పంది మాంసం ఎందుకు నిషేధింపబడినది? ()

ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్

ఒక క్రైస్తవుడి ప్రశ్న – పంది కూడా దేవుడి సృష్టిలోని ఒక సృష్టి అయినప్పటికీ, దాని మాంసం ఎందుకు నిషేధింపబడినది?

  |

  పంది మాంసం ఎందుకు నిషేధింపబడినది?

  ﴿ نصراني يسأل عن سبب تحريم لحم الخنزير ﴾

  ] తెలుగు – Telugu – التلغو [

  الشيخ محمد صالح المنجد

  అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

  పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్

  2009 - 1430

  ﴿ نصراني يسأل عن سبب تحريم لحم الخنزير ﴾

  « باللغة التلغو »

  الشيخ محمد صالح المنجد

  ترجمة: محمد كريم الله

  مراجعة: شيخ نزير أحمد

  2009 - 1430

  పందిమాంసం ఎందుకు నిషేధింపబడినదని ఒక క్రైస్తవుడు ప్రశ్నిస్తున్నాడు

  పంది కూడా దేవుడి సృష్టిలోని ఒక సృష్టి అయినప్పటికీ, దాని మాంసాన్ని ఇస్లాం ధర్మం ఎందుకు నిషేధిస్తున్నది?.

  అల్హందులిల్లాహ్ – సకల స్తోత్రములు అల్లాహ్ కే.

  మొదటిది:

  మన ప్రభువు పందిమాంసాన్ని చాలా ఖచ్చితమైన ఆదేశాలతో నిషేదించినాడు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం):

  (ఓ ప్రవక్తా) వారికి తెలుపు: నా పై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానంలో: ఆహార పదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం – ఎందుకంటే అది అపరిశుద్ధమైనది; లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి – ఆయన పేరుతో గాక – ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన, హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.”[అల్ అన్ఆమ్ 6:145]

  అల్లాహ్ తన దయ వలన మరియు కరుణ వలన అన్ని మంచి వాటిని మరియు ఉత్తమమైన వాటిని తినటానికి మనకు అనుమతించినాడు. ఆయన కేవలం అపవిత్రమైనవాటిని మరియు అపరిశుద్ధమైన వాటిని మాత్రమే నిషేధించినాడు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (ఖుర్ఆన్ వచనపు భావం యొక్క అనువాదం):

  “…అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మమును నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరుశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు” [అల్ అరాఫ్ 7:157]

  పంది ఒక అపవిత్రమైన మరియు అపరిశుద్ధమైన జంతువు అనీ మరియు దానిని తినటమనేది మానవుడికి హాని కలుగజేస్తుందనే వాస్తవాలను మనం ఒక్క క్షణం కూడా మరవలేము. అంతేకాక అది మురికిలోను మరియు విసర్జితాలలోను జీవిసిస్తుంది. మంచి ప్రవర్తన గలవారికి దానిని ముట్టుకోవటాన్ని కూడా అసహ్యించుకుంటారు. మరి అలాంటిది, దానిని తినటం అనేది ఆ వ్యక్తి యొక్క విచిత్ర ప్రవర్తనకు కారణమై ఉంటుంది లేదా అతని విచిత్ర ప్రవర్తనకు ఒక సూచన అయి ఉంటుంది.

  రెండవది:

  పంది మాంసం తినటం వలన కలిగే భౌతిక, శారీరక హాని కలిగించే అనేక విషయాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రము ఋజువు చేసినది. వాటిలో కొన్ని:

  ‎ కొలెస్టరోల్ అతి ఎక్కువగా ఉన్న మాంసములలో పంది మాంసం కూడా ఒకటి. రక్తప్రవాహంలో దాని హెచ్చుదల గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే ధమని నాళాలను తరచుగా అవరోధించవచ్చు, అడ్డగించవచ్చు. పంది మాంసంలో కొవ్వుతో కూడి, బలిసి ఉన్న ఆమ్లముల (fatty acids) నిర్మాణం అటువంటి ఆమ్లములు కలిగి ఉన్న ఇతర పదార్థాలతో పోల్చినట్లయితే, అది సాధారణమైనది కాదని గుర్తించబడింది. అంటే ఆ పంది మాంసంలోని ఆ కొవ్విన ఆమ్లములు సులభంగా మానవశరీరంలో కలిసిపోవటం వలన, అవి కొలస్టొరాల్ స్థాయిని బాగా పెంచివేస్తాయి.

