ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ()

ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్

క్లుప్తం అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ...

|

 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

محمد ﷺ هو خاتم الأنبياء والرسل

« باللغة تلغو »

అనువాదం: ముహమ్మద్ కరీముల్లాహ్

రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త మరియు సందేశహరుడు అనే విషయానికి సంబంధించిన సాక్ష్యాధారాలను స్పష్టంగా వివరించండి. దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఆయన అంతిమ ప్రవక్త అని మాత్రమే నిరూపిస్తున్నాయి గానీ, ఆయన అంతిమ సందేశహరుడు అని సూచించడం లేదు కదా!

అల్హందులిల్లాహ్.

ప్రవక్త మరియు సందేశహరుడు అనే పదాల విషయంలో పండితుల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. మెజారిటీ పండితుల అభిప్రాయం ఏమిటంటే అల్లాహ్ నుండి వహీ (దివ్యవాణి) అందుకునే ఆయన ‘ప్రవక్త’. అయితే దానిని ప్రజలకు అందజేయమనే ఆదేశం ఆయనకు ఇవ్వబడదు. మరోవైపు సందేశహరుడికి అల్లాహ్ నుండి వహీ (దివ్యవాణి) అందుతుంది మరియు దానిని ప్రజలకు అందజేయమనే ఆదేశం కూడా ఆయనకు ఇవ్వబడుతుంది. 

ఈ పదాల గురించి తమ మధ్య భేదాభిప్రాయాలున్నా, వారందరూ ఏకగ్రీవంగా ‘సందేశహరుడి స్థానం ప్రవక్తత్వం కంటే గొప్పదని’ అంగీకరించారు. అందువలన వారిలా పలికారు, ‘ప్రతి సందేశహరుడు ఒక ప్రవక్త, కానీ ప్రతి ప్రవక్తా సందేశహరుడు కాడు’. 

కాబట్టి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త, ఆయన తర్వాత మరే ప్రవక్తా రాడు అని తెలిపే ప్రతిదీ, ఆయన అంతిమ సందేశహరుడని మరియు ఆయన తర్వాత మరే సందేశహరుడూ రాడని కూడా ధృవీకరిస్తున్నట్లే. ఎందుకంటే, ప్రవక్త కాకుండా సందేశహరుడు కావడం అసాధ్యం. 

ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ సందేశహరుడని వచ్చినట్లయితే, ఆయన తర్వాత మరే ప్రవక్తా రాడు అనే దాన్ని ఇది ధృవీకరించదు. ఎందుకంటే, ప్రతి ప్రవక్తా సందేశహరుడు కానవసరం లేదు అనే కారణం వలన ఆయన తర్వాత ప్రవక్త వచ్చే అవకాశం ఉన్నట్లవుతుంది.  

కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి, అంతిమ ప్రవక్త అని రావటం వలన, ఆయన తర్వాత మరే ప్రవక్తా వచ్చే అవకాశం లేదు, మరే సందేశహరుడూ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన రాక ప్రవక్తత్వానికి సీలు వేయడం వంటిది. 

ఇబ్నె కథీర్ రహిమహుల్లాహ్ ఇలా వివరించారు: 

“ అయితే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు చిట్టచివరి ప్రవక్త” [అల్ అహ్ జాబ్ 33:40]. ఈ వచనం తెలిపేదేమిటంటే ఆయన తర్వాత మరే ప్రవక్తా రాడు, మరే సందేశహరుడూను. ఎందుకంటే, సందేశహరుని స్థానం ప్రవక్త స్థానం కంటే గొప్పది. ప్రతి సందేశహరుడు తప్పక ప్రవక్త అయి ఉంటాడు కానీ ప్రతి ప్రవక్తా సందేశహరుడు కానవసరం లేదు. 

తఫ్సీర్ ఇబ్నె కథీర్ (3/645)

షేఖ్ ఇబ్నె ఉథైమీన్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: “ఒకవేళ ఆయన ప్రవక్తత్వానికి సీలు అయితే, సందేహరులకు కూడా ఆయన సీలు అవుతారు. అంటే ఆయన ప్రవక్తలలో చిట్టచివరి వారయితే, తప్పక సందేశహరులలో కూడా చిట్టచివరి వారవుతారు. కాబట్టి ఇలా చెప్పబడింది: ప్రతి సందేశహరుడూ ఒక ప్రవక్త కూడా. కానీ, ప్రవక్త తప్పక సందేశహరుడు కాడు”

మజ్మూఅ ఫతావా ఇబ్నె ఉథైమీన్ (1/250)

మరియు అసలైన విషయం అల్లాహ్ కే తెలుసు.