ముందుమాట
ఇన్నల్’హంద లిల్లాహ్ నహ్మదుహూ వ నస్తయీనుహూ వ నస్తగ్ఫిరుహూ వ నవూజు బిల్లాహి మిన్ షురూరి’’అన్ ఫుసినా వమిన్ సయ్యిఆతి ఆమాలినా (సర్వస్తోత్రాలు, ప్రశంసలుఅల్లాహ్’కు మాత్రమే చెందుతాయి, మేము ఆయనను స్తుతిస్తున్నాము, సహాయం ఆర్ధిస్తున్నాము, క్షమాపణ వేడుకుంటున్నాము మరియు ఆయనను మాత్రమే మా ఆత్మల కీడు నుండి, దుష్కర్మలనుండి శరణు వేడుచున్నాము.)మయ్యహ్దిహిల్లాహు ఫలా ముజిల్లలహూ వమయ్యుజ్’లిల్'హు ఫలా హాదియలహూ (అల్లాహ్ మార్గదర్శనం ప్రసాదించిన వాడికి ఎవరు మార్గబ్రష్టుడిగా మార్చలేరు, మరియు ఆయన మార్గబ్రష్టుడిగా మర్చినవాడికి మార్గదర్శనం ఎవరు చేయలేరు.) {వ అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ సల్లల్లాహు అలైహి వసల్లమ తస్లీమన్ కసీరన్-} నేను సాక్ష్యామిస్తున్నాను అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవంలేడు, ఆయన ఏకైకుడు, అయనకు ఎవరు సాటిలేరు, మరియు నేను సాక్ష్యామిస్తున్నాను ’ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ అల్లాహ్ దాసుడు, మరియు ఆయన సందేశహరుడు, అల్లాహ్ ఆయనపై అనేక శాంతులు కారుణ్యాలు కురిపించుగాకా!
అమ్మాబాద్! అల్లాహ్ సర్వలోకాల కొరకు తన ప్రవక్తలను సందేశహరులను ప్రభవింపచేశాడు, తద్వారా అల్లాహ్’కు విరుద్దంగా ప్రజలవద్ద ఎలాంటి సాకు, ప్రమాణం ఉండజాలదు, మరియు ఆయన గ్రంధాలను మార్గదర్శనం, దయ, జ్యోతి, స్వస్థతగా చేసి అవతరింపచేశాడు. మునుపటి దైవప్రవక్తలు తమ జాతుల వైపు ప్రత్యేకంగా పంపించబడేవారు, వారి గ్రంధాల సంరక్షణ బాధ్యత కూడా వారికే ఇవ్వబడింది. అందువల్ల వారి గ్రంధాలు వక్రీకరించబడ్డాయి, వాటి చట్టాలలో, శాసనాలలో మార్పులు, చేర్పులు జరిగాయి. ఎందుకంటే అవి ప్రత్యేక కాలంకోసం, ప్రత్యేక జాతులకోసం అవతరింపబడ్డాయి.
పిమ్మట అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్’ను తన ప్రవక్తగా ఎన్నుకుని ఆయనను అంతిముడుగా చేసి సందేశహరుల, దైవప్రవక్తల పరంపరను ముగించి సీలు వేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.}[1] మరియు ఆయనకు ఒక గొప్పగ్రంధాన్ని ఇచ్చి గౌరవించాడు అదియే ‘సర్వోన్నత పవిత్ర అల్’ఖుర్ఆన్’ గ్రంధం, ఈ గ్రంథ రక్షణ బాధ్యతను ప్రజల ఆధీనం చేయకుండా అల్లాహ్’యే స్వయంగా తీసుకున్నాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {మేమే ఈ ఖుర్ఆన్ ను (జిక్ర ను) అవతరింపజేశాము. మరి మేమే దీనిని సంరక్షిస్తాము}[2] మరియు ఆయన దానిని ప్రళయదినం వరకు ధర్మశాసనంగా స్థిరపర్చాడు,మరియు ఆ ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడు స్థిరంగా ఉంచడానికి దానినీ విశ్వసించాలని,ఇతరులను దానివైపుకు ఆహ్వానించాలని మరియు దానిపై సహనస్థైర్యాలు కనబర్చాలని పవిత్రుడైన అల్లాహ్ స్పష్టం చేశాడు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క పద్ధతి (మన్’హజ్) మరియు ఆయన తరువాత ఆయన అనుచరుల పద్ధతి : అల్లాహ్ వైపునకు జ్ఞానంతో వివేకంతో పిలుస్తూ ఆహ్వానించటం. అల్లాహ్ తఆలా ఈ విధానాన్ని స్పష్టపరుస్తూ ఇలా చెప్పాడు :- {(వారితో) అను : "ఇదే నా మార్గం. నేనూ మరియు నన్ను అనుసరించేవారూ, నిశ్చిత జ్ఞానంతో మిమ్మల్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు మరియు నేను ఆయనకు సాటి కల్పించే వారిలోని వాడిని కాను!"} మరియు దైవమార్గంలో ఎదురయ్యే కష్టనష్టాలను సహించాలని ఆయనకు ఆదేశించాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {దృఢసంకల్పం కలిగిన దైవసందేశహరుల వలె మీరు కూడా సహనాన్ని పాటించండి}[3] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు :- {ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!}[4] నేను’కరుణామయుడైన అల్లాహ్ విధానాన్నిపాటిస్తూ,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మార్గదర్శాన కాంతిని పొందుతూ,దైవగ్రంధపు జ్ఞానాన్ని అర్జిస్తూ ప్రజలను అల్లాహ్ మార్గంవైపునకు ఆహ్వానించుటకు ఈ పుస్తకాన్ని రచించాను. ఇందులో నేను విశాలమైన బ్రహ్మాండ నిర్మాణాన్ని, మనిషి పుట్టుకను, అతనికి ఒసగబడిన గౌరవాన్ని, అతని వైపుకు సందేశహరులను పంపబడటాన్ని,గతధర్మాల స్థితిగతుల గురించి సంక్షిప్తంగా వివరించాను. ఆ తరువాత నేను ఇస్లాం యొక్క అర్ధాన్ని,దానిమూల స్థంభాల గురించి తెలిపాను, ఎవరైతే మార్గదర్శనం కొరుకుంటాడో అతని ఎదుట ఈ పుస్తకం ఆధారాలతో ప్రమాణంగా నిలుస్తుంది,మరియు సాఫల్యం పొందాలనుకునేవాడికోసం అతని మార్గాన్ని అతనికోసం స్పష్టపరిచాను. ఎవరైతే ప్రవక్తల, సందేశహరుల, సంస్కరణవేత్తల అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటాడో ఇదియే వారి మార్గం! ఎవడైతే వారికి విముఖత చూపుతాడో నిశ్చయంగా అతను తనని ఒక పనికిమాలినవాడిగా మార్చుకున్నాడు, మరియు అపమార్గంపై నడిచాడు.[5] ఇతర ధర్మాలవారు జనులను ప్రజలను తమ ధర్మంవైపుకు పిలుస్తూ 'సత్యం'అందులో తప్ప మరెందులో లేదని నమ్ముతారు, ఇతర మతవిశ్వాసకులు ప్రజలను తమ మత స్థాపకులను అనుసరించాలని మరియు ఆ నాయకుల విధానాలను గౌరవించాలని ఆహ్వానిస్తారు.
కాని ఒక ముస్లిం తన స్వీయ విచారాలను, విధానాలను పద్దతులను అనుసరించమని ప్రజలను ఎప్పుడు ఆహ్వానించడు, ఎందుకంటే అతని కొరకు ప్రత్యేకమైన మతం, మార్గం ఏది లేదు, నిశ్చయంగా అతని ధర్మం ‘అల్లాహ్ ధర్మం’ఆ ధర్మాన్ని తనకోసం ప్రభువు ఇష్టపడ్డాడు; అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు :- {నిస్సందేహంగా ఇస్లాం'యే అల్లాహ్ వద్ద ధర్మం సమ్మతమైనది}[6] మరియు మనిషి కీర్తిప్రతిష్టలవైపుకు వారు ఆహ్వానించరు, ఎందుకంటే దైవధర్మంలో మానవులంతా సమానమే వారి మధ్య ఎటువంటి తారతమ్యం ఉండదు కేవలం తఖ్వా ఆధారంగా మాత్రమే గౌరవం లభిస్తుంది,ప్రజలను తన ప్రభువు ఎంచిన మార్గంపై నడవాలని,సమస్త ప్రవక్తలను విశ్వసించాలని,చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అవతరించిన దైవధర్మాన్ని అనుసరించాలని ఉపదేశించాడు,సమస్త ప్రజానికానికి దాన్ని చేరవేయాలని ఆయనకు ఆదేశించాడు.
ఈ పుస్తకాన్ని అల్లాహ్ తన కోసం ఎంచుకున్న 'దైవధర్మం' (ఇస్లాం) వైపుకు ఆహ్వానించడానికి నేను వ్రాశాను,ఈ ధర్మం కొరకు తన అంతిమ ప్రవక్తను ప్రభవింపచేశాడు, మరియు మార్గదర్శకత్వం కోరినవాడి కోసం ఋజుమార్గాన్ని బోదిస్తుంది, సుఖసంతోషాలను అబిలాషించేవాడికి రుజువులను చూపిస్తుంది. అల్లాహ్ సాక్షిగా! ఈ ధర్మంలో తప్ప మానవుడు నిజమైన ఆనందాన్ని పొందలేడు, మరియు ఒక వ్యక్తి అల్లాహ్’ను తన ప్రభువుగా,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం’ను సందేశహరుడిగా, ఇస్లాం’ను తన ధర్మంగా విశ్వసించనంత వరకు అసలైన సుఖశాంతులను పొందలేడు. పూర్వము మరియు ప్రస్తుత కాలంలో ఇస్లాం ను స్వీకరించిన కోట్లమంది సాక్ష్యామిస్తూ తెలిపిన విషయమేమిటంటే ‘ఇస్లాం స్వీకరణ తరువాతే నిజమైన జీవన విధానం, అసలైన పుట్టుక పర్మార్ధం గురించి తెలిసింది,ఇస్లాం నీడలో వారు అసలైన సుఖసంతోషాలను ఆస్వాదించారు. ఎందుకంటే ప్రతీ మనిషి సుఖసంతోషాలను అభిలాషిస్తాడు,మరియు శాంతిని పరిశోధిస్తాడు సత్యాన్ని వెతుకుతూ ఉంటాడు. కాబట్టి నేను ఈ పుస్తక సంకలనం చేశాను, నేను అల్లాహ్ తో ’ఈ కార్యం కేవలం అల్లాహ్ చిత్తాన్నిపొందడానికి, ఆయన మార్గదర్శనం వైపుకు ఆహ్వానించేదిగా చేయాలని'వేడుకుంటున్నాను మరియు దుఆ చేస్తున్నాను అల్లాహ్ దీనిని ఇహపరలోకాల్లో సాఫల్యం చేకూర్చే సత్కర్మగా ఆమోదించుగాకా!
నేను ఒక షరతుతో ఈ పుస్తకాన్ని ప్రతీ భాషలోకి అనువదించడానికి, ప్రచురించడానికి అనుమతినిస్తున్నాను, అది’ ఇతర భాషలోకి అనువదించే అనువాదకుడు దీని అనువాదంలో న్యాయశీలతను అనుసరిస్తూ అమానతుదారుడిగా వ్యవహరించవలెను.
అంతేకాదు అరబీభాషలోని ఈ మూలపుస్తకం లేక మరే ఇతర అనువాదంలో ఏమైనా సంస్కరణలు అవసరము ఉంటే క్రింద తెలిపిన చిరునామా ద్వారా నాకు సూచించాలని కోరుతున్నాను.
ఆది, అంతపు ప్రశంసలు, గోచర, అగోచర ప్రశంసలు అల్లాహ్ కొరకు శోభిస్తాయి. మరియు అంతర్గత బహిర్గత స్తోత్రాలు ఆయన కొరకు వర్తిస్తాయి. ఆరంభంలో అంతంలో ఆయనకు మాత్రమే స్తుతులు చెందుతాయి, ఆయన కొరకు భూమి నిండా, ఆకాశం నిండా ప్రశంసలు చెందుతాయి, మరియు మా ప్రభు అల్లాహ్ కోరిన వాటి నిండా ప్రశంసలు కేవలం ఆయనకు చెందుతాయి. అల్లాహ్ తఆలా మనందరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంపై, ఆయన సహచరులపై మరియు ప్రళయం వరకు ఆయన మార్గంపై నడిచే అనుయాయులపై అంతులేని దయా, కారుణ్యాలు కురిపించుగాకా!
రచయిత:
డాక్టర్ ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ సాలెహ్ అస్సుహైమ్.
రియాజ్ 13/10/1420 హిజ్రీ-స.బ 1032 రియాజ్-1342.
స.బ 6249 రియాజ్ 11442.
మనిషి పెరిగి, వివేకం వృద్దిచెందిన తరువాత అతని మనోమస్తిష్కంలో అనేక ప్రశ్నలు, ఆలోచనలు, మెదలవుతూ ఉంటాయి, నేను ఎక్కడి నుండి వచ్చాను? ఎందుకు వచ్చాను? నా గమ్యం ఏమిటి? మరియు నన్ను ఎవరు సృష్టించారు? నలువైపుల నాకు కనిపించే ఈ మహాబ్రహ్మాండాన్ని ఎవరు సృష్టించారు? ఈ మహాబ్రహ్మాండానికి యజమాని ఎవరు? దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నియంత్రిస్తున్నారు? ఇత్యాది ముఖ్యమైన ప్రశ్నలువస్తాయి.
ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో మనిషి అసమర్ధుడు,ఆధునిక విజ్ఞానం కూడా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదు,ఎందుకంటే ఈ ప్రశ్నలు ధర్మపరిధిలోనివి,కాబట్టి వీటికి సంబంధించి అనేక కథనాలు,విభిన్న మిత్యాలు,మూఢనమ్మకాలు,కథలు కనిపిస్తాయి,అవి మనిషి వ్యాకులతను,చింతను మరింత పెంచుతాయి. మనిషి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సరైన సమాధానాలు కనుక్కోవడం సంభవం కాదు,కానీ అల్లాహ్ అతనికి సత్యమార్గదర్శనం చేస్తే ఈ ప్రశ్నలతో పాటు ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు పొందగలడు. ఎందుకంటే ఇవి అగోచర విషయాలుగా పరిగణించబడతాయి, సత్యమైన దైవధర్మం మాత్రమే న్యాయమైన అసలైన మార్గాన్నిదర్శనం చేస్తుంది,ఎందుకంటే అల్లాహ్ ఏకైకుడే సందేశహరులకు,ప్రవక్తలకు తన దైవవాణి పంపించాడు. కాబట్టి ఒకమనిషి నిజమైన న్యాయమైన ధర్మం వైపుకు తప్పనిసరిగా మరలాలి,ఆ జ్ఞానం ఆర్జించి దాని ప్రకారం విశ్వసించాలి, తద్వారా అతని వ్యాకులత, చీకూచింతలు దూరమవుతాయి,సందేహాలు నివృత్తి అవుతాయి,మరియు ఋజుమార్గం పొందుతాడు.
రాబోయే పేజీలలో నేను మిమ్మల్ని అల్లాహ్’ ఋజుమార్గం వైపునకు ఆహ్వానిస్తాను, మరియు మీ ముందు వాటికి చెందిన కొన్ని ముఖ్యమైన ఆధారాలు,ప్రమాణాలు,స్పష్టమైన రుజువులు ప్రవేశపెడతాను,తద్వారా మీరు నిష్పక్షపాతంతో సహన స్థైర్యాలతో వీటిని విచారిస్తూ పరిశీలించండి.
అవిశ్వాసపరులు సృష్టితాలను, కృత్రిమ దైవాలను ఆరాధిస్తారు ఉదాహరణకు:-చెట్లు, రాళ్ళు, మానవులు, కాబట్టి యూదులు, బహుదైవారాధకులు దైవప్రవక్తను అల్లాహ్ లక్షణాలను,గుణగనాలను గురించి అడుగుతూ‘ఆయన దేనికి చెందినవాడు ? అని అడిగారు-అల్లాహ్ అప్పుడు ఈ సూరాను అవతరింపచేశాడు. {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.}[7] {అల్లాహ్ ఏ అవసరం లేనివాడు. (నిరుపేక్షాపరుడు)}[8] {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.}[9] {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."}[10] దాసులకు తనగురించి పరిచయమిస్తూ ఇలా చెప్పాడు:- {నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!} మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన,తన సింహాసనాన్ని(అర్ష్ ను) అధిష్ఠించాడు.మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్నీ వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువును కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.} {మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు.నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి.} ఇలా సెలవిచ్చాడు: {అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు కూడా బాగా తెలుసు.ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది.{8} {ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నింటినీ ఎరిగిన వాడు. మహనీయుడు, సర్వోన్నతుడు.}9-10. మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదిలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా ? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా ? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను : "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన ఒక్కడు,ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)}11
పరమపవిత్రుడైన అల్లాహ్ తన ఆయతులను వారికొరకు రుజువులుగా స్పష్టమైన సాక్ష్యాలుగా స్థాపించాడు. అల్లాహ్ సెలవిచ్చాడు : {మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే.}[11] {మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు.నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.}[12] అల్లాహ్ సెలవిచ్చాడు: {మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం;మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి.} (ఇంకా) ఆయన (శక్తి) సూచనలలో రాత్రివేళ మీరు నిద్రపోవటం, పగటిపూట,మీరు ఆయన కృపను (జీవనోపాధిని) అన్వేషించటం కూడా ఉన్నాయి.
ఆయన అందం,పరిపూర్ణత వంటి సుగుణాలతో తనను కీర్తించాడు;ఇలా పలికాడు: {అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే.ఆయన సమ్ముఖంలో - ఆయన అనుజ్ఞ లేకుండా - సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందున్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప,ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. }[13] మరియు ఇలా పలికాడు: {పాపాలను క్షమించేవాడు మరియు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, శిక్షించటంలో కఠినుడు, ఎంతో ఉదార స్వభావుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. (అందరి) మరలింపు ఆయన వైపుకే ఉంది!} మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రధాత, శరణమిచ్చేవాడు, సర్వశక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు} [14]-[15]
సర్వశక్తిమంతుడు, వివేచనాపరుడు, నిజ ఆరాధ్యుడు, ప్రభువు ఆయన తన పరిచయం దాసులకు చేశాడు,మరియు తన ఆయతులను వారికొరకు సాక్ష్యాలుగా, నిదర్శనాలుగా స్థాపించాడు, తన సుగుణాన్ని పరిపూర్ణగుణంతో వర్ణించాడు, ఇది ఆయన అస్తిత్వ ఉనికి, పోషకత్వం, దైవత్వంను సందేశహరుల శాసనాలను, బుద్ది అవసరాన్ని మరియు నైతిక స్వభావంను సూచిస్తుంది, మరియు ఈ విషయంపై అన్నీ సముదాయాలు ఏకగ్రీవంగా ఉన్నాయి. ఈ విషయం గురించి నేను రాబోయే పేజీల్లో కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను.ఇక ఆయన అస్తిత్వం మరియు (రుబూబియ్యతు)పోషకత్వం కు సంబంధించిన కొన్ని ప్రమాణాలు ఇచ్చట పేర్కొనబడుతున్నాయి అవి :-
ఓ మానవుడా! నీ నలువైపుల ఆవరించి ఉన్న ఈ మహావిశ్వం ఆకాశాలు,నక్షత్రాలు,నదులు,పర్చబడిన భూమితో కలిసి తయారయ్యింది,ఒకదానికొకటి పరస్పరం కలిసిన ముక్కలు దీనిలో ఉన్నాయి,ఇందులో మొలకెత్తేవి వేరువేరుగా బిన్నవిభిన్నంగా ఉన్నాయి,అనేక రకాల పండ్లు ఇందులో ఉన్నాయి, ప్రతీ ప్రాణిలో మీరు రెండు జతలు పొందుతారు. కాబట్టి ఈ విశ్వ బ్రహ్మాంఢం స్వతహాగా తనను సృజించుకోలేదు, నిశ్చయంగా దీనిని సృజించే ఒక సృష్టికర్త ఉండటం తప్పనిసరి, ఎందుకంటే అది స్వయంగా తననుతాను సృష్టించుకోవడమనేది అసంభవం, అలాంటప్పుడు మరి ఎవరు ఇంతటి మనోహరమైన సుందర సృష్టిని స్థాపించారు? మరియు ఉత్తమంగా ఎవరు రూపకల్పన చేశారు? దానిని వీక్షించేవారి కోసం అద్భుతమైన సూచనగా మలిచాడు,అది మరెవరో కాదు ఆయనే సర్వశక్తిమంతుడైన అల్లాహ్! అయన తప్ప మరొక నిజప్రభువు లేడు మరియు ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడు!అల్లాహ్ సెలవిచ్చాడు :- {వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?}[16] {లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.} ఈ రెండు ఆయతులు మూడు ముఖ్యమైన విషయాలను సూచిస్తున్నాయి.అవి :-
1) ఏమి? వీరు అనస్తిత్వం(లేమి) నుండి పుట్టించబడ్డారా ?
2) ఏమి? వారు తమను స్వతహాగా సృష్టించుకున్నారా ?
3) ఏమి? వారు భూమ్యాకాశాలను సృష్టించారా ?
వారు అనస్తిత్వం నుండి పుట్టించబడలేదు మరియు తమను స్వయంగా సృష్టించుకోలేదు, మరియు వారు భూమ్యాకాశాలను కూడా సృష్టించలేదు కాబట్టి ఖచ్చితంగా వారిని మరియు భూమ్యాకాశాలను సృష్టించిన ఒక సృష్టికర్త ఉనికిని నమ్మడం అనివార్యం. ఆయనే సర్వశక్తిమంతుడు, ఒకేఒక్కడైన అల్లాహ్!
సృష్టికర్తను స్వాభావికంగా గుర్తించే విధంగా ప్రాణులు సృష్టించబడ్డాయి, మరియు ఆయన ప్రతీ వస్తువు నుండి మహోన్నతుడు, పెద్దవాడు, గొప్పవాడు, మరియు పరిపూర్ణుడు, ఈ విషయం గణితశాస్త్ర సిద్దాంతాల కంటే ఎక్కువగా ఉత్తమంగా, మనిషి స్వభావంలో నిక్షిప్తమయ్యింది, దీనిని రుజువులతో నిరూపించవలసిన అవసరం లేదు, అతని సహజసిద్ద స్వభావం కొన్ని ప్రతికూలప్రభావాలను ఎదురుకుని మార్పుకు గురై ఉంటుంది.[18} అల్లాహ్ సెలవిచ్చాడు:- {అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆస్వభావం పైనే(ఉండండి). అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా! ఇదే సరైన ధర్మం.}[17] మరియు (ఆయన) సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {ప్రతీ శిశువు స్వాభావికసహజగుణం పై పుట్టించబడతాడు,అయితే వారి తల్లిదండ్రులు అతన్ని యూదునిగా,క్రైస్తవునిగా లేక మజూసిగా మార్చేస్తారు,ఒక జంతువు పరిపూర్ణశిశువును కంటుంది అప్పుడు దానిలో నీవేమైన లోపాన్ని చూస్తావా?} పిదప అబూ హురైరా(రదియల్లాహు అన్హు) ఇలా పలికారు మీరు చదవండి ఒక వేళ మీరు తలచుకుంటే :- అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావం పైనే (ఉండండి).అల్లాహ్ సృష్టిని మార్చకూడదు సుమా![18] మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా ప్రవచించారు:- {‘తస్మాత్! నిశ్చయంగా నా ప్రభువు నాకు ఆదేశించినది ఏమనగా మీకు తెలియని విషయాలను నన్ను బోధించమని ఈ రోజు వాటిని నాకు తెలియజేశాడు,నా దాసుడికి నేను ఇచ్చిన ప్రతీ సంపద హలాలుగావించినది,మరియు నేను నా సమస్త దాసులను ముస్లిములుగా పుట్టించాను,తరువాత వారి వద్దకి షైతానులు వచ్చి ధర్మం నుండి వారిని మార్గబ్రష్టులుగా మార్చారు,మరియు హలాలు విషయాలను హరాముగా నిషేదించారు మరియు వారికి నాతో పాటు ఇతరులను భాగస్వామ్యాన్ని కల్పించమని ఆదేశించారు,యదార్ధమేమిటంటే అలాచేయమని నేను ఎలాంటి రుజువును దింపలేదు.}[19]
ప్రాచీన-నూతన జాతులన్నిఈ విషయం పట్ల ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి,అది ఈ విశ్వానికి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్’ఆయనే ఆకాశాలను భూమిని పుట్టించినవాడు, ఈ నిర్మాణం లో అతనికి ఎవరు భాగస్వాములు లేరు, తనయజమాన్యంలో ఆయనకు సాటిలేనట్లుగా!
భూమ్యాకాశాల నిర్మాణంలో ఏ జాతి విశ్వాసం గురించి’కూడా అల్లాహ్’తో వారి దేవతలు భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని వర్ణించబడలేదు,కానీ వారిని,వారి దైవాలను అల్లాహ్’యే పుట్టించాడని విశ్వసించేవారు,కాబట్టి ఆయన తప్ప మరొక సృష్టికర్త కానీ ఉపాధికర్త కానీ లేడు,లాభం నష్టం పవిత్రుడైన ఆయన చేతిలో ఉంది. {22} బహుదైవారాధకులైన ముష్రికులు సైతం అల్లాహ్ పోషకత్వాన్ని [రుబూబియ్యాతు] విశ్వసించేవారనే విషయాన్ని అల్లాహ్ స్వయంగా తెలియజేశాడు. {మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించి, సూర్యచంద్రులను ఉపయుక్తంగా చేసింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పక: "అల్లాహ్!" అని అంటారు. అయినా వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు?).[20] {అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతి దాని గురించి బాగా తెలుసు.}[21] {మరియు ఒకవేళ నీవు వారితో: "ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి నిర్జీవంగా ఉన్న భూమికి జీవితాన్ని ఇచ్చింది ఎవరు?" అని అడిగితే, వారు తప్పకుండా "అల్లాహ్!" అని అంటారు. నీవు ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే!" కాని చాలా మంది అర్థం చేసుకోలేరు.}[22] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఒకవేళ, నీవు వారితో : "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు" అని అంటారు.}
ఈ మహావిశ్వాన్ని సృష్టించినవాడు ఒకగొప్పసృష్టికర్త ఉన్నాడని బుద్ది’కి అంగీకరించడం తప్ప మరొక మార్గం లేదు, ఎందుకంటే ఈ మహావిశ్వం పుట్టించబడినదని, ఆవిష్కరింపబడినదని బుద్ది గ్రహిస్తుంది,మరియు సృష్టి స్వతహాగా తనను తాను సృష్టించుకోలేదని బుద్ది గ్రహిస్తుంది, కాబట్టి ఆవిష్కరణ వెనుక ఆవిష్కరణకర్త ఖచ్చితంగా ఉంటాడు.
మనిషికి ప్రమాదాలు,ఆపదలు సంభవిస్తూ ఉంటాయనే విషయం తెలుసు,మనిషి వీటి నుండి రక్షించుకొలేని సమయంలో ఆకాశం వైపుకు మనసును కేంద్రీకరించి తన ప్రభువు తో ఆ సంకటం నుండి,ఆ కష్టం నుండి రక్షించమని దరఖాస్తు చేసుకుంటాడు,ఇతర రోజుల్లో విగ్రహాలను ఆరాధిస్తూ తన ప్రభువును నిరాకరించినప్పటికినీ,కాబట్టి ఇది ఒక తప్పనిసరి అవసరం దీనిని తిరస్కరించడానికి లేదు,మరియు ఖచ్చితంగా దీనిని స్వీకరించాలి. చివరికి జంతువులకు కూడా ఏదైనా ప్రమాదం సంభవిస్తే అవి తల లేపి ఆకాశం వైపుకు దృష్టిని సారిస్తాయి. నిశ్చయంగా అల్లాహ్ మనిషి గురించి తెలుపుతూ ‘అతనికి ఏదైనా సంకటం ఏర్పడితే తన ప్రభువు వైపుకు పరుగులుతీస్తూ వస్తాడు,తన ఆ సంకటాన్ని దూరం చేయమని ప్రాదేయపడతాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు, అతడు పూర్వం దేని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు (ఇతరులను) సాటి కల్పిస్తాడు.}[23] అల్లాహ్ తాలా బహుదైవారాధకులైన ముష్రికుల గురించి ఇలా సెలవిచ్చాడు: {ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము!"}[24] {కాని, ఆయన వారిని కాపాడిన వెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీరు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము.}23 మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు వారిని సముద్రపు అల,మేఘంగా క్రమ్ముకున్నప్పుడు, వారు పరిపూర్ణ భక్తితో అల్లాహ్ నే వేడుకుంటారు. కాని ఆయన వారిని రక్షించి ఒడ్డుకు చేర్చిన తరువాత వారిలో కొందరు (విశ్వాస-అవిశ్వాసాల) మధ్య ఆగిపోతారు. మరియు మా సూచనలను కేవలం విశ్వాసఘాతకులు,కృతఘ్నులైన వారు మాత్రమే, తిరస్కరిస్తారు.}[25]
ఈ మహావిశ్వాన్ని అనస్థిత్వం నుండి ఉనికిలోకి తెచ్చిన దైవం,మరియు మనిషిని ఉత్తమ రూపంలో సృజించిన దైవం,అతని స్వభావంలో తన దాస్యాన్ని,తనకోసం సమర్పణను అప్రమేయంగా కేంద్రీకరించాడు,బుద్దులు ఆయన పోషకత్వం మరియు దైవత్వం’కు కట్టుబడి ఉన్నాయి,సముదాయాలు జాతులు ఆయన పోషకత్వం పట్ల ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఆ దైవం తన పోషకత్వం మరియు దైవత్వంలో ఏకైకుడుగా ఉండటం చాలా అవసరం. పుట్టించడంలో సృష్టించడంలో ఎలాగైతే అతనికి భాగస్వాములు లేరో అదేవిధంగా దైవత్వంలో ఆయనకు ఇతర భాగస్వాములు లేరు,ఈ విషయాన్ని రూఢీ పరిచే అనేక ప్రమాణాలు ఉన్నాయి:-
i. ఈ విశ్వంలో ఒకేఒక్క ఆరాధ్యుడు ఉన్నాడు ఆయనే సృష్టికర్త, ఉపాధికర్త, ఆయనే లాభం చేకూర్చుతాడు, ఆయనే కీడు దూరం చేస్తాడు, ఒకవేళ ఈ విశ్వంలో మరొక దైవం ఉన్నట్లైతే అతనికి కూడా సృష్టి,నిర్వాహణ మరియు ఆదేశహక్కు ఉంటుంది,మరియు ఆ ఇద్దరిలో ఎవరు కూడా మరొకరి భాగస్వామ్యాన్ని ఇష్టపడరు.[26] తప్పనిసరిగా ఒకరు మరొకరిపై ఆధిపత్యాన్ని విజయాన్ని పొందుతారు అలాంటప్పుడు రెండవవాడు ఆరాధ్యుడు కాజాలడు,ఆధిపత్యం పొందినవాడు జయించినవాడు మాత్రమే నిజమైన ఆరాధ్యుడు అవుతాడు,అతని దైవత్వంలో వేరే భాగస్వామి లేడు,ఏ విధంగానైతే ఆయన పోషకత్వంలో మరొక సాటిలేడో,అల్లాహ్ తాలా సెలవిచ్చాడు: {అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.}[27]
ii. ఆరాధనకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే,భూమ్యాకాశాలకు ఆయన అధిపతి,ఎందుకంటే మనిషి తనకు లాభం చేకూర్చేవాడిని,కీడు తొలగించేవాడిని,చెడును,ఉపద్రవాలను దూరంచేయువాడిని దైవంగా భావిస్తూ దరిచేరుతాడు. మరి ఈ పనులను చేయగల శక్తిసామర్ధ్యాలు భూమ్యాకాశాలను మరియు వాటిమధ్యనున్న వాటి అధిపతికే ఉన్నాయి,ఒకవేళ బహుదైవారాధకుల వాదన ప్రకారం ఆయనతో పాటు ఇతర దైవాలు ఉన్నట్లైతే దాసులు ఖచ్చితంగా సత్యమైన చక్రవర్తి అల్లాహ్ ఆరాధనకు చేరవేసే మార్గాలను చేసుకునేవారు. అల్లాహ్’ను వదిలి ఆరాధించబడే సమస్త దైవాలు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించేవారు ఆయన సామీప్యాన్ని పొందేవారు,కాబట్టి ఎవరైతే లాభనష్టాలకు యజమాని అయిన ప్రభువు సామీప్యాన్ని పొందాలని ఆశిస్తాడో అతను వాస్తవ ఆరాధ్యుడిని ఆరాధించాలి ఆయనను భూమ్యాకాశాలలోని సమస్త ప్రాణులు ఆరాధిస్తాయి,అందులో వీరు ఆరాధించే మిథ్యాదైవాలు కూడా ఉన్నాయి. {వారితో అను : "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!"}[28] సత్యపరిశోధకులు ఈ అల్లాహ్ యొక్క వాక్యాలను చదవండి:- {వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో,వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.}22 {సిఫారసు కూడా ఆయనవద్ద ఎలాంటి లాభం చేకూర్చదు కానీ ఆయన అనుమతించినవారికి మినహా'}[29] నిశ్చయంగా ఈ ఆయతులు నాలుగు విషయాలద్వారా అలాహ్యేతరులతో ఉండే హృదయపూర్వక బంధాన్ని త్రెంచివేస్తాయి.అవి:-
ఒకటి:-అల్లాహ్’తో పాటు అణువంత వస్తువుకు కూడా ఈ భాగస్వాములకు అధికారం లేదు,అణువంత వస్తువు అధికారం లేని వారికీ లాభనష్టాన్ని చేకూర్చే శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి'ఉండవు,మరియు అతనికి ఆరాధ్యుడు లేదా అల్లాహ్ కు భాగస్వామీ అయ్యే అర్హతకూడా ఉండదు,కాబట్టి కేవలం అల్లాహ్ యే వారందరికీ అధికారి,ఆయన ఒక్కడే వారిని నియంత్రిస్తూ ఉంటాడు.
రెండు:- నిశ్చయంగా వారు భూమ్యాకాశాలలో ఏ వస్తువుకు కూడా యజమాని కారు,మరియు వారికి అందులో అల్లహ్ తో పాటు అణువంత భాగస్వామ్యం కూడా లేదు.
మూడు :-అల్లాహ్ కు తన సృష్టిలో ఎలాంటి సహాయకుడు లేడు,ఆయనే ప్రాణులకు ప్రయోజనకరమైనవాటిని అందిస్తూ సహాయపడతాడు,వారికి కీడు చేసేవాటిని తొలగిస్తాడు,ఎందుకంటే ఆయనకు వారిలో ఎవరి అవసరంలేదు,సంపూర్ణ నిరుపేక్షాపరుడు, మరియు ప్రజలకు ఖచ్చితంగా తమ ప్రభువు యొక్క అవసరం ఉంది.
నాలుగు :- 'నిశ్చయంగా ఈ భాగస్వాములు తమ అనుచరుల కొరకు అల్లాహ్ వద్ద ఎటువంటి సిఫారసు చేసే శక్తిని కలిగి ఉండరు,వారికి సిఫారసు అనుమతి కూడా ఇవ్వబడదు,అల్లాహ్ కేవలం తన సజ్జనులకు,సత్పురుషులకు మాత్రమే సిఫారసు చేసే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు,ఈ సజ్జనులు కూడా ‘అల్లాహ్’ ఎవరి మాటలు,కార్యాలు,విశ్వాసం పట్ల సంతృప్తి చెంది ఉంటాడో వారి కోసం మాత్రమే సిఫారసు చేస్తారు,{32}
iii. సర్వలోకాల వ్యవహారాలు పూర్తిగా వ్యవస్థీకృతమవ్వడం, ఆ వ్యవహారాలను దృఢపర్చడం’అనేది ‘విశ్వనిర్వాహకుడు, ఏకైకదైవం, ఏకైక చక్రవర్తి, ఏకైక ప్రభువు’సృష్టికి అతను తప్ప మరొక దైవం లేడని, ఆయన తప్ప మరొక ప్రభువు లేడనే’గొప్పసాక్ష్యాన్నిప్రమాణాన్ని సూచిస్తుంది. ఎలాగైతే ఈ విశ్వాసామ్రాజ్యానికి ఇద్దరు సృష్టికర్తలు ఉండటం అసంభవమో అలాగే ఇద్దరు ఆరాధ్యులు ఉండటం కూడా అసంభవం.అల్లాహ్ ఇలాసెలవిచ్చాడు :- {ఒకవేళ (రెండింటిలో) అందులో అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యు డు ఉన్నట్లైతే అవిసర్వనాశనమైపోయేవి.}[30] అనుకుందాం!ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్పమరొక ఆరాధ్యుడు ఉన్నాడు ఉంటే కనుక అవి నాశనమైపోయేవి,నాశనానికి గాల కారణం ఇలా ఉంటుంది :- ఒకవేళ అల్లాహ్'తో పాటు మరొక దైవం ఉన్నట్లైతే వారిలోని ప్రతీ ఒక్కరికీ ఖచ్చితంగా ఆధిపత్య,నిర్వాహణ,నియంత్రణ శక్తిసామర్ధ్యాలు ఉంటాయి,అలాంటప్పుడు పరస్పరం విభేదం, జగడాలు తలెత్తుతాయి,ఆకారణంగా వారిలో ఉపద్రవం రేకెత్తుతుంది.[31] ఒక శరీరంలో రెండు సమాన ఆత్మలు ఉండి నిర్వహించడటమనేది అసంభవం,అలా ఒకవేళ వీలు కలిగిన ఖచ్చితంగా అది నాశనమై అంతమైపోతుంది,ఇలా జరగడం అసంభవం,కనుక ఈ మహా బ్రహ్మాంఢమైన విశ్వం గురించి ఇలా ఎలా ఊహించగలము,ఆయన చాలా మహోన్నతుడు. [32]
iv. దీనిపై దైవసందేశహరులు మరియు దైవప్రవక్తలందరి ఏకాభిప్రాయం.
దైవప్రవక్తలు సందేశహరులు ప్రజల్లో అత్యంత బుద్దిమంతులు, తెలివైనవారు, పావనపరులు, నైతికపరులు మరియు ప్రజల మంచిని కోరే ఉపదేశకులు, అల్లాహ్ సంకల్పం గురించి అత్యధికంగా తెలిసినవారు, దృఢమైన సత్యమార్గానికి, ఋజుమార్గానికి మార్గనిర్దేశనం చేసేవారు, ఎందుకంటే వారికి అల్లాహ్ తరుపునుండి వహీ చేరుతుంది, కాబట్టి వారు దాన్ని ప్రజలకు చేర్చేవారు.ఈ విషయాల్లో సమస్త జాతులు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. ఆదమ్ అలైహిస్సలాం నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకు వచ్చిన సమస్త ప్రవక్తలు,సందేశహరులు తమ జాతి ప్రజలకు ‘అల్లాహ్’ను విశ్వసించాలని మరియు మిథ్యాదైవాల ఆరాధనను త్యజించమని ఆపడం’గురించి మరియు ఆయన సత్యమైన దైవం’అనే పిలుపులో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. {మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా:"నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము}[33] అల్లాహ్ తఆలా నూహ్ అలైహిస్సలాం గురించి తన జాతి ప్రజలకు అతను ఇలా భోదించాడు అని సెలవిచ్చాడు: {మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను".}[34] మరియు అల్లాహ్ తఆలా వారిలోని చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం గురించి తెలుపుతూ'ఆయన తన జాతీప్రజలకు ఇలా భోదించాడు అని చెప్పాడు: (ఓ ముహమ్మద్!) ఇలా అను:"నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది.వాస్తవంగా మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?}[35]
ఈ దైవమే విశ్వాన్ని అనస్థిత్వం నుండి ఉనికిలోకి తెచ్చాడు,అద్భుతంగా దాన్ని సృజించాడు,మనిషిని అత్యంత సుందరంగా రూపొందించాడు అతన్ని గౌరవించాడు,అతని స్వభావంలో అల్లాహ్ పోషకత్వం,దైవత్వాన్ని నింపాడు,అతని మనసుకు ప్రశాంతత' సృష్టికర్త సమర్పణలో,ఆయనమార్గ అనుసరణలో పెట్టాడు,అతని ఆత్మపై ఇది అనివార్యం చేశాడు దానికి శాంతి దొరకాలంటే ఖచ్చితంగా తన సృష్టికర్తతో కలిసి ఆయన సంపర్కంలో ఉండాలి,ఆ సంపర్కం ఆయన చూపిన ఋజుమార్గం గుండానే సంభవం,ఆ మార్గాన్ని ఆయన మహనీయ గౌరవనీయ ప్రవక్తలు సూచించారు, మరియు మానవుడికి దైవం సరైన బుద్దిని ప్రసాదించాడు ఆ బుద్ది సక్రమంగా ఉండాలన్నా,సంపూర్ణంగా పని చేయాలన్నా తన సృష్టికర్త ప్రభువును విశ్వసించినప్పుడే సాధ్యమవుతుంది,సంభవం అవుతుంది.
స్వభావం సరళంగా ఉన్నప్పుడూ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది,ప్రాణం కుదురుగా స్థిరంగా ఉంటుంది, బుద్ది తన ప్రభువు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటుంది, ఇహపరలోకాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయి. ఒకవేళ మనిషి దీనిని తిరస్కరించి మరొక దానిని ఎంచుకున్నట్లైతే వ్యాకులత ఆందోళన, ఇబ్బందులతో కూడిన జీవితాన్ని గడుపుతాడు, దిక్కుతోచని స్థితిలో ప్రపంచం లో సంచరిస్తాడు,మరియు అక్కడి దైవాలలో విభజించబడతాడు,అతనికి ప్రయోజనం ఎవరు చేకూరుస్తారో,కష్టాలను, కీడును ఎవరు తొలగిస్తారో తెలియకుండాపోతుంది. మనసులో ఈమాను విశ్వాసం బలపడటానికి,కుఫ్ర్ అవిశ్వాసం స్పష్టమవ్వడానికి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఉదహరిస్తున్నాడు,ఎందుకంటే ఉపమానం వల్ల మాట తొందరగా అర్ధమవుతుంది,ఇందులో అల్లాహ్ ఇద్దరు వ్యక్తులను ఒకరితోమరొకరిని పోల్చాడు ఒకవ్యక్తి వ్యవహారం అనేక దైవాల మధ్య విభజించబడింది,మరొక వ్యక్తి కేవలం తన ఏకైక ప్రభువును ఆరాధిస్తున్నాడు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {అల్లాహ్ ఒక ఉపమానం ఇస్తున్నాడు: ఒక మానవుడు (బానిస) పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెందినవాడు. మరొక మానవుడు (బానిస) పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందిన వాడు, వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా? సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.}[36] అల్లాహ్ ఏకేశ్వరోపాసకుడిని,మరియు ఒక ముష్రికు బానిసతో పోల్చాడు ఆ బానిస వేర్వేరు సహచరుల యాజమాన్యంలో ఉంటాడు వారు అతని గురించి ఒకరితో మరోకరు గొడవ పడుతారు,అతను వారిలో విభజించబడ్డాడు,వారిలోని ప్రతీ ఒక్కడి నుండి అతనికి ఒక ఆదేశం ఉంది,ప్రతీ ఒక్కడి తరుపునుండి అతనికి పని ఉంది, ప్రతి ఒక్కరూ అతనిని నిర్దేశిస్తారు,అతనికి బాధ్యతలను అప్పగిస్తారు.అతను వారిలో గందరగోళానికి గురై ఆందోళన చెందుతాడు,ఎల్లప్పుడూ అస్థిరంగా ఉంటాడు.తన శక్తిసామర్ధ్యాలను విడదీసే వారి భిన్నమైన మరియు విరుద్ధమైన కోరికలను అతను తీర్చలేకపోతాడు! మరియు మరొక బానిస ఉన్నాడు అతనికి ఒకేఒక యజమాని ఉన్నాడు. తన యజమాని ఏమి కోరుకుంటున్నాడో అతనికి తెలుసు ,తనకి అప్పచెప్పబడే పనులు బాధ్యతలు ఏమిటో తెలుసు. తద్వారా అతను సౌకర్యవంతంగా ప్రశాంతంగా ఉంటాడు,ఒక స్పష్టమైన నిర్దిష్టమైన మార్గంలో స్థిరంగా ఉంటాడు. ఈ ఇద్దరు బానిసలు సమానంగా ఉండలేరు. ఎందుకంటే, ఇతను ఒకే యజమానికి కట్టుబడి ఉంటాడు,కాబట్టి స్థిరత్వం, జ్ఞానం, నమ్మకంతో సంతోషంగా ఉంటాడు మరియు మరొకడు భిన్నమైన మరియు వివాదాస్పదమైన యజమానులకు కట్టుబడి ఉంటాడు కనుక శిక్షకు,బాధకు గురై ఉంటాడు.అతను ఒక స్థితిపై స్థిరంగా ఉండలేడు వారిలో ఒక్కరినికూడా సంతృప్తి పర్చలేడు. ఇక అందరినీ ఎలా సంతోష పెట్టగలడు.
ఇప్పటికీ నేను అల్లాహ్ అస్తిత్వం, పోషకత్వం, దైవత్వంను రుజువు పరిచే అనేక ప్రమాణాలను స్పష్టంగా వివరించాను, ఇప్పుడు ఈ విశ్వసృజనను మరియు మనిషి పుట్టుకకు చెందిన జ్ఞానాన్ని అందులోగల అల్లాహ్ మర్మం,రహస్యాన్ని పరిశోధిస్తే చాలా బాగుంటుంది.
ఈ అనంతవిశ్వం అందుగల ఆకాశాలు,భూమి,నక్షత్రాలు,నదులు,సముద్రాలు,వృక్షాలు మరియు సమస్త జీవరాశులను అల్లాహ్ అనస్తిత్వం నుండి సృస్టించాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {వారితో ఇలా అను:"ఏమీ? మీరు, భూమిని రెండు రోజులలో సృష్టించిన ఆయన (అల్లాహ్) ను తిరస్కరించి,ఇతరులను ఆయనకు సమానులుగా నిలబెడతారా? సర్వలోకాలకు పోషకుడు ఆయనే కదా?"}[37]. {మరియు ఆయన దానిలో (భూమిలో) దాని పైనుండి స్థిరమైన పర్వతాలను నెలకొలిపాడు మరియు అందులో శుభాలను అనుగ్రహించాడు మరియు అర్థించేవారి కొరకు, వారి అవసరాలకు సరిపోయేటట్లు జీవనోపాధిని సమకూర్చాడు, ఇదంతా నాలుగు రోజులలో పూర్తి చేశాడు.} {అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి,దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు:"మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ:"మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము."అని అన్నాయి.}. {కావున ఆయన వాటిని రెండు రోజులలో ఏడు ఆకాశాలుగా నిర్మించాడు, మరియు ప్రతి ఆకాశానికి దాని వ్యవహారాన్ని దివ్యజ్ఞానం (వహీ) ద్వారా నిర్దేశించాడు. మరియు మేము ఈ ప్రపంచపు ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) అలంకరించాము మరియు దానిని సురక్షితం చేశాము. ఇదే సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియామకం.}{40}
మరియు అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు:- {ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని విడగొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా?[38] {మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము. మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము.} {మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము.అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.}{41}
ఈ విశ్వాన్ని అల్లాహ్ ఒక గొప్ప ఉద్దేశ్యంతో సృష్టించాడు,దానిని లెక్కించడం మీవల్ల సాధ్యపడదు, దానిప్రతి భాగంలో గొప్పజ్ఞానం మరియు అద్భుతమైన సూచనలు ఉన్నాయి.మీరు దాని ఒక్కసూచనను పరిశీలించిన స్పష్టమైన అద్భుతాలను చూస్తారు. మీరు మొక్కలలో అల్లాహ్’ యొక్క నిర్మాణాన్ని పరిశీలించండి,దాని ప్రతి ఆకు,కాండం మరియు పండ్లు ప్రయోజనాలతో నిండి ఉంది,అల్లాహ్ యొక్క అద్భుతాలను చూడండి,మానవ తెలివి దాని వివరాలను పూర్తిగా గ్రహించడంలో అసమర్ధమైనది,అర్థం చేసుకోలేదు,ఆ సున్నితమైన మరియు బలహీనమైన కాండం యొక్క నీటి సిరలను చూడండి, జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా తప్ప కళ్ళుదానిని చూడలేవు,దిగువ నుండి పైకి నీటిని ఎలా పీల్చుతుంది మరియు నీరు ఆ సిరలలో వాటి ఆమోదయోగ్యత మరియు సామర్థ్యాలకు అనుగుణంగా కదులుతుంది. మళ్ళీ అది దాని శాఖల్లో కొమ్మల్లో విభజించబడుతుంది, ఆపై కనిపించని చోటుకు చేరిపోతుంది, ఆపై మీరు చెట్టు పిండదశను, ఒక దశ నుండి మరొక దశకి ఎలా చేరుతుందో గమనించండి,కళ్ళకు కనిపించని గర్భస్థశిశువు దశలు మారుతున్నట్లుగా' జరుగుతుంది. ఆ మొక్కను [నగ్న ఖాండంగా} దానిపై ఎలాంటి తోలు లేకుండా పెరుగుతున్నట్లు మీరు చూస్తారు, అప్పుడు ప్రభువు మరియు సృష్టికర్త దానిని చాలా అందంగా ఆకులతో కప్పుతాడు.మళ్ళీ అందులో బలహీనమైన పిండంను బయటకుతీస్తాడు, దీని రక్షణ కొరకు ఆ బలహీనమైన పండు కోసం ఒక వస్త్రాన్ని తయారుచేస్తాడు,తద్వారా వేడి, చలి మరియు ఇతర హానికరమైన కీడు నుంచి రక్షించబడుతుంది.పిదప అల్లాహ్ ఆ పండు వరకు దానికి కావలిసిన ఆహారాన్ని శక్తిని కాండాలు ప్రవాహసిరల గుండా చేరుస్తాడు, దాంతో ఆ పండు ఆహారాన్ని గ్రహిస్తుంది, ఒక శిశువు తన తల్లితో పాలను గ్రహించినట్లుగా, అది దానిని పెంచిపోషిస్తుంది, చివరికి అది పూర్తి పండుగా పరిపక్వత చెందుతుంది,అలా నిర్జీవకర్ర నుంచి రుచికరమైన మృదువైన పండుగా బయటికి వస్తుంది.
మరియు ఒకవేళ మీరు భూమిని ‘అది ఎలా సృష్టించబడింది? దాని రచనా ఎలా జరిగింది అని పరిశీలించి గమనిస్తే’ఆ సృష్టికర్త, నిర్మాణకర్త రచనల్లో ఒక మహా గొప్ప సూచనగా దానిని పొందుతారు,అల్లాహ్ దానిని నివాసయోగ్యంగా పాన్పుగా పరిచాడు, మరియు దాన్నితన దాసులపరం చేశాడు, మరియు వారి కొరకు అందులో ఉపాధిని, ఆహారాన్ని ,వారి జీవనవ్యవస్థకు ఉపయోగపడే వనరులను అమర్చాడు,మరియు వారు తమ వ్యవహారాలను,అవసరాలను తీర్చుకోవడానికి రవాణా సౌకర్యానికి అనుగుణంగా రహదారులను వేశాడు, పర్వతాలను బలంగా అమర్చాడు వాటిని మేకులుగా చేసి భూమిని కదలకుండా స్థానబ్రాంశం చెందకుండా రక్షించడానికి అమర్చాడు,వాటి మూలలను కోనలను విస్తృతపరిచి సమతుల్యపర్చాడు, విశాలంగా పరిచాడు, మరియు ఆయన దానిని సజీవులను, నిర్జీవులను సమీకరించేదిగా చేశాడు, సజీవులను అది తన వీపుపై మోస్తుంది, నిర్జీవులను మరణాంతరం కడుపులో మోస్తుంది, దాని వీపు సజీవులకు నివాసయోగ్యంగా, కడుపును నిర్జీవులకు నివాసం’గాచేశాడు. మళ్ళీ ఒకసారి ఈ ఖగోళాన్ని గమనించండి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, గ్రహాలతో ఇది గుండ్రంగా తిరుగుతుంది,ఈ విశ్వం ఎలాతిరుగుతుంది? నిర్దారీత సమయం వరకు క్రమపద్దతిలో ఆదేశానుసారంగా నిరంతరం ఎలా తిరుగుతూ ఉంది? మరియు ఇందులో రాత్రి, పగలు, ఋతువులు, వేడి, చలి వంటివి మారుతూ ఉన్నాయి?- వీటిలో భూమి పై నివసించే అనేక మొక్కలు, ప్రాణులకు ఏ ప్రయోజనం చేకూరుతుంది!
పిమ్మట మీరు ఆకాశా నిర్మాణాన్ని పరిశీలించండి,చూపులను మాటిమాటికి అటువైపు మరల్చుతూ చూడండి,దాని ఎత్తులో వైశాల్యంలో స్థిరత్వంలో గొప్పసూచనలు కనుగొంటారు,దానిక్రింద ఎలాంటి స్థంభం లేదు,దానిపై ఎలాంటి గాలం లేదు కేవలం అల్లాహ్ శక్తివల్ల నిలకడగా ఉంది.ఆయనే భూమ్యాకాశాలను కదలకుండా పట్టుకుని ఉన్నాడు.
మరియు నీవు ఈ విశ్వాన్ని దాని విభాగాల నిర్మాణం, వ్యవస్థను పరిశీలించినప్పుడు సర్వొత్తమవ్యవస్థను పొందుతావు,ఇది సృష్టికర్త యొక్క సంపూర్ణ శక్తిసామర్ధ్యాలను, సంపూర్ణ జ్ఞానాన్ని,సంపూర్ణ వివేకాన్ని, సంపూర్ణ దయ, సున్నితత్వాన్ని సూచిస్తుంది,ఇది నిర్మితమై సిద్దంగా ఉన్నఒక ఇల్లును పోలినదిగా ఉంది,అందులో అతనికి కావలిసిన అన్నీ వస్తువులు, ప్రయోజనాలు,అవసరాలన్నీ సిద్దంచేయబడి ఉన్నాయి. కనుక ఆకాశం భూమికి పైకప్పువలే దానిపై ఉంది, భూమి పాన్పుగా విశాలంగా స్థిరంగా నివాసయోగ్యంగా ఉంది, సూర్యచంద్రులు జ్యోతుల వలె కాంతిని వెదజల్లుతాయి, నక్షత్రాలు దీపాలుగా మరియు అలంకరణగా ఈ ప్రపంచంలో ప్రయాణికులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి, భూమిలో నిక్ష్పితమై ఉన్నఖనిజాలు,వజ్రవైడుర్యాలు సిద్దంగా ఉన్న నిధిలా ఉన్నాయి,అందులోని ప్రతీదీ దానికి నిర్దారించబడిన పనికోసం ఉన్నాయి,అనేక రకాలైన మొక్కలు అతని సేవకై సిద్దంగా ఉన్నాయి,విభిన్నమైన జంతువులు వాటి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి,అందులో కొన్ని వాహనాలుగా మరికొన్ని పాలిచ్చేవిగా,మరికొన్ని ఆహారం కోసం,మరికొన్ని వస్త్రాల కోసం ఇంకా కొన్ని కాపలా కోసం నిర్దారించబడ్డాయి. మరియు మనిషిని అందులో అధికారం ఆధిపత్యం కలిగిన రాజుగా చేశాడు,అతను తన ఆదేశాలతో పనులతో కార్యాలను నిర్వహిస్తాడు.
ఒకవేళ మీరు ఈ విశ్వమంతటిని లేదా దాని ఒక భాగాన్ని పరిశీలించి గమనించినట్లైతే ఆశ్చర్యకరమైన అద్భుతాలను పొందుతారు,ఒకవేళ నీవు అందులో లోతుగా పరిశీలించి ప్రతీరకమైన మనోవాంఛకు మూఢ అనుసరణకు దూరంగా ఆత్మశుద్దితో న్యాయంగా ఆలోచిస్తే ఈ విశ్వం పుట్టించబడినదని నీకు అర్ధమవుతుంది,దానిని ఒకగొప్పజ్ఞాని,శక్తిశాలి,వివేకి పుట్టించాడని తెలుస్తుంది, ఆయన దీనిని అతి ఉత్తమంగా సమపాలల్లో తీర్చిదిద్దాడు,అత్యుత్తమ విధంగా వ్యవస్థీకృతం చేశాడు,పిదప మీకు ఇందులో ఇద్దరు సృష్టికర్తలు ఉండటం అసంభవమనే విశ్వాసం కూడా బలపడుతుంది,దైవం ఒకేఒక్కడు అని ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని నమ్ముతారు,ఒకవేళ భూమ్యాకాశాలలో అల్లాహ్ కాకుండా మరో దైవం ఉండి ఉంటే అవి సర్వనాశనమైపోయేవి,వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయేది,అందుగల ప్రయోజనాలు నిర్వీర్యమైపోయేవి.
కనుక ఒకవేళ మీరు ఈ సృష్టి నిర్మాణ గొప్పతనాన్ని సృష్టికర్తకు కాకుండా ఇతరులకు ఆపాదించదలిస్తే మరి‘నది పై తిరిగే ఒక చక్రాల యంత్రం గురించి మీరు ఏమి చెబుతారు?దీని సాధనాలు బలంగా చేయబడ్డాయి,బలంగా అమర్చబడింది,పరిపూర్ణంగా వస్తువులను తూచబడింది,వీక్షకులకు అందులో,సామగ్రీలో,రూపంలో ఎలాంటి లోపం కనిపించలేదు.దానిని ఒక పెద్ద తోటలో అమర్చబడింది అందులో ప్రతీ రకమైన పండ్లు ఉన్నాయి,అది ఆ తోటకు కావల్సినపలాల్లో నీటిని సమకూరుస్తుంది. మరియు ఈ తోటలో ఒక సంరక్షకుడు తోటమాలి ఉన్నాడు,అతను చెడిపోయిన భాగాలను కత్తిరిస్తాడు మరియు దానిని జాగ్రత్తగా చూసుకుంటాడు,దానికి కావలిసిన ప్రతీదీ సమకూరుస్తాడు తద్వారా దానిలో ఏదీ లోపభూయిష్టంగా ఉండదు మరియు దాని పండ్లలో ఏదీ క్షీణించదు. కోసే సమయంలో ఈ తోటమాలి మనిషి యొక్క అవసరాలకు అనుగుణంగా దానిని విభాగాలుగా కేటాయిస్తాడు,ప్రతీ వర్గానికి యోగ్యమైనది దక్కుతుంది,ఇదే విధంగా ప్రతీసారి కేటాయించబడుతుంది.
ఏమి మీరు ఇదంతా ఆకస్మికంగా ఎటువంటి రూపకర్త,ప్రణాళికకర్త,ఏ నిర్వాహకుడు లేకుండానే ఇవన్నీజరిగాయని మీరునమ్ముతారా? ఏ యంత్రాంగం మరియు తోట ఉనికి ఏ నిర్వాహకుడు, ప్రణాళికకర్త లేకుండా ఆకస్మికంగా జరిగిందని మీరు చెబుతారా? ఇవన్నీ ఆకస్మికంగా జరిగితే మరి మీ తెలివి మీకు ఏమి చెబుతుంది? మీరు ఏమని తీర్పు చేస్తారు ?ఏ విషయాన్ని మీరు మార్గదర్శనం చేస్తారు ?.[39]
విశ్వ సామ్రాజ్య సృష్టి పట్ల చింతన పరిశీలన తరువాత,ఈ మహాసృష్టితాల మరియు స్పష్టమైన సూచనల వెనుక గల వివేక మర్మాలలో కొన్ని కారణాలను పేర్కొనడం సముచితమని మేము భావిస్తున్నాము. అందులో కొన్ని క్రింద పేర్కొనబడుతున్నాయి:-
1) మనిషికి ఆధీనపర్చడం:-అల్లాహ్ ఈ భూమిపై తన ఆరాధన చేయడానికి,భూమిలో ప్రజలను వ్యాప్తి చేయడానికి ఉత్తరాధికారిని చేయడానికై నిర్ణయించాడు,అంచేత మనుషులను ఇక్కడ సృష్టించాడు,తద్వారా అతను సుఖశాంతులతో విరిసిల్లుతూ ప్రాపంచిక పరలోక జీవితం వ్యవహారాలను ఉత్తమంగా సంస్కరించవచ్చు,అల్లాహ్ సెలవిచ్చాడు:- {భూమ్యాకాశాలలో ఉన్నవస్తువలన్నింటినీ ఆయన తన తరుపున మీసేవలో ఉండేటట్లుగా చేశాడు,నిశ్చయంగా యోచనా చేసేవారికి ఇందులో ఎన్నో సూచనాలున్నాయి}[40]. మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్ ! ఆయనే, భూమ్యాకాశాలను సృష్టించాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టింటాడు. మరియు తన ఆజ్ఞతో, ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు.}[41] {మరియు ఎడతెగకుండా, నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు.} {మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు.}
2) భూమ్యాకాశాలు మరియు సమస్తవిశ్వసామ్రాజ్యం అల్లాహ్ పోషకత్వానికి రుజువులుగా ఆయన దైవత్వానికి నిదర్శనాలుగా దర్పణంగా నిలుస్తున్నాయి,ఎందుకంటే ఈ విశ్వంలోగల మహత్తర విషయమేమిటంటే ఆయన రుబూబియత్ పోషకత్వాన్ని అంగీకరించడం మరియు ఆయన ఏకత్వంను విశ్వసించడం. ఎందుకంటే ఇది అతి గొప్ప వ్యవహారం కాబట్టి అల్లాహ్ దీనికోసం దృఢమైన సాక్ష్యాలను స్థాపించాడు,దీనికోసం స్పష్టమైన గొప్పనిదర్శనాలను నిలబెట్టాడు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్'భూమ్యాకాశాలను సమస్త అస్తిత్వాలను ఆయన నిదర్శనాలుగా సూచించడానికి నిర్మించాడు, అందువల్ల ఖుర్ఆను లో అత్యధికంగా’ {వ మిన్ ఆయాతిహీ} అనే వాక్యాలు ప్రస్తావించబడ్డాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {భూమ్యాకాశాల సృష్టి ఆయన(శక్తి) సూచనలలోనివే} (ఇంకా) ఆయన (శక్తి) సూచనలలో రాత్రివేళ, పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృపను (జీవనోపాధిని) అన్వేషించటం కూడా ఉన్నాయి.(జాగ్రత్తగా) వినేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి. {ఇంకా ఆయన సూచనలలో (ఇంకొకటి) ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు.} {ఆయన సూచనలలో (వేరొకటి) ఇదికూడా ఉంది: భూమ్యా కాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి.}[42]
3) ఇది మరణం తరువాత పునర్జీవితానికి సాక్ష్యంగా ఉపయోగపడుతుంది -జీవితం రెండు రకాలు ఒకటి-ప్రాపంచిక జీవితం,రెండు- పరలోక జీవితం,ఇందులో పరలోక జీవితమే వాస్తవమైనది మరియు శాశ్వతమైనది, అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {మరియు ఈ ప్రాపంచిక జీవితం కేవలం వినోద కాలక్షేపం మరియు క్రీడ మాత్రమే. మరియు అసలు పరలోక గృహ జీవితమే వాస్తవమైన జీవితం. ఇది వారు తెలుసుకుంటే ఎంత బాగుండేది!}[43] ఎందుకంటే ప్రతిఫలాలు,బహుమానాలు,లెక్కలు తేల్చేది అక్కడే, మరియు అందులో స్వర్గవాసి అనంత సుఖసంతోషాలతో శాశ్వతంగా ఉంటాడు,నరకవాసి భాధకారమైన శిక్షలు అనుభవిస్తూ కలకాలం ఉంటాడు.