  ‎ పంది మాంసం మరియు పంది కొవ్వు - పెద్దపేగు, పురీష స్థానం, పురీష నాళం, మలాశయం, వస్తి గ్రంథి మరియు రక్తములలో కేన్సరు వ్యాప్తికి తోడ్పడతాయి.

  ‎ పంది మాంసం మరియు పంది కొవ్వు - స్థూలకాయం, కాయపుష్టి మరియు చికిత్స చేయడానికి కష్టతరమైన దాని సంబంధిత వ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి.

  ‎ పంది మాంసం తినటమనేది గజ్జి, చర్మరోగం, ఎలర్జీ, కడుపులో పుండు లెగటం వంటి వాటికి దారి తీస్తుంది.

  ‎ అంతేకాక పంది మాంసం – మానవుల ఊపిరితిత్తులలో, చిన్నప్రేగులో పెరిగే ఒక జాతి పురుగు (బద్దె పురుగు) వలన కలిగే ఊపిరితిత్తుల రోగాలకు మరియు ఇతర సూక్ష్మ హృద్రోగాలకు కారణమవుతుంది.

  పంది మాంసం తినటంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఊపిరితిత్తులలో, చిన్నప్రేగులో దాదాపు 2 – 3 మీటర్ల వరకు పెరగ గలిగే ఒక జాతి పురుగు tapeworm (బద్దె పురుగు) దానిలో ఉంటుంది. ఈ పురుగుల గ్రుడ్లు మెదడులో పెరిగితే, అవి మానవుల పిచ్చితనానికి మరియు అపస్మారక స్థితికి దారితీయవచ్చును. అవే గనుక హృదయం చుట్టుప్రక్కల ప్రాంతంలో పెరిగితే, అధిక రక్తపు పోటులకు మరియు గుండె పోటులకు దారి తీయవచ్చును. పంది మాంసంలో కనబడే మరొక రకమైన పురుగు పేరు trichinosis worm. ఇది వండటం వలన కూడా చావదు. మన శరీరంలో దాని పెరుగుదల పక్షవాతానికి మరియు చర్మం పై పొక్కులు లేవటానికి దారితీస్తుంది.

  పంది మాంసం తినటం వలన వచ్చే బద్దెపురుగు రోగం చాలా ప్రమాదరకమైనదని వైద్యులు ధృవీకరించారు. రోగి శరీరంలోని చిన్నప్రేగులో అది వృద్ధి చెందుతూ, కొన్ని నెలలోనే అది 4- 10 మీటర్ల పొడవైన, వేల భాగాలతో కూడిన శరీరం గల పెద్ద పురుగుగా మారి, మల విసర్జన సమయంలో దానిలోని కొంత భాగం బయటకు కనబడుతుంది. ఆ పురుగు గ్రుడ్లను పంది మ్రింగి, కడుపులో ఉంచుకున్నప్పుడు అవి బద్దెపురుగు తలను కలిగి ఉండి, పూర్తిగా పెరగని ద్రవంతో నిండిన సంచి రూపంలో ఆ పంది కణాలలో మరియు కండరాలలోనికి చేరి పోతుంది. ఎవరైనా వ్యక్తి ఆ వ్యాధి సోకిన పంది మాంసం తిన్నప్పుడు, అది అతని ప్రేగులో చేరి, పూర్తిస్థాయి పురుగుగా వృద్ధి చెందుతుంది. ఈ పురుగులు మనలో నీరసానికి, బలహీనతకు కారణమవుతాయి మరియు vitamin B12 లోటును కలుగజేసి, ఒక ప్రత్యేక రకమైన అనేమియా anaemia కు దారితీస్తాయి. దాని ఫలితంగా నాడీమండలానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని కేసులలో ఆ ద్రవరూపంలోని పురుగు మెదడులోనికి చేరిపోవటం వలన వంపులు తిరిగిపోవటం, మెదడుపై ఒత్తిడి పెరిగిపోవటం, మూర్ఛత్వానికి గురికావటం మరియు పక్షవాతానికి గురికావడం మొదలైనవి సంభవించవచ్చును.

  సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వలన వెంట్రుక వంటి లేదా వానపాము వంటి పురుగు మానవ శరీరంలోనికి ప్రవేశించి తరచుగా ప్రాణాంతకమయే trichinosis అనే రోగం రావడానికి కారణమవుతుంది. ఇతరుల శరీరాన్ని ఆశ్రయించి జీవించే ఈ పరోపజీవులు చిన్న ప్రేగులోనికి చేరిన 3 – 5 రోజులలోఅనేక క్రిములను ఉత్పత్తి చేస్తాయి. అవి ప్రేగులోకి ప్రవేశిస్తాయి మరియు రక్తంలోకి చేరతాయి. అక్కడి నుండి అవి దాదాపు శరీరం మొత్తం లోని జీవాణువులలో చేరిపోతాయి. అవి కండరాలలో చేరి, అక్కడ రోగకారకమైన ద్రవపదార్థం ఊరే తిత్తిగా మారతాయి. దాని వలన రోగి తీవ్రమైన కండరాల నొప్పికి గురవుతాడు. రోజులు గడిచిన కొద్దీ అది మెదడు, హృదయ కండరాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు మరియు నరాలలో కూడా రోగాన్ని వ్యాపింపజేయ గలదు. కొన్ని కేసులలో అది ప్రాణాంతకమైన, హానికరమైన వ్యాధిగా మారే అవకాశం ఉన్నది.

  మానవులకు మాత్రమే వచ్చే కీళ్ళవాతరోగ జ్వరం మరియు కీళ్ళనొప్పులు వంటి వ్యాధులు కొన్ని ఉన్నాయి. అయితే పందులలో తప్ప ఇతర ప్రాణులలో అవి కనబడవు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు (భావం యొక్క అనువాదం):

  “నిశ్చయంగా, ఆయన మీ కొరకు చచ్చిన జంతువు, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు జిబహ్ చేయబడిన దానిని (తినటాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవరైనా గత్యంతరం లేక, దుర్నీతితో కాకుండా, హద్దుమీరకుండా (తిన్నట్లయితే) అటిట వానిపై ఎలాంటి దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడూ, అపార కరుణా ప్రదాత” [అల్ బఖరహ్ 2:173]

  పంది మాంసం తినటం వలన కొన్ని హానికరమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. బహుశా మీరు వాటి గురించి చదివిన తర్వాత, ఇస్లాంలో అది ఎందుకు హరాం చేయబడినదనే అంటే నిషేధింపబడినదే విషయంలో మీకు వచ్చే సందేహాలన్నీ తీరిపోతాయి. ఇది సత్యధర్మం వైపు మీరు వేసే మొదటి అడుగు కావాలని ఆశిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఆగి, పరిశోధించి, ఫలితాలపై దృష్టిసారించి, కేవలం సత్యాన్ని కనిపెట్టాలనే మరియు సత్యాన్ని అనుసరించాలనే తపనతో వాటి గురించి పూర్తిగా అర్థం చేసుకునేలా బాగా ఆలోచించ వలెను. ఇహపరలోకాలలో ప్రయోజనం కలిగించే సన్మార్గాన్ని మీకు చూపమని నేను అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను.

