బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ ()

అబ్దుర్రహ్మాన్ బిన్ హమాద్ అల్ అమర్

 

సత్య ధర్మం

|

 బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్

(అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం)

 ముందుమాట మరియు అంకితభావం

అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాతు వస్సలాము అలా జమీయి రుసులిల్లాహి, వబఅద్ (సర్వ లోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే పొగడ్తలన్నీ మరియు అల్లాహ్ ప్రవక్తలందరిపై శుభాలు మరియు శాంతి కురియు గాక, ఆ తరువాత:

ఇది మనుగడ వైపు పిలుపు. ఉనికిలో ఉన్న ప్రతి బుద్దిమంతుడైన పురుషుడి మరియు స్త్రీ ముందు దీన్ని ఉంచుతున్నాను. మహోన్నతుడైన, సర్వ సామర్ధ్యం కలవాడైన అల్లాహ్ తో ఆశిస్తూ ఆయన తన మార్గం నుండి తప్పిపోయిన వాడిని దీని ద్వారా సన్మార్గం చూపుతాడని. మరియు నాకు, దీన్ని వ్యాపింపచేయటంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కడికి సంపూర్ణ పుణ్యాన్ని కలిగిస్తాడని నేను పలుకుతున్నాను. అల్లాహ్ తో సహాయం కోరతూ:

ఓ బుద్ధి కల మానవుడా తెలుసుకో నిన్ను సృష్టించిన నీ ప్రభువుని తెలుసుకుని మరియు ఆయనను విశ్వసించి ఆయన ఒక్కడినే ఆరాధించి మరియు నీ ప్రభువు నీ వద్దకు మరియు ప్రజలందరి వద్దకు పంపించిన నీ ప్రవక్తను గుర్తించి మరియు ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించి మరియు నీ ప్రభువు నీకు ఆదేశించిన సత్యధర్మమును గుర్తించి, దాన్ని విశ్వసించి దాని ప్రకారం నీవు ఆచరిస్తే తప్ప నీకు ఇహలోకములో మరియు మరణాంతరం పరలోకంలో ఎటువంటి మనుగడ కాని ఆనందము కాని లేదు.

మరియు మీ ముందు ఉన్న ఈ పుస్తకం (సత్య ధర్మం) లో ఈ గొప్ప విషయాల వివరణ కలదు. వాటిని తెలుసుకుని, వాటి ప్రాకారంగా ఆచరించటం మీపై తప్పనిసరి. మరియు కొన్ని పదాలు మరియు సమస్యలకు అవసరమగు వాటిని మరింత స్పష్టంగా నేను ఫుట్ నోట్ లో ప్రస్తావించాను. మరియు వాటన్నింటిలో అల్లాహ్ వాక్కు (ఖుర్ఆన్) ను, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులను ఆధారంగా తీసుకున్నాను. ఎందుకంటే అవి సత్య ధర్మమునకు మాత్రమే సూచన. దీనిని తప్ప దేనిని కూడా అల్లాహ్ ఏ ఒక్కరి నుండి ధర్మంగా ఆమోదించడు.

మరియు చాలా మంది ప్రజలను తప్పు దారి పట్టించిన గుడ్డి అనుకరణను నేను వదిలేశాను. అంతే కాదు తాము సత్య మార్గంపై ఉన్నామని చెప్పుకునే అనేక తప్పుదారి పట్టిన సమాజాలను నేను ప్రస్తావించాను. అవి దాని నుండి చాలా దూరంగా ఉన్నవి. వాటి స్థితి గురించి తెలియని వాటికి చెందిన వారు మరియు ఇతరులు దాని నుండి జాగ్రత్తపడుతారని. మరియు నాకు అల్లాహ్ చాలు మరియు ఆయన ఎంతో మంచి పరిరక్షకుడు.

దాన్ని పలికిన వాడు మరియు వ్రాసిన వాడు: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మన్నింపు అవసరం కలవాడు.

- అబ్దుర్రహ్మాన్ బిన్ హమ్మాద్ అల్ ఉమర్ .

 మొదటి అధ్యాయం

  గొప్ప సృష్టికర్త అయిన అల్లాహ్1 పరిచయం:

ఓ బుద్ధిమంతుడైన మానవుడా నీవు ఉనికిలో లేనప్పుడు నిన్ను సృష్టించి, అనుగ్రహాల ద్వారా నిన్ను పోషించిన సర్వలోకాల ప్రభువు అల్లాహ్ యే నీ ప్రభువని తెలుసుకో. అల్లాహ్ తఆలా[1] పై విశ్వాసం కలిగిన బుద్ధిమంతులు ఆయనను తమ కళ్ళతో చూడలేదు కాని వారు ఆయన ఉనికిపై మరియు ఆయన విశ్వమంతటి సృష్టికర్త, కార్యనిర్వాహకుడు అవటంపై సూచించే ఆధారాలను చూశారు. మరియు వాటి ద్వారా ఆయనను గుర్తుపట్టారు. మరియు ఈ ఆధారాల్లోంచి:

మొదటి ఆధారము:

విశ్వము, మానవుడు, జీవనం: అవి ప్రారంభము మరియు అంతము కలిగిన, ఇతరుల అవసరం కలిగిన ఉనికిలోకి వచ్చిన వస్తువులు. మరియు ఉనికిలోకి వచ్చిన, ఇతరుల అవసరం కలిగిన వాడు సృష్టిరాసి అవటం తప్పనిసరి. మరియు సృష్టిరాసి దానికి సృష్టి కర్త తప్పనిసరిగా ఉండాలి. మరియు ఈ గొప్ప సృష్టికర్త యే అల్లాహ్. మరియు అల్లాహ్ ఆయనే ఎవరైతే పవిత్రమైన తన స్వయం గురించి ఆయనే విశ్వమంతటి సృష్టికర్త, కార్యనిర్వాహకుడు అని తెలియపరచాడు. మరియు ఈ సమాచారం మహోన్నతుడైన అల్లాహ్ తరుపు నుండి ఆయన తన ప్రవక్తలపై అవతరింపజేసిన తన గ్రంథముల్లో వచ్చింది.

మరియు నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలు ఆయన వాక్కును ప్రజలకు చేరవేశారు. మరియు వారు ఆయన పై విశ్వాసము వైపునకు మరియు ఆయన ఒక్కడి ఆరాధన చేయటం వైపునకు వారిని పిలిచారు. మహోన్నతుడైన అల్లాహ్ తన గొప్ప గ్రంథమైన ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

{నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో సృష్టించాడు. ఆ పిదప సింహాసనం (అర్ష్ ) పై ఆసీనుడయ్యాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు!}

[అల్ ఆరాఫ్: 54]

పవిత్ర వచనం యొక్క సంక్షిప్త అర్థము:

మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలందరికి ఆయన వారిని సృష్టించిన మరియు భూమ్యాకాశములను ఆరు దినములలో [2]సృష్టించిన సృష్టికర్త అని తెలియపరుస్తున్నాడు. మరియు ఆయన తన సింహాసనమును అధిష్టించి ఉన్నాడని [3] తెలియపరుస్తున్నాడు.