4) మనిషి మరణించిన తరువాత పరలోక పునర్జీవితం పొందిన పిమ్మట అక్కడికి చేరుకుంటాడు,ఈ విషయాన్నిప్రభువుతో బంధం తెగినవాడు,బుద్ది గడ్డితిన్నవాడు,ప్రకృతిక స్వభావం కోల్పోయిన ప్రతీ ఒక్కడు నిరాకరించాడు అందుచేత అల్లాహ్ తన నిదర్శనాలను స్థాపించాడు,రుజువులను స్పష్టపర్చాడు,తద్వారా మనుషులు పరలోకజీవితాన్ని విశ్వసించగలరు ,హృదయాలు దాన్ని నమ్మగలవు. ఎందుకంటే రెండవసారి సృష్టినిర్మాణం అనేది మొదటి నిర్మాణం కంటే చాలా తేలికగా ఉంటుంది,భూమ్యాకాశాలను పునః నిర్మించడం అనేది మనిషిని పునః సృష్టించడం కంటే మహా గొప్ప విషయం.అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:- {మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు,ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు.ఇది ఆయనకు ఎంతో సులభమైనది.భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు}[44] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టి మానవ సృష్టి కన్నాగొప్ప విషయం.కాని చాలామంది దీన్నితెలుసుకోరు}[45] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువున కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని.}[46]
ఈ సమస్త విశ్వం నీ మేలు కొరకు ఆధీనపర్చబడింది,మరియు దాని నిదర్శనాలు మరియు సూచనలు నీ కనులముందు సాక్ష్యాలుగా ప్రమాణాలుగా నిలబెట్టడం జరిగింది,అవి అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదేవుడు మరొకడు లేడు,ఆయన ఏకైకుడు ఆయనకు మరొకరు సాటిలేరు'అని సాక్ష్యం చెప్తున్నాయి. మరణాంతర నీ జీవితం,మరణాంతర పునఃపుట్టుక భూమ్యాకాశాల నిర్మాణం కంటే చాలా సులభం అనే సత్యం,నీ ప్రభువును నువ్వు కలుసుకోవాలన్న సత్యం నీ కర్మల ప్రకారం నీకు ప్రతిఫలాలు లభిస్తాయనే సత్యం నీకు తెలిసింది. మరియు ఈ సర్వ అండ,పిండ,బ్రహ్మాంఢాలు ప్రభువుకు దాస్యం చూపుతున్నాయి,సమస్త జీవులు ఆ పరమ ప్రభువు పవిత్రతను స్తుతిస్తున్నాయి అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు:- {ఆకాశాలలో నున్నవి మరియు భూమిలో నున్నవి, సమస్తమూ విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అయన అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి.}[47] మరియు ఆయన మహోన్నతకు సజ్దా సాష్టాంగాలు చేస్తున్నాయి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నవన్నీ మరియు భూమిలో ఉన్నవన్నీ మరియు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, సర్వవృక్షరాశి,సర్వజీవరాశి మరియు ప్రజలలో చాలా మంది,అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారని?మరియు చాలా మంది శిక్షకు కూడా గురి అవుతారు. మరియు అల్లాహ్ ఎవడినైతే అవమానం పాలు చేస్తాడో,అతడికి గౌరవమిప్పించ గలవాడు ఎవ్వడూ లేడు. నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిందే చేస్తాడు.}{51] అంతేకాదు ఈ సమస్త లోకాలన్నీ సృష్టికర్తను ఆయన శోభకు తగినట్లు ప్రార్ధిస్తున్నాయి ఆరాధిస్తున్నాయి; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఏమీ? నీకు తెలియదా (చూడటం లేదా) ? నిశ్చయంగా, భూమ్యాకాశాలలో ఉన్న సర్వమూ మరియు రెక్కలు విప్పి ఎగిరే పక్షులు సైతం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉంటాయని? వాస్తవానికి ప్రతిదానికి తన నమాజ్ మరియు స్తోత్రం చేసే పద్ధతి తెలుసు. మరియు అవి చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు}[48][49]
నీ శరీరవ్యవస్థ పూర్తిగా ప్రభువు నిర్దారించిన రీతిలో ఆయన నిర్వహణ ప్రకారంగా నడుస్తుంది, హృదయం, కాలేయం, జీర్ణాశయం మరియు మిగతా అవయవాలన్నీ అల్లాహ్ ఎదుట లొంగియున్నాయి, నిర్వాహణను ఆయనకు సమర్పించి యున్నాయి. మరి ఏమి? మీ ప్రభువును విశ్వసించడం లేదా ఆయనను ఆవిశ్వసించడం’లో ఎంచుకునే అధికారం ఇచ్చినప్పుడు సన్మార్గం వదిలి తప్పుడుమార్గాన్ని ఎలా ఎన్నుకుంటావు? అప్పటికి నీకు చుట్టూ వ్యాపించియున్న ఈ మహావిశ్వమంతా చివరికి నీ శరీరం కూడా ఆయనకు లోబడి ఉంది.
పరిపూర్ణ బుద్ది కలిగిన ఒకమనిషి ఈ విశాలమైన మహా బ్రహ్మాంఢం’లో ఒక్క శాతం కూడా అపమార్గాన్ని,తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడాన్ని ఎన్నటికీ ఇష్టపడడు.
అల్లాహ్ ఈ విశ్వంలో నివసించడానికి యోగ్యుడైన ఒక జీవిని సృష్టించే నిర్ణయం తీసుకున్నాడు,ఆ జీవి మనిషి రూపంలో వెలువడ్డాడు.ఈ భూ పదార్ధం నుండే మానవుడు పుట్టించబడాలనేది దైవసంకల్పం కనుక ఆయన మానవుడిని భూమి నుండి పుట్టించాడు’అలా అతనిని మట్టిసారంతో సృష్టించడమారంభించాడు. ఆపై అతన్ని అత్యుత్తమమైన ఆకారంలో ఇప్పుడు కలిగి ఉన్న అందమైన రూపం లో అతన్ని చింత్రించాడు. అతని ఆకారం పరిపూర్ణమైనప్పుడు తన ఆధీనంలో ఉన్న ఆత్మను అతనిలో ఊదాడు,ఆపై అద్భుతంగా అతను వింటున్నాడు,చూస్తున్నాడు,కదులుతున్నాడు మరియు మాట్లాడగలుగుతున్నాడు. ఈ విధంగా ఉత్తమరీతిలో మనిషిగా మార్చాడు.పిదప అతన్ని ప్రభూ స్వర్గంలో నివాసం కల్పించాడు. అతనికి అవసరమైన జ్ఞానాన్ని భోదించాడు,అతనికి స్వర్గపు సర్వానుగ్రహాల అనుమతి కల్పించాడు,కానీ పరీక్షనిమిత్తము ఒక చెట్టును నిషేధించాడు,అల్లాహ్ అతని స్థానాన్ని,అంతస్తుని స్పష్టపర్చదలచి దైవదూతలకు అతనికి సాష్టాంగపడాలని ఆదేశించాడు అప్పుడు అల్లాహ్ యొక్క దూతలందరూ అతనికి సజ్దా చేశారు. కానీ ఒక ఇబ్లీసు మాత్రం అహంకారాన్ని, గర్వాన్ని చూపిస్తూ సజ్దా చేయలేదు,దాంతో ప్రభువు అతనిపై దైవాదేశదిక్కారం వల్ల ఆగ్రహించాడు,తన దయాకారున్యాలకు దూరంగా వేలేశాడు,ఎందుకంటే అతను అల్లాహ్ ఎదుట గర్వాన్ని ప్రదర్శించాడు,అప్పుడు ఇబ్లీసు ప్రభువుతో తన వయోపరిమితిని పొడిగించమని ప్రళయదినం వరకు గడువు ఇవ్వాలని వేడుకున్నాడు,దైవం అతని వయస్సును పొడిగించి ప్రళయదినం వరకు గడువు ఇచ్చాడు. ఆదము అలైహిస్సలాం’కు అతని సంతానానికి అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాల పట్ల షైతాను అసూయ ద్వేషాలకు లోనయ్యాడు.షైతాను దైవప్రమాణం చేసి ఆదమును అతని సంతానాన్ని తప్పుదారి పట్టిస్తానని శపథం చేశాడు,ధర్మనిష్ట,చిత్తశుద్ది కలిగినవారు,సత్యవంతులు,దైవభీతి పరులను మినహాయించి జనులను కుడి ఎడమ పైన క్రింద ప్రతీవైపు నుండి అతిత్వరలో మార్గబ్రష్టత్వానికి గురిచేస్తాడని చెప్పాడు, నిశ్చయంగా అల్లాహ్ దైవభీతిపరులను షైతాను చేష్టలనుండి, కీడునుండి సంరక్షించాడు. అల్లాహ్ షైతాను అకృత్యాల గురించి ఆదము కు ముందే హెచ్చరించాడు, కానీ షైతాను ఆదము, అతని భార్య హవ్వా స్వర్గము నుండి బహిష్కరింపబడాలని వారి దుస్తులు తొలిగిపోయి గుప్తాంగాలు బహిర్గతమై అవమానపడాలని భావించి ప్రేరేపించి తప్పుదారి మళ్ళించాడు, దానికోసం అతను దైవప్రమాణం చేసి వారితో నేను మీ శుభాన్ని మంచికోరేవాడను అని చెప్పి,మీరు ఆ చెట్టును తిని దూతలుగానో లేదా శాశ్వతపౌరులుగా మారుతారు”అని భావించి మాత్రమే మిమ్మల్ని దానినుండి అల్లాహ్ వారించాడు అని చెప్పి నమ్మించాడు.
దాంతో వారిద్దరు అల్లాహ్ వారించిన ఆ చెట్టును తిన్నారు,అల్లాహ్ ఆదేశ దిక్కారం వల్ల వారికి విధించిన మొదటిశిక్ష ‘ధరించినదుస్తులు తొలిగిపోయి మర్మాంగాలు బహిర్గతమయ్యాయి’అల్లాహ్ వారికి చేసిన హెచ్చరిక గురించి షైతాను అకృత్యాల గురించి తిరిగి గుర్తుచేశాడు,అప్పుడు ఆదము తన ప్రభువుతో క్షమాపణ కోరాడు,ఆయన అతన్ని క్షమించాడు,అతని పశ్చాత్తాపం ఆమోదించాడు,అతన్ని ఎన్నుకుని మార్గదర్శనం చేశాడు.ఆపై అల్లాహ్ ఆదేశిస్తూ అతను నివసిస్తున్న స్వర్గం నుంచి భూమిపైకి వెళ్లిపోవాలని,అదే అతని నివాసస్థలం,అతని నివాసానికి అవసరమైన వస్తుసామాగ్రి ఉంటుంది, నిర్దారిత సమయం వరకు అక్కడే నివసించాలని’చెప్పాడు మరియు అతను భూమి నుండి పుట్టాడు,అక్కడే జీవనం సాగించాలి, అక్కడే చావాలి మరియు అందులో నుండే పునఃర్జీవం పోసుకుంటాడనే విషయాన్ని అతనికి స్పష్టంగా తెలిపాడు.
ఆదము మరియు అతని భార్యహవ్వా ఇద్దరూ భూగోళం పై దిగారు,పిదప వారి సంతానం వ్యాప్తిచెందింది,వారందరూ అల్లాహ్ ఆదేశానుసారంగా ఆయనను ఆరాధించేవారు,ఎందుకంటే అప్పుడు ఆదము అలైహిస్సలాం ఒక ప్రవక్తగా ఉన్నారు
అల్లాహ్ తఆలా ఈ విషయాన్ని ఇలా తెలియజేశాడు:- {మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని సృష్టించాము.పిదప మీ రూపాన్ని తీర్చిదిద్దాము.ఆ పిదప దైవదూతలను:"మీరు ఆదమ్ కు సాష్టాంగం (సజ్దా) చేయండి!" అని ఆదేశించగా,ఒక్క ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగం (సజ్దా) చేశారు,అతడు సాష్టాంగం చేసేవారిలో చేరలేదు}[50] {(అప్పుడు అల్లాహ్) అన్నాడు: "(ఓ ఇబ్లీస్!) నేను ఆజ్ఞాపించినప్పటికీ, సాష్టాంగం చేయకుండా నిన్ను ఆపింది ఏమిటి?" దానికి (ఇబ్లీస్): "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని నీవు మట్టితో సృష్టించావు."అని జవాబిచ్చాడు.] {(అప్పుడు అల్లాహ్) ఆజ్ఞాపించాడు: "నీవిక్కడ నుండి దిగిపో! ఇక్కడ గర్వపడటం నీకు తగదు, కావున వెళ్ళిపో! నిశ్చయంగా, నీవు నీచులలో చేరావు!"} {(ఇబ్లీస్) ఇలా వేడుకున్నాడు: "వారు తిరిగి లేపబడే (పునరుత్థాన) దినం వరకు నాకు వ్యవధినివ్వు!"} {(అల్లాహ్) సెలవిచ్చాడు: "నిశ్చయంగా, నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!"} {(దానికి ఇబ్లీస్) అన్నాడు: "నీవు నన్ను మార్గభ్రష్టత్వంలో వేసినట్లు, నేను కూడా వారి కొరకు నీ ఋజుమార్గంపై మాటువేసి కూర్చుంటాను!"} {"తరువాత నేను వారి ముందు నుండి, వారి వెనుక నుండి, వారి కుడివైపు నుండి మరియు వారి ఎడమ వైపు నుండి, వారి వైపుకు వస్తూ ఉంటాను. మరియు వారిలో అనేకులను నీవు కృతజ్ఞులుగా పొందవు!"} {(అల్లాహ్) జవాబిచ్చాడు,"నీవిక్కడి నుండి అవమానింపబడి, బహిష్కృతుడవై వెళ్ళిపో! వారిలో ఎవరైతే నిన్ను అనుసరిస్తారో! అలాంటి మీ వారి అందరితో నిశ్చయంగా, నేను నరకాన్ని నింపుతాను."} {మరియు మేము (ఆదమ్ తో) అన్నాము:"ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి,కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి,అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు!"} {ఆ పిదప షైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి, రహస్యంగా వారి చెవులలో అన్నాడు:"మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని, లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు,మీ ఇద్దరినీ ఈ వృక్షం నుండి నివారించాడు!"} మరియు (షైతాన్) వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు:"నిశ్చయంగా, నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని!" ఈ విధంగా వారిద్దరిని మోసపుచ్చి, తన (పన్నుగడ) వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును (ఫలమును) రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమ (శరీరాల)పై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు: "ఏమీ? నేను మీ ఇద్దరినీ ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా, షైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా?" వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు: "మా ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే! మమ్మల్ని క్షమించకపోతే! నిశ్చయంగా, మేము నాశనమై పోయేవారమవుతాము." (అల్లాహ్) అన్నాడు: "మీరందరు దిగిపోండి! మీరు ఒకరికొకరు శత్రువులు అవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీతకాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి". ఇంకా ఇలా అన్నాడు: "మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరల లేపబడతారు (పురుత్థరింపబడతారు)".{53}
మనిషిలో అల్లాహ్ చేసిన నిర్మాణ ప్రక్రియను గొప్పతనాన్ని పరిశీలించండి. ఆయన అతన్ని ఉత్తమ రూపంలో సృష్టించాడు, తెలివి, జ్ఞానం, వాగ్ధాటి, మాట్లాడే కళ, అందమైన స్వరూపం, మేలైన ఆకారం, సమతుల్యమైన సారూప్యం, మరియు గౌరవ ప్రదమైన లక్షణాలు అనగా పుణ్యం,విధేయత,ఆదేశాలపాలన చేయడం వంటి వాటితో రూపొందించాడు ఒకసారి ఆలోచించండి అతను మాతృగర్భంలో ఒక వీర్యబిందువుగా ఉన్నస్థితిని మరియు దైవాదూత అతనిని శాశ్వతంగా స్వర్గవనాలలో ప్రవేశించబడే స్థితిని? ఎంత తేడా ఉంది. {ఎంతో శుభప్రదుడైన అల్లాహ్, సృజనకారులలో కెల్లా అత్యుత్తమ సృజనకారుడు.}[51]
ఈ ప్రపంచం ఒక ఊరు, అందులో మనిషి నివసిస్తున్నాడు, ప్రతీఒక్కరు ఇందులో నిమగ్నమై ఉన్నారు, ప్రయోజనాలను పొందటానికి కృషిచేస్తున్నారు, వస్తువులన్నీ అతని సేవకోసం అతని అవసరాలను తీర్చడానికి సిద్దంచేయడం జరిగింది, దైవదూతలు అతనికోసం నియమించడం జరిగింది, వారు అతన్ని రేయింభవళ్లు సంరక్షిస్తున్నారు, వర్షానికి, పాడిపంటల కోసం దూతలు నియుక్తులయ్యారు, వారు మనిషి ఉపాధి కోసం శ్రమిస్తూ అతనికోసం పనిచేస్తున్నారు, గ్రహాలు మనిషి ప్రయోజనం నిమిత్తం బ్రమిస్తున్నాయి, సూర్య, చంద్ర, నక్షత్రాలు కాలాన్ని లెక్కించడానికి, మేలైన ఆహారాన్ని వ్యవస్థీకృతం చేయడానికి నడుస్తున్నాయి, మరియు వాయువ్యవస్థ కూడా గాలి, వాయువులు మరియు పక్షులు అందుగల సమస్త వస్తువులతో సహా అతని హితువు కోసం ఆధీనపర్చబడింది,భూగోళం మొత్తం అతని మేలుకొరకు ఆధీనపర్చబడి అతని ప్రయోజనం కోసం అమర్చబడింది, భూమీ,నేల కొండకోనలు నదులు సముద్రాలు పంటఫలాలు,చెట్లు వృక్షాలు,పశువులు జంతువులు అందులో ఉన్న సమస్తం మనిషి కొరకు పుట్టించబడ్డాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్ ! ఆయనే, భూమ్యాకాశాలను సృష్టించాడు. మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని నుండి మీ కొరకు ఆహారంగా ఫలాలను పుట్టించాడు.మరియు తన ఆజ్ఞతో,ఓడలను మీకు ఉపయుక్తంగా చేసి సముద్రంలో నడిపించాడు. మరియు నదులను కూడా మీకు ఉపయుక్తంగా చేశాడు.}[52] {మరియు ఎడతెగకుండా,నిరంతరం పయనించే, సూర్యచంద్రులను మీకు ఉపయుక్తంగా చేశాడు. మరియు రాత్రింబవళ్ళను కూడా మీకు ఉపయుక్తంగా ఉండేటట్లు చేశాడు.} {మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు.} మనిషి గౌరవాన్ని సంపూర్ణం చేయడానికి దైవం అతని ప్రాపంచిక జీవనానికి అవసరమయ్యే సర్వాన్నిసృష్టించాడు,మరియు పరలోకజీవన సాఫల్యానికి అంతస్తులను పెంపొందించుకొనుటకై అవశ్యకరమైనవన్నీ సిద్దం చేశాడు,అందువల్ల మనిషి వద్దకి గ్రంధాలను అవతరింపచేశాడు,అతని వద్దకి ప్రవక్తలను పంపించాడు వారు అల్లాహ్ శరీఅతు శాసనాలను చట్టాలను అతనికి స్పష్టంగా తెలియజేశారు దానివైపుకు అతన్ని ఆహ్వానించారు.
తరువాత అల్లాహ్ అతని కొరకు అతని శరీరం నుండి-ఆదము శరీరం నుండి- అతని భార్యను సృష్టించాడు ఆమె ద్వారా అతను విశ్రాంతిని ప్రశాంతతను పొందుతాడు ఇది అతని ప్రకృతి మానసిక శారీరక అవసరాలను తీర్చడానికి చేయబడింది తద్వారా తను ఆమె వద్ద శాంతిని,విశ్రాంతిని స్థిరత్వాన్ని పొందవచ్చు. ఇద్దరి కలయిక వల్ల పరస్పర సంతోషం శాంతి ప్రేమ దయా కారుణ్యాలు అనుభవాన్ని పొందగలరు ఎందుకంటే వారిద్దరి శారీరక మానసిక నాఢీ నిర్మాణం పరస్పర కోరికలను తీర్చడంలో మరియు వారి నూతన తరాన్నిసంతతిని పునరుత్పత్తి చేయడానికని చేయబడింది వారిరువురి ఆత్మలో ఈ భావనను నింపడం జరిగింది మరియు ఈ బంధం ఆత్మకు,నరాలకు శాంతిని శరీరానికి హృదయానికి ప్రశాంతతను మరియు జీవితం గడపడానికి స్థైర్యాన్నిమరియు ఆత్మలు మరియు మనస్సాక్షి కోసం మరియు స్త్రీ, పురుషుల మధ్య సంతోషాన్ని పెట్టడం జరిగింది.
అల్లాహ్ మానవుల్లో ముస్లింలను [విశ్వాసులను]ఎన్నుకున్నాడు మరియు వారిని తన స్నేహితులుగా చేసుకున్నాడు మరియు తన ఆదేశాలను శిరసావహించడానికి నియమించాడు వారు దైవధర్మ శాస్త్రానికి అనుగుణంగా జీవనం సాగిస్తారు,తద్వారా స్వర్గంలో తన ప్రభువు సాన్నిద్యంలో ఉండే యోగ్యతను పొందుతారు. మరియు దైవం వారిలో కూడా సదాచారులను అమరులను ప్రవక్తలను ఎన్నుకున్నాడు మరియు వారికి ఈ లోకంలో గొప్ప అనుగ్రహభాగ్యాన్నిప్రదానం చేశాడు,వాటితో హృదయాలకు ఆనందం కలుగుతుంది,మరియు అవి అల్లాహ్ ఆరాధన ఆయన ఆజ్ఞ పాలన ఆయన జపం. అంతేకాదు గొప్ప గొప్ప వరాలు ప్రధానం చేశాడు వారు తప్ప మరెవరూ వాటిని పొందలేరు అనే సంరక్షణ సుఖశాంతులు సంతోషాలు వీటన్నింటి కంటే కూడా ప్రదాన వరం దైవప్రవక్తలు తెచ్చిన సత్య సందేశాలను సత్యమని గ్రహించడంతో పాటు దాన్ని విశ్వసించడం మరియు అల్లాహ్ పరలోక జీవితంలో అతనికొరకు చిరస్మరణీయమైన అనుగ్రహాలు మరియు శాశ్వత సాఫల్యం సిద్దం చేసి ఉంచాడు అది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఉదారత్వానికి మాత్రమే శోభిస్తుంది,మరియు ఆయన తనని విశ్వసించిన జనులకు చిత్తశుద్దిని కనబర్చిన వారికి ఆ బహుమానాలను పురస్కారాలను ప్రదానం చేస్తాడు.
ఇస్లాంలో మహిళ ఒక గొప్ప స్థితికి చేరుకుంది అంతకు ముందు ఆ స్థాయికి ఏ సముదాయాల్లో ఆమె చేరలేదు,రాబోయే తరాల్లో కూడా అలాంటి స్థానాన్ని పొందలేదు,ఎందుకంటే ఇస్లాం మనిషికి ఒసగిన గౌరవం స్త్రీ పురుషుల ఇరువురికీ సమానంగా సమతుల్యంగా వర్తిస్తుంది,ఈ లోకంలో వారు అల్లాహ్ ఆదేశాల ఎదుట సమానంగా ఉన్నారు,ఎలాగైతే పరలోక జీవితంలో దైవం యొక్క బహుమానాలు ఫలాలు,పొందడంలో సమానులుగా ఉంటారు,సమతుల్యంగా ప్రతిఫలాలు పొందుతారు,అల్లాహ్ తాలా ఇలా సెలవిచ్చాడు. {మేము ఆదము సంతతికి గౌరవం వొసగాము }[53] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {తల్లిదండ్రులు, సమీప బంధువులు వదిలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది.అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది.ఆ ఆస్తి తక్కువైనాసరే,ఎక్కువైనాసరే (అందులో)వాటా మాత్రం నిర్ధారితమైఉంది}[54] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి-}[55] అల్లాహ్ సెలవిచ్చాడు: {విశ్వాసులైన పురుషులు విశ్వాసులైన స్త్రీలు -వారంతా ఒందొకరికి మిత్రులుగా సహాయకులుగా చేదోడు వాదోడుగా ఉంటారు}[56] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు} [57] {మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!"}[58][59] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {వారిప్రభువు వారి మొరను ఆలకించి ఆమోధించాడు మీలో పని చేసే వారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలయినాసరే నేను వృధా చేయను}[60] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.} మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.}
ఇస్లాంలో మహిళలకు లభించిన గౌరవం మరే మతంలో ధర్మంలో సాంప్రదాయంలో చట్టంలో లభించలేదు,అయితే రుమానియా సాంప్రదాయం ప్రకారం ‘మహిళ ‘కేవలం పురుషుడి ఆధీనంలో ఉన్న దాసి మాత్రమే,అని ప్రకటిస్తుంది ,ఆమెకు ఎటువంటి అధికారం ఉండదు,రూమ్’లో ఒక మహాసదస్సు నిర్వహించడం జరిగింది అందులో స్త్రీల గురించి చర్చించబడింది,ఆ పై ఆమె ఒక నిర్జీవి అని తేల్చిచెప్పింది,కాబట్టి పరలోకంలో ఆమెకు ఎటువంటి భాగం లేదు,మరియు ఆమె ఒక మలినము'అని తెలిపింది.
ఏథెన్స్ లో మహిళా ఒక విసిరివేయబడిన, దొరికిన వస్తువులా చూడబడుతుంది,ఆమె ‘అమ్మకం’జరిగేది, అది ఒక అశుద్దమైన పనిగా వ్యవహరించబడుతుంది.
'ప్రాచీన భారత దేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం:-‘మహమ్మారి మృత్యువు నరకం పామువిషం మరియు అగ్ని మహిళా కంటే ఎన్నో రేట్లు ఉత్తమం, ఆమె జీవితం తన భర్త మరణంతో సమాప్తమవుతుంది,ఎందుకంటే అతనే ఆమెకు స్వామి కాబట్టి. అంతేకాదు ఆమె తన భర్త శరీరాన్ని శవాన్ని కాల్చేటప్పుడు అందులో దూకి సతీసహగమనం’అవ్వాలి, లేకపోతే ఆమెను ఎల్లప్పుడు శాపం వెంటాడుతూ ఉంటుంది.
యూదుల యూద ధర్మం ప్రకారం మహిళ గురించి Old testament పాతనిబందన లో ఈ విషయం ఉల్లేఖించబడింది. (నేను’అధ్యాయనం చేశాను మరియు నిజమైన బుద్దిని పొందటానికి కఠినమైన ప్రార్ధన చేశాను, నేను ప్రతీ విషయానికి ఒక హేతుబద్దమైన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను, అయితే నేను తెలుసుకున్నది ఏమిటి? నాకు తెలిసినది ఏమిటంటే? అది చెడ్డది, తెలివితక్కువది, మూర్ఖురాలు. పిచ్చిది, మరణం కంటే కూడా చేదైనది, కొంతమంది స్త్రీలు వల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటారు, వారి హృదయాలు ఉచ్చులు’వారి కౌగిలి సంకెళ్ళు'అని కూడా నేను తెలుస్కున్నాను’) [61]
ప్రాచీన కాలానికి చెందిన మహిళ పరిస్థితి ఇలా ఉండేది,ఇక మధ్యకాలానికి ఆధునిక యుగానికి చెందిన పరిస్థితి ఎలా ఉండేదో క్రింద లిఖితమైన ఘటనలు స్పష్టంగా వివరిస్తాయి:-
Denmaark ‘డెన్మార్క్’కు చెందిన లేఖఖుడు wieth kordsten వైట్ కొస్త్ మహిళల గురించి ‘క్యాతెలిక్ చర్చ్’కు చెందిన అభిప్రాయాన్ని ఈ విధంగా ఉల్లేఖించారు :- (‘ప్రాచీన మధ్యయుగంలో ‘క్యాతలీక్స్’ల దృష్టి ప్రకారం మహిళలను రెండవతరగతి మనిషిగా భావించేవారు,యూరోపియ మహిళా గురించి ఎటువంటి పర్వా ఉండేది కాదు అతి తక్కువగా ఆలోచించేవారు.) మరియు క్రీ.శ.-586 వ సంవత్సరం ఫ్రాన్స్ లో ఒక సదస్సునిర్వహించారు అందులో మహిళలకు సంభంధించి విమర్శలు,విచారాలు చర్చలు జరిగాయి,ఆమెను మనిషిగా జమ కట్టాలీ?ఆమెను మనుషుల్లో పరిగణించకూడదు?అనే విషయంగా విచారణ విమర్శలు జరిగాయి ఆ తరువాత సదస్సులోని సభ్యులు తీర్పు చేస్తూ ఆమె ఒక మనిషిగా పరిగణించబడుతుంది,కానీ పురుషుల సేవకోసం ఆమె పుట్టించబడింది.అని తీర్మానించారు. ఫ్రెంచ్ చట్టంలో ఆర్టికల్ 217 ప్రకారం ఇలా చెప్పబడింది :- (‘వివాహితురాలు ఆమెవివాహం ఆమె యజమాన్య హక్కుకు మరియు ఆమె భర్తకు మధ్య ఉన్న విభజనపై ఆధారపడి ఉన్నప్పటికి ఆమె తన సంపత్తిని సంపదను మరొకరికి పంచలేదు,లేదా ఆమె యాజమాన్య హక్కును ఇతరులకు కదపలేదు,మరియు దాన్నికొదువగానీ తాకట్టుగానీ పెట్టలేదు,మరియు ఏదైనా మూల్యంతో లేదా మూల్యం లేకుండా కానీ తన భర్త అనుమతి లేకుండా లేదా అతని వ్రాతపూర్వక సమ్మతి లేకుండా ఏ వస్తువుకు ఆమె యజమాని కాజాలదు')
ఇంగ్లాండులో హెన్రీ అష్టాం ఒక ఆంగ్ల మహిళపై బైబిల్ చదవడం నిషేదించాడు,క్రీ.శ 1850 వరకు మహిళలు నాగరికులుగా పరిగణించబడేవారు కాదు,మరియు క్రీ.శ 1882 వరకు వారికి వ్యక్తిగత హక్కులు అధికారాలు ఉండేవి కావు,[62]
ఐరోపా,అమెరికా మరియు ఇతర పారిశ్రామిక దేశాలలో మహిళల పరిస్థితి విషయానికొస్తే ఆమెను వాణిజ్య ప్రయోజనలకోసం ఉపయోగించాల్సిన ఒక సాధారణ జీవిగా పరిగణిస్తారు,ఆమె వాణిజ్య ప్రకటనల ప్రచారంలో ఒక భాగం చివరికి వస్తువుల ప్రకటనలకొరకు ఆమెను వస్త్ర హీనులుగా నగ్నంగా మార్చే పరిస్థితి కూడా చేరుకుంది,మరియు పురుషుల ద్వారా నిర్ధారిత మైన నియమనిబంధనల ఆధారంగా ఆమె శరీరాన్ని అస్తిత్వాన్ని హలాలుగా సమ్మతించినదిగా చేసుకున్నారు,తద్వారా ఆమెనుప్రతీ చోట కేవలం రంజింపచేసే వస్తువుగా సుఖభోగాల వస్తువుగా మార్చుకున్నారు.
మహిళ,స్త్రీ తన సంపద తెలివితేటలు మరియు శరీరం ద్వారా లాభం చేకూర్చెంత వరకు శ్రద్దగా సంరక్షించబడేది,కానీ వృద్దాప్యంలో ఉన్నప్పుడూ మరియు ఆమె దీనస్థితికి చేరినప్పుడు వ్యక్తులు,సమాజం,సంస్థలు,అన్నీ ఆమెను విసిరిపడేసేవారు,చివరికి ఆమె తన ఇంట్లో లేక మానసిక వైద్యశాలలో ఒంటరిగా నిస్సహాయస్థితిలో జీవితం గడిపివేసేది.
మీరు దీనిని దివ్యఖుర్ఆన్ గ్రంధంలో వర్ణించబడిన అల్లాహ్ యొక్క ఈ ఆయతు ద్వారా సరిపోల్చి చూడండి { ఖుర్ఆనుతో ఎన్నటికీ సరిపోల్చలేము } {విశ్వాసులైన స్త్రీలు,విశ్వాసులైన పురుషులు వారంతా ఒండోకరికి మిత్రులుగా[సహాయకులుగా చేదోడు వాదోడుగా]ఉంటారు.[63] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి } [64] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు {మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.}[65] {మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!"}24
ఆమె ప్రభువు ఆమెకు ఈ గౌరవం ఇస్తూ మానవ జాతికి ఇలా స్పష్టంచేస్తూ తెలియజేశాడు:- ప్రభువు మహిళను స్త్రీను ఒక తల్లిగా ఒక భార్యగా ఒక కూతురుగా జీవించడానికి పుట్టించాడు,అంతేకాదు ఈ భూమిను నిర్వర్తించడానికి ప్రత్యేకమైన నిబంధనాలు నియామాలు నిర్దారించాడు అవి పురుషులకు వర్తించకుండా కేవలం మహిళలకు ప్రత్యేకంగా విశిష్టమైనవి.
ఇందులో అల్లాహ్ వివేకం దాగి ఉంది ,దానిని గ్రహించడంలో బుద్ది తెలివితేటలు అసమర్ధత కనిపిస్తుంది,దానిని వర్ణించడంలో నోరునాలుకలు అశక్తత చూపిస్తాయి,ఈ క్రింది పంక్తుల్లో కొన్ని వివేకాలను మర్మాలను ప్రస్తావించబోతున్నాము అవి ఇలా ఉన్నాయి :-
1) అల్లాహ్ తఆలా కు ఉత్తమ మైన పేర్లు కలవు ఉదా : అల్ గఫూర్{అధికంగా క్షమించేవాడు }ఆర్ రహీం { అధికంగా దయచూపువాడు } అల్ అఫ్’వు {అత్యధికంగా మన్నించువాడు } అల్ హలీం {సహన శీలుడు}. మరియు ఈ పేర్ల ప్రభావం తప్పనిసరిగా బహిర్గతమవ్వాలి,కనుక అల్లాహ్ తఆలా మర్మం [వివేకపు]ప్రకారం ఆయన ఆదము మరియు అతని సంతానాన్ని ఒక మేలైన ఇంటిలో దించాలి,అక్కడ ఆయన తన అత్యుత్తమ నామాల శక్తి ప్రభావాన్ని చూపించాలి,కోరిన వారిని ఆయన క్షమించాలి,కోరినవారిని ఆయన దయచూపాలి,కోరిన వారి పట్ల సహనం చూపాలి,అంతేకాదు ఆయన ఇతరనామాలు మరియు గుణాల విశేషాలు వాటి ప్రభావం స్పష్టంగా బహిర్గతమవ్వాలి.
2) అల్లాహ్ తఆలా స్పష్టంగా వివరించి తెలియజేసే సత్యమైన చక్రవర్తి మరియు సామ్రాజ్యాధికారి చక్రవర్తి ఆదేశాలను నిషేధాలను జారీ చేశాడు,బహుమానాలను శిక్షలను అమలు పరుస్తాడు అవమానపరుస్తాడు గౌరవం ప్రసాదిస్తాడు కనుక ఆయన అధికార కోరిక మేరకు ఆదము మరియు అతని సంతానాన్ని ఒక ఇంటిలో దించాలి,ఆక్కడ వారిపై ఆయన ఆధికార అధిపత్యాన్ని చూపిస్తూ ఆదేశాలు జారీచేయ్యాలి,ఆ తరువాత వారిని మరొక ఇంటికి స్థానాంతరం చేసి వారి కర్మలకు ప్రతిఫలాలు నొసగాలి.
3) అల్లాహ్ తఆలా కోరిక మేరకు వారిలో కొందరిని దైవప్రవక్తలుగా,సందేశహరులుగా సత్పురుషులుగా అమరులుగా నిలిపాడు,వీరిని ప్రజలు ప్రేమించాలి,ప్రజలను వారు ప్రేమించాలి,పిమ్మట ప్రభువు వారిని మరియు తన శత్రువులను ఒకచోట పరీక్ష నిమిత్తం వదిలాడు,వారు ఆయనకు ప్రధమంగా ప్రాధాన్యత ఇచ్చారు,ఆయన సంతోషం మరియు ప్రేమ కొరకు దైవమార్గంలో ప్రాణ త్యాగం చేసారు అప్పుడు వారికి ఆయన ప్రేమ ప్రసన్నత సామీప్యం లభించింది ఇది లేకుండా లభించేది కాదు. దైవదౌత్యం ప్రవక్తత మరియు అమరత్వం అల్లాహ్ సామీప్యం యొక్క సర్వశ్రేష్టమైన పదవులలోనివి వీటిని మనిషి పొందాలంటే ఆదము,అతని సంతానం పృథ్వీపైకి పంపించబడాలని తీర్పు చేశాడు.
4) అల్లాహ్ తఆలా ఆదము మరియు అతని సంతానాన్ని మంచి చెడును స్వీకరించే యోగ్యత గల వస్తువు నుండి పుట్టించాడు,అది అతనిని మనోవాంఛలు,ప్రలోభాలు,అన్యాయం వైపుకు ఆహ్వానిస్తుంది మరియు బుద్ది జ్ఞానం తో ప్రతిస్పందిస్తుంది.కనుక అల్లాహ్ అతనిలో బుద్దిని మరియు మనోవాంఛలను సృష్టించాడు వీటిని తన అవసరాలను ఆహ్వానించే కారకాలుగా చేశాడు తద్వారా అతని ఉద్దేశ్యం పూర్తి అవుతుంది,మరియు ప్రభువు తన వివేకం,శక్తి,గర్వాన్ని,అధికారం,దయాగుణాన్ని,కరుణను తన దాసుల కొరకు ఆధిపత్యంలో,అధికారంలో స్పష్టంగా ప్రదర్శించాలని కోరుకున్నాడు. కనుక ఆయన వివేకాదేశానుసారం ఆదము మరియు అతని సంతతిని పృథ్వి పైకి పంపించబడాలి,ఆప్పుడే వారు ఈ పరీక్షకు గురికాగలరు,ఈ కారణాల వల్ల మనిషి యొక్క సుముఖత మరియు ప్రతిస్పందన ప్రభావాలు కనిపిస్తాయి దానికనుగుణంగా అతన్ని గౌరవించడం లేదా అవమానించడం అనే విషయం ప్రకటించే అవకాశం ఉంటుంది.
5) అల్లాహ్ తఆలా తన ఆరాధన నిమిత్తం మనిషిని సృష్టించాడు ఇదే వారి పుట్టుకకు గల ప్రధాన ఉద్దేశ్యం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}[66] మనిషి నుండి కోరబడిన సంపూర్ణ దాస్యం శాశ్వత అనుగ్రహాలతో ,అంతమే ఎరుగని వరాలతో కూడిన నివాసంలో పూర్తికాజాలదు,అది కేవలం పరీక్షా స్థలంలో మైదానంలో మాత్రమే వీలుపడుతుంది,మిగిలి ఉండే నివాసం అనుగ్రహాలతో నిండి ఆశలను కోరికలను పూర్తిచేస్తుంది తప్ప పరీక్షకు గురిచేసే మైదానంగా నియమ నిబంధనలు పాటించేలా పూరించేలా నివాసమై ఉండదు.
6) అగోచర విషయాలను {గైబ్ పై ఈమాను} విశ్వసించడం లాభదాయకమైన విశ్వాసం అవుతుంది కనిపించే విషయాలపై విశ్వసించడమే అసలైతే ప్రళయదినాన అందరూ విశ్వసిస్తారు,ఒకవేళ వారిని అనుగ్రహాలతో కూడిన నివాసంలో పుట్టించి ఉంటే అగోచర విషయాల పట్ల విశ్వసించడం వల్ల ప్రాప్తించే అంతస్తును స్థాయిని ఎన్నటికీ పొందలేరు,మరియు అగోచర విషయాలు చూసి విశ్వసించిన వాటికి ఇది లభించదు,అందువల్ల అల్లాహ్ వారిని ఒక ఇంటిలోకి పంపించాడు అక్కడ అగోచర విషయాలపై విశ్వసించే భాగ్యం దక్కుతుంది.
7) అల్లాహ్ తఆలా ఆదమును భూమి యొక్క ఒక గుప్పేడు మట్టినుండి సృష్టించాడు,మరియు భూమిలో మంచీచెడు మృదువైన కఠినమైన రెండు రకాల మట్టి ఉంది అయితే ఆదము సంతానంలో కొంతమంది తన నివాసంలో ఉండటానికి అర్హులు యోగ్యులు కారు అని అల్లాహ్ కు తెలుసు. అందువల్ల ఆయన మంచి చెడు తీసిన చోటనే వారిని దించాడు తరువాత అల్లాహ్ వారిని రెండు ఇళ్ల నివాసాల మాధ్యమంతో వేరువేరు చేశాడు మంచి వారిని తన సామీప్యుడిగా పొరుగువాడిగా మరియు అందులో నివాసిగా చేశాడు,చెడ్డ వారిని దౌర్భాగ్యమైన దుశ్టుల ఇంట్లో నివాసిగా చేశాడు.
8) అల్లాహ్ తఆలా ఇలా దీనిద్వారా ఆయన అనుగ్రహించిన దాసులకు తన సంపూర్ణ అనుగ్రహ భాగ్యాలను మహోన్నతను పరిచయం చేయదలిచాడు,తద్వారా వారు ఆయనను అత్యంత ఎక్కువ ప్రేమించేవారుగా మరియు అత్యంత ఎక్కువ కృతజ్ఞత తెలుపుకునే వారిగా మారగలరు మరియు ఆయన ఒసగిన అనుగ్రహాలపై అత్యధికంగా ఆనందిస్తారు అంచేత దైవం వారికి తన శత్రువుల పట్ల ఎలాంటి వ్యవహారం చేశాడో ఎలాంటి నరకాన్ని సిద్దం చేసి పెట్టాడో చూపించాడు మరియు ఆయన తన గొప్ప అనుగ్రహాలతో వారిని ప్రత్యేకపరిచాడు తద్వారా వారికి ఆనందం కలగాలని సంతోషం సంపూర్ణమవ్వాలని వారి ప్రసన్నత మరింత ఎక్కువ అవ్వాలని భావించాడు.వారిని ఈ విషయం పై సాక్ష్యులుగా పెట్టాడు. ఇదంతా వారికి అల్లాహ్ ప్రసాదించిన బహుమానం మరియు ఆయన యొక్క సంపూర్ణ ప్రేమకు ఒక నిదర్శనం.దీనికోసం తప్పనిసరైన విషయమేమిటంటే వారిని ఆయన భూమిపై పంపాలి,వారిని పరీక్షించాలి,తాను కోరిన వారిపై దయా,జాలి అనుగ్రహించాలి,మరియు తన వివేక మర్మన్యాయం కోసం కోరిన వారిని అసహాయకులుగా విడిచిపెట్టాలి ఆయన సమస్తం తెలిసిన వాడు వివేచనా పరుడు.
9) ఆదము మరియు అతని సంతానం స్వర్గానికి తిరిగి వచ్చేటప్పుడు అత్యంత ఉత్తమ స్థితిలో ఉండాలని అల్లాహ్ ఆశించాడు అందువల్ల ఆయన వారికి ప్రాపంచిక సుఖ దుఖాలు కష్టానష్టాలు శోకాలు చింతలు రుచి చూపించాడు దానివల్ల పరలోక ఇంటిలో వారికి స్వర్గ ప్రవేశం పట్ల ఉత్సాహకత దాని గొప్పతనం విలువ సామీప్య ఆకాంక్ష పెరుగుతుంది ఎందుకంటే 'ఒక వస్తువు అందాన్ని దానికి విరుద్దమైన వస్తువు మాత్రమే స్పష్టపరుస్తుంది'.
మానవ జాతి ఆరంభం గురించి స్పష్టంగా తెలియజేసిన తరువాత మానవునికి సత్యధర్మం ప్రాధాన్యత గురించి తెలియజేయడం చాలా ఉత్తమమని నేను భావిస్తున్నాను!
మనిషికి జీవించడానికి ఇతర జీవన అవసరాల కంటే ధర్మం ఆవశ్యకత చాలా ఎక్కువగా అవసరం ఉంది.ఎందుకంటే మనిషికి అల్లాహ్ ఆనందించే విషయాల పట్ల జ్ఞానం ఉండటం చాలా అవసరం మరియు దీని కోసం ఒక కార్యాచరణ అవసరం ఉంది,అతను తనకు చేకూర్చే విషయాలను మరియు నష్టాల నుండి పరిరక్షించగలిగే విషయాలను దాని ద్వారా తెలుసుకోగలుగుతాడు. ఇది కేవలం దైవధర్మశాసనం వల్లనే సాధ్యమవుతుంది,దైవధర్మమే లాభదాయకమైన నష్టకారకమైన కర్మల మధ్యగల తేడాను సూచిస్తుంది.అదే సృష్టిలో అల్లాహ్'న్యాయం మరియు దాసులకు తనజ్యోతి.కాబట్టి ప్రజలు ఏ విషయాలను ఆచరించాలి ఏ విషయాలకు దూరంగా ఉండాలి అని బోధించే ఒక ధర్మశాసనం లేకుండా జీవనం కొనసాగించబడటం అసంభవం.
ఒక మనిషికి ఒక కోరిక ఉంది అతను ఆ కోరిక ఏమిటి? ఎలాంటిది? అది అతనికి లాభం చేస్తుందా లేదా నష్టం చేస్తుందా? అతనికి మేలు చేస్తుందా లేక హానీ కలిగిస్తుందా అని తెలుసుకోవాలిసిన అవసరం ఉంది. -కొంతమంది దీనిని స్వాభావికంగా తెలుసుకుంటారు, మరి కొంత మంది బుద్ది జ్ఞానాన్ని ఉపయోగించి ప్రకృతి సూచనలు ఆధారాల వెలుగులో తెలుసుకుంటారు మరికొందరు దైవప్రవక్తలు పరిచయం చేసి భోదించి వివరించి మార్గదర్శనం చేస్తే తప్ప తెలుసుకోలేరు.[67]
అయితే నాస్తిక సిద్దంతాలు మరియు భౌతిక సిద్దంతాలు విస్తృతంగా ప్రదర్శించబడి అలంకరించబడి ఉండవచ్చు,మరియు వివిధ రకమైన భావజాలాలు మరియు సిద్ధాంతాలు వృద్ధి చెంది ఉండవచ్చు,కానీ అవి వ్యక్తులను మరియు సమాజాలను నిజమైన సత్యధర్మఅవసరం లేకుండా ఎప్పటికీ చేయలేవు.ఈ భావజాలాలు మనిషికి కావల్సిన ఆధ్యాత్మిక మరియు శారీరక అవసరాలను ఎప్పటికీ అందించలేవు. మరియు మనిషి ఎంత లోతుగా అందులోకి వెళ్తాడో,అంత త్వరగా అవి తనికి భద్రత,రక్షణ ఇవ్వలేవని,అతని దాహాన్ని తీర్చలేవని మరియు నిజమైన సత్యధర్మం అనివార్యమని నమ్ముతాడు. ఎర్నెస్ట్ రీనాన్ ఇలా తెలిపాడు :- (మనం ప్రేమిస్తున్న ప్రతిదీ క్షీణించిపోయే అవకాశం ఉంది,తెలివితేటలు,విజ్ఞాన శాస్త్రం మరియు పరిశ్రమలను ఉపయోగించుకునే స్వేచ్ఛ రద్దు చేయబడవచ్చు,కాని మతాన్ని రద్దు చేయడం అసాధ్యం.బదులుగా,ఇది ప్రాపంచిక జీవితంలో నీచమైన ఇరుకైన ప్రలోభాలకు మనిషిని పరిమితం చేయాలనుకుంటుంది,భౌతికవాద సిద్ధాంతం యొక్క పనికిమాలినతనానికి వ్యర్థానికి ఒక జీవన రుజువుగా ఇది మిగిలిపోతుంది}[68]
ముహమ్మద్ ఫరీద్ వజ్దీ ఇలా అన్నాడు: (మతతత్వం యొక్క ఆలోచన మసకబారడం అసాధ్యం,ఎందుకంటే ఇది ఆత్మ యొక్క అత్యుత్తమ కోరిక మరియు దాని భావోద్వేగాలలో చాలా ఉదారంగా ఉంటుంది,మానవ తలని పెంచే ధోరణి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,బదులుగా,ఈ ధోరణి పెరుగుతుంది,అందం మరియు వికారాలను హేతుబద్ధీకరించే మనస్సు ఉన్నంతవరకు మతతత్వం యొక్క స్వభావం ఒక వ్యక్తిని అనుసరిస్తుంది]{73}
'మానవుడు ప్రభువు నుండి దూరమైనప్పుడు తన మానసిక సామర్థ్యాలు మరియు జ్ఞానం యొక్క విస్తృతిని గుర్తిస్తాడు అలాగే తన ప్రభువు మరియు ఆయన పట్ల అనివార్య విషయాల గురించి అజ్ఞానతను గుర్తిస్తాడు మరియు తన స్వయం గురించి తనను సంస్కరించే విషయాలు,బ్రష్టుపట్టించే విషయాలు,ఆనందం కలిగించేవి, దుఖం కలిగించే విషయాల అజ్ఞానతను గుర్తిస్తాడు మరియు ఖగోళ శాస్త్రం, గెలాక్సీల శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, అణు శాస్త్రాలు వంటి శాస్త్రీయ వివరాల గురించి తనకు గల పెద్ద అజ్ఞానాన్ని గుర్తిస్తాడు... అప్పుడు ఈ ప్రపంచం గర్వా హంకార దశను వదిలి వినయ వినమ్రతల వైపుకు మరలుతుంది,ఈ సర్వశాస్త్రాల వెనుక ఒక పరిజ్ఞాని మహావివేకి ఉన్నాడని మరియు ప్రకృతి వెనుక ఒక సమర్థుడైన సృష్టికర్త ఉన్నాడని విశ్వసిస్తారు.ఈ వాస్తవికత నిష్పాక్షిక పరిశోధకుడిని అగోచరాన్ని విశ్వసించడాన్ని,సరళమైన సత్యధర్మానికి లొంగిపోవడాన్ని మరియు సహజ స్వభావం యొక్క పిలుపుకు ప్రతిస్పందించడాన్ని అనివార్య పరుస్తుంది. కానీ ఎప్పుడైతే మనిషి ఈ మార్గం నుండి తప్పుతాడో,అతని సహజస్వభావం చెడిపోతుంది మరియు అతను మూగ జంతువుల స్థాయికి దిగజారుతాడు.
మేము పైన పేర్కొన్న విషయాల సారాంశాన్ని ఈ విషయంతో ముగిస్తున్నాము, నిశ్చయంగా వాస్తవధర్మం - అల్లాహ్ యొక్కతౌహీదు ఏకత్వం పట్ల విశ్వాసం,ఆయనను ఆరాధించడం మరియు ఆయన శాసనాలను ఆదేశాలను అనుసరించడం మాత్రమే- అయితే 'సత్యధర్మం 'మనిషి జీవితానికి చెందిన అత్యవసరమైన అంశం,దాని ద్వారానే మనిషి సమస్తలోకాలకు ప్రభువైన అల్లాహ్ వాస్తవ దాస్యాన్ని పూర్తిచేయగలడు మరియు ఇహపరలోకాల్లో వినాశకాల నుండి దుఖాల నుండి కష్టాలనుండి శాంతిని సుఖశాంతులను రక్షణను పొందగలుగుతాడు.
అదేవిధంగా, ఆత్మ శుద్ధి చేయడానికి మరియు అధ్యాత్మిక సైద్దాంతిక శక్తిని మెరుగుపరచడానికి ఈ ధర్మం చాలా అవసరమైన అంశం,ఎందుకంటే కేవలం దీని ద్వారానే బుద్ది తన ఆకలిని తీర్చుకోగలదు,ఇది లేకుండా తన అత్యున్నత లక్ష్యాలను నెరవేర్చలేదు.
సంకల్ప శక్తి యొక్క పరిపూర్ణతకు ఇది కీలకమైన అంశం,ఎందుకంటే ఇది గొప్పగొప్ప ప్రేరణల ద్వారా మద్దతు ఇస్తుంది మరియు నిరాశ నిస్పృహలకు గురిచేసే కారణాలను ఎదుర్కునేందుకు ప్రధాన మార్గాలను అందిస్తుంది.
అయితే కొంతమంది - మనిషి స్వాభావికంగానే నాగరికుడు'అని అంటారు. కానీ మేము {మనిషి స్వాభావికంగానే ధార్మికుడు]‘అని చెప్తాము.}[69]-ఎందుకంటే మనిషిలో రెండు శక్తులు ఉన్నాయి:ఒకటి సైద్ధాంతిక శక్తి మరియు సంకల్ప శక్తి,అతని పూర్తి ఆనందం అతని సైద్ధాంతిక మరియు సంకల్ప శక్తిని పరిపూర్ణం చేయడంపై ఆధారపడి ఉంటుంది మరియు అతని సైద్ధాంతిక శక్తి యొక్క పరిపూర్ణత ఈ క్రింది వాటిని తెలుసుకోవడం ద్వారా తప్ప జరగదు:-
1. సర్వసృష్టికర్త, పరిపోషకుడైన ప్రభువు యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆయన మనిషిని ఏమీ లేకుండా సృష్టించాడు,అతనిపై అనేక అనుగ్రహాలను కురిపించాడు.
2. అల్లాహ్ పేర్లు మరియు గుణాలను తెలుసుకోవడం,మరియు ఆయన కొరకు తప్పనిసరైన విషయాల జ్ఞానాన్ని తెలుసుకోవడం;మరియు తనదాసులపై ఈ పేర్లు గుణాలు ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవాలి.
3. పవిత్రుడైన అల్లాహ్ వరకు చేర్చే మార్గాన్నితెలుసుకోవడం.
4. మనిషికి మరియు మహాగొప్ప అనుగ్రహాలకు చేర్చే సత్య మార్గానికి మధ్య అడ్డుగా తగిలి నిరోధించే అవరోధాలు మరియు హానిలను తెలుసుకోవడం.
5. మీ స్వంత ఆత్మజ్ఞానం,దానివాస్తవికత మరియు అవసరాల గురించి నిజమైన అవగాహన కలిగి ఉండటం,దానిని సంస్కరించేది,చెడిపేది ఏది మంచి ఏది చెడును గుర్తించడం మరియు దాని లక్షణాలు మరియు లోపాలను తెలుసుకోవడం.
ఈ ఐదు విషయాలు తెలుసుకోవడం ద్వారానే మనిషి తన సైద్ధాంతిక విజ్ఞానశక్తిని పరిపూర్ణం చేయగలడు.తన దాసులపై ఉన్నఅల్లాహ్ అధికారాలను హక్కులను గౌరవించడం ద్వారా మరియు ఈ హక్కులను హృదయపూర్వకంగా చిత్తశుద్దితో, నిర్విరామంగా నిర్వహించడం ద్వారా తప్ప అతని సైద్ధాంతిక మరియు సంకల్ప శక్తి యొక్క పరిపూర్ణత జరగదు.ఈ రెండు శక్తులు ఆయన సహాయం లేకుండా పరిపూర్ణం అవ్వవు, మరియు మనిషి అల్లాహ్ అతనికి సన్మార్గం చూపితే తప్ప తన సజ్జనులకు సత్పురుషులకు చూపిన మార్గాన్ని తెలుసుకోలేని నిస్సహాయుడిగా ఉన్నాడు. [70]
'సత్యధర్మం అనేది ‘ఆత్మ యొక్క వివిధ శక్తులకు’ దైవమద్దతు అని మనకు తెలిసిన తరువాత,ధర్మం సమాజానికి రక్షణ కవచం అని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పరస్పర సహకారం ద్వారా తప్ప మానవ జీవితం సరిగ్గా,సజావుగా ఉండదు మరియు మానవ సంబంధాలను నియంత్రించేది,వారి బాధ్యతలను నిర్దారించి నిర్వచించేది మరియు వారి హక్కులకు హామీ ఇచ్చే ఒకవ్యవస్థ ద్వారా తప్ప ఈ పరస్పర సహకారం జరగదు. ఈ వ్యవస్థను కట్టుదిట్టం చేయడానికి ఒక గొప్పఅధికారం కూడా చాలా అవసరం,ఇది మనిషిని[ఆత్మను] వ్యవస్థను ఉల్లంఘించకుండా నిరోధించగలదు,దానిని కాపాడుకోవడానికి ప్రోత్సహిస్తుంది,హృదయాల్లో భయాన్నికలిగిస్తుంది,దాని హద్దులను ఉల్లంఘించకుండా అతిక్రమించకుండా,అపవిత్రం చేయకుండా నిరోధిస్తుంది. మరి ఈ అధికారం శక్తి ఏమిటి ?. నేను చెప్తున్నాను:భూమిపై ధార్మిక శక్తికి సమానమైన శక్తి లేదా వ్యవస్థ పట్ల గౌరవాన్ని నిర్ధారించేది,సమాజం యొక్కసమైక్యతను మరియు దాని వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించేది మరియు దానిలోని సౌలభ్యం మరియు ప్రశాంతతను చేకూర్చే కారకాలను నిర్దారించే సమానమైన శక్తి ఏది లేదు.
'దాని రహస్యం ఏమిటంటే, మనిషి ఇతర జీవుల నుండి ప్రత్యేకించబడ్డాడు, అతని కదలికలు మరియు కార్యాలు ఏ చెవి ఏ కన్నుచూడని ఒక శక్తి ద్వారా నియంత్రించ బడుతుంది,అదే'విశ్వాసం'అది ఆత్మను పవిత్రం చేసి, అవయవాలను శుద్ధి చేస్తుంది' 'కాబట్టి మనిషి ఎల్లప్పుడూ నిజమైన విశ్వాసం లేదా తప్పుడు విశ్వాస నమ్మకంతో నియంత్రించబడతాడు.అతని నమ్మకం,విశ్వాసం సరైనది అయితే,అతనిలోని ప్రతిదీ సరైనది అవుతుంది,కానీ అతని నమ్మకం పాడైతే,అతనిలోని ప్రతిదీ పాడైపోతుంది'
విశ్వాసం మరియు ఆరాధన మనిషిని కనిపెట్టుకుని ఉన్నాయి,మరియు అవి మానవుల్లో సమానంగా చూడబడతాయి –అవి రెండు రకాలు:-
1-మానవప్రతిష్ట,మానవత్వం మరియు ఇలాంటి ఇతర నైతిక విలువల పట్ల విశ్వాసం ఉండటం,వీటిని ఉల్లంఘించడానికి మంచి మనసులు సిగ్గుపడతాయి,వారికి శారీరక హింసలు,చెడు పరిణామాల నుండి విముక్తులయినప్పటికీనీ ఇష్టపడరు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను విశ్వసించడం మరియు ఆయనకు రహస్యాలు తెలుసు,అంతర్గత బహిర్గత విషయాలు తెలిసినవాడు,షరీఅతు తన ఆదేశాలు మరియు నిషేధాలతో శక్తిని పొందుతుంది,ఆయన ప్రేమ ద్వారా లేదా ఆయన పట్ల భయం ద్వారా లేదా ఆ రెండింటి ద్వారా ఆయన నుండి సిగ్గుతో ఉబ్బిపోతాడు. ఈమాను యొక్క ఈ రకం మనిషి మనసుపై మానవ ఆత్మ పై బలమైన అధికారం కలిగి ఉంటుంది’అనడంలో సందేహంలేదు,ఆశల తుఫానులు మరియు భావనల ఎత్తుపల్లాలు, అన్నిటి కంటే కఠినమైన పోరాటం చేసేది మరియు ప్రతీ సాధారణ మరియు ప్రత్యేక వ్యక్తి మదిలో అత్యంత ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
అంచేత ధర్మం, న్యాయం, నిజాయితీ నియమాల ఆధారంగా ప్రజల మధ్య వ్యవహారాలు చక్కదిద్దడానికి అన్నిటి కంటే ఒక ఉత్తమమైన హామీ ఇది,అందువల్ల సమాజానికి ఇది చాలా ఆవశ్యకరమైనది,ఈ విషయంలో ఆశ్చర్యమేమీలేదూ’’జాతిలో, సముదాయంలో ధర్మానికి గల స్థానం మానవ శరీరంలో హృదయానికి గల స్థానంతో సమానం. అనడం'లో ఆశ్చర్యం లేదు[71].
సాధరణంగా ధర్మానికి ఈ స్థానం ఉంటే నేటి ప్రపంచలో ‘అనేక బహుళమతాలు’కనిపిస్తాయి,ప్రతీ మతం వారు తమవద్ద ఉన్న మతంతో ఆనందిస్తూ దృఢంగా దాన్ని అనుసరించడం మీరు చూడవచ్చు,ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ? మానవాళి యొక్క ఆకాంక్షలను సంపూర్ణం చేసే మతం ధర్మం ఏది?మరియు సత్యం ధర్మాన్ని తెలుసుకునే గీటురాయి ఏది? నిజమైన సత్యధర్మం యొక్క ప్రమాణాలు, జాబితాలు ఏమిటి ?.
ప్రతి ధార్మిక అనుచరుడు తన మతం,విశ్వాసం నిజమైనదని నమ్ముతాడు,మరియు మతాన్ని అనుసరించే వారందరూ తమ మతం ఆదర్శవంతమైనదని మరియు అత్యంత సరళమైన విధానం దృఢమైన సన్మార్గం అని నమ్ముతారు. కల్పిత మతాల అనుచరులను లేదా మానవనిర్మిత మతాల అనుచరులను మీరు వారి నమ్మకానికి విశ్వాసాలకు రుజువులను అడిగినప్పుడు,వారు తమ తాతముత్తాతలను ఆ విశ్వాసం మీద పొందామని, వారి మార్గాలను అనుసరిస్తున్నారని వాదిస్తారు.ఆ తరువాత వారు నమ్మశక్యం కాని కల్పిత కథనాలను వివరిస్తారు,మరియు ఆ మాటలు లోపాలు మరియు బలహీనతలు లేనివి కాదు, సురక్షితమైనవి కావు, వారసత్వంగా వచ్చిన పుస్తకాలపై మాత్రమే వారు ఆధారపడి ఉంటారు,దీని రచయితలు,లేఖఖులు మరియు వాటి అసలు భాషలు మరియు వాటి ప్రాంతపు మూలాలు కూడా తెలియవు. ఇవన్నీ కేవలం కల్పిత కథనాలు మాత్రమే! సమీకరించడం వల్ల ఇవి గౌరవించబడ్డాయి, తరం తరువాత తరం వారసత్వంగా చెలామణి అవ్వసాగాయి, విశ్వసనీయత తెలుసుకొనుటకై వీటి ఉల్లేఖగొలుసులపై వచనాలపై ఎటువంటి వైజ్ఞానిక పరీక్షలు చేయబడలేదు.
ఈ తెలియని పుస్తకాలను,కథనాలను,గుడ్డి అనుకరణలను మతాలు మరియు విశ్వాసాల విషయాలలో సాక్ష్యంగా తీసుకోలేము.మరి అలాంటప్పుడు ఈ కల్పిత కల్తీ మతాలు ,మానవనిర్మిత మతాలన్నీ సత్యమా లేక అసత్యమా ?.
