ఇస్లామీయ మూలసిద్ధాంతంపై కొన్ని ప్రశ్నోత్తరాలు ()

ఇస్లామీయ మూలసిద్ధాంతాల గురించి అర్థం చేయుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

|

 ఇస్లామీయ మూలసిద్ధాంతంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

أسئلة وشبهات عن العقيدة الإسلامية مع الأجوبة

 ఇస్లామీయ మూలసిద్ధాంతంపై కొన్ని ప్రశ్నోత్తరాలు

 ముస్లింల మూలవిశ్వాసం ఏమిటి?

ఏకైక, అద్వితీయ, సాటిలేని దేవుడైన అల్లాహ్, ఆయన సృష్టించిన దైవదూతలను, ఆయన పంపిన దివ్యావతరణలను, దివ్యసందేశాన్ని ప్రజలకు అందజేయటం కొరకు ఆయన ఎంచుకొన్న ప్రవక్తలను, అంతిమ తీర్పుదినాన్ని, తమ తమ ఆచరణలకు వహించవలసిన వ్యక్తిగత బాధ్యతను, మానవుడి విధవ్రాతపై అల్లాహ్ కు ఉన్న ఆధిపత్యాన్ని మరియు పరలోక జీవితాన్ని ముస్లింలు విశ్వసిస్తారు. ఆదం నుండి మొదలై నోవా, అబ్రహాం, ఇష్మాయీల్, ఇసాక్, జాకోబ్, జోసేఫ్, మోసెస్, ఆరోన్, డేవిడ్, సోలోమాన్, ఎలియాస్, జోనాహ్, జాన్ ది బాప్టిస్ట్ మరియు జీసస్ (వారందరిపై శాంతి కురుయుగాక) ప్రవక్తల పరంపరను ముస్లింలు విశ్వసిస్తారు. అయితే ప్రళయదినం వరకు పుట్టబోయే మొత్తం మానవాళి కొరకు అంతకు పూర్వం పంపబడిన దివ్యసందేశాలన్నింటినీ మరలా ధృవీకరిస్తూ మరియు క్లుప్తంగా వాటి సారాంశాన్ని తెలుపుతూ అంతిమ దివ్యసందేశం రూపంలో  జిబ్రయీల్ దైవదూత ద్వారా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దివ్యఖుర్ఆన్ అవతరించబడింది.

 ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల అరంభం విభిన్నమైనదా?

లేదు. యూదు ధర్మంతో సహా ఇవి మూడూ ప్రవక్త అబ్రహాం అలైహిస్సలాంతోనే మొదలవు తున్నాయి. మరియు వారి ముగ్గురు ప్రవక్తలు తిన్నగా అబ్రహాం కుమారుల వంశానికే చెందుతారు – ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తిన్నగా ప్రవక్త అబ్రహాం పెద్దకుమారుడైన ఇస్లాయీల్ సంతతిలోని వారు. మోసెస్ మరియు జీసస్ అలైహిస్సలాంలు తిన్నగా ప్రవక్త అబ్రహాం రెండో కుమారుడైన ఇసాక్ సంతతిలోని వారు.  

ప్రవక్త అబ్రహాం మక్కాలో జనవాసాన్ని ఏర్పరచినారు మరియు ముస్లింలు ప్రతిరోజు చేసే నమాజు కొరకు ఖిబ్లాగా (దిశగా) గౌరవించే పవిత్ర కాబాగృహాన్ని పునఃనిర్మించారు.

 ఇతర ధర్మాలను ఇస్లాం సహిస్తుందా ?

ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది: ధర్మం విషయంలో మీపై కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయడాన్ని, వారికి న్యాయం చేయడాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. (ఖుర్ఆన్, 60:8).

 జీసస్ అలైహిస్సలాం గురించి ముస్లింల అభిప్రాయం ఏమిటి ?

ముస్లింలు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను ఎంతో గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు, ఆయన పునరాగమనం కొరకు ఎదురు చూస్తారు. మానవాళి వైపు పంపబడిన అల్లాహ్ యొక్క మహోన్నత ప్రవక్తలలో ఆయన కూడా ఒకరని విశ్వసిస్తారు. ఏ ముస్లిం వ్యక్తీ ఆయనను కేవలం జీసస్ అని ఎన్నడూ సంభోదించడు, ఆయన పేరు ప్రస్తావించినపుడల్లా అలైహిస్సలాం అంటే ఆయనపై శాంతి కురుయుగాక అనే పదాలతో ఆయన పేరును ప్రస్తావిస్తాడు. కన్యమేరీకి ఆయన జన్మించడాన్ని ఖుర్ఆన్ గ్రంథం ధృవీకరిస్తున్నది. ఖుర్ఆన్ గ్రంథం మర్యమ్ పేరుతో ఒక పూర్తి అధ్యాయాన్ని కలిగి ఉంది. మొత్తం సృష్టిలో అత్యంత పవిత్రురాలైన మహిళ మర్యమ్ అని ఇస్లాం ప్రకటిస్తున్నది.

 ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది నిజమేనా?