మరియు సింహాసనం ఆకాశములపై ఉన్నది. మరియు అది సృష్టిరాసులలోకెల్ల అత్యున్నతమైనది మరియు విశాలమైనది. మరియు అల్లాహ్ ఈ సింహాసనంపై ఉన్నాడు. మరియు ఆయన తన జ్ఞాన పరంగా, తన వినికిడి పరంగా, తన దృష్టిపరంగా సృష్టిరాసులతో పాటు ఉన్నాడు. వారి వ్యవహారముల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. అత్యున్నతుడైన అల్లాహ్ రాత్రిని చేశాడని తెలియపరుస్తున్నాడు. అది పగలును తన చీకటితో క్రమ్మివేస్తుంది. మరియు అది వేగముగా దాని తరువాత వస్తుంది. మరియు ఆయన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడని తెలియపరుస్తున్నాడు. మరియు ఆయన వాటన్నింటిని ఉపయుక్తంగా చేశాడు అవి ఆయన ఆదేశముతో తమ కక్ష్యల్లో ప్రకాశిస్తున్నవి. మరియు తన ఒక్కడికే సృష్టించే, ఆదేశించే అధికారం కలదని మరియు ఆయన తన ఉనికిలో, తన గుణాల్లో పరిపూర్ణత కల ఉన్నతుడని తెలియపరుస్తున్నాడు. ఆయనే చాలా, శాశ్వతమైన మేలుని ప్రసాదిస్తాడు. మరియు ఆయన సర్వలోకాలకు ప్రభువు. వారిని సృష్టించి అనుగ్రహాల ద్వారా పోషించాడు.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

{మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) రేయింబవళ్ళు మరియు సూర్యచంద్రులున్నాయి. మీరు సూర్యునికి గానీ చంద్రునికి గానీ సాష్టాంగం (సజ్దా) చేయకండి, కాని కేవలం వాటిని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగం (సజ్దా) చేయండి - నిజంగానే మీరు ఆయనను ఆరాధించేవారే అయితే}.

[ఫుస్సిలత్: 37]

పవిత్ర వచనం యొక్క సంక్షిప్త అర్థము:

మహోన్నతుడైన అల్లాహ్ రాత్రి, పగలు, సూర్యుడు మరియు చంద్రుడు ఆయన పై సూచించే ఆయన సూచనలని తెలియపరుస్తున్నాడు. మరియు సూర్యునికి, చంద్రునికి సాష్టాంగపడటం నుండి వారిస్తున్నాడు. ఎందుకంటే అవి కూడా ఇతర సృష్టిరాసులవలె సృష్టిరాసులు. సృష్టించబడిన వాటి ఆరాధన చేయటం సరికాదు. మరియు సాష్టాంగపడటం ఆరాధనలో నుంచి ఒక రకము. మరియు అల్లాహ్ ఈ ఆయతులో వేరే వాటిలో ఆదేశించినట్లే తన ఒక్కడి కొరకు సాష్టాంగపడమని ప్రజలను ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే సృష్టికర్త మరియు కార్యనిర్వహకుడు, ఆరాధనకు అర్హుడైనవాడు.

రెండవ ఆధారం:

ఆయన మగ, ఆడ ను సృష్టించాడు: ఆడవాళ్ళు, మగవారు ఉనికిలో ఉండటం అల్లాహ్ పై సూచన.

మూడవ ఆధారం:

భాషలు, రంగులు భిన్నంగా ఉండటం: ఒకే స్వరము కల ఇద్దరు లేదా ఒకే రంగు గల ఇద్దరు లభించరు. కాని వారి మధ్య తేడా ఉండటం తప్పనిసరి.

నాల్గవ ఆధారం:

        అదృష్టాలు విభిన్నంగా ఉండటం: అయితే ఇతను ధనికుడై ఉంటే ఇంకొకడు పేదవాడై ఉంటాడు. మరియు ఇతను అధ్యక్షుడై ఉంటే ఇంకొకడు అతని క్రిందవాడై ఉంటాడు. ఒకే సమయంలో వారిలో నుంచి ప్రతి ఒక్కరు బుద్ధి కలవాడై, ఆలోచించే వాడై, జ్ఞానం కలవాడై ఉంటాడు. మరియు తనకు లభించని ఐశ్వర్యము, గౌరవము, అందమైన భార్య యొక్క ఆశ కలవాడై ఉంటాడు. కాని ఎవరికి సామర్ధ్యం ఉండదు అది తప్ప ఏదైతే అల్లాహ్ అతని కొరకు నిర్ణయించాడో. మరియు అది అల్లాహ్ సుబహానహు [4] తలచిన విజ్ఞత కొరకు. మరియు అది: ప్రజలను ఒకరితో ఇంకొకరిని పరీక్షించటం మరియు కొందరిని కొందరితో సేవ తీసుకోవటం చివరికి వారందరి ప్రయోజనాలు వృధా కావు.

        మరియు ఎవరికొరకైతే అల్లాహ్ ఇహలోకములో అదృష్టమును నిర్ణయించలేదో అతను అల్లాహ్ పై విశ్వాసమున్న స్థితిలో మరణిస్తే అతని కొరకు అతని అదృష్టమును అదనంగా స్వర్గంలో అతని అనుగ్రహాల్లో నిక్షేపించి ఉంచుతాడని అల్లాహ్ తఆలా తెలియపరచాడు. దానికి తోడు అల్లాహ్ పేదవాడికి గొప్పతనములను ఒసగుతాడు వాటి ద్వారా అతను స్వీయ ఆరోగ్యం, శ్రేయస్సును ఆస్వాదిస్తాడు. చాలామంది ధనికుల్లో ఎక్కువగా ఇవి లభ్యం కావు. మరియు ఇది అల్లాహ్ విజ్ఞతలోంచిది మరియు ఆయన న్యాయములోంచిది.

ఐదవ ఆధారం:

నిద్ర మరియు నిజమైన కల. అందులో పరిశుద్ధుడైన అల్లాహ్ నిదురపోయే వాడికి అగోచరంగా శుభవార్తగా లేదా హెచ్చరికగా ఏదైన విషయం గురించి తెలియపరుస్తాడు.

ఆరవ ఆధారం:

ఆత్మ: అల్లాహ్ ఒక్కడికి తప్ప ఎవరికి దాని వాస్తవికత తెలియదు.

ఏడవ ఆధారం:

మానవుడు: అతని శరీరంలో కల ఇంద్రియాలు, నాడీ వ్యవస్థ, మెదడు, జీర్ణ వ్యవస్థ మొదలైనవి.

ఎనిమిదవ ఆధారం:

అల్లాహ్ మృత భూమిపై వర్షమును కురిపిస్తాడు. అప్పుడు తమ రూపముల్లో, రంగుల్లో, ప్రయోజనముల్లో, రుచిలో భిన్నమైన మొక్కలు మరియు వృక్షములు మొలకెత్తుతాయి. ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ప్రస్తావించిన వందల ఆధారాల్లోంచి ఇది చాలా తక్కువ. మరియు ఆయన తెలియపరచాడు అవి పరిశుద్ధుడైన ఆయన ఉనికిపై మరియు ఆయన సృష్టిరాసులన్నింటిని సృష్టించిన వాడవటంపై, వాటి కార్యనిర్వాహకుడు అవటంపై సూచించే స్థిరమైన సూచనలని.

తొమ్మిదవ ఆధారం:

అల్లాహ్ ప్రజలను ఏ స్వభావం పై సృష్టించాడో ఆ స్వభావము తన సృష్టికర్తగా, తన కార్యనిర్వహకుడిగా అల్లాహ్ ఉనికి ఉండటంను విశ్వసిస్తుంది. మరియు ఎవరైతే దాన్ని నిరాకరిస్తాడో అతడు తన మనస్సును తప్పులో పడవేశాడు మరియు దాన్ని ఇబ్బందిలో పడవేశాడు. ఉదాహరణకు (అష్షుయూయీ) కమ్యునిష్టు [5]. అతడు ఈ జీవితంలో దుర్భరంగా జీవిస్తాడు. తాను ఉనికిలో లేనప్పుడు తనను సృష్టించిన, అనుగ్రహాల ద్వారా తనను పోషించిన తన ప్రభువు పట్ల తన తిరస్కారమునకు ప్రతిఫలంగా మరణాంతరం అతని పరిణామం నరకాగ్నికి ఆహుతి అవటం. ఒక వేళ అతను అల్లాహ్ వైపు పశ్చాత్తాపముతో మరలి, ఆయనను, ఆయన ధర్మమును, ఆయన ప్రవక్తను విశ్వసిస్తే తప్ప.