ఈ మతాలన్నీ న్యాయం సత్యం అవ్వడం అసాధ్యం, ఎందుకంటే నిజం ఒక్కటే ఉంటుంది అనేకం ఉండవు.ఈ మిథ్యామతాలు మరియు మానవ నిర్మిత నమ్మకాలన్నీ అల్లాహ్ నుండి వచ్చినవి కావడం కూడా అసాధ్యమే.అందువల్ల,అనేక మతాలు ఉన్నందున -మరియు నిజం,సత్యం ఒక్కటే!కనుక-మరి వాటిలో నిజమైన మతం,ధర్మంఏది?. అందువల్ల, నిజమైన ధర్మాన్ని మిథ్యా అసత్యాల నుండి వేరు చేయడానికి గీటురాయి వలె ప్రమాణాలు ఉండాలి. ఈ ప్రమాణాలు మనకు దొరికినప్పుడు వాటిని ఆ మతాలపై సరితూచితే ఏది నిజమైనమతం ఏది సత్య ధర్మం అని మనకు తెలుస్తుంది; మరియు ఈ ప్రమాణాలన్ని లేదా ఒకటి ఏ మతంతో సరితూగకపోతే అది ఒక మిథ్యాకల్పితం అని తప్పుడు మతం అని మనకు తెలుస్తుంది.
తప్పుడు మిథ్యామతాల నుండి నిజమైన సత్యధర్మాన్ని వేరుచేసే ప్రమాణాలు ఇవి :
ఒకటి:ఈ ధర్మం అల్లాహ్ నుండి ఉండాలి, దాన్నిమానవజాతికి తెలియజేయడానికి తన దూతద్వారా ప్రవక్తల్లో ఏదేని ఒక దైవప్రవక్త పై ప్రజలకు భోదించడానికి అవతరించబడాలి.ఎందుకంటే నిజమైన ధర్మం కేవలం అల్లాహ్ ధర్మమే! మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్’యే పునరుత్థాన రోజున తన దాసులకు వారికి అవతరింపచేసిన ధర్మం గురించి ప్రశ్నించి లెక్కతీసుకుని ప్రతిఫలమిస్తాడు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.}[72] అల్లాహ్ సెలవిచ్చాడు: {మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా:"నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.}[73] పై ఆయతులు మరియు ప్రమాణాల ఆధారంగా, మనిషి ఏ ధర్మమునైనా తెచ్చిదానిని అల్లాహ్’నుండి కాకుండా,తన వైపుకు జోడించినట్లైతే అది ముమ్మాటికి ఒక తప్పుడు మతం అవుతుంది.
రెండవది: ఆరాధన కోసం అల్లాహ్’ ఏకైకుడను మాత్రమే ప్రార్ధించాలని పిలుపునివ్వడం,బహుదైవారాధనను నిషేధించడం మరియు దానికి దారి తీసే మార్గాలను నిషేదిస్తూ పిలుపునివ్వడం.ఎందుకంటే ‘తౌహీదు ఏకత్వం వైపునకు ప్రజలను ఆహ్వానించడమే’సమస్త ప్రవక్తల,సందేశహరుల మూల ఉద్దేశ్యం.ప్రతీ ప్రవక్త తన జాతినుద్దేశించి ఇలా చెప్పారు ;- {'మీరు అల్లాహ్'ను ఆరాధించండి,ఆయన తప్ప మరొకరెవరూ మీకు ఆరాధ్యులు కారు'}[74] దీని ఆధారంగా షిర్కు తో కలిసిన ఏ ధర్మమైన లేదా అల్లాహ్’కు ప్రవక్తను లేదా దైవదూతను లేదా సత్పురుషుడను సాటి కల్పించినట్లైన అది అసత్యమవుతుంది,వారు ఒక ప్రవక్తను అనుసరించేవారైనా సరే మిథ్యమతమవుతుంది.
మూడు: దైవప్రవక్తలందరూ తమ ప్రజలకు భోదించిన ఆహ్వానించిన సూత్రాలతో ఏకీభవించాలి అనగా ప్రవక్తలందరూ ఏకైకుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించమని ఆహ్వానించారు,అల్లాహ్ మార్గదర్శకత్వం వైపునకు పిలిచారు,షిర్కు ను ఖండించారు నిషేదించారు, తల్లిదండ్రులకు అవిధేయత చూపకూడదని, ఒక వ్యక్తిని అన్యాయంగా చంపకూడదని చెప్పారు మరియు ఇతర స్పష్టమైన గోప్యమైన అనైతిక విషయాలను ఖండించి నిషేదించారు.అల్లాహ్ తెలిపాడు. {మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా:"నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.}[75] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఇలా అను: "రండి మీ ప్రభువు మీకు నిషేధించి వున్న వాటిని మీకు వినిపిస్తాను: 'మీరు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి. మరియు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి. మేమే మీకూ మరియు వారికి కూడా జీవనోపాధిని ఇచ్చేవారము. మరియు బహిరంగంగా గానీ, లేదా దొంగచాటుగా గానీ అశ్లీలమైన (సిగ్గుమాలిన) పనులను సమీపించకండి. అల్లాహ్ నిషేధించిన ప్రాణిని, న్యాయం కొరకు తప్ప చంపకండి. మీరు అర్థం చేసుకోవాలని ఈ విషయాలను ఆయన మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.}[76] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?"}[77]
నాలుగు: ఇది ఒకదానితో ఒకటి విరుద్ధంగా లేదా భిన్నంగా ఉండకూడదు, అతను ఒక విషయాన్ని ఆజ్ఞాపించి మళ్ళీ మరొక ఆదేశంతో తిరస్కరించకూడదు.ఒకవస్తువును నిషేధించి అలాంటి మరొక వస్తువును ఎటువంటి కారణం లేకుండా అనుమతించకూడదు ధర్మసమ్మతం చేయకూడదు లేదా కొన్ని సమూహాలకు ఒకటి నిషేధించి మరికొందరికి దానిని అనుమతించకూడదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు- {ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరుపు నుండి గాక ఇతరుల తరుపు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!}[78]
ఐదు:- ఆ ధర్మం ప్రజల మతం,గౌరవం,డబ్బు,ప్రాణాలు మరియు సంతాన సంరక్షణను సునిశ్చితపర్చేదై ఉండాలి. దానికోసం ఆదేశాలు,నిషేదాలు,నైతికతలు,హెచ్చరికలు నిర్ధారించి ఈ ఐదు విషయాలను పరిరక్షించాలి.
ఆరు:-ఇది మానవాళికి వారి సొంత అన్యాయాల నుండి మరియు ఒకరిపట్ల ఒకరు చేసే అన్యాయం నుండి సంరక్షిస్తూ కారుణ్యప్రదాతగా ఉపయోగపడాలి’-ఆ అన్యాయం ఇతరుల హక్కులను కొల్లగొట్టడం,అధికార దుర్వినియోగానికి పాల్పడటం లేదా బలహీనులను బలవంతులు మోసం చేయడం కావచ్చు. మూసా అలైహిస్సలాం ప్రవక్తకు దయచూపుతూ ఇచ్చిన తౌరాతు గురించి వివరిస్తూ అల్లాహ్ తఆలా ఇలా చెప్పాడు :- {-మరియు మూసా కోపం చల్లారిని తరువాత ఆ ఫలకాలను ఎత్తుకున్నాడు. మరియు తమ ప్రభువుకు భయపడేవారికి, వాటి వ్రాతలలో మార్గదర్శకత్వం మరియు కారుణ్యం ఉన్నాయి.}[79] అల్లాహ్ ఈసా అలైహిస్సలాం గురించి తెలుపుతూ చెప్పాడు :- {మేము అతన్ని జనుల కోసం ఒక సూచనగా మా ప్రత్యేక కృపాగా చేయదలిచాము}[80] మరియు సాలెహ్ అలైహిస్సలాము గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:- {ఓ నా జాతీప్రజలారా మీరేచెప్పండి,నేను నా ప్రభువు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉన్నాను, ఆయన నాకు నా కారుణ్యాన్నికూడా ప్రసాదించిఉన్నాడు}[81] మరియు దివ్యగ్రంధం ఖుర్ఆను గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు {మేము అవతరింపజేసే ఈ ఖుర్'ఆను'విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత కారుణ్య ప్రదాయిని }[82]
ఏడవది: ఆ మార్గం అల్లాహ్ ధర్మశాస్త్రానికి మార్గదర్శకత్వం చేయాలి,మరియు అతని నుండి అల్లాహ్ ఏమి కోరుకుంటున్నాడో సూచించాలి మరియు అతను ఎక్కడ నుండి వచ్చాడు ?అతని గమ్యం ఏమిటో ఎక్కడ ఉంది? అని స్పష్టపర్చాలి. మరియు తౌరాతు గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు! {మేము తౌరాతు గ్రంధాన్ని అవతరింపజేశాము అందులో మార్గదర్శకత్వము,జ్యోతి ఉండేవి'...}[83] మరియు ఇంజీలు గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు {మేము అతనికి ఇంజీలు గ్రంథాన్ని వొసగాము అందులో మార్గదర్శకత్వము,జ్యోతి ఉండేవి }[84] మరియు ఖుర్ఆను దివ్యగ్రంధం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు {ఆయనే తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్నిసత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు}[85] సత్యధర్మం అనేది అల్లాహ్ ధర్మశాస్త్రానికి మార్గదర్శకత్వం చేస్తుంది మరియు మనసుకు శాంతి,ప్రశాంతతను చేకూరుస్తుంది,చెడు ప్రేరేపణలన్నింటి నుండి రక్షిస్తుంది, అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది మరియు ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది.
ఎనిమిది:- ఈ ధర్మం ఉత్తమ కర్మల కై,ఉత్తమ నైతికత వైపుకు పిలుపునివ్వాలి,అనగా’-సత్యం,న్యాయం,నిజాయితీ, నమ్రత, పవిత్రత మరియు ఔదార్యం లాంటి పనులవైపుకు పిలవాలి.తల్లిదండ్రులకు అవిధేయత, అమాయక ప్రజలను అన్యాయంగా చంపడం, అన్నిరకాల అనైతికతలు,అబద్ధాలు,అన్యాయం,దౌర్జన్యం,తిరుగుబాటు,లోభత్వం మరియు పాపాలు వంటి చెడు ప్రవర్తనలను కూడా ఇది నిషేధించాలి.
తొమ్మిది:-దీనిని విశ్వసించిన వారికి ఆనందాన్ని అందించగలగాలి. అల్లాహ్ తఆలా ఇలా చెప్పాడు :- తాహా [86] {మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు}[87] మరియు ఈ ధర్మం సహజస్వభావానికి అనుగుణంగా ఉండాలి {అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే(ఉండండి). సరైన బుద్దికి అనుగుణంగా ఉండాలి ఎందుకంటే సత్యధర్మం అనేది'అల్లాహ్ ధర్మశాస్త్రం'మరియు సరైన బుద్ది అల్లాహ్ సృష్టితము కనుక [ఈ రెండింటిమధ్య] సరైనబుద్దికి మరియు అల్లాహ్ ధర్మశాస్త్రం పరస్పరం విభేధించడం అసంభవం.
పది: ఇది న్యాయాన్ని సూచించాలి అన్యాయాన్నిఖండించాలి,సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేయాలి,అపమార్గానికి వ్యతిరేకంగా హెచ్చరించాలి, ప్రజలను తప్పుడు మార్గాల నుండి వంకరమార్గాల నుండి కాపాడుతూ ఋజుమార్గం వైపుకు మార్గదర్శనం చేయాలి.అల్లాహ్ జిన్నాతుల గురించి తెలుపుతూ అవి ఖుర్ఆను గ్రంధం విన్నప్పుడు పరస్పరం చెప్పుకున్న విషయాల గురించి తెలియజేశాడు :- {వారు (జిన్నాతులు) ఇలా అన్నారు: "ఓ మా జాతివారలారా! వాస్తవంగా మేము మూసా తరువాత అవతరింప జేయబడిన ఒక గ్రంథాన్ని విన్నాము. అది దానికి పూర్వం వచ్చిన దానిని (తౌరాత్ ను) ధృవీకరిస్తుంది; సత్యం వైపునకు మరియు ఋజుమార్గం (ఇస్లాం) వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది".}[88] మరియు వారి దౌర్భాగ్యానికి దారితీసే విషయాల వైపుకు వారిని పిలువకూడదు:- {తాహా [89]. {మేము ఈ ఖుర్ఆన్ ను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి కాదు.}[90] మరియు వారి వినాశనానికి దారితీసే విషయాలను ఆదేశించకూడదు :- {మరియు మిమ్మల్ని మీరు హతమార్చుకోకండి'నిశ్చయంగా అల్లాహ్ మీ పై అమితమైన దయగలవాడు }[91] మరియు అది తన అనుయాయుల మధ్య లింగం,రంగు,తెగల ఆధారంగా బేధాభావాలు చూపకూడదు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు} కనుక సత్యధర్మంలో ఒకరిపై మరొకరికి విశీష్టత ,ప్రతిష్టల గీటురాయి'అల్లాహ్ యొక్క తక్వా'యే[అల్లాహ్ భయభీతి]
నిజమైన సత్యధర్మం మరియు కల్పితమైన తప్పుడు ధర్మాల మధ్య తేడాను గుర్తించే ప్రమాణాలను -దివ్యఖుర్ఆను గ్రంధం లో ప్రస్తావించబడిన ఆయతులను సాక్ష్యంగా ఇక్కడ సూచించాను,ఇవి అల్లాహ్’తఆలా పంపిన సత్యవంతులైన ప్రవక్తలందరి విషయంలో ఈ ప్రమాణాలు సర్వసాధారణమైనవని రుజువు పరుస్తున్నాయి,-వీటి ప్రస్తావన తరువాత మతాల యొక్క రకాలను పేర్కొనడం చాలా సముచితమని నేను భావిస్తున్నాను.
మతపరంగా మానవాళి రెండు రకాలుగా విభజించబడింది:-
ఒకటి: ’అల్లాహ్ వైపునుంచి ఆకాశ గ్రంధం ఇవ్వబడినవారు- యూదులు, క్రైస్తవులు మరియు ముస్లిములు,/యూదులు మరియు క్రైస్తవుల విషయానికొస్తే,వారి పుస్తకాలలో ఉన్నవాటి ప్రకారం ఆచరించకపోవడంవల్ల; అల్లాహ్’ను వదిలి మనుషులను దేవుళ్ళుగా చేసుకోవడం మరియు చాలా కాలం గడిచిపోయినందువల్ల. ప్రవక్తలపై అవతరించిన వారి పుస్తకాలు పోయాయి; కాబట్టి యూదపండితులు వారి కోసం పుస్తకాలను రచించి అవి అల్లాహ్ నుండి అవతరించబడినవని పేర్కొన్నారు.వాస్తవానికి అవి అల్లాహ్ వైపునుంచి రాలేదు, హద్దుమీరిన మతోన్మాదుల వక్రీకరణ మరియు అబద్ధాలకోరుల తప్పుడు కథనాలు మాత్రమే.
ముస్లింల పుస్తకం (ఖుర్ఆనుల్అజీం) విషయానికొస్తే,ఇది అల్లాహ్'నుంచి అవతరింపబడిన చిట్టచివరి దైవగ్రంధం, అల్లాహ్ దీని సంరక్షణకై బాధ్యత తీసుకున్నాడు మానవజాతికి దాని రక్షణ భాధ్యతను అప్పగించలేదు.అల్లాహ్ ఇలా చెప్తున్నాడు:- {మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని సంరక్షిస్తాము}[92] ఖుర్ఆన్ ప్రజల హృదయాలలో మరియు పుస్తకంలో భద్రపరచబడింది, ఎందుకంటే ఇది మానవజాతి మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ దింపిన చిట్టచివరి పుస్తకం. ఆయన దీనిని ప్రళయం వరకు వారి గురించి చెప్పేసాక్ష్యంగా చేసాడు మరియు దానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించాడు.ప్రతీయుగంలో దాని హద్దులను,అక్షరాలను కనిపెట్టుకునేవారిని,తన ధర్మశాస్త్రం ప్రకారంగా ఆచరించేవారిని విశ్వసించేవారిని’-బోధించేవారిని సిద్దంచేశాడు. మరిన్ని వివరాలు ఈ పుస్తకంలో రాబోయే పేరాల్లో వస్తున్నాయి [93]
ఇక రెండవవర్గం:-వీరి వద్ద అల్లాహ్ నుంచి దిగిన ఎటువంటి ఆకాశ గ్రంధం లేదు,కానీ తమ మత స్థాపకులకు ఆపాదించబడిన వారసత్వ పుస్తకాలను కలిగి ఉన్నారు,వారిలో’హిందువులు,మజూసీలు(అగ్నిభక్తులు)బౌద్దులు కన్ఫ్యూషియన్లు మరియు అరబ్బులు',వీరు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ రాకకు మునుపుగలవారు.
ప్రతీ జాతిప్రజలకు వారికి అవసరమయ్యే ప్రాపంచిక ప్రయోజనాలను పొందటానికి కావలిసిన జ్ఞానం,ఆచరణ ఇవ్వబడ్డాయి,ప్రతీ మనిషికి అల్లాహ్ చేసిన మార్గదర్శనాల్లో ఇదీ ఒక సాధారణ మార్గదర్శకత్వం,అంతేకాదు ప్రతీ జంతువుకు ఈ జ్ఞానం మార్గదర్శకం చేయబడింది,తినడానికి త్రాగడానికి వాటికి ప్రయోజనకరమైన వాటిని పొందడానికి మరియు హాని కలిగించేవాటి నుండి రక్షించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మరియు అల్లాహ్ వాటిలో ప్రయోజనకరమైనవాటి పట్ల ప్రేమను,హానికారకాల పట్ల ద్వేషాన్నిసృష్టించాడు: అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {అత్యున్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు!}[94] {ఆయనే (ప్రతిదానిని) సృష్టించాడు మరియు తగిన ప్రమాణంలో రూపొందించాడు.}[95] మరియు ఆయన నిర్దారించాడు,పిదప మార్గం చూపించాడు'[96] మరియు మూసా అలైహిస్సలాం ఫిరౌన్ గురించి ఇలా తెలియజేశాడు. {నా ప్రభువు ప్రతీ వస్తువుకు సృష్టి నొసగాడు మరియు మార్గంచూపాడు}100 మరియు ఇబ్రాహీం ఖలీల్ అలైహిస్సలాం ఇలా తెలిపారు {ఆయనే నన్ను సృష్టించాడు.ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు.} ప్రతీ బుద్దిమంతుడు - కొంచం తెలివి,ఆలోచన ఉన్నవాడు,-ఈ విషయ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అది’-ధర్మాన్ని అనుసరించే వ్యక్తులు ఇతర నాస్తికుల కంటే జ్ఞానంలో,సత్కర్మలలో సంపూర్ణులు’గా ఉన్నారు,మరియు ఇస్లామేతరుల వద్ద లభించే మంచి కంటే ఎక్కువగా ముస్లిముల వద్ద లభించే లాభం ఎక్కువ సంపూర్ణంగా ఉంటుంది,ధార్మికవ్యక్తుల వద్ద ఉన్నది అన్యుల వద్ద లేదు!కనుక జ్ఞానం మరియు ఆచరణలు రెండు రకాలు:-
మొదటిది :- ‘తెలివితేటల’ ద్వారా సాధించే జ్ఞానం-అనగా’ ఖగోళ శాస్త్రం,వైద్య శాస్త్రాలు మరియు వృత్తివిద్యా వంటివి,ధార్మికులు,మతాల అనుచరులు మరియు నాస్తికులు ఈ వస్తువుల జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ; ధార్మికులు,మతాల అనుచరులు మాత్రం అందులో పరిపూర్ణతను కలిగి ఉంటారు కానీ కొన్ని విషయాల జ్ఞానాన్ని బుద్ది ద్వారా సాధించలేము,అనగా’ –దైవశాస్త్రాలు,మతశాస్త్రాలు,ఈ రకమైన జ్ఞానం ప్రత్యేకంగా ధర్మ అనుయాయులకు మాత్రమే ఉంటుంది.ఇందులో కొన్ని విషయాలు [లాజికల్’గా] తార్కిక సాక్ష్యాల ద్వారా నిరూపించబడవచ్చు! తార్కిక సాక్ష్యాలు ఎలా రుజువు చేయాలన్నది కూడా దైవప్రవక్తలు మనుషులకు మార్గనిర్దేశం చేశారు;ఇది షరీఅతుబద్దమైన తార్కిక శాస్త్రం.
రెండవది:- దైవప్రవక్తలు ఇచ్చిన సమాచారం ద్వారా మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందగలము తప్ప బుద్దిని ఉపయోగించి తెలుసుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు,ఆ విషయాలు;అల్లాహ్ మరియు ఆయన నామాలు గుణగణాల గురించి,పరలోకంలో దైవ అనుయాయులకు గల శాశ్వత అనుగ్రహాలు తిరస్కారులకు ఎదురయ్యే శిక్షల సంభందిత విషయాల గురించి,షరీఅతు ధర్మశాస్త్రం గురించి,గతించిన ప్రవక్తలు వారి అనుచర సమాజ చరిత్రలు మొదలైనవి.[97]
పెద్దమతాలు,వాటి పురాతన పుస్తకాలు మరియు పురాతన చట్టాలు పనికిమాలిన వారికి,మోసగాళ్ళకు సులభమైన వేటగా మారాయి,వక్రీకరించేవారికి,కపటవాదులకు ఆటవస్తువుగా మరియు రక్తపాత సంఘటనలకు మరియు మహావిపత్తులకు ఎరగా మారాయి,చివరికి అవి తమ ఆత్మను మరియు ఆకారాన్ని కోల్పోయాయి,ఒకవేళ ఈ పురాతన పుస్తకాల అనుయాయులను,వారివద్దకి వచ్చిన ప్రవక్తలను తిరిగి బ్రతికిస్తే ఖచ్చితంగా వారు వీటిని ఖండిస్తారు మరియు వాటిపట్ల అజ్ఞానతను ప్రదర్శిస్తారు.
యూదమతం [జుడాయిజం]- [98] పారంపర్య ఆచారాల,సంప్రదాయాల ఒక సమూహంగా మారింది,అందులో ఎటువంటి ఆత్మ,ప్రాణం గాని లేవు మరియు ఇది ఒక నిర్దిష్ట జాతికి నిర్దారీత వ్యక్తులకు సంబంధించిన మతం, ప్రపంచానికి ఇది ఎటువంటి సందేశాన్ని ఇవ్వదు,సముదాయాలకు జాతులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వదు మరియు మానవాళి పట్ల దీనికి ఎటువంటి దయ లేదు.
నిశ్చయంగా ఈ మత మూలవిశ్వాసంలో కల్పితాలు మార్పులు చోటుచేసుకున్నాయి ఆ మూలాలు ఇతర మతాలు మరియు జాతుల మధ్య ఒక గొప్ప చిహ్నంగా ఉండేవి మరియు అందులో గౌరవసంకేతాలుగా సూచించబడేవి.ఇది ఇబ్రాహీం మరియు యాఖూబ్ అలైహిముస్సలాం తన సంతానానికి ప్రభోదించిన తౌహీద్ ఏకత్వపు విశ్వాసం. యూదులు తమ ఇరుగుపొరుగున జీవించే అసత్య మతసముదాయాల విశ్వాసాలను లేదా ఎవరి అధికారం కింద వీరులోబడి ఉన్నారో వారి అనేక విశ్వాసాలను స్వీకరించారు,మరియు అజ్ఞాన కాలంనాటి విగ్రహారాధకుల ఆచారాలు మరియు సంప్రదాయాలను కూడా స్వీకరించారు. నిష్పాక్షికమైన యూద చరిత్రకారులు దీనిని ధృవీకరించారు.యూద ఎన్సైక్లోపీడియాలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి.
{"విగ్రహాలను, తప్పుడు మిథ్యాదైవాలను ఆరాధించడం ఇశ్రాయీలీయుల హృదయాల్లోకి చొచ్చుకుపోయిందని మరియు వారు బహుదైవారాధన,మూఢ నమ్మకాలను స్వీకరించారనే విషయాన్ని’ ప్రవక్తల కోపం,విగ్రహారాధకులపై గల ప్రవక్తల ఆగ్రహం సూచిస్తుంది. విగ్రహారాధనలో యూదులకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది’అని తల్మూద్ కూడా సాక్ష్యమిచ్చాడు "] [99]
బాబిల్ ‘తల్మూద్’[100] – యూదులు దీనిని అతిపవిత్రమైనదిగా భావిస్తారు మరియు తౌరాతు కంటే ఎక్కువ ప్రాధాన్యత చూపుతారు,ఇది ఆరవ శతాబ్ద కాలంలో యూదులలో విస్తృతంగా వ్యాపించింది, ఇందులో వారి అజ్ఞానం మందబుద్ది,అసంబద్ధమైన సూక్తులు,అల్లాహ్ పట్ల దురుసు ప్రవర్తన,సత్యాలను తారుమారు చేయడం మరియు ధర్మం మరియు బుద్ది తో ఆటలాడటం వంటి అనేక వింత పైశాచిక ఉదాహరణలు ఉన్నాయి.ఇవి - ఈ యుగంలో యూదసమాజం మేధోపరంగా మరియు మతపరంగా ఎంతవరకు క్షీణించిందో చూపిస్తుంది.[106.][101]
ఇక క్రైస్తవమతం[102]-'విషయానికొస్తే,ఇది తొలికాలం నుండి అతివాదుల వక్రీకరణలు,అజ్ఞానుల మనోవ్యాఖ్యానం, రోమను క్రైస్తవ బహుదైవత్వవాద మార్పులతో మిళితమైంది, ఈ వక్రీకరణలు, మార్పులు మరియు అన్య బహు దైవత్వవాదం కింద'ఈసా యొక్క గొప్పబోధలన్నీఖననం చేయబడిన కుప్పగా మారాయి మరియు తౌహీద్ ఏకత్వం మరియు అల్లాహ్ యొక్క హృదయపూర్వక ఆరాధన యొక్క కాంతి ఈ దట్టమైన మేఘాల వెనుక దాగిపోయాయి.[103]
‘క్రీస్తు శకం నాల్గవ శతాబ్దం చివరి నుండి, త్రిత్వం’ సిద్ధాంతం క్రైస్తవ సమాజంలోకి ఎలా చొచ్చుకుపోయిందో ఒక క్రైస్తవ రచయిత మాట్లాడుతూ ఇలా చెప్పాడు:-
"ఒక దేవుడు మూడు వేర్వేరు దైవాలతో కలిగి ఉంటాడనే నమ్మకం నాల్గవ శతాబ్దం చివరి త్రైమాసికం నుండి క్రైస్తవ ప్రపంచపు అంతర్గత జీవితంలోకి వారి ఆలోచనలలోకి చొచ్చుకుపోయింది, అప్పటినుండి క్రైస్తవ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో అధికారిక గుర్తింపు పొందిన మతంగా మారింది. అలాగే, ట్రినిటీ[త్రిత్వం] అభివృద్ధి మరియు దాని రహస్యం గురించి క్రీ.శ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలోనే తెరలేసింది"[104]"
ఒక క్రైస్తవ చరిత్రకారుడు [“హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ది లైట్ ఆఫ్ మోడరన్ సైన్స్” అనే పుస్తకంలో] క్రైస్తవ సమాజంలో విగ్రహారాధన వివిధ రూపాల్లో,ఆకారాలలో ఉద్భవించడం మరియు మూఢ అనుసరణ లేదా అజ్ఞానం కారణం చేత బహుదైవారాధనలో మునిగిన జాతుల నాయకులను,పండుగలు,మతపరమైన ఆచారాలు,సంప్రదాయాలను స్వీకరించడంలో క్రైస్తవుల వైవిధ్యం గురించి చర్చిస్తూ ఇలా చెప్పాడు.-{ "బహుదైవారాధన ముగిసింది,కానీ పూర్తిగా తొలగించబడలేదు. బదులుగా, ఇది హృదయాలలోకి చొచ్చుకుపోయింది మరియు అందులోని ప్రతిదీ క్రైస్తవమతం పేరిట కొనసాగింది.తమ దేవుళ్ళను,వీరులను విడిచిపెట్టిన వారు తమ అమరవీరులలో ఒకరిని తీసుకున్నారు అతనికి దైవత్వపు గుణాలను ఆపాదించాడు,తరువాత అతని పేరు మీద ఒక విగ్రహాన్ని నిర్మించారు.ఈ విధంగా ఈ షిర్కు బహుదైవరాధన,విగ్రహారాధన స్థానిక అమరవీరుల వైపుకు మరలింది. ఆ శతాబ్దం చివరి నాటికి,వారిలో అమరుల మరియు సత్పురుషులు,సాధువుల ఆరాధన అంతటా వ్యాపించింది,మరియు సాధువులు దివ్యగుణాలను,లక్షణాలను కలిగి ఉన్నారని బోధించే ఒక నూతన విశ్వాసంగా ఉద్భవించింది.పిదప ఈ సాధువులు మరియు పవిత్రపురుషులు దైవానికి మరియు మనిషి మధ్య మధ్యవర్తులుగా మారిపోయారు మరియు పురాతన బహుదైవారాధక పండుగల పేర్లు నూతన పేర్లతో మార్చబడ్డాయి,చివరికి క్రీ శ 400’సంవత్సరంలో పురాతన సూర్య పండుగ’ ఈసా జయంతి’ క్రిస్మస్’గా మారిపోయింది”.
మజూసీలు {పారసీలు} పూర్వకాలం నుంచే ప్రకృతిని ఆరాధించేవారు,అందులో పెద్దది అగ్ని,చివరికి వారు అగ్ని ఆరాధనతోనే అతుక్కుపోయారు,దానికోసం వారు ఆలయాలు,కట్టడాలు నిర్మించసాగారు. తద్వారా వారి దేశంలోని అన్నీ ప్రదేశాలలో ‘అగ్నిమండపాలు,ఆలయాలు’విస్తృతంగా వ్యాపించాయి మరియు అగ్ని ఆరాధన మరియు సూర్యుని పవిత్రత తప్ప మిగతా అన్ని మతాలు,విశ్వాసాలు కనుమరుగయ్యాయి. మతం వారి దృష్టిలో ‘ప్రత్యేక ప్రదేశాలలో నిర్వహించే సంప్రదాయాలు మరియు ఆచారాలు' మాత్రమే.[105]
‘ఇరాన్ ఫీ అహ్’దిస్సాసానీన్’["ఇరాన్ ఇన్ ది సాసానియన్ ఎరా"]డెన్మార్క్ రచయిత ‘ప్రొఫెస్సర్ ఆర్ధర్ క్రిస్టన్ సేన్’ధార్మిక నాయకుల వర్గం మరియు వారి కార్యకలాపాల గురించి వర్ణిస్తూ ఇలా తెలిపారు:-
[ఈ నాయకులపై రోజుకు నాలుగు సార్లు సూర్యుడిని ఆరాధించడం అనివార్యం, మరియు దానితో పాటు చంద్రుడిని, అగ్నిని, నీటిని కూడా ఆరాధించాలి, వీరికి ఇలా ఆదేశించబడింది:- అగ్నిని ఆర్పివేయమని పిలువకూడదు, మరియు అగ్ని నీరు పరస్పరం కలువకూడదు, మరియు ఇనుముకు తృప్పు పట్టనివ్వకూడదు ఎందుకంటే ఈ ఖనిజం వారి దృష్టిలో చాలా పవిత్రమైనది.]112
వారు ప్రతి యుగంలో ద్వంద్వదైవత్వాన్ని విశ్వసించేవారు మరియు ఇది వారి చిహ్నంగా మారింది,మరియు వారు రెండు దేవతలను విశ్వసించారు,వాటిలో ఒకటి ‘జ్యోతి’ లేదా ‘మంచి’దైవం,మరియు వారు దీనిని "ఆహ్వార్ మజ్దా' లేదా 'యజ్దాన్' అని పిలుస్తారు మరియు రెండవది ‘చీకటి’ లేదా ‘చెడుదైవం అతను"అహుర్’మన్" మరియు వారి మధ్య సంఘర్షణ,యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంది[106].
బౌద్ధమతం,భారతదేశం మరియు మధ్య ఆసియాలో విస్తృతంగా వ్యాపించే మతం,ఇది విగ్రహారాధకమతం, దీని అనుచరులు ఎక్కడికి వెళ్లినా విగ్రహాలను వెంట తీసుకువెళతారు.వెళ్ళినచోటల్ల ఈ విగ్రహాల కోసం దేవాలయాలను నిర్మిస్తారు “బుద్ధుడి” విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.[107]
బ్రాహ్మణవాదం – భారతదేశంకు చెందిన మతం - ఇది అనేక దేవుళ్ళకు,దేవతలకు ప్రసిద్ది చెందింది.క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో విగ్రాహారాధన చాలా ఎత్తుకు చేరుకుంది,కాబట్టి ఈ శతాబ్దంలో దేవతల సంఖ్య 330 మిలియన్లకు చేరుకుంది [115’] ప్రతి మంచివస్తువు, ప్రతి భయంకర వస్తువు మరియు ప్రతి ఉపయోగకర వస్తువు దైవంగా మారింది,మరియు ఈ యుగంలో విగ్రహాలు చెక్కే పరిశ్రమ బాగా వృద్దిచెందింది,మరియు అందులో కళాకారులు తమ హస్తకళను ప్రదర్శించేవారు.
హిందూ రచయిత్రి ‘సి.వి- విద్యా తన పుస్తకం”తారీఖుల్ హింది అల్ వుస్తా’{మధ్యకాలీన భారత చరిత్ర}లో ‘హరీష్ రాజు యొక్క శాసన కాలం’{క్రీ పూ -606-648} అంటే అరేబియా ద్వీపకల్పంలో ఇస్లాం ఉదయించిన యుగం‘లో మాట్లాడుతూ ఇలా చెప్పింది:-
["హిందూ మతం మరియు బౌద్ధమతం రెండు సమానమైన విగ్రహారాధక మతాలు,అయితే బౌద్ధమతం విగ్రహారాధనలో హిందూ మతాన్ని అధిగమించింది.మొదట్లో ఈ మతం–బౌద్ధమతం-దేవుని ఉనికిని తిరస్కరించింది,కానీ క్రమంగా బుద్ధుడిని ఒక పెద్ద ఆరాధ్యుడిగా నిలబెట్టింది.} ఇది తరువాత ‘బోధిస్తావాస్’[Bodhistavas] వంటి ఇతర దైవాలను జోడించింది.భారతదేశంలో విగ్రహారాధన గరిష్ట స్థాయికి చేరుకుంది,తద్వారా ‘బుద్ధ’[Buddha] అనే పేరు కొన్ని తూర్పుదేశ బాషల్లో ‘విగ్రహానికి’ మారుపేరుగా’పర్యాయపదంగా మారింది”.
ప్రపంచం అంతటా విగ్రహారాధన విస్తృతంగా వ్యాపించిందనడంలో సందేహం లేదు,ఎందుకంటే అట్లాంటిక్ సముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు ప్రపంచం మొత్తం విగ్రహారాధనలో మునిగిపోయింది, క్రైస్తవ మతం, సామీయ్య’ మరియు బౌద్ధమతం విగ్రహాలను గౌరవించడం మరియు కీర్తించడంలో పోటీ పడసాగాయి చివరికి ఒక మైదానంలో పరిగెత్తుతున్న‘పందెపు గుర్రాల్లా’ అవి కనబడసాగాయి[108].
మరో హిందూ రచయిత్రి తన పుస్తకం“అల్ హిందూకియ్యతుస్సాయిదాతు”లో ఇలా అన్నారు.{ విగ్రహాలను తయారుచేసే ప్రక్రియా }ఇంతటితో ఆగలేదు,ముగియలేదు,వేర్వేరు చారిత్రక కాలాల్లో ఉన్న 'దేవతల సముదాయంలో' చిన్న విగ్రహాలు అధిక సంఖ్యలో చేరడం కొనసాగించాయి, చివరికి అవి అసంఖ్యాక,లెక్కలేనన్ని దైవాలుగా మారాయి}.[109]
ఇది ప్రపంచ మతాల దుస్థితి ఇక నాగరిక దేశాల విషయానికొస్తే, అవి గొప్ప ప్రభుత్వాలను స్థాపించాయి,అనేక శాస్త్రాలు అభివృద్ధి చెందాయి మరియు పరిశ్రమలకు మరియు కళలకు కేంద్రంగా ఉన్నాయి. ఈ దేశాలలో మతాలు,ధర్మాలు నిర్మూలించబడ్డాయి; అవి వారి మూలాన్ని మరియు శక్తిని కోల్పోయాయి,ఇందులో నీతివంతమైన సంస్కర్తలు మరియు బోధకులు కనుమరుగయ్యారు, ఇక్కడ నాస్తికత్వం బహిరంగంగా ప్రకటించబడింది,అన్నీ రకాల అవినీతి విస్తరించింది, అన్ని ప్రమాణాలు మార్చబడ్డాయి మనిషి హీనుడుగా విలువ లేనివాడుగా మారిపోయాడు.అందుకే ఆత్మహత్యలు పెరిగాయి, కుటుంబ సంబంధాలన్నీ త్రెంచచబడ్డాయి, సామాజిక సంబంధాలు అస్తవ్యస్తమయ్యాయి, మానసిక చికిత్సా కేంద్రాలు రోగులతో నిండిపోయాయి మోసగాళ్ళు ఎక్కువయ్యారు,అందులో మనిషి ప్రతీ రకమైన ఆహ్లాదాన్ని పొందసాగాడు,నూతన ఆవిష్కారాలు కనుగున్నాడు, ధర్మాన్ని, మతాన్ని అనుసరించసాగాడు ఇదంతా తన ఆత్మయొక్క దాహాన్ని తీర్చుకోవడానికి, మనసుకు శాంతి చేకూరాలని చేయబడింది,కానీ ఈ మతాలు మరియు సిద్ధాంతాలన్నీ అతని కోసం ఈ లక్ష్యాలను సాధించడంలో విఫలమయ్యాయి. మరియు అతను తన సృష్టికర్తతో సంబంధాన్ని ఏర్పరుచుకుని, ఆయన తనకోసం ఇష్టపడ్డ విధంగా తన ప్రవక్తలకు ఆదేశించి చూపిన ప్రకారంగా ఆరాధించనంత వరకు ఈ మానసిక దుఖంలో మరియు మనోవేధనలో జీవనం కొనసాగిస్తూ ఉంటాడు,తనప్రభువునూ తిరస్కరించి మరొక మార్గదర్శనాన్ని వెతికేవారి కోసం అల్లాహ్ తఆలా స్పష్టంగా ఇలా తెలియజేశాడు:- {మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము}[110] ఈ ప్రాపంచిక జీవితంలో నిజమైన విశ్వాసులకు గల సుఖ శాంతుల గురించి అల్లాహ్ తఆలా తెలుపుతూ ఇలా చెప్పాడు:- ఎవరైతే విశ్వసించి,తమ విశ్వాసాన్ని షిర్క్ తో కలుషితం చేయరో! అలాంటి వారికే శాంతి ఉంది. మరియు వారే సన్మార్గంలో ఉన్నవారు.[111] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు.నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప!ఇదొక ఎడతెగని బహుమానం.}[112]
ఒకవేళ మనం -ఇస్లాం కాకుండా -మతం యొక్క ప్రమాణాలను ఈ మతాలపై వర్తింపజేస్తే'మనకు స్పష్టంగా తెలుస్తుందేమిటంటే ఆ ప్రమాణాలలో చాలా వరకు విషయాలు లేవు అని సంక్షిప్తంగా చెప్పిన విషయాల వెలుగులో తెలుస్తుంది.
ఈ మతాలన్నీటిలో గల అతి పెద్ద లేమి [తౌహీదుల్లాహ్] అల్లాహ్ ఏకత్వవిశ్వాసం.ఈ మతాల అనుయాయులు అల్లాహ్’తో పాటు ఇతర మిథ్యాదైవాలను సాటికల్పించారు, ఈ మార్పుచెందిన కల్పితమైన మతాలు ప్రజలకు ప్రతీ కాలంలో ప్రతీ సమయంలో రక్షించే ఒక మంచి ధర్మశాస్త్రాన్ని, మరియు ప్రజల ధర్మాన్ని ప్రాణాలను, గౌరవాన్ని, సంతానం, సంపదను కాపాడే శాసనాలను అందించలేదు’అలాగే అల్లాహ్ ఆదేశించిన ధర్మశాస్త్రం వైపుకు మార్గదర్శనం చేయలేదు, మరియు అవి వైరుద్యాలు, విబేధాలు చోటు చేసుకున్నందువల్ల తమ అనుయాయులకు, శాంతిని, ప్రశాంతతను ప్రదానం చేయలేకపోయాయి.
ఇక ఇస్లాం విషయాని కొస్తే, ఇస్లాం'యే సత్యమైన ధర్మం మరియు అల్లాహ్ తనకోసం మరియు సర్వమానవాళి కోసం ఈ ధర్మాన్ని ఎన్నుకున్నాడనే విషయాన్ని మీరు రాబోయే అధ్యాయాలలో తెలుసుకుంటారు.
ఈ పేరాగ్రాఫ్ చివర్లో ‘ఈ క్రింది విషయాలను తెలియజేయడం సముచితమని మేము భావిస్తున్నాము అవి: దైవదౌత్యపు వాస్తవికత,దాని సూచనలు,మానవాళికి దైవదౌత్యపు ఆవశ్యకత మరియు దైవప్రవక్తల దావతు మూలసూత్రాలను మరియు చిట్టచివరి శాశ్వత దైవదౌత్య వాస్తవికత.
ఈ జీవితంలో మనిషి తెలుసుకోవలసిన అనివార్యమైన జ్ఞానాలల్లో ఒక గొప్ప విషయం ఏమిటంటే,అతను తన ప్రభువు గురించి తెలుసుకోవాలి,అతన్ని లేమి నుంచి సృష్టించి,అనేక శుభాలను అనుగ్రహించాడు.ఈ మహా సృష్టిని అల్లాహ్ సృష్టించడానికి గల ప్రధాన కారణం‘పరమపవిత్రుడైన అల్లాహ్’ను మాత్రమే ఆరాధించాలి.
అయితే ఇక్కడ ఒక ప్రశ్నలేస్తుంది ఏమిటంటే‘మనిషి తన ప్రభువు గురించి నిజమైన జ్ఞానాన్నిఎలా తెలుసుకోవాలి?. మరియు అతని పై గల విధులు మరియు హక్కులు ఏమిటి?ఎలా తన ప్రభువును ఆరాధించాలి? నిశ్చయంగా మనిషి తనకు కష్టకాలంలో సహాయం చేసినవాడిని అతనికి లాభం చేకూర్చిన వాడిని పొందగలడు ఉదాహరణ;వ్యాధికి చికిత్స చేయడం,అతని కోసం మందును సిద్దంచేయడం,ఇల్లు నిర్మించడంలో అతనికి సహాయం చేయడం లాంటివి. కానీ వీరందరిలో ప్రభువు గురించి అతనికి పరిచయం చేసే వ్యక్తిని,ప్రభువును ఎలా ఆరాధించాలి?అని బోధించేవ్యక్తిని మాత్రం పొందలేడు ఎందుకంటే ‘ప్రభువు’[అల్లాహ్]వారి నుంచి ఏమి కోరుకుంటున్నాడు?అనే విషయాన్ని‘బుద్ది’స్వతహాగా తెలుసుకోవడం అసంభవం,ఎందుకంటే బుద్ది తనలాంటి ఎదుటి మనిషి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోలేని దీన స్థితిలో,బలహీన స్థితిలో ఉంది,మనిషి కోరిక గురించి చెప్పడమే ఆసాధ్యమైనప్పుడు ఇక అల్లాహ్ ఉద్దేశ్యం మరియు కోరిక ఏమిటో ఎలా తెలుసుకోగలడు,అయితే ఈ విషయాన్ని అల్లాహ్ తన సందేశాలను ప్రజలకు బోధించడానికి ఎన్నుకున్నసందేశహరులు మరియు ప్రవక్తల కోసం మాత్రమే ప్రత్యేకించాడు, వీరి తరువాత మార్గదర్శనం పొందిన ఇమాములు,ప్రవక్తల అనుయాయులకు ఇచ్చాడు వీరు ప్రవక్తల విధివిధానాలను అనుసరిస్తూ,వారి లక్ష్యాలను మిషన్’ను[దృక్పథాన్ని] ప్రజలకు బోధిస్తూ ప్రచారం చేస్తారు. ఎందుకంటే మనిషి ప్రత్యక్షంగా అల్లాహ్ నుండి సందేశాలను పొందటం అసంభవం వారిలో అంతటి శక్తి సామర్థ్యాలులేవు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. {మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు.}[113] ఖచ్చితంగా అల్లాహ్ షరీఅతు’ను ప్రజలకు భోధించడానికి ఒక మధ్యస్థుడు,ప్రచారకుడి అవసరం ఉంది, ఈ మధ్యస్తులు, ప్రచారకులనే ’దైవప్రవక్తలు మరియు సందేశహరులు అంటారు, అల్లాహ్ సందేశాన్ని దైవదూత దైవప్రవక్తకు చేరుస్తాడు అప్పుడు వారు ఆ సందేశాన్ని ప్రజలకు భోదిస్తారు,అంతేతప్ప దైవదూతలు స్వయంగా ప్రజలకు సందేశాలను భోధించరు. ఎందుకంటే దైవదూతల లోకం బౌతికంగా మనుషుల లోకానికి చాలా భిన్నంగా ఉంటుంది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్'యే దైవదూతల నుండి మరియు మనుషుల నుండి సందేశహరులను ఎన్నుకుంటాడు}[114]
పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క వివేక మర్మం ఈ విషయాన్ని తీర్పుచేసింది’సందేశహరుడు ఎవరివైపుకు పంపబడుతున్నాడో వారికోవకు చెందినవాడై ఉండాలి’తద్వారా ప్రజలు అతని మాటలను అర్ధంచేసుకుంటారు మరియు అతనితో ముఖాముఖీ సంభాషిస్తూ,మాట్లాడుతూ అవగాహనం చేసుకుంటారు. ఒకవేళ దైవప్రవక్తలను దైవదూతల కోవ నుంచి పంపితే ప్రజలు అతన్ని ఎదుర్కోలేరు మరియు అతని నుండి సందేశాలను పొందలేరు.[115] అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు వారు: "ఇతని వద్దకు (ప్రవక్త వద్దకు) ఒక దైవదూత ఎందుకు దింప బడ లేదు?" అని అడుగుతారు. మరియు ఒకవేళ మేము దైవదూతనే పంపి ఉంటే! వారి తీర్పు వెంటనే జరిగి ఉండేది. ఆ తరువాత వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడి ఉండేది. కాదు.}[116] {మరియు ఒక వేళ మేము దైవదూతను అవతరింపజేసినా, అతనిని మేము మానవ రూపంలోనే అవతరింపజేసి ఉండేవారం. మరియు వారు ఇపుడు ఏ సంశయంలో పడి ఉన్నారో! వారిని ఆ సంశయానికే గురి చేసి ఉండేవారం.}[117] అల్లాహ్ సెలవిచ్చాడు:- {మరియు మేము మీకు ముందు పంపిన ప్రవక్తలందరూ నిస్సందేహంగా బోజనం చేసేవారు,బజారుల్లో సంచరించేవారు...} ఆపై సెలవిచ్చాడు {మరియు మమ్మల్ని కలుసుకోవలసి ఉందని ఆశించనివారు ఇలా అన్నారు:"దైవదూతలు మా వద్దకు ఎందుకు పంపబడలేదు? లేదా మేము మా ప్రభువును ఎందుకు చూడలేము?" వాస్తవానికి, వారు తమను తాము చాలా గొప్పవారిగా భావించారు మరియు వారు తలబిరుసుతనంలో చాలా మితిమీరి పోయారు.}
మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు:- {మీకు ముందు కూడా మేము పురుషులనే ప్రభవింపచేసాము వారివైపునకు మేము దైవవాణిని అవతరింపచేసాము}[118] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- [మరియు మేము ప్రతీ ప్రవక్తను అతని జాతి భాషలోనే పంపాము తద్వారా అతను వారికి స్పష్టంగా ప్రభోధిస్తాడు}[119] ఈ ప్రవక్తలు మరియు సందేశహరులంతా సంపూర్ణబుద్దిగల వివేచనాపరులు, స్వభావికంగా పావనులు ఆచరణలో మాటల్లో సత్యసంధులు, నిర్ధారిత కార్యాలను పూర్తిచేయడంలో నిజాయితీపరులు,మానవచరిత్రను మంటగలిపేచర్యల నుండి సురక్షితమైనవారు, కళ్ళు మరియు స్వభావిక అభిరుచి అసహ్యించుకునే విషయాల నుండి వారి శరీరాలు ఎంతో పవిత్రమైనవి[120] అల్లాహ్ తఆలా వారి వ్యక్తిత్వాలను మరియు ప్రవర్తనలను శుద్దిచేసి పవిత్ర పర్చాడు,అందుచేత వారు ప్రజల్లో అత్యంత నైతిక పరులు, అత్యంత పవిత్రులు మరియు అత్యంత ఔదార్యంగలవారయ్యారు, అల్లాహ్ తఆలా వారిలో ఉత్తమ నైతికత మరియు సంస్కారాలను జమాపర్చాడు. ఎలాగైతే వారిలోని ‘సహనం, జ్ఞానం, కరుణా, ఔదార్యం, గౌరవం, దానగుణం, దైర్యం మరియు న్యాయం వంటి సద్గుణాలను జమాపర్చాడు, దాంతో వారు తమజాతిప్రజల్లో నైతికత మరియు ఆచరణరీత్యా గొప్పప్రత్యేకతను సంతరించుకున్నారు, సాలెహ్ అలైహిస్సలాం జాతిప్రజలు అతనితో చెప్పిన విషయాన్ని అల్లాహ్ ఇలా తెలియజేశాడు:- {వారన్నారు: "ఓ సాలిహ్! ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని (దైవాలను) ఆరాధించకుండా, మమ్మల్ని ఆపదలచుకున్నావా?"}[121] మరియు షుఐబ్ అలైహిస్సలాంతో అతని జాతీప్రజలు ఇలా అన్నారు:- {వారు అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా? (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!"}[122] మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం దైవదౌత్యం పొందడానికి ముందే తన జాతిప్రజల్లో'అల్ అమీను'[నిజాయితీపరుడు] బిరుదుతో ప్రఖ్యాతిగాంచారు,అల్లాహ్'తఆలా ఆయనను ఇలా వర్ణించారు :- {మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!}[123]
అల్లాహ్'సృష్టిలో వీరు మేలైనవారు మరియు ఎన్నుకోబడ్డవారు అల్లాహ్ తఆలా వీరిని తన సందేశాన్ని,తన అప్పగింతను ప్రజలకు చేర్చడానికి ఎన్నుకున్నాడు;అల్లాహ్ ఇలా తెలియజేశాడు:- {అల్లాహ్'కు తన సందేశాన్ని ఎక్కడ పెట్టాలో చాలా బాగా తెలుసు}[124] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు.}[125]
ఈ ప్రవక్తలను మరియు సందేశహరులను అల్లాహ్ సద్గుణాలతో వర్ణించినప్పటికిని,గొప్ప నైతికతతో ప్రఖ్యాతి గాంచినప్పటికినీ వారు కూడా మానవమాతృలే కనుక మనిషికి ఎదురయ్యే సవాళ్ళన్ని వారు ఎదుర్కునేవారు’ అంచేత వారికి ఆకలి దప్పికలు ఉండేవి,వ్యాధులకు గురయ్యేవారు, నిద్రించేవారు, తినేవారు, వివాహమాడేవారు, మరియు చివరికి మరణించేవారు కూడా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా నీవు మరణిస్తావు,మరియు వారు మరణిస్తారు.}[126] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా మేము మీకు మునుపు అనేక ప్రవక్తలను పంపాము,మరియు వారందరిని భార్యలు మరియు సంతానంగలవారుగా చేశాము.}[127]. కొన్నిసార్లు వారు భాధించబడ్డారు మరికొన్నిసార్లు హత్యచేయబడ్డారు ఇంకొన్ని సార్లు ఇంటి నుండి అన్యాయంగా తీసివేయబడ్డారు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు (ఓ ప్రవక్తా!) సత్యతిరస్కారులు,నిన్ను బంధించటానికి నిన్ను హతమార్చటానికి, లేదా నిన్ను వెళ్ళగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని (జ్ఞప్తికి తెచ్చుకో!) వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే కుట్రలు పన్నటంలో అందరి కంటే ఉత్తముడు} కానీ ఇహపరలోకాల్లో అంతిమ ఫలితం,సహాయం,శక్తి వారికోసమే ఉంది:- {ఎవడైతే అల్లాహ్ కు సహాయం చేస్తాడో అల్లాహ్ అతనికి కూడా ఖచ్చితంగా సహాయం చేస్తాడు}[128] అల్లాహ్ సెలవిచ్చాడు: {"నిశ్చయంగా, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ప్రాబల్యం వహిస్తాము" అని అల్లాహ్ వ్రాసి పెట్టాడు. నిశ్చయంగా, అల్లాహ్ మహాబలశాలి, సర్వశక్తిమంతుడు!}[129][130]
దైవదౌత్యం,ప్రవక్తత అనేది సర్వోన్నతమైన జ్ఞానాన్నితెలుసుకుని స్థాపించడానికి మరియు సర్వశ్రేష్టమైన మహాకార్యాలను ఆచరించే మాధ్యమిక సాధనం కాబట్టి అల్లాహ్ తఆలా దయచూపుతూ ఈ ప్రవక్తల కోసం కొన్ని సూచనలను సిద్దంచేసిపెట్టాడు తద్వారా వీరి వాస్తవికత తెలుస్తుంది మరియు ప్రజలు వారిని గుర్తించి వీటి ద్వారా తెలుసుకుంటారు.ఒకవేళ ఎవడైన ప్రవక్తత గురించి దావా చేస్తే అతనిపై ఈ సంకేతాలు లక్షణాలు మరియు స్థితులు ప్రకటితమవుతాయి ఒకవేళ అతను సత్యుడైతే అతని సత్యసంధతను స్పష్టపరుస్తాయి,ఒకవేళ కాజిబ్ అబద్దాలకోరు అయితే అతని అబద్దాన్ని బహిర్గతం చేస్తాయి. ఈ సూచనలు,గుర్తులు చాలా ఉన్నాయి కానీ అందులో కొన్ని మహత్వపూర్ణమైన ప్రధాన సూచనలు ఇవి:-
1) ప్రవక్తలు ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన వైపుకు పిలుస్తారు మరియు అల్లహ్యేతరుల ఆరాధనను ఖండిస్తారు,ఎందుకంటే ఈ ఉద్దేశ్యం కోసమే అల్లాహ్ సృష్టిని మనిషిని సృష్టించాడు.
2) ప్రజలతో తనను విశ్వసించాలని,సత్యమనినమ్మాలని దైవదౌత్యం ప్రకారం ఆచరించాలని ఆహ్వానిస్తారు, అల్లాహ్ తఆలా తనప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ్ సల్లం'కు ఇలా'చెప్పమని ఆదేశించాడు:- {(ప్రవక్త) చెప్పండి!ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరివైపుకు ప్రభవింపబడిన అల్లాహ్ సందేశహరుడను}[131].
3) అల్లాహ్ ప్రవక్తకు విభిన్నమైన సూచనలతో దైవదౌత్య అద్భుతాల ద్వారా తాకీదు చేస్తాడు, ప్రవక్తలు తెచ్చిన ఈ అద్భుతాలకు సమాధానం చెప్పడానికి లేదా దానిని పోలిన సూచనను తేవడంలో ప్రజలు విఫలమవుతారు అశక్తత చూపుతారు,ఆ అద్భుతాలలో ఒకటి ‘మూసా అలైహిస్సలాం యొక్క కర్ర ‘పాముగా మారడం’ మరియు ఈసా అలైహిస్సలాం'కు గల అద్భుతాలలో ఒకటి 'పుట్టుగ్రుడ్డి వారికి ,కుష్టురోగులకు అల్లాహ్ అనుమతితో స్వస్థత ప్రసాదించేవారు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం కు ఇవ్వబడిన అద్భుతమైన సూచన'అల్ ఖురానుల్ అజీం' ఆయన వ్రాయడం చదవడం తెలియని ఒక నిరక్ష్యరాసుడు,ఇలాంటి ఇంకేన్నో అనేక దైవదౌత్య అద్భుత సూచనలు ఉన్నాయి.
ఈ ప్రమాణాలలో స్పష్టమైన సత్యం ఏమిటంటే దైవప్రవక్తలు సందేశహరులు తీసుకువచ్చినవి,విరోధులు వాటిని ఖండించడం గానీ నిరాకరించడం గానీ చేయలేకపోతారు,అంతేకాదు వారికి దైవప్రవక్తలు తెచ్చినది నిరాకరించలేని సత్యమని'స్పష్టంగా తెలిసి ఉంటుంది.
ఈ ప్రమాణాలలోనే ఒకటి అల్లాహ్ తన ప్రవక్తలకు స్థితిగతుల పట్ల సంపూర్ణత,అందమైన లక్షణాలు,ఉదార స్వభావం,మంచి నైతికత వంటి లక్షణాలతో ప్రత్యేకించాడు.
ఈ ప్రమాణాలలోనే ఒకటి ‘అతని శత్రువులకు వ్యతిరేఖంగా మద్దతు ఇవ్వడం సహాయం చేయడం మరియు అతని దావతు ఆహ్వానాన్ని స్పష్టం చేయడం ఉన్నాయి.
4) అతని సందేశ ఆహ్వానం గడిచిన ప్రవక్తలు,సందేశహరులు ఇచ్చిన మౌలిక సందేశాలతో సరితూగాలి[132]
5) అతను తన ఆరాధన వైపుకుగానీ లేదా ఏదైనా ఆరాధనను తన కోసం చేయాలని ఆహ్వానించకూడదు,మరియు తన తెగను కానీ లేదా సముదాయాన్ని ఎక్కువగా గౌరవించమని ఆహ్వానించకూడదు,-అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్’తో ప్రజలకు సందేశమివ్వమని ఇలా ఆదేశించాడు:- {(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను:"నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దైవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు: "ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు?"}[133]
6) ప్రజలతో తన దావతు ఆహ్వానానికి బదులుగా ప్రాపంచిక వస్తువులను అడగకూడదు,అల్లాహ్ తఆలా తన ప్రవక్తలైన‘నూహ్’హూద్’సాలెహ్’లూత్’షుఐ’బ్ అలైహిముస్సలాం ప్రజలతో చెప్పిన విషయం గురించి తెలుయజేస్తూ ఇలా చెప్పాడు:- {నేను దాని కొరకు మీ నుండి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం సర్వలోకాల ప్రభువు వద్దనే ఉన్నది.}[134] ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను.}[135]
ఇక్కడ మీకోసం ఈ సందేశహరులు మరియు ప్రవక్తలకు చెందిన కొన్ని లక్షణాలు, మరియు ప్రవక్తతకు చెందిన కొన్నిసంకేతాలు ప్రస్తావించాను, నిజానికి అవి చాలా ఎక్కువగా ఉన్నాయి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా మేము ప్రతీ సముదాయంలో ప్రవక్తను ప్రభవింపచేసాము,[ప్రజలారా ]కేవలం అల్లాహ్'ను ఆరాధించండి మరియు తాగూత్(మిథ్యాదైవాలు) కు దూరంగా ఉండండి'[136] నిశ్చయంగా మానవ జాతికి వీరివల్ల గొప్ప సౌభాగ్యం దక్కింది , చరిత్రలో వారి సమాచారాన్ని నమోదు చేయబడింది, వీరి ధర్మశాస్త్రాలు శాసనాలు నిరంతరంగా వర్ణించబడ్డాయి, నిశ్చయంగా అవి సత్యమైనవి మరియు న్యాయబద్దమైనవని చెప్పబడింది,మరియు అల్లాహ్ వీరికి చేకూర్చిన సహాయాన్ని మరియు శత్రువులను నాశనం చేసిన ఘటనలు’నూహ్ [అలైహిస్సలాం] జాతి ప్రజలపై విరుచుకుపడ్డ తూఫాన్’ఫిరౌన్ జలసమాధి’లూత్ జాతి శిక్ష’మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ధర్మ వ్యాప్తిలో శత్రువులపై విజయం మొదలైనవి మరెవరైతే ఈ విషయాలను మంచిగా అర్ధంచేసుకుంటాడో అతనికి సత్యం ప్రస్పుటమవుతుంది నిశ్చయంగా వారు మేలును,హిదాయతు మార్గదర్శనం చేశారు,ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విషయాలు వారికి తెలియజేశారు,హానీ కలిగించే వాటి నుండి హెచ్చరించారు'అందులో మొట్టమొదటి ప్రవక్త నూహ్ అలైహిస్సలాం చిట్టచివర ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివ సల్లం' ప్రవక్తగా పంపబడ్డారు.
ప్రవక్తలు అల్లాహ్ దాసుల వైపుకు పంపబడే సందేశహరులు'వారు అల్లాహ్ ఆజ్ఞలను దాసులకు తెలియజేస్తారు, వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తే అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసిన అనుగ్రహ ప్రసాదాల గురించి వారికి శుభవార్త ఇస్తారు,ఒకవేళ ప్రజలు వారికి అవిధేయత కనబరిస్తే నిత్యశిక్షల గురించి హెచ్చరిస్తారు మరియు గతజాతుల యధార్త కథలను మరియు తమ ప్రభువు ఆజ్ఞలను ధిక్కరించినందు వల్ల ఈ లోకంలో వారికి ఏమి జరిగింది ఎలాంటి శిక్షలు,హింసలు చవిచూశారో వారికి చెప్తారు.
ఈ దైవ ఆజ్ఞలు మరియు నిషేధాలను మానవ తెలివి,వివేకాలు బుద్ది ద్వారా స్వతంత్రంగా తెలుసుకో లేవు, అందుకే అల్లాహ్ మానవాళి కోసం ధర్మశాసనాలను గౌరవార్ధకంగా చేసి ,అతని ప్రయోజనాలను పరిరక్షించడానికి రూపొందించి ఆజ్ఞలు మరియు నిషేధాలను నిర్దేశించాడు. ప్రజలు వారి కోరికలకు కట్టుబడి ఉంటారు, తద్వారా నిషేధించబడిన విషయాలను ఉల్లంఘిస్తారు, ఇతర వ్యక్తులపై దాడి చేస్తారు మరియు వారి హక్కులను స్వాధీనం చేసుకుంటారు. అందువల్ల అల్లాహ్ తన వివేకానుసారం మానవజాతి మధ్య ప్రవక్తలను పంపించాడు, అల్లాహ్ ఆజ్ఞలను వారు గుర్తుచేసేవారు, అవిధేయతకు వ్యతిరేకంగా వారిని హెచ్చరిస్తారు, వారికి ఉపదేశాలు పఠిస్తారు మరియు గత జాతుల కథలను వారికి తెలియజేస్తారు. ఎందుకంటే,అద్భుతమైన కథలు విన్నప్పుడు మరియు అద్భుతమైన భావనలు మనస్సును మేల్కొలిపినప్పుడు,బుద్ది దానిని స్వీకరిస్తుంది,తద్వారా జ్ఞానం పెరుగుతుంది మరియు సరైన విధంగా అవగాహన కలుగుతుంది. ప్రజల్లో ఎక్కువగా వినే మనిషి అంతే ఎక్కువగా విచారిస్తాడు; ఎంత ఎక్కువగా విచారిస్తాడో అంతే ఎక్కువగా అర్ధం చేసుకుంటాడు,ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటాడో అంత ఎక్కువగా జ్ఞానం పెరుగుతుంది, ఎంత ఎక్కువగా జ్ఞానం ఉంటుందో అంత ఎక్కువగా ఆచరిస్తాడు. కాబట్టి, దైవ ప్రవక్తలను పంపడం కంటే మరో మార్గం లేదు మరియు సత్య స్థాపన లో వారికి ప్రత్యామ్నాయం లేదు.[137]
షైఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా [138]:-మనిషికి ప్రాపంచిక,పరలోక జీవిత సాఫల్యం కోసం దైవదౌత్య సందేశం చాలా అవసరం,ఎలాగైతే ఒక వ్యక్తి పరలోక సాఫల్యం కోసం దైవదౌత్యానికి విధేయత చూపడం అనివార్యమో అలాగే ప్రాపంచిక జీవితంలో అతనికి సాఫల్యం లభించాలంటే దైవప్రవక్తల సందేశానికి విధేయత చూపడం అనివార్యం - అందువల్ల, మనిషికి షరీఅతుకు కట్టుబడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతను రెండు కదలికల మధ్య ఉంటాడు,ఒక కదలిక ద్వారా అతను తనకు ఏది ప్రయోజనం చేకూరుస్తుందో పొందుతాడు మరియు రెండవ కదలిక ద్వారా తనకు హాని కలిగించే వాటినుండి రక్షించుకుంటాడు. అల్లాహ్ యొక్క షరీఅతు ఒక జ్యోతి లాంటిది,ఏది వారికి ప్రయోజనకరమైనది మరియు ఏది వారికి హనీ కలిగించేది అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది.అది భూమిపై ప్రకాశించే అల్లాహ్ యొక్క జ్యోతి మరియు తనదాసుల మధ్య ఆయన న్యాయం మరియు అది ఒక కోట అందులో ప్రవేశించినవాడు సురక్షితంగా ఉంటాడు.