కాదు, ముమ్మాటికీ కానే కాదు. క్రైస్తవులు ఏసుక్రీస్తును ఆరాధిస్తారు. కాబట్టి వారు క్రైస్తవులని పిలవబడుతున్నారు. ముస్లింలు కేవలం ఏకైకుడు, అద్వితీయుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తారు గానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఎంత మాత్రమూ ఆరాధించరు. అందువలన వారు ముహమ్మదీయులు అని పిలవబడరు. ముస్లింలు అల్లాహ్ ఆజ్ఞలను పూర్తిగా శిరసావహిస్తారు. అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా, అల్లాహ్ కు విధేయత చూపుతూ, అల్లాహ్ అభీష్టానికి మనస్పూర్తిగా తమ ఇచ్ఛను సమర్పించుకుని జీవితపు ప్రతి అడుగూ వేస్తారు. కాబట్టి వారు ముస్లింలని పిలవబడతారు. (భాషాపరంగా ముస్లింలంటే సమర్పించుకున్నవారు).

 ముస్లింలు కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మాత్రమే తమ ప్రవక్తగా నమ్ముతారనేది నిజమేనా ?

వాస్తవానికి ముస్లింలు మొట్టమొదటి ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాం నుండి చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వోన్నతుడైన అల్లాహ్ మానవాళి వైపు పంపిన ప్రవక్తలందరినీ మరియు సందేశహరులందరినీ విశ్వసిస్తారు. ప్రవక్తల సంఖ్య వేలల్లో లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. ఏదేమైనా ఖుర్ఆన్ లో అల్లాహ్ కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే పేర్కొన్నాడు. వారిలో ఐదుగురిని అత్యంత ప్రబలమైన మరియు అత్యంత శక్తిమంతమైన ప్రవక్తలుగా పేర్కొన్నాడు – వారు నూహ్, అబ్రహాం, మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ (వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి కురుయుగాక).

ముస్లింలు ప్రవక్తలందరినీ ఆదరిస్తారు. ఎప్పుడు ఏ ప్రవక్త పేరు ప్రస్తావించబడినా, “అలైహిస్సలాం అంటే అల్లాహ్ యొక్క శాంతి వారిపై కురుయుగాక” అని ముస్లింలు పలుకుతారు.

 జీసస్ అలైహిస్సలాం మరియు మేరీలను ముస్లింలు అసహ్యించుకునే బదులు ఎంతో ఇష్టపడతారనేది నిజమేనా ?

ముస్లింలు జీసస్ (అలైహిస్సలాం) మరియు మేరీలను విశ్వసిస్తారు, ఎంతో గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు. అంతేగా జీసస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క అత్యంత ప్రబలమైన మరియు శక్తిమంతమైన ప్రవక్తలలో ఒకరని, ఆయన తల్లి మర్యమ్ ను మొత్తం స్త్రీలందరిలో అత్యున్నత స్థానం కొరకు అల్లాహ్ ఎంచుకున్నాడని ముస్లింలు మనస్పూర్తిగా నమ్ముతారు. జీసస్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా కన్య మేరీకి అపూర్వంగా జన్మించారని కూడా ముస్లింలు నమ్ముతారు.

అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ గ్రంథంలో స్వయంగా మర్యమ్ పేరుతో ఒక పూర్తి అధ్యాయం ఉన్నది – అంత ఎక్కువ ప్రత్యేకంగా ఏ స్త్రీ పేరూ గౌరవించబడలేదు. కాబట్టి, ముస్లింల గురించి కొందరు ముస్లిమేతరులు నమ్ముతున్న దానికి భిన్నంగా, ముస్లింలు నిస్సందేహంగా మేరీను ఎంతో ఆత్మీయంగా గౌరవిస్తారు మరియు ఆదరిస్తారు. ఇక జీసస్ అలైహిస్సలాం విషయానికి వస్తే, అల్లాహ్ కు ఎంతో ప్రియమైన ప్రవక్తలలో ఆయన కూడా ఒకరు అని ముస్లింలు విశ్వసిస్తారు.

 మోసెస్ అలైహిస్సలాం యూదుల ప్రవక్త అయినా, ముస్లింలు కూడా మోసెస్ అలైహిస్సలాంను నమ్ముతారనేది ఆశ్చర్యకరమైన విషయం. ఇది నిజమేనా ?

మోసెస్ అలైహిస్సలాం యూదుల ప్రవక్త కాదు. ఆయన ఇస్రాయీలు సంతతి కొరకు పంపబడిన అల్లాహ్ యొక్క ప్రవక్త. ఇస్రాయీలు సంతతిని ఈజిప్టు రాజైన ఫిరౌను యొక్క అత్యాచారాల నుండి కాపాడడానికి ఆయన పంపబడినారు. అయితే, ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం కూడా ఒక ముస్లిమే. ఎందుకంటే ఆయన కూడా అల్లాహ్ యొక్క దివ్యసందేశాన్నే ప్రజలకు అందజేసారు; సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించమని ఆయన బోధించారు. అల్లాహ్ ను ఆరాధించమని, ఉపవాసం పాటించమని మరియు జకాతు దానం ఇవ్వమని ఆయన ప్రజలను ఆదేశించారు.

ఎలాంటి భేదభావం లేకుండా ఇతర ప్రవక్తలందరినీ మరియు సందేశహరులందరినీ నమ్ముతున్నంత త్రికరణశుద్ధితో ముస్లింలు ప్రవక్త మోసెస్ అలైహిస్సలాంను కూడా అల్లాహ్ యొక్క మహాప్రవక్తగా విశ్వసిస్తారు.

 ఇస్లాం బహుదైవాలను విశ్వసిస్తుందా? ఎందుకంటే ఖుర్ఆన్ లో సంభోదించేటపుడు, ‘మేము’ అనే పదాన్ని అల్లాహ్ వాడుతున్నాడు కదా!

ఇస్లాం ధర్మం నిష్కర్షగా, ఖచ్చితంగా ఒక ఏకదైవత్వ ధర్మం (strictly monotheistic religion). ఎలాంటి సర్దుబాటులకు తావివ్వని, రాజీపడని స్వచ్ఛమైన ఏకదైవత్వంలో తన పూర్తి విశ్వాసాన్ని ఉంచుతున్నది. సృష్టికర్త తన దివ్యలక్షణాలలో మరియు గుణగణాలలో సాటిలేని ఏకైకుడు, అద్వితీయుడని నమ్ముతుంది. ఖుర్ఆన్ లో అనేక చోట్ల అల్లాహ్ స్వయంగా ‘మేము’ అనే పదంతో సూచించుకున్నాడు. అయితే దీని అర్థం ఒకరి కంటే ఎక్కువ దైవాలను ఇస్లాం ధర్మం విశ్వసిస్తున్నదని కాదు. 

 రెండు రకాల బహువచనాలు:

అనేక భాషలలో రెండు రకాల బహువచనాలు ఉంటాయి – ఒక రకం బహువచనం, సంఖ్యాపరంగా ఒకటి కంటే ఎక్కువ వాటిని, ఎక్కువ సార్లను మరియు అనేకవారిని సూచిస్తుంది. మరోరకమైన బహువచనం గౌరవార్థకంగా బహవచనంలో దేనినైనా, ఏ వ్యక్తినైనా, ఏ శక్తినైనా సూచించే పదం.  

a. ఇంగ్లీషు భాషలో, ఇంగ్లండు మహారాణి స్వయంగా తనను తాను ‘మేము’ అని ప్రస్తావిస్తుందే గానీ ‘నేను’ అని పేర్కొనదు. ఇది ‘రాజసాన్ని’ సూచించే బహుచవచనంగా గుర్తించబడింది.  

b. భారతదేశ మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ హిందీ భాషలో "హమ్ దేఖ్నా చాహ్తే హై " అంటే "మేము చూడాలని అనుకుంటున్నాము." అని పలికేవారు. ఇక్కడ ‘హమ్’అంటే ‘మేము’  అని అర్థం. ఇది కూడా హిందీ భాషలో రాజసాన్ని సూచించే మరొక బహువచన పదంగా గుర్తించబడింది. 

c. అలాగే, అరబీ భాషలో, ఖుర్ఆన్ లో అల్లాహ్ తన గురించి స్వయంగా ప్రస్తావించినపుడు, తరచుగా ‘నహ్ను’ అంటే ‘మేము’ అని పేర్కొనడం జరిగింది. పైవిధంగానే ఇక్కడ కూడా దానిని రాజసాన్ని అంటే అల్లాహ్ యొక్క సార్వభౌమత్వాన్ని సూచించే ఒక గౌరవార్థక బహువచన పదంగా మాత్రమే గుర్తించాలి. అంతేగానీ సంఖ్యాపరమైన బహువచన పదంగా తీసుకోకూడదు. 

తౌహీద్  లేక ఏకదైవత్వం అనేది ఇస్లాం ధర్మం యొక్క మూలసిద్ధాంతాల్లోని అతి అతి ముఖ్యమైన మూలసిద్ధాంతం. ఖుర్ఆన్ లో అనేకచోట్ల సాటిలేని ఏకైకుడు మరియు అద్వితీయుడైన సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ గురించి ప్రస్తావించబడింది.

ఉదాహరణకు, సూరతుల్ ఇఖ్లాస్ లో ఇలా పేర్కొనబడింది: "ప్రకటించు, సాటిలేని ఏకైకుడు, అద్వితీయుడైన ఆయనే అల్లాహ్."  [ఖుర్ఆన్ 112: 1]

 పరలోక జీవితం ఉందని మీరెలా నిరూపించగలరు ?

 1.   పరలోక జీవితాన్ని నమ్మడమనేది ఒక అంధవిశ్వాసమా ? ఒక మూఢనమ్మకమా ?

శాస్త్రీయమైన మరియు హేతుబద్ధమైన తార్కిక ఆధునిక భావాలు కలిగిన ఏ నాగరికుడైనా పరలోక జీవిత విశ్వాసం గురించి సూచించే ఏ వచనైనా ఎలా నమ్మగలరని అనేకమంది ప్రజలు ఆశ్చర్య పడుతున్నారు. తమ అంధ విశ్వాసాల, మూఢనమ్మకాలపై  ఆధారపడి వారు పరలోక జీవితాన్ని విశ్వసిస్తున్నారని కొందరు ప్రజలు భావిస్తున్నారు.

అయితే పరలోక జీవితాన్ని ఎందుకు విశ్వసించాలనేది లాజికల్ గా కూడా ఋజువు అయింది.

 2.   పరలోక జీవితాన్ని విశ్వసించడమనేది ఒక హేతుబద్ధమైన విశ్వాసం

దివ్యఖుర్ఆన్ లో వైజ్ఞానిక విషయాలను సూచించే వచనాలు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నాయి. ("ఖుర్ఆన్ మరియు సైన్సు" అనే పుస్తకాన్ని చదవండి). 14 శతాబ్దాలకు పూర్వమే ఖుర్ఆన్ లో పేర్కొనబడిన అనేక వైజ్ఞానిక విషయాలను కేవలం కొన్ని శతాబ్దాల క్రితమే శాస్త్రజ్ఞులు కనిపెట్టగలిగారు మరియు ధృవీకరించగలిగారు. కానీ, నేటికీ ఖుర్ఆన్ లోని ప్రతి వచనాన్ని నిరూపించగలిగే మరియు ధృవీకరించగలిగేటంత ఆధునిక స్థాయికి సైన్సు చేరుకోలేక పోయింది.

ఉదాహరణకు ఖుర్ఆన్ లో పేర్కొనబడిన వాటిలో దాదాపు 80% విషయాలు నూటికి నూరు శాతం వాస్తవమైన విషయాలేనని సైన్సు ధృవీకరించిందని  భావిద్దాం. మిగిలిన 20% గురించి, సైన్సు ఎలాంటి ప్రకటన చేయలేక పోయింది. ఎందుకంటే వాటి సత్యాసత్యాలు ధృవీకరించగలిగేటంత ఆధునిక స్థాయికి అదింకా చేరుకోలేదు. నిజానికి ఈనాడు మనకున్న పరిమిత జ్ఞానంతో, ఈ 20% వచనాలలో ఒక్క శాతం వచనాలను కూడా అవి తప్పని లేదా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని చెప్పలేము. కాబట్టి ఖుర్ఆన్ యొక్క 80% వచనాలు నూటికి నూరు శాతం కరక్టు అయి, మిగిలిన 20% వచనాలు తిరస్కరించబడక పోయినపుడు, ఆ 20% వచనాలు కూడా కరక్టే అవ్వచ్చని లాజిక్ అంటే హేతువు చెబుతున్నది. పరలోక జీవిత ఉనికి గురించి తెలుపబడిన వచనాలు ఈ 20% సందిగ్ద వచనాల భాగంలో ఉన్నాయి. అవి కూడా నిజమే కావచ్చని లాజిక్ కూడా చెబుతున్నది.

 3.   పరలోక భావన లేకుండా శాంతి మరియు మానవ నైతిక విలువల భావనకు అర్థం పర్థం లేదు.

దొంగతనం ఒక మంచి పనా లేక చెడు పనా ? ఒక మామూలు వ్యక్తి అదొక చెడు పని అంటాడు. పరలోక జీవితాన్ని నమ్మని ఎవరైనా వ్యక్తి ఒక బలవంతుడైన మరియు ప్రబలుడైన నేరస్థుడిని దొంగతనమనేది ఒక చెడుపని అని ఎలా ఒప్పించగలడు?

ఒకవేళ నేను ఈ ప్రపంచంలో ఒక బలమైన మరియు ప్రబలమైన నేరస్థుడిని. అదే సమయంలో నేను మంచి తెలివితేటలు గలవాడిని మరియు లాజికల్ మనిషిని. దొందతనం ఒక మంచి పని అని నేనంటాను. ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపడంలో అది నాకు సహాయపడుతున్నది. అలా దొంగతనం నా కొరకు మంచి పనే.

ఒకవేళ ఎవరైనా దొంగతనం నా కొరకు ఎందుకు చెడు పనో తెలిపే ఒక్క లాజికల్ వాదననైనా నా ముందు పెట్టగలిగితే నేను వెంటనే దానిని వదిలి వేస్తాను. అపుడు ప్రజలు సాధారణంగా ఈ క్రింది వాదనలను అతడి ముందు పెడతారు:

 a. దొంగతనానికి గురైన వ్యక్తి కష్టాలు ఎదుర్కొంటాడు

దోచుకోబడిన వ్యక్తి కష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని కొందరు అంటారు. దానికి నేను తప్పకుండా అంగీకరిస్తున్నాను. కానీ, నా కొరకైతే అది లాభదాయకమే కదా! ఒకవేళ నేను వెయ్యి రూపాయలు దోచుకోగలిగితే, ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో కమ్మని భోజనం తినగలను.

 b. నిన్నే ఎవరైనా దోచుకోవచ్చు.

ఏదో ఒకరోజు నన్నే ఎవరైనా దోచుకోవచ్చని కొందరు ప్రజలు అంటారు. నన్నెవరూ దోచుకోలేరు, ఎందుకంటే నేను చాలా బలమైన రౌడీని మరియు నా వద్ద వందల కొద్దీ బాడీగార్డులు ఉన్నారు. నేను ఎవరిని తలిస్తే వారిని దోచుకోగలను కానీ, నన్నెవరూ దోచుకోలేరు. దోచుకోవడమనేది ఎవరైనా సామాన్య వ్యక్తి కొరకు రిస్క్ తో కూడిన వృత్తి కావచ్చేమో గానీ నాలాంటి ఆరితేరిన బలమైన వ్యక్తి కొరకు ఎంత మాత్రమూ కాదు.

 c.  పోలీసులు నిన్ను అరెష్టు చేయవచ్చు

ఒకవేళ నీవు ప్రజలను దోచుకుంటే పోలీసులు నిన్ను అరెష్టు చేస్తారని కొందరు అంటారు. కానీ వారో విషయం తెలుసుకోవాలి. పోలీసులు నన్ను అరెష్టు చేయలేరు ఎందుకంటే కొందరు పోలీసులు నా జీతం పై బ్రతుకుతున్నారు. కొందరు మంత్రులకూ నా జీతం అందుతుంది. ఒకవేళ ఎవరైనా సామాన్య వ్యక్తి దోపిడీ చేస్తే, అతడు అరెష్టు చేయబడతాడని, అది అతడి కొరకు కష్టాలకు గురిచేస్తుందని, అతని కొరకు చెడు అవుతుందనే మాటకు నేను అంగీకరిస్తున్నాను. కానీ నేను అసాధారణమైన శక్తిమంతుడిని మరియు నా పేరు వింటేనే ప్రజలు వణికే ప్రబలమైన దాదాను కదా!

దోపిడి నా కోసం ఎందుకు చెడుపనో తెలిపే కనీసం ఒక్క లాజికల్ కారణం నాకు చూపండి, నేను దొంగతనాన్ని వదిలివేస్తాను.

 d. సులభంగా సంపాదించిన ధనం

దోపిడి ద్వారా సంపాదించిన ధనం సులభంగా సంపాదించే ధనమని, అది కష్టపడి సంపాదించే ధనం కాదని కొందరు అంటారు. నేను వారితో పూర్తిగా అంగీకరిస్తాను, అది తేలిగ్గా సంపాదించే ధనమే. అందుకనే నేను దొంగతనాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ ఎవరైనా వ్యక్తి వద్ద సులభంగా సంపాదించే మరియు కష్టపడి సంపాదించే అవకాశాలు రెండూ ఉంటే, ఎవరైనా వివేకవంతుడైన వ్యక్తి సులభంగా సంపాదించే అవకాశం ఉన్న మార్గాన్నే ఎంచుకుంటాడు కదా!

 e.  అది మానవత్వానికి వ్యతిరేకం

దోపిడీ, దొంగతనాలు మానవత్వానికి విరుద్ధమని, ఒక వ్యక్తి తోటి వ్యక్తి మంచిచెడల గురించి పట్టించుకోవాలని కొందరు అంటారు. నేను వారి మాటలను ఖండిస్తూ, ‘మానవత్వం’ అనే ఈ చట్టాన్ని ఎవరు వ్రాసారు మరియు నేను ఎందుకు దానిని అనుసరించాలి? అని ప్రశ్నిస్తున్నాను.

ఈ మానవత్వ చట్టం భావావేశం కలిగిన మరియు అభిమానం కలిగిన వ్యక్తుల కొరకు మంచిదేమో గానీ నేను ఒక లాజికల్ వ్యక్తిని మరియు ఇతరుల బాగోగుల పట్టించుకోవడంలో నాకు ఎలాంటి ప్రయోజనం కనబడటం లేదు.

  f.  అదొక స్వార్థపూరితమైన చర్య

దోపిడీ, దొంగతనం అనేది పరుల క్షేమము గురించి పట్టించుకోని ఒక స్వార్థపూరిత చర్య అని కొందరు అంటారు. నిజమే, దొందతనమనేది ఒక స్వార్థపూరిత చర్యే. అయితే, నేనెందుకు స్వార్థపరుడిని కాకూడదు? నా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో అది నాకు సహాయపడుతుంది.

 1.  దోపిడీ, దొంగతనమనేది ఒక చెడు పని అనడానికి ఎలాంటి లాజికల్ కారణమూ దొరకదు:

కాబట్టి దోపిడీ, దొంగతమనేది ఒక చెడు పని అని నిరూపించడానికి చేసే వాదలన్నీ వీగి పోతాయి, నిష్ఫలమైపోతాయి. ఒక సామాన్య వ్యక్తికి ఈ వాదనలు సంతృప్తి కలిగించవచ్చేమో గానీ ఒక బలవంతుడైన మరియు ప్రబలమైన నా వంటి గజదొంగకు కాదు. నా వాదనలోని లాజిక్ మరియు హేతువాదం ముందు ఏ వాదనా నిలబడలేదు. ఈ ప్రపంచంలో అనేకమంది నేరస్థులు ఉన్నారనేది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు.

అలాగే, మానభంగం, మోసం, దగా మొదలైనవి కూడా నా కొరకు మంచి పనులే. అవి చెడు పనులని నన్ను అంగీకరింపజేసే ఏ లాజికల్ వాదనా మిగలదు.

 2.  ఒక బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడిని అతడు చేసేది చెడు పని అని ఒక ముస్లిం మాత్రమే ఒప్పించగలడు

ఇప్పుడు నాణానికి మరోవైపు దృష్టిసారించుదాం. ఇపుడు మీరు పోలీసులకు మరియు మంత్రులకు జీతాలు అందజేస్తున్న ఈ ప్రపంచంలోని ఒక అత్యంత బలవంతుడైన మరియు ప్రబలమైన నేరస్థుడని భావించుదాం. మిమ్మల్ని రక్షించడానికి బారులు తీరిన బాడీగార్డులు ఉన్నారు. దొంగతనం, దోపిడీ, మానభంగం, మోసం, దగా మొదలైనవి చెడు పనులని మిమ్మల్ని ఒప్పించే ఒక ముస్లింను నేను.

ఒకవేళ నేను కూడా దోపిడీ, దొంగతనాలనేవి చెడు పనులని నిరూపించడానికి లాజికల్ గా ప్రయత్నిస్తే, ఇంతకు ముందు వలే వ్యర్థమై పోతుంది.

నేరస్థుడు లాజికల్ వ్యక్తి అంటే హేతువాది అని మరియు ఆతడు ఒక అత్యంత బలమైన మరియు ప్రబలమైన గజదొంగ అయినప్పుడే అతడి వాదలన్నీ కరక్టు అవుతాయని నేను అంగీకరిస్తున్నాను.

 3.  ప్రతి మనిషి న్యాయాన్ని కోరుకుంటాడు

ప్రతి ఒక్క మానవుడు న్యాయాన్నే కోరుకుంటాడు. ఒకవేళ అతడు ఇతరుల కొరకు న్యాయాన్ని అభిలషింకపోయినా, స్వయంగా తన కోసం మాత్రం తప్పకుండా న్యాయం జరగాలని కోరుకుంటాడు. కొందరు ప్రజలు అధికారం మరియు అంతస్తు మత్తులో పడి, ఇతరులకు బాధ మరియు కష్టం కలిగిస్తారు. కానీ, ఒకవేళ వారికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోరు. ఇతరుల బాధలను, కష్టాలను వారు పట్టించుకోక పోవడానికి ఒక కారణం ఏమిటంటే, వారు అధికారాన్ని మరియు పరపతి ఇచ్చే అంతస్తులను ఆరాధిస్తున్నారు. ఆ అధికారం మరియు అంతస్తుల అహంకారం ఇతరులకు అన్యాయం చేసేందుకు వారిని అనుమతించడమే కాకుండా దానికి వ్యతిరేక దిశలో అలాంటి అన్యాయమే ఇతరులు తమకు చేయకుండా నిరోధిస్తుంది.

 4. అల్లాహ్ అందరి కంటే అత్యంత శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు

ఒక ముస్లింగా నేను ఆ నేరస్థుడిని అల్లాహ్ యొక్క ఉనికిని గురించి ముందుగా ఒప్పిస్తాను. (అల్లాహ్ యొక్క ఉనికిని ఋజువు చేయమని అడగబడిన ప్రశ్నకు ఇవ్వబడిన జవాబు చూడండి). అల్లాహ్ మీ కంటే ఎక్కువ శక్తిమంతుడు. అంతేగాక ఆయన అత్యంత న్యాయవంతుడు కూడా. దివ్యఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:

"అతి తక్కువ పరిమాణంలో కూడా అల్లాహ్ ఎన్నడూ అన్యాయం చేయడు"

[ఖుర్ఆన్ 4:40]

 5.  అల్లాహ్ నన్నెందుకు శిక్షిస్తాడు ?

ఖుర్ఆన్ లోని వైజ్ఞానిక వాస్తవాలు చూపబడిన తర్వాత, లాజికల్ మరియు సైంటిఫిక్ మనిషి కావడం ఆ నేరస్థుడు అల్లాహ్ యొక్క ఉనికిని ఒప్పుకుంటాడు. అల్లాహ్ ఎంతో శక్తిమంతుడు మరియు న్యాయవంతుడు కావడం వలన అతడిని ఎందుకు శిక్షించకుండా వదిలి పెడతాడని వాదించవచ్చు.

 6. అన్యాయం చేసే దోషులు శిక్షించబడాలి

అన్యాయానికి గురైన ప్రతి వ్యక్తీ ఆర్థిక మరియు సామాజిక స్థాయిల ప్రమేయం లేకుండా, తనకు అన్యాయం చేసినవాడు తప్పకుండా శిక్షించబడాలని కోరుకుంటాడు. దొంగలకు మరియు రేపిష్టులకు గుణపాఠం నేర్పబడటాన్ని ప్రతి సామాన్య వ్యక్తీ ఇష్టపడతాడు. అనేక మంది నేరస్థులు శిక్షించబడినా, ఇంకా అనేక మంది నేరస్థులు పట్టుబడకుండా స్వతంత్రులుగా తిరుగుతూ, భోగభాగ్యాలతో కూడిన విలాసజీవితాన్ని గడపుతున్నారు. ఒకవేళ ఎవరైనా శక్తిమంతుడు మరియు ప్రబలుడైన వ్యక్తికి అతని కంటే బలమైన మరియు ప్రబలమైన వ్యక్తి అన్యాయం చేస్తే, ఆ శక్తిమంతుడు కూడా ఆ అన్యాయం చేసిన బలవంతుడికి కఠినశిక్ష పడాలనే కోరుకుంటాడు.

 7. పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష

పరలోక జీవితం కోసం ఈ ఇహలోక జీవితం ఒక పరీక్ష. ఖుర్ఆన్  ఇలా ప్రకటిస్తున్నది:

"చావు బ్రతుకులను సృష్టించిన ఆయనే మీలో ఎవరు ఉత్తములో పరీక్షిస్తాడు; ఆయనే అత్యంత శక్తిమంతుడు, క్షమించేవాడూను"           [ఖుర్ఆన్ 67:2]

 8. తీర్పుదినాన చేయబడే అంతిమ న్యాయం

ఖుర్ఆన్ ఇలా ప్రకటిస్తున్నది:

"ప్రతి ఆత్మా చావు రుచి చూడవలసిందే: కేవలం తీర్పుదినాన మాత్రమే మీకు పూర్తి ప్రతిఫలం ప్రసాదించబడుతుంది. నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశ పెట్టబడినవాడు మాత్రమే సాఫల్యవంతుడు: ఈ ఇహలోక జీవితపు ఆకర్షణలు కేవలం మిథ్యా మరియు వంచన మాత్రమే."           [ఖుర్ఆన్ 3:185]

తీర్పుదినాన అంతిమ న్యాయం చేయబడుతుంది. ఎవరైనా వ్యక్తి చనిపోయిన తర్వాత, తీర్పుదినాన అతడు ఇతర మానవులతో పాటు మరలా తిరిగి లేపబడతాడు. ఎవరైనా వ్యక్తి అతడి నేరాల శిక్షలో కొంత భాగాన్ని ఈ ప్రపంచంలోనే అనుభవించే అవకాశం ఉంది. అయితే పరలోకంలోనే అసలు అంతిమ ప్రతిఫలం ప్రసాదించబడుతుంది మరియు అంతిమ శిక్ష విధించబడుతుంది. సర్వోన్నతుడైన అల్లాహ్ ఒక దొంగను లేదా ఒక రేపిష్టును ఈలోకంలో శిక్షించడు. కానీ తప్పకుండా అంతిమ తీర్పుదినాన ఆ నేరస్థుడు జవాబు ఇవ్వవలసి ఉంటుంది మరియు పరలోకంలో అతడు చేసిన నేరానికి కఠినంగా శిక్షించబడతాడు. దాని నుండి ఏ నేరస్థుడూ తప్పించుకోలేడు.

 9.  హిట్లర్ కు మానవ చట్టం ఏ శిక్ష విధించగలదు ?

ఆరు మిలియన్ల యూదులను హిట్లర్ తన భయంకరమైన పరిపాలనలో గ్యాస్ ఛేంబర్లలో భస్మం చేసి వేసినాడు. ఒకవేళ అతడిని ఎవరైనా పోలీసు అరెష్టు చేసినా, న్యాయం చేయడానికి మానవులచే తయారు చేయబడిన చట్టం హిట్లర్ కు ఏ శిక్ష విధించ గలదు ? అతడిని కూడా గ్యాస్ ఛెంబరుకు పంపించడం కంటే మించి ఇంకేమైనా కఠినశిక్ష విధించగలరా ? కానీ అది ఒక యూదుడిని హత్య చేసిన దానికి మాత్రమే సరిపోయే శిక్ష. మరి, మిగిలిన ఐదు మిలియన్ల, తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల, తొమ్మిది వందల తొంభై మంది యూదుల హత్యకు బదులుగా అతడి వేయబడవలసిన శిక్ష మాటేమిటి?

 10.  ఆరు మిలియన్ల కంటే ఎక్కువ సార్లు హిట్లర్ ను అల్లాహ్ నరకాగ్నిలో కాల్చుతాడు

ఖుర్ఆన్ లో అల్లాహ్ ప్రకటన ఇలా ఉంది:

"ఎవరైతే మా చిహ్నాలను తిరస్కరించారో, త్వరలోనే మేము వారిని నరకాగ్నిలో పడవేస్తాము; వారి చర్మాలు కాలిపోగానే మేము క్రొత్త చర్మాలు తొడిగిస్తాము – మాటిమాటికీ కాలడానికి, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడూను"           [ఖుర్ఆన్ 4:56]

ఒకవేళ అల్లాహ్ తలిస్తే, పరలోకంలో హిట్లర్ ను ఆరు మిలియన్ల సార్లు నరకాగ్నిలో కాల్చి అతడి నేరానికి సరైన శిక్ష విధిస్తాడు.

 11. పరలోక జీవిత భావన లేకుండా మానవ నైతిక విలువల లేదా మంచిచెడుల భావన లేదు

ఎవరినైనా పరలోక జీవితం గురించి ఒప్పించకుండా అతడిలో మానవ నైతిక విలువల మరియు మంచి చెడుల భావనలు కలుగజేయడం అసాధ్యం. ముఖ్యంగా ఈ ప్రపంచంలో బలవంతుడు మరియు ప్రబలుడై ఉండి ఇతరులకు అన్యాయం చేస్తున్న వ్యక్తిని పరలోక భావన లేకుండా అతడు చేస్తున్న నేరం గురించి ఒప్పించడం మరీ కష్టం.

 ఒకవేళ కాఫిర్ల అంటే ముస్లిమేతరుల హృదయాలపై అల్లాహ్ సీలు వేసేసి ఉంటే, ఇస్లాం స్వీకరించటం లేదని ఎందుకు వారిపై ఆరోపణలు చేయాలి ?

1.    నిరంతరం సత్యాన్ని తిరస్కరిస్తున్న వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడని ఖుర్ఆన్ లోని రెండవ అధ్యాయమైన సూరతుల్ బఖరహ్ లోని 6 మరియు 7 వ వచనాలలో అల్లాహ్ ప్రకటించినాడు : "ఇక సత్యాన్ని తిరస్కరించిన వారి విషయంలో,  వారు హెచ్చరించబడినా హెచ్చరించబడక పోయినా ఒకటే; వారు విశ్వసించరు. వారి హృదయాలపై అల్లాహ్ సీలు వేసినాడు మరియు వారి చెవులపై, కళ్ళపై పరదా; వారికి లభించే శిక్ష కడు కఠినమైంది."   [ఖుర్ఆన్ 2:6-7]

సత్యాన్ని తిరస్కరించే మామూలు కాఫిర్ల అంటే సత్యతిరస్కారుల గురించి ఈ వచనాలు తెలుపడం లేదు. ఇక్కడ వాడబడిన అరబీ భాషా పదాలు అల్లదీన కఫరూ అంటే సత్యతిరస్కారం వైపు నిరంతరం మ్రొగ్గు చూపేవారని అర్థం. అలాంటి వారిని నీవు హెచ్చరించినా, హెచ్చరింకపోయినా తేడా లేదు. ఎందుకంటే వారు విశ్వసించరు. అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. ఇంకా వారి చెవులపై మరియు కళ్ళపై పరదా కప్పినాడు. అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేయడం వలన కాదు ఈ కాఫిర్లు అంటే సత్యతిరస్కారులు అర్థం చేసుకోకపోవడం మరియు నమ్మకపోవడం, కానీ వాస్తవం దీనికి విభిన్నంగా ఉంది. కాఫిర్లు అంటే సత్యతిరస్కారులు సత్యతిస్కారం వైపు నిరంతరం మ్రొగ్గు చూపడం వలన, వారిని హెచ్చరించినా హెచ్చరించక పోయినా వారు అల్లాహ్ ను నమ్మరు. అందువలన అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. కాబట్టి అల్లాహ్ ను కాదు నిందించవలసింది, సత్యాన్ని నిరంతరం తిరస్కరిస్తున్న ఆ సత్యతిరస్కారులను నిందించాలి.

2.    ఉదాహరణ: పరీక్షలో ఫెయిల్ అవుతాడని టీచర్ భావిస్తున్న ఒక విద్యార్థి  

ఫైనల్ పరీక్షలకు ముందు ఒక అనుభవజ్ఞుడైన ఒక టీచర్ హద్దుమీరిన తుంటరితనం, క్లాసులో శ్రద్ధగా పాఠాలు వినకపోవడం మరియు అతడికి ఇవ్వబడిన హోమ్ వర్కు సరిగ్గా పూర్తిచేయకపోవడం వంటి కారణాల వలన ప్రత్యేకంగా ఒక విద్యార్థి ఆ పరీక్షలలో తప్పుతాడని ఊహించాడు. ఒకవేళ పరీక్షలు వ్రాసిన తర్వాత ఆ విద్యార్థి నిజంగా తప్పితే, ఆ విద్యార్థి ఫెయిల్ కావడానికి ఎవరిని నిందించాలి: తప్పుతాడని ఊహించిన టీచరునా లేక కష్టబడి చదవని విద్యార్థినా? ఫెయిల్ అవుతాడని ముందుగానే టీచర్ ఊహించడం వలన ఆ విద్యార్థి తప్పాడని నిందించడం సముచితం కాదు కదా. పరీక్ష తప్పడానికి స్వయంగా విద్యార్థే కారకుడు గానీ టీచర్ ఊహించడం అతడి తప్పడానికి కారణం కాజాలదు.  

అలాగే, కొందరు సత్యాన్ని నిరంతరం తిరస్కరించే వైపే మ్రొగ్గుతారనే విషయం ముందుగానే అల్లాహ్ కు తెలుసు మరియు దాని వలన అల్లాహ్ వారి హృదయాలపై సీలు వేసినాడు. అందువలన సత్యతిరస్కారులైన ఆ ముస్లిమేతరులే స్వ యంగా సత్యాన్ని తిరస్కరించడానికి కారకులు. అంతేగాని వారి సత్యతిరస్కారానికి అల్లాహ్ వారి హృదయాలపై వేసిన సీలు కాదు.