పదవ ఆధారం:

బర్కత్ (శుభము, సమృద్ధత) మరియు అది కొన్ని సృష్టితాల్లో అధికంగా ఉండటం. ఉదాహరణకు గొర్రెలు. బర్కత్ కు వ్యతిరేకము అల్ ఫషిలు ఏ విధంగానైతే కుక్కల్లో మరియు పిల్లుల్లో ఉంటుందో.

***

మహోన్నతుడైన అల్లాహ్ గుణాల్లోంచి ఆయన:

ఎటువంటి ఆరంభము లేకుండా మొదటివాడు మరియు మరణంలేని, అంతం లేని అనునిత్య జీవుడు మరియు తన ఉనికిపై స్థిరంగా ఉండే అక్కరలేనివాడు, ఇతరుల అవసరం లేనివాడు. మరియు ఏకైకుడు ఆయనకు ఎవరు సాటిలేరు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు (నిరపేక్షాపరుడు). (2) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. (3) {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [అల్ ఇఖ్లాస్: 1-4]

ఆయతుల అర్థం:

        అవిశ్వాసపరులు ప్రవక్తల పరిసమాప్తుడిని అల్లాహ్ గుణము గురించి అడిగినప్పడు అల్లాహ్ ఆయన పై ఈ సూరాని అవతరింపజేశాడు. మరియు అందులో వారితో ఇలా పలకమని ఆయనని ఆదేశించాడు:

అల్లాహ్ ఒక్కడే ఆయనకు ఎవరు సాటి లేరు. అల్లాహ్ ఆయనే అనునిత్య జీవుడు, కార్యనిర్వహకుడు. విశ్వం పై, ప్రజల పై మరియు ప్రతీ దాని పై ఆయన ఒక్కడికే సంపూర్ణ సార్వభౌమత్వము కలదు. ప్రజలు తమ అవసరములు తీర్చుకోవటంలో ఆయన ఒక్కడి వైపే మరలటం తప్పనిసరి.

        ఆయన ఎవరి నుండి జన్మించలేదు మరియు ఆయన నుండి ఎవరు జన్మించలేదు. మరియు ఆయనకు కొడుకు లేదా కూతురు లేదా తండ్రి లేదా తల్లి ఉండటం సరి కాదు. అంతే కాదు ఆయన స్వయంగా ఈ సూరాలో మరియు ఇతర సూరాలలో వీటన్నింటిని తీవ్రంగా ఖండించాడు. ఎందుకంటే జీవన పరంపర మరియు ప్రసవం సృష్టి లక్షణాలు. మరియు అల్లాహ్ క్రైస్తవులను మసీహ్ ఈసా అల్లాహ్ కుమారుడన్న వారి మాటపై ఖండించాడు. మరియు యూదులను ఉజైర్ అల్లాహ్ కుమారుడన్న వారి మాటపై ఖండించాడు. మరియు ఇతరులను దైవదూతలు అల్లాహ్ కుమార్తెలన్న వారి మాటపై ఖండించాడు. మరియు ఈ తప్పుడు మాటపై వారిని మందలించాడు.

మరియు ఆయన మానవ తండ్రి అయిన ఆదంను మట్టితో మరియు మానవ తల్లి అయిన హవ్వాను ఆదమ్ ప్రక్కటెముకతో సృష్టించినట్లే మసీహ్ ఈసా అలైహిస్సలాంను తన సామర్ధ్యముతో తండ్రి లేకుండా తల్లితో సృష్టించాడని తెలియపరచాడు. అప్పుడు ఆయన ఆమెను తన ప్రక్క చూశారు. ఆ తరువాత ఆయన ఆదమ్ సంతతిని స్త్రీపురుషుని నీటితో సృష్టించాడు. ఆయన ప్రతీ వస్తువును ఆరంభంలో ఉనికిలో లేనప్పుడే సృష్టించాడు. మరియు దాని తరువాత ఆయన తన సృష్టితాల కొరకు ఒక పద్ధతిని, రీతిని తయారు చేశాడు. ఆయన తప్ప ఎవరు కూడా వాటిని మార్చలేరు. మరియు అల్లాహ్ సుబహానహు ఈ రీతిలో నుంచి ఏమైన మార్చదలచుకుంటే దాన్ని తాను తలచినట్లు మార్చివేస్తాడు.

        ఏ విధంగానైతే ఆయన ఈసా అలైహిస్సలాంను తండ్రి లేకుండానే తల్లితో సృష్టించాడో మరియు ఏ విధంగానైతే ఆయనను తల్లి ఒడిలోనే మాట్లాడేటట్లు చేశాడో మరియు ఏ విధంగానైతే మూసా అలైహిస్సలాం చేతి కర్రను పరుగెత్తే సర్పంలా చేశాడో. మరియు ఆయన దానితో సముద్రంపై కొడితే అది చీలిపోయి ఆయన మరియు ఆయన జాతివారు దాటే మార్గంగా మారిపోయింది. మరియు ఏ విధంగానైతే ఆయన ప్రవక్తల పరిసమాప్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు చంద్రుడిని రెండు ముక్కలుగా చీల్చివేశాడో. మరియు వృక్షములను ఆయన వాటి వద్ద నుండి వెళ్ళినప్పుడు ఆయనకు సలాంచేసేవిగా చేశాడు. మరియు జంతువులను ఆయన కొరకు దైవదౌత్యం యొక్క సాక్ష్యం పలికేవిగా చేశాడు. వాటి స్వరమును ప్రజలు వినేవారు. అప్పుడు అది నిశ్చయంగా నీవు అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను అని పలికేది. మరియు ఆయనను బురాఖ్ పై మస్జిదె హరాం నుండి మస్జిదె అఖ్సా వరకు రాత్రి నడిపించాడు. ఆ తరువాత ఆయనను ఆకాశము వైపునకు ఎక్కించాడు ఆయనతో పాటు జిబ్రయీల్ అలైహిస్సలాం ఉన్నారు. చివరకు ఆయన ఆకాశము పైకి చేరుకున్నారు. అప్పుడు అల్లాహ్ సుబహానహు వతఆలా ఆయనతో మాట్లాడాడు. మరియు ఆయనపై నమాజును విధిగావించాడు. మరియు ఆయన భూమిపై ఉన్న మస్జిదె హరాం వైపునకు మరలారు. మరియు ఆయన తన మార్గంలో ఆకాశంలో ఉన్న వారందరిని చూశారు. మరియు ఇదంతా ఒకే రాత్రిలో ఫజర్ ఉదయించక మునుపు జరిగినది. మరియు ఇస్రా మేరాజ్ సంఘటన ఖుర్ఆన్ లో, ప్రవక్త హదీసులలో, చరిత్ర పుస్తకములలో ప్రసిద్ధి చెందినది.

***

మరియు అల్లాహ్ స్వయంగా వర్ణించుకున్న మరియు ఆయన ప్రవక్తలు వర్ణించిన ఆయన గుణములు:

1)    వినటం, చూడటం, తెలుసుకోవటం, సామర్ధ్యం, నిర్ణయించటం. ఆయన ప్రతీది వింటాడు మరియు చూస్తాడు. ఆయన వినటమును, ఆయన చూడటమును ఏ అడ్డు అడ్డగించదు. మరియు మాతృ గర్భముల్లో ఉన్నది మరియు హృదయములు దాచేవి మరియు జరిగినది, జరగబోయేది ఆయనకు తెలుసు. మరియు ఆయన సామర్ధ్యం కలవాడు ఏదైన ఆయన నిర్ణయించుకున్నప్పుడు దానితో ఆయన నీవు అయిపో (కున్) అంటాడు అది అయిపోతుంది.