అల్లాహ్ షరీఅతుచట్టం అంటే అర్ధం హానికరమైన,ఉపయోగకరమైన వాటి మధ్య వ్యత్యాసం తెలియడం కాదు; ఎందుకంటే జంతువులు కూడా అలా చేయగలవు.గాడిద మరియు ఒంటె బార్లీగింజలు మరియు ఇసుక మధ్య తేడాను గుర్తించగలవు.దీని అర్థం ఏమిటంటే,తన ప్రాపంచిక జీవితంలో మరియు అతని పరలోక జీవితంలో అతనికి ప్రయోజనం చేకూర్చే పనులు మరియు హాని కలిగించే పనుల మధ్యతేడాను గుర్తించగలగాలి,ఈమాను తౌహీదు, న్యాయం, పుణ్యం, ఇహ్సాన్, అమానతు, రక్షణ, దైర్యం, జ్ఞానం, సహనం, మంచివైపుకు ఆహ్వానం, చెడును ఖండించడం, రక్తసంబంధాలను కలుపుకోవడం, తల్లిదండ్రులకు విధేయత చూపడం, పొరుగు వారి పట్ల దయచూపడం, హక్కులు నెరవేర్చడం, అల్లాహ్ కోసం చేసే ఆచరణలు చిత్తశుద్దిని కలిగి ఉండాలి,అల్లాహ్ పై నమ్మకం, ఆయనతో సహాయం కోరడం, ఆయన తఖ్దీరు తీర్పులపై సంతృప్తి చెందటం, ఆదేశాలను స్వీకరించడం, సత్యమని భావించడం, ప్రవక్తలను, వారు చెప్పే సందేశాలను సత్యమని విశ్వసించడం మొదలైనవి దాసుడి కొరకు ప్రాపంచిక జీవితంలో మరియు పరలోక జీవితంలో ప్రయోజనకరమైనవి మరియు లాభదాయకమైనవి, మరియు వీటికి వ్యతిరేఖమైన విషయాలు అతనికి ఇహపరలోకాల్లో కీడును మరియు నష్టాన్ని కలిగిస్తాయి.
ఒకవేళ దైవదౌత్య సందేశం లేకుంటే మనిషిబుద్ది జీవితానికి ఉపయోగపడే ప్రయోజనకరమైన విషయాలు హనీకారకమైన విషయాల గురించి వివరించడం అసంభవం,అల్లాహ్ దాసులకు ప్రసాదించిన అతిపెద్ద అనుగ్రహం ఏమిటంటే తన ప్రవక్తలను ప్రజల వద్దకు పంపించాడు,వారికి దైవగ్రంధాలను నొసగాడు,మరియు వారికి సన్మార్గాన్ని’చూపించాడు. ఒకవేళ అల్లాహ్ ఇలా అనుగ్రహించకపోతే ప్రజలు జంతువులలా మరియు అంతకుమించిన దుర్భరజీవనం గడిపేవారు. మరెవరైతే దైవప్రవక్తల సందేశాన్ని స్వీకరించి దానిని అనుసరిస్తాడో అతను జీవరాసుల్లో అత్యంత మేలైనవాడు,మరెవరైతే వారిని దిక్కరించి తిరస్కరిస్తారో వారు జీవుల్లో అత్యంత హీనులు,కుక్కలు మరియు పందుల అత్యంతహీనస్థితికి దిగజారి ఉంటారు,కాబట్టి నేలపై నివసించేమానవులు ప్రవక్తలను సందేశాలను దృఢంగా పట్టుకోవాలి వారి శ్రేయస్సు ఇందులోనే ఉంది,ఎప్పుడైతే దైవప్రవక్తల అనుసరణ విధేయత అంతమవుతుందో అప్పుడు అల్లాహ్ భూమ్యాకాశాలను సర్వనాశనం చేస్తాడు ప్రళయం సంభవిస్తుంది.
మరియు భూలోకవాసులకు దైవప్రవక్తల అవసరం అనేది సూర్యుడు, చంద్రుడు, గాలి మరియు వర్షం’అవసరం లాంటిది కాదు,మనిషికి ప్రాణం లాంటి అవసరం లేదా కంటికి కాంతి అవసరం వంటిది కాదు;శరీరానికి అన్నపానియాల అవసరం లాంటిది కూడా కాదు,మనిషి ఊహకుచేరే ప్రతీ దానికంటే ఇది ఆవశ్యకరమైనది మహత్వపూర్ణమైనది,దైవప్రవక్తలు అల్లాహ్’కు మరియు దాసులకు మధ్య ఆదేశ,నిషేదాజ్ఞలలో మధ్యవర్తులుగా ఉన్నారు,వారు అల్లాహ్ కు మరియు దాసులకు మధ్య దూతలుగా ఉన్నారు,వారిలో చిట్టచివరివాడు,వారందరికి నాయకుడు,అల్లాహ్ దృష్టిలో వారిలో అత్యంత గౌరవనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం’! అల్లాహ్ ఆయనను సర్వలోకాల కొరకు కారుణ్యమూర్తిగా పంపించాడు,సరైన రుజుమార్గాన్ని అనుసరించేవారికి ఒక రుజువుగా మరియు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరికి సాక్ష్యంగా చేసాడు.ఆయనను అనుసరించడం,ప్రేమించడం,గౌరవించడం మరియు అతని హక్కులను తీర్చమని తన దాసులకు ఆజ్ఞాపించాడు.అల్లాహ్ ఇతర ప్రవక్తలు మరియు సందేశహరుల నుండి అతనిని విశ్వసించాలని ప్రతిజ్ఞలను తీసుకున్నాడు,మరియు నమ్మిన అనుచరుల నుండి అదే ప్రతిజ్ఞను తీసుకోవాలని వారిని ఆదేశించాడు. అల్లాహ్ ఆయనను ప్రళయానికి ముందు శుభవార్తహరునిగా హెచ్చరించేవాడిగా,అల్లాహ్ వైపుకు ఆహ్వానించేవాడిగా,ప్రకాశించే జ్యోతిగా పంపాడు మరియు అతనితో దైవదౌత్యాన్ని ప్రవక్తత ను ముగించాడు, ఆయన ద్వారా ప్రజలకు మార్గదర్శనం చేశాడు, వారిని అజ్ఞానం నుండి రక్షించాడు,ఆయన సందేశం ద్వారా గుడ్డికళ్లను, చెవిటిచెవులను మరియు మూసుకుపోయిన హృదయాలను తెరిచాడు. మరియు ప్రపంచం ఆయన సందేశ జ్యోతితో గాఢాంధకారాల నుంచి ప్రకాశించింది, విడిపోయిన హృదయాలను జోడించాడు, చెడిపోయిన ఉమ్మతునుజాతిని తిరిగి సంస్కరించాడు, స్పష్టమైన ఆధారాలతో వివరించాడు, ఆయన హృదయాన్ని తెరిచాడు మరియు అతని బరువును[పాపాలను] దించేశాడు, ఆయన ఖ్యాతిని పెంచాడు, మరియు ఆయన ఆదేశాన్ని తిరస్కరించినవారి కోసం అవమానకరంగా చేశాడు. ప్రజలు అల్లాహ్ పంపిన గ్రంధాలలోని సందేశాలను మార్పులు చేర్పులు చేసి దైవధర్మాన్ని పూర్తిగా మార్చేసారు, ప్రతీ జాతీ మరియు సముదాయానికి ప్రత్యేకంగా సంప్రాదాయాలు ఉండేవి మరియు వారు అల్లాహ్ గురించి మరియు దాసుల మధ్య తమ అశుద్ద మాటలతో ఇష్టపూరిత తీర్పులు చేసేవారు అప్పుడు అల్లాహ్ తఆలా దైవప్రవక్తను పంపించాడు,ఆయన ద్వారా జనులకు మార్గదర్శనం చేసి ఋజుమార్గం ప్రసాదించాడు మరియు ప్రజలను ఆజ్ఞానాంధకారాల నుండి జ్ఞానజ్యోతి వైపుకు తీసుకువచ్చాడు. మరియు ఆయన ద్వారా సఫలీకృతులను, అసఫలీకృతలను వేరుచేశాడు,ఎవరైతే ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించాడో అతను ఋజుమార్గం పొందాడు,మరెవరైతే ఆయన మార్గం నుండి తప్పిపోయాడో అతను మార్గబ్రష్టతకు లోనై ఆపమార్గం పాలయ్యాడు తనపై అన్యాయానికి పాల్పడ్డాడు,దైవప్రవక్త ముహమ్మద్'[స]పై మరియు దైవప్రవక్తలదరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాకా[147 ]
‘మానవ జాతికి దైవదౌత్య అవసరం, ఆవశ్యక్తత’కు చెందిన విషయాల సారాంశం’ను ఈ క్రింది పంక్తుల్లో వివరిస్తున్నాము.
i. మనిషి ఒక సృష్టి జీవి అతనిని పాలించే ఒక ప్రభువు ఉన్నాడు, మనిషి తన ప్రభువును మరియు సృష్టికర్తను తెలుసుకోవడం అనివార్యమైన విషయం, మరియు అతని నుండి ఏమి కోరుకుంటున్నాడు? ఎందుకు అతన్ని సృష్టించాడు?మనిషి తన ప్రభువు గురించి స్వతహాగా తెలుసుకోలేడు,దైవప్రవక్తలు మరియు సందేశహరుల ద్వారా మరియు వారు తెచ్చిన మార్గదర్శకత్వం వెలుగులో తెలుసుకోవడం ద్వారా తప్ప మనిషి స్వతంత్రంగా అన్నీ తెలుసుకోలేడు.
ii. ఒక మనిషి శరీరం మరియు ఆత్మతో కూడి ఉంటాడు,శరీరానికి ఆహారం భోజనం మరియు పానీయాల పరంగా లభిస్తుంది,మరియు ఆత్మ యొక్క పోషణ కోసం దానిని సృష్టించిన సృష్టికర్త నిర్ణయిస్తాడు,అదే సత్యధర్మం,సత్కర్మలు.దైవప్రవక్తలు మరియు సందేశహరులు సత్యమైన ధర్మాన్ని తీసుకువచ్చారు మరియు ధర్మబద్దమైన సత్కర్మలు చేయాలని మార్గనిర్దేశం చేశారు.
iii. మానవుడు సహజస్వభావంగా ధర్మాన్ని ఇష్టపడతాడు,అతనికి తప్పనిసరిగా ఆచరించడానికి ఒక మతం ఉండాలి,ఆ మతం నిజమైనదిగా ఉండాలి.కాబట్టి, దైవప్రవక్తలు మరియు సందేశహరుల పై నమ్మకం,విశ్వాసంతో పాటు వారు తెచ్చినవన్నీ విశ్వసించడం ద్వారా తప్ప నిజమైన సత్యధర్మాన్ని తెలుసుకోవడానికి మార్గం లేదు.
iv. మనిషి ఈ ఇహలోకంలో దైవప్రసన్నత పొందే మార్గాన్ని,స్వర్గమార్గాన్ని మరియు పరలోక శాశ్వత అనుగ్రహాలను తెలుసుకోవల్సిన అవసరం ఉంది,అయితే ఈ మార్గాన్ని కేవలం ప్రవక్తలు మరియు సందేశహరులు మాత్రమే మార్గనిర్దేశణం చేయగలరు
v. మానవుడు స్వతహాగా చాలా బలహీనుడు,చాలా మంది శత్రువులు అతని కోసం కాచుకుని ఉంటారు,షైతాను అతన్ని తప్పుదారి పట్టించాలని కోరుకుంటాడు,అతని దుష్ట సహచరులు చెడు పనులను అందంగా,న్యాయంగా మలచి కనబరుస్తారు మరియు అమ్మారా’మనసు అతన్ని చెడు చేయడానికి ప్రేరేపిస్తుంది.అందువల్ల, తన శత్రువుల చెడు ప్రణాళికల నుండి అతన్ని రక్షించగలిగేది అవసరం,అది కేవలం దైవప్రవక్తలు మరియు సందేశహరులు మాత్రమే మార్గనిర్దేశం చేసి స్పష్టంగా వివరించగలరు.
vi. మనిషి స్వభావం రీత్యా ఒక నగరవాసి,సామాజిక జీవనం గడపడానికి,ప్రజలతో సంబంధాలు న్యాయబద్దంగా కొనసాగించడానికి, ప్రజలలో న్యాయం,సమానత్వం ఏర్పడటానికి ఒక చట్టం ఒక ధర్మశాస్త్రం అవసరం – ఒకవేళ ఇది లేకపోతే మనిషి దుర్భరమైన ఆటవిక జీవనం గడపవలసి ఉండేది.అలాగే, ఈ ధర్మశాసనం ప్రతి ఒక్కరి హక్కును మితిమీరకుండా,నిర్లక్ష్యం లేకుండా సమతుల్యంగా రక్షించగలగాలి,అయితే అలాంటి పరిపూర్ణ చట్టాన్ని సందేశహరులు మరియు ప్రవక్తలు తప్ప మరెవరూ తీసుకురాలేరు.
vii. మనిషి తనకు ప్రశాంతత మరియు మానసిక శాంతి ఎలా లభిస్తుందో తెలుసుకోవాలి,ఆనందానికి గల నిజమైన మార్గాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి, ప్రవక్తలు మరియు సందేశహరులు ఈ విషయాల వైపుకు మార్గనిర్దేశం చేశారు.
ప్రజలకు ప్రవక్తలు మరియు సందేశహరుల అవసరం ఎందుకు? అని వివరించిన తరువాత, పరలోకం’ గురించి చర్చించడం మరియు దానిని రూఢీ చేసే రుజువులు మరియు ఆధారాలను వివరించడం సముచితం అని నేను భావిస్తున్నాను.
మరణం అనివార్యం అని ప్రతి మనిషికి తెలుసు. కానీ మరణం తరువాత అతని నివాసం ఏమిటి? అతను సౌభాగ్యవంతుడుగా ఉంటాడా లేక దౌర్భాగ్యుడుగా ఉంటాడా?
ప్రపంచంలోని చాలా సముదాయాలు మరియు జాతులు మరనాంతరం తిరిగి పునర్జీవనం లభిస్తుందని,వారి పనులన్నింటికీ లెక్కలు చూడబడతాయని,ఒకవేళ మంచి చేస్తే మంచి ప్రతిఫలం పొందుతారు మరియు చెడు చేస్తే చెడు పరిహారం శిక్ష ఉంటుంది’అని నమ్ముతారు[139]. ఈ విషయాన్ని–మరణాంతర జీవితం మరియు ప్రతిఫల లెక్కలు–సరైన బుద్ది అంగీకరిస్తుంది మరియు దైవశాసనాలు,చట్టాలు దీనిని ధృవీకరిస్తాయి.ఇది మూడు మౌలికాంశాల పై ఆధారపడి ఉంటుంది:
1) పరమపవిత్రుడైన ప్రభువు యొక్క పరిపూర్ణ జ్ఞానం యొక్క దృవీకరణ.
2) ప్రభువు పరిపూర్ణ శక్తి యొక్క ధృవీకరణ.
3) ప్రభువు పరిపూర్ణ వివేకం యొక్క నిర్ధారణ.[140]
మరణాంతరాజీవన నిరూపనకై అనేక తార్కిక[లాజికల్ ]ఆధారాలు మరియు లిఖిత ఆధారాలు ఉన్నాయివాటిలో కొన్ని:ఇవి
1) చనిపోయినవారి పునరుత్థానానికి ఆకాశం మరియు భూమి యొక్క సృష్టిని సూచిస్తుంది. {ఏమీ?వారికి తెలియదా?నిశ్చయంగా ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.}[141] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు.}[142]
2) ఎటువంటి నమూనా మరియు ప్రణాళిక లేకుండా సృష్టిని పుట్టించే శక్తిసామర్థ్యం అల్లాహ్’కు ఉన్నప్పుడూ రెండవసారి సృష్టిని పునః సృష్టించడం పట్ల తేలికగా సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి, ఒక వస్తువు కు అస్తిత్వం కల్పించి ఉనికిలోకి తీసుకురాగల శక్తిసామర్ధ్యాలు గల వాడికి తిరిగి దానిని పునః రూపొందించడమనేది చాలా తేలికైన విషయం.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది.}[143] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు.అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?}[144] [ఇలా అను:"మొదట వాటిని పుట్టించిన ఆయనే,మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు.మరియు ఆయన ప్రతి సృష్టి సృజన పట్ల జ్ఞానముకలవాడు"}
3) అల్లాహ్ మనిషిని అత్యుత్తమ రీతిలో రూపొందించాడు, ఒక సమగ్ర రూపంలో,పరిపూర్ణ శరీరంతో పుట్టించాడు,అతనిలో అవయవాలు,మాంసం,ఎముకలు,నరాలు,సాధనాలు,శాస్త్రాలు, మరియు పరిశ్రమలు ఉన్నాయి– ఇందులో ఆయన మృతులను తిరిగి పుట్టించగల శక్తిసామర్ధ్యాలు కలిగి ఉన్నాడనడానికి గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి.
4) ప్రాపంచిక జీవితంలో మృతులను తిరిగి సృష్టించే శక్తిని కలిగి ఉన్నప్పుడూ చనిపోయిన వారిని పరలోకంలో పునః సృష్టింపజేయగల సామర్థ్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.ఈ విషయాన్ని అల్లాహ్ తన ప్రవక్తల పై అవతరింపచేసిన దైవగ్రంధాలలో స్పష్టంగా తెలియజేశాడు. ఈ గ్రంధాలలోని సందేశానుసారం 'అల్లాహ్ అనుమతితో మృతులను తిరిగి బ్రతికించిన వారిలో దైవప్రవక్తలైన మహనీయ 'ఇబ్రాహీం మరియు 'ఈసా మసీహ్ అలైహిమస్సలాం'లు ఉన్నారు.
5) అల్లాహ్ మృతులను పునఃసృష్టించగల శక్తిమంతుడు అని’ హష్ర్’ నష్ర్ పోలిన వ్యవహారాల పై ఆయనకు గల శక్తి సామర్ధ్యల ద్వారా నిరూపించవచ్చు.అవి:-
[అ]అల్లాహ్ మనిషిని వీర్యం బిందువుతో సృష్టించాడు అది శరీరమంతా చెల్లాచెదురుగా విస్తరించి ఉంటుంది - అందుకే శరీరంలోని అన్నిభాగాలు సంభోగాన్నిఆనందిస్తాయి-అల్లాహ్ శరీరంలోని అన్ని భాగాల నుండి ఈ వీర్య బిందువును సేకరించి,తల్లిగర్భంలో ప్రవేశపెడతాడు,ఆపై అల్లాహ్ దానితో మనిషిని సృష్టిస్తాడు. ఈ భాగాలన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి, ఆయన వాటిని ఒకచోట చేర్చి,వాటి నుండి మనిషిని రూపొందించాడు,వారు మరణంతో రెండవసారి చెల్లాచెదురుగా మారిపోతే, రెండవసారి వాటిని ఒకచోట చేర్చకుండా అతన్నిఏ విషయం నిరోధించగలదు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- [ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?][145] {ఏమిటి?దాంతో [మనిషిని]సృష్టించేది మీరా?లేక మేము సృష్టిస్తున్నామా?
[ఆ]మొక్కల విత్తనాలు రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి,మెత్తని తడి భూమిలో దానిని నాటి మట్టిని కూడ్పి నీటిని పోసినప్పుడు అది మొలకెత్తుతుంది,మనిషి బుద్ది ప్రకారం అది కుళ్లి కృశించిపోవాలి,ఎందుకంటే దానిని నాశనం చేయడానికి మట్టి మరియు నీరులో ఒక్కటైన చాలు,కానీ ఆ విత్తనం కుళ్లిపోకుండా సురక్షితంగా ఉంటుంది,తేమ పెరిగినా కొద్ది విత్తనం చీల్చుకుని మొక్క బయటికి వస్తుంది,మరి ఇది అల్లాహ్ యొక్క పరిపూర్ణ శక్తిని,సంపూర్ణ వివేకాన్ని సూచిచడంలేదా? అయితే వివేకవంతుడు,శక్తిమంతుడైన దైవం కు భాగాలను సమీకరించడంలో,అవయవాలను కలపడంలో పునః నిర్మించడంలో సామర్ధ్యం లేదా? అల్లాహ్ సెలవిచ్చాడు:- {మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?}[146] {మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?}[147] అదేవిధంగా మరోకచోట సర్వశక్తిమంతుడు ఇలా అన్నాడు: {నేల ఎండిపోయి నీవు చూస్తావు ఆ తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అది పులకిస్తుంది,ఉబికివస్తుంది,అన్నిరకాల మనోహరమైన మొక్కలనుమొలకెత్తిస్తుంది'
6) నిశ్చయంగా సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడు,సర్వజ్ఞుడు మరియు వివేచనాపరుడు వినోదం కోసం సృష్టిని పుట్టించలేదని మరియు వారిని ఉద్దేశ్యం లేకుండా విడిచిపెట్టలేదనే విషయాన్ని స్పష్టం చేశాడు. {మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!}[148] ఆయన సృష్టిని ఒక మహా ఉద్దేశ్యం కోసం,గొప్ప లక్ష్యం కోసం పుట్టించాడు;అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}[149] అందువల్ల ఈ సర్వజ్ఞుడు వివేచనాపరుడైన ప్రభువు దృష్టిలో ఆయన ఆదేశాలకు కట్టుబడి విధేయత చూపేవారిని మరియు ఆదేశాలను దిక్కరించి అవిధేయత చూపేవారిని సమానంగా భావించడు. అల్లాహ్ ఇలా చెప్తున్నాడు:- ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా?159 అందువల్ల ఆయన సంపూర్ణ వివేకం,మహాఆగ్రహం వల్ల ప్రళయదినాన సృష్టిరాసులను తిరిగి బ్రతికించి వారి కార్యాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరికీ ప్రతిఫలం లభిస్తుంది,మంచివాడికి ప్రతిఫలం చెడ్డవాడికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసలా కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి.}[150][151]
పరలోకం పట్ల విశ్వాసం' అనేది వ్యక్తిగత మరియు సామాజిక జీవితం పై అనేక ప్రభావాలను చూపుతుంది,వాటిలో కొన్ని ఇవి :-
1) పరలోకంలో సాఫల్యం పొందడానికై మనిషిలో అల్లాహ్ విధేయత పట్ల ఆసక్తి కలుగుతుంది మరియు ఆ రోజు ఉండే శిక్షకు భయపడి అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉంటాడు.
2) ఒక విశ్వాసి ప్రాపంచిక అనుగ్రహాలను ఆనందాలను పరలోక ఆనందాల కోసం,అనుగ్రహాల కోసం కోల్పోతాడు. అలాంటప్పుడు పరలోక రోజును విశ్వసించడంలో అతనికి ‘శాంతి ‘ఓదార్పు’లభిస్తుంది.
3) పరలోకదినాన్ని విశ్వసించడం వల్ల మనిషికి మరణం తరువాత తన గమ్యం ఏమిటో తెలిసి ఉంటుంది,మరియు అతని కర్మలకు ప్రతిఫలం లభించనుందని సత్కర్మలకు సత్ఫలితం,దుష్కర్మలకు చెడు ఫలితం లభిస్తుందని తెలుసుకుంటాడు,మరియు అతి త్వరలో లెక్కలు అప్పచెప్పవలసి ఉందని,దౌర్జన్యం చేసినవారితో ప్రతీకారం తీర్చుకోబడుతుంది,ఒకవేళ ఇతరుల హక్కును కొల్లగొట్టినట్లై,అన్యాయానికి పాల్పడితే వారి హక్కులు తీసుకోబడుతాయి.
4) పరలోకాన్ని నమ్మిన వ్యక్తి యొక్క విశ్వాసం ఇతరులకు అన్యాయం చేయకుండా మరియు వారి హక్కులను ఉల్లంఘించకుండా నిరోధిస్తుంది. ప్రజలు పరలోక దినాన్ని విశ్వసిస్తే, వారు పరస్పరం ఒకరినొకరిపై అణచివేతలకు అన్యాయాలకు పాల్పడకుండా సురక్షితంగా ఉంటారు మరియు వారి హక్కులు కాపాడబడతాయి.
5) పరలోకాన్ని విశ్వసించిన వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని జీవితంలో ఒక దశగా చూస్తాడు తప్ప శాశ్వత జీవితంగా భావించడు.
ఈ పేరా ముగించేముందు -వేన్'బిత్'-ఇస్లాం స్వీకరించిన ఒక అమెరికన్ క్రిస్టియన్'-మాటలను ఇక్కడ వర్ణించడం ఉత్తమమని భావిస్తున్నాను గతంలో ఇతను చర్చీలో పని చేశాడు పిదప ఇస్లాం'మరియు పరలోకాన్ని విశ్వసించాడు, ఇలాచెప్పాడు:- (నిశ్చయంగా ఇప్పుడు నాకు ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాయి కానీ ఈ ప్రశ్నల జవాబుకోసం నా జీవితం యొక్క పెద్ద సమయాన్ని గడిపాను.అవి:-నేను ఎవరిని?నాకు ఏమి కావాలి?నేను ఎందుకు వచ్చాను?నేను ఎక్కడికి వెళ్తాను నా గమ్యం ఏమిటి ?)[152].
సర్వప్రవక్తల, సందేశహరుల ఆహ్వానం ఒకే మౌలికంశంపై ఆధారపడి ఉంది,అది-అల్లాహ్ పట్ల విశ్వాసం,దైవదూతలపై విశ్వాసం,దైవగ్రంధాలపై విశ్వాసం,దైవప్రవక్తల పట్ల విశ్వాసం, పరలోకదినాన్ని విశ్వసించడం,మంచి,చెడు విధివ్రాతను విశ్వసించడం’మొదలైనవి,అలాగే సమస్తప్రవక్తల ఆదేశం ప్రకారం’ప్రజలు కేవలం ఏకైకుడైన అల్లాహ్’ను మాత్రమే ఆరాధించాలి ఆయనకు ఇతరులెవ్వరిని సాటి కల్పించకూడదు,మరియు ఆయన సన్మార్గాన్ని అనుసరించాలి,అపమార్గాలను,విభిన్నమార్గాలను అవలంభించకూడదు,మరియు వారు నాలుగు రకాల విషయాలను నిషేధిస్తారు-1] బహిర్గతంగా లేక అంతర్గతంగా చేయబడే అశ్లీలపనులు,చెడు పనులు,2]పాపాలు,3]అకారణంగా ఒకరికి అన్యాయం చేయడం,4]అల్లాహ్’కు సాటికల్పించడం,భాగస్వామిగాచేయడం,మరియు విగ్రహారాధన చేయడం! అదేవిధంగా అల్లాహ్’ను భార్య,పుత్రుడు,భాగస్వామి,సమానం,సరిసాటి విషయాల నుంచి పవిత్ర పర్చడం,లేక అల్లాహ్’కు విరుద్దంగా దూషించడం,సంతాన్నాన్నిహత్యచేయడం,అకారణంగా ఒకరిని చంపడాన్ని వారించడం,వడ్డీ తినడాన్ని నిషేదించడం,అనాధాల సొమ్మును కాజేయడాన్ని వారించడం,వాగ్దానాన్ని పూర్తిచేయడం,సంపూర్ణంగా తూనికలు కొలవడం,తల్లిదండ్రులకు విధేయత చూపడం,ప్రజల మధ్య న్యాయం చేకూర్చడం,మాటలో చేతలో సత్యాన్ని అలవర్చుకోవడం,అహంకారం గర్వం,దుబారా ఖర్చు ను వారించడం,మరియు ప్రజల సొమ్మును అన్యాయంగా తినడం’వంటి పనులనుండి వారించడం మొదలైనవి.
ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చెప్పారు:- షరీఅతు యొక్క చట్టాలన్నీ మౌలిక సిద్దంతాలలో మరియు నియమాలలో సమానంగా ఉన్నాయి,కొన్ని శాఖల్లో భేధాలు ఉన్నప్పటికి మెదడులో వాటి మంచి నిక్షిప్తమయ్యింది,ఒకవేళ అవి అసలైన స్థితి నుంచి తొలగిపోయినట్లైతే వివేకం బుద్ది,మర్మం,దయ అంతమవుతాయి,అవి సంభవించడం ఆసాధ్యమవుతాయి. [ఒకవేళ న్యాయం వారి మనోవాంఛలను అనుసరించినట్లైతే భూమ్యాకాశాలు మరియు అందులోని సమస్తం సర్వనాశనమై పోయేది] [153] అలాంటప్పుడు ఒక తెలివైన వ్యక్తి విశ్వసామ్రాజ్యాధినేత యొక్క శాసనాన్ని, చట్టాన్ని ఎలా దిక్కరించగలడు?. [154][155]
అంచేత దైవప్రవక్తల ధర్మం ఒక్కటే ,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. [156] {మరియు నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి.}[157] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్ కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకూ నిర్ధారించాడు,దానినే మేము నీ వైపుకు వహీ ద్వారా పంపాము,దానిగురించే ఇబ్రాహీముకు,మూసాకు,ఈసాకు కూడా తాకీదు చేశాము ఈ ధర్మాన్నే నెలకొల్పాలని అందులో చీలిక తీసుకురావద్దని ఉపదేశించాము}.
ధర్మం యొక్క ఉద్దేశం ఏమిటంటే,మానవజాతిని వారు సృష్టించబడిన ఉద్దేశాన్నిపొందేలా చేయడం అది: తమ ఏకైకుడైన ప్రభువును ఆరాధించడం,ఆయనకు ఇతరులను భాగస్వామ్య పర్చకుండా ఉండటం{168}.ఆయన వారి కోసం శాసనాలను,హక్కులను నియమించాడు,వాటిని విధిగా వారు నెరవేర్చాలి,మరియు వారికి బాధ్యతలను అప్పచెప్పుతాడు.ఈ లక్ష్యాన్ని సాధించడానికి వారికి మార్గాలను నిర్దేశిస్తాడు, తద్వారా వారు తమ ప్రభువు ప్రసన్నతను మరియు ఇహపరలోకాల్లో ఆనందాన్ని సాధించగలుగుతారు, అది మనిషిని అతని వ్యక్తిత్వాన్ని,అతని స్వభావం,ఆత్మ మరియు అతని చుట్టూ ఉన్న ప్రపంచం మధ్య ఘర్షణకు కారణమయ్యే ప్రాణాంతక వ్యాధులతో బాధపెట్టదు.
దైవప్రవక్తలందరూ దైవధర్మం వైపుకు ఆహ్వానించారు, అది మనిషి నమ్మవలసిన మూల పునాది విశ్వాసాలను మరియు అతను తన జీవితంలో అనుసరించాల్సిన చట్టాన్ని అందిస్తుంది.అందుకే తౌరాతు ఒక విశ్వాసం మరియు అలాగే ఒక చట్టం కూడా!దాని అనుచరులకు ఆ చట్టశాసనాల ప్రకారం తీర్పులు చేయాల్సిందిగా ఆదేశించబడింది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మేము తౌరాతుగ్రంధాన్ని అవతరింపచేసాము,అందులో మార్గదర్శకత్వము జ్యోతీ ఉండేవి,ఈ తౌరాతు ఆధారంగానే ముస్లిములైన ప్రవక్తలు, రబ్బానీలు,ధర్మవేత్తలు,యూదుల సమస్యలను పరిష్కరించేవారు.}[158] దీని తరువాత ఈసా మసీహ్’ను అల్లాహ్ ఇంజీల్ ఆకాశ పుస్తకం ఇచ్చిపంపాడు,ఈ పుస్తకం కూడా ప్రజల కొరకు హిదాయతు[మార్గదర్శకత్వం]మరియు జ్యోతి’లా ఉండేది,మరియు తనకు మునుపు వచ్చిన గ్రంధాలను సత్యపరిచింది, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఆ ప్రవక్తల తరువాత మేము మర్యం కుమారుడగు ఈసాను పంపాము,అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంధాన్ని సత్యమని దృవీకరించేవాడు,మేమతనికి ఇంజీలు గ్రంధాన్నివోసగాము,అందులో మార్గదర్శకత్వము జ్యోతి ఉండేవి. }[159] ఆపై తరువాత చివర్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం సంపూర్ణ ధర్మం మరియు అంతిమ శాసనం తీసుకుని వచ్చారు,అంతిమ సందేశం మునుపు వచ్చిన శాసనాలన్నింటిని రద్దుచేసింది,మరియు మునుపు వచ్చిన ఆకాశ గ్రంధాలను దృవీకరించింది, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మేము నీ వైపుకు ఈ గ్రంధాన్ని సత్యాసమేతంగా అవతరింపచేసాము,అది తనకన్నా ముందు వచ్చిన గ్రంధాలను సత్యమని దృవీకరిస్తుంది,వాటిని పరిరక్షిస్తుంది,కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్ అవతరింపచేసిన ఈ గ్రంధానికనుగుణంగానే తీర్పు చెయ్యి ఈ సత్యాన్ని వీడి వారి మనోవాంఛలను అనుసరించకు'}[160] అల్లాహ్ తఆలా స్పష్టంగా తెలియజేశాడు,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం మరియు ఆయనతో ఉన్న ముస్లిములు ఏ విధంగా గత ప్రవక్తలు మరియు సందేశహరులు విశ్వసించారో అలా వీరు కూడా అల్లాహ్’ను విశ్వసించారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము. మరియు మేము (ఆదేశం) విన్నాము మరియు దానిని శిరసావహించాము, నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాము, ఓ మా ప్రభూ! మా గమ్యస్థానం నీ వైపుకే ఉంది.}[161]
అర్రిసాలతుల్ బాఖియ్య (శాశ్వత దైవదౌత్యం) [162]
ఇంతకు ముందు యూదమతం,క్రైస్తవ మతం,మజూసీ మతం,[మాజ్డాయిజం] జరాదాష్టియా,విగ్రహారాధనల యొక్క పరిస్థితుల గురించి వివరించబడ్డాయి,వీటితో క్రీస్తు పూర్వం 6 వ శతాబ్దం లో మనిషి యొక్క పరిస్థితులు మానవజాతి స్థితిగతులు తెరుచుకుని స్పష్టమవుతాయి,ధర్మం పాడైపోయినప్పుడు రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులు కూడా గతితప్పుతాయి;నె త్తుటి యుద్ధాలు విస్తృతంగా జరుగుతాయి, నియంతృత్వం, నిరంకుశతత్వం ఉద్భవిస్తుంది, మరియు మానవజాతి పూర్తిగా అంధకారంలో మునిగి జీవిస్తుంది.అందువల్ల నాస్తికత్వం, అవిశ్వాసం మరియు అజ్ఞానం ఫలితంగా హృదయాలు అంధకారంలో మునిగిపోతాయి.చరిత్ర గతి తప్పుతుంది,నీతులు క్షీణిస్తాయి,గౌరవాలు మరియు హక్కులు ఉల్లంఘించబడతాయి మరియు అల్లర్లు,అల్లకల్లోలాలు క్రమంగా పెరుగుతాయి,నేలపై,నీటిపై పరిస్థితి చాలా భయంకరంగా మారుతుంది,ఏ బుద్దిజ్ఞాని అయినా దాని గురించి ఆలోచిస్తే, మానవాళి -ఆ యుగంలో – నశిస్తున్నారని, అంతరిస్తున్నారని మరియు వారు తిరిగి రాని అగాధం వైపు వెళుతున్నారని అతను గ్రహిస్తాడు, అల్లాహ్ వారిని ఒక గొప్ప సంస్కర్తతో రక్షించనంతవరకు,మానవజాతికి మార్గాన్ని ప్రకాశవంతం చేయడానికి దైవదౌత్య జ్యోతిని మరియు మార్గదర్శక కాంతి ద్వారా వారికీ ఋజుమార్గానికి,సన్మార్గానికి మార్గనిర్దేశం చేస్తాడు.
ఆ సమయంలో, అల్లాహ్ శాశ్వతంగా ఉండిపోయే ప్రవక్తత కాంతిని’మక్కా నుండి ఉదయింపచేయాలని అనుమతించాడు, అక్కడే అల్లాహ్ గృహం’కాబా ఉంది, అక్కడి వాతావరణం కూడా బహుదైవారాధన, షిర్కు అజ్ఞానం, అన్యాయం మరియు నిరంకుశత్వం పరంగా ఇతర మానవజాతుల మాదిరిగా ఉండేది కానీ ఇతర ప్రదేశాలతో పోలిస్తే చాలా లక్షణాలలో అది విభిన్నంగా ఉండేది:-వాటిలో కొన్నిఇవి:-
1) ఇది గ్రీకు,రోమన్ లేదా భారత తత్వశాస్త్రాలు,సిద్దాంతాల మలినాలతో ప్రభావితం కాని ఒక స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉంది.అక్కడి స్థానికులు స్వచ్చమైన మనస్సులు ,లోతైనవాగ్ధాటి,పదునైన మెదడు మరియు అసాధారణమైన బుద్ది, ఆశ్చర్యకరమైన తెలివిగలవారు.
2) ఇది ప్రపంచ నడిబొడ్డున,నడిమధ్యన ఉంది. ఇది యూరప్, ఆసియా మరియు ఆఫ్రికాకు మధ్యలో ఉన్నందువల్ల దైవదౌత్య సందేశం అతితక్కువ వ్యవధిలో ప్రపంచపు ఈ ఖండాలకు వేగంగా వ్యాపించింది.
3) ఇది ఒక సురక్షితమైన ప్రదేశం.అబ్రహా (అబిస్సినియన్ రాజు) దానిపై దాడి చేయాలనుకున్నప్పుడు అల్లాహ్ దానిని రక్షించాడు. పొరుగున ఉన్న రోమన్ మరియు పెర్షియన్ సామ్రాజ్యాలు కూడా దీనిని జయించలేకపోయాయి.దాని వాణిజ్యవ్యాపారాలు కూడా ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలలో సంరక్షించబడ్డాయి.అంచేత ఆ ప్రాంతంలో కారుణ్య ప్రవక్త ప్రభవింపబడ్డారు.అల్లాహ్ ఈ నగరవాసుల గురించి ఈ గొప్ప అనుగ్రహం ద్వారా ప్రస్తావించాడు. ఏమిటి?మేము వారికి సురక్షితమైన పవిత్రమైన చోట స్థిరనివాసం కల్పించలేదా ?వారికి అక్కడ అన్నీ రకాల పండ్లు ఫలాలు ఉపాధి రూపంలో మా వద్ద నుంచి సరఫరా చేయబడలేదా?[163]
4) ఈ గొప్ప ప్రదేశం మరియు ఖురైష్ వంశం అనువైన చోటు, ఇది బాష ప్రావీణ్యత,వ్యాకరణ ప్రతిభకు,వాగ్ధాటికి మరియు గౌరవప్రదమైన ఉత్తమ నైతికత,లక్షణాలకు ప్రసిద్ది చెందింది అంతే కాదు గౌరవం మరియు నాయకత్వ పదవులను కలిగి ఉంది.
ఈ గొప్ప ప్రదేశంలో మరియు ఖురైష్ వంశం నుండి ఇది బాష ప్రావీణ్యత, వ్యాకరణ ప్రతిభకు, వాగ్ధాటి కి మరియు ఉత్తమ నైతికత, గౌరవప్రదమైన లక్షణాలకు ప్రసిద్ది చెందింది అంతేకాదు గౌరవప్రతిష్ట మరియు నాయకత్వాన్నికలిగి ఉంది. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను ప్రవక్తలలో మరియు సందేశహరులలో చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన 6'వ శతాబ్దం క్రీ.శ.570 వ సంవత్సరంలో మక్కాలో జన్మించాడు. ఆయన అనాథగా పెరిగాడు, ఎందుకంటే ఆయన గర్భంలో ఉన్నప్పుడు తండ్రి మరణించాడు.అతని తల్లి మరియు తాతా ఆరేళ్ళ వయసులో మరణించారు. కాబట్టి, బాబాయి అతనిని ఆలనా పాలనా చూసుకున్నాడు ఈ విధంగా ఆయన అనాధగా పెరిగాడు. ఆపై అసాధారణ ప్రతిభాపాఠాల సంకేతాలు ఆయన పై వ్యక్తమయ్యాయి; మరియు ఆయన అలవాట్లు,మర్యాదలు మరియు లక్షణాలు తన ప్రజలకు భిన్నంగా ఉన్నాయి. ఆయన తన సంభాషణలో ఎప్పుడూ అబద్దం చెప్పలేదు మరియు ఎవరినీ బాధపెట్టలేదు. ఆయన నిజాయితీ, పవిత్రత మరియు చిత్తశుద్ధితో ఎంతగానో ప్రాచుర్యం పొందాడు,తద్వారా ప్రజలు చాలా మంది తమ విలువైన ఆస్తులను ఆయనకి అప్పగించేవారు, ఆయన తన జీవితాన్ని మరియు సంపదను కాపాడుకునే విధంగా వాటిని పరిరక్షించేవారు.అలా ప్రజలు ఆయనకి "అల్-అమీన్" (నమ్మకస్తుడు) అనే బిరుదుతో గౌరవించారు. ఆయన చాలా బిడియస్తుడు, ప్రాజ్ఞవయస్సు వచ్చినప్పటి నుండి ఎవరి ముందు తనను తాను నగ్నంగా చూపించలేదు.ఆయన స్వచ్చమైన నిజాయితి పరుడు,ధర్మవంతుడు మరియు తన ప్రజలు విగ్రహాలను ఆరాధించడం, మద్యం సేవించడం మరియు అమాయకుల రక్తాన్ని చిందించడం చూసి బాధపడేవారు. తను ఇష్టపడే పనులను మాత్రమే వారితో చేసేవారు మరియు వారు పనికిమాలిన చర్యలకు పాపాలకు పాల్పడినప్పుడు వారికి దూరంగా ఉండేవారు. అనాధలకు మరియు వితంతువులకు సహాయం చేసేవారు,ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు. ఆయన నలభై ఏళ్ళకు చేరుకున్నప్పుడు,తన చుట్టూ ఉన్న అవినీతి, అక్రమాలను చూసి తీవ్రమైన అసౌకర్యానికి ఇబ్బందికి గురయ్యారు మరియు తన ప్రభువును ఆరాధించడానికి ఒంటరిగా ఏకాంతంలో గడపడం ప్రారంభించారు మరియు తన ప్రభువుతో సన్మార్గం, మార్గదర్శకత్వం ’చూపమని ప్రార్ధించేవారు, ఈ స్థితి కొనసాగుతుండగా, ఒక దైవదూత తన ప్రభువు తరుపు నుంచి ఒక దైవవాణితో ఆయన వద్దకి అవతరించాడు, ఈ ధర్మాన్ని మానవాళికి తెలియజేయమని;అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకు పిలుస్తూ ఇతరులను ఆయనకు సాటికల్పించకూడదని ఆదేశించాడు.అల్లాహ్ ఈ ధర్మాన్ని మానవజాతి కోసం పరిపూర్ణపరిచాడు,వారిపై తన అనుగ్రహాన్ని పూర్తిచేశాడు. మహనీయ అల్లాహ్ ప్రవక్త తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తరువాత,అల్లాహ్ ఆయనకి మరణాన్ని ప్రసాదించాడు, ఆయన అరవై మూడు సంవత్సరాలు జీవించారు; ప్రవక్తతకు మునుపు నలభైసంవత్సరాలు మరియు ప్రవక్త మరియు సందేశహరుడిగా ఇరవై మూడు సంవత్సరాలు జీవనం గడిపారు.
'ప్రవక్తల పరిస్థితుల గురించి ఎవరైతే ఆలోచిస్తారో మరియు వారి చరిత్రను అధ్యయనం చేస్తారో పూర్తి నమ్మకంతో తెలుసుకుంటారు ప్రవక్త దైవదౌత్యాన్ని నిరూపితమయ్యే మార్గాల్లో అన్నింటికంటే ఎక్కువగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ దైవదౌత్యాన్ని చాలా సులభంగా నిరూపించవచ్చు.
ఏ విధంగా మూసా మరియు ఈసా అలైహిస్సలాం యొక్క దైవదౌత్యం లిఖించబడినదో ఆలోచిస్తే అది క్రమబద్దమైన తవాతూర్ విధానంలో లిఖించబడింది అని మీకు అర్ధమవుతుంది,తవాతూర్ మాద్యమంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం దైవదౌత్యాన్ని అతి ఎక్కువగా,పటిష్టమైన పద్దతిలో,బాధ్యతయుతంగా నకలు చేయబడింది.
ఈ విధంగా, తవాతుర్ మాద్యమంగా మొదట ప్రవక్తల అద్భుతాలు మరియు గుర్తులు సమానంగా నకలు చేయబడ్డాయి కాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క అద్భుతాలు చాలా గొప్పవి, ఎందుకంటే అవి చాలా ఉన్నాయి మరియు వాటిలో అత్యంతగొప్పది అద్భుతమైన ఖుర్ఆన్, ఇది తవాతురు క్రమంలో స్వర మరియు అక్షర రూపంలో నకలు చేయబడుతుంది.[164]
ఎవరైతే ప్రవక్త మూసా, ఈసా అలైహిముస్సలాం తెచ్చిన దైవదౌత్య సందేశం మరియు మహనీయ దైవప్రవక్తసల్లల్లాహు అలైహివసల్లం తెచ్చిన సరైన విశ్వాసం,దృఢమైన శాసనాలు మరియు ఉపయోగకరమైన జ్ఞానం మధ్య తారతమ్యాలను పోల్చిచూసిన వారందరికీ ఒకే దీపం నుండి ఉద్భవించిందని అదే దైవదౌత్య దీపంఅని’ ఖచ్చితంగా తెలుస్తుంది.
దైవప్రవక్తల అనుచరుల పరిస్థితులను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం అనుచరులతో పోల్చిచూసిన వారెవరైనా,ప్రజల కోసం వారు అత్యుత్తమమైన వ్యక్తులని తెలుసుకుంటారు.మరియు వారు ప్రవక్తల తదనంతరం వచ్చిన అనుయాయుల కూడా ఎక్కువ మంది ప్రవక్తల అనుచరులు ఉన్నారని ఖచ్చితంగా తెలుస్తుంది.వారు ఇస్లామీయ ఏకత్వధర్మశాస్త్రాన్ని వ్యాపింపచేశారు, న్యాయ ప్రచారం చేశారు మరియు బలహీనులకు మరియు నిరాశ్రయులకు అనాధలపై దయ చూపారు.[165].
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం దైవదౌత్యంను నిరూపించే మరిన్ని అదనపు సాక్ష్యాలు మీకు కావాలంటే,‘అలీ బిన్ రబ్బన్ అత్తబరీ' అతను కనుగొన్న రుజువులు మరియు సంకేతాలు నేను మీకు తెలియచేస్తాను.ఆ సంకేతాల కారణంగా క్రైస్తవుడిగా ఉన్న అతను తరువాత ఇస్లాంను స్వీకరించాడు.అవి :
1) దైవప్రవక్త ఏకైకుడైన అల్లాహ్ ఆరాధన వైపుకు మాత్రమే పిలిచాడు,మరియు ఆయన తప్ప ఇతర మిథ్యాదైవాల ఆరాధన త్యజించాలని ఖండించాడు. ఈ విషయంగా ఆయన ప్రవక్తలందరితో ఏకీభవించారు.
2) కేవలం అల్లాహ్ ప్రవక్తలు మాత్రమే చూపించగల స్పష్టమైన సంకేతాలను ఆయన చూపించారు.
3) ఆయన భవిష్యత్తులో జరిగబోయే సంఘటనలను కొన్ని వివరించాడు మరియు ఆయన తెలిపినట్లుగానే అవి జరిగాయి.
4) ప్రపంచం మరియు అందుగల దేశాలకు చెందిన అనేక సంఘటనలు గురించి చెప్పారు ఆయన చెప్పినట్లుగా ఈ సంఘటనలు జరిగాయి.
5) ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన పుస్తకం – పవిత్రమైన’ఖుర్ఆన్ - ఇది ప్రవక్తత్వానికి,దైవదౌత్యానికి గల ఒకపెద్ద సంకేతం, ఎందుకంటే ఇది భాషప్రావీణ్యత గల ఒక ప్రభావంతమైన పుస్తకం,చదవడం లేదా వ్రాయడం తెలియని ఒక నిరక్షరాస్యుడిపై అవతరించింది,భాషాపండితులైన రచయితలకు కవులకు అలాంటిది తేవాలని లేదా దాని లాంటి సూరా వ్రాసి తేవాలని సవాలు చేసింది. మరియు అల్లాహ్ స్వతహాగా దాని పరిరక్షణ బాధ్యత యొక్క హామీ ఇచ్చాడు,దానితో సరైన నమ్మకాన్ని విశ్వాసాన్ని సంరక్షించాడు,ఇందులో పరిపూర్ణమైన దైవధర్మశాసనాన్ని పెట్టాడు మరియు అతిఉత్తమ సమాజాన్ని దీనిద్వారా స్థాపించాడు.
6) అతను ప్రవక్తల పరంపరను ముగించే చిట్టచివరి అంతిమ ప్రవక్త,ఒకవేళ ఆయనను ప్రవక్తగా ప్రభవించనట్లైతే గత ప్రవక్తల అతని రాక గురించి చెప్పిన ప్రవచనాలు,భవిష్యవాణి శుభవార్తలు అసత్యమయ్యేవి.
7) దైవప్రవక్తలందరూ ఆయన రాకకు పూర్వమే ఆయన గురించి ప్రస్తావించారు.మరియు ఆయన రాబోయే ప్రాంతం, నగరం మరియు ఇతర దేశాలు మరియు రాజులు ఆయన ఆధీనంలోకి రావడాన్ని కూడా తెలిపారు, ఆయన ధర్మవ్యాప్తి,ధర్మ ప్రచారం చేయడం గురించి కూడా వారు ప్రస్తావించారు.
8) తన పై యుద్ధం చేసిన దేశాల పై, జాతుల పై ఆయన సాధించిన విజయం కూడా దైవదౌత్యానికి,ప్రవక్తతకు గల గుర్తుల్లో ఒక చిహ్నంగా భావించవచ్చు;ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవక్త అని తప్పుగా చెప్పుకునే ఒక వ్యక్తికి విజయం,అధికారం,శత్రువులపై ప్రాబల్యం, అతని సందేశం యొక్క వ్యాప్తి మరియు అతని అనుచరుల సమృద్ధితో అల్లాహ్ చేత బలోపేతం కావడం అనేవి అసాధ్యమైన విషయాలు;నీతిమంతుడు నిజాయితీగల ఒక ప్రవక్త చేతిలో తప్ప ఇవన్నీ జరగవు.
9) ఆయన సద్గుణాలు మరియు లక్షణాలు అనగా ఆయన ఆరాధనలు,పవిత్రత,మర్యాద,నిజాయితీ, ప్రశంసనీయమైన వ్యక్తిత్వం,సంప్రదాయాలు,శాసనాలు ఒక నిజమైన ప్రవక్తలో తప్ప సమీకరించబడవు.
ఈ ప్రమాణాలను, రుజువులను ప్రస్తావించిన తరువాత, మార్గదర్శకత్వం పొందిన ఈ వ్యక్తి ఇలా అన్నాడు:- ఇవి ప్రకాశించే దైవదౌత్య లక్షణాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రామాణిక రుజువులు ఉన్నాయి.ఎవరిలో ఈ విషయాలు బహిర్గతమవుతాయో వారి దైవదౌత్యం ప్రవక్తత విధి అవుతుంది,అలాంటి వ్యక్తి లక్ష్యాన్ని చేధించి అభివృద్ధి చెందుతాడు; మరియు అతనిపై నమ్మకం తప్పనిసరి.ఎవరైతే ఈ రుజువులను ధిక్కరించి వాటిని తిరస్కరించారో అతని ప్రయత్నం విఫలమౌతుంది నష్టం జరిగుతుంది మరియు అతని ప్రాపంచిక, పరలోక జీవితం సర్వనాశనం అవుతుంది.]”[166]
ఈ పేరా చివరలో, నేను మీకు రెండు సాక్ష్యాలను వివరిస్తాను:-ముహమ్మద్ ప్రవక్త కాలానికి చెందిన రోమన్ రాజు మరియు నేటి క్రైస్తవ ఆంగ్ల మత ప్రచారకుడు జాన్ సెయింట్ యొక్క సాక్ష్యం.
మొదటిది హిర్కల్ [హెరాక్లియస్] యొక్క సాక్ష్యం:- ఇమామ్ బుఖారీ రహి’అబూ సుఫ్యాన్’ను రూమ్ రాజు పిలిపించినప్పటి సంఘటనను ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు. [అబుల్ యమాన్ హకం బిన్ నాఫీ 'మాకు హదీసు వివరించాడు,ఆయనకు ఈ హదీసు గురించి షుఐబ్ తెలియజేశాడు.అతను ఈ హదీసును జుహ్రీ నుండి విన్నాడు.ఆ విషయాన్ని ఆయనకు ఒబైదుల్లా బిన్ అబ్దుల్లా బిన్ ఉత్బా బిన్ మసూద్ తెలియజేశారు,అబూ సుఫ్యాన్ బిన్ హర్బ్ ఈ సంఘటనను అబ్దుల్లా బిన్ అబ్బాస్ నుండి వివరించాడు:-వారు ఆ సమయంలో ఖురైష్ యొక్క కొంత మందితో కలిసి షామ్ సిరియా కు వ్యాపారం నిమిత్తం వెళ్లారు,ఆ కాలంలో ముహమ్మద్ మరియు కుఫ్ఫారు ఖురైష్’ ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది,అబూ సుఫ్యాన్ చెప్పసాగారు’హిర్కల్ మనుషులు సిరియా [షామ్]నగరంలోని ఒక ప్రాంతంలో మమ్మల్నికలుసుకున్నారు,నన్ను మరియు నా మిత్రులను ఏలియా{బైతుల్ మక్దిస్} తీసుకునివెళ్లారు,మా అందరినీ రాజ దర్భారుకు తీసుకునివెళ్లారు అక్కడ హిర్కల్ [హెర్క్యులస్] సమావేశానికై సభను పిలిచాడు.అతని చుట్టూ రోమ్’కు చెందిన గొప్ప వ్యక్తులు ప్రముఖులు (పండితులు, మంత్రులు, చక్రవర్తులు) కూర్చున్నారు/ హెర్క్యులస్ రాజు అతనిని మరియు అతని అనువాదాకుడిని పిలిచాడు.అప్పుడు ఆయన వారిని అడిగారు, "మీలో ప్రవక్తగా చెప్పుకునే ఆ వ్యక్తికి బంధుత్వం రీత్యా సమీప వ్యక్తి ఎవరు ఉన్నారు ?"నేను అతని దగ్గరి బంధువు అని చెప్పాను" అని అబూ సుఫ్యాన్ అన్నారు.రాజు నీకు అతనితో ఏ బంధుత్వం ఉంది అని అడిగాడు?దానికి నేను ‘అతను నాకు బాబాయి తరుపునుండి సోధరుడు అవుతాడు,ఆ సముదాయంలో అబ్దు మునాఫ్’కు చెందినవారు ఎవరులేరు.(ఇది విన్న) హెర్క్యులస్ (అబూ సుఫ్యాన్) నా దగ్గరకు తీసుకురావాలని మరియు నా వెనుక ఉన్న తన సహచరులతో అతని వెనుక కూర్చోమని చెప్పాడు.అప్పుడు హిర్కల్ తన అనువాదకుడితో,"ఈ వ్యక్తి (అంటే ముహమ్మద్) స్థితి గురించి నేను అబూ సుఫ్యాన్ను అడుగుతానని ఒకవేళ అతను నాకు అబద్ధం చెబితే, మీరు అతని అబద్ధాన్ని నాకు బహిర్గతం చేయాలి’అని ఈ ప్రజలకు చెప్పండి" అని చెప్పాడు.(అబూ సుఫ్యాన్ చెప్పారు) అల్లాహ్ సాక్షిగా! నా సహచరులు నన్ను అసత్యుడిగా వర్గీకరిస్తారనే’ సిగ్గు నాకు కలగకపోతే,నేను ప్రవక్త గురించి ఖచ్చితంగా అబద్దం సాక్ష్యం చెప్పేవాడను,కానీ నాకు కలిగిన రోషం వల్ల నేను అతనికి ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పాను. అప్పుడు హిర్కల్ [హెర్క్యులస్] నన్ను అడిగిన మొదటి విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి వంశం మీలో ఎలా ఉంది? అతను చాలా గొప్ప వంశానికి చెందినవారని నేను చెప్పాను."మీలో ఎవరైనా అలాంటి మాటలు ఇంతకు ముందు చెప్పారా?" నేను చెప్పలేదు’అని చెప్పాను, అతని తాతముత్తాతల్లో ఎవరైనా రాజు ఉన్నారా?అని అడిగాడు,నేను ఎవరులేరని చెప్పాను.అప్పుడు అతను "గొప్పవారు అతనిని అనుసరించారా లేదా బలహీనులను అనుసరించారా?" అని అడిగాడు,నేను ‘బలహీనులు’ అని చెప్పాను.అప్పుడు అతను,తన అనుచరులు రోజు రోజుకు పెరుగుతున్నారా లేదా తగ్గుతున్నారా?అని అడిగాడు,నేను’పెరుగుతున్నారు’అని చెప్పాను.అతను,వారిలో ఎవరైనా ఆ ధర్మాన్ని స్వీకరించిన తరువాత మళ్ళీ కోపంతో దాన్ని తిరస్కరించారా?అని అడిగాడు,నేను’లేదు అని చెప్పాను, "అతను ఎప్పుడైనా (ఏ సందర్భంలోనైనా) తన ఈ దైవదౌత్య సందేశానికి ముందు అబద్దం చెప్పాడా?"అని అడిగాడు, నేను చెప్పలేదని’అన్నాను.అతను ఎవరినైనా మోసం చేశాడా?అని అడిగాడు,’చేయలేదు’అని నేను చెప్పాను,ఇప్పుడు మేము అతనితో పాటు ఒక ఒప్పందంలో ఉన్నాము,అతను ఏమి చేయబోతున్నాడో నాకు తెలియదు.అని చెప్పాను(అబూ సుఫ్యాన్ చెప్పారు) ఈ సంభాషణలో నేను సిగ్గురోషం వల్ల అతనిని నిందించే వేరే ఏ అబద్ధం చేర్చలేదు.హెర్క్యులస్ "మీరు ఎప్పుడైనా పరస్పరం అతనితో యుద్దం చేశారా?"అని అడిగాడు,నేను ‘అవును’ అని చెప్పాను.అతను, "అప్పుడు అతనిది మరియు మీ యుద్దం ఎలా ఉండేది?"అని అడిగాడు నేను చెప్పాను, మా పోరాటం సమానంగా సాగేది, కొన్నిసార్లు వారు మరికొన్ని సార్లు మేము గెలిచాము’అని చెప్పాను,హెర్క్యులస్ అతను మీకు ఏమి చేయమని ఆదేశిస్తాడు?అని అడిగాడు. నేను అన్నాను: ఆయన ఇలా అంటున్నారు: అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయనకు ఇతరులను సాటి కల్పించకూడదు మరియు మా తాతముత్తాతల పూజించే వారి ఆరాధనను త్యజించాలని మరియు నమాజు ప్రార్ధించాలని,ధర్మంగా ఉండాలని,వాగ్దానం పూర్తిచేయాలని రక్తసంభంధాలను నెరవేర్చమని మాకు ఆజ్ఞా పించాడు. అప్పుడు హెర్క్యులస్ తన అనువాధకుడితో,అబూ సుఫ్యాన్ కి చెప్పు,నేను అతని వంశం గురించి అడిగాను. నువ్వు, 'అతను మాలో అత్యున్నత వంశానికి చెందినవాడు' అని చెప్పావు.నిజానికి దైవప్రవక్తలు గొప్పవంశాల నుంచి’ప్రభవిస్తారు,నేను నిన్ను,మీ ముందు ఇంకెవరైనా ఇలా చెప్పారా? అని అడిగాను నువ్వు లేదు అని అన్నావు, ఇంతకుముందు ఒకవేళ ఎవరైనా ఇలా చెప్పి ఉంటే, ఈ వ్యక్తి కూడా అతను చెప్పిన దానిని అనుకరించాడు అని నేను అనుకునేవాడిని, తన పూర్వీకుల్లో ఎవరైనా రాజు ఉన్నారా అని నేను నిన్ను అడిగాను.నువ్వు ఎవరు’లేరు అని చెప్పావు.కాబట్టి వారి పూర్వీకులలో ఒకరు రాజు అయీ ఉంటే నేను (నా హృదయంలో) ఆ వ్యక్తి (ఈ సాకుతో) తన పూర్వీకుల రాజ్యాన్ని మరియు వారి దేశాన్ని (మళ్ళీ) పొందాలని కోరుకుంటున్నాడు అని భావించేవాడిని, మరియు నేను నిన్నుఅడిగాను, అతను ఈ సందేశాలను మాటలను చెప్పడానికి మునుపు (అంటే ప్రవక్త అని చెప్పుకునే మునుపు )అబద్ధం చెప్పాడని మీరు ఎప్పుడైనా ఆరోపించారా? అని దానికి నువ్వు లేదు’అని చెప్పావు.కాబట్టి నాకు’ప్రజల విషయంలో అబద్ధాలు చెప్పని వ్యక్తి దేవుని గురించి ఎలా అబద్ధాలు చెప్పగలడు అని నాకు అర్థమైంది. గొప్పవాళ్ళు ఆయనను అనుసరిస్తారా లేదా బలహీనులా? అని నేను నిన్ను అడిగాను.బలహీనులు ఆయనను అనుసరిస్తున్నారని నువ్వు చెప్పావు,నిజానికి దైవప్రవక్తలను అనుసరించేవారు బలహీనులే ఉంటారు. మరియు నేను నిన్ను అడిగాను, అతని సహచరులు పెరుగుతున్నారా లేదా తగ్గుతున్నారా? అని నువ్వు వారు పెరుగుతున్నారని, చెప్పావు, నిజానికి ఈమాన్ విశ్వాసం ఇలాగే పెరుగుతుంది,చివరికి పరిపూర్ణమవుతుంది, నేను నిన్ను అడిగాను ఎవరైనా అతని ధర్మం స్వీకరించి పిదప తిరస్కరించి మతభ్రష్టుడు అవుతాడా?అని. నువ్వు లేదు’అని చెప్పావు, వాస్తవానికి ఈమాను విశ్వాసం హృదయంలో గూడు కట్టుకుని సంతోషంగా ఉన్నవారి గుణం ఇది. వారు ఎట్టి పరిస్థితిలో దానిని తిరస్కరించరు.అతను ఎప్పుడైనా ఒడంబడికను,ఒప్పందం విచ్ఛిన్నపర్చాడా? అని నేను మిమ్మల్ని అడిగాను.మీరు కాదు,అని చెప్పారు నిజానికి ప్రవక్తల పరిస్థితి ఇదే, వారు ఒడంబడికను విచ్ఛిన్నం చేయరు ద్రోహంచేయరు. మరియు నేను మీతో అడిగాను’మీరు అతనీతో వారు మీతో పరస్పరం యుద్దం చేశారా ?అని దానికి మీరు ‘యుద్దంలో ఇద్దరూ సమానంగా గెలుపు ఓటములకు గురవుతారని చెప్పారు, నిజానికి దైవప్రవక్తలను పరీక్షించడానికి ఇలా జరుగుతూ ఉంటుంది చివరికి వారే విజయం సాధిస్తారు అతను మీకు ఏమి ఆదేశిస్తున్నాడు? అని అడిగాను మీరు అల్లాహ్ను ఆరాధించమని,ఆయనకు ఇతరులను భాగస్వాములుగా నిలబెట్టవద్దని, విగ్రహారాధన చేయకుండా నిషేధించారని, తాతముత్తాతల ఆరాధనను గ్రుడ్డిగా అనుసరించవద్దని అతను మాకు ఆజ్ఞాపించారని చెప్పారు మరియు నమాజు ప్రార్ధన,సత్యంగా ఉండటం,పవిత్రంగా ఉండటం,ప్రతిజ్ఞను పాలించడం,అమానతులను అప్పచెప్పాలని’ఆదేశించారని మీరు చెప్పారు.ఒకవేళ మీరు చెబుతున్నది నిజమైతే, అతను నా ఈ రెండు పాదాలు ఉన్న స్థలానికి త్వరలో యజమాని అవుతాడు. నిశ్చయంగా ఒక ప్రవక్త రాబోతున్నాడనే విషయం నాకు తెలుసు,కానీ అతను మీ నుండి ఉదయిస్తాడని నేను ఊహించలేదు,ఒకవేళ నేను ఆయనని కలువగలనని నమ్మకం ఉంటే నేను అతనిని కలవడానికి కష్టాలను ఎదుర్కుంటాను.ఒకవేళ నేను అతనితో ఉన్నట్లైతే,అతని రెండు పాదాలను కడుగుతాను.ఆపై అబుసుఫ్యాన్ చెప్పారు; తరువాత హిర్కల్ దైవప్రవక్త వ్రాసిన లేఖను తెప్పించారు, అతను దిహ్యాతో బుస్రా పాలకుడికి పంపాడు.అతను ఆ లేఖను హిర్కల్ కు సమర్పించాడు,అతను దానిని చదివాడు.ఆ లేఖలో ఈ సందేశం ఉంది; బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం! దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తరుపు నుంచి ‘రూమ్ చక్రవర్తి హిర్కల్’గారికి!అస్సాలాము అలా మనిత్తబఅల్ హుదా!{ఋజుమార్గం విశ్వసించినవారికి శాంతికలుగు గాకా} వ్రాయునది ఏమనగా-నిశ్చయంగా నేను మిమ్మల్ని ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నాను,ఇస్లాం స్వీకరించండి శాంతిని పొందుతారు,అల్లాహ్ మీకు రెండువంతుల పుణ్యాలను ప్రసాదిస్తాడు, ఒకవేళ మీరు నిరాకరిస్తే మీ ప్రజల పాపం మీ పై ఉంటుంది,[167] ‘ఓ గ్రంధవాహకులారా !రండి మీకు మాకు సమానామైన ఒక కలిమా వైపుకు’అల్లాహ్ ను మాత్రమే మనం ఆరాధించాలి,ఆయనకు సరిసమానంగా ఏ వస్తువును సాటి కల్పించకూడదు,మరియు మనలోని కొందరు మరికొందరిని అల్లాహ్’ను కాకుండా ప్రభువులుగా చేసుకోకూడదు,ఒకవేళ వారు వెనుతిరిగితే’మీరు ‘నిశ్చయంగా మేము ‘ముస్లిములము అని సాక్ష్యామివ్వండి’[168][169]
ఆంగ్ల మతప్రచారకుడు 'జాన్ సెంట్' యొక్క సాక్ష్యం:అతను ఇలా చెప్పాడు: “వ్యక్తుల మరియు సమాజ సేవలో ఇస్లాం మౌలిక సిద్దంతాలను,మూలాల వివరణలు మరియు సమానత్వం మరియు ఏకైత్వవాదం యొక్క పునాదుల ఆధారంగా సమాజాన్ని స్థాపించడంలో దాని న్యాయం గురించి నిరంతర అద్యయనం తరువాత నేను ఇస్లాంను బుద్ది మరియు ఆత్మతో స్వీకరించాను.మరియు నేను ఆ రోజు నుంచి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ‘ఇస్లాం ప్రచారకర్తగా ఒక దాయిగా,భోధకుడిగా సేవచేస్తానని అల్లాహ్ కు ప్రతిజ్ఞ చేశాను.
ఈ వ్యక్తి క్రైస్తవ మతాన్నిఅధ్యయనం చేసి,దానిలో ప్రావీణ్యం సంపాదించిన తరువాత ఇది మానవ జీవితానికి చెందిన అనేక ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఖచ్చితత్వానికి వచ్చాడు.కాబట్టి అతను దానిని అనుమానించడం ప్రారంభించాడు.తరువాత, అతను కమ్యూనిజం మరియు బౌద్ధమతాన్ని అభ్యసించాడు,కాని అక్కడ తనకు ఏమి కావాలో తెలుసుకోలేకపోయాడు,చివరకు ఇస్లాంను లోతుగా అధ్యయనం చేశాడు, తరువాత ఇస్లాం ను విశ్వసించాడు మరియు ధర్మప్రచారకుడిగా మారాడు.
ఇంతకు ముందు మీ కోసం చర్చించిన విషయాలు,ప్రవక్త యొక్క వాస్తవికత,దాని సంకేతాలు,రుజువులు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క దైవదౌత్య సంకేతాల గురించి వివరణ మీకు స్పష్టం చేయబడింది.దైవదౌత్య ముగింపు [ఖత్మే నబువ్వతు] పై చర్చించటానికి ముందు,అల్లాహ్ ఈ క్రింది కారణాలవల్ల తప్ప దైవప్రవక్తను పంపడు అనే విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి:
1) ప్రవక్త యొక్క సందేశం ఒక నిర్దిష్ట జాతి కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిందై ఉంటుంది, ఆ దైవప్రవక్తకు తన సందేశాన్ని పొరుగు దేశాలకు తెలియజేయమని ఆదేశించబడదు,అల్లాహ్ మరొక ప్రవక్తను ప్రత్యేక సందేశంతో మరొక దేశానికి పంపుతాడు!
2) మునుపటి ప్రవక్త యొక్క సందేశం అంతరించిపోయినప్పుడు అల్లాహ్ మరొక నూతన ప్రవక్తను వారి ధర్మాన్ని పునఃసంస్కరించమని పంపుతాడు.
3) మునుపటి ప్రవక్త యొక్క ధర్మశాస్త్రం ఆ కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేది తరువాతి కాలానికి అది తగినదై ఉండదు,అప్పుడు అల్లాహ్ మరొక దైవప్రవక్తను నూతన ధర్మ శాసనంతో,చట్టంతో పంపుతాడు,అది మరొక నిర్దిష్ట సమయం వరకు మరియు నిర్దిష్ట ప్రదేశానికి అనుకూలంగా ఉంటుంది,అయితే, అల్లాహ్ యొక్క వివేకానుసారం’ ఆయన మానవాళికి అన్ని కాలాలకు మరియు ప్రదేశాలకు అనువైన సందేశంతో ముహమ్మద్సల్లల్లాహు అలైహివ సల్లం ను పంపించదలచాడు,ప్రతీ రకమైన మార్పులు చేర్పులకు దూరంగా దాన్ని సంరక్షించాడు,తద్వారా ఎల్లప్పుడు ఆయన సందేశం విరసిల్లుతుంది,తద్వారా ప్రజలకు జీవన సందేశంగా ఇది మిగిలిపోతుంది.ఈ కారణంగానే అల్లాహ్ దానిని దైవదౌత్యాలకు ముగింపు ముద్ర గా మార్చాడు.[170]
అల్లాహ్ ముహమ్మద్’సల్లల్లాహు అలైహివ సల్లం’కు నొసగిన ప్రత్యేకతల్లో ఒకటి ఆయన అంతిమ ప్రవక్తగా’ప్రభవించబడ్డారు ఆయన తరువాత ఏ ప్రవక్త రాడు.ఎందుకంటే, అల్లాహ్ ఆయనతో దైవదౌత్యలను సంపూర్ణ పరిచాడు,ఆయనతో అన్నీ షరీఅతులను చట్టాలను ముగించాడు,ఆయనతో కట్టడనిర్మాణాన్ని పరిపూర్ణం చేశాడు మరియు ఈసా ప్రవక్త ఆయన గురించి ఇచ్చిన భవిష్యశుభవార్తను వాస్తవంగా నిరూపించాడు.ఆయన ఇలా చెప్పారు :- (మీరు పుస్తకాలలో ఎప్పుడూ చదవలేదా’ ఆ రాయిని నిర్మించేవారు తిరస్కరించారు అదే ఒక మూలకు తలగా మారింది) [185’] అల్'ఖుస్ ఇబ్రాహీం ఖలీల్ -తరువాత ఇస్లాం స్వీకరించారు-ఈ వచనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ తనగురించి చెప్పిన ఈ హదీసుతో ఏకీభవిస్తుంది. {నాది మరియు నాకు మునుపు గతించిన ప్రవక్తల ఉపమానం ఆ వ్యక్తి లాంటిది అతను ఒక ఇంటిని నిర్మించాడు,దాన్ని అత్యుత్తమంగా మలచి అతి సుందరంగా తీర్చిదిద్దాడు కానీ ఒక మూల‘ఇటుక’ పెట్టె ప్రదేశం మాత్రం వదిలేశాడు,ప్రజలు ఆ ఇంటిని చూడటానికి తరలి వస్తున్నారు ఆ ఇంటిని పరిశీలిస్తూ ఆశ్చర్యకితులవుతున్నారు,కానీ దానితో పాటు ఎందుకని ఇక్కడ ఒక ఇటుక’ పూరించలేదు’అని అంటున్నారు,దైవప్రవక్త సెలవిచ్చారు:-నేనే ఆ ఇటుకను మరియు నేనే ప్రవక్తలలో అంతిమ దైవప్రవక్తను}[171][172]
ఈ కారణంగానే అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన దివ్యగ్రంధాన్ని మునుపటి పుస్తకాలన్నిటిపై సాక్షిగా మరియు వాటిని తుడిచివేసేదిగా చేశాడు.ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన ధర్మశాస్త్రాన్ని మునుపటి శాసనాలను,చట్టాలను,ఆదేశాలను రద్దు చేశాడు మరియు ప్రవక్త షరీఅతు యొక్క రక్షణ బాధ్యతను అల్లాహ్ చేపట్టాడు,అందువల్ల దీని చదువు,లేఖనం విజయవంతంగా [ముతవాతిర్]వరుస క్రమపద్ధతిలో వ్యాప్తి చేయబడింది. ఏ క్రమంలో ఖుర్ఆను వరుసగా వ్యాప్తిజరిగిందో అదేవిధంగా దైవప్రవక్త హదీసులు బోధనలు,ఆచరణలు ముతవాతిర్ క్రమంలో నకలు చేయబడ్డాయి,అదే విధంగా ఈ ధర్మ శాసనాలు,ఆరాధనలు,సున్నతులు సాంప్రదాయాలు,ఆదేశాలు నియమాలు కూడా వరుసగా ముతవాతిర్ క్రమంలో ప్రచారం చేయబడ్డాయి.
ఎవరైతే ప్రవక్తజీవిత చరిత్ర మరియు హదీసు గ్రంధాల జ్ఞానాన్ని పొందుతాడో అతను తెలుసుకుంటాడు, దైవప్రవక్త అనుయాయులు, సహచరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క పరిస్థితులను, వచనాలను,కథనాలను,పనులను మానవాళి కొరకు సంరక్షించారని తెలుస్తుంది.వారు తన ప్రభువు కొరకు ఆయన చేసిన ఆరాధనలను,ధర్మపోరాటాలను,స్మరణలను,ఇస్తెగ్ఫార్’ ఆయన ఔదార్యాన్ని,ధైర్యం,తన సహచరులతో మరియు తనిని సందర్శించే వారితో గల వ్యవహారాలను,సంబంధాన్నికూడా వారు నిక్షిప్త పరిచి ప్రచారం చేశారు.అదేవిధంగా వారు ఆయన ఆనందం, దుఃఖం, అన్నపానీయాలు, వస్త్రధారణ, ప్రయాణాలు, నివాసం, మరియు నిద్రించే, మెల్కునే మర్యాదలు ప్రభోదించేవారు. ఇవన్నీ మీకు తెలిసినప్పుడు, మీకు ఈ ధర్మం అల్లాహ్ యొక్క సంరక్షించడం వల్లనే సురక్షితంగా ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది మరియు దాంతో పాటు మీరు ఆయన ప్రవక్తలకు,సందేశహరుల పరంపరను ముగించే అంతిమ చిట్టచివరి ప్రవక్త అని కూడా తెలుసుకుంటారు,ఎందుకంటే ఆయన సర్వప్రవక్తలలో అంతిమ దైవప్రవక్త అనే విషయాన్ని అల్లాహ్ మాకు చెప్పాడు. అల్లాహ్ ఇలా చెప్తున్నాడు:- ఎందుకంటే ఆయన సర్వప్రవక్తలలో అంతిమ దైవప్రవక్త అనే విషయాన్ని అల్లాహ్ మాకు తెలియజేశాడు,అల్లాహ్ ఇలా చెప్తున్నాడు:- {(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.}[173] దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ స్వయంగా తెలిపారు మరియు నేను సమస్త సృష్టి వైపుకు ప్రవక్తగా ప్రభవించబడ్డాను మరియు నా ద్వారా ప్రవక్తల పరంపర ముగిసింది'[174].
ఇప్పుడు ఇస్లాంను నిర్వచించి దాని వాస్తవికత, దాని మూలాలు, స్థంభాలు మరియు దశలను వివరించే సమయం వచ్చింది.
కలిమా-ఏ-'ఇస్లాం యొక్క అర్ధం
మీరు భాషా నిఘంటువులను పరీక్షిస్తే ‘ఇస్లాం’ అనే పదానికి అర్ధం "అంగీకరణ, సమర్పణ, లొంగిపోవటం, ప్రకటించడం, అమీర్ ఆదేశాన్ని, నిషేదాన్ని పాటించడం మరియు అభ్యంతరం లేకుండా పూర్తి చేయడం"అని మీకు తెలుస్తుంది. అల్లాహ్’తఆలా నిజమైన ఈ సత్యధర్మానికి ‘ఇస్లాం’ అని పేరు పెట్టాడు,ఎందుకంటే ఎటువంటి అభ్యంతరం లేకుండా అల్లాహ్ ఆజ్ఞలకు లొంగడం ఆయనకు విధేయత చూపడం,ఆయన కొరకు ఆరాధనను ప్రత్యేకించడం,ఆయన మాటలను విశ్వసించడం మరియు ఆయనపై విశ్వాసం కలిగి ఉండటం.మరియు ముఖ్యంగా ముహమ్మద్ సల్లల్లాహ్ అలైహివ సల్లం తెచ్చిన షరీఅతు,ధర్మం పేరు ఇస్లాం గా మారింది.
అత్తారీఫు బిల్ ఇస్లాం- [175].
ఈ ధర్మం పేరు ఇస్లాం అని ఎందుకు పెట్టబడింది? నిస్సందేహంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ మతాలకు వాటి పేర్లు ఉన్నాయి,అవి తమ మతాలకు చెందిన ఒక ప్రత్యేక వ్యక్తి పేరుతో లేదా ప్రత్యేక జాతితో ప్రసిద్దిపొందాయి,క్రైస్తవమతానికి ‘యేసుక్రీస్తు పేరుతో పేరుపెట్టారు; బౌద్ధమతానికి దాని వ్యవస్థాపకుడైన బుద్ధుడి పేరు పెట్టబడింది; మరియు జరదుశ్త్’ఈ పేరుతో ప్రసిద్ది,దాని స్థాపకుడు మరియు జెండా ఎగరవేసినవాడు ‘జరాదష్ట్ ‘ పేరుగల వ్యక్తి ఆ పేరుపెట్టారు.యాహూజా’అనే ఒక ప్రసిద్ద తెగ పేరుతో యూదమతం [జుడాయిజం]ఉద్భవించింది.అందువల్ల దీనికి యాహూది’యూదమతం’అని పేరుపెట్టారు,మొదలైనవి. కానీ అల్ 'ఇస్లాం' అలా కాదు,ఎందుకంటే దానికి ఆ పేరు ఒక ప్రత్యేక వ్యక్తి వల్ల గాని ,ప్రత్యేక జాతి వల్ల గానీ పేరు ఆపాదించబడలేదు,ఆ పేరు ‘ఇస్లాం’పదంలో ఉండే ఒక ప్రత్యేక గుణం,విశేషణం వైపుకు సూచిస్తుంది. ఈ పేరు సైతం ఈ ధర్మాన్ని స్థాపించినవాడు,ఉనికిలోకి తెచ్చినవాడు మనిషి కాదు అని నిరూపిస్తుంది,మరియు ఈ ధర్మం ఒక సముదాయం కోసం ప్రత్యేకమని,ఇతరులకు ఇందులో హక్కు లేదనే విషయాన్ని కూడా ఖండిస్తుంది,మరియు దీని లక్ష్యం ఏమిటంటే ‘భూమిపై ఉన్నవారందరూ ఇస్లాం విశేష గుణాల తో తమను తాము ప్రత్యేకించుకోవాలి,ఎవరైతే ఈ ప్రత్యేకతను పొందుతారో అతను పురాతన వాటికి చెందినవాడైన నూతనవాటికి చెందినవాడైన ‘అతను ముస్లిం అవుతాడు.మరియు రాబోయే తారాల్లో ఎవరైనా దీనిని స్వీకరిస్తారో అతను ముస్లిముగా వ్యవహరించబడతాడు.
ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక నిర్దిష్ట సూత్రాన్ని మరియు స్థిరమైన ప్రమాణానికి లోబడి ఉంటుందని తెలుసు.సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మరియు భూమి ఇవన్నీ ఒక సాధారణ నియమానికి లోబడి ఉంటాయి,దానికి విరుద్దంగా అవి వెంట్రుకవాసం కూడా జరగవు.అలాగే మనిషి కూడా,మనిషి తన స్థితిగతుల గురించి బాగా ఆలోచించినప్పుడు,అతను అల్లాహ్ యొక్క చట్టాలకు సంపూర్ణంగా తలొగ్గుతున్నదని మీకు తెలుస్తుంది.అల్లాహ్ విధి కోరితే తప్ప మనిషి శ్వాస తీసుకోలేడు,నీరు, ఆహారం,కాంతి మరియు వేడి అవసరము’కలుగదు, జీవనచక్రాన్ని ఆయనే నడిపిస్తున్నాడు;మనిషి శరీరంలోని అవయవాలన్ని అల్లాహ్ నిర్దారించిన విధి ప్రకారమే పని చేస్తున్నాయి, ఈ అవయవాలు చేసే విధులు,పనులన్నీ అల్లాహ్ నిర్దారించిన విధి ప్రకారం నిర్వహిస్తాయి.
ఈ సంపూర్ణ దైవవిధి,సృష్టిలోని సర్వం ఆయన ఆజ్ఞను పాటిస్తుంది,ఆయనను ధిక్కరించే వారు ఈ విశ్వంలో ఎవరూ లేరు – ఆకాశంలోని విశాలమైన పెద్దగ్రహాల నుండి భూమి యొక్క ఇసుకలోని అతిచిన్నరేణువు వరకు –అన్నీ ఏకైకుడైన సర్వశక్తిమంతుడు,సార్వభౌమధికారి మరియు ఆరాధ్యుడి తక్దీరుకు చెందినవి.భూమ్యాకాశాలు మరియు అందులో ఉన్నవన్నీ ఈ తక్దీరు విధి ఆజ్ఞను పాటిస్తున్నాయి, ఈ విశ్వ ప్రపంచం మొత్తం దానిని సృష్టించిన ఆ సర్వశక్తిమంతుడైన సార్వభౌమాధికారి ఆజ్ఞను శిరసావహిస్తుంది.ఈ విషయంతో,ఇస్లాంయే విశ్వమంతటికి ధర్మం అని స్పష్టమవుతుంది.ఎందుకంటే ఇస్లాం’అంటేనే ‘విధేయత చూపడం,మరియు నిరభ్యంతరంగా ఆదేశకుడి ఆజ్ఞలను,నిషేదాలను’పాలించడం,అని మీరు ఇప్పుడే తెలుసుకున్నారు! ’సూర్యుడు,చంద్రుడు,మరియు భూమి ఆయన ఆజ్ఞను పాటిస్తాయి,మరియు గాలి,నీరు,కాంతి,చీకటి మరియు వేడి ఆయన ఆదేశాలు పాటిస్తాయి,అలాగే చెట్టు,పుట్ట రాయి రెప్ప పశువులు జంతువులు’కూడా ఆయనకు విధేయత చూపుతాయి,చివరికి ప్రభువును గుర్తించనివాడు,ఆయన అస్తిత్వాన్ని తిరస్కరించేవాడు,ఆయన సూచనలను తిరస్కరించేవాడు లేదా మిథ్యదైవాలను పూజించేవాడు,ఇతరులను ఆయనకు సాటికల్పించేవాడు’-వీరందరూ అల్లాహ్ వారిని పుట్టించిన సహజస్వభావం ప్రకారం ఆయన ఎదుట లొంగి ఉన్నారు.
మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా,రండి మనిషి’ని పరిశీలిద్దాం,అతనిలో రెండు భిన్నమైన విషయాలు కనిపిస్తాయి.
ఒకటి: అల్లాహ్ పుట్టించిన మనిషి యొక్క సహజస్వభావం;అదే’ అల్లాహ్కు సమర్పించుకోవడం,ఆయనను ఆరాధించడం,ప్రేమించడం, ఆయన సామీప్యత పొందటం,ఆయన ప్రేమించే సత్యాన్ని, మంచిని, నిజాయితీని ప్రేమించడం; ఆయన ద్వేషించే అబద్ధం, చెడు, అన్యాయం మరియు తప్పులను ద్వేషించడం;మరియు దీని ప్రకారంగా ఫిత్రత్ యొక్క సర్వ కర్మలు జరుగుతాయి:డబ్బు, కుటుంబం మరియు పిల్లలపై ప్రేమ మరియు ఆహారం, పానీయం మరియు వివాహ కోరిక మరియు మన శరీరానికి అవసరమయ్యే ఇతర పనులు,ఇతర ఆవశ్యకరమైన శారీరక విధులు.
రెండు:- మనిషి యొక్క స్వేచ్ఛా సంకల్పం మరియు ఎంపిక:- అల్లాహ్ మనిషి కొరకు ప్రవక్తలను పంపించాడు,పుస్తకాలను అవతరింపచేశాడు,తద్వారా అతను సత్యానికి, అబద్ధానికి,న్యాయం అన్యాయం,సన్మార్గం అపమార్గం మంచి, చెడు మధ్య తేడాను వ్యత్యాసాన్ని గుర్తించగలడు,బుద్ది తెలివిని ప్రసాదించాడు,తద్వారా అతను ఖచ్చితమైన జ్ఞానంతో ఎంపిక చేసుకోవచ్చు.ఒకవేళ అతను మంచిమార్గం పై నడవాలని కోరుకుంటే,అది అతనికి సన్మార్గం,సత్యం వైపుకు మార్గదర్శనం చేస్తుంది;ఒకవేళ అతను చెడు కోరుకుని దానిని చేయాలని ఇష్టపడితే,అది అతనికి చెడు మరియు నాశనానికి దారి తీసే మార్గదర్శనం చేస్తుంది.
మీరు మొదటిరకం యొక్క దృక్పథంలో ఆలోచించి మనిషిని చూస్తే, అతను పుట్టుకతోనే తక్దీర్’విధి’ ఆదేశానుసారం సమర్పించటానికి విధేయత చూపడానికి సృష్టించబడ్డాడని మీరు తెలుసుకుంటారు, సహజంగానే వాటిని పాటిస్తాడు,వాటి నుండి తప్పించుకోలేడు, ఈ విషయంగా అతను మరియు ఇతర జీవులన్నీసమానమే.
మీరు రెండవ రకం యొక్క దృక్పథంలో ఆలోచించి మనిషిని చూస్తే అతన్ని సొంతనిర్ణయాధికారిగా పొందుతారు ,అతను కోరింది ఎంచుకుంటాడు,అప్పుడు అతను ముస్లిముగా మారుతాడు లేదా కాఫీరుగా అవిశ్వాసిగా మారుతాడు. [కృతజ్ఞత తెలుపుకునేవాడు లేదా ఆవిశ్వసించేవాడు'}[176]
అంచెత మీరు ప్రజలను రెండు రకాలుగా పొందుతారు :
ఒక వ్యక్తి తన సృష్టికర్తను గుర్తిస్తాడు,మరియు అతన్ని ప్రభువు మరియు యజమానిగా,ఆరాధ్యుడిగా విశ్వసిస్తాడు,కేవలం ఆయనను మాత్రమే ఆరాధిస్తాడు తన సొంత అభీష్టానుసార జీవితంలో ఆయన శాసనలను చట్టాన్ని అనుసరిస్తాడు.ఏవిధంగా అతని ప్రభువు స్వాభావికంగా విధేయత చూపే విధంగా సృష్టించబడ్డాడో,దాని నుంచి ఎవరికి సెలవు లేదు,అతను తన తక్దీర్ విధి పై నడుస్తాడు,మరియు తన ఇస్లాంను పూర్తిచేసుకున్న సంపూర్ణ ముస్లిము ఇతనే,అతని జ్ఞానం నిజమైనది ఎందుకంటే అతను సృష్టికర్త అయిన అల్లాహ్ ను గుర్తించాడు,ఆయన అతని కొరకు ప్రవక్తలను పంపాడు,అతనికి జ్ఞానాన్నిమరియు నేర్చుకునే శక్తిసామర్ధ్యాలను ప్రసాదించాడు,తద్వారా అతని బుద్ది మరియు తెలివి సరైన దిశను పొందాయి. ఎందుకంటే వాటిని అతను ఉత్తమంగా ఉపయోగించి తనకు అనివార్యమైన విషయాల గురించి ఆలోచించి అతిముఖ్యమైన విషయాల గురించి పరిశీలించి వాటీని అర్ధంచేసుకునే భాగ్యాన్ని కల్పించాడు,దాంతో అతని నోరు సరైనదిగా మారింది,అది న్యాయం మాట్లాడుతుంది,ఎందుకంటే అది ఇప్పుడు కేవలం ఏకైకుడైన ప్రభువు మాట వింటుంది,ఆయనే మాట్లాడే,సంభాషించే శక్తిని ప్రదానం చేసి అనుగ్రహించాడు అంటే అతని జీవితంలో సత్యమే ఉంది,ఎందుకంటే అతను షరీఅతు కు సంభందించిన అల్లాహ్ ఆదేశాలను పాటించడమే కాకుండా స్వతహాగా తన అభీష్టమైన కార్యల్లో కూడా అల్లాహ్’కు విధేయత చూపుతున్నాడు,మరియు సృష్టిరాశులకు మరియు అతనికి మధ్య గుర్తింపు మరియు ప్రేమబంధం నెలకొంది.ఎందుకంటే అతను కేవలం వివేచనపరుడు మహాజ్ఞాని అయిన అల్లాహ్’ను మాత్రమే ఆరాధిస్తాడు,సర్వసృష్టి అతని ముందు సాష్టాంగపడుతుంది,ఆయన ఆజ్ఞకు లొంగుతుంది,ఆయన విధిరాతను పాటిస్తుంది!మరియ మనిషి కూడా,ఆయన నీకోసమే వాటన్నింటిని పనిలో పెట్టాడు.
దీనికి విరుద్ధంగా, మరొక వ్యక్తి, అల్లాహ్కు లొంగిపోయి, తన జీవితమంతా అల్లాహ్కు లొంగి జీవించాడు, కాని ఈ సమర్పణను, విధేయతను అతను ఎప్పుడూ గ్రహించలేదు లేదా దాని గురించి ఏమి ఆలోచించలేదు. తన ప్రభువును గుర్తించలేదు ఆయన ధర్మశాస్త్రాన్ని విశ్వసించలేదు అతని దైవప్రవక్తలను అనుసరించలేదు. తన చెవులను, కళ్ళను చెక్కిన సృష్టికర్తను గుర్తించడానికి అల్లాహ్ ఇచ్చిన జ్ఞానం మరియు తెలివితేటలను అతను ఉపయోగించలేదు. అతను దైవం ఉనికిని తిరస్కరించాడు, ఆయన ఆరాధన నుండి వెన్నుచూపాడు,మరియు నిర్ణయాధికారం గల తన జీవిత విషయాలలో అల్లాహ్ శాసనలను, ఆదేశాలను పాటించడాన్నినిరాకరించాడు, లేదా ఇతరులకు భాగస్వామ్యం కల్పించాడు. మరియు ఆయన ఏకత్వాన్నిరుజువు చేసే సంకేతాలను విశ్వసించడాన్ని, నమ్మడాన్ని నిరాకరించాడు. ఇలాంటి వ్యక్తిని’ కాఫీర్’[అవిశ్వాసి] అని పిలుస్తారు ఎందుకంటే 'కుఫ్ర్' యొక్క అర్ధం 'దాచడం,కప్పడం, కాబట్టి ఈ మనిషిని 'కాఫీర్' అని పిలుస్తారు’ కాఫిర్ పదం ఇలా చెప్పబడుతుంది :-{ كفر درعه بثوبه إذا غطاها به ولبسه فوقها } ‘వ్యక్తి కవచాన్నివస్త్రంతో కప్పి దానిపై దుస్తులు తొడిగినప్పుడు ‘అతను తన కవచాన్నివస్త్రంతో దాచాడు’అని అంటారు,అదే విధంగా ఈ వ్యక్తిని కూడా కాఫీరు అని పిలుస్తారు,ఎందుకంటే అతను తన స్వభావాన్ని దాచిపెట్టి, దానిని అజ్ఞానం మరియు తెలివితక్కువతనంతో కప్పివేస్తాడు. మీకు మంచిగా తెలిసింది అతను ఇస్లాం స్వభావం పై పుట్టాడు,అతని శరీరం యొక్క పూర్తి అవయవాలు ఇస్లాం స్వభావం అనుసారం పనిచేస్తాయి. మరియు అతని చుట్టుగల సృష్టికూడ ‘సమర్పణ’[ఇస్తేస్లామ్] మార్గం పై నడుస్తుంది,కానీ అతను తన అజ్ఞానం,మందబుద్ది తో తెరవేసి దాచాడు,మరియు ప్రాపంచిక స్వభావం మరియు అతని సొంత స్వభావం కూడా అంతర్దృష్టి నుండి దాచివేయబడింది,కాబట్టి మీరు చూస్తూ ఉంటారు అతను తన ఆలోచన మరియు విద్యాజ్ఞాన శక్తిని తన సహజస్వభావానికి వ్యతిరేఖంగా ఉన్న సముదాయాల్లో ప్రయోగిస్తాడు,అతనికి తనకు వ్యతిరేఖమైన వస్తువులు కనిపిస్తాయి,స్వభావాన్ని అసత్యకరించే పనులకోసమే అతను కృషి చేస్తాడు.
కాబట్టి ఇప్పుడు మీరు స్వతహాగా,అవిశ్వాసి ఎంతటి భ్రష్టత్వానికి గురై ఉన్నాడు మరియు ఎంతటి మూఢఅందకారంలో మునిగి ఉన్నాడు’అని ఆలోచించండి. {191}
మీ నుండి ఆశించబడే ఇస్లాం ఇదియే,ఈ ఇస్లాం ను పాటించడం కష్టమైన విషయం కాదు,కాని అల్లాహ్ ఎవరికి సౌలభ్యం ప్రసాదిస్తాడో వారికి చాలా సులభం.ఈ ఇస్లాం’నే విశ్వమంతా అనుసరిస్తుంది. {ఆకాశంలోనూ, భూమిలోనూ, ఉన్నవారంతా తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ఉన్నారు'}[177] మరియు అది అల్లాహ్ యొక్క ధర్మం! అల్లాహ్ తెలియజేశాడు {నిస్సందేహంగా ఇస్లాం'యే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం}[178] అల్లాహ్ కొరకు స్వీయాన్నిసమర్పించుకోవడం'ఇస్లాం అంటారు. {ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే ‘నేనూ నా అనుచరులు దైవ విధేయతకు తల ఒగ్గాము’అని వారికి చెప్పేయి’}[179] మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇస్లాం'అర్ధాన్ని వివరిస్తూ ఇలా తెలిపారు:- (నీ హృదయాన్ని అల్లాహ్ కొరకు సమర్పించు,నీ ముఖాన్ని అల్లాహ్'వైపుకు మరల్చు మరియు విధి జకాతు చెల్లించు')[180] ఒకవ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో 'ఇస్లాం'అంటే ఏమిటి?అని అడిగాడు,ప్రవక్త తెలిపారు'నీ హృదయం అల్లాహ్'కొరకు సమర్పించడం,మరియు నీ నోటి బారినుండి నీ చేతి బారినుండి ముస్లిములు సురక్షితంగా ఉండాలి'-అతను అడిగాడు:ఏ ఇస్లాం మేలైనది?ప్రవక్త'అల్'ఈమాను'అని చెప్పారు,దానికతను'అల్'ఈమాను'అంటే ఏమిటి?అని అడిగాడు,ప్రవక్త చెప్తూ:-[అల్లాహ్'ను విశ్వసించడం,అల్లాహ్ దూతలను ,ఆయన గ్రంధాలను,ఆయన ప్రవక్తలను'మరణాంతర జీవనాన్నివిశ్వసించడం'అనిచెప్పారు[181] మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:- [అల్ ఇస్లాం'అంటే: లా ఇలాహ ఇల్లల్లాహు'వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్'అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యుడు లేడు,మరియు నిస్సందేహంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు']మరియు నమాజు స్థాపించడం,జకాతు చెల్లించడం,రమదాను ఉపవాసాలు ఉండటం,అల్లాహ్ గృహం [కాబతుల్లాహ్] హజ్జ్ చేయడం,ఒకవేళ వెళ్లగలిగే స్తోమత ఉన్నట్లైతే'-}[182] మరియు దైవప్రవక్త సెలవిచ్చారు:-{ వాస్తవ 'ముస్లిము'ఎవరంటే -అతని చేతితో,నోటితో ముస్లిములు పరిరక్షించబడతారు} [183]
మరియు ఈధర్మం'ఇస్లాం ధర్మం తప్ప మరొక ధర్మాన్ని అల్లాహ్ ఆమోదించడు'అది ప్రధముల నుండి కావొచ్చు,భవిష్యుల నుంచి కావొచ్చు.ఎందుకంటే సమస్త ప్రవక్తలు ఇస్లాం ధర్మం'ను అనుసరించారు,మహోన్నతుడైన అల్లాహ్ నూహ్ ప్రవక్త గురించి ఇలా తెలిపాడు:- {నువ్వు వారికి నూహ్ అలైహిస్సలాం గాధను వినిపించు,అప్పుడు అతను తన జాతివారితో’ఓ నా జాతి ప్రజలారా!నేను మీ మధ్య ఉండటం దైవాజ్ఞలకు ఉపదేశించడం మీకు సహింప శక్యం కాకపోతే పోనివ్వండి,నేను మాత్రం అల్లాహ్’నే నమ్ముకున్నాను.} ఈ ఆయతు వరకు :- మరియు 'నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞా పించబడింది’ మరియు ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు:- {అతని ప్రభువు అతనితో: "(మాకు) విధేయుడవుగా (ముస్లింగా) ఉండు" అని అన్నప్పుడు అతను: " నేను సర్వలోకాల ప్రభువునకు విధేయుడను (ముస్లింను) అయిపోయాను" అని జవాబిచ్చాడు.}[184] మరియు మూసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు {మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్) పైననే నమ్మకం ఉంచుకోండి."}[185] మరియు ఈసా మసీహ్ అలైహిస్సలాం గురించి ఇలా తెలిపాడు:- {మరియు నేను, (ఈసా) శిష్యుల (హవారియ్యూన్ ల) మనస్సులలో ఇలా మాట వేసినప్పుడు: "నన్ను మరియు నా ప్రవక్తను విశ్వసించండి." వారన్నారు: " మేము విశ్వసించాము మరియు మేము ముస్లింలము అయ్యాము అనే మాటకు సాక్షిగా ఉండు!"}[186][187]
మరియు ఈ ధర్మం-ఇస్లాం-దీని శాసనాలు,విశ్వాసాలు,ఆదేశాలు,అల్లాహ్ యొక్క దైవవాణి'-దివ్యఖుర్ఆను మరియు సున్నతు-నుంచి వెలువడుతాయి,-వీటి గురించి త్వరలో మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాము.
అసత్య మతాలు మరియు మానవ సృష్టిత మతాల అనుచరులు పురాతన యుగానికి చెందిన పుస్తకాలను, పూర్వీకుల నుండి వారసత్వంగా పొందిన పుస్తకాలను పవిత్రంగా భావించడం మరియు వాటిని గౌరవించడం’అలవాటుగా చేసుకున్నారు, వాటిని లిఖించినది,అనువదించినది,ఏ యుగానికి చెందినది? అనే నిజం ఎవరికి తెలియదు,కానీ బలహీనత, లోపం, కోరిక, మనోవాంఛలు, మరుపు’ మరియు ఇంకేన్నో లోపాలు కలిగి ఉన్న వ్యక్తులచే అవి వ్రాయబడ్డాయి.
కానీ ఇస్లాం ఇతర మతాల కంటే విభిన్నమైనది,ఒక ప్రత్యేకతను కలిగి ఉంది,ఎందుకంటే అది స్వచ్చమైన నిజమైన నికార్సైన ’దివ్యఖుర్ఆను, సున్నతు పై ఆధారపడి ఉంది. వీటిని సంక్షిప్తంగా ఇక్కడ వివరిస్తున్నాము.
ఇస్లాం అల్లాహ్ యొక్క ధర్మం అని ఇంతకు ముందు తెలిపిన విషయాల ద్వారా మీకు తెలిసి ఉంటుంది, అందుకే అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ [సల్లల్లాహు అలైహివ సల్లం]పై దివ్యఖుర్ఆన్ గ్రంధం’ను ప్రజల మార్గదర్శకానికై అవతరింపచేశాడు, దాన్నిముస్లింల కొరకు ధర్మశాసనంగా చేశాడు, అందులో అల్లాహ్ కోరిన ప్రజల హృదయాలకు స్వస్థత సమకూర్చాడు, ఎవరికొరకు అల్లాహ్ మేలును,కాంతిని కోరుకుంటాడో వారి కొరకు అది జ్యోతిని ఇస్తుంది, సాఫల్యం ప్రసాదిస్తుంది. అల్లాహ్ ప్రవక్తలను పంపిన మూల పునాదులపై ఈ ఖుర్ఆను గౌరవించబడింది. దివ్యఖుర్ఆన్’దైవం నుంచి అవతరించిన మొదటి ఆకాశగ్రంధం కాదు మరియు ముహమ్మద్’[సల్లల్లాహు అలైహివ సల్లం] ప్రభవించబడిన మొదటి ప్రవక్త కూడా కాదు. అల్లాహ్ ఇబ్రహీము అలైహిస్సలాము పై లేఖనాలను,పత్రాలను దించాడు; తౌరాతు మూసా అలైహిస్సలాము పై, జబూర్ దావూదు అలైహిస్సలాం పై,ఇంజీలు ఈసా అలైహిస్సలాం పై అవతరించాయి!ఈ పుస్తకాలన్నీ అల్లాహ్ తరుపు నుండి ప్రవక్తలు మరియు సందేశహరుల పై అవతరించాయి.అయితే ఇందులో చాలా పుస్తకాలు అంతరించిపోయాయి,అధిక భాగం రూపుమారింది,మార్పులు,చేర్పులు జరిగాయి.
కానీ ఖుర్ఆను సంరక్షణ బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు,దానిని కలకాలం ఉండేదిగా మరియు పురాతన పుస్తకాలను రద్దుపరిచేదిగా చేశాడు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఇంకా ఓ ప్రవక్తా మేము నీ వైపుకు ఈ గ్రంధాన్ని సత్యాసమేతంగా అవతరింపచేసాము, అది తన కన్నా ముందు వచ్చిన గ్రంధాలను సత్యమని ధృవీకరిస్తుంది వాటిని పరిరక్షిస్తుంది']204] మరియు అల్లాహ్ దానిని ప్రతీదానిని వివరించి చెప్పేదిగా వర్ణించాడు అల్లాహ్ సెలవిచ్చాడు:- [మరియు’మేము నీపై ఈ గ్రంధాన్ని అవతరింపచేసాము’అందులో ప్రతీ విషయం విశదీకరించబడింది} [188] మరియు ఈ దివ్యపుస్తకంలో (హిదాయతు)మార్గదర్శనం మరియు కరుణ ఉన్నాయి. {మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి ఒక స్పష్టమైన గ్రంధం,మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది }[189] మరియు ఈ గ్రంధం ఖుర్ఆను దృఢమైన సన్మార్గాన్ని చూపిస్తుంది. {నిశ్చయంగా ఈ 'అల్ ఖుర్ఆను'దృఢమైన సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేస్తుంది}[190] మరియు ఈ ఖుర్ఆను మానవ జీవితానికి ప్రతీ మలుపు పై అత్యుత్తమమైన మార్గాన్నిసూచిస్తుంది.[191]
ఈ ఖుర్ఆను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం కోసం మిగిలి ఉండిపోయే ఒక అద్భుతం,గత పవక్తల అద్భుతాలు వారి మరణంతో ముగిసిపోయేవి కానీ ఖుర్ఆను’ను అల్లాహ్ తఆలా చెదిరిపోనీ మిగిలిపోయే సాక్షిగా నిలబెట్టాడు.
అది చాలా పెద్ద సాక్ష్యం మరియు స్పష్టమైన సంకేతం,దానిద్వారా అల్లాహ్ తఆలా ప్రజలకు సవాలు విసిరాడు ‘ఇలాంటి ఖుర్ఆను ను తీసుకుని రమ్మని,లేదా అలాంటి పది సూరాలను తీసుకురమ్మని’లేదా ఒక సూరా తీసుకురమ్మని’సవాలు చేశాడు కానీ వారు అలా చేయలేకపోయారు,ఈ ఖుర్ఆను అవతరణ ఏ జాతిప్రజలపై జరిగిందో వారు భాషాశాస్త్ర నైపుణ్యంలోప్రావీణ్యులు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"}[192]
ఈ ఖుర్ఆను అల్లాహ్ తరుపున అవతరించినదనడానికి సాక్ష్యం’ఏమిటంటీ ఇందులో గతజాతులకు సంభంధించిన యధార్ధ కథలు ఉన్నాయి,అది రాబోయే జాతుల గురించి పూసగుచ్చినట్లు ప్రస్తావిస్తుంది,మరియు అందులో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు వర్ణించబడ్డాయి,ఆ విషయాల లోతుల్లోకి వైజ్ఞానులు నేటియుగంలో చేరుకున్నారు. ఈ ఖుర్ఆను అల్లాహ్ తరుపు నుండి వాణి[వహీ]గా అవతరించిందనడానికి ఒక సాక్ష్యం ‘ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వద్ద ఈ ఖుర్ఆను అవతరణకు పూర్వం దీనిని పోలిన ఎటువంటి పుస్తకం లేదు,మరియు ఆయన నుంచి ఇలాంటి మాట మొదట ఎప్పుడు వినిపించలేదు,అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {(ఇంకా ఇలా) అను: "ఒక వేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా? ఏమీ? మీరిది గ్రహించలేరా?"}[193] ఆయన చదవడం రాయడం తెలియని ఒక నిరక్ష్యరాసి,ఏ జ్ఞాని వద్దకు ఏ గురువు వద్దకు ఎప్పుడు ఆయన వెళ్లింది లేదు,అయినప్పటికి ఆయన తన జాతి యొక్క భాష కోవిదులకు,విజ్ఞానులకు ఇలాంటి ఖుర్ఆను ను వ్రాసి తీసుకురావాలని’సవాలు చేసేవారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. {మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు. అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు.}[194] ఈ నిరక్ష్యరాసి’గురించి తౌరాతు మరియు ఇంజీలు గ్రంధములో ప్రస్తావించబడింది,అతనికి చదవడం వ్రాయడం తెలియదు’ మరియు అతనివద్దకు తౌరాతు మరియు ఇంజీలు-భాగం కలిగిన యూదులు,క్రైస్తవుల పాస్టర్లు పండితులు వచ్చి వివాదల గురించి అడిగేవారు,పరస్పర జగడాల సమస్యలను ఆయన వద్దకి తీసుకెళ్ళేవారు,తౌరాతు మరియు ఇంజీలు’లో అల్లాహ్ తఆలా దైవప్రవక్త గురించి వివరిస్తూ ఇలా తెలియజేశాడు:- {"ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు. కావున అతనిని సమర్థించి, అతనితో సహకరించి, అతనిపై అవతరింపజేయబడిన జ్యోతిని అనుసరించే వారు మాత్రమే సాఫల్యం పొందేవారు".}[195] మరియు అల్లాహ్ ముహమ్మద్ స ను యూదులు క్రైస్తవులు అడిగిన ప్రశ్నకు స్పష్టంగా ఇలా జవాబిచ్చారు:- {గ్రంధప్రజలు మీతో అడుగుతున్నారు'మీరు వారిపై ఆకాశం నుండి గ్రంధాన్నిఅవతరింపచేయాలి'అని }[196] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {మరియు వారు మీతో ఆత్మ(రూహు)గురించి ప్రశ్నిస్తున్నారు }[197] అల్లాహ్ సెలవిచ్చాడు: {వారు మీతో జిల్'ఖర్నైన్'గురించి ప్రశ్నిస్తున్నారు'}[198] అల్లాహ్ సెలవిచ్చాడు: {నిశ్చయంగా,ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.}[199]
పాస్టర్ ఇబ్రాహీం ఫేల్బస్’తన పి.హెచ్.డి ఆద్యాయనంలో ‘ఖుర్ఆనులో లోపాలను తీయడానికి ప్రయత్నించాడు’కానీ ఎప్పటికీ తీయలేకపోయాడు,ఎందుకంటే ఖుర్ఆను దృఢమైన సాక్ష్యాలతో అతన్ని అసమర్ధుడిగా నిలబెట్టింది,ఆ తరువాత అతను ఓడిపోయానని ఒప్పుకున్నాడు,మరియు తన ప్రభువు ఎదుట సాష్టాంగపడి ఇస్లాం స్వీకరించాడు.[200]
“ఒక ముస్లిము వ్యక్తి అమెరికా’కు చెందిన డాక్టర్’ జాఫరీలాంగ్’కు ఒక ఖుర్ఆను’ అనువాద పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ‘అతను ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ’అందులో ‘ఖుర్ఆను స్వయంగా ప్రశ్నిస్తుంది మరియు వాటికి స్వయంగా జవాబిస్తుంది’ మరియు తనకు మరియు ఖుర్ఆనుకు మధ్యగల అంతర్మధనాన్ని దూరంచేస్తుంది’ అతను ఇది కూడా చెప్పాడు-{ఈ ఖుర్ఆనును అవతరింపచేసినవాడు నా కంటే ఎక్కువ నా గురించి తెలిసినవాడు’’- వాస్తవానికి ‘మనిషిని పుట్టించినవాడే ఈ ఖుర్ఆను గ్రంధాన్ని కూడా అవతరింపచేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!}[201] అయితే అతను ఖుర్ఆను అనువాదాన్ని చదవడం వలన ఇస్లాం స్వీకరించారు మరియు ఈ పుస్తకాన్ని రచించారు అందులోని విషయాలను మీకు చెప్పడం జరిగింది’[202]
ఖుర్ఆను మజీదులో మనవాళికి అవసరమయ్యే అవసరాలన్నీ ఇమిడి ఉన్నాయి,అందులో 'జాబితాలు, విశ్వాసాలు, ఆదేశాలు, వ్యవహారాలు, మర్యాదల యొక్క సూత్రాలు ఉన్నాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మేము ఈ గ్రంధంలో ఏ విషయం వదిలిపెట్టలేదు'}[203] ఇందులో అల్లాహ్ యొక్క తౌహీదు ఏకత్వం వైపుకు ఆహ్వానించబడింది, ఆయన నామాలు, గుణాలు మరియు కార్యక్రమాల గురించి ప్రస్తావించబడింది, మరియు దైవప్రవక్తలు, సందేశహరులు తెచ్చిన దానిని సత్యమని దృవీకరిస్తుంది, ఈ ఖుర్ఆను పరలోకం, ప్రతిఫలం మరియు లెక్కల గురించి నిర్ణయిస్తుంది, మరియు దీనికి సాక్ష్యం చూపిస్తుంది, గతించిన జాతుల గురించి, సముదాయాల గురించి వివరిస్తుంది, శిక్షలకు,హింసలకు,శాపాలకు గురైన వారి గురించి తెలుపుతుంది, మరియు పరలోకంలో ఉండబోయే శిక్షలను కూడా వర్ణిస్తుంది.
ఈ ఖుర్ఆనులో అనేక ఆధారాలు,సూచనలు మరియు సాక్ష్యాలు ఉన్నాయి అవి వైజ్ఞానులను ఆశ్చర్యకితులను చేస్తాయి, మరియు ఇది ప్రతీ యుగానికి సంభంధించినది,ఇందులో వైజ్ఞానికులు తోపాటు పరిశోధకులు కూడా తప్పిపోయిన విషయాలను పొందుతారు,మీకోసం మూడు ఉదాహరణలు వివరిస్తాను,అవి మీకోసం వాటిని స్పష్టపరుస్తాయి ఆ ఉదాహరణలు ఇవి :-
1) అల్లాహ్ తఆలా తెలిపాడు {మరియు రెండు సముద్రాలను కలిపి ఉంచిన వాడు ఆయనే! ఒకటేమో రుచికరమైనది, దాహం తీర్చునది, మరొకటేమో ఉప్పగనూ, చేదుగనూ ఉన్నది మరియు ఆయన ఆ రెండింటి మధ్య ఒక అడ్డుతెరను - అవి కలిసి పోకుండా - అవరోధంగా ఏర్పరచాడు.}[204] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు: {లేక (సత్యతిరస్కారుల పరిస్థితి) చాలా లోతుగల సముద్రంలోని చీకట్లవలే ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు. చీకట్లు ఒకదానిపై నొకటి క్రమ్ముకొని ఉంటాయి. అపుడు ఎవడైనా తన చేతిని (చూడాలని) చాచితే, వాడు దానిని చూడలేడు. మరియు ఎవనికైతే అల్లాహ్ వెలుగునివ్వడో, అతనికి ఏ మాత్రం వెలుగు దొరకదు.}[205]
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం సముద్రయాత్ర చేయలేదు’మరియు ఆ కాలంలో సముద్రలోతును కనుగొనే సాధనాలు పరికరాలు’ఆవిష్కరించబడలేదని అందరికీ తెలుసు. అల్లాహ్ యే ఈ విషయాలను ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం'కు వహీ,వాణి ద్వారా తెలియజేశాడు ! అల్లాహ్ ఇలా తెలియజేశాడు
2) అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు: నిశ్చయంగా మేము మనిషి ని మట్టి సారముతో సృజించాము,తరువాత అతన్ని వీర్యబిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము'. {ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.(14 )}[206] గర్భస్థ పిండం ఏర్పడే దశల గురించి ఈ ఖచ్చితమైన వివరాలను శాస్త్రవేత్తలు నేడు కనుగొన్నారు.
3) అల్లాహ్ తఆలా సెలవిచ్చాడు. {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.}[207] ‘ఈ సంపూర్ణ ఆలోచన మానవాళికి లేదు మరియు ఈ విషయాల గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదు.శాస్త్రవేత్తల బృందం ఒక మొక్క లేదా కీటకాన్ని పరిశీలించి,పరిశోధనలు జరిపి తమ ఆవిష్కరణలను నమోదు చేస్తే,ఆ విషయాలను చూసి మనం ఆశ్చర్యం తో అబ్బురపడతాము,అయితే ఈ శాస్త్రవేత్తల నుండి ఈ మొక్క లేదా కీటకంలో దాగి ఉన్నరహస్యాలు వారు పరిశోధించిన దానికంటే ఎన్నోరేట్లు ఎక్కువ’అని మనకు తెలుసు.
ఫ్రెంచ్ విజ్ఞాని’మూరిస్ బుకాయా’ఖుర్ఆను,ఇంజీలు,తౌరాతు మరియు నవీన ఆవిష్కరణల మధ్య పోల్చిచూశారు,ఆ విషయాలు భూమ్యాకాశాలు మరియు మనుషుల పుట్టుక కు సంభందించినవి,అప్పుడు అతను‘నవీన ఆవిష్కరణలు ఖుర్ఆను గ్రంధము వర్ణించిన విషయాలతో సరితూగుతున్నాయి’అనిచెప్పాడు. 'ఈ రోజు ఉన్న తౌరాతు,ఇంజీలులో జంతువులు,మనుషులు,భూమి పుట్టుక కు సంభందించిన చాలా విషయాలు తప్పు’అని చెప్పాడు.
'అల్లాహ్ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై ఖుర్ఆను దింపాడు,మరియు ఆయన పై దానికి సమానమైన విషయాన్నిదింపాడు,అదియే’దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సున్నతు[సంప్రదాయం]అది ఖుర్ఆను’ను వ్యాఖ్యానిస్తుంది,మరియు ఆయన ఆదేశాలను స్పష్టం చేస్తుంది.! ఆయన ఇలా సెలవిచ్చాడు:- {తస్మాత్!నిశ్చయంగా నాకు ఖురఆనుతో పాటు దానిని పోలిన మరొక విషయం ఇవ్వబడింది}[208] అల్లాహ్ తఆలా ప్రవక్తకు అనుమతిస్తూ’ఖుర్ఆనులో గల సాధారణ,ప్రత్యేక,మరియు సంక్షిప్త విషయాలను మీరు వ్యాఖ్యానిస్తూ స్పష్టపర్చండి.అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- (పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని!}[209]
[హదీసు]సున్నతు ఇస్లాం యొక్క మూలాల్లో రెండవ మూలపునాది,నిజానికి ఇది దైవప్రవక్తతో సహీ,ముత్తసిల్ సనద్ [సరైన వ్యక్తిక గొలుసుల పరంపర]ద్వారా రుజువుచేయబడింది,ఇది ప్రవక్త వచనాలు,కార్యాలు,తక్రీరి లేదా ‘వస్ఫ్’ఉల్లేఖనాలను హదీసు అంటారు!
మరియు ఇది అల్లాహ్ తరుపునుంచి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్' వైపుకు అవతరించిన దైవవాణి'ఎందుకంటే దైవప్రవక్త తన కోరిక ప్రకారం ఏదీ ఆదేశించరు! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.[210] {అసాధారణ శక్తిగల దైవాదూత జీబ్రాయీల్]అతనికి ఖుర్ఆను నేర్పాడు'}[211]227 నిశ్చయంగా ఆయనకు ఆజ్ఞాపించినదే ప్రజలకు భోదిస్తారు,అల్లాహ్ఇలా సెలవిచ్చాడు;- {నా వద్దకు పంపబడిన సందేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను,నేను స్పష్టంగా హెచ్చరించేవాడిని మాత్రమే}
స్వచ్చమైన ప్రామాణిక సున్నతు ఇస్లాం యొక్క ఆదేశాలు, విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు మరియు మర్యాదలకు’కార్యాచరణాత్మక వ్యవహరిక రూపం.ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవక్త వీటన్నింటినీ పుణ్యఫలార్జనతో ఆచరించేవారు,ఆయనకు లభించిన ఆదేశాల మేరకు ప్రజలకు దానిని స్పష్టం చేసేవారు,మరియు అదే విధంగా ప్రజలను చేయమని ఆజ్ఞాపిస్తూ ప్రోత్సహించేవారు,ప్రవక్త ఇలా తెలిపారు:- మీరు నన్ను ఏవిధంగా నమాజూ పాటిస్తుండగ చూశారో ఆవిధంగా నమాజ్ పాటించండి'[212] మరియు నిశ్చయంగా అల్లాహ్ విశ్వాసులతో ప్రవక్త కార్యాలను,వచనాలను వారి విశ్వాసం సంపూర్ణమయ్యేవరకు అనుసరించమని ఆదేశించాడు:అల్లాహ్ ఇలా'సెలవిచ్చాడు:- {వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!}[213] మరియు ప్రవక్త అనుయాయులైన సహాబాలు'[రిజ్వానల్లహి అలైహిమ్ అజ్మయీన్] ప్రవక్త వచనాలను,ఆచరణాలను తరువాతి తరాల కోసం నమోదు చేశారు, వీరు తమ తరువాతి తరాల వారి కొరకు నమోదుచేశారు. పిదప వాటిని హదీసు పుస్తకాలలో సమీకరించి భద్రపర్చారు,ఆ హదీసులను కఠినమైన నిబందనలతో,కఠినమైన షరతులతో జల్లించి నమోదుచేసేవారు,హదీసులను నమోదు చేయడంలో ఈ షరతులను కూడా పెట్టేవారు అది’ఒకవేళ ఎవరైన ‘ముహద్దిసు హదీసును సేకరిస్తున్నట్లైతే తప్పనిసరిగా ఆ వ్యక్తి అతని కాలానికి చెందిన [సమకాలీనుడై]ఉండాలి,ఆ సనద్ ‘గొలుసు’ ఉల్లేఖఖుడి నుండి దైవప్రవక్త వరకు ఎడతెగకుండా అనుసంధానించబడి ఉండాలి[214],మరియు సనద్ యొక్క ఉల్లేఖఖులందరూ నమ్మకస్తులు,న్యాయపరులు, సత్యవంతులు,నిజాయితీపరులై ఉండాలి.
సున్నత్,ఇస్లాం యొక్క ఆచరణాత్మక అమలుగా పరిగణించబడుతుంది దాంతోపాటు ఇది దివ్యఖుర్ఆను’ను వివరిస్తుంది,దాని ఆయతులను వ్యాఖ్యానిస్తుంది,మరియు సంక్షిప్త ఆదేశాలను విస్తారంగా వివరిస్తుంది,దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సాధారణంగా తనపై అవతరించిన దానిని విడమరిచి తన మాటలతో,తన కర్మలతో మరియు రెండింటితో చెప్పేవారు. మరికొన్ని సందర్భాల్లో హదీసు స్వయంగా ఖుర్ఆను యొక్క కొన్ని ఆదేశాలను,శాసనాలను,నియమాలను,స్పష్టపరుస్తుంది.
కాబట్టి ఖుర్ఆను మరియు హదీసు రెండింటినీ విశ్వసించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ రెండు ఇస్లాం యొక్క పునాదులు మరియు మూలాలు,వీటిని అనుసరించడం వాజిబు,మరియు వాటివైపుకు మరలడం వాటికి విధేయత చూపడం,వాటి నిషేదాలకు దూరంగా ఉండటం,వాటి మాటలను దృవీకరించడం,అందులో ప్రస్తావించబడిన అల్లాహ్ యొక్క నామాలను మరియు కార్యాలను విశ్వసించడం,అల్లాహ్ విశ్వాసుల కొరకు సిద్దంచేసి పెట్టిన విషయాలను నమ్మడం,అవిశ్వాసుల కోసం హెచ్చరించిన శిక్షలను ’తప్పనిసరిగా విశ్వసించాలీ. {అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!}[215] అల్లాహ్ సెలవిచ్చాడు: {దైవప్రవక్త మీకు ఇచ్చినదాన్ని సంతోషంగా పుచ్చుకోండి,ఆయన ఏ విషయం నుండైనా మిమ్మల్ని వారిస్తే దాన్ని వదిలి పెట్టండి}[216]
ఈ ధర్మం యొక్క మూలాల పరిచయం తరువాత, దాని దశల గురించి చర్చించడం సముచితమని భావిస్తున్నాను.అవి:-ఇస్లాం, ఈమాన్ మరియు ఇహ్సాన్.ఇప్పుడు మేము వీటి స్తంభాల గురించి క్లుప్తంగా మాట్లాడబోతున్నాం.
అల్ ఇస్లాము-యొక్క మౌలిక స్తంభాలు ఐదు-అవి: రెండు సాక్ష్యాలు, నమాజు, జకాతు, రమజాను ఉపవాసాలు మరియు హజ్జ్.
మొదటిది:'లా ఇలాహ ఇల్లల్లాహ్' ముహమ్మదుర్రసూలుల్లాహ్'సల్లల్లాహు అలైహివసల్లం అని సాక్ష్యామివ్వడం{అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం మరొకడు లేడు'ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ అల్లాహ్ యొక్క సందేశహరుడు}
'లా ఇలాహ ఇల్లల్లాహ్' అంటే ['లా మాబూద బి హక్ఖిన్ ఫిల్ అర్జీ వలా ఫిస్సమాయి'ఇల్లల్లాహు వహ్దహూ']నిజానికి 'భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం మరొకడు లేడు'-ఆయన ['ఇలాహుల్ హక్ఖ్']సత్యమైన దేవుడు'మరియు ఆయన తప్ప ప్రతీ దేవుడు' అసత్యమే.[217] ‘ఆరాధన మరియు ప్రార్ధన కేవలం ఏకైకుడైన అల్లాహ్ కొరకు చేయవలెను,మిగతా మిథ్యాదైవాలను ఖండించాలి అని’ఈ వాక్యం సూచిస్తుంది,ఈ వాక్యాన్ని చదివినవాడు ఈ రెండు విషయాలు పూర్తిచేయనంత వరకు ప్రయోజనం పొందలేడు’
మొదటిది:- లా ఇలాహ ఇల్లల్లాహ్’ను:దానిని సంపూర్ణంగా విశ్వసించాలి,దాని జ్ఞానం ఉండాలి,పూర్తి నమ్మకం ఉండాలీ,ఆచరణతో దానిని దృవీకరించాలి,ప్రేమించాలి.
రెండు:- అల్లాహ్ తప్ప పూజించబడే ఇతర మిథ్యా దైవాల ఆరాధన,ప్రార్ధనను ఖండించాలి,కాబట్టి మనిషి కూడా ఈ సాక్ష్యాన్ని అంగీకరించాడు కానీ అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే వారిని ఖండించలేదు,అప్పుడు ఈ వాక్యం అతనికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు.[218].
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం సాక్ష్యం అర్ధం’ఏమిటంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ ప్రవక్త యొక్క ఆదేశాల పట్ల అనుచరణ ,వియధేత చూపడం,ఆయన తెలిపిన విషయాలను విశ్వసించడం మరియు ఆయన హెచ్చరించిన విషయాలకు దూరంగా ఉండటం,అల్లాహ్ ను ఆయన చెప్పినట్లుగా అనుమతించినట్లుగానే ఆరాధించాలి,అంతేకాదు ముహమ్మద్ సర్వమానవాళి కొరకు ప్రవక్తగా విశ్వసించాలి,ఆయన ఒక దాసుడు మరియు మనిషి అని నమ్మాలి,కాబట్టి ఆయనను ఆరాధించకూడదు,ఎందుకంటే ఆయన ఒక సందేశహరుడు,కనుక ఆయనను దిక్కరించకూడదు,తిరస్కరించకూడదు,ఆయనను అనుసరించాలి మరియు ఆయన మాటకు విధేయత చూపాలి,ఎవరైతే ఆయనకు విధేయత చూపుతాడో అతను స్వర్గానికి వెళ్తాడు,ఎవరైతే ఆయన ఆదేశాలను పాటించకుండా తిరస్కరిస్తాడో అతను నరకంలో విసిరివేయబడతాడు. విశ్వాసానికి సంబంధించిన విషయాలు,ఇస్లామియ నిషేధాలు,అల్లాహ్ ఆదేశించిన ఆరాధన పద్దతులు,న్యాయ వ్యవస్థ మరియు ఒక కుటుంబ నిర్మాణ సంస్కరణ విషయాలు,హరాము మరియు హలాలుకు {అనుమతించే లేదా నిషేధ}చెందిన చట్టాలు మరియు నైతికతకు సంభందించిన విషయాలు.ఇవన్నీ సమస్యలకు పరిష్కారాలను మహాప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా పొందాలి,ఎందుకంటే ఆయన అల్లాహ్ యొక్క దైవప్రవక్త,ఆయన తెచ్చిన షరీఅతు చట్టాన్ని ప్రజలకు అందజేశాడు,సంపూర్ణ శాసనాలను చట్టాలను ధర్మశాస్త్రాన్ని మానవజాతికి తెలియజేశాడు.237.
నమాజు:-ఇది ఇస్లాం యొక్క రెండవ మూలస్థంభం.ఇది ఇస్లాం స్థంభం,ఎందుకంటే ఇది మనిషికి మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న సంబంధం.ముస్లిం ఒక రోజులో ఐదుసార్లు నమాజు చదువుతాడు,దానిద్వారా అతను తన విశ్వాసాన్నిసంస్కరించుకుంటూ పునరుద్ధరించుకుంటాడు,పాపపు మరకల నుండి తనను తాను శుద్ధి చేసుకుంటాడు మరియు ఇది అతనిని అశ్లీలమైన విషయాలు మరియు పాపాలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. మనిషి ఉదయం నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఇహలోక ప్రాపంచిక విషయాలలో నిమగ్నమవ్వడానికి ముందు తన ప్రభువు ముందు పరిశుభ్రపరుచుకుని స్వచ్ఛంగా నిలబడతాడు.అతను తన ప్రభువును గొప్పగా కీర్తిస్తాడు,తన దాస్యాన్ని ఒప్పుకుంటాడు,ఆయనతో సహాయాన్ని అర్ధిస్తాడు,రుకూ,సజ్దా,ఖియాం ద్వారా తనకు మరియు ప్రభువు'కు మధ్య గలప్రతిజ్ఞని దాస్యాన్ని,ఆదేశాన్ని పూర్తిచేస్తూ దృవీకరిస్తాడు,ఇలా ప్రతీరోజు ఐదు ఆచరిస్తూ ఉంటాడు,నమాజు ఆచరించడానికి’మనిషి హృదయం,అతని దేహం,వస్త్రం,మరియు నమాజు ఆచరించు ఆ ప్రదేశం’పవిత్రంగా ఉండాలి. మరియు ముస్లిములు తన ఇతర మిత్రులతో పాటు జమాతుతో నమాజును ఆచరించాలి,మరియు వారు తమ ముఖాలను అల్లాహ్ పవిత్ర గృహం కాబా దిశలో ఉంచాలి కనుక నమాజును అత్యుత్తమంగా మరియు సంపూర్ణ విధానంలో పెట్టడం జరిగింది,దానితో అతను తన ప్రభువును సృష్టికర్తను ఆరాధిస్తాడు,మనిషి శరీర భాగాలన్నింటితో అల్లాహ్’ను కీర్తిస్తాడు’నోరు,చేతులు,కాళ్ళు,తల,ఇంద్రియాలు మరియు అతని శరీరంలోని అన్ని ఇతర భాగాలు అల్లాహ్ ను కీర్తిస్తూ గౌరవిస్తాయి;మనిషికి చెందిన అవయవాలన్నీ ఈ మహా ప్రార్ధనలో తమవంతు ఆరాధనను పూర్తిచేస్తాయి.
ఇంద్రియాలు మరియు అవయవాలు నమాజు యొక్క భాగాన్ని తీసుకుంటాయి మరియు హృదయం కూడా తన వంతు వాటాను నిర్వహిస్తుంది.నమాజులో అల్లాహ్’ను కీర్తించడం,ఆయనను స్తుతించడం,ఆయన గౌరవాన్ని కొనియాడటం,ఆయనను పవిత్రపర్చడం,తక్బీరు చెప్పడం’వంటివి ఉంటాయి.ఇది సత్యసాక్ష్యంచెప్పడం,ఖుర్ఆన్ పఠనం,అల్లాహ్ ముందు భక్తితో ఖియాం’నిలబడటం,మరియు ఖియాంలో విశ్వప్రణాళికా నిర్వాహకుడైన అల్లాహ్ ముందు భక్తిశ్రద్దలతో,సామీప్యాన్ని కోరుకోవడం అనుకువను ప్రదర్శించడం. దీని తరువాత రుకూ మరియు సజ్దా చేయడం,మరియు రెండు సజ్దాలకు మధ్య భక్తి శ్రద్దలతో వినమ్రత,అనుకువతో కూర్చోవడం,అల్లాహ్ మహోన్నత ను,ఆయన గౌరవం కోసం అనుకువతో విన్నవించుకోవాలి,హృదయం ఆయన కోసం కంపించాలి,శరీరం ఆయన ఎదుట సమర్పించుకోవాలి,శరీరావయవాలు ఆయనపట్ల భయభక్తులను కలిగి ఉండాలి. చివరలో అతను అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుతూ,ఆయనను స్తుతిస్తూ,దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూదు సలాములను ప్రార్థిస్తూ మరియు ఇహపరలోకంలోని మేలు,మంచిని తన ప్రభువును అడుగుతూ చివరకు తన ప్రార్థనను ముగిస్తాడు.[219]
మూడవది:-జకాతు [220]:-విధిగా చెల్లించే ధానధర్మాలు- ఇస్లాం యొక్క మూడవ స్తంభం.ధనవంతుడైన ఒక ముస్లింకు తన సంపద నుండి జకాతు చెల్లించడం తప్పనిసరి.అతను తన సంపదలో అతి తక్కువ భాగం పేదలకు,బీదలకు మరియు ఇతర షరీఅతు అనుమతించిన అర్హతగలవారికి ఇవ్వవలిసి ఉంటుంది.
ముస్లింలు ఇష్టపూర్వకంగా అల్లాహ్ ప్రసన్నతను,శుభాలను చూరగొనటానికి జకాతును పేదలకు,అనాధులకు,అర్హులైన ఆగత్యపరులకు చెల్లించాలి.ఆ ఉపకారానికి బదులును ఆశించకూడదు, లేదా ఆ కారణంగా అతనికి హాని చేయకూడదు. అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందటం కొరకు మాత్రమే ఒక ముస్లిం దానిని చెల్లించాలి;దానికి బదులు ప్రజల నుంచి ఏ రకమైన ప్రతిఫలం లేదా కృతజ్ఞతలు కోరుకోకూడదు.రియాకారి ప్రదర్శన కోసమో,పోగడ్తల కోసమో చేయకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నతకై చెల్లించాలి.
జకాతు చెల్లించడం వల్ల డబ్బులో శుభాలు,వృద్ది ప్రాప్తిస్తాయి మరియు పేదలు,అనాధలు నిరాశ్రయులు మరియు పేదవారి హృదయాలను ఆనందపరుస్తుంది.వారి గౌరవాన్ని రక్షిస్తూ యాచించకుండా ఇది నిరోధిస్తుంది మరియు వారిపై దయా కరుణ చూపించాలి,వారిని పేదరికం దుర్భరజీవితం నుండి ధనవంతులు రక్షించాలి,జకాతు చెల్లించడం ద్వారా మనిషి లో దయా జాలి ఔదార్యం, గొప్పతనం, పరోపకారం, దాతృత్వం మరియు కరుణ’లాంటి లక్షణాలు వృద్ది చెందుతాయి,మరియు కొన్ని అవలక్షణాల నుంచి అనగా’పిసినారి వైఖరి,లోభత్వం,కఠినహృదయం నుండి రక్షించుకోవచ్చు. ఇందులో ముస్లింలు పరస్పరం ఒకరినొకరు ఆదరిస్తారు,ధనవంతులు పేదలపై దయ చూపిస్తారు, తద్వారా సమాజంలో- పేదలు నిరాశ్రయులు,అప్పుల్లో కూరుకుపోయినవారు లేదా యాత్ర ఆగిన ప్రయాన యాత్రికుడు’ లాంటి వారు మిగిలి ఉండరు.
నాలుగు:- ఉపవాసం:-ఇవి రమజాను ఉపవాసాలు,ఫజ్రోదయం నుంచి సూర్యాస్తమయం వరకు' ఉంటుంది,ఇందులో ఒక ఉపవాసి అన్నపానీయాలు,సంభోగం,లాంటి మనోకోరికలు త్యజించి అల్లాహ్ ఆరాధన కోసం ఉపక్రమిస్తాడు,మరియు తన మనసును ప్రతీరకమైన మనోవాంఛ నుంచి రక్షించుకుంటాడు. అల్లాహ్ తఆలా ఈ ఉపవాసం నుండి రోగులకు, ప్రయాణికులకు, గర్భవతులకు, పాలుపట్టించే తల్లులకు,మరియు ఋతుస్రావం,బహిష్టు స్త్రీలకు మినహాయింపు ఇచ్చాడు, ఇందులోని ప్రతీ ఒక్కరి కొరకు వేర్వేరు ఆదేశాలు ఉన్నాయి.
ఈ మాసంలో ముస్లిములు తమ ఆత్మలను కామ వాంఛల నుంచి నిరోదించుకుంటూ జంతువుల శ్రేణి నుంచి,తమను తీసి దైవదూతల తరగతిలోకి తీసుకెళ్లడానికి కృషిచేస్తాడు,చివరికి ఒక ముస్లిం ఉపవాసి అల్లాహ్ ప్రసన్నత తప్ప ఈ ప్రపంచంలో ఎవరి అవసరం లేని దశకు స్థితికి చేరుకోవచ్చు.
ఉపవాసం మనిషి ఆత్మను శుద్దిచేస్తుంది మరియు అతనిని అల్లాహ్’దైవభీతిని కలిగి ఉండాలని ప్రోత్సహిస్తుంది,ఒకరిని ప్రపంచాన్ని త్యజించేలా చేస్తుంది, అల్లాహ్ వద్ద ఉన్నదాన్ని పొందడానికి ప్రోత్సహిస్తుంది మరియు ధనవంతులకు పేదవారి స్థితిగతులు అర్ధమయ్యేలా చేస్తుంది,తద్వారా వారి హృదయాలు పేదల పట్ల సానుభూతిని,కరుణను కలిగేలా చేస్తాయి,మరియు వారు అల్లాహ్ అనుగ్రహాలలో జీవిస్తున్నారని తెలుసుకుంటారు,దాంతో వారు అల్లాహ్ కు అధికంగా కృతజ్ఞత తెలుపుకుంటారు.
ఉపవాసం ఆత్మను శుద్ధి చేస్తుంది మరియు అతనిలో అల్లాహ్ భీతిని భయాన్ని సృష్టిస్తుంది.ఇది వ్యక్తులు మరియు సమాజ వాసులకు బహిరంగంగా,రహస్యంగా,కష్టసుఖాల్లో అల్లాహ్ యొక్క రక్షణ పట్ల భావన పెపొందేలా చేస్తుంది తద్వారా పూర్తి సమాజం ఈ మాసాన్ని ఆరాధనలో గడుపుతుంది,ప్రభువు స్మరణలో ఒక నెల మొత్తం గడుపుతుంది;తద్వారా అల్లాహ్ భయభీతి కలుగుతుంది, అల్లాహ్ పట్ల విశ్వాసం కలుగుతుంది,పరలోక విశ్వాసం మరియు అల్లాహ్ రహాస్యాలను, బహిర్గత విషయాల జ్ఞానం కలిగి ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది.మనిషి ఖచ్చితంగా ఒక రోజు ఆయన ముందు నిలబడతాడు, అప్పుడు ఆయన ప్రతీ చిన్న పెద్ద విషయాల గురించి అతనిని అడుగుతాడు’[221]
ఐదు:- అల్'హజ్జ్;-[222]హజ్జ్ ఇస్లాం యొక్క ఐదవ స్తంభం’హజ్జ్ అర్ధమేమిటంటే మక్కా ముకర్రమాలో అల్లాహ్ గృహాన్ని సందర్శించడం,ఇది ప్రతీబుద్దిగల,స్తోమతగల ముస్లింపై విధి చేయబడింది.అల్లాహ్ గృహమైన కాబతుల్లాహ్ వరకు వెళ్ల గలిగే సామర్ధ్యం లేదా ప్రయాణ ఖర్చులు ఉండాలి అతని వద్ద వెళ్ళి రావడానికి కావలిసిన సామాగ్రి సరిపోయే ఖర్చులు ఉండాలి, తన కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బులు కూడా ఉండాలి,మార్గం సురక్షితంగా ఉండాలి, తన పోషణలో ఉన్నవారు ఆరోగ్యవంతులుగా సురక్షితంగా ఉండితీరాలి! ఆర్ధిక స్తోమత,శారీరక శక్తిని కలిగి ఉన్న వారి పై జీవితంలో ఒకసారి హజ్జ్ చేయడం విధి.
'హజ్ సంకల్పించుకుని చేయాలనుకునేవాడు తన ఆత్మను పాపాల మలినం నుండి పరిశుద్దపర్చడానికి అల్లాహ్ తో తౌబా చేసుకుంటూ పశ్చాత్తాపపడాలి. అతను మక్కా మరియు ఇతర పవిత్ర స్థలాలకు చేరుకున్నప్పుడు, హజ్ యొక్క ఆచారాలను అల్లాహ్’కు దాస్యం చూపుతూ ఆయన’ ప్రసన్నత పొందటం కొరకు నిర్వహిస్తాడు. మరియు కాబతుల్లాహ్’ మరియు హజ్జ్ కార్యకలాపాల ప్రాంతాలను ఆరాధించకూడదు,అవి అతనికి ఎటువంటి ప్రయోజనం కానీ హానీ కానీ చేకూర్చవు. మరియు ఒకవేళ అల్లాహ్ ఆ గృహనికి హజ్జ్ యాత్ర చేయమని ఆదేశించకపోతే ఏ ముస్లింకు దాన్నిఆచరించడం తగదు అనే విషయాన్ని అతను తెలుసుకోవాలి.
హజ్జ్ సమయంలో హాజీ ఒక తెల్లని వస్త్రాన్ని మరియు ఒక తెల్లని లుంగీని కట్టుకోవాలి,ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అక్కడికి చేరుకుంటారు,ప్రజలందరూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు, ఒకే ప్రభువును అందరూ ఆరాధిస్తారు. నాయకుడు, పాలితుడు, ధనికుడు, బీదవాడు, తెల్లవాడు,నల్లవాడు అని తేడా ఉండదు,అందరూ అల్లాహ్ దాసులు మరియు ఆయన సృష్టి ,ఒక ముస్లిముకు మరొకరిపై కేవలం అల్లాహ్ భీతి [తఖ్వా] మరియు సత్కార్యాల ఆధారంగా మాత్రమే ఆధిక్యత ఉంటుంది.
అందువల్ల ముస్లింలు పరస్పరం ఒకరికొకరు సహాయపడుతూ పరిచయం చేసుకోవాలి,మరియు పరలోకదినాన్ని సమాధుల నుండి తిరిగి సజీవులుగా తీయబడే రోజు గురించి గుర్తుచేసుకోవాలి ఆ రోజు అల్లాహ్ ప్రజలందరి లెక్కతీసుకోడానికి ఒక విశాల మైదానంలో సమీకరిస్తాడు,కాబట్టి ప్రజలు అల్లాహ్ కు విధేయత కనబరుస్తూ మరణాంతర జీవనం కొరకు సంసిద్దమవ్వాలి.[223]
ఉబూదియ్యతు లిల్లాహ్’- అర్ధం మరియు వాస్తవికత ‘అల్లాహ్'యే సృష్టికర్త మరియు నువ్వు సృష్టిరాశివి,మరి నువ్వు దాసుడివి ఆయన నీకు దైవం,వాస్తవం ఇలా ఉన్నప్పుడూ మనమంతా ఖచ్చితంగా అల్లాహ్ చూపిన సన్మార్గం ఋజుమార్గం వైపుకు ఆయన షరీఅతును అనుసరిస్తూ ఆయన ప్రవక్తల బాటను అనుసరించాలి. అల్లాహ్ తన దాసుల కొరకు మహోన్నతమైన గొప్ప షరీఅతు శాసనాలను రూపొందించాడు,సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్'తౌహీదు ఏకత్వం,నమాజు,జకాతు,ఉపవాసం,మరియు హజ్జ్'మొదలైనవి.
కానీ ఈ ఆరాధనలు మాత్రమే ఇస్లాం లోని ఆరాధనలు కావు,ఇస్లాం లో ఆరాధనల పరిమితి చాలా విశాలంగా ఉంది,-ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహ్ ప్రసన్నత చెందే ఇష్టపడే ప్రతీ బహిర్గత అంతర్గత నోటిమాట, శారీరకకార్యం’ను’ ఇబాదతు’ అంటారు,-కాబట్టి అతని నోటి నుంచి వచ్చే ప్రతీ మాట లేదా అతను ఆచరించే ప్రతీ కార్యం ఆరాధన అనబడుతుంది, చివరికి అల్లాహ్ సామీప్యాన్ని పొందే సంకల్పంతో అలవర్చుకునే ప్రతీ మంచి అలవాటు’ను ఆరాధన అంటారు. అలాగే మీ తల్లిదండ్రులు,కుటుంబీకులతో సద్వ్యవహారం,మీ పిల్లలతో,ఇరుగుపొరుగు వారితో కలిసిమెలిసి జీవనం గడపడం వెనుక అల్లాహ్ యొక్క ప్రీతి ప్రసన్నత పొందే సంకల్పం ఉంటే అది కూడా ఆరాధన అవుతుంది అదే విధంగా మీ వ్యవహారం ఇల్లు, బజారు, మరియు కార్యాలయంలో ఉత్తమంగా ఉంటే అది కూడా ఒక ఆరాధనే అవుతుంది, అలాగే అమానతు చెల్లించడం, న్యాయం,సత్యం, అలవర్చుకోవడం, హానికర వస్తువలను తొలగించడం, బలహీనులకు సహాయం చేయడం, హలాలు సంపాదించడం, భార్యాపిల్లలపై ఖర్చుచేయడం,అనాధాల పట్ల సానుభూతిని కలిగి ఉండటం, రోగిని పరామర్శించడం,ఆకలిగొన్నవాడికి తినిపించడం,పీడితునికి సహాయం చేయడం,వీటిని అల్లాహ్ ప్రీతి ప్రసన్నతలు పొందే సంకల్పంతో చేయబడితే ఆరాధన అనబడుతుంది. నీ కోసం,నీ కుటుంబీకులకోసం,నీ సమాజంకోసం,నీ దేశంకోసం అల్లాహ్ ప్రసన్నత సంకల్పంతో చేయబడే ప్రతీ కార్యం ఆరాధన అనిపిస్తుంది,చివరికి నీ మనోవాంఛలను షరీఅతు అనుమతించిన పద్ధతిలో పూర్తిచేసుకోవడం కూడా ఇబాదతు అవుతుంది,సత్సంకల్పం దానితో కలిసినప్పుడు’ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఇలా తెలిపారు;- {మీ ప్రతీ శరీరావయవంలో దానం ఉంది.సహబాలు అడిగారు:ఓ దైవప్రవక్త! కామవంఛాలను తీర్చుకోవడంలో పుణ్యం ఎలా లభిస్తుంది?ప్రవక్త చెప్పారు:నువ్వే చెప్పు ఒకవేళ అతను దానిని హరాము పద్దతిలో పూర్తిచేసుకుంటే అతనిపై పాపం నమోదుకాదా ?అదేవిధంగా దానిని అతను హలాలు పద్ధతిలో పూర్తిచేస్తే అతనికి పుణ్యం లభిస్తుంది.}[224]
మరియు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: (అబూ మూసా అల్ అష్అరీ రజిల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ప్రతీ ముస్లిం పై దానమివ్వటం విధి' సహాబీ అడిగారు'ఒకవేళ అతని వద్ద లేకుంటే మీ అభిప్రాయం ఏమిటి ?దానికి సమాధానమిస్తూ'స్వయంగా తన చేతులతో సంపాదించి తనకు లాభాన్ని చేకూర్చుకుంటూ ఇతరులకు దానం చేయాలి 'సహాబీ ప్రశ్నిస్తూ 'మరి ఒక వేళ అతనికి శక్తి లేకుంటే మీ అభిప్రాయం ఏమిటి ? దానికి ప్రవక్త సమాధానమిస్తూ’ అవసరం లో ఉన్నఅభాగ్యుడికి సహాయపడాలి,చెప్పారు సహాబీ మళ్ళీ ;అది కూడా చేసేంతా శక్తి లేకుంటే ఏమి చేయాలి ?బదులిస్తూ’ మంచి వైపుకు ఆహ్వానించాలి చెప్పారు దానికి ;అతను ఒకవేళ అది చేయకపోతే‘పాపం నుండి రక్షించు కోవాలి అది కూడా దానం చేయటానికి సమానం’)[225]
అల్ ఈమాను యొక్క స్తంభాలు ఆరు అవి:- అల్లాహ్ పట్ల విశ్వాసం,దైవదూతల పట్ల విశ్వాసం, దైవగ్రంధాల పట్ల విశ్వాసం, దైవప్రవక్తల పట్ల విశ్వాసం,పరలోకం పట్ల విశ్వాసం,విధివ్రాత పట్ల విశ్వాసం.
మొదటిది:- ఈమను బిల్లాహ్:- అల్లాహ్'ను విశ్వసించడం,:- అల్లాహ్ తఆలా యొక్క పరిపోషకత్వాన్ని విశ్వసించాలి అంటే 'ఆయనే ప్రభువు, సృష్టికర్త, యజమాని, సర్వకార్యాల నిర్వాహణకర్త అని మరియు దైవత్వాన్ని'అల్లాహ్'తఆలా కోసం విశ్వసించడం, అనగా'వాస్తవానికి అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరొకడు'లేడు అని ఆయన తప్ప ఇతర మిథ్యాదైవాలు అసత్యం'అని విశ్వసించడం, మరియు 'ఆయన నామాలు,మరియు గుణగనాలను విశ్వసించడం'అనగా 'ఆయన కొరకు మాత్రమే అందమైన, ఉత్తమమైన, గొప్ప నామాలు , గుణాలు' వర్తిస్తాయి' అని విశ్వసించడం.
ఈ విషయాలలో అల్లాహ్ ఏకత్వాన్ని విశ్వసిస్తూ ఆయన ఏకైకుడు అని విశ్వసించాలి,మరియు ఆయన పరిపోషణ లో దైవత్వంలో' నామాలు గుణాలలో ఇతరులను ఆయనకు భగస్వామ్యం కల్పించకూడదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {"ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా ఉండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?"}[226]
మరియు ఆయనకు కునుకు,నిద్ర లేవని విశ్వసించాలి,మరియు ఆయన గోచర ,అగోచరవిషయాలు తెలిసినవాడు మరియు భూమ్యాకాశాలలోని సర్వం ఆయన స్వాధీనంలో ఉంది'అని విశ్వసించాలి. {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు.మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.}[227].
మరియు అల్లాహ్ తఆలా తన సర్వసృష్టికి వేరుగా అర్ష్ సింహాసనం పై ఉన్నాడు,అని విశ్వసించాలి,అలాగే ఆయన సృష్టితో పాటు జ్ఞానపరంగా ఉంటూ 'వారి పరిస్థితులను,తెలుసుకుంటాడు,వారి మాటలు వింటున్నాడు,వారిని చూస్తున్నాడు,వారి వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు,లేనోడికి తినిపిస్తున్నాడు,విడిపోయిన వారిని కలుపుతున్నాడు,ఆయన కొరిన వాడికి రాజ్యాధికారాన్ని కట్టబెడుతున్నాడు,కోరిన వాడి నుండి లాక్కుంటున్నాడు,మరియు ఆయన ప్రతీది చేయగల శక్తివంతుడు.[228]
అల్లాహ్ 'ను విశ్వసించడం వల్ల కలిగే ప్రయోజనాలు:-ఇవి
1) ఇది అల్లాహ్’ను ప్రేమించేలా మనిషిని చేస్తుంది మరియు ఆయనను కీర్తించడానికి ఉపయోగపడుతుంది అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించటానికి మరియు నిషేధించిన వాటికి దూరంగా ఉండటానికి ఉపయోగ పడుతుంది.మనిషి ఇలా చేయడం వల్ల , అతను ఈ లోకంలో మరియు పరలోకంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందుతాడు.
2) అల్లాహ్’ను విశ్వసించడం వల్ల మనస్సులో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం పెంపొందుతాయి,ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి నిజమైన యజమాని ప్రభువు అల్లాహ్ మాత్రమేనని, ఆయన తప్పహాని లేదా ప్రయోజనం కలిగించేవారు ఎవరు లేరని మనిషికి తెలుస్తుంది.ఈ జ్ఞానం అతన్ని అల్లాహ్ మినహా ఇతర మిథ్యా దైవాల అవసరంను మరియు ఇతరుల భయాన్ని అతని హృదయం నుండి తొలగిస్తుంది,అతను కేవలం అల్లాహ్’పై మాత్రమే నమ్మకం ఉంచుతాడు మరియు ఆయనకు మాత్రమే భయపడతాడు.
3) అల్లాహ్' పట్ల నమ్మకం హృదయంలో వినయాన్నివినమ్రతను సృష్టిస్తుంది;ఎందుకంటే అతనికి లభించిన ప్రతీ వరం అల్లాహ్ అనుగ్రహించాడని అతను తెలుసుకుంటాడు.షైతాను అతన్ని మోసం చేయలేడు,అతడు గర్వించడు మరియు అహంకారం చూపడు మరియు తన శక్తిసామర్ధ్యాలపై సంపదను చూసుకుని ప్రగల్భాలు పలుకడు.
4) నిశ్చయంగా ప్రతీ అల్లాహ్'ను విశ్వాసించేవాడికి ఈ విషయం తెలిసి ఉంటుంది అది 'అతను సాఫల్యం పొందాలంటే విజయం సాధించాలంటే కేవలం అల్లాహ్ ప్రసన్నతను'చేకూర్చే సత్కర్మలు చేయడం' వల్లనే సాధ్యమవుతుంది,కానీ కొంతమంది ఇతరులు అసత్యమైన నమ్మకాలు కలిగియున్నారు’ఉదాహరణకు’-అల్లాహ్ పుత్రుడను శిలువ ఎక్కించడం వల్ల వారిపాపాలు ప్రక్షాళన గావించబడ్డాయి,అల్లాహ్ ను వదిలి ఇతరులను దైవాలుగా విశ్వసిస్తారు,మరియు అడిగిందల్లా వారికి ఒసగుతారు’అని నమ్ముతారు,నిజానికి అవి వారికి ఎలాంటి లాభ నష్టాలు చేకూర్చలేరు, మరికొందరు’నాస్తికులు ఉంటారు వారు సృష్టికర్త ఉనికిని ఆయన అస్తిత్వాన్ని తిరస్కరిస్తారు.ఇవన్నీ కోరికలే .రేపు ప్రళయ దినాన అల్లాహ్ ముందుకు హాజరుపర్చబడి సత్యా అసత్యాలు వారు చూస్తారు,అప్పుడు వారికి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయ్యారు’అని అర్ధమవుతుంది.
5) అల్లాహ్’ను విశ్వసించడం వల్ల మనిషిలో సంకల్ప శక్తి, ధైర్యం,దృఢత్వం,నమ్మకం లాంటి మహాశక్తులు అభివృద్ది చెందుతాయి,వారు ప్రపంచంలో అల్లాహ్ ప్రీతిప్రసన్నతను పొందటానికి గొప్పగొప్ప వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటాడు,మరియు అతను భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారి పై సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉన్నానని పూర్ణవిశ్వాసాన్నికలిగి ఉంటాడు,ఆయనే మద్దతు ఇచ్చేవాడు,ఆయనే తన చేతిని ఆపుకునేవాడు అని నమ్ముతాడు అలా అతను తన నమ్మకంలో,స్థిరత్వంలో మరియు సహనంలో దృఢమైన పర్వతంలో పటిష్టతను పొందుతాడు.[229]
రెండవది:- అల్ ఈమాను బిల్ మలాయికా(దైవదూతలను విశ్వసించడం):- నిశ్చయంగా వీరిని అల్లాహ్ తన విధేయత కొరకు,తనను స్తుతించుటకు సృష్టించాడు,ఎందుకంటే వారు: వారు'గౌరవనీయులైన ఆయన దాసులు ][230] {వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.}[231] {వారికి ముందున్న వాటి గురించి వెనుక ఉన్న వాటి గురించి అంతా ఆయనకు తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.} మరియు వారు:- {ఆయన వద్ద ఉన్నవారు'ఆయన్ని ఆరాధించటం పట్ల గర్వం ప్రదర్శించరు'[ఆయన దాస్యం చేస్తూ]అలసిపోరు {వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు.} అల్లాహ్ వారిని మన కళ్లకు కనిపించకుండా అదృశ్యపర్చాడు,వారిని మనం చూడలేము,కానీ కొన్నిసార్లు వారిని కొంతమంది ప్రవక్తలు,సందేశహరులపై ప్రత్యేక్షపరుస్తాడు.
మరియు దైవదూతల కోసం కొన్ని నిర్దారించిన పనులు బాధ్యతలు ఉన్నాయి,అందులో జీబ్రీల్ అలైహిస్సలాం'కు 'వహీ'వాణి'ని అల్లాహ్ కోరిన తన ప్రవక్తలకు,సందేశహరులకు చేర్చడం,మరియు ఇంకొకరు'మనిషికి చావు ఇచ్చి ఆత్మలను పట్టుకొస్తాడు,మరికొందరు'తల్లిగర్భంలో'ఉన్నశిశువు'రక్షణకై నియమించబడ్డారు, మరికొందరు 'మనిషి సంరక్షనకై'నియమించబడ్డారు,మరికొందరు మనిషి కర్మలను నమోదుచేయడానికై నియమితమయ్యారు అలా ప్రతీ ఒక్కరితో ఇద్దరు దైవదూతలు నియమితమై ఉన్నారు. {కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;}[232] {అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు.}254
దైవదూతలను విశ్వసించడం వల్ల కలిగే ప్రయోజనాలు:-
1) ముస్లిముల విశ్వాసం:-ఇది ముస్లిం విశ్వాసాన్ని షిర్కు మరియు దానికి చెందిన అశుద్దాల నుండి శుద్ధి చేస్తుంది;అల్లాహ్ ఈ గొప్ప పనులతో నియమించిన దైవదూతల ఉనికిని ఒక ముస్లిం విశ్వసించినప్పుడు,విశ్వవ్యవహారాల నిర్వహణలో ఇతరులకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పబడే నమ్మకం నుండి అతను రక్షణ పొందుతాడు.
2) ఇది ముస్లింలకు తెలుసు, దైవదూతలు స్వతహాగా ఎలాంటి ప్రయోజనం కానీ, హానిగానీ చేయరు,వారు కేవలం అల్లాహ్ యొక్క గౌరవనీయులైన దాసులు,అల్లాహ్ వారికి ఆజ్ఞాపించిన దానిని చేస్తారు ఆయన ఆజ్ఞలను తిరస్కరించరు.కనుక అతను వారిని ఆరాధించడు, తన వ్యవహారాలలో అతని వైపుకు మరలడు,మరియు వారిపై ఆధారపడడు.
మూడవది:-అల్'ఈమాను బిల్ కుతుబ్'దైవగ్రంధాలను విశ్వసించడం:-నిశ్చయంగా అల్లాహ్ తఆలా తన ప్రవక్తలపై,సందేశహరులపై సత్యాన్ని,ధర్మాన్ని వివరించడానికి,దాని ప్రచారానికై పుస్తకాలను అవతరింపచేశాడు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి, మేము మా సందేశహరులను స్పష్టమైన సూచలనిచ్చి పంపాము. మరియు వారితో బాటు గ్రంధాన్ని అవతరింపజేశాము. మరియు మానవులు న్యాయశీలురుగా మెలగటానికి త్రాసును కూడా పంపాము }255 ఈ పుస్తకాలు అనేకం ఉన్నాయి అందులో కొన్ని ఇవి:- ఇబ్రాహీం పత్రాలు,ముసాకు ఒసగిన తౌరాతు గ్రంధం,దావూద్ కు ఇచ్చిన జబూర్'మరియు ఈసా మసీహ్'తెచ్చిన ఇంజీలు గ్రంధము.[అలైహిముస్సలాం].
ఈ పుస్తకాలను గురించి అల్లాహ్ మనకు తెలియజేస్తూ'అవి నశించిపోయాయి ఇబ్రాహీం పత్రాలు'ఈ ప్రపంచం నుండి అంతరించిపోయాయి'అని చెప్పాడు. తౌరాతు,ఇంజీలు,జబూరు గ్రంధాలు పేర్లతో యూదుల వద్ద,క్రైస్తవుల వద్ద వాటి ఉనికి ఉన్నప్పటికి మార్పులు చేర్పులు జరిగి మార్చబడ్డాయి,పుస్తకాల అధికభాగం పోయింది,మరియు అందులో లేని విషయాలు నమోదుచేయబడ్డాయి,నిజానికి ఇతరుల పేర్లతో ఆపాదించబడ్డాయి. పాత నిబంధన లో నలబై 'భాగాలున్నాయి కానీ కేవలం ఐదు మాత్రమే మూసా అలైహిస్సలాం వైపుకు జోడించబడ్డాయి,ఈ రోజు ఉన్న ఇంజీలులో ఒక్కటి కూడా ఈసా మసీహ్'వైపుకు జోడించబడిలేదు.
కాబట్టి ఈ పాత గ్రంధాలను' అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపచేశాడు,అవి కేవలం ఆ కాలాలకు సంబంధించిన శాసనాలు,వాటిని అల్లాహ్ ఆ కాలాల కోసం మాత్రమే ప్రత్యేకించాడు'అని విశ్వసించాలి.
ఇక చిట్టచివరి గ్రంధం అల్లాహ్ తరుపు నుంచి వచ్చినది 'అల్ 'ఖుర్ఆనుల్ అజీమ్'దీనిని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై అవతరింపచేశాడు,నిరంతరంగా అల్లాహ్ యే దానిని సంరక్షిస్తున్నాడు, దాని అక్షరాలలో, వాక్యాలలో, హరకాతుల్లో [కదలికల్లో]అర్ధాలలో ఏ రకమైన మార్పు గానీ, చేర్పు గాని జరగలేదు.
అల్'ఖుర్ఆనుల్ అజీమ్ మరియు గత పుస్తకాలకు మధ్య గల వ్యత్యాసాలు చాలా రకాలుగా ఉన్నాయి;
1) నిశ్చయంగా ఈ పురాతన పుస్తకాలు అంతరించిపోయాయి, మరియు అందులో మార్పులు,చేర్పులు నమోదు చేయబడ్డాయి,ఇతరుల వైపుకు అవి ఆపాదించబడ్డాయి,అందులో వ్యాఖ్యానాలు,సంక్షిప్తాలు,వివరణలు జోడించబడ్డాయి,వాటిలో దైవవాణికి, బుద్దికి,సహజ స్వభావానికి విరుద్ధమైన అనేక విషయాలు ఉన్నాయి.
ఖుర్ఆనుల్ కరీం'అల్లాహ్ సంరక్షణలో నిరంతరం సురక్షితంగా ఉంది,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం పై అవతరించిన అక్షరాలు,వాక్యాలు అలాగే సంరక్షించబడ్డాయి,అందులో ఎటువంటి మార్పు కానీ చేర్పు కానీ చేయబడలేదు. ముస్లిములు ఎంతో పవిత్రంగా అల్'ఖుర్ఆను'గ్రంధాన్ని ఇతర విషయాలతో సమ్మేలితమవ్వకుండా స్వచ్ఛంగా ఉంచడానికి జాగ్రత్త పడతారు, ఇతర విషయాలను అనగా' దైవప్రవక్త జీవిత చరిత్ర,సహాబాల చరిత్ర,ఖుర్ఆను వ్యాఖ్యానం,ఆరాధనల ఆదేశాలు,వ్యవహారాల ఆదేశాలు'ఖుర్ఆనుతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచుతారు.
2) నిశ్చయంగా పురాతన గ్రంధాలకు నేడు చారిత్రక ప్రమాణ పత్రాలు లభించవు,మరియు అందులోని కొన్నిఎవరిపై అవతరించాయి,ఏ భాషలో లిఖించబడ్డాయి కూడా తెలియదు, అందులోని కొన్ని భాగాలు తెచ్చిన వారి వైపు కాకుండా ఇతరుల వైపుకు ఆపాదించబడ్డాయి.
ఇక ఖుర్ఆను విషయానికి వస్తే ముస్లిములు దానిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుంచి కంఠస్తపర, వ్రాతపూర్వకంగా 'నిరంతర పరంపరతో'క్రమబద్దంగా భద్రపర్చారు,ముస్లిముల వద్ద ప్రతీ యుగంలో ప్రతీ దేశంలో ఈ పుస్తకం యొక్క అనేక హుఫ్ఫాజులు'[ఖుర్ఆన్ కంఠస్త పరులు],అనేక లిఖిత గ్రంధాలు ఉన్నాయి. లిఖితపుస్తకాలు శబ్దకంఠస్త పుస్తకాలతో ఏకీభవించకపోతే వాటిని పరిగణలోకి తీసుకోబడదు,అవి ఖచ్చితంగా హృదయంలోని పంక్తులు వ్రాతపూర్వక పుస్తకాలతో ఏకీభవించాలి.
అన్నింటికంటే మించి,ఈ ప్రపంచంలోని పుస్తకాలలో ఏదీ చేయబడని విధంగా ఖుర్ఆన్ మౌఖికంగా ప్రసారం చేయబడింది.ముస్లింలలో తప్ప ఈ ప్రత్యేకమైన ప్రసార పద్ధతి కనుగొనబడలేదు.ఖుర్ఆను సంరక్షించే పద్దతి ఈ విధంగా సాగుతుంది:-ఒక విద్యార్థి తన గురువు చేతిలో ఖుర్ఆన్ ను కంఠస్తంతో హృదయంలో నిక్షిప్తం చేసుకుంటాడు;అతను తన గురువు చేతిలో కంఠస్తంతో హృదయ పూర్వకంగా నేర్చుకున్నాడు.ఉపాధ్యాయుడు విద్యార్థికి "ఇజాజా" అనే ధృవీకరణ పత్రాన్ని కూడా ఇస్తాడు, దీనిలో ఉపాధ్యాయుడు తన సొంత ఉపాధ్యాయుల నుండి తాను నేర్చుకున్న వాటిని ఒకదాని తరువాత ఒకటి నేర్పించాడని ఉపాధ్యాయుడు సాక్ష్యమిస్తాడు,ఈ ఉపాధ్యాయులలో ప్రతి ఒక్కరూ ఖుర్ఆను నేర్చుకున్న తన గురువు పేరును చెప్తారు.అల్లాహ్ ప్రవక్త'కు గొలుసు చేరే వరకు వరుసగా,అల్లాహ్ ప్రవక్త'కు చేరే వరకు ఉపాధ్యాయుల గొలుసు కంఠస్తపరంగా వెళుతుంది.
ఖుర్ఆన్ లోని ప్రతీ సూరా ప్రతీ ఆయతు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ మీద ఎప్పుడు,ఎక్కడ అవతరించిందనడానికి అనేక బలమైన సాక్ష్యాలు మరియు చారిత్రక రుజువులు ఉన్నాయి.
3) గత పురాతన పుస్తకాలు అవతరించిన భాషలు చాలా కాలం ముందే అంతరించిపోయాయి.ఈ యుగంలో ఆ భాషలు మాట్లాడేవారు లేరు మరియు చాలా కొద్ది మంది మాత్రమే వాటిని ఇప్పుడు అర్థం చేసుకోగలరు.ఖుర్ఆన్ అవతరించిన భాష విషయానికొస్తే, ఇది ఈ రోజు లక్షల్లో మాట్లాడే సజీవభాష.ఇది ప్రపంచంలోని ప్రతి దేశంలో బోధించబడుతుంది మరియు అధ్యయనం చేయబడుతుంది.దానిని నేర్చుకునేవాడు కూడా ఖుర్ఆన్ యొక్క అర్ధాన్నినేర్చుకోవడానికి వారిని ప్రతిచోటా పొందుతాడు.
4) పురాతన పుస్తకాలలో ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్ట సమయం కోసం, ఒక నిర్దిష్ట దేశానికి పంపబడింది;ఉద్దేశించబడింది. అందుకే ఆ దేశానికి మరియు ఆ కాలానికి మాత్రమే చెందిన నియమాలు ఇందులో ఉన్నాయి.ఈ పురాతన లక్షణాలను కలిగి ఉన్న ఏ పుస్తకం మానవాళికి తగినది కాదు.
ఇక ఖుర్ఆన్ విషయానికొస్తే,ఇది అన్ని కాలాలకు మరియు అన్ని ప్రదేశాలకు ఉద్దేశించిన పుస్తకం. ఇందులో శాసనాలు,వ్యవహారాలు,నైతిక నియమాలు మరియు ప్రతి యుగానికి చెందిన తగిన మర్యాదలను కలిగి ఉంది; ఎందుకంటే ఇది సర్వమానవాళికి సంబోధించబడుతుంది.
ఈ విషయాలతో స్పష్టమయ్యేది ఏమిటంటే మనిషికి విరుద్దంగా ‘అల్లాహ్ యొక్క పట్టు’[ హుజ్జతు’] అనేది ‘అసలైన రూపం భాషా తెలియని పుస్తకాలతో స్థాపించబడటం అసంభవం,ఎందుకంటే మార్పులు చేర్పులకు గురైన ఆ పుస్తకాల భాషను మాట్లాడే వారు కానీ,తెలిసినవారు కానీ భూమి పై లేరు... అల్లాహ్ యొక్క పట్టు(హుజ్జతు)మనిషికి విరుద్దంగా ఈ పుస్తకాలలో ఉంటుంది’ అవి మార్పులు చేర్పులకు,హెచ్చుతగ్గులు కాకుండా సురక్షితంగా ఉండాలి’ఆ పుస్తక కాపీలు ప్రతీచోట లభ్యమవ్వాలి,మరియు అది జీవన భాషలో లిఖించబడి ఉండాలి,ఆ భాషను లక్షల్లో మాట్లాడేవారు ఉండాలి,వారు అల్లాహ్ సందేశాలను ప్రజలకు చేరవేస్తూ ఉండాలి,ఆ పుస్తకమే పవిత్ర ’ఖుర్ఆను’గ్రంధం’. దానిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై అల్లాహ్ అవతరింపచేశాడు,ఆ గ్రంధం మునుపటి పుస్తకాలను దృవీకరిస్తుంది,మరియు వాటికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ గ్రంధాన్ని అనుసరించడం సమస్త మానవాళి పై విధి చేయబడింది,తద్వారా అది వారి కొరకు జ్యోతిగా,స్వస్థతగా,మార్గదర్శక ప్రదాయినిగా,కరుణగా మారుతుంది: {మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు!}[233] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {(ప్రవక్త)చెప్పండి!ఓ ప్రజలారా నిశ్చయంగా నేను మీ అందరివైపుకు ప్రభవింపబడిన అల్లాహ్ సందేశహరుడను}257.[234]
నాలుగవది:- [అల్'ఈమాను బిర్రుసుల్']దైవప్రవక్తలను విశ్వసించడం.{సలవాతుల్లాహి సలాముహూ'అలైహిమ్]
నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల వద్దకు ప్రవక్తలను పంపాడు,అల్లాహ్ ను విశ్వసించి ప్రవక్తలను సత్యమని నమ్మిన వారికి శాశ్వత అనుగ్రహాల యొక్క శుభవార్తను అందిస్తారు,అవిశ్వసించిన వారిని శిక్షలతో హెచ్చరించారు. {మేము ప్రతీ సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపచేసాము,అతని ద్వారా "అల్లాహ్'ను మాత్రమే ఆరాధించండి'ఆయన తప్ప ఇతరాత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి"}[235] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.}[236]
మరియు ఈ దైవప్రవక్తలు అనేక మంది ఉన్నారు.వారిలో మొదటివారు నూహు అలైహిస్సలాం,మరియు చిట్ట చివరివారు ముహమ్మద్’సల్లల్లాహు అలైహివ సల్లం.వారిలో అల్లాహ్ మనకు కొంత మంది గురించి మాత్రమే తెలిపాడు, ఇబ్రాహీము, మూసా, ఈసా, దావూదు,యహ్యా,జకరియ్యా,మరియు సాలెహ్ అలైహిముస్సలాం మరియు మనకు తెలియజేయని వారి గురించి కూడా అల్లాహ్ ఇలా చెప్పాడు. {మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు}[237]
ఈ సమస్త ప్రవక్తలు సందేశహరులందరు అల్లాహ్ సృష్టించిన మానవులు,వీరికి రుబూబియ్యతు, ఉలూహియ్యతు' గుణాలలో ఎటువంటి భాగస్వామ్యం లేదు,మరియు ఆరాధనకు చెందిన ఏ భాగంలో వారికి అధికారం లేదు,వారు స్వతహాగా తమ కొరకు ఎటువంటి ప్రయోజనం కానీ హనిగానీ చేకూర్చలేరు,అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం గురించి ఇలా తెలియజేశాడు:- ఆయన ప్రవక్తల్లో మొట్టమొదటి వాడు-ఆయన తనజాతిప్రజలతో ఇలా చెప్పాడు {నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనడంలేదే వినండి,నా దగ్గర అగోచరజ్ఞానం కూడా లేదు'నేను దైవదూతనని కూడా అనటంలేదు}[238]. మరియు అల్లాహ్ తఆలా వారిలో చిట్టచివరి ప్రవక్తకు ఇలా ఆదేశించాడు:- {నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనడంలేదే వినండి,నా దగ్గర అగోచరజ్ఞానం కూడా లేదు'నేను దైవదూతనని కూడా మీతో అనటంలేదు}[239]. మరియు ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్ తలచినంత మాత్రమే తప్ప నేను సైతం నా కోసం లాభం కానీ నష్టం కానీ చేకూర్చు కునే అధికారం నాకు లేదు}[240]
ప్రవక్తలందరూ గౌరవనీయులైన అల్లాహ్ దాసులు,అల్లాహ్ వారిని ఎన్నుకున్నాడు, మరియు వారికి దైవదౌత్య పదవితో సత్కరించాడు, వారిని దాసులుగా వర్ణించాడు, వారందరి ధర్మం ఇస్లాం, అల్లాహ్ 'అది తప్ప మరొక ధర్మాన్ని ఆమోదించడు :- {నిస్సందేహంగా ఇస్లాం'యే అల్లాహ్ వద్ద ధర్మం సమ్మతమైనది}264 దైవదౌత్య పునాదుల్లో వారందరి సందేశాలు సమానం, మరియు షరీఅతు శాసనాలు చట్టాలు వేరుగా ఉండేవి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మీలో ప్రతీఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని మార్గాన్ని నిర్ధారించాము}[241] మరియూ ఈ షరీఅతులలో శాసనాలలో చట్టాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన షరీఅతు శాసనాలు చిట్టచివరివి,ఇది మునుపటి శాసనాలన్నింటిని రద్దు పరిచింది, మరియు ఆయన దైవదౌత్యం చిట్టచివరిది,ఆయన ద్వారా ప్రవక్తల పరంపరను ముగించబడింది.[242]
మన ప్రవక్తను విశ్వసించినవాడు మిగతా ప్రవక్తలందరినీ కూడా తప్పనిసరిగా విశ్వసించాలి,ఒకప్రవక్తను విశ్వసించినవాడు నిజానికి ప్రవక్తలందరిని విశ్వసించినట్లే,ఎందుకంటే ప్రవక్తలు,సందేశహరులు,అల్లాహ్ పట్ల విశ్వాసం,దైవదూతలపట్ల విశ్వాసం, దైవగ్రంధాలపై విశ్వాసం,దైవదూతలపై విశ్వాసం,పరలోకంపై విశ్వాసం'కలిగి ఉండాలని దావతు ఇచ్చారు, ఎందుకంటే వారందరి ధర్మం ఒకటి,ఎవరైతే వారి మధ్య వ్యత్యాసం చూపినా,కొంత మందిని విశ్వసించి మరికొందరిని తిరస్కరించినా 'నిజానికి వారందరినీ అవిశ్వసించారు. ఎందుకంటే వారిలోని ప్రతీఒక్కరు ప్రవక్తలను,సందేశహరులను అందరినీ విశ్వసించాలి అని ఆహ్వానించారు [243]అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఈ ప్రవక్త తన ప్రభువు తరుపు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.}[244] మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ -}[245]
ఐదవది:-పరలోక దినం పై విశ్వాసం'ఈ ప్రపంచంలో'మరణం'తో ప్రతీ మనిషి జీవితం ముగుస్తుంది,మరి మరణం తరువాత మనిషి గమ్యం ఏమిటి? ఈ ప్రపంచంలో శిక్ష నుండి తప్పించుకున్నఅన్యాయం చేసిన దుర్మార్గుల ముగింపు ఏమిటి ?అన్యాయాల పర్యవసానం నుంచి వారు తప్పించుకుంటారా? ఈ లోకంలో తమ హక్కును,ప్రతిఫల భాగం వాటాను కోల్పోయిన ఉత్తముల,నీతిమంతుల సంగతేంటి,వారి ప్రతిఫలం వృథా అవుతుందా?
నిశ్చయంగా మానవజాతి మరణాన్నితరం తరువాత తరం చవిచూస్తూ ఉంటుంది,చివరికి అల్లాహ్ ఆజ్ఞతో ఈ లోకంలో ప్రళయం సంభవిస్తుంది,సర్వసృష్టి నాశనమవుతుంది,ఆ తరువాత అల్లాహ్ సర్వసృష్టిని పరలోక దినాన జమాపరుస్తాడు,అందులో ఆయన ప్రధములను,చివరి వారిని సమీకరిస్తాడు,ఈ ప్రపంచంలో చేసిన మంచి చెడు కార్యాల ఆధారంగా ఆ దాసుల లెక్క తీసుకుంటాడు,అప్పుడు అల్లాహ్'ను విశ్వసించినవారు స్వర్గానికి వెళ్తారు,అవిశ్వాసించినవారు నరకానికి వెళ్తారు.
స్వర్గము'అంటే'అల్లాహ్ తఆలా తన ముస్లిము దాసులకు సిద్దం చేసిపెట్టిన అనుగ్రహవరం,అందులో రకరకాల అనుగ్రహాలు ఉన్నాయి,ఏ ఒక్కరూ దానిని వర్ణించలేరు,అందులో వంద అంతస్తులు ఉన్నాయి,ప్రతీ అంతస్తులో నివాసులు వారి అల్లాహ్ పట్ల విశ్వాసం మరియు ఆయన విధేయత ఆధారంగా జీవిస్తారు. మరియు స్వర్గంలో గల అతిక్రింది అంతస్తులో ఉన్నవాడికి ప్రపంచ సామ్రాజ్యా ధికారంతో పాటు దానికి పదిరెట్లు పెద్దదిగా ఆ అంతస్తు ఉంటుంది.
మరియు నరకం'అంటే అల్లాహ్ తనను అవిశ్వసించి తిరస్కరించిన దాసుల కొరకు సిద్దంచేసి పెట్టాడు,అందులో రకరకాల విపరీతమైన హింసలు,శిక్షలు ఉంటాయి,వాటిని విని మనిషి కంపించిపోతాడు,అల్లాహ్ పరలోకదినాన ఎవరికైనా మరణ ఆజ్ఞ ఇస్తే నరకవాసి కేవలం ఆ నరకాన్ని చూడగానే చచ్చిపోతాడు.
నిశ్చయంగా అల్లాహ్'కు ప్రతీ మనిషి గురించి అతను చేసే మంచి,చెడులు,బహిరంగంగా, రహస్యంగా చేసేవి ప్రతీదీ ఆయనకు (ముందే) తెలుసు ప్రతీ మనిషితోపాటు ఇద్దరు దైవదూతలు ఉన్నారు,అందులో ఒకరు మంచిని వ్రాస్తున్నాడు మరొకరు చెడును నమోదు చేస్తున్నాడు,మనిషి చేసే ఏ ఒక్కవిషయం కూడా వారు వదిలిపెట్టరు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు.}[246] ఈ కర్మలను దైవదూతలు ఒక పుస్తకంలో నమోదు చేస్తారు,ఆ పుస్తకాన్ని రేపు పరలోకదినాన అతని చేతిలో పెట్టబడుతుంది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.}{270}. అప్పుడు ప్రతీ ఒక్కరూ ఆ పుస్తకాన్ని చదువుతారు,అందులోని ఏ విషయాన్ని అతను నిరాకరించడు,ఒకవేళ అతను వాటిని నిరాకరిస్తే అల్లాహ్ అతని చెవులకు,కళ్ళకు,రెండు చేతులకు,రెండుకాళ్ళకు నోటిని ప్రదానం చేస్తాడు అవి అతను చేసిన ప్రతీ పనిని వివరిస్తాయి.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు (జ్ఞాపకముంచుకోండి) అల్లాహ్ యొక్క విరోధులు నరకాగ్ని వైపుకు సమీకరించబడే రోజు, వారు తమ తమ స్థానాలకు పంపబడతారు.}[247] చివరకు వారు దానిని (నరకాగ్నిని) చేరుకున్నప్పుడు;వారి చెవులు, వారి కళ్ళు మరియు వారి చర్మాలు వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి, వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి.[248] [మరియు వారు తమ చర్మాలను (అవయవాలను) అడుగుతారు: "మీరెందుకు మాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నారు?" అవి ఇలా సమాధానమిస్తాయి: "ప్రతి వస్తువుకు మాట్లాడే శక్తి ప్రసాదించిన అల్లాహ్ యే మమ్మల్ని మాట్లాడింప జేశాడు." మరియు ఆయనే మిమ్మల్ని మొదటిసారి సృష్టించిన వాడు, మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.}21 {మరియు (మీరు దుష్కార్యాలు చేసేటప్పుడు) మీ చెవుల నుండి మీ కండ్ల నుండి మరియు మీ చర్మాల నుండి - మీకు వ్యతిరేకంగా సాక్ష్యం వస్తుందేమోనని - మిమ్మల్ని మీరు దాచుకునేవారు కాదు. అంతేకాదు మీరు చేస్తున్న ఎన్నో కార్యాలు వాస్తవంగా, అల్లాహ్ కు తెలియటం లేదని మీరు భావించేవారు.}-
మరియు'పరలోకదినాన్నివిశ్వసించడం'-అది ప్రళయం రోజు'తిరిగి లేపబడే రోజు,సమీకరించబడేరోజు - ఆరోజు గురించి సమస్త ప్రవక్తలు సందేశహరులు తెలియజేశారు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.}[249] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. {ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా, ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన వాడు అల్లాహ్ యే నని మరియు ఆయన వారిని సృష్టించటంలో అలసి పోడని, మరణించిన వారిని తిరిగి బ్రతికించగల సామర్థ్యం గలవాడని? అలా కాదు (ఎందుకు కలిగిలేడు)! నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.}[250] మరియు అల్లాహ్ వివేకం దీనిని కోరుతుంది ఎందుకంటే ఆయన సృష్టిని వృధాగా పుట్టించలేదు,వారిని ఊరికే వదిలేయలేదు,బుద్దిపరంగా చూస్తే బలహీనులు కూడా ఏ కార్యాన్ని,పనిని ఉద్దేశ్యం,ప్రయోజనం లేకుండా చేయరు,ఇది మనిషితోనే సంభవం కానప్పుడు'తన ప్రభువు గురించి ఆయన తనను వృధాగా పుట్టించడాని'ఏ ఉద్దేశ్యం లేకుండా ఊరికే వదిలేశాడని అతను ఎలా భావిస్తాడు?'అల్లాహ్ వారు చెప్పే మాటలకు పవిత్రుడు మరియు చాలా గొప్పవాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {"ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"}[251] మరియు సత్యవంతుడు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: {మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!}[252]
తెలివిమంతులు వివేచనపరులు పరలోకాన్ని విశ్వసించాలని సాక్ష్యామిచ్చారు,అదే విషయాన్ని బుద్ది కోరుతుంది,రుజువైన సహజస్వభావం దీనిని అంగీకరిస్తుంది,ఎందుకంటే మనిషి పరలోకదినాన్నివిశ్వసించినప్పుడు అతను చేసిన సత్కార్యాలు,విడిచిన పాపాలకు ప్రతిఫలం అల్లాహ్ వద్ద లభిసుందని ఆశిస్తాడు. ఆపై ఇది కూడా అతను తెలుసుకుని ఉంటాడు'ఎవరిపై అతను దౌర్జన్యం చేస్తాడో అతను తన హక్కును ఖచ్చితంగా పరలోకదినాన పొందుతాడు,పరలోకదినాన ప్రజల మధ్య తీర్పు చేయబడుతుంది,అప్పుడు మనిషి చేసిన మంచికి బదులుగా మంచిని పొందుతాడు చెడుకి బదులుగా చెడుని పొందుతాడు'ప్రతీఒక్కరికీ అతను చేసిన దాని ప్రకారంగా ప్రతిఫలం లభిస్తుంది,మరియు ఆరోజు అల్లాహ్ యొక్క న్యాయం ప్రదర్శించబడుతుంది.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు; {మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.}[253] {మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.}
ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు,ఈ రోజు గురించి అల్లాహ్ ఏ ప్రవక్తకు చెప్పలేదు,ఏ సామీప్య దైవదూతకు దాని జ్ఞానంలేదు,ఆ జ్ఞానం అల్లాహ్ కేవలం తన కోసం ప్రత్యేకించుకున్నాడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- [వీరు నీతో ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది?అని ప్రశ్నిస్తున్నారు [ఓప్రవక్తా] చెప్పువారికి: దీని జ్ఞానం కేవలం నా ప్రభువు దగ్గర మాత్రమే ఉంది,దాని సమయంలో దానిని కేవలం అల్లాహ్'యే బహిర్గతపరుస్తాడు.}[254] అల్లాహ్ సెలవిచ్చాడు: {నిశ్చయంగా అల్లాహ్ వద్ద మాత్రమే ప్రళయం యొక్క జ్ఞానం ఉంది}[255]
ఆరు:-విధిరాత,తీర్పుపట్ల విశ్వాసం
నిశ్చయంగా అల్లాహ్'కు జరిగింది,జరగబోయేది'తెలుసు,దాసుల స్థితిగతులు,వారి కార్యాలు,మరణసమయాలు,ఉపాధి గురించి పూర్తిగా తెలుసు'అని విశ్వసించాలి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.}279 మరియు అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:- {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు.మరియు భూమిలోనూ,సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు.మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.}[256]. మరియు ఆయన వద్ద ఉన్న పుస్తకంలో ప్రతీది లిఖితమై ఉంది:-అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {మేము ప్రతీ విషయాన్ని స్పష్టమైన ఒక గ్రంధంలో నమోదుచేసి పెట్టాము}[257] అల్లాహ్ సెలవిచ్చాడు: {ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.}282 అల్లాహ్ తఆలా ఏదైనా ఆదేశం కోరినపుడు దాంతో'కున్'ఫ యకూన్ {అయిపో అంటే అయిపోతుంది}ద్వారా ముగిస్తాడు:అల్లాహ్ ఇలాసెలవిచ్చాడు :- {నిశ్చయంగా, ఆయన విధానమేమిటంటే! ఆయన ఏదైనా చేయదలచు కున్నప్పుడు దానితో:"అయిపో!" అని అంటాడు,అంతే! అది అయిపోతుంది.}[258] మరియు ఎలాగైతే అల్లాహ్ ప్రతీది చేయగల సమర్ధుడో'ఆయన ప్రతీదీ సృష్టిస్తాడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.}[259] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్'యే ప్రతీది సృష్టించేవాడు}[260] అయితే అల్లాహ్ దాసులను తనకు విధేయత'చూపడానికి సృష్టించాడు,మరియు వారికి ఆ విషయాన్ని వివరించాడు, దాని గురించి ఆదేశించాడు,మరియు తనకు ఆవిధేయత కనబర్చవద్దని హెచ్చరించాడు, నిషేదించాడు, మరియు వారి కోసం తక్దీరు'ను'కోరికను'ఇచ్చాడు తద్వారా వారు అల్లాహ్ ఆదేశాలను పూర్తిచేయగలరు అలా వారు పుణ్యాన్ని పొందగలరు,మరియు ఎవరైతే ఆయనకు ఆవిధేయత చూపుతారో ఆయన శిక్షలకు అర్హులు అవుతారు.[261]
మనిషి 'తఖ్దీరును'విధిరాత'ను విశ్వసించినప్పుడు ఈ క్రింది ప్రయోజనాలు అతనికి కలుగుతాయి:-
1) సబబ్[కారణం]యొక్క పనులు చేసేటప్పుడు మనిషి నమ్మకం అల్లాహ్'తఆలా పై ఉంటుంది,ఎందుకంటే 'సబబు,ముసబ్బబు'[కారణం,దానిఫలితం]రెండు అల్లాహ్'కోరిక మరియు తీర్పు నిమిత్తమే ఉంటాయని'అతనికి తెలిసి ఉంటుంది.
2) మనసుకు శాంతి హృదయానికి ప్రశాంతత లభిస్తుంది,ఎందుకంటే ఇది అల్లాహ్ తీర్పు మరియు కోరిక ప్రకారం జరిగింది'అని మరియు విధిరాత ప్రకారంగానే ప్రతీది జరుగుతుందని'నమ్ముతాడు,తద్వారా అతని ఆత్మకు శాంతి లభిస్తుంది అల్లాహ్ విధిరాత పట్ల ప్రసన్నుడవుతాడు,కాబట్టి ఎవరైతే తక్దీరును'విశ్వసిస్తాడో అతను స్వచ్చమైన జీవితాన్నిమరియు అందరికంటే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు.
3) అతను తన లక్ష్యం సాధించినప్పుడు అహంకారాన్ని ప్రదర్శించడు; ఎందుకంటే, ఈ అనుగ్రహం అల్లాహ్ అమర్చిన కారణాలతో పొందాడు'అని అతను తెలుసుకుంటాడు.అందువల్ల అతను అల్లాహ్'కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.
4) కోరుకున్నది దక్కనప్పుడు,చెడు జరిగినప్పుడు మనిషి ఆందోళనను,భాధను ఇది దూరం చేస్తుంది,ఎందుకంటే ఇది అల్లాహ్ ఆదేశం మేరకు జరుగుతుంది,దాన్ని ఎవరు దూరంచేయలేరు,ఎట్టి పరిస్థితిలో అది జరిగి తీరుతుంది.కనుక మనిషి దానిపై సహనంపాటిస్తాడు,అల్లాహ్'నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు:- {భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.}[262] {ఇదంతా మీరు పోయిన దానికి నిరాశ చెందకూడదని మరియు మీకు ఇచ్చిన దానికి సంతోషంతో ఉప్పొంగి పోరాదని. మరియు అల్లాహ్ బడాయీలు చెప్పుకునేవారూ, గర్వించే వారూ అంటే ఇష్టపడడు.}
5) తఖ్దీరు'ను విశ్వసించడం వల్ల అల్లాహ్ పై పూర్తినమ్మకం ఏర్పడుతుంది.ఎందుకంటే ఒక ముస్లింకు తెలుసు "ప్రయోజనం లేదా హాని కలిగించే శక్తి"కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది.అప్పుడు అతను ఏ బలవంతుడికి భయపడడు మరియు మంచి పనులు చేయడానికి ఒకరికి భయపడి వెనుకాడడు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లామ్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమ తో ఇలా భోదించారు:- {తెలుసుకో!నిశ్చయంగా ఒకవేళ మానవజాతి కలిసి నీకు ప్రయోజనంచేయాలని భావించిన అల్లాహ్ రాసిపెట్టింది తప్ప కొంచెం కూడా ప్రయోజనం చేయలేరు, మరియు వారందరూ కలిసి నీకు హానీ చేయదలిచిన అల్లాహ్ నీ కొరకు రాసిపెట్టిన దానికంటే కొంచం కూడా హానీ చేయలేరు}[263]
"బహుశా నీవు అల్లాహ్'ను చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించాలి, ఒక వేళ నీవు ఆయనను చూడలేకున్నట్లైతే ఆయన నిన్నుచూస్తున్నట్లుగా భావించి ఆరాధించాలి'-కాబట్టి మనిషి తన ప్రభువును ఈ లక్షణం ఆధారంగా ఆరాధించాలి,ఇది అల్లాహ్ అతనికి దగ్గరగా ఉన్నాడని గుర్తుచేస్తుంది'తన ప్రభువు ఎదుట నిలబడిన భావన కలిగిస్తుంది,ఈ భావన అల్లాహ్ పట్ల భయాన్ని,భీతిని,గౌరవాన్నికలిగిస్తుంది,అల్లాహ్ ఆరాధనను ఉత్తమంగా పాటించడంలో సహకరిస్తుంది మరియు దానిని ఉత్తమంగా చేయడానికి,సంపూర్ణపర్చడానికి సహకరిస్తుంది.
కాబట్టి దాసుడు ఆరాధించేటప్పుడు తన ప్రభువుకు భయపడాలి,ఆయన దగ్గరగా ఉన్నాడని భావించాలి,బహుశా అతను అల్లాహ్’ను చూస్తున్నట్లుగా భావించాలి,ఒకవేళ ఆ స్థితిని భావించడం కఠినమైతే అల్లాహ్’తో ఆ స్థితిని పొందటంలో సహాయం కోసం దుఆ చేయాలి,అల్లాహ్ అతన్ని చూస్తున్నాడనే భావన కలిగి ఉండాలి,అలాగే అల్లాహ్’కు మనిషి యొక్క సర్వరహస్యాలు తెలుసు,అవి బహిర్గతమైనవైన,దాచబడినవైన సరే,దాసుడు చేసే ఏ పని,కార్యం,వ్యవహారం అల్లాహ్ నుండి దాగిలేదు.[264]
ఒక దాసుడు ఈ దశకు చేరుకుంటే అతను తన ప్రభువును చిత్తశుద్దితో ఆరాధిస్తాడు,ఇతరుల వైపుకు మ్రోగ్గుచూపడు,ప్రజల ప్రశంసలకు పొగడ్తలకు వేచిచూడడు,మరియు వారి అవమానాన్ని లెక్కచేయడు,అల్లాహ్'ప్రసన్నతను పొందటం,ప్రభువును స్తుతించడం అసలైన సాఫల్యమని భావిస్తాడు.
మరియు 'రహస్యంగా, బహిర్గతంగా అతని వ్యక్తిత్వం సమానమవుతుంది,అతను తన ప్రభువును అంతర్గతంగా బహిర్గతంగా ఆరాధించేవాడు అవుతాడు,తన మనసులో దాగియున్నరహస్యాలు,వచ్చే ప్రేరేపణలు అల్లాహ్’కు తెలుసు అని సంపూర్ణంగా విశ్వసిస్తాడు.మరియు అల్లాహ్ పై విశ్వాసం అతని మనసును సంరక్షిస్తుంది,అతను తన ప్రభువు రక్షణ యొక్క అనుభూతిని పొందుతాడు,అతను తన శరీరావయవాలను అల్లాహ్ కొరకు సమర్పించుకుంటాడు,అతను అల్లాహ్’కు కోరుకున్నది,ఆయన ప్రసన్నత చేకూర్చే పనిని మాత్రమే చేస్తాడు,అతను తనను తాను పూర్తిగా అల్లాహ్’కు సమర్పించుకుంటాడు.
అతని హృదయం ఎల్లప్పుడు ప్రభువుతో జోడించబడి ఉంటుంది కాబట్టి అతను ఎవరిని సహాయం అర్ధించడు,అల్లాహ్ అతనికి చాలు. మరే మనిషికి తన కష్టాల గురించి కానీ,భాధల గురించి ఫిర్యాదు చేయడు,ఎందుకంటే అల్లాహ్ యే ఆ కష్టాన్ని,అవసరాన్ని దింపాడు కాబట్టి వాటిని తీర్చేది కూడా ఆయనే సహాయకుడిగా ఆయన చాలు'అని నమ్ముతాడు. అతను ఏ ప్రదేశానికి భయపడడు,మరియు ఎవ్వరికీ భీతిల్లడు,ఎందుకంటే'అల్లాహ్ ప్రతీ స్థితిలో అతనితో ఉంటాడని అతనికి తెలుసు,ఆయనే అతనికి చాలు,మరియు ఆయన ఎంతో మంచి సహాయకుడు. అల్లాహ్ ఆదేశించిన ఏ ఆజ్ఞ'ను అతను ఉల్లంఘించడు,మరియు అల్లాహ్'కు ఆవిధేయత చూపడు,ఎందుకంటే వారు అల్లాహ్'కు సిగ్గుపడతారు,మరియు అల్లాహ్ ఆజ్ఞ'ను ఉల్లంఘించడాన్ని,ఆయన నిషేధాలను చేయడాన్ని ఇష్టపడరు. మరియు అహంకారాన్ని చూపరు,లేదా ఒకరిపై దౌర్జన్యం చేయరు,లేదా ఒకరి హక్కును అన్యాయంగా లాక్కొరూ,ఎందుకంటే 'అల్లాహ్ ప్రతీదీ కనిపెట్టుకుని ఉన్నాడు అతీ త్వరలో తన కర్మలకు ప్రతిఫలం ఒసగుతాడన్నవిషయం అతనికి తెలుసు. మరియు భూమిపై అల్లకల్లోలాన్ని రేకెత్తించడు ఎందుకంటే భూమిపై ఉన్నవస్తువులన్నీ అల్లాహ్ తఆలా సామ్రాజ్యాధికారానికి చెందినవి,అల్లాహ్ తన సృష్టికి ఆధీనపర్చాడు'అని అతనికి తెలుసు,కాబట్టి అతను తన అవసరాన్ని బట్టి ఈ మంచి విషయాలను ఉపయోగించుకుంటాడు,మరియు దానిపై అల్లాహ్'కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.
ఈ పుస్తకంలో నేను మీకు చెప్పినవి మరియు మీకు అందించినవన్నీ ఇస్లాం లోని ముఖ్యమైన మూలవిషయాలు మరియు గొప్ప స్తంభాలు మాత్రమే.ఈ మూల పునాది విషయాలను విశ్వసించి,దాని సంభంధిత కార్యాలను ఆచరించినవాడు ముస్లిం అవుతాడు.కాకపోతే, ఇస్లాం- నేను మీకు చెప్పినట్లుగా – ధర్మం,ప్రపంచం;ఆరాధన మరియు జీవన విధానం.ఇది సమగ్రమైన,మరియు సంపూర్ణమైన దైవిక వ్యవస్థ,దాని చట్టంలో జీవితంలోని ప్రతీ రంగంలో అవసరమైన విషయాలన్నీ ఉన్నాయి,అది వ్యక్తికి,సమాజానికి చెందినది కావొచ్చు లేదా వారి మత,రాజకీయ,ఆర్థిక,సామాజిక మరియు భద్రతకు చెందినది అయిఉండవచ్చు. మానవుడు అందులో శాంతిని మరియు యుద్ధాన్ని నియంత్రించే సూత్రాలు,ప్రాథమిక అంశాలు మరియు నియమాలను పొందుతాడు;మరియు మనుషులు, పక్షులు,జంతువులు మరియు అతని చుట్టూ ఉన్న పర్యావరణం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది.అది మనిషి యొక్క వాస్తవికత, జీవితం మరియు మరణం గురించి కూడా అతనికి వివరిస్తుంది;మరియు మరణం తరువాత పునరుత్థానం.అతను తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే ఉత్తమ పద్దతిని కూడా ఇస్లాంలో పొందుతాడు; అల్లాహ్ ఇలా చెప్పాడు:- {మరియు మీరు ప్రజలతో ఉత్తమంగా సంభాషించండి}[265] అల్లాహ్ సెలవిచ్చాడు:- {మరియు ప్రజలను క్షమిస్తూ ఉంటారు}[266]. అల్లాహ్ సెలవిచ్చాడు:- {ఏదైనా ఒక వర్గంతో ఉన్న విరోధం మిమ్మల్ని న్యాయవిరుద్ధతకు పాల్పడనీయకూడదు,న్యాయం చేయండి,ఇది దైవభీతికి అత్యంత చేరువైనది}[267]
ఈ ధర్మం యొక్కదశలు తరగతులు మరియు ప్రతి తరగతి యొక్క ప్రాథమిక విషయాలను చర్చించిన తరువాత, ఇస్లాం యొక్క ప్రత్యేకతలను,అందాలను క్లుప్తంగా చర్చించడం సముచితమని మేము భావిస్తున్నాము.
ఇస్లాం యొక్క అందాలను పూర్తిగా వ్రాయగలిగే శక్తి ఏ కలముకు లేదు,ఈ ధర్మపు సద్గుణాలను,విశిష్టతలను వివరించడానికి పదాలు లేవు;ఎందుకంటే ఇది అల్లాహ్ తఆలా యొక్క ధర్మం,ఏ విధంగానైతే అల్లాహ్'ను కళ్ళు చూడలేవో అలాగే మనిషి అల్లాహ్ జ్ఞానాన్ని ఆవరించలేడు. అదే విధంగా అల్లాహ్ యొక్క షరీఅతు సద్గుణాలను వివరించడానికి కలము కు కూడా శక్తిలేదు. ఇబ్నుల్ ఖయ్యిమ్' రహిమహుల్లాహ్ చెప్పారు:- (మీరు ఈ రుజువైన సరళమైన ధర్మం,ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క షరీఅతు యొక్క వివేక మర్మం గురించి పరిశీలిస్తే –మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం యొక్క పరిపూర్ణతను,మంచిని మాటల్లో వివరించలేము,వాటి యొక్క సద్గుణాలను వివరణల ద్వారా వర్ణించలేము,మరియు బుద్దితెలివి గలవారు కూడా దాని ఎత్తును గొప్పతనాన్ని ఊహించలేరు, బుద్దితెలివి సంపూర్ణులైన వారందరు అందులో జమచేయబడినా సరే!అయితే విజ్ఞానులు మరియు విద్వాంసులు ‘ఇస్లాం యొక్క సద్గుణాలను తెలుసుకుని వాటి శ్రేష్టత గురించి ఇలా సాక్ష్యం ఇచ్చారు’-ప్రపంచం ఇస్లాం షరీఅతు చట్టాలకంటే సంపూర్ణమైనది, దీనికంటే పవిత్రమైనది, దీని కంటే గొప్ప షరీఅతు చట్టం తలుపును’ ఇంకా తట్టనే లేదు-తద్వారా మీకు దీని గొప్పతనం గురించి తెలుస్తుంది. ఒకవేళ దైవప్రవక్త ఏ ఆధారం సాక్ష్యం తీసుకురాకపోయినా ;ఇది అల్లాహ్ తరపునుంచి వచ్చిన ధర్మం’అల్లాహ్’కు ప్రీతిదాయకమైన ధర్మం అనే మాట’సాక్ష్యానికి సరిపోతుంది,మరియు ఈ ప్రపంచంలోని జీవులన్నీ ‘అల్లాహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానం,సంపూర్ణ వివేకం, అనంతకరుణ, దయ, పుణ్యం, ఉపకారం, మరియు గోచర అగోచరవిషయాల సంపూర్ణ జ్ఞానం’మరియు నియమాలు, పరిణామాలు, మరియు ఫలితం యొక్క విషయాల గురించి సాక్ష్యం చెప్తున్నాయి. ఇది దాసులపై ఉపకారంగా అల్లాహ్ అనుగ్రహించిన ఒక గొప్ప వరం,! దాసులపై అల్లాహ్ కురిపించిన అతిగొప్ప అనుగ్రహం ‘ఇస్లాం ద్వారా తన దాసులకు మార్గదర్శకత్వం చూపాడు,మరియు వారిని దీనికి అర్హుడిగా చేశాడు,దీనిని వారి కొరకు ఇష్టపడ్డాడు.!ఈ కారణం చేత అల్లాహ్ తన దాసులకు ఉపకారం చేస్తూ వారికి దాని మార్గదర్శనం చేశాడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.}[268] మరియు అల్లాహ్ తఆలా తన దాసులకు పరిచయం చేస్తూ,తన అనుగ్రహాలను గుర్తుచేస్తూ’మరియు అనుగ్రహాలు పొందినందుకు వారి నుండి కృతజ్ఞతను కోరుతూ తెలియజేశాడు:- {ఈ రోజు నేను మీకోరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను}[269]
అల్లాహ్'కు ఈ ధర్మానికి బదులుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇస్లాం ధర్మం కు సంభందించిన కొన్ని సద్గుణాలు సంక్షిప్తంగా తెలియజేస్తున్నాను.
ఈ ధర్మాన్ని అల్లాహ్ తన కొరకు ఇష్టపడ్డాడు,మరియు ప్రవక్తలకు దీనిని ఇచ్చి పంపాడు,తన ప్రజలకు ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆయనను ఆరాధించాలని,పూజించాలని ఆదేశించాడు,ఏ విధంగానైతే [అల్లాహ్]సృష్టికర్తకు మరియు సృష్టికి మధ్య పోలిక, సమానత్వం లేదో అదేవిధంగా ప్రజలు చేసుకున్నమతానికి,వారి చట్టాలకు మరియు అల్లాహ్ ధర్మానికి మధ్య సమానత్వం పోలిక లేదు! ఏ విధంగానైతే అల్లాహ్ తనను పరిపూర్ణగుణాలతో వర్ణించుకున్నాడో అదే విధంగా ఆయన ధర్మం కూడా పరిపూర్ణమైనది,ఇది మనుషుల ఇహపరలోకాల జీవనం మెరుగుపడటానికి గల ప్రయోజనకరమైన చట్టాలను,జాబితాలను రూపొందించింది,సృష్టికర్త మరియు సృష్టి కి మధ్యగల హక్కులు,దాసుల హక్కులు,మరియు వారి మధ్యగల పరస్పర హక్కులు తెలిపింది,అలాగే ఒండోకరి హక్కుల గురించి తెలుపుతుంది,
ఈ ధర్మం యొక్క ప్రముఖ అందాలలో ఒకటి 'ప్రతిదానికి పరిపూర్ణత ఉంది'అల్లాహ్ చెప్పారు:- {మేము ఈ గ్రంధంలో ఏ విషయం వదిలిపెట్టలేదు'}[270] అందువల్ల ఈ ధర్మంలో సృష్టికర్తకు సంభంధించిన ప్రతీదీ ‘పరిపూర్ణత’తో నిండి ఉంది, ఆయన నామాలు,గుణాలు,ఆయన హక్కులు,మరియు అలాగే ఆయన సృష్టికి,మానవులకు సంభంధించిన‘షరీఅతు శాసనాలు, ఆదేశాలు, నైతికత, వ్యవహారాలు,మొదలైనవి.మరియు ఈ ధర్మం ప్రథములను గురించి చివరివారి గురించి,దైవప్రవక్తల గురించి,ప్రవక్తలు ొసందేశహరులకు సంభంధించిన విషయాలు తెలియజేసింది.అలాగే భూమ్యాకాశాలు,గ్రహాలు,నక్షత్రాలు,సముద్రాలు,వృక్షాలు మరియు విశ్వం గురించి విషయాలను తెలియజేసింది,పుట్టుక పరమార్ధం ఏమిటి?లక్ష్యం ఏమిటి?అంతం ఏమిటి అనే విషయాలను గురించి ప్రస్తావించింది,స్వర్గం మరియు స్వర్గవాసుల నివాసం గురించి మరియు నరకం మరియు నరకవాసుల గురించి విషయాలు ప్రస్తావించింది.
ప్రతి అసత్య మతం మరియు అబద్ద మతంకు గల లక్షణం ఏమిటంటే ‘ఒక మనిషిని అతనికి సమానమైన మరొక బలహీనమైన,రోగాల బారిన పడే మరియు మరణించే మనిషితో జోడిస్తుంది,మరికొన్ని సార్లు యుగాలకు ముందు మరణించి ఎముకలు కరిగి మట్టిగా మారిన వ్యక్తితో సైతం సంభంధాన్ని జోడిస్తుంది. కానీ ఇస్లాం విశిష్టత ఏమిటంటే’మనిషి సంభంధాన్ని అతని సృష్టికర్తతో జోడిస్తుంది,మధ్యలో ఏ మధ్యవర్తి,సామీప్యుడు,లేదా పవిత్ర జాతి పురుషుడు సహాయం అవసరం ఉండదు,కేవలం అల్లాహ్’తో నేరుగా అతని సంభంధం ఉంటుంది,సృష్టికర్త మరియు సృష్టికి మధ్య ఒక సంబంధం అది బుద్దిని తన ప్రభువుతో కలుపుతుంది,తద్వారా జ్యోతిని పొందుతాడు,అది అతనికి మార్గదర్శనం చేస్తుంది,అతనిని ఎత్తుకు తీసుకెళ్తుంది,దాని ద్వారా పరిపూర్ణ దాస్యాన్ని పొందుతాడు,పనికిమాలిన పనులకు దూరంగా ఉంటాడు,ఎప్పుడైతే వ్యక్తి తన ప్రభువుతో హృదయాన్ని జోడించుకోడో అతను జంతువుల కన్నాహీనస్థితికి చేరుతాడు.
ఇదీ సృష్టికర్త {అల్లాహ్}మరియు సృష్టికి {మానవులు}మధ్య గల గొప్ప సంభంధం తద్వారా అతను తన ప్రభువు యొక్క కోరిక ఇష్టాల గురించి సుపరిచితుడవుతాడు,కాబట్టి ఏకాగ్రతతో అల్లాహ్ ను ఆరాధిస్తాడు,ఈ సంభంధం వల్ల అతను ప్రభువు ఆనందించేవి మరియు ప్రసన్నత చెందే విషయాల గురించి తెలుసుకుంటాడు,వాటిని పొందుతాడు, అలాగే అల్లాహ్ ఆగ్రహానికి కారణమయ్యే విషయాల గురించి తెలుసుకుని వాటి నుండి దూరంగా ఉంటాడు!
మరియు ఈ సంభంధం మహోన్నతుడైన సృష్టికర్తకు మరియు బలహీనుడు,యాచకుడైన మానవుడికి మధ్యగల సంభంధం దీని ద్వారా మానవుడు సహాయాన్ని,మార్గదర్శనాన్ని పొందుతాడు,మరియు అల్లాహ్’తో కపటుల కపట నాటకాల నుంచి షైతానుల చెడు నుంచి రక్షణ ఇవ్వమని యాచిస్తాడు.
ఇస్లాం శాసనాలు మరియు చట్టాలు ప్రాపంచిక పరలోక లాభాలను పొందటం మరియు ఉన్నతమైన నైతికతను పరిపూర్ణ పర్చడానికి స్థాపించబడ్డాయి.
పరలోక ప్రయోజనాల వివరణ :-ఇస్లాం షరీఅతు’ దీని రకాలన్నింటిని వివరించింది, అందులో ఏది వదలలేదు, బదులుగా అందులో ఏ విషయం మిగిలి ఉండకూడదని వాటి వ్యాఖ్యానం, వివరణ, స్పష్టతను తెలియజేసింది, పుణ్యాత్ములకు వారి వరాల, అనుగ్రహాల వాగ్దానం చేయబడింది, తిరస్కారులకు వారి శిక్షలు,హింసల గురించి హెచ్చరించబడింది.
ప్రాపంచిక ప్రయోజనాల వివరణ :- ఈ ధర్మంలో మనిషి ధర్మం, అతని ప్రాణం, డబ్బు, వంశం, గౌరవం,మరియు అతని బుద్దిని రక్షించే ప్రతీ దానిని అల్లాహ్ చట్టంగా వర్గీకరించాడు.
ఉత్తమ నైతికత యొక్క వివరణ:-దీని గురించి బహిర్గతంగా అంతర్గతంగా అల్లాహ్ ఆదేశించాడు,నీచమైన,పనికిమాలిన పనుల నుంచి ఆపాడు, బహిర్గత వినమ్రత, అనుకువ, స్వచ్ఛత, పవిత్రత, అశుద్దత, మలినాల నుంచి రక్షణ. అత్తరు పూయడం, మంచిదుస్తులు ధరించడం, మంచి ముఖాన్ని, ఆకారాన్ని కలిగి ఉండటం సున్నతు, మరియు అసహ్యకరమైన షైతాను పనులను హరాముగా భావించాలి, ఉదాహరణకు’వ్యభిచారం, మద్యపానం, మృతజీవుల మాంసం తినడం, మరియు పంది మాంసం తినడం మొదలైనవి. మరియు హలాలును తినమని ఆజ్ఞాపించాడు, వృధా ఖర్చు,మితిమీరిన ఖర్చు చేయడాన్ని వారించాడు.
అంతర్గత హృదయ శుద్దత ;-అంతర్గత హృదయ స్వచ్ఛత అంటే’ మనిషి పైశాచిక నైతికతను వదిలి ప్రశంసనీయ, ఉత్తమమైన నడవడికను అలవర్చుకోవాలి,-పైశాచిక నైతికత’అంటే ‘అబద్దం,పాపం,కోపం,అసూయ,లోభత్వం,ప్రాపంచిక వ్యామోహం,గర్వం,ప్రదర్శనబుద్ది. ప్రశంసనీయ ఉత్తమ నైతికత :-సత్ప్రవర్తన,ప్రజలతో ఉత్తమంగా మెలగడం,ఇహ్'సాన్ చేయడం,న్యాయం,అనుకువ,సత్యం,మనసును గౌరవించడం,దానం,అల్లాహ్ పై నమ్మకం, ఇఖ్లాస్ చిత్తశుద్ది,అల్లాహ్ భీతి, సహనం,మరియు కృతజ్ఞత మొదలైనవి.
ఈ ధర్మాన్ని ప్రత్యేకించే గుణాలలో ఇది ఒకటి,ఈ ధర్మం యొక్క ప్రతీ చిహ్నంలో సౌలబ్యం ఉంది,మరియు ప్రతీ ఆరాధనలో సౌలబ్యం ఉంది. {ధర్మం విషయంలో ఆయన మీ పై ఎలాంటి ఇబ్బందినీ ఉంచలేదు}[271] మొదటి సౌలభ్యం;-ఈ సౌలభ్యం యొక్క అర్ధం’ఏమిటంటే 'ఎవరైన ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరించాలంటే అతనికి ఒక మనిషి యొక్క మద్యవర్తిత్వం లేదా గత పాపాల ఒప్పుకోలు అవసరం లేదు.అతను తనను తాను శుభ్రపరచుకొని,లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్’ సాక్ష్యాన్ని చెప్పాలి [అల్లాహ్ తప్ప ఆరాధనకు నిజమైన ఆరాధ్యుడు మరొకరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను;] మరియు సాక్ష్యం యొక్క అర్ధాలను విశ్వసించాలీ మరియు దాని ప్రకారం ఆచరించాలి.
ఇంకా, ఇస్లాంలో ప్రతి ఆరాధన సౌలభ్యం మరియు ఉపశమనం కలిగి ఉంటుంది.ఒక మనిషి ప్రయాణిస్తున్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉంటే,అతను ఇంట్లో లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసిన కార్యం యొక్క ప్రతిఫలం ఘనత నమోదు చేయబడుతుంది.ముస్లిం జీవితం అంతా సౌలభ్యం మరియు ప్రశాంతతతో నిండి ఉంటుంది, అయితే అవిశ్వాసి జీవితం కష్టాలు మరియు భాదలతో నిండి ఉంటుంది. అలాగే, ఒక ముస్లిం మరణం చాలా సులువుగా జరుగుతుంది,ఒక పాత్ర నుండి నీటిచుక్క బయటకు వచ్చినట్లు అతని శరీరం నుండి ఆత్మ బయటికి వస్తుంది. అల్లాహ్ ఇలా చెప్పారు:- {ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు.}[272] అవిశ్వాసి విషయానికొస్తే, అతని మరణ సమయంలో చెండాలమైన,కఠినమైన దైవదూతలు హాజరు అవుతారు,కొరడాతో కొట్టికొట్టి అతని ప్రాణం తీస్తారు.అల్లాహ్ అవిశ్వాసి గురించి చెప్పాడు: {ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడూ దైవదూతలు తమ చేతులు చాచి సరే ఇక మీ ప్రాణాలు బయటికి తీయండి మీరు అల్లాహ్’కు అబద్దాలు ఆపాదించునందుకు అల్లాహ్ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందులకు ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది’అని చెబుతుండగా నీవు చూడగలిగితే ఎంత బావుండు}[273] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దైవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదుల పైనను కొడుతూ ఇలా అంటారు:"భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.}[274]
న్యాయం:-ఇస్లామియ షరీఅతు శాసనాలను నిర్దేశించేవాడు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే. అతను ప్రజలందరి సృష్టికర్త: నలుపు, తెలుపు, మగ, ఆడ. ఆయన తీర్పు, న్యాయం మరియు దయ ముందు స్త్రీలు,పురుషులు, సమానం. వారందరూ అల్లాహ్ యొక్క ఆదేశం,న్యాయం,కరుణా ఎదుట సమానులు. కాబట్టి షరీఅతులో ప్రతి మగ మరియు ఆడవారికి సరిపోయే నియమాలను నియమించాడు.అలాంటప్పుడు ఇస్లాం ధర్మశాస్త్రం స్త్రీ లపై మగవారిని మ్రోగ్గుచూపడం లేదా ఆడవారికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు మగవారికి అన్యాయం చేయడం అసాధ్యం.ఇస్లాం తెల్ల మనిషికి ప్రత్యేక విషయాలు అనుమతించి,నల్లజాతీయుడికి దానిని నిషేదించదు. అల్లాహ్ షరీఅతు చట్టాల ముందు అందరూ సమానమే మరియు దైవభక్తి,భీతి వల్ల తప్ప వారి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు.
ఈ షరీఅతు ఒక గొప్ప లక్షణం,మహా ప్రత్యేకతను కలిగి ఉంది,అది :- మంచిని ఆజ్ఞాపించడం మరియు చెడును ఖండించడం.కాబట్టి ప్రతీ ముస్లిం మగ ఆడ యువకులు, తెలివిబుద్దిగలవారిపై వారిసామర్థ్యం ప్రకారం మంచిని ఆజ్ఞాపించడం,చెడును ఖండించడం విధి చేయబడింది మంచిని ఆజ్ఞాపించడం చెడును ఖండించడం’విధి యొక్క దశలు!ఇలా ఉన్నాయి. మరియు దానిని చేతితో ఆజ్ఞాపించాలి లేదా ఖండించాలి,ఒకవేళ అంతటి శక్తిలేకుంటే నోటితో ఆజ్ఞాపించాలి,ఒకవేళ ఆ శక్తి లేకుంటే మనసులో తప్పుగా భావించాలి,ఈ విధంగా పూర్తి ఉమ్మతు ఒండొకరి కొరకు కాపరిగా మారిపోవాలి. కాబట్టి ప్రతీ ఒక్కరి పై [‘అమ్ర్ బిల్ మారూఫ్’వ నహ్యూ అనిల్ ముంకర్’]మంచిని ఆజ్ఞాపించి చెడును ఖండించే కార్యాన్ని విధిగా అమలుపర్చవలసిన బాధ్యత ఉంది,తప్పులు చేస్తూ మంచి చేయడంలో నిర్లక్ష్యం వహించే వారికి తప్పనిసరిగా ఆదేశించాలి,ఒకవేళ ఎవరైనా పాపం లేదా నేరం చేశాడు అతను రాజు అయినా పాలితుడైన సరే మన శక్తిప్రకారం షరీఅతు ప్రకారంగా అతనిని ఆపాలి,ఈ ఆదేశం ప్రతీ ఒక్కరిపై అతనిశక్తికి తగినట్లు విధిగా చేయాలి,
ఈ వ్యవహారం మీరు చూసినట్లుగా ప్రతీ ఒక్కరి పై స్తోమతమేరకు విధిగా చేయబడింది అయితే నేడు చాలా మంది రాజకీయ నాయకులు’ ప్రతిపక్షాలకు తమ ప్రభుత్వ పనిని గమనించే అధికారం ఇచ్చాము అని ‘గర్విస్తూ ఉంటారు.
ఇవి ఇస్లాం యొక్క కొన్ని మహత్వాపూర్ణమైన గొప్ప ఉత్తమమైన లక్షణాలు,ఒకవేళ మీరు వాటిని విస్తారంగా వివరించదలిస్తే ‘ప్రతీ ధర్మవిషయాన్ని చిహ్నాన్ని,ఫర్జ్,మరియు ప్రతీ ఆజ్ఞ మరియు ప్రతీ నిషేదం’గురించి మాట్లాడవలసి వస్తుంది,ఇందులో గల సంపూర్ణ వివేకం,దృఢమైన చట్టం,పరిపూర్ణ మేలు గురించి మీరు పరిశీలించండి ఇస్లాం ధర్మశాసనాల గురించి ఎవరైతే ఆలోచిస్తారో, అది అల్లాహ్ నుండి వచ్చినదని మరియు ఎటువంటి సందేహం లేని సత్యమని మరియు ఎటువంటి భ్రష్టత్వంలేని మార్గదర్శకత్వం అని అతను ఖచ్చితంగా తెలుసుకుంటాడు.
అందువల్ల మీరు అల్లాహ్ వైపుకు తిరిగి వెళ్లాలని,ఆయన ధర్మశాస్త్రాన్నిఅనుసరించాలని ఆయన ప్రవక్తల సందేశహరుల మార్గాన్ని అనుసరించాలని కోరుతున్నాను,పశ్చాత్తాపం యొక్క తలుపు మీ ముందు తెరిచి ఉంది మరియు మీ ప్రభువు క్షమించేవాడు, అత్యంత దయగలవాడు. నిన్ను క్షమించటానికి అతను మిమ్మల్ని పిలుస్తున్నాడు.
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:- {‘ప్రతీ ఆదము పుత్రుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు}[275] మనిషి ప్రకృతి సిద్దంగా బలహీనుడు;అతను తన లక్ష్యం మరియు సంకల్పంలో బలహీనంగా ఉన్నాడు,అతను పాపాలు మరియు తప్పులు సహజంగా భరించలేడు.కాబట్టి అల్లాహ్ తన దయతో మనిషికి విషయాలను సులభతరం చేశాడు మరియు అతని కొరకు పశ్చాత్తాపం[తౌబా] ను చట్టంగా సూచించాడు.మరియు తౌబా యొక్క వాస్తవికత: పాపాన్ని అల్లాహ్ భయంతో వదిలేయడం’మరియు అల్లాహ్ దాసుల కోసం సిద్దం చేసిపెట్టిన వాటిని ఆశించడం,-మరియు తనతో జరిగిన తప్పులపై సిగ్గుపడటం,ఆ పాపాన్ని విడిచే దృఢసంకల్పం చేసుకోవడం,సత్కార్యాలు మరియు పుణ్యకార్యాల ద్వారా తమను సంస్కరించుకోవడం’ [276] మీరు చూసినట్లు, పశ్చాత్తాపం అనేది దాసునికి మరియు అతని ప్రభువుకు మధ్య గల స్వచ్ఛమైన హృదయ సంభందిత కార్యం.ఇది అతని కోసం కష్టమైన పని కాదు; ఇది కేవలం హృదయ ఆచరణ, పాపాన్ని విడిచిపెట్టడం మరియు దానికి తిరిగి వెళ్లకూడదు. అల్లాహ్ నిషేధించిన వాటన్నటికీ దూరంగా ఉండాలి.[277]
మీ వ్యవహారాలను బహిర్గతం చేసే,మీ రహస్యాన్ని బహిర్గతం చేసే మరియు మీ బలహీనతను ఉపయోగించుకునే మానవుడి చేతిలో మీరు పశ్చాత్తాపం చెందాల్సిన అవసరం లేదు.తౌబా అనేది మీకూ మరియు మీ ప్రభువుకు మధ్య జరిగే ఒక సంభాషణ మీరు మీ పాపాల మన్నింపుకై ప్రభువును అర్ధిస్తారు,మార్గదర్శనానికై ప్రాదేయపడతారు,అప్పుడు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని తౌబాను ఆమోదిస్తాడు.
ఇస్లాంలో వారసత్వంగా పొందిన పాపం ఏదీ లేదు, లేదా మానవజాతికి రక్షకుడి పరిహారం’లాంటి దేమీ లేదు. యూదమతం వదిలి ఇస్లాం స్వీకరించిన’ముహమ్మద్ అసద్’ ఇలా తెలిపారు:- {నాకు పూర్తి ఖుర్ఆను గ్రంధంలో ఎక్కడ కూడా ‘మనిషికి పాపాల నుంచి ప్రాయశ్చిత్తం జరిపించవలసిన అవసరం ఉంది’అని లేదు! ఇస్లాం లో వారసత్వంలో వచ్చిన పాపంగానీ, మనిషికి అతని అంతిమ పరిణామానికి మధ్య అడ్డుగా నిలిచే పాపం గురించి ఏ విషయం లేదు,ఎందుకంటే అల్లాహ్ తెలియజేశాడు’: {మరియు మానవునికి తాను చేసిన దాని ఫలితం తప్ప మరొకటి లభించదు;}[278] పాపవిమోచనం పొందటానికి మరియు తప్పు క్షమించబడటానికి తౌబ తలుపులు తెరుచుకోవడానికి మానవుడితో బలిత్యాగం సమర్పించవలసిన అవసరం,లేదా ఆత్మహత్య చేసుకోవలిసిన అవసరం లేదు.[279]అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- {మరియు మరొక మంత్రిత్వ శాఖను సందర్శించవద్దు ٰ} [306’][280]
తౌబా’కు అనేక లాభాలు ప్రయోజనాలు ఉన్నాయి అందులో కొన్ని మీకోసం మేము తెలియజేస్తున్నాము:-
1) 1.ఇది అల్లాహ్ యొక్క సహనం విశాలతను మరియు అతని పాపాలను,దుశ్చర్యలను దాచడంలో గొప్పతనాన్ని మనిషికి తెలియజేస్తుంది. ఒకవేళ ఆయన కోరితే,అతన్ని తొందరగా శిక్షించి, ప్రజల ముందు అతన్ని అవమానించేవాడు, తద్వారా అతను వారితో హాయిగా జీవించలేడు.కానీ అల్లాహ్ అతని పాపాలను అతని కోసం దాచి గౌరవించాడు, తన సహనంతో అతని పాపాన్ని కప్పి,అతనికి శక్తి, సదుపాయం మరియు జీవనోపాధిని ఇచ్చాడు.
2) ఇది అతనికి తన మనసు యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవటానికి వీలు కల్పిస్తుంది, అది చెడు వైపు మొగ్గు చూపుతుంది మరియు దానితో పాపాలు,దుశ్చర్యాలు లేదా నిర్లక్ష్యం వంటివి చేయబడతాయి ఇది మనిషి మనసు బలహీనమైనదని మరియు నిషేధించబడిన కోరికలపై సహనం వహించలేదని అర్ధమవుతుంది,మరియు అది అల్లాహ్ నుండి రెప్పపాటు క్షణం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు’-దానిని శుద్దిచేయాలి,మార్గదర్శనం చేయాలి.
3) అల్లాహ్ తౌబాను చట్టంలో ఒక భాగంగా చేశాడు,తద్వారా ఆనందాన్ని కలగచేసే కారణాలను ప్రజలు తెలుసుకోగలరు,అవి‘అల్లాహ్ వైపుకు మరలడం మరియు ఆయనను సహాయం కోరడం;అలాగే తౌబా ద్వారా దుఆ చేయడం,అనుకువతో ప్రార్ధించడం, ఉపవాసాలు,అల్లాహ్ పట్ల నిస్సహాయత,అల్లాహ్ పట్ల ప్రేమను చూపించడం,ఆయన పట్ల భయం మరియు ఆశ ఇత్యాదివి ప్రాప్తిస్తాయి;ఈ విధంగా మనిషి ఆత్మ తన సృష్టికర్తకు దగ్గరవుతుంది, అది పశ్చాత్తాపం లేకుండా మరియు అల్లాహ్ వైపుకు మరలకుండా సాధ్యమయ్యేది కాదు.
4) అల్లాహ్ అతను చేసిన మునుపటి పాపాలు క్షమిస్తాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {[ఓ ప్రవక్త] ఈ అవిశ్వాసులకు చెప్పు వారు గనక మానుకుంటే గతంలో వారి వల్ల జరిగిన పాపాలన్నీ క్షమించబడతాయి}[281]
5) మనిషి చేసిన పాపాలు పుణ్యాలుగా మార్చబడతాయి. సర్వశక్తిమంతుడు ఇలా అన్నాడు: {కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.}[282]
6) మనిషి తన తోటి మానవులతో వారి తప్పులు,పాపాల విషయంలో అల్లాహ్ తన తప్పులను పాపాలను మన్నించినట్లే వారిని క్షమించాలి. ఎందుకంటే ‘పనిని బట్టి ఫలితం’ఉంటుంది,ప్రజలు ఎప్పుడైతే ఇలాంటి ఉత్తమ వ్యవహారం చేస్తారో అల్లాహ్ కూడా వారికి అలాంటి ఉత్తమ ఫలితాన్ని అందజేస్తాడు,మరియు వారి తప్పులను పాపాలను పుణ్యాలలో,మంచిలో మార్చేస్తాడు. ఏ విధంగా అతను ఇతరుల తప్పులపై ఉదార వైఖరితో అవలంభించాడో అలాగే పరమ పవిత్రుడైన అల్లాహ్ అతని తప్పులకు,పాపాలకు ప్రతిఫలం ఉత్తమంగా ఇస్తాడు
7) అతను తన మనసు అనేక లోపాలు మరియు దోషాలతో నిండి ఉందని తెలుసుకోవడానికి అతనికి ఇది సహాయపడుతుంది;ఇది అతన్ని ఇతర వ్యక్తుల తప్పుల గురించి మాట్లాడకుండా ఉండేలా చేస్తుంది మరియు ఇతరుల తప్పుల గురించి ఆలోచించకుండా తన స్వయాన్ని సంస్కరించుకోవటానికి ముందుగా తోడ్పడుతుంది. [283].
మరియు నేను ఈ విషయాన్ని ముగించేముందు అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చిన ఒక వ్యక్తి యొక్క హదీసును తెలియజేస్తాను.ఇలా అడిగాడు: ‘ఓ దైవప్రవక్త నేను ప్రతీ రకమైన పాపం చేశాను,ఆయన అడిగారు;ఏమి నీవు ఈ సాక్ష్యాన్ని ఇవ్వలేదా “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు మరొకడు లేడు,మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త’అని’?ఈ విషయాన్ని ప్రవక్త మూడు సార్లు అడిగారు’అప్పుడు అతను సమాధానం ఇచ్చాడు’’అవును,చదివాను’! ప్రవక్త చెప్పారు:-ఈ వాక్యం వాటిని తుడిచి వేస్తుంది’మరో ఉల్లేఖనంలో ఉంది’ఈ వాక్యం వాటన్నింటిని రూపుమాపుతుంది’}[284]
8) మరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది'అతను మహనీయ దైవప్రవక్త వద్దకి వచ్చాడు ఇలా అడిగాడు:- [ఓ ప్రవక్త ఒక వ్యక్తి షిర్కు చేయకుండా మిగతా రకమైన ప్రతీ పాపాన్ని వదలకుండా చేసి ఉంటాడు,మరి అలాంటి వ్యక్తి కొరకు తౌబా తలుపు తెరిచి ఉంటుందా?ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయమేమిటి? ప్రవక్త అతనిని అడిగారు”నువ్వు ఇస్లాం స్వీకరించావా?దానికతను’నేను’సాక్ష్యామిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్య దైవం మరొకడు లేడు ఆయన ఏకైకుడు,ఆయనకు ఎవరు సాటిలేరు,మరియు నిస్సందేహంగా మీరు అల్లాహ్ యొక్క ప్రవక్త’ప్రవక్త అతనికి చెప్పారు” సత్కార్యాలు ఆచరిస్తూ ఉండు,పాపాలకు దూరంగా ‘ఉండు’అప్పుడు అల్లాహ్ నీకోసం అనేక పుణ్యాలు లిఖిస్తాడు,దానికతను’ఇలా అడిగాడు’మరి నా మునుపటి పాపాలు తప్పిదాల సంగతేమిటి?అప్పుడు దైవప్రవక్త’అల్లాహు అక్బర్’అని తక్బీర్ చెప్పసాగారు,చివరికి అతను మౌనమయ్యాడు.}[285].
ఇస్లాం ధర్మం మునుపటి పాపాలను తుడిచివేస్తుంది,మరియు సత్యమైన పశ్చత్తాపం వెనుకటి పాపాలను తొలగిస్తుంది,ఈ విషయం హదీసు ద్వారా రూఢీ అవుతుంది.మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తెలియజేశారు:-
ఇస్లాం అల్లాహ్ యొక్క ధర్మం అని, ఇది నిజమైన సత్యధర్మం‘అని, ఇది ప్రవక్తలు మరియు సందేశహరులందరూ బోధించినది అని ఈ పుస్తకంలో మీకు స్పష్టం చేయబడింది;ఎవరైతే దీనిని విశ్వసిస్తారో అల్లాహ్ ఈ లోకంలో మరియు పరలోకంలో గొప్ప బహుమతిని వారి కొరకు సిద్ధం చేసాడు, మరియు ఎవరైతే దీనిని తిరస్కరించి అవిశ్వసిస్తారో వారికి తీవ్రమైన హింస,శిక్షలతో హెచ్చరించాడు.
ఎందుకంటే అల్లహ్యే ఈ విశ్వానికి సృష్టికర్త ,సామరాజ్యాధికారి,నిర్వాహణకర్త,మరియు ఓ మానవుడా నువ్వు అందులో ఒక జీవివి,ఆయన నిన్ను పుట్టించాడు మరియు విశ్వంలో ఉన్నది నీ కోసం ఆధీనపర్చాడు,మరియు నీకోసం షరీఅతును రూపొందించాడు,దానిని అనుసరించమని నీకు ఆదేశించాడు. ఒక వేళ నీకు ఆదేశించిన దాని ప్రకారం నువ్వు విశ్వసించి,అనుసరించి మరియు నిన్ను వారించిన విషయాల నుంచి నువ్వు ఆగిపోతే సాఫల్యం పొందుతావు,పరలోకంలో అల్లాహ్ వాగ్దానం చేసిన అనుగ్రహాలు వరాలు పొందుతావు,మరియు ఈ ప్రపంచంలో అనేక అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి’-మరియు నువ్వు పరిపూర్ణ తెలివిమంతులు,అత్యంత పవిత్రులైన ప్రవక్తలు సందేశహరులు సజ్జనులు దైవప్రవక్తలను పోలినట్లు పవిత్రుడిగా మారుతావు.
ఒక వేళ మీరు అవిశ్వాసించి,మీ ప్రభువుకు అవిధేయత చూపిస్తే;మీరు మీ ప్రాపంచిక జీవితాన్నిమరియు మీ పరలోకాన్ని కోల్పోతారు మరియు ఈ లోకంలో మరియు పరలోకంలో ఆయన కోపానికి మరియు శిక్షకు గురి అవుతారు.అప్పుడు మీరు సమస్త జీవులలో అత్యంత దుర్మార్గులు నీచుల వలె ఉంటారు,తెలివితేటలలో చాలా లోపభూయిష్టంగా మరియు మనస్సు అత్యంత అపవిత్రంగా కలిగి:షైతానులు, అవినీతిపరులు మరియు మిథ్యా దేవతల మాదిరి ఉంటారు.
ఇప్పుడు నేను అవిశ్వాసం కుఫ్ర్’పరిణామాలను విస్తారంగా తెలియజేస్తాను,అవి:-
అల్లాహ్ తఆలా తనను విశ్వసించి తన ప్రవక్తలను అనుసరించేవారి కొరకు ఇహపరలోకాల్లో శాంతి కలుగుతుంది అని తెలియజేశాడు,అల్లాహ్ ఇలా తెలిపాడు: {విశ్వసించి తమ విశ్వాసాన్ని షిర్కుతో కలగాపులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే}[286] అల్లాహ్ తఆలా యే’సంరక్షకుడు,భద్రతదారుడు,ఆయనే విశ్వ సామ్రాజ్యాధినేత,ఆయన తన దాసుడిని ఈమాను పరంగా ఇష్టపడినప్పుడు అతనికి రక్షణ, శాంతి, ప్రశాంతత, ఒసగుతాడు, ఒకవేళ మనిషి ఆయనను అవిశ్వసించినట్లైతే అతని ప్రశాంతతను,రక్షణనను, లాక్కుంటాడు,అలాంటివారిని పరలోకంలో తమ నివాసం గురించి భయపడుతూ ఉండటం చూస్తారు,మరియు ఇహలోకంలో ఆపదలు,ఆనారోగ్యం వ్యాధులకు గురికావడం,భవిష్యత్తు గురించి దిగులుచెందేవాడిగా పొందుతారు, అందువల్ల అభద్రతా భావన మరియు అల్లాహ్ పట్ల నమ్మకం,లేకపోవడం వల్ల జీవనభీమా,ఆస్తిభీమ చేసుకుంటాడు.
అల్లాహ్ మనిషిని సృష్టించాడు,అతని కొరకు విశ్వంలోని సమస్తాన్ని ఆధీనపర్చాడు,ప్రతీ జీవి కొరకు దాని ఆహారం, వయసును నిర్దారించాడు,కాబట్టి నువ్వు చూస్తున్నావు పక్షులను అవి ఉదయాన్నే గూటి నుంచి ఆహారం కోసం బయలుదేరుతాయి, ఒక కొమ్మనుంచి మరోకొమ్మకు ఎగురుతూ,మధురమైన స్వరాల్లో పాడుతూ ఉంటాయి. మానవుడు కూడా ఈ ప్రాణుల్లో ఒకడు,అతని కొరకు ఆహారాన్ని,వయస్సును నిర్దారించబడింది,ఒకవేళ అతను తన ప్రభువును విశ్వసించి, ఆయన శాసనాలపై స్థైర్యంగా ఉన్నట్లైతే ఆనందాన్ని,ప్రశాంన్ని నొసగుతాడు,జీవనోపాధికి తగిన కనీస మార్గాలు లేనప్పటికీ. అతని వ్యవహారాలను సులభతరం చేస్తాడు.
మరియు ఒకవేళ అతను తన ప్రభువును తిరస్కరించి ఆరాధించకుండా గర్వాన్ని ప్రదర్శించినట్లైతే అతని జీవితాన్ని కఠినంగా దుర్భరంగా మారుస్తాడు,అతనిజీవితంలో ఆందోళనలు,భాధలు నింపుతాడు,ఒక వేళ అతని వద్ద రకరకాల భోగభాగ్యాలు, సాధనాలు ఉన్నప్పటికినీ జీవితం దుర్భరమవుతుంది. తమ సభ్యులకు అన్నీ రకాల విలాసవంతమైన మార్గాలకు హామీ ఇచ్చిన దేశాలలో పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు మీరు చూడలేదా? జీవితాన్ని ఆస్వాదించడానికి సామాగ్రిలో మరియు ప్రయాణ పర్యటనల్లో విపరీతంగా ఖర్చుచేయడాన్నిమీరు చూడలేదా? ఈ విషయంలో దుబారా ఖర్చుకు ప్రేరేపించే విషయమేమిటంటే ‘ఈమాను లేని హృదయాలు,చీకుచింతలు,ఆందోళనల భావన,మరియు ఈ ఇక్కట్లను తొలగించడానికి విభిన్న మార్గాలను,సరికొత్త సాధనాలను యోచించడం.అల్లాహ్ తఆలా సత్యం పలికాడు:ఇలా సెలవిచ్చాడు:- {మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము.}[287]
ఎందుకంటే అతని ఆత్మ ఇస్లాం యొక్క తౌహీదు పై పుట్టించబడింది,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {అల్లాహ్ మానవులను ఏ స్వభావంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే (ఉండండి)}[288] అతని శరీరం దాని ప్రభువుకు లొంగిపోయి, ఆయన ఆజ్ఞ ప్రకారం కదులుతుంది, కాని అవిశ్వాసి తన స్వభావానికి వ్యతిరేకంగా చేస్తూ విరుద్దంగా నడుచుకుంటాడు మరియు తన ప్రభువు ఆదేశాలకు వ్యతిరేకంగా నచ్చిన జీవితాన్నిగడుపుతాడు.అతని శరీరం సృష్టికర్త యొక్క ఇష్టానికి లొంగిపోయి ఉంటుంది కానీ అతని స్వీయసంకల్పం ప్రభువుకు విరుద్ధంగా ఉంటుంది.
మరియు అతను తన చుట్టూ ఉన్నవిశ్వంతో విభేదిస్తున్నాడు;ఎందుకంటే విశ్వం, అతిపెద్ద గెలాక్సీల నుండి చిన్నకీటకాల వరకు,అవి తన ప్రభువు నిర్దారించిన విధిరాత ప్రకారంగా నడుస్తున్నాయి.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {అప్పుడే ఆయన కేవలం పొగగా ఉన్న ఆకాశం వైపునకు తన ధ్యానాన్ని మరల్చి, దానిని మరియు భూమిని ఉద్దేశించి ఇలా అన్నాడు: "మీరిద్దరు (ఉనికిలోకి) రండి మీకు ఇష్టమున్నా, ఇష్టం లేక పోయినా!" అవి రెండూ: "మేమిద్దరమూ విధేయులమై (ఉనికిలోకి) వస్తాము." అని అన్నాయి.}[289]. బదులుగా,ఈ విశ్వం తన ప్రభువుకి లొంగిపోవడానికి అంగీకరించిన వ్యక్తిని ప్రేమిస్తుంది, మరియు దానితో విభేదించే వారిని ద్వేషిస్తుంది,మరియు అవిశ్వాసి ఈ సృష్టికి తిరుగుబాటుదారుడు,అతను తన ప్రభువుకు వ్యతిరేకంగా ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. అందువల్ల అతన్ని మరియు అతని అవిశ్వాసాన్నిమరియు నాస్తికత్వాన్ని ద్వేషించడం ఈ భూమ్యాకాశాలకు,సమస్త జీవులకు గల హక్కు. {వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు".}[290]. {వాస్తవానికి, మీరు ఎంత పాపిష్ఠికరమైన విషయాన్ని కల్పించారు.}[291] {దాని వలన ఆకాశాలు ప్రేలి పోవచ్చు! భూమి చీలి పోవచ్చు! మరియు పర్వతాలు ధ్వంసమై పోవచ్చు!} {ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు.} {ఎవరినైనా కొడుకునిగా చేసుకోవటం అనంత కరుణామయునికి తగినది కాదు.}92 ఎందుకంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు. ఫిరౌన్ మరియు అతని సైన్యం గురించి అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు. {కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.}
అవిశ్వాసం కుఫ్ర్’ నిజానికి అజ్ఞానం,చెప్పాలంటే ఒక పెద్ద అజ్ఞానం,ఎందుకంటే కాఫీరు తన ప్రభువు గురించి అజ్ఞానంలో ఉంటాడు,ఆయన సృష్టించిన విశ్వాన్ని చూస్తున్నాడు,ప్రభువు దీనిని అద్భుతంగా సృష్టించాడు,అతను స్వయంగా తన అస్తిత్వంలో గొప్ప నిర్మాణాన్ని చూస్తున్నాడు,పిదప ఈ విశ్వ సృష్టి గురించి అజ్ఞానిగా మారుతున్నాడు,ఏమి?ఇది పెద్ద అజ్ఞానం కాదా?
దీనికి కారణం,అతను తనను పుట్టించిన సృష్టికర్తను వదలి ఇతరులకు లోబడి ఉంటాడు,తన ప్రభువును ఆరాధించడు, ఇతరులను ఆరాధిస్తాడు, మరియు జూల్మ్’అంటే ‘వస్తువును దాని స్థానాన్ని వదిలి వేరేచోట పెట్టడం’మరియు ఆరాధనను దాని అర్హత గల వాడికి చేయకుండా మరొకరికి చేయడం’కంటే పెద్ద అన్యాయం ఏమి ఉంటుంది. నిశ్చయంగా లుఖ్మాన్ అల్ హకీం'షిర్కు దారుణం గురించి స్పష్టంగా ఇలా చెప్పారు: {ఓ నా కుమారా !అల్లాహ్'కు సాటికల్పించకూ,నిశ్చయంగా షిర్కు అనునది పెద్దఅన్యాయం}[292]
మరియు అతను తన చుట్టూ ఉన్న మనుషులపై ప్రాణులపై దౌర్జన్యం చేస్తాడు,ఎందుకంటే అతనికి హక్కుదారుడి యొక్క హక్కు గురించి’తెలియదు’పరలోకదినాన దౌర్జన్యం చేయబడిన ప్రతీ మనిషి లేదా జంతువు ఎదుట అతను నిల్చుంటాడు,తన ప్రభువుతో తన కోసం అతని నుండి ప్రతిఫలం ఇవ్వమని అడుగుతాడు.
అందువల్ల తన అవిశ్వాసానికి తక్షణ శిక్షగా విపత్తులు మరియు బాధలకు గురి అవుతాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా,లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా - తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి?[293]. లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా?[294] లేదా,వారిని భయకంపితులు జేసి పట్టుకోవచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.[295][296] అల్లాహ్ సెలవిచ్చాడు: {అవిశ్వాసులకు వారి అవిశ్వాస పోకడల ఫలితంగా ఎల్లప్పుడూ ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది,లేదా వారి ఇళ్లకు సమీపంలోనే అది వచ్చిపడుతూ ఉంటుంది'అల్లాహ్ వాగ్దానం నెరవేరే వరకూ ఈ స్థితి నెలకొనే ఉంటుంది నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానానికి వ్యతిరేఖంగా చేయడు'} మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {లేదా ఈ నగరాల వాసులు, పట్టపగలు తాము కాలక్షేపంలో ఉన్నప్పుడు వచ్చే మా శిక్ష నుండి సురక్షితంగా ఉన్నారా?} మరియు అల్లాహ్ స్మరణ నుండి వెన్నుచూపిన ప్రతీఒక్కడి పరిస్థితి ఇలాగే ఉంటుంది,అల్లాహ్ తఆలా మునుపటి అవిశ్వాస సముదాయాలకు సంభందించిన శిక్షల గురించి ప్రస్తావిస్తూ తెలిపాడు:- {కావున ప్రతి ఒక్కరిని మేము అతని పాపానికి బదులుగా పట్టుకున్నాము. వారిలో కొందరిపైకి మేము తుఫాన్ గాలిని పంపాము. మరికొందరిని ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) చిక్కించుకున్నది. ఇంకా కొందరిని భూమిలోనికి అణగ ద్రొక్కాము. ఇంకా ఇతరులను ముంచి వేశాము. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.} మరియు మీరు మీ చుట్టుప్రక్కలోని ప్రజల విపత్తులను చూడవచ్చు వారిపై అల్లాహ్ శిక్షలు, ఎలా విరుచుపడుతున్నాయో;
తన దుర్మార్గానికి,తప్పుకు కారణంగా,అతను హృదయాలు మరియు ఆత్మలు ఆస్వాదించే గొప్ప దినాన్ని కోల్పోతాడు, అది అల్లాహ్’జ్ఞానాన్ని తెలుసుకోవడం,ఆయనను ధ్యానించడం మరియు ఆయన ద్వారా మనఃశాంతిని పొందటం అలాగే అతను ప్రపంచాన్ని కూడా కోల్పోతాడు,ఎందుకంటే అతను అక్కడ దౌర్భాగ్యమైన మరియు గందరగోళ జీవితాన్ని గడుపుతాడు. అతను తనను కోల్పోతాడు;ఎందుకంటే అతను దానిని సృష్టించిన ఉద్దేశ్యం వైపుకు ఆధీనపర్చలేదు. తద్వారా అతను ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందలేడు, ఎందుకంటే అతను మూర్ఖుడిలా నివసించాడు,మూర్ఖుడిగా మరణించాడు,మరియు అతను అతి నీచులతో పాటు లేపబడతాడు.అల్లాహ్ ఇలా చెప్పాడు:- {మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు}[297] మరియు అతను తన కుటుంబీకులను కూడా నష్టపర్చాడు,ఎందుకంటే అతను వారితో పాటు కలిసి అల్లాహ్’ను తిరస్కరిస్తూ కుఫ్ర్’కు పాల్పపడుతూ జీవించాడు,కాబట్టి వారు మూర్ఖత్వంలో కఠినత్వంలో సమానం అవుతారు,వారందరి నివాసం నరకాగ్ని అవుతుంది;అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ప్రళయదినాన తాము నష్టపోయినదిగాక తమ పరివారానికి కూడా నష్టం చేకూర్చినవారే పూర్తిగా నష్టపోయినవారు}[324} పునరుత్థాన రోజున,వారు నరకయాతనలో పడతారు,మరియు అది చాలా భయానకమైన నివాసం,సర్వశక్తిమంతుడు అల్లాహ్ ఇలా పలికాడు:- {దైవదూతలతో ఇలా అనబడుతుంది)"ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్నవారిని}[298]. {అల్లాహ్'ను వదిలి పెట్టి సుమా మరి వారందరికి జ్వలించే అగ్ని [నరకం] దారి చూపండి}[299].
నిశ్చయంగా అల్లాహ్ అతన్ని అనస్థిత్వం నుంచి ఉనికిని ప్రసాదించాడు,అతనిపై అనుగ్రహాలన్నీ కురిపించాడు,కానీ అతను అల్లాహ్’ను వదలి ఇతరులను ఆరాధిస్తున్నాడు,ఆయనను వదిలి ఇతరులను సహాయకులుగా చేసుకుంటున్నాడు,ఇతరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు… ఇంతకు మించి ఆయన అనుగ్రహభాగ్యాల తిరస్కరణ ఏమై ఉంటుంది?మరియు ఇంతకుమించి ఘోరమైన కృతఘ్నత ఇంకేమై ఉంటుంది?.
ఎందుకంటే మానవ జీవితానికి యోగ్యమైన మనిషి తన ప్రభువును విశ్వసించేవాడు,తన జీవిత లక్ష్యాన్నితెలుసుకునేవాడు,తన గమ్యాన్ని గుర్తించేవాడు మరియు పునరుత్థానం గురించి ఖచ్చితంగా నమ్ముతాడు,తద్వారా అతను ఎవరికి ఏ హక్కు చెల్లించాలో ఆ హక్కు చెల్లిస్తాడు ఇతరులను హక్కును కొల్లగొట్టడు,ఒక జీవికి హాని చేయడు.అతను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు మరియు ఇహపరలోకంలో మంచి జీవితాన్ని పొందుతాడు. అల్లాహ్ ఇలా చెప్పాడు:- {ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.}[300] మరియు పరలోకంలో : {శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుభ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు,నిజానికి ఇదే గొప్ప సాఫల్యం'}[301]
ఈ జీవితంలో ఎవరైతే జంతువుల జీవితానికి సమానమైన జీవితాన్ని గడిపాడో,అతనికి తన ప్రభువు తెలియదు,తన జీవిత ఉద్దేశ్యం ఏమిటో తెలియదు మరియు అతనిశాశ్వత నివాసం ఎక్కడ ఉందో తెలియదు? అతని ఉద్దేశ్యం కేవలం తినడం,త్రాగడం,నిద్రించడం’అయి ఉంటుంది,…అలాంటప్పుడు అతనికి మరియు ఇతరర జంతువులకు మధ్య తేడా ఏముంటుంది? బదులుగా అతను వాటికంటే కూడా హీనుడు,నీచుడై ఉంటాడు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు వాస్తవానికి మేము చాలా మంది జిన్నాతులను మరియు మానవులను నరకం కొరకు సృజించాము. ఎందుకంటే! వారికి హృదయాలున్నాయి కాని వాటితో వారు అర్థం చేసుకోలేరు మరియు వారికి కళ్ళున్నాయి కాని వాటితో వారు చూడలేరు మరియు వారికి చెవులున్నాయి కాని వాటితో వారు వినలేరు. ఇలాంటి వారు పశువుల వంటి వారు; కాదు! వాటి కంటే అధములు. ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు.}[302] మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- లేక వారిలోని చాలా మంది వింటారని లేదా అర్థం చేసుకుంటారని నీవు భావిస్తున్నావా? అసలు వారు పశువుల వంటి వారు. అలా కాదు! వారు వాటి కంటే ఎక్కువ దారి తప్పిన వారు.}[303].
కాఫిరు తిరస్కారి’ఒక శిక్ష నుండి మరొక శిక్షకు మారుతూ ఉంటాడు,అతను ప్రపంచం నుండి-(అక్కడ అతను ఆపదలు,భాధలు రుచిచూసి ఉంటాడు_) పరలోక నివాసం వైపుకు వెళ్తాడు,వెళ్లడానికి ముందు అతని వద్దకి మరణ దూతలు వస్తారు,అప్పటికే అతని వద్దకి యాతన పెట్టె దూతలు వచ్చి సిద్దంగా ఉంటారు,అతనికి యోగ్యమైన శిక్షలను అతనికి రుచిచూపిస్తారు. {మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దైవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.}[304] పిదప అతని ఆత్మను తీశాక మరణించిన తరువాత తన సమాధిలోకి వెళ్తాడు,అక్కడ అతను మరింత తీవ్రమైన హింసను ఎదుర్కొంటాడు,అల్లాహ్ తఆలా ఫిరౌన్ కుటుంబీకుల గురించి తెలియజేస్తూ ఇలా అన్నాడు: {ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.}[305]. పునరుత్థాన దినమున సృష్టిజీవులు తిరిగి మళ్ళీ పుట్టించబడతాయి,వారి కర్మలు ప్రవేశ పెట్టబడతాయి,అప్పుడు కాఫీరు'నిశ్చయంగా అల్లాహ్ పుస్తకంలో అతని సర్వకర్మలు లెక్కించాడని అవిశ్వాసి చూస్తాడు:- అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు,ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్ని గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.}[306]. అక్కడ అవిశ్వాసులు కోరుకుంటారు'ఒకవేళ మట్టిగా మారితే బావుండు'అని {నిశ్చయంగా, మేము అతని సమీపంలో ఉన్న శిక్షను గురించి మిమ్మల్ని హెచ్చరించాము. ఆ రోజు ప్రతి మనిషి తన చేజేతులా చేసుకొని ముందు పంపుకున్నదంతా ప్రత్యక్షంగా చూసుకుంటాడు. మరియు సత్యతిరస్కారి: "అయ్యో! నా పాడుగాను! నేను మట్టినయి ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.}[307]
ఆరోజు కఠిన శిక్షల కారణంగా భూమిలో సర్వసంపదలకు యజమాని అయిన వ్యక్తి వాటిని చెల్లించి ఆ రోజు శిక్షలనుంచి తప్పించుకోవాలని చూస్తాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {దుర్మార్గనికి ఒడిగట్టేవారి వద్ద భూమి యందలి సమస్తమూ ఉన్నా,దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయదినాన వారు దాన్నంతటినీ కూడా పరిహారంగా ఇచ్చి వేస్తారు'}[308]. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;}[309] తన భార్యానీ మరియు తన సోదరుణ్ణీ మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను; {మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా,తాను విముక్తి పొందాలని కోరుతాడు.}
అందువల్ల ఆ నివాసం ‘ప్రతిఫల నివాసం’మరియు అది కోరికల,వాంఛలనివాసం కాదు,కాబట్టి మనిషి ఖచ్చితంగా అతను చేసిన పనులకు ప్రతిఫలం పొందుతాడు,మంచి చేస్తే మంచి ఫలితాన్ని,చెడు చేస్తే చెడు ఫలితాన్ని’పొందుతాడు. పరలోకంలో కాఫిరు పొందే తీవ్రమైన శిక్ష నరకాగ్ని’మరియు అల్లాహ్ నరకవాసులపై నరకాగ్ని శిక్షను తరగతులువారిగా విభజించాడు,తద్వారా వారు చేసిన దానికి సరైన శిక్ష అనుభవిస్తారు. {ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!}[310] {వారు దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.}[311] మరియు వారి పానీయం మరియు దుస్తుల గురించి చెప్తూ ఇలా తెలియజేసాడు: {ఆ ఇరువర్గాల వారు తమప్రభువు విషయంలో గొడవ పడతారు,అయితే అవిశ్వాసుల కోసం అగ్ని వస్త్రాలు కత్తిరించబడతాయి'సలసల కాగే నీరు వారి తలలపై నుంచి కుమ్మరించ బడుతుంది'} {దానితో వారి కడుపులలో ఉన్నది మరియు వారి చర్మాలు కరిగి పోతాయి.} {వారి కొరకు [వారిని చితకబాదడానికి ] ఇనుపసుత్తులు కూడా ఉన్నాయి }
ఓ మానవుడా !
మునుపు నువ్వు అస్థిత్వం లేనివాడవు.అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు;- {ఏమీ? మునుపు, అతడి ఉనికే లేనప్పుడు, మేము అతనిని సృష్టించిన విషయం అతనికి జ్ఞాపకం రావటం లేదా?"}[312] పిదప అల్లాహ్ మిమ్మల్ని ఒక వీర్యబిందువు నుండి సృష్టించాడు,పిమ్మట ఆయన మిమ్మల్ని వినేవాడు మరియు చూసేవాడు'గా చేశాడు,అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {అనంత కాలచక్రంలో,మానవుడు తాను చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉన్న సమయం గడవలేదా?} [313] {నిశ్చయంగా, మేము మానవుణ్ణి ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. అతనిని పరీక్షించటానికి, మేము అతనిని వినేవాడిగా, చూసేవాడిగా చేశాము.}[314][315] ఆపై నువ్వు కొంచం కొంచంగా బలహీనావస్థ నుండి బలవంతుడిగా’మారావు’మరియు ఒకరోజు మళ్ళీ నువ్వు బలహీనావస్థ వైపుకు మరలవలసి ఉంది;అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు.} చివరికి మరణం సంభవిస్తుంది అందులో ఎలాంటి సందేహంలేదు, మీరు ఈ దశల ద్వారా,ఒక బలహీనత నుండి మరొక బలహీనతకు వెళ్తారు;అల్లాహ్ మీకు ఇచ్చిన ఆ బలాన్ని మరియు సదుపాయాన్ని ఉపయోగించడం ద్వారా తప్పమీరు స్వతహాగా మీ నుండి చెడును నివారించలేరు లేదా మీ కోసం మీరు ప్రయోజనం పొందలేరు,మరియు నువ్వు ప్రకృతికంగా ఒక యాచకుడివి,అవసరాలు కలవాడివి. మీరు సజీవంగా ఉండటానికి మీకు చాలా అవసరాలుకావాలి,అవి మీ చేతులతో మీరు పొందలేరు కొన్నిసార్లు అవి మీకు దక్కుతాయి,మరికొన్నిసార్లు వాటిని మీరు కోల్పోతారు. మరియు ఎన్నో విషయాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి,వాటిని పొందాలని నీవు కోరుకుంటావు,కానీ వాటిని ఒకసారి పొందగలుగుతావు మరికొన్ని సార్లు పొందలేకపోతావు. ఎన్నో వస్తువులు నీకు నష్టాన్ని చేకూరుస్తాయి మరియు నీ ఆశలపై నీళ్ళు జల్లుతాయి,నీ ప్రయత్నాన్ని వ్యర్థపరుస్తాయి,మరియు నీ కొరకు ఆపదలకు నష్టాలకు భాధలకు కారణమవుతాయి, వాటి నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తావు, కొన్నిసార్లు వాటిని దూరంగా ఉంచుతావు మరికొన్ని సార్లు నిస్సహాయకుడిగా ఉండిపోతావు... ఏమిటి నీకు నీ బలహీనత అసమర్ధత మరియు అల్లాహ్ యొక్క అవసరం భావన కలగడం లేదా! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఓ మానవులారా! అల్లాహ్ అక్కర గలవారు మీరే! వాస్తవానికి అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.}
మీ కంటికి కనబడని ఒక బలహీనమైన వైరస్ వల్ల అనారోగ్యానికి గురవుతారు, అది నిరోధించలేని బాధాకరమైన ఒక వ్యాధికి కారణమవుతుంది మరియు మీకు చికిత్స చేయడానికి మీలాంటి ఒక బలహీన మానవుడి వద్దకు వెళ్తారు.కొన్నిసార్లు ఔశధం ఫలిస్తుంది, మరికొన్నిసార్లు డాక్టరు విఫలమవుతాడు, అప్పుడు రోగి మరియు డాక్టరు ఇద్దరు ఆశ్చర్యంలో పడిపోతారు.
ఓ ఆదము పుత్రుడా !నువ్వు ఎంత బలహీనుడవు,ఒక ఈగ నీ నుండి ఏదైనా లాక్కుంటే దాన్ని తిరిగితీసుకుని రాలేవు! అల్లాహ్ సత్యం చెప్పాడు. ఇలా సెలవిచ్చాడు: {ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.}[316] మీరు ఒకఈగ నుండి అది లాక్కుని వెళ్ళిన దాన్ని తిరిగి తీసుకురాలేనప్పుడు మీరు మీ ఏ వ్యవహారానికి యజమాని అవుతారు? (మీ నుదుటి జుట్టు అల్లాహ్ చేతిలో ఉంది,మీ ఆత్మ ఆయన చేతిలో ఉంది,మీ హృదయం కరుణామయుడి రెండు వేళ్ల మధ్య ఉంది,తను ఇష్టపడే విధంగా అతన్ని తిప్పుతాడు,మీ జీవితం మరియు మరణం ఆయన చేతిలో ఉంది,మీ ఆనందం మరియు మీ కష్టాలు ఆయన చేతిలో ఉన్నాయి, మీ కదలికలు,పనులు,మాటలు ఆయన కోరికతో,అనుమతితో జరుగుతుంది,కాబట్టి ఆయన అనుమతి లేకుండా కదలకండి మరియు ఆయన చిత్తం లేకుండా చేయకండి.ఆయన మిమ్మల్ని మీ స్వయానికి వదిలేస్తే,ఆయన మిమ్మల్ని బలహీనత,నిర్లక్ష్యం,పాపం మరియు దుర్మార్గానికి వదిలివేస్తాడు;మరియు ఆయన మిమ్మల్ని ఇతరుల కోసం వదిలివేస్తే, మీకు ఎటువంటి ప్రయోజనం,హాని, మరణం, జీవితం లేదా పునరుత్థానం చేకూర్చలేని వాడికి ఆయన మిమ్మల్ని వదిలివేస్తాడు. కంటిరెప్ప సమయం కూడా ఆయన అవసరంలేకుండా ఉండలేరు,మీరు జీవించినంత కాలం ప్రతి అంశంలోనూ బహిర్గతంగా అంతర్గతంగా ఆయన అవసరం మీకు ఉంటుంది. ఆయన మీకు అనుగ్రహాలు ప్రసాదిస్తాడు కానీ మీరు ఆయన కోపాన్ని పాపాలతో, అవిశ్వాసంతో ఆహ్వానిస్తున్నారు. మీరు ఆయనను మరచిపోయారు, మీరు తిరిగి ఆయన వద్దకు వెళ్లవలసి ఉంది,ఆయన ఎదుట నిలబడవలసి ఉంది.[317]
ఓ మానవుడా:నీ బలహీనత మరియు నీ పాపపు పరిణామాలను నువ్వు భరించలేకపోవడం వల్ల' {అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు.}[318] అల్లాహ్ దైవ ప్రవక్తలను పంపాడు, పుస్తకాలు దింపాడు, షరీయతు చట్టాలను నియమించాడు, మీ ముందు ఋజుమార్గాన్ని స్థాపించాడు మరియు ఆధారాలు , రుజువులు,సాక్ష్యాలు,స్పష్టమైన ప్రమాణాలను స్థాపించాడు చివరికి ప్రతి వస్తువులో సంకేతాలు పెట్టాడు అవి తన ఏకత్వం,పోషకత్వం,దైవత్వంను సూచిస్తాయి, అయితే మీరు సత్యాన్ని అబద్ధాలతో అడ్డుకుంటున్నారు, అల్లాహ్ను వదిలి షైతానును స్నేహితుడిగా చేసుకుంటున్నారు మరియు అసత్యం కోసం వాదులాడుతున్నారు. {కానీ మానవుడు అన్నింటికంటే ఎక్కువ తగువులమారి'}[319] ‘అల్లాహ్ అనుగ్రహాలను నువ్వు అనుభవిస్తు నీ ఆరంభాన్ని మరియు అంతాన్ని మరిచిపోయావు! ఏమి? నువ్వు ఒక వీర్య బిందువు నుండి పుట్టించబడ్డావని మరిచిపోయావా?మరియు నీ పయనం ఒక సమాధిలోకి అని మరిచిపోయావా?మరియు మరణాంతరం నీ అంతిమ నివాసం స్వర్గం లేదా నరకం అయి ఉంటుంది. {ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు?}[320] {మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు.అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?"}[321] {ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయన ప్రతి సృష్టి సృజన పట్ల జ్ఞానముకలవాడు"} మహోన్నతుడు ఇలా సెలవిస్తున్నాడు: {ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?} {ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.} {తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.}
ఓ మానవుడా! అల్లాహ్ ఎదుట నిలబడి ఆయన ద్వారా కలిగే ఆనందాన్ని ఎందుకు నిరాకరిస్తున్నావు,ఆయనను ప్రార్ధించు తద్వారా ఆయన నిన్ను పేదరికం నుండి తీసి ధనికుడుగా చేస్తాడు,వ్యాధి నుండి స్వస్థత ప్రసాదిస్తాడు,మీ భాధలను దూరం చేస్తాడు,మీ పాపాలను క్షమిస్తాడు,నీ నష్టాన్ని భర్తీచేస్తాడు,ఒకవేళ నీ పై దౌర్జన్యం జరిగితే నీకు సహాయం చేస్తాడు,నీవు అపమార్గానికి లోనైతే సన్మార్గదర్శనం చేస్తాడు,నీకు తెలియని విషయాన్ని జ్ఞాన భోధచేస్తాడు,భయానికి గురైతే శాంతిని ప్రసాదిస్తాడు,బలహీనస్థితిలో దయచూపుతాడు,నీ శత్రువులను నీ నుంచి దూరం చేస్తాడు,మరియు నీకు ఉపాధిని ప్రసాదిస్తాడు.[322]
ఓ మానవుడా! అల్లాహ్ నీకు ప్రసాదించిన అనుగ్రహల్లో –ధర్మ అనుగ్రహం తరువాత –పెద్దది,’బుద్ది’అనుగ్రహం,దాని ద్వారా అతను తనకు ప్రయోజనకరమైన హానీకరమైన విషయాల మధ్య వ్యత్యాసాన్ని గ్రహిస్తాడు, మరియు అల్లాహ్ ఆదేశాలను, నిషేధాలను అర్ధంచేసుకుంటాడు,దానిద్వారా జీవన పరమార్ధాన్ని తెలుసుకోగలడు,అది ఏకైకుడు, ఆయనకు ఎవరు సాటిలేని అల్లాహ్’ ను ఆరాధించడం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా!}[323] {తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు}
ఓ మానవుడా! నిశ్చయంగా తెలివిగల మనిషి పెద్ద విషయాలను ఇష్టపడతాడు,చిన్న విషయాలను ఇష్టపడడు,అతను గొప్పవారైన ప్రవక్తలను, సత్పురుషులను అనుకరించడానికి ప్రయత్నిస్తాడు, వారితో కలవాలని కోరుకుంటాడు, అతను వారిని పొందలేనప్పటికి, అతని మార్గం అల్లాహ్ ఈ వాక్యంలో చెప్పిన వైపుకు ఉంటుంది:- [మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి,అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు,మీ పాపాలను మన్నిస్తాడు,][324] ఒకవేళ అతను దీని ప్రకారం నడుచుకున్నట్లైతే అల్లాహ్ అతన్ని సందేశహరులు,ప్రవక్తలు అమరులు మరియు సత్పురుషులతో కలుపుతాడు అల్లాహ్ తెలియజేశాడు:- {మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది!}[325]
ఓ మానవుడా ! ఓ మానవుడా! నేను నీకు ఈ విషయాన్ని ఉపదేశిస్తున్నాను’నువ్వు నీ మనసుతో ఏకాంతంలో ఉంటావు,నీ వద్దకు వచ్చిన సత్యాన్ని గురించి ఆలోచించు, దాని ప్రమాణాలను చూడు,ఆధారాలను పరిశీలించు, ఒకవేళ నువ్వు దానిని సత్యమని పొందితే దాని అనుకరణలో తొందరపడు,సాంప్రదాయాలను,నమ్మకాలను గ్రుడ్డిగా నమ్మవద్దు! మరియు ఈ విషయాన్ని మంచిగా తెలుసుకో ‘నీ ఆత్మ’నీ బంధువులు,నీ మిత్రులు,నీ తాతముత్తాతల వారసత్వం కంటే ఎక్కువ గౌరవనీయమైనది, అల్లాహ్ కాఫిరులకు, తిరస్కారులకు ఇది ఉపదేశించాడు, మరియు వారిని ఆహ్వానించాడు: పరమపవిత్రుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {(ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే,దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!}[326]
ఓ మానవుడా ! ఓ మానవుడా! నువ్వు ఇస్లాం స్వీకరిస్తే నీకు వచ్చే నష్టం ఏమి లేదు! అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు.}[327] ఇబ్ను కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు:- “వారు ఇస్లాం స్వీకరిస్తే కలిగే నష్టమేమిటి ఒకవేళ వారు అల్లాహ్ ను విశ్వసించి ఆయన మార్గంలో నడిస్తే ,మరియు పరలోకంలో ‘మంచి పనులు చేసిన వాడి కొరకు అల్లాహ్’చేసిన వాగ్దానం’ను ఆశిస్తూ విశ్వసిస్తే,అల్లాహ్ వారికి ఇచ్చిన దానిలో నుండి ఆయన మార్గంలో ఖర్చుచేస్తే,అతనికి తనవైపు మార్గదర్శనం చేస్తాడు,మరియు ఆయన ప్రసన్నత చేకూరే సత్కార్యల భాగ్యాన్ని కలిగిస్తాడు,అల్లాహ్’కు వారి మంచి చెడు ఉద్దేశాలు తెలుసు,మరియు అందులో ఎవరు అనుగ్రహానికి అర్హులో వారికి ఆయన అనుగ్రహం ప్రసాదిస్తాడు మరెవరికైతే అల్లాహ్ఎదుట నిలబడటానికి యోగ్యత ఉండదో,ఆయన తలుపు నుండి గెంటివేయబడతాడో అతను ఇహపర లోకాల్లో విఫలమవుతాడు,నష్టానికి గురి అవుతాడు}[328]. మీ ఇస్లాం స్వీకరణ మీకు మరియు అల్లాహ్ హలాలు చేసిన విషయాలు పొందటానికి లేదా చేయడానికి మధ్య అడ్డుగా నిలువదు,బదులుగా అల్లాహ్ ప్రసన్నత కోసం మీరు చేసే ప్రతీ పనికి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు,ఆ పని మీ మీ ప్రపంచాన్ని మార్చేది మరియు మీ డబ్బును,మీ పదవిని,ప్రతిష్టని వృద్ది పరిచేది కావొచ్చు,చివరికి మీరు వాటిలో హలాలు విషయాల ద్వారా హరాము నుండి సంరక్షించుకోవాలని అనుకునే వాటిలో కూడా మీకు పుణ్యఫలాలు దక్కుతాయి మహనీయ దైవ ప్రవక్త ఇలా తెలిపారు : - {మీ ప్రతీ శరీరావయవంలో దానం ఉంది.సహబాలు అడిగారు: ఓ దైవప్రవక్త! ఎలా కామవంఛాలను తీర్చుకోవడంలో పుణ్యం లభిస్తుంది?ప్రవక్త చెప్పారు: నువ్వే చెప్పు ఒకవేళ అతను దానిని హరాము పద్దతిలో పూర్తిచేసుకుంటే అతని పై పాపం నమోదుకాదా ?అదేవిధంగా దానిని అతను హలాలు పద్దతిలో పూర్తిచేస్తే అతనికి పుణ్యం లభిస్తుంది.}[329].
ఓ మానవుడా ! నిశ్చయంగా ప్రవక్తలు సత్యాన్ని తీసుకువచ్చారు,అల్లాహ్ ఉద్దేశ్యాన్ని చేరవేశారు,మరియు మనిషికి అల్లాహ్ షరీఅతు జ్ఞానం అవసరం ఉంటుంది,తద్వారా ఈ లోకంలో తెలివితో జీవించగలడు మరియు పరలోకంలో సాఫల్యం పొందుతాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- {ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరుపు నుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చివున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి,ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందినదని తెలుసుకోండి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు}[330] మరియు మహాశక్తిసంపన్నుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు: (ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! వాస్తవంగా, మీ ప్రభువు తరుపు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది. ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో! నిశ్చయంగా, అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా, తనకే నష్టం కలిగించు కుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను!"[331]
ఓ మానవుడా!ఒకవేళ నీవు ఇస్లాం స్వీకరిస్తే అది కేవలం నీకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది,మరియు ఒకవేళ నీవు దిక్కరిస్తే అది కేవలం నీకుమాత్రమే హానీ చేస్తుంది,నిశ్చయంగా అల్లాహ్'కు దాసుల అవసరం లేదు,పాపుల పాపం ఆయనకు ఎటువంటి హానీ చేయజాలదు,విధేయుల విధేయత ఆయనకు ప్రయోజనం చేయలేదు,ఆయన జ్ఞానంతో తప్ప ఎవరు పాపం చేయలేరు,మరియు ఆయన అనుమతితో తప్ప ఎవరూ ఆయనకు విధేయత చూపలేరు,అల్లాహ్ తన ప్రవక్తకు చెప్పిన విషయం ఇలా చెప్పాడు: ఓ నా దాసులారా! నిశ్చయంగా నేను నా పై అన్యాయాన్ని నిషేధించుకున్నాను, దాన్ని మీకోసం నిషేదించాను,కాబట్టి మీరు పరస్పరం ఒకరిపై ఒకరు అన్యాయం చేసుకోకండి. ఓ నా దాసులారా! మీరందరూ మార్గహీనులు నేను సన్మార్గ దర్శనం చేసినవారు తప్ప !కనుక మీరు ఋజుమార్గానికై నన్ను అర్ధించండి నేను మీకు సన్మార్గదర్శనం చేస్తాను. ఓ నా దాసులారా! మీరంతా ఆకలిగొన్నవారు నేను తినిపించినవారు తప్ప,కాబట్టి మీరు నన్ను ఆహారానికై అర్ధించండి నేను మీ అందరికీ తినిపిస్తాను. ఓ నా దాసులారా! మీరంతా వస్త్రహీనులు నేను ధరించినవారు తప్ప! కాబట్టి మీరు వస్త్రధారనకై నన్ను అర్ధించండి నేను మీ అందరికీ వస్త్రాప్రధానం చేస్తాను. ఓ నా దాసులారా! మీరు రాత్రింభవళ్లు పాపాలు,తప్పులు చేస్తున్నారు,నేను మీ పాపాలన్నీ క్షమిస్తున్నాను.కనుక మీరు నాతో క్షమించమని అర్ధించండి నేను మిమ్మల్ని క్షమిస్తాను. ఓ నా దాసులారా! మీరు నాకు ఎప్పటికీ హానీ కలిగించలేరు,కనుక మీరు నాకు హానీ కలిగించండి చేకూర్చండి,మరియు మీరు నాకు ఎన్నటికీ లాభం చేకూర్చలేరు,కనుక నాకు మీరు లాభం చేకూర్చండి ఓ నా దాసులారా! మీ పూర్వీకులు మీ తరువాతి తరాలవారు,మీ మనుషులు మీ జిన్నాతులు అందరూ కలిసి మీలోని అత్యధిక భయభీతులు కలిగి ఉన్నవ్యక్తి హృదయంలా మారిపోయినా నా అధికారంలో కొంచం కూడా వృద్దిరాదు. ఓ నా దాసులారా!మీపూర్వీకులు మీ తరువాతి తరాలవారు,మీ మనుషులు మీ జిన్నాతులు అందరూ కలిసి మీలోని అత్యంత దుష్టవ్యక్తి హృదయం కలిగి ఉన్నవ్యక్తి హృదయంలా మారిపోయినా నా అధికారంలో కొంచం కూడా తరుగురాదు. ఓ నా దాసులారా! మీపూర్వీకులు మీ తరువాతి తరాలవారు,మీ మనుషులు మీ జిన్నాతులు అందరూ కలిసి మీలోని అత్యంత దుష్టవ్యక్తి హృదయం కలిగి ఉన్నవ్యక్తి హృదయంలా మారిపోయినా నా అధికారంలో కొంచం కూడా తరుగురాదు. ఓ నా దాసుడా! ఇవి నీ కార్యాలు వాటిని నేను లెక్కించి పెడుతున్నాను,తరువాత వీటికి నేను ప్రతిఫలం ఒసగుతాను,ఎవరైతే మంచిని పొందుతాడో అతను అల్లాహ్ ను స్తుతిస్తూ ప్రశంసిస్తాడు,మరెవరైతే ఇది కాకుండా పొందుతాడో అతను తనను తాను నిందించుకుంటాడు’[332]
“స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే, అల్లాహ్ మనందరికీ ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను,శాంతిని వర్షించుగాకా!”
[1] సూరతుల్ అహ్'జాబ్:(40)వ ఆయతు,అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ పై అవతరించిన గొప్ప దివ్యగ్రంధం "పవిత్ర ఖుర్ఆను" నుండి గ్రహించినది, ఇలాంటి అనేక "పవిత్ర ఖుర్ఆన్" ఆయతులు నా పుస్తకంలో ఉన్నాయి, అవి '(ఖాల తఆలా/ఖాల అల్లాహుతఆలా) మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు- అల్లాహ్' చెప్పాడు- అంటూ ప్రస్తావించబడతాయి, మరియు మీరు ఖుర్ఆను యొక్క సంక్షిప్త పరిచయాన్ని ఈ పుస్తకంలో 95 -100 మరియు 114 -117 పేజీలో పొందుతారు.
[2] సూరతుల్ హిజ్ర్ -9'వ ఆయతు.
[3] సూరతు యూసుఫ్ -108'వ ఆయతు.
[4] సూరతుల్ అహ్'ఖాఫ్ -35వ ఆయతు.
[5] సూరతు ఆలే-ఇమ్రాన్ 200వ ఆయతు
[6] సూరతు ఆలె'ఇమ్రాన్ 19'వ ఆయతు.
[7] సూరతుల్ ఇఖ్లాస్.
[8] సూరతుల్ ఆరాఫ్ -54'వ ఆయతు.
[9] సూరతుర్రాద్ -2,3,7,8-ఆయతులు.
[10] సూరతుర్రాద్ -16'వ ఆయతు.
[11] సూరతు ఫుస్సీలత్ :37,39 ఆయతులు.
[12] సూరతు రూమ్ : 22-23 ఆయతులు.
[13] సూరతుల్ బఖర-ఆయతు 255
[14] సూరతు గాఫిర్ 3'ఆయతు
[15] సూరతుల్ హష్ర్ -23'ఆయతు.
[16] సూరతు తూర్ 35-36 ఆయతులు.
[17] చూడండి -మజ్'మూవుల్ ఫతావా షైకుల్ ఇస్లాం ఇబ్ను తైమియా'సంపుటం1'పేజీ -47-73,49.
[18] సూరతు రూమ్ 30 ఆయతు
[19] బుఖారీ ఉల్లేఖనం ,ఖద్ర్ పుస్తకం,ఆద్యాయం-3;ముస్లిం ఉల్లేఖనం -ఖద్ర్ పుస్తకం -హదీసు 2658 ఆయన పదాలు.
[20] {2}చూడండి -మజ్'మూవుల్ ఫతావా షైకుల్ ఇస్లాం ఇబ్ను తైమియా'సంపుటం14'పేజీ -380-383,
మరియు సంపుటం'7-పేజీ 75.
[21] {23} సూరతుల్ అన్'కబూత్-61-63 ఆయతులు.
[22] సూరతుల్ జుఖ్'రుఫ్ -9'ఆయతు
[23] వివరంగా తెలుసుకోవడానికి-’కితాబుత్తౌహీదు’-రచన;-ఇమాముల్ ముజద్దిద్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహ్హాబ్ రహిమహుల్లాహ్ ను చూడండి (25) సూరతు జుమర్,8 వ ఆయతు.
[24] సూరతు యూనుస్ 22-23 ఆయతు
[25] {27}సూరా లుఖ్మాన్ -32 వ ఆయతు.
[26] షర్'హు అల్అఖీదాతుత్తహావియా'పేజీ 39 చూడండి.
[27] }సూరతుల్ ముమినూన్ 92 ఆయతు.
[28] {30}సూరతుల్ ఇస్రా 42 ఆయతు.
[29] {31} సూరతు' సబా-23, 24.
[30] సూరతుల్ అంబియా -22 ఆయతు.
[31] ఫతుల్ ఖదీర్ చూడండి సంపుటం 3,పేజి-403.
[32] చూడండి మిఫ్తాహు దారుస్సఆదతు-సంపుటం1పేజీ -260
[33] సూరతుల్ అంబియా -25 ఆయతు.
[34] సూరతుల్ హూద్ 2 ఆయతు
[35] సూరతుల్ అంబియా -108'ఆయతు
[36] {39}సూరతుల్ జుమర్- 29 ఆయతు.
[37] {40} సూరతు ఫుస్సీలత్ 9-12 ఆయతులు.
[38] సూరతుల్ అంబియా 30,32 ఆయతులు -మరియు సూరతు రాద్ ప్రారంభాన్ని చూడండి
[39] ఈ పేరా ను ‘మిఫ్తాహు’దారిస్సఆదా’-{సంపుటం 1;పేజీ 251-269 }పుస్తకంలోని వివిధ పేజీలలో నుండి గ్రహించబడింది
[40] {43}సూరతుల్ జాసియా :13వ ఆయతు.
[41] {44}సూరతుల్ ఇబ్రాహీం 32-34 ఆయతులు.
[42] {45}సూరతుర్రూమ్ 22-25 ఆయతులు.
[43] సూరతుల్ అన్'కబూత్ 64 ఆయతు
[44] {47}సూరతు రూమ్ 27 ఆయతు.
[45] సూరతు గాఫిర్ 57'ఆయతు.
[46] సూరతుర్రాద్ -2'ఆయతు.
[47] {50}సూరతుల్ జుమా 1 వ ఆయతు
[48] {51}సూరతుల్ హజ్జ్ 18 వ ఆయతు.
[49] {52}సూరతు నూర్ -41 వ ఆయతు.
[50] సూరతుల్ ఆరాఫ్ 11،25'ఆయతు.
[51] సూరతుల్ ఆరాఫ్ 14'ఆయతు.
[52] {55}మిఫ్తాహు దారుస్సఆదహ్,సంపుటం 1,పేజీ 327-328,-సూర ఇబ్రాహీం 32-34
[53] సూరతుల్ ఇస్రా 70 ఆయతు
[54] సూరతు గాఫిర్ 7'ఆయతు
[55] సూరతుల్ బఖర-ఆయతు 228
[56] సూరతు తౌబా-71 వ ఆయతు
[57] సూరతు ఇస్రా 23,24 ఆయతులు.
[58] సూరా ఆలీ ఇమ్రాన్195'ఆయతు.
[59] సూరతుల్ నహ్ల్ -97వ' ఆయతు
[60] సూరతు గాఫిర్ 124'ఆయతు
[61] సఫరుల్ జామిఆ,అల్'ఇస్హాహు' 7: 25’-26’-పాత నిబంధన దానిని పవిత్రం చేస్తుంది,యూదులు మరియు క్రైస్తవులు దీనిని నమ్ముతారని తెలుసు.
[62] సిల్ సిలతుల్ ముఖారణతుల్ అద్'యాన్ -రచన డా అహ్మద్ షిబ్లీ సంపుటం3 పేజీ 210,213.
[63] సూరతు తౌబా-71 వ ఆయతు
[64] సూరతుల్ బఖర-ఆయతు 228
[65] {68} సూరతు ఇస్రా 23,24 ఆయతులు
[66] {69} సూరతుల్ జారియాత్-56 ఆయతు
[67] చూడండి అత్తద్ మురియ్య -షైకుల్ ఇస్లాం ఇబ్ను తైమియా -పేజీ నం:213-214;మిఫ్తాహు దారిస్సఆదహ్-సంపుటం 2 పేజీ 383.
[68] చూడండి 'అద్దీను'-రచన 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లా దరాజ్ పేజీ -87
[69] మునుపటి మూలాన్ని చూడండి, పేజీలు 98/84.
[70] చూడండి: అల్ ఫవాయిద్ -పేజీ 18-19
[71] చూడండి అద్దీను -పేజీ నం -98,102.
[72] సూరతు నిసా 163'ఆయతు
[73] సూరతుల్ అంబియా -25'ఆయతు
[74] సూరతుల్ ఆరాఫ్ 73'ఆయతు.
[75] సూరతుల్ అంబియా -25'ఆయతు
[76] {81}సూరతుల్ అన్ఆమ్ -151
[77] సూరతుల్ జుఖ్'రుఫ్ -45'ఆయతు
[78] {83} నిసా 82 ఆయతు.
[79] సూరతుల్ ఆరాఫ్ 154'ఆయతు.
[80] {85} సూరతు మర్యం 21 వ ఆయతు.
[81] సూరతుల్ హూద్ 63'ఆయతు
[82] {87}సూరతుల్ ఇస్రా 82 ఆయతు
[83] {88}సూరతుల్ మాయిదా :44
[84] {88}సూరతుల్ మాయిదా :46
[85] సూరతుల్ అంబియా -33 ఆయతు.
[86] {91}సూరతు తాహా:1,2 వ ఆయతు
[87] {92}సూరతు రూమ్ 30 ఆయతు.
[88] సూరతుల్ అహ్'ఖాఫ్ 30 ఆయతు.
[89] {94}సూరతు తాహా:1,2 వ ఆయతు
[90] సూరతు గాఫిర్ 29'ఆయతు
[91] సూరతుల్ హిజ్ర్ 139'ఆయతు.
[92] సూరతుల్ హజ్జ్ -9'ఆయతు.
[93] చూడండి: ఈ పుస్తకం యొక్క పేజీ 95-100 మరియు 114-117
[94] సూరతుల్ ఆలా -1-3 ఆయతులు.
[95] {100}సూరతు తాహా -50'వ ఆయతు
[96] - సూరతు షు'ఆరా -78 వ ఆయతు;చూడండి-'అల్ జవాబుస్సహీ ఫీ మన్ బదల దీనల్ మసీహ్'-సంపుటం-4 పేజీ నం -97.
[97] చూడండి-మజ్మూఉ ఫతావా షైఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా -సంపుటం-4 పేజీ 210-211.
[98] మరింత విస్తరంగా తెలుసుకొనుటకు,-ఇఫ్’ హాముల్ యహూద్’-రచన : శామ్యూల్ బిన్ అల్-యాహ్యా అల్-మాగ్రిబి”ను చూడండి, అతను మొదట యూదుడు, తరువాత ఇస్లాంలోకి మారాడు.
[99] ’] Xll. p. 568-69’ (ص 7’ je) యూదఎన్సైక్లోపీడియా వాల్యూమ్. Xll.
[100] - తల్మూద్’అనగా - యూదుల మతం మరియు వారి మర్యాదలను బోధించే ఒక పుస్తకం’ అని అర్ధం. ఇది వివిధ యుగాలలో యూద పండితులు "ది మిష్నా" (షరీఅహ్) పుస్తకానికి రాసిన వ్యాఖ్యానం మరియు సంక్షిప్త కథనాల సమాహారం.
[101] -వివరంగా చదవండి:-డాక్టర్ రోహ్లాంజ్ రచించిన 'అల్ యహూద్ అలా హస్బి తల్మూద్' పుస్తకం మరియు ఫ్రెంచ్ నుండి అరబీలోకి అనువదించబడిన'అల్-కంజుల్ మర్సూద్ ఫీ ఖవాయిదిత్తల్మూద్'- అనువాదకుడు -డాక్టర్ యూసెఫ్ హన్నా నస్రుల్లా-
[102] -మరింత వివరంగా తెలుసుకోవడానికిఈ పుస్తకాలు చూడండి-షైకుల్ ఇస్లాం ఇబ్ను’తైమియా రహ్’ రచించిన “అల్ జవాబుస్సహీ హు లిమన్ బద్దల దీనల్ మసీహ్’-మరియు రహ్మతుల్లాహ్ బిన్ ఖలీల్ అల్ హిందీ రచించిన“ఇజ్’హారుల్ హక్ఖ్”మరియు అబ్దుల్లా అత్తర్జుమాన్’[ఈయన క్రైస్తవ మతం నుండి ఇస్లాం స్వీకరించారు] రచించిన’తోహ్’ఫతుల్అరీబ్ ఫిర్రద్ది అలా ఇబాదిత్తస్లీబ్.
[103] ’] ప్రసిద్ధ యూరోపియన్ రచయిత డ్రేపర్ యొక్క ప్రఖ్యాత పుస్తకం ‘అస్సరాఉ బైనద్దీని వల్ ఇల్మి’- {"ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిలిజియన్ అండ్ సైన్స్"}, పేజీలు 40’-41.
[104] -న్యూ కాథలిక్ ఎన్సైక్లోపీడియాలో పేర్కొన్న వాటి సారాంశం.ది హోలీ ట్రినిటీ ఎస్సే,సంపుటం-14’,పేజీ -295.
[105] "ఇరాన్ ఇన్ ది సాసానియన్ ఎరా"పుస్తకం చదవండి.రచన;ప్రొఫెసర్ ఆర్థర్ కెర్స్టన్ సేన్'-ఇరాన్ చరిత్రలో నైపుణ్యం కలిగినవాడు,డెన్మార్క్లోని కోపెన్హాగన్ విశ్వవిద్యాలయంలో ఓరియంటల్ లాంగ్వేజెస్ ప్రొఫెసర్'మరియు షాహీన్ మకారియోస్ అల్ మజుసి రచించిన "హిస్టరీ ఆఫ్ ఇరాన్"
[106] -ఇరాన్ ఫీ అహ్'దిస్సాసానీయన్'బాబుద్దీనుజ్ జర్ తుష్తి దియానతుల్ హుకుమా పేజీ ; 183-233.
[107] “ప్రాచీన భారతదేశం” ప్రొఫెసర్ ఐషురా తుబా రాసిన పుస్తకాన్ని చూడండి. -భారత నాగరికత చరిత్ర ప్రొఫెసర్ “హైదరాబాద్” విశ్వవిద్యాలయం’ఇండియా. మరియు భారత మాజీ ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాసిన "ది డిస్కవరీ ఆఫ్ ఇండియా"పుస్తకం, పేజీలు 201’-202.
[108] C.V. Vidya: History of Mediavel Hindu India Vol I (poone 1921)
[109] చూడండి'అస్'సీరతున్నబవియ్య'-రచన -అబుల్ హసన్'నద్వి -పేజీ 19-28.
[110] {118}సూరతు తాహా -124'వ ఆయతు
[111] {119}సూరతుల్ అన్ఆమ్ 82
[112] సూరతుల్ హూద్108'ఆయతు
[113] {121} సూరతు షూరా 51'వ ఆయతు.
[114] సూరతుల్ హజ్జ్ 759'ఆయతు.
[115] తఫ్సీరు అల్ ఖురానుల్ అజీమ్'-కూర్పు-అబుల్ ఫిదా ఇస్మాయీల్ బిన్ కసీర్ అల్ ఖురశి-3'సంపుటం పేజీ:64.
[116] సూరతుల్ అన్ ఆమ్ -8,9 ఆయతులు.
[117] సూరతుల్ ఫుర్ఖాన్-20-21 ఆయతులు
[118] సూరతుల్ అంబియా 43 ఆయతు.
[119] సూరతుల్ అహ్'ఖాఫ్4 ఆయతు.
[120] చూడండి:లవామి'ఉల్ అణ్వారిల్'బహియ-సంపుటం2'-పేజీ 265-305/మరియు అల్ ఇస్లాం కూర్పు-అహ్మద్ షిబ్లీ పేజీ 114
[121] సూరతుల్ హూద్62'ఆయతు
[122] సూరతుల్ హూద్87'ఆయతు
[123] సూరతుల్ అహ్'ఖాఫ్4 ఆయతు.
[124] {132}సూరతుల్ అన్ఆమ్-124
[125] సూరా ఆలీ ఇమ్రాన33'ఆయతు.
[126] {134}సూరతుల్ జుమర్ 30 ఆయతు
[127] సూరతుర్రాద్ 38'ఆయతు.
[128] {136}సూరతు రూమ్ 30 ఆయతు.
[129] సూరతుల్ హజ్జ్ 40'ఆయతు.
[130] {138}సూరతుల్ ముజాదల 21 వ ఆయతు.
[131] సూరతుల్ ఆరాఫ్15854'ఆయతు.
[132] చూడండి-మజ్మూవూల్ ఫతావా షైఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా -సంపుటం-4 పేజీ 210-213.
[133] {141}సూరతుల్ అన్ఆమ్ 50
[134] సూరతు షుఅరా -180,109,127,145,164.
[135] సూరతు సాద్ 86'ఆయతు.
[136] సూరతుల్ అంబియా 365 ఆయతు.
[137] ఆలామున్నబువ్వహ్,రచన' అలీ బిన్ ముహమ్మద్ మావర్దీ-పేజీ 33.
[138] -అహ్మద్ బిన్ అబ్దుల్ హలీం బిన్ అబ్దుస్సలాం బిరుదు 'ఇబ్ను తైమియా'- ఆయన 661 హిజ్రీలో జన్మించారు మరియు -728 హిజ్రీలో మరణించారు, ఆయన ఇస్లాం యొక్క గొప్పపండితుల్లో ఒకరు, ఆయన అనేక పుస్తకాలు రచించారు.
[139] -చూడండి'అల్-జవాబుస్సహీహ్'-సంపుటం-4,పేజీ-96.
[140] -చూడండి 'అల్ ఫవాయిదు'పుస్తకం,రచన-ఇబ్నుల్ ఖయ్యిం-పేజీ 6-7
[141] సూరతుల్ అహ్'ఖాఫ్33 ఆయతు
[142] {151}సూరతు యాసీన్ 81ఆయతు
[143] }సూరతు రూమ్27 ఆయతు.
[144] {153]సూర యాసీన్ - 78-79 ఆయతులు.
[145] సూరతుల్ వాఖిఆ -ఆయతు58
[146] సూరతుల్ వాఖిఆ 63-64ఆయతులు
[147] సూరతుల్ హజ్జ్ 5'ఆయతు
[148] {157}సూరతు సాద్ 27వ ఆయతు
[149] {158}సూరతు జారియాతు 56 ఆయతు
[150] సూరతు సాద్ 28'ఆయతు
[151] - సూరతు యాసీన్ : ఆయతు-4 ; మరియు చూడండి:-అల్ ఫవాయిదు లి ఇబ్నుల్ ఖయ్యిమ్ -పేజీ:6-9,అత్తఫ్సీరూల్ కబీర్ లిర్రాజీ-సంపుటం2,పేజీ 113-116.
[152] -మజల్లతు ఆద్దావతు'సఊదియ్యతు,-నంబరు 1722,తేదీ-19/9/1420హిజ్రీ,పేజీ-37.
[153] - ముహమ్మద్ - ఇబ్నె - అబీ బకర్ - ఇబ్నె అయ్యూబ్ అజ్జరయీ, జననం 691 హి మరణం 751 హి , ఇస్లామీయ గొప్ప ధార్మిక విద్వాసుల్లోంచి ఒకరు. ఆయనవి చాలా పుస్తకాలు కలవు.
[154] {164}సూరతుల్ ముమినూన్71ఆయతు.
[155] మిఫ్తాహు దారిస్సఆదహ్-సంపుటం 2,పేజీ 383,చూడండి జవాబుస్సహీ లిమన్'బద్దల దీనుల్మసీహ్--సంపుటం 4 ,పేజీ 322,లవామి'ఉల్' అణ్వారు లిస్సఫారీనియ్యి-సంపుటం 2,పేజీ 263.
[156] సూరతుల్ ముమినూన్ ;51-52 ఆయతులు.
[157] {167}సూరతు షూరా 13'వ ఆయతు.
[158] {169}సూరతుల్ మాయిదా :44
[159] {170}సూరతుల్ మాయిదా :46
[160] సూరతుల్ మాయిదా :48
[161] సూరతుల్ బఖర-ఆయతు285
[162] మరిన్ని వివరాలకై 'చూడండి 'అర్రహీకుల్ మక్తూమ్'రచన-సఫీఉర్రహ్మాన్ ముబారక్'పూరి.
[163] సూరతుల్ ఖసస్ 57'ఆయతు
[164] ’] ఈ పుస్తకంలో ఖుర్ఆన్ పై ప్రత్యేక పేరా చూడండి, పేజీలు 95’-100 మరియు 114’-117’
[165] ’] మజ్మూ ఫతావ షేకుల్-ఇస్లాం ఇబ్ను తైమియా, సంపుటం [వాల్యూమ్] 4, పేజీలు; 201, 211, మరియు ఇఫ్’హాముల్ యహూద్, రచన-అల్-సామ్యూల్ అల్-మగ్రిబి, ఇతను మొదట యూదుడు పిదప ఇస్లాం స్వీకరించాడు పేజి- 58,59.
[166] అద్దీన్ వద్దౌలతు ఫీ ఇస్బాతి నుబువ్వతి నబియ్యినా ముహమ్మద్[సల్లల్లాహు అలైహివ సల్లం ], రచన ‘అలీ బిన్ రబ్బన్ అత్తబరీ పేజీ- 47.మరియు ఇవి కూడా చూడండి: పుస్తకం ‘అల్-ఈ’లాము’ రచన అల్-ఖుర్తుబీ పే. 263.
[167] ’] అంటే,హుదైబియా ఒప్పందం సమయంలోనిది,దాని వ్యవధి పది సంవత్సరాలు,ఇది హిజ్రీ ఆరవ సంవత్సరం, ఫత్హుల్‘బారి,సంపుటం 1, పేజి 34 చూడండి.
[168] బలదతు షామ్
[169] సహీహుల్ బుఖారి,[అరీసియ్యీన్'పదాలతో ]కితాబుల్ జిహాద్.
[170] చూడండి అఖీదతు తహావియా పేజీ 156,లావామిఉల్ అణ్వారూల్ బహియ్య సంపుటం 2,పేజీ 269,277 మరియు మబాదిఉల్ ఇస్లాం -పేజీ 64.
[171] ఇంజీలు మత్తా 42:21
[172] అల్-ముహ్తది ఇబ్రహీం ఖలీల్ అహ్మద్’రాసిన “తౌరాతు, బైబిల్ మరియు ఖుర్ఆను’లలో ముహమ్మద్[స]”పుస్తకం పేజి 73 చూడండి,.మరియు బుఖారీ ఉల్లేఖనం,కితాబుల్ మనాఖిబ్,18 వ అధ్యాయం[వల్లఫ్జు లహూ],ముస్లిం ఉల్లేఖనం కితాబుల్ ఫజాయిల్ హదీసు నంబరు 2286,అబూహురైర మర్ఫూ హదీసు,వహువ ఫిల్ ముస్నద్,సంపుటం2,పేజీ-256-312.
[173] సూరతుల్ హజ్జ్ 40'ఆయతు.
[174] రవాహు అల్ ఇమామ్ అహ్మద్ ఫీ ముస్నదిహీ,సంపుటం2,పేజీ 411,412 ,ముస్లిం ఉల్లేఖనం,కితాబుల్ మసాజీద్,తనపదాలతో [వల్లఫ్జు లహూ,]హదీసు 523.
[175] మరిన్ని వివరాల కోసం చూడండి:పుస్తకం ‘మబాదివుల్ ఇస్లాం’రచన షైఖ్ హమీద్ బిన్ ముహమ్మద్ అల్లహీం,మరియు పుస్తకం’దలీల్ ముక్తసర్ లిఫహ్మి ల్ ఇస్లాం’-రచన.ఇబ్రాహీం హర్బ్’
[176] సూరతుల్ ఇన్సాన్'3'ఆయతు
[177] సూరా ఆలీ ఇమ్రాన83'ఆయతు.
[178] సూరా ఆలీ ఇమ్రాన్ 19'ఆయతు.
[179] సూరా ఆలీ ఇమ్రాన్20'ఆయతు.
[180] ఇమామ్ అహ్మద్ సంపుటం 5,పేజీ 3,ఇబ్ను హిబ్బాన్ ,సంపుటం 1,పేజీ377
[181] ’] ఇమామ్ అహ్మద్ తన ముస్నద్,సంపుటం4,పేజి 114 లో వివరించారు అల్-హైసమి మజ్మఆలో సంపుటం 1,పేజీ-59’లో చెప్పారు,దీనిని అహ్మద్ మరియు అత్తబరాణి 'అల్-కబీరు బి నహ్విహీ'-వర్రిజాలు సుఖాతు లో ఉల్లేఖించారు,ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లాహ్ రాసిన 'ఫజ్లుల్ ఇస్లాం' యొక్క సందేశాన్ని చూడండి,
[182] -ముస్లిం ఉల్లేఖనం,కితాబుల్ ఈమాన్,హదీసు 8
[183] బుఖారి ఉల్లేఖనం,కితాబుల్ ఈమాను,ఆద్యాయం 'అల్ ముస్లిము మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లీసానిహీ వ యదిహీ'-మరియు ఆయన పదాలు,ముస్లిం ఉల్లేఖనం,కితాబుల్ ఈమాను,-హదీసు 39
[184] సూరతు యూనుస్ 71,72 ఆయతులు.
[185] సూరతుల్ బఖర-ఆయతు131
[186] సూరతు యూనుస్ 84 ఆయతు
[187] అత్తదమ్ముర్రియతు'పేజీ 109-110, సూరతుల్ మాయిదా 111 వ ఆయతు
[188] సూరతు మాయిదా 48'ఆయతు
[189] సూరతు నహ్ల్ 89 ఆయతు.
[190] {206}సూరతుల్ అన్ఆమ్ 157
[191] {207}సూరతుల్ ఇస్రా92 ఆయతు
[192] సూరతుల్ అంబియా 388'ఆయతు
[193] సూరతు యూనస్ 16'ఆయతు
[194] సూరతుల్ అన్'కబూత్'- 48'ఆయతు
[195] సూరతుల్ ఆరాఫ్157'ఆయతు.
[196] సూరతున్నిసా-153'ఆయతు
[197] {213}సూరతుల్ ఇస్రా-85 ఆయతు
[198] సూరతుల్ కహఫ్ -83'ఆయతు.
[199] సూరతు నమ్ల్ -అల్ ఆయతు 76.
[200] చూడండి: అల్'ముస్తష్రి'కూన్ వల్ ముబష్షిరూన్'ఫిల్ ఆలమిల్ అరబియ్యి'వల్ ఇస్లామీ-కూర్పు ఇబ్రాహీం ఖలీల్ అహ్మద్.
[201] అస్సరాఉ మిన్ అజలిల్ ఈమాన్ -కూర్పు డా-జాఫరీ లాంగ్'తర్జుమా-డాక్టర్.మున్'జిరిల్'అబసియ్యి నశ్రు దారుల్ కుఫ్ర్ -పేజీ -34.
[202] సూర తబారక్ 14'ఆయతు.
[203] సూరతుల్ అన్'ఆమ్ -38'వ ఆయతు.
[204] సూరతుల్ ఆరాఫ్535'ఆయతు.
[205] సూరతు నూర్ -40 వ ఆయతు
[206] సూరతుల్ ఆరాఫ్ 144'ఆయతు.
[207] సూరతుల్ అన్ఆమ్ 59.
[208] -ఇమామ్ అహ్మద్ తన 'ముస్నద్'లో ఉల్లేఖించారు,సంపుటం-4,పేజీ-131, మరియు అబూదావూద్ ఫీ సుననిహి ఫీ కితాబుస్సున్నహ్' బాబు లుజూముస్సున్నహ్'హదీసు-4604,సంపుటం-4,పేజీ-200.
[209] సూరతు నహ్ల్ -44 ఆయతు.
[210] సూరతు నజ్మ్ -4,5
[211] సూరతుల్ అహ్'ఖాఫ్9ఆయతు
[212] రవాహుల్ బుఖారి ఫీ కితాబిల్ అజాన్'-ఆద్యాయం-18,సంపుటం1-పేజీ 155.
[213] {230}సూరతు అహ్'జాబ్ 21 వ ఆయతు
[214] ఈ ప్రత్యేకమైన విద్యాశాస్త్ర పద్దతి మరియు సున్నతు’ను ప్రచారం చేయడంలోని ‘జబ్త్’అమరిక’ఖచ్చితత్వం ఫలితంగా,ముస్లింలు ఒక శాస్త్రాన్నికనుగొన్నారు,దానిని 'ఇల్ముల్-‘జర్’హు వ-తాదీలు-' మరియు -'ఇల్మ్ ముస్తలహుల్-హదీత్' అని పిలుస్తారు. ఈ రెండు శాస్త్రాలు ముస్లింల యొక్క ప్రత్యేక లక్షణాలలోనివి,ఇంతకు ముందు దీనిని ఎవరూ చేయలేదు.
[215] సూరతున్'నిసా 65'ఆయతు
[216] సూరతుల్ హష్ర్ 7'ఆయతు.
[217] దీనుల్ హక్ఖ్-పేజీ 38.
[218] ఖుర్రతు ఉయూనుల్ ము'వహ్హిదీన్-పేజీ :60
[219] మిఫ్తాహు'దారిస్సఆదహ్ -సంపుటం 2-పేజీ-384.
[220] -మరిన్ని వివరాలకు చూడండి-రిసాలతాని ఫిజ్జకాతి వస్సియామి'-రచన: సమాహతు ష్శైఖ్ 'అబ్దుల్ అజీజ్'బిన్ బాజ్'రహిమహుల్లాహ్'
[221] చూడండి మిఫ్తాహు దారుస్సఆదతు-సంపుటం1పేజీ 384.
[222] -మరిన్ని వివరాల కోసం ఉలమా పండితుల బృందం రచించిన "దలీల్ అల్-హాజ్ వల్ ఉమ్రా"పుస్తకం చూడండి;సమాహతు ష్శైఖ్ అబ్దుల్ అజీజ్’ బిన్ బాజ్’రహ్ రచించిన "అత్తహ్ఖీకు వల్ ఈజాహు"లికసీరిమ్మిన్ మసాయిలిల్ హజ్జ్’వల్ ఉమ్రా’
[223] గడిచిన పుస్తకం చూడండి-సంపుటం 2,పేజీ 385,మరియు దీనుల్ హక్ఖు;పేజీ 67.
[224] ఇమాం ముస్లిం తన గ్రంధంలో'జకాతు పుస్తకం'లో ఉల్లేఖించారు,హదీసు1006.
[225] {246}బుఖారీ ఉల్లేఖనం,'జకాతు పుస్తకం,ఆద్యాయం293 ;ముస్లిం ఉల్లేఖనం -'జకాతు పుస్తకం-హదీసు1008 ఆయన పదాలలో,
[226] సూరతు మర్యం-65 వ ఆయతు.
[227] {249}సూరతుల్ అన్ఆమ్ 59
[228] చూడండి-అఖీదతు అహ్లుస్సున్నతు వల్ జమాఅతు-పేజీ 7,11.
[229] చూడండి అఖీదతు అహ్లుస్సున్నతు వల్'జమా'అతు- పేజీ 44,మరియు మబాదివుల్ ఇస్లాం- పేజీ 80-84.
[230] సూరతుల్ అంబియా 26-28ఆయతులు
[231] సూరతుల్ అంబియా 19-20 ఆయతులు
[232] సూరతు ఖాఫ్ 17,18 ఆయతులు, చూడండి అఖీదతు అహ్లుస్సున్నతు వల్ జమా' అతు-పేజీ 19
[233] సూరతుల్ అన్'ఆమ్ -155'వ ఆయతు.
[234] సూరతుల్ ఆరాఫ్ 158వ ఆయతు,చూడండి అల్ అఖీదతుస్సహీహ వమా యుజాద్దుహా పేజీ 17 వ అఖీదతు అహ్లుస్సున్నతు వల్-జమా'అతు,పేజీ 22;మబాదివుల్ ఇస్లాం -పేజీ 89
[235] సూరతుల్ అంబియా 365 ఆయతు.
[236] సూరతు గాఫిర్1657'ఆయతు
[237] సూరతు నిసా -164'ఆయతు.
[238] సూరతుల్ హూద్31'ఆయతు
[239] {262}సూరతుల్ అన్ఆమ్ 50
[240] సూరతుల్ ఆరాఫ్188'ఆయతు.
[241] సూరా ఆలీ ఇమ్రాన్ 19'ఆయతు.
[242] సూరతుల్ మాయిదా 48'ఆయతు
[243] చూడండి'అల్ అఖీదతుస్సహీహతు వమా యుజాద్దుహా'పేజీ-17.మరియు అఖీదతు అహ్లుస్సున్నతు వల్ 'జమా'అతు'-పేజీ-25.
[244] సూరతుల్ బఖర-ఆయతు:285
[245] సూరతు నిసా-150'ఆయతు.
[246] సూరతు'-ఖాఫ్ 18'వ-ఆయతు.
[247] సూరతుల్ కహఫ్-49'ఆయతు.
[248] సూరా ఫుస్సీలత్ :20,22ఆయతులు.
[249] సూరతు ఫుస్సీలత్ 39'ఆయతు
[250] సూరతుల్ అహ్'ఖాఫ్33 ఆయతు.
[251] {274}సూరతుల్ ముమినూన్115 ఆయతు.
[252] సూరతు సాద్ 27'ఆయతు
[253] సూరతు జుల్'జిలతు-7,8 ఆయతులు మరియు చూడండి దీనుల్-హక్ఖ్ పేజీ 19
[254] సూరతుల్ ఆరాఫ్187'ఆయతు.
[255] సూరా లుఖ్మాన్ 34 వ ఆయతు.
[256] సూరతుల్ అన్'కబూత్ 62 ఆయతు
[257] ’] సూరత్ అల్-అనామ్, 59 వ వచనం. ఈ పద్యం తప్ప నోబెల్ ఖుర్ఆన్ లో ఏమీ లేనట్లయితే, అది దేవుని నుండి వచ్చినదానికి స్పష్టమైన సాక్ష్యం మరియు నిశ్చయాత్మక వాదన. ఎందుకంటే మానవాళి అన్ని యుగాలలో - జ్ఞానం విస్తృతంగా మరియు మనిషి గర్వంగా ఉన్న ఈ యుగంలో కూడా - ఈ సమగ్ర బ్రీఫింగ్ గురించి ఆలోచించదు, దానిని చేయగలిగేలా చేయనివ్వండి మరియు దాని యొక్క అత్యంత ప్రయత్నం చెట్టు లేదా కీటకాన్ని పర్యవేక్షించడం ఒక నిర్దిష్ట వాతావరణంలో దాని రహస్యాలు మనకు తెలియజేయడానికి మరియు గొప్ప వాటి నుండి వాటిని దాచడానికి. సమగ్ర ఆలోచన మరియు సమగ్ర అవగాహన విషయానికొస్తే, ఇది మానవాళికి తెలియని మరియు చేయలేని విషయం.
[258] }సూరతు యాసీన్ 12
[259] సూరతుల్ హజ్జ్ 70'ఆయతు.
[260] {283}సూరతు యాసీన్ 82
[261] సూరతుల్'ఖమర్ 49'ఆయతు.
[262] సూరతుల్ హదీద్ 22,23 ఆయతులు,మరియు ఈ పుస్తకాలు చూడండి:'అల్ అఖీదతుస్సహీహా వమా యుజాద్దుహా'పేజీ-19,మరియు అఖీదతు అహ్లుస్సున్నతువల్ జమా'ఆతు-39,మరియు దీనుల్ హక్ఖ్'పేజీ-19.
[263] -ఇమామ్ అహ్మద్ తన ముస్నద్'లో దీన్ని ఉల్లేఖించారు:- సంపుటం-1,పేజీ-293.ఇమామ్ తిర్మిజీ తన సునన్'లో 'అల్'ఖియామ'ఆద్యాయంలో దీన్ని ఉల్లేఖించారు;సంపుటం-4,పేజీ-76.
[264] చూడండి జామివూల్ ఉలూమ్'వల్ హకమ్ పేజీ 128.
[265] సూరతుల్ బఖర-ఆయతు 83
[266] సూరతు ఆలె ఇమ్రాన్ 134'ఆయతు.
[267] సూరతుల్ మాయిదా 8'ఆయతు
[268] సూరా ఆలే ఇమ్రాన్ 164'ఆయతు.
[269] మిఫ్తాహు దారిస్సఆదహ్ సంపుటం'1, పేజీ 374-375,సూరతుల్ మాయిదా ; ఆయతు 3.
[270] సూరతుల్ అన్'ఆమ్ -38'వ ఆయతు.
[271] సూరతుల్ హజ్జ్ 78'ఆయతు.
[272] సూరతుల్ అంబియా 32 ఆయతు.
[273] అల్'అన్'ఆమ్-93 ఆయతు.
[274] {300}సూరతుల్ అన్ఫాల్' 50 ఆయతు.
[275] రవాహుల్ అహ్మద్ ఫీ ముస్నదిహీ'సంపుటం3,పేజీ198;వ తిర్మిజీ ఫీ సుననిహీ ఫీ అబ్వాబి సిఫతుల్ ఖియామహ్ సంపుటం-4,పేజీ 49;మరియు ఇబ్ను మాజా ఫీ కితాబి జుహ్ద్' సంపుటం 4పేజీ491.
[276] అల్ ముఫ్రదాతు ఫీ గరీబీల్ ఖుర్ఆన్ పేజీ 76,చిన్నపాటి వ్యత్యాసంతో.
[277] అల్ ఫవాయిద్,రచనా ఇబ్నుల్ ఖయ్యిమ్ పేజీ 116.
[278] సూరతుల్ జుమర్ 39 ఆయతు.
[279] అత్తరీఖుల్ ఇలల్ ఇస్లాం -ముహమ్మద్ అసద్ పేజీ 140,కాస్త వ్యత్యాసంతో
[280] సూరతు'నజ్మ్ 38 ఆయతు.
[281] {307}సూరతుల్ అన్ఫాల్ 38 ఆయతు.
[282] సూరతుల్ ఫుర్ఖాన్ 70'ఆయతు.
[283] చూడండి మిఫ్తాహు దారుస్సఆదతు-సంపుటం1పేజీ 358،370
[284] దీనిని అబూ యా'లా తన ముస్నద్,సంపుటం -6 పేజి-155 /, మరియు అత్త బరాని ఫీ -ముజమిల్-అవ్సత్ సంపుటం 7, పేజి 132, మరియు అస్-సగీర్,సంపుటం 2,పేజీ 201, అజ్జియాఉ ఫిల్ 'ముక్తారా' సంపుటం-5,151,152 చెప్పారు:ఇస్నాదుహూ సహీహు మరియు ముజ్మఅ లో చెప్పారు’సంపుటం 10పేజీ 83,అబూ యాలా మరియు బజ్జారు’ఇలాంటిది ఉల్లేఖించారు,మరియు అత్తబ్రాని ఫిస్సగీర్’వల్ అవ్సత్ వ రిజాలుహుం సుఖాతు.
[285] ఇబ్ను అబీ ఆసిమ్ ఫిల్ ఆహాద్ వల్ మసానీ’సంపుటం5పేజీ188 లో ఉల్లేఖించారు,మరియు అత్తబ్రానీ ‘అల్-కబీరు’లో సంపుటం7,పేజీ53లోపేజీ 314, ఉల్లేఖించారు, అల్ హైసమి ‘అల్ మజ్మఅ’లో సంపుటం 1 పేజీ 32 లో ఉల్లేఖించారు,మరియు తబ్రానీ మరియు బజ్జారు ఇలాంటిది ఉల్లేఖించారు-‘రిజాలుల్ బజ్జార్ రిజాలుస్సహీహ్’ముహమ్మద్ బిన్ హార్వన్ అబూ నషీత్ తప్ప,వహువ సిఖతున్.
[286] {312}సూరతుల్ అన్ఆమ్ 82 వ ఆయతు.
[287] {313}సూరతు తాహా -124'వ ఆయతు
[288] {314}సూరతు రూమ్ 30 ఆయతు
[289] సూరతు ఫుస్సీలత్-11'ఆయతు.
[290] {316}సూరతు మర్యం 88،93 వ ఆయతు.
[291] {317}సూరతు దుఖాన్ 29 ఆయతు.
[292] }సూరా లుఖ్మాన్ 13 వ ఆయతు.
[293] సూరతు నహ్ల్ 45-47 ఆయతులు.
[294] సూరతుర్రాద్ 31'ఆయతు.
[295] సూరతుల్ ఆరాఫ్98'ఆయతు.
[296] సూరతుల్ అన్'కబూత్ 40 ఆయతు.
[297] సూరతుల్ ఆరాఫ్9'ఆయతు.
[298] సూరతు జుమర్-15వ ఆయతు,సూరతు షూరా-45వ ఆయతు.
[299] సూరతు సాఫ్ఫాత్ : 22-23 ఆయతులు.
[300] సూరతుల్ నహ్ల్ -97వ' ఆయతు.
[301] సూరతుస్సఫ్-12 ఆయతు
[302] సూరతుల్ ఆరాఫ్179'ఆయతు.
[303] సూరతుల్ ఫుర్ఖాన్ 44'ఆయతు.
[304] {330}సూరతు రూమ్ 50 ఆయతు.
[305] సూరత్ గాఫిర్ 46వ ఆయతు
[306] సూరతు కహఫ్ -49'ఆయతు.
[307] సూరతు నబ 40'ఆయతు.
[308] {334}సూరతుల్ జుమర్ 47 ఆయతు.
[309] సూరతుల్ మా ఆరిజ్ -11-14 ఆయతులు
[310] సూరతు రహ్మాన్ :43-44 ఆయతులు.
[311] సూరతుల్ హజ్జ్ 19-21 వ ఆయతులు.
[312] {338}సూరతు మర్యం 67వ ఆయతు.
[313] {339}సూరతు ఇన్సాన్ :1,2 వ ఆయతు
[314] సూరతుల్ రూమ్ -54'ఆయతు.
[315] సూరతు ఫాతిర్15'ఆయతు
[316] సూరతుల్ హజ్జ్ 73'ఆయతు.
[317] షైఖ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రచించిన "తసర్రుఫీ మినల్ ఫవాయిద్"చూడండి పేజీ 56.
[318] సూరతు నిసా-28'ఆయతు.
[319] సూరతుల్ కహఫ్ -54'ఆయతు.
[320] సూరతు యాసీన్ 77-79 ఆయతులు
[321] సూరతుల్ ఇన్ఫితార్-6,8ఆయతులు.
[322] చూడండి మిఫ్తాహు దారిస్సఆద-సంపుటం1పేజీ 251.
[323] సూరతు నహ్ల్:53-54.
[324] సూరా ఆలే ఇమ్రాన31'ఆయతు.
[325] సూరతు నిసా-69'ఆయతు
[326] సూరతుల్ ఫాతిర్ 46 ఆయతు.
[327] సూరతు నిసా 39'ఆయతు
[328] కొంచం వ్యత్యాసంతో తఫ్సీరూల్ ఖుర్ఆనుల్ అజీం సంపుటం1పేజీ 497.
[329] తఖ్దీము తఖ్రీజిహి-పేజీ 109.
[330] సూరతు గాఫిర్1707'ఆయతు
[331] సూరతు యూసుఫ్ -108'ఆయతు
[332] ముస్లిం ఉల్లేఖనం పుస్తకం: అల్ బిర్రు వస్సిలతు,బాబు తహ్రీముజ్జుల్మ్ హ -2577.