  కాని, పంది మాంసం తినటం వలన కలిగే హాని గురించి మాకు తెలియపోయినా, అది హరాం అంటే నిషేధింపబడినదనే విషయంలో మా విశ్వాసం కించెత్తు కూడా తగ్గదు మరియు దాని నుండి దూరంగా ఉండాలనే మా నిర్ణయం బలహీనపడదు. ఆదం అలైహిస్సలాం స్వర్గం నుండి బహిష్కరింపబడటానికి కారణం – అల్లాహ్ నిషేధించిన చెట్టు నుండి ఆయన తినటమే అనే విషయం మీకు తెలుసు కదా! ఆ చెట్టు గురించి మాకు ఏమీ తెలియదు మరియు దాని నుండి తినవద్దనటానికి కారణం ఏమై ఉంటుందని ఆదం అలైహిస్సలాం తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. అయితే అల్లాహ్ దానిని నిషేధించాడు అనే విషయమే ఆయనకు చాలు, అలాగే మనకు మరియు ప్రతి ఒక్క విశ్వాసికి కూడా అల్లాహ్ నిషేధాజ్ఞలే చాలు.

  ఇక పంది మాంసం తినటం వలన కలిగే కొన్ని హానికరమైన రోగాలపై దృష్టి సారించుదాము; Fourth Annual Conference of Islamic Medicine, Kuwait edition, p. 731 ff; and al-Wiqaayah al-Sihhiyyah fi Daw’ al-Kitaab wa’l-Sunnah by Lu’lu’ah bint Saalih,p.635ff. లలో సమర్పించబడిన వైద్యశాస్త్ర పరిశోధనలను ఒకసారి పరిశీలించండి.

  కాని, ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాము: మీ దివ్యగ్రంథాలలో ఒకటైన పాతనిబంధనలలో పంది మాంసం నిషేధింపబడలేదా?

  “అసహ్యం, ఏవగింపు కలిగించే దేనిని తినవద్దు. మీరు ఈ జంతువులను తినాలనుకుంటే … పంది అపవిత్రమైనది, మురికిది; దాని డెక్కలు గిట్టలు చీలి ఉన్నప్పటికీ, అది నెమరు వేయదు. మీరు వాటి మాంసాన్ని తినవద్దు, వాటి మృతకళేబరపు అవయవాలను ముట్టుకోవద్దు.” (Deuteronomy 14:3-8)

  ఇంకా Leviticus 11-1-8. లో కూడా చూడండి.

  యూదుల కోసం కూడా పంది మాంసం నిషేధింపబడినదనే ఋజువులు తెలుపవలసిన అవసరం లేదు. ఒకవేళ మీకేమైనా సందేహం ఉన్నట్లియితే, ప్రజలను అడగండి, వారు మీకు తెలుపుతారు. అయితే మీ దివ్యగ్రంథంలో తెలుపబడిన మరికొన్ని ఇతర విషయాలను కూడా మీరు పరిశోధించాలని మా కోరిక. కొత్త నిబంధనలు మిమ్మల్ని ఇలా ఆదేశిస్తున్నాయి – తౌరాహ్ లోని నియమనిబంధనలు మీకు కూడా వర్తిస్తాయి మరియు వాటిని మార్చకూడదు. మెస్సయ్య ఇలా తెలుపాడని బైబిల్ లో లేదా:

  “నేను శాసనాన్ని లేదా ప్రవక్తలను నిర్మూలించడానికి వచ్చానని భావించవద్దు. నేను వాటినికి నిర్మూలించటానికి రాలేదు – కాని, వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. భూమ్యాకాశాలు అదృశ్యమయ్యేవరకు నేను మీకు నిజం చెబుతాను. ప్రతిదీ సంపూర్ణమయ్యే వరకు శాస్త్రము నుండి అతి చిన్న అక్షరం లేదా పెన్ను యొక్క ఒక చిన్న గీత కూడా అదృశ్యం కాదు.” Matthew 5:17-18?

  కొత్త నిబంధనలలోని ఈ స్పష్టమైన ఆదేశాలు చూసిన తర్వాత ఇంకా వేరే ఆజ్ఞలు వెదక వలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ పందిమాంసం ఖచ్ఛితంగా అపవిత్రమైనదనే ఇంకో ప్రకటనను మనం తప్పక చూడవలెను.:

  “దగ్గరలోని పర్వతప్రాంతంలో పందులు ఒక పెద్ద సమూహం మేపబడుతున్నది. దుష్టశక్తులు జీసస్ ను ఇలా అర్థించాయి: ‘పందులలో మమ్మల్ని పంపుప; వాటి వద్దకు పోవటానికి మాకు అనుమతినివు.’ ఆయన వారికి అనుమతినిచ్చెను, మరియు దుష్టశక్తులు బయటకు వచ్చాయి మరియు పందుల వైపునకు వెళ్ళాయి.” Mark 5:11-13

  బహుశా మీరు ఇది రద్దుచేయబడినదని అనవచ్చు మరియు ఆ యా విషయాలు పీటర్ చెప్పినవి, ఫలానా ఫలానా విషయాలు పాల్ చెప్పినవని ...............…?

  ఇది స్పష్టంగా అల్లాహ్ పదాలను మార్చటమే. అంటే తౌరాహ్ మరియు భూమ్యాకాశాలున్నంత వరకు ఆ ఆదేశాలు అలాగే ఉంటాయి అనే మెస్సయ్యా పలుకులను పాల్ లేదా పీటర్ రద్దు చేయ గలరా?

  బైబిల్ లోని నిషేధాజ్ఞలు నిజంగానే ఎవరి ద్వారానో రద్దు చేయబడినాయని ఒకవేళ అనుకున్నట్లయితే, మీకోసం పూర్వం నిషేదింపబడిన దానినే మరల నిషేధిస్తున్న ఇస్లామీయ ధర్మాజ్ఞలను మీరెందుకు విమర్శిస్తున్నారు?

  మూడవది:

  పంది మాంసం తినటం నిషేధింపబడినప్పుడు, అల్లాహ్ వాటిని ఎందుకు సృష్టించాడు అనే మీ ప్రశ్నకు జవాబు – మీరు ఈ ప్రశ్న సీరియస్ అడిగి ఉంటారని మేము భావించటం లేదు. అలా కాదంటే మేము మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాము: హానికలిగించే, ప్రతిఘటించే, ఏవగింపు కలిగించే, అసహ్యాన్ని కలిగించే ఫలానా ఫలానా ప్రాణులను అల్లాహ్ ఎందుకు సృష్టించాడు? ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాము:అల్లాహ్ షైతానును ఎందుకు సృష్టించాడు?

  తనకిష్టమైన విధంగా తన దాసులకు ఆజ్ఞాపించే మరియు తన ఇష్టానుసారం పాలించే ప్రత్యేకాధికారం ఆ సృష్టికర్తకు లేదా?ఆయన ఆజ్ఞలను, ఆదేశాలను లేక ఆయన పదాలను ఎవ్వరూ తారుమారు చేయలేరు.

  సృష్టింపబడినందుకు గాను, తన ప్రభువు తనను ఏదైనా చేయమని ఆజ్ఞాపించినప్పుడల్లా, “మేము విన్నాము మరియు మేము విధేయత చూపుతాము” అని అనటం ఒక దాసుడి బాధ్యత కాదా?

  దాని రుచిని మీరు ఇష్టపడుతూ ఉండవచ్చు మరియు దానిని తినాలని మీరు కోరుకోవచ్చు. అంతేకాక మీ చుట్టుప్రక్కల వారు కూడా దానిని తినటానికి ఇష్టపడవచ్చు. కాని, మీ మనస్సు ఇష్టపడే వాటిలో దేనినీ త్యాగము చేయకుండానే స్వర్గంలోకి చేరపోగలరా?

  Islam Q&A