2)    తాను తలచినప్పుడు తాను తలచుకున్నది సంభాషించటం: మరియు నిశ్చయంగా ఆయన మూసా అలైహిస్సలాంతో సంభాషించాడు. మరియు ప్రవక్తల పరిసమాప్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో సంభాషించాడు. మరయు ఖుర్ఆన్ దాని పదాలు మరియు దాని అర్థాలతో సహా అల్లాహ్ వాక్కు. దాన్ని ఆయన తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడు. అది ఆయన గుణముల్లోంచి ఒక గుణము. అపమార్గమునకు లోనైన మూతజిలా చెప్పినట్లు అది సృష్టిరాసి కాదు. [6]

3)    ముఖము, రెండు చేతులు, అధిష్టించటం, దిగటం [7], సంతోషించటం, ఆగ్రహించటం. ఆయన విశ్వాసపరులైన తన దాసుల నుండి సంతోషిస్తాడు మరియు అవిశ్వాసపరులపై, తన ఆగ్రహమును అనివార్యం చేసేవాటికి పాల్పడే వారిపై ఆగ్రహిస్తాడు. మరియు ఆయన సంతోషము, ఆయన ఆగ్రహము ఆయన ఇతర గుణముల్లాంటివే. అవి సృష్టిరాసుల గుణములతో పోల్చబడవు మరియు వ్యాఖ్యానించబడవు మరియు వర్ణించబడవు.

విశ్వాసపరులు మహషర్ మైదానములో, స్వర్గములో అల్లాహ్ ను తమ కళ్ళతో చూస్తారని ఖుర్ఆన్ మరియు సున్నత్ లో నిరూపితమైనది. మరియు అల్లాహ్ యొక్క గుణములు మహోత్తరమైన ఖుర్ఆన్ లో, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులలో సవివరంగా వచ్చినవి. కాబట్టి మీరు చూడండి.

***

మానవ సంతతిని మరియు జిన్నులను అల్లాహ్ సృష్టించటానికి కారణం.

ఓ బుద్ధిమంతుడా నిన్ను సృష్టించిన నీ ప్రభువు అల్లాహ్ యే అని నీవు గుర్తించినప్పుడు అల్లాహ్ నిన్ను వ్యర్ధంగా సృష్టించలేదని తెలుసుకో. నిశ్చయంగా ఆయన నిన్ను తన ఆరాధన కొరకు సృష్టించాడు.

మరియు అల్లాహ్ యొక్క ఈ వచనం దానికి ఆధారం:

{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}[56] నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు.[57] నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రధాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు.[58] [అజ్ జారియాత్: 56-58]

వచనాల సంక్షిప్త అర్థం:

మొదటి ఆయతులో అల్లాహ్ తఆలా జిన్నులను [8] మరియు మానవ సంతానమును తన ఒక్కడి ఆరాధన చేయుటకు సృష్టించాడని తెలియపరుస్తున్నాడు. రెండవ, మూడవ ఆయతులలో ఆయన తన దాసుల నుండి అక్కరలేనివాడని మరియు వారి నుండి ఎటువంటి ఆహారమును గాని తినిపించటమును గాని కోరటం లేదని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయనే ఆహారోపాధి కలిగించే బలవంతుడు. ప్రజల కొరకు మరియు ఇతరుల కొరకు ఆహారోపాధి ఆయన వద్ద నుండే కలుగును. ఆయనే వర్షమును కురిపిస్తాడు. మరియు భూమి నుండి ఆహారములను వెలికి తీస్తాడు.

మరియు భూమి మీద ఉన్న ఇతర ప్రాణుల విషయానికొస్తే అల్లాహ్ వాటిని మానవుని కొరకు వాటి ద్వారా అతడు ఆయన విధేయతపై సహాయం పొందటం కొరకు మరియు అల్లాహ్ షరీఅత్ పై వాటి పట్ల వ్యవహరించటానికి సృష్టించాడని ఆయన తెలియపరచాడు. మరియు విశ్వంలోని ప్రతీ ప్రాణి మరియు ప్రతి కదలిక మరియు నిశ్చలతను అల్లాహ్ ఒక విజ్ఞత కొరకు సృష్టించాడు. దాన్ని ఖుర్ఆన్ లో స్పష్టపరచాడు. మరియు దానిని అల్లాహ్ ధర్మ శాస్త్రంను తెలిసిన ప్రతి ఒక్కరు తమ జ్ఞానపరంగా తెలుసుకుంటారు. మరియు చివరికి ఆయుషుల, జీవనోపాధుల, సంఘటనల, విపత్తుల విభిన్నత ప్రతీది అల్లాహ్ ఆదేశముతోనే జరుగుతుంది. ఆయన బుద్ధి జీవులైన తన దాసులను పరీక్షించడానికి. కావున ఎవరైతే అల్లాహ్ విధివ్రాతతో సంతృప్తి చెంది, ఆయనకు లొంగిపోయి, ఆయనను సంతృప్తి పరచే కార్యాల్లో కృషి చేస్తాడో అతనికి అల్లాహ్ వద్ద నుండి మన్నత ఉంటుంది. మరియు ఇహలోకంలో, మరణం తరువాత పరలోకంలో ఆనందం ఉంటుంది. మరియు ఎవరైతే అల్లాహ్ విధివ్రాతతో సంతృప్తి చెందకుండా, ఆయనకు లొంగకుండా, ఆయనకు విధేయత చూపకుండా ఉంటాడో అతని కొరకు అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం ఉంటుంది. మరియు ఇహపరాల్లో అతనికి దుఃఖము ఉంటుంది.

మేము అల్లాహ్ తో ఆయన మన్నతను అర్ధిస్తున్నాము మరియు ఆయన ఆగ్రహం నుండి ఆయనతో శరణు వేడుకుంటున్నాము.

***

 మరణాంతరం మరల లేపబడటం, కర్మలపై లెక్కతీసుకోవటం మరియు ప్రతిఫలం ప్రసాదించటం మరియు స్వర్గము, నరకము.

        ఓ బుద్ధిజీవుడా అల్లాహ్ నిన్ను తన ఆరాధన కోసం సృష్టించాడని నీవు గుర్తించినప్పుడు నీవు తెలుసుకో ఆయన తన ప్రవక్తలపై అవతరింపజేసినటువంటి తన గ్రంథములన్నింటిలో ఆయన నిన్ను జీవింపజేసి మరల లేపుతాడని మరియు మరణం తరువాత ప్రతిఫల నివాసములో నీ కర్మలపై నీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడని తెలియపరచాడు. ఇది ఎందుకంటే మానవుడు మరణంతో ఆచరణ నివాసము మరియు నాశనమయ్యే నివాసము అయిన ఈ జీవితము నుండి ప్రతిఫల నివాసము మరియు శాశ్వత నివాసము అయిన మరణం తరువాత ఉన్నటువంటి నివాసము వైపునకు మరలుతాడు. మానవుని జీవనం కొరకు అల్లాహ్ నిర్ణయించిన కాలం ముగిసినప్పుడు అల్లాహ్ మరణ దూతను ఆదేశిస్తాడు అప్పుడు అతను అతని ఆత్మను అతని శరీరం నుండి స్వీకరిస్తాడు. అతని ఆత్మ అతని శరీరం నుండి వెలుపలికి రాక ముందు మరణ తీవ్రతలను చవిచూసిన తరువాత అతడు మరణిస్తాడు.

        ఒక వేళ ఆత్మ అల్లాహ్ పై విశ్వాసము కలదై, ఆయనపై విధేయత చూపేదైతే నిశ్చయంగా అల్లాహ్ దాన్ని అనుగ్రహాల నివాసమైన స్వర్గంలో ఉంచుతాడు. ఒక వేళ అది అల్లాహ్ ను అవిశ్వసించేదై, మరణాంతరం లేపబడటం మరియు ప్రతిఫలం ప్రసాదించటంను తిరస్కరించేదైతే అల్లాహ్ దాన్ని శిక్ష నివాసమైన నరకంలో ఉంచుతాడు. చివరికి ఇహలోక ముగింపు సమయం వస్తుంది. అప్పుడు ప్రళయం సంభవిస్తుంది. మరియు మిగిలి ఉన్న సృష్టిరాసులన్నీ మరణిస్తాయి. అప్పుడు అల్లాహ్ ఒక్కడు తప్ప ఎవరు మిగలరు. ఆ తరువాత అల్లాహ్ ప్రాణులన్నింటిని మరల లేపుతాడు చివరకు జంతువులను కూడా. మరియు ప్రతీ ఆత్మను దాని శరీరంలో అది మొదట సృష్టించినప్పుడు ఎలా ఉన్నదో అలా పరిపూర్ణంగా మరలిన తరువాత ప్రవేశింపజేస్తాడు. ఇది ప్రజలతో లెక్క తీసుకుని వారికి వారి కర్మల ప్రతిఫలం ప్రసాదించటానికి. పురుషునికి, స్త్రీకి మరియు యజమానికి, సేవకునికి మరియు ధనికుడికి, పేదవాడికి. ఎవరికీ అన్యాయం చేయబడదు. మరియు హింసకు గురైనవాడికి అతడిని హింసించిన వాడి నుండి ప్రతీకార న్యాయం ఇప్పించబడును. చివరికి జంతువులకు వారిని హింసించిన వారి నుండి ప్రతీకార న్యాయం ఇప్పించబడును. మరియు వారిలో నుంచే ఒకరితో ఇంకొకరికి ప్రతీకార న్యాయం ఇప్పించబడును. ఆ తరువాత వాటితో నీవు మట్టి అయిపోమని పలకబడును. ఎందుకంటే అవి నరకంలో గాని స్వర్గంలో గాని ప్రవేశించవు.

మరియు అల్లాహ్ మానవ సంతతికి మరియు జిన్నులకు అందరికి వారి కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కావున ఆయన తనపై విశ్వాసమును కనబరచి, తనపై విధేయత చూపి, తన ప్రవక్తలను అనుసరించిన వారికి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఒక వేళ వారు ప్రజల్లో అత్యంత పేదవారిగా ఉన్నా సరే. మరియు ఆయన తిరస్కారులైన అవిశ్వాసపరులను నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు. ఒక వేళ వారు ఇహలోకంలో ప్రజల్లో అత్యంత ధనికులైన, వారిలో గౌరవంతులైనా సరే. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

 యదార్ధానికి మీలో అందరికన్నా ఎక్కువ భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు.

 [అల్-హుజ్'రాత్: 13]

స్వర్గము: ఇది అనుగ్రహాల నిలయం. ఇందులో రకరకాల అనుగ్రహాలు కలవు. వాటిని ఎవరూ వర్ణించలేరు. ఇందులో వంద అంతస్తులు కలవు. ప్రతీ అంతస్తులో అల్లాహ్ పై తమ విశ్వాస శక్తిని బట్టి మరియు ఆయనపై తమ విధేయతను బట్టి నివాసులు ఉంటారు. మరియు స్వర్గములోని తక్కువ స్థానంలో ఉండేవారికి ఇహలోకములో ఒక రాజుకి అనుగ్రహించబడిన అనుగ్రహాల్లాంటి డబ్బై రెట్లు అధికంగా అనుగ్రహాలు ప్రసాదించబడుతాయి. [9]

నరకాగ్ని: అల్లాహ్ మమ్మల్ని దాని నుండి రక్షించుగాక. అది మరణాంతరం పరలోకంలో శిక్ష గృహము. అందులో రకరకాల శిక్షలు యాతనలు కలవు. దాని ప్రస్తావన వలన హృదయములు భయాందోళనకు గురి అవుతాయి. మరియు కళ్ళు ఏడుస్తాయి.

ఒక వేళ పరలోక నివాసములో మరణం అన్నది ఉంటే నరకవాసులు కేవలం నరకమును చూడగానే చనిపోయేవారు. కాని మరణం అన్నది ఒక సారే సంభవిస్తుంది. దానితొ మనిషి ఇహలోక జీవితం నుండి పరలోకమునకు మరలుతాడు. నిశ్చయంగా దివ్య ఖుర్ఆన్ లో మరణం, మరణాంతరం లేపబడటం, లెక్క తీసుకోబడటం, ప్రతిఫలం ప్రసాదించటం, స్వర్గము, నరకము గురించి సంపూర్ణ వర్ణత వచ్చింది. మరియు మేము ప్రస్తావించిన దానిలో దాని వైపు సూచన ఉన్నది.

మరణాంతరం లేపబడటం, లెక్క తీసుకోబడటం, ప్రతిఫలం ప్రసాదించబడటం గురించి చాలా ఆధారాలు కలవు. అల్లాహ్ తఆలా దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

దాని (ఆ మట్టి) నుంచే మిమ్మల్ని సృష్టించాము, మరల మిమ్మల్ని దానిలోకే చేర్చుతాము మరియు దాని నుంచే మిమ్మల్ని మరొకసారి లేపుతాము. [తాహ: 55]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరచిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?".

[యా, సీన్: 78-79]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం".

[అత్తగాబున్: 7]

వచనాల సంక్షిప్త అర్థం:

1)     మొదటి ఆయతులో అల్లాహ్ సుబహానహు వ తఆలా మానవ సంతతిని మట్టి నుండి సృష్టించాడని తెలియపరుస్తున్నాడు. మరియు అది వారి తండ్రి ఆదం అలైహిస్సలాంను మట్టితో సృష్టించినప్పుడు. మరియు ఆయన వారిని మరణం తరువాత అందులో సమాధులలో వారికి గౌరవంగా మరలింపజేస్తాడని తెలియపరచాడు. మరియు రెండవసారి ఆయన వారిని దాని నుండి వెలికి తీస్తాడని తెలియపరచాడు. అప్పుడు వారు తమ సమాధుల నుండి వారి మొదటి నుండి వారి చివరి వరకు బయటకు వస్తారు. అప్పుడు అల్లాహ్ వారి లెక్క తీసుకుని ఆ పిదప వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

2)     రెండవ ఆయతులో అల్లాహ్ మరణాంతరం లేపబడటంను తిరస్కరించే అవిశ్వాసపరుడిని ఖండిస్తున్నాడు. అతడు ఎముకలు నాశనం అయిపోయిన తరువాత జీవించడం పై ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వాటిని జీవింపజేస్తాడని తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయనే వాటిని ఉనికిలో లేనప్పుడు మొదటిసారి సృష్టించాడు.

3)     మూడవ ఆయతులో అల్లాహ్ మరణాంతరం లేపబడటంను తిరస్కరించే అవిశ్వాసపరుల తప్పుడు ఆలోచనను ఖండిస్తున్నాడు. మరియు అల్లాహ్ వారిని తొందరలోనే మరణాంతరం లేపుతాడని మరియు వారు చేసుకున్న కర్మల గురించి వారికి తెలియపరుస్తాడని మరియు దాని పరంగా వారికి ప్రతిఫలం ప్రసాదిస్తాడని మరియు అది అల్లాహ్ పై సులభమని తెలియపరుస్తూ వారి కొరకు అల్లాహ్ పై దృఢమైన ప్రమాణం చేయమని తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆదేశిస్తున్నాడు.

వేరొక ఆయతులో అల్లాహ్ మరణాంతరం లేపబడటంను మరియు నరకమును తిరస్కరించే వారిని మరణాంతరం లేపినప్పుడు వారిని నరకాగ్నిలో శిక్షిస్తాడని తెలియపరుస్తున్నాడు.

 మీరు తిరస్కరిస్తూ వచ్చిన నరక యాతనను మీరు చవిచూడండి.

 [అస్ సజదహ్: 20]

 మానవుని కర్మల, మాటల రికార్డు:

మరియు అల్లాహ్ అజ్జ వ జల్ల ఇది కూడా తెలియపరచాడు మానవుడు మాట్లాడే, చేసే ప్రతీ మంచి, చెడు అది బహిరంగంగా ఉన్నా గోప్యంగా ఉన్నా అల్లాహ్ కు తెలుసు. మరియు భూమ్యాకాశములను, మానవులను, ఇతరులను సృష్టించక ముందే తన వద్ద ఉన్న లౌహె మహ్ఫూజ్ లో దాన్ని రాసి పెట్టాడని తెలియపరచాడు. మరియు ఆయన దీనితో పాటు ప్రతీ మానవునితో ఇద్దరు దూతలను నియమించాడని. ఒకడు అతని కుడి వైపు అతడి పుణ్య కార్యములను వ్రాస్తాడని, మరియు ఇంకొకడు అతని ఎడమ వైపు అతడి పాప కార్యాలను వ్రాస్తాడని, వారి నుండి ఏదీ తప్పిపోదు అని తెలియపరచాడు. మరియు అల్లాహ్ సుబహానహు వ తఆలా ఇది కూడా తెలియపరచాడు ప్రతీ మానవుడు లెక్కదినమున తన కర్మల పుస్తకం ఇవ్వబడతాడని, అందులో అతని మాటలు, కర్మలు వ్రాయబడి ఉంటాయి. అప్పుడు అతను వాటిని చదువుతాడు. వాటిలో నుంచి దేన్ని అతడు నిరాకరించడు. మరియు ఎవరైనా దేన్నైన నిరాకరిస్తే అల్లాహ్ అతని చెవులకు, అతని కళ్ళకు, అతని చేతులకు, అతని కాళ్ళకు, అతని చర్మమునకు అతడు చేసిన వాటన్నింటి గురించి మాట్లాడిస్తాడు.మరియు మహోత్తరమైన ఖుర్ఆన్ లో సవిస్తరంగా ఇది పేర్కొనబడింది.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు:

( (మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు) [ఖాఫ్: 18] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నిశ్చయంగా మీ పైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు (10). గౌరవనీయులైన లేఖకులు (11), మీరు చేసేదంతా వారికి తెలుసు (12). [అల్ ఇన్ఫితార్: 10-12]

ఆయతుల వివరణ:

అల్లాహ్ సుబహానహు వ తఆలా ప్రతీ మానవుని పై ఇద్దరు దూతలను నియమించాడని తెలియపరుస్తున్నాడు. ఒకరిని అతని కుడివైపున పర్యవేక్షకునిగా అతని సత్కర్మలను వ్రాస్తున్నాడు. మరియు మరొకరు అతని యడమ వైపున పర్యవేక్షకునిగా అతని దుష్కర్మలను వ్రాస్తున్నాడు. మరియు అల్లాహ్ చివరి రెండు ఆయతులలో ప్రజలపై గౌరవోన్నతులైన దూతలను నియమించాడని తెలియపరస్తున్నాడు. వారు వారి కర్మలన్నింటిని వ్రాస్తున్నారు. మరియు వారిని పుట్టించక ముందు తన వద్ద లౌహె మహ్ఫూజ్ లో వారి కర్మలను తెలుసుకుని వాటిని వ్రాసినట్లే వారి కర్మలన్నింటిని తెలుసుకోవటంపై వారికి సామర్ధ్యము కలిగించాడని ఆయన తెలియపరుస్తున్నాడు.

సాక్ష్యం:

అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవడూ లేడని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని నేను సాక్ష్యం పలుకుతున్నాను. మరియు స్వర్గం వాస్తవమని, నరకము వాస్తవమని మరియు ప్రళయం రాబోతుందని అందులో ఎటువంటి సందేహం లేదని మరియు అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని లెక్క తీసుకోవటానికి, ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపుతాడని మరియు అల్లాహ్ తన గ్రంథంలో లేదా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట తెలియపరచినది వాస్తవమని నేను సాక్ష్యం పలుకుతున్నాను.

ఓ బుద్ధిమంతుడా ఈ సాక్ష్యం ద్వారా నేను నిన్ను విశ్వాసం వైపునకు మరియు దాన్ని ప్రకటించటం వైపునకు మరియు దాని అర్థముపై ఆచరించటం వైపునకు పిలుస్తున్నాను. ఇదే సాఫల్య మార్గము.


 రెండవ అధ్యాయం

  ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం:  

ఓ బుద్ధిమంతుడా నిన్ను సృష్టించిన నీ ప్రభువు అల్లాహ్ అని మరియు ఆయన నీ ఆచరణ పరంగా నీకు ప్రతిఫలం ప్రసాదించటానికి నిన్ను మరల లేపుతాడని గుర్తించినప్పుడు నీవు తెలుసుకో అల్లాహ్ నీ వైపునకు మరియు ప్రజలందరి వైపు ఒక ప్రవక్తను పంపించాడు, అతనికి, అతని అనుచరులకి విధేయత చూపమని నిన్ను ఆదేశించాడు. మరియు సరైన ఆరాధన గుర్తింపు కొరకు మార్గము ఈ ప్రవక్తను అనుసరించటంలో మరియు ఆయన ఇచ్చి పంపించబడ్డ అల్లాహ్ ధర్మ శాసనం ప్రకారం అల్లాహ్ ఆరాధన చేయటంలో మాత్రమే ఉన్నదని ఆయన తెలియపరచాడు.

మరియు ఈ పవిత్ర ప్రవక్త, ఆయనను విశ్వసించి అనుసరించటం ప్రజలందరి పై తప్పనిసరి. ఆయన ప్రవక్తల పరిసమాప్తి. మరియు ప్రజలందరి వైపు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్త నిరక్షరాస్యుడైన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి మూసా మరియు ఈసా అలైహిమస్సలామ్ తౌరాత్ మరియు ఇంజీలులో నలభై కన్న ఎక్కువ చోట్ల శుభవార్తనిచ్చారు. యూదులు మరియు క్రైస్తవులు ఈ రెండు గ్రంధములతో ఆడుకుని, వాటిలో మార్పుచేర్పులు జరపక ముందు చదివేవారు [10].

మరియు ఈ ప్రియ ప్రవక్త ఎవరి ద్వారా నైతే అల్లాహ్ తన ప్రవక్తల పరంపరను సమాప్తం చేశాడో మరియు అతనిని ప్రజలందరి వైపు ప్రవక్తగా పంపించాడో ఆయన ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ అల్ హాషిమి, అల్ ఖురషీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన భూమిపై ఉన్న అత్యంత ఉన్నత తెగలో చాలా ఉన్నతమైన, సత్యవంతుడైన వ్యక్తి. ఆయన వంశ పరంపర అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తనయుడైన అల్లాహ్ ప్రవక్త ఇస్మాయీల్ అలైహిస్సలాంతో కలుస్తుంది. మరియు నిశ్చయంగా ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 570వ సంవత్సరంలో మక్కాలో జన్మించారు. ఆయన జన్మించిన రాత్రి, ఆయన తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన క్షణం విశ్వమంత ఒక పెద్ద వెలుగుతో కాంతిమయమైనది. దానితో ప్రజలు భయభ్రాంతికి గురయ్యారు. చరిత్ర పుస్తకముల్లో ఈ సంఘటన లిఖించబడినది. మక్కాలోని కాబాలో ఖురైష్ జాతి వారు పూజించే విగ్రహాలు తలక్రిందుల పడిపోయినవి. ఫారిస్ మరియు కిస్రా రాజ గృహములు కదిలిపోయాయి. దానితో పది అంతకంటే ఎక్కువ దీపపు కుప్పెలు రాలి పడిపోయినవి. వారు ఆరాధించే ఫారిస్ అగ్ని ఆరిపోయింది. మరియు అది దాని కన్న ముందు రెండు వేల సంవత్సరముల నుంచి ఎన్నడు ఆరలేదు.

మరియు ఇదంతా భూ వాసుల కొరకు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి ప్రవక్తల పరిసమాప్తి పిల్లవాడి ప్రకటణ. తొందరలోనే అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే విగ్రహాలను ఆయన ముక్కలు ముక్కలు చేస్తారు. మరియు ఫారిస్, రోమ్ ను ఒక్కడైన అల్లాహ్ ఆరాధన వైపునకు మరియు తన సత్య ధర్మములో ప్రవేశించటం వైపునకు పిలుస్తారు. వారు నిరాకరించినప్పుడు ఆయన మరియు ఆయన అనుచరులు వారితో ధర్మపోరాటం చేస్తారు. అప్పుడు అల్లాహ్ వారిపై ఆయనకు విజయం కలిగిస్తాడు. మరియు తన వెలుగైన తన ధర్మమును భూమిపై విస్తరింపజేస్తాడు. మరియు ఇది అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత కార్యరూపం దాల్చినది.

అల్లాహ్ తన ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంనకు తన కన్నా మునుపటి ప్రవక్త సోదరులకు ఇవ్వనటువంటి ప్రత్యేకతలను ఇచ్చాడు అవి:

మొదటిది: ఆయన ప్రవక్తల పరిసమాప్తి. ఆయన తరువాత ఏ ప్రవక్త గాని సందేశహరుడు గాని రాడు.

రెండవది: ఆయన దైవదౌత్యం ప్రజలందరి కొరకు. కావున ప్రజలందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజం. ఆయనపై విధేయత చూపి, ఆయనను అనుసరించిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. మరియు ఆయనపై అవిధేయత చూపిన వాడు నరకంలో ప్రవేశిస్తాడు. చివరికి యూదులపై, క్రైస్తవులపై ఆయనను అనుసరించే బాధ్యత మోపబడింది. మరియు ఎవరైతే ఆయనను అనుసరించడో మరియు ఆయనను విశ్వసించడో వాడు మూసా, ఈసా మరియు ప్రవక్తలందరిని తిరస్కరించినవాడు. మరియు మూసా, ఈసా మరియు ప్రవక్తలందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించని మనుషులందరితో విసిగిపోయారు. ఎందుకంటే అల్లాహ్ ఆయన గురించి శుభవార్త ఇవ్వమని మరియు తమ సమాజములను అల్లాహ్ ఆయనను ప్రవక్తగా పంపించినప్పుడు ఆయన అనుసరణ వైపు పిలవమని వారికి ఆదేశించాడు. మరియు అల్లాహ్ ఆయనకు ఇచ్చి పంపించిన ధర్మము అదే దేనినైతే తన ప్రవక్తలకు ఇచ్చి అల్లాహ్ పంపించాడో. మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ఈ గౌరవ ప్రవక్త కాలంలో దాన్ని పరిపూర్ణ దశకు చేరవేసి ఉపలబ్ది చేశాడు. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించిన తరువాత అల్లాహ్ ఆయనకు ఇచ్చి పంపించిన ఇస్లాం ధర్మమును వదిలి వేరే ధర్మమును స్వీకరించటం ఎవరికీ సమ్మతం కాదు. ఎందుకంటే అది పరిపూర్ణ ధర్మము. దానితో అల్లాహ్ ధర్మములన్నింటిని రద్దు పరచాడు. మరియు ఎందుకంటే అది భద్రమైన సత్య ధర్మము.

ఇక యూదత్వం మరియు క్రైస్తవం అవి మార్పుచేర్పులు చేయబడిన ధర్మములు. అవి అల్లాహ్ అవతరింపజేసినట్లు యదావిదిగా లేవు. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించే ప్రతీ ముస్లిం మూసా, ఈసా మరియు ప్రవక్తలందరిని అనుసరించిన వాడవుతాడు. మరియు ఇస్లాం నుండి వైదొలగిన ప్రతి ఒక్కడు మూసా, ఈసా మరియు ప్రవక్తలందరిని తిరస్కరించిన వాడవుతాడు. ఒక వేళ అతను మూసా లేదా ఈసా అలైహిమస్సలాంను అనుసరించే వారిలో నుంచి అని ప్రకటించుకున్నా సరే.

మరియు ఇందు వలనే బుద్దిమంతులైన, న్యాయంగా వ్యవహరించేవారైన యూదుల పండితుల్లోంచి మరియు క్రైస్తవుల సన్యాసుల్లోంచి ఒక సమూహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం చూపటం వైపునకు మరియు ఇస్లాంలో ప్రవేశించటం వైపునకు త్వరపడింది.

***

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మహిమలు[11]:

మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర వ్రాసిన పండితులు ఆయన దైవదౌత్యము యొక్క నిజాయితీపై సూచించే ఆయన మహిమలను షుమారు చేశారు. అవి వెయ్యి కంటే ఎక్కువగా ఉన్నవి. వాటిలో నుండి:

1)        ఆయన రెండు మొండెముల మధ్య అల్లాహ్ సాలీల్[12] రూపములో మొలపించిన దైవదౌత్యపు (ముహమ్మదుర్రసూలుల్లాహ్) ముద్ర.

2)        ఎండాకాలపు తీవ్ర వేడి ఎండలో ఆయన నడిచినప్పుడు మేఘములు ఆయన కొరకు నీడనివ్వటం.

3)        ఆయన చేతులలో ఉన్న కంకర రాళ్ళు తస్బీహ్ చదవటం (అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడటం). మరియు చెట్లు ఆయనకు సలాం చేయటం.

4)        చివరికాలంలో సంభవించే అగోచర విషయాల గురించి ఆయన సమాచారమివ్వటం. ఇదిగో అవి ఆయన తెలియపరచినవి ఒక్కొక్కటి సంభవిస్తున్నవి.

మరియు ఈ అగోచర విషయాలు ఏవైతే ప్రవక్తల పరిసమాప్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తరువాత ఇహలోకం ముగిసేవరకు సంభవించేవి, మరియు వేటి గురించైతే అల్లాహ్ ఆయనకు తెలియపరచాడో, వేటి గురించైతే సమాచారమిచ్చాడో అవి హదీసు పుస్తకముల్లో, ప్రళయదిన సూచనల పుస్తకముల్లో వ్రాయబడి ఉన్నాయి. ఉదాహరణకు: ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ పుస్తకం "అన్నిహాయ" మరియు "అల్ అక్బారుల్ ముషాఅతు ఫీ అష్రాతిస్సాఅతి" పుస్తకం, హదీసు పుస్తకముల్లో "అబ్వాబుల్ ఫితన్ వల్ మలాహిమ్". ఈ మహిమలన్ని ఆయనకన్న మునుపు ప్రవక్తల మహిమలకు పోలి ఉన్నవి.

కాని అల్లాహ్ ఆయనకు ప్రత్యేకించి ప్రవక్తల్లోంచి ఎవరికి ప్రసాదించని ఇహలోకము ముగిసేవరకు కాల పత్రములపై ఉండిపోయే గొప్ప మహిమను ప్రసాదించాడు. అది అల్లాహ్ వాక్కు అయిన దివ్య ఖుర్ఆన్. అల్లాహ్ దాని పరిరక్షణ బాధ్యతను తీసుకున్నాడు. మార్పు చేర్పులు చేసే చేతులు దాన్ని తాకలేవు. ఒక వేళ ఎవరైన ఒక్క అక్షరం మార్చటానికి ప్రయత్నించిన బహిర్గతమైపోతుంది. ఇదిగో వందల సంఖ్యల ఖుర్ఆన్ పుటములు ముస్లిముల చేతుల్లో ఉన్నవి. ఒకటి కూడా ఇంకొక దానికి విభిన్నంగా ఉండదు. ఒక అక్షరం కూడా తేడా ఉండదు.

ఇక తౌరాత్ మరియు ఇంజీలు పుటములు లెక్కలేనన్ని ఉన్నవి. వాటిలో కొన్ని కొన్నింటికి భిన్నంగా ఉన్నవి. ఎందుకంటే యూదులు, క్రైస్తవులు అల్లాహ్ వారికి వాటి పరిరక్షణ బాధ్యత ఇచ్చినప్పుడు వాటితో, వాటి అక్షరములతో ఆటాడుకునేవారు. కాని ఖుర్ఆన్ పరిరక్షణ బాధ్యత తనకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు. అంతే కాదు దాని పరిరక్షణ బాధ్యత అల్లాహ్ సుబహానహువ తఆలా స్వయంగా తీసుకున్నాడు. ఎలాగైతే ఆయన సెలవిచ్చాడు:

(మేమే ఈ ఖుర్ఆన్ ను అవతరింపజేశాము. మరి మేమే దీనిని రక్షిస్తాము)

 [అల్ హిజ్ర్ : 9]

 ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అవటం పై మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అవటం పై అల్లాహ్ వాక్కు నుండే బుద్ధి విశిష్ఠమైన ఆధారాలు మరియు సూచనలు.

ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సూచించే బుద్ధి విశిష్ఠమైన, తర్కశాస్త్ర ఆధారాల్లోంచి అల్లాహ్ ఖురైష్ అవిశ్వాసులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇతరులైన పూర్వసమాజాలు తమ ప్రవక్తలను తిరస్కరించినట్లు తిరస్కరించినప్పుడు అల్లాహ్ వారికి చాలేంజ్ చేయటం. మరియు వారు ఖుర్ఆన్ ను అల్లాహ్ వాక్కు కాదన్నారు. అల్లాహ్ వారిని దాని లాంటి దాన్ని తీసుకురమ్మని వారికి చాలేంజ్ చేశాడు. అది వారి భాషలో ఉండి మరియు వారు స్వఛ్ఛమైన భాష వారై ఉండి మరియు వారిలో పెద్దపెద్ద పండితులు, సాహిత్యపరులు, గొప్ప కవులు ఉండి కూడా వారు అశక్తులైపోయారు. మరల వారు తిరస్కరించినటువంటి పది సూరాలను తీసుకు రమ్మని చాలేంజ్ చేశాడు. అప్పుడు వారు అశక్తులైపోయారు. ఆ తరువాత ఒక సూరాని తీసుకుని రమ్మని చాలేంజ్ చేశాడు. అయినా వారు అశక్తులైపోయారు. ఆ తరువాత దాని లాంటి దాన్ని తీసుకుని రావటం నుండి వారి అశక్తతను మరియు మానవులు, జిన్నులందరి అశక్తతను ఆయన ప్రకటించాడు. ఒక వేళ వారు ఒకరికొకరు సహాయకులిగా ఉన్నా;

పరిశుద్ధుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: ఇలా అను:

"ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తీసుకుని రాలేరు". [అల్ ఇస్రా: 88]

         ఒక వేళ దివ్యఖుర్ఆన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ప్రజల్లోంచి ఇతరుల వాక్కు అయితే దాని భాషలో ప్రావీణ్యులైన అరబ్బుల్లోంచి ఇతరులు దాని లాంటి దాన్ని తీసుకుని రాగలిగేవారు. కాని అది అల్లాహ్ తఆలా వాక్కు. మరియు మానవుని వాక్కు పై అల్లాహ్ వాక్కు ప్రాముఖ్యత మరియు దాని గొప్పతనం మానవునిపై అల్లాహ్ గొప్పతనం లాంటిది.

         ఎందుకంటే అల్లాహ్ కు పోలినది ఏదీ లేదు. మరియు అల్లాహ్ వాక్కును పోలినది ఏదీ లేదు. ఇందువలనే ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు అని మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని స్పష్టమవుతుంది. ఎందుకంటే అల్లాహ్ వాక్కును ఆయన వద్ద నుండి ప్రవక్త మాత్రమే తీసుకు రాగలడు.

మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

 {(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు}. {అల్ అహ్’జాబ్: 40 }

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

(మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు). {సబా: 28}:

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా పంపాము. [అల్ అంబియా: 107]

వచనాల సంక్షిప్త అర్థం:

అల్లాహ్ మొదటి ఆయత్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరి వద్దకు పంపించబడ్డ ఆయన ప్రవక్త అని మరియు ఆయన తన ప్రవక్తల పరిసమాప్తి అని, ఆయన తరువాత ఎటువంటి ప్రవక్త రారని తెలియపరచాడు. మరియు తన దౌత్యము బాధ్యత మోయటానికి, తన ప్రవక్తల పరంపర పరిసమాప్తి అవటానికి ఆయనను ఎన్నుకున్నాడని తెలియపరచాడు. ఎందుకంటే దీని కొరకు ఆయన ప్రజల్లోకెల్ల నైపుణ్యత కలవారని ఆయనకు తెలుసు.

మరియు అల్లాహ్ సుబహానహు వ తఆలా రెండవ ఆయతులో ఆయన తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రజలందరి కొరకు తెల్లవారు, నల్లవారు, అరబ్బుల, అరబ్బేతరుల కొరకు ప్రవక్తగా పంపించాడని తెలియపరచాడు. మరియు చాలా మంది ప్రజలకు సత్యం ఏమిటో తెలియదు. అందువలనే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించక పోవటం వలన అపమార్గమునకు లోనయ్యారు మరియు అవిశ్వాసులయ్యారు.

మరియు మూడవ ఆయతులో అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి పలికాడు. మరియు ఆయన అతడిని లోకమంతటి కొరకు కారుణ్యంగా పంపించాడు. కాబట్టి ఆయన ప్రజల ముందట గౌరవించబడే అల్లాహ్ కారుణ్యము. ఎవరైతే ఆయనను విశ్వసించి, ఆయనను అనుసరిస్తారో వారు అల్లాహ్ కారుణ్యమును స్వీకరించారు. వారి కొరకు స్వర్గం కలదు. మరియు ఎవరైతే ముహమ్మద్ ను విశ్వసించరో, ఆయనను అనుసరించరో వారు అల్లాహ్ కారుణ్యమును ధిక్కరించారు. మరియు వారు నరకాగ్నికి మరియు బాధాకరమైన శిక్షకు హక్కుదారులయ్యారు.

 అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించటం కొరకు పిలుపు:

ఇందుకనే ఓ బుద్ధిమంతుడా ప్రభువుగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంను ఆయన ప్రవక్తగా విశ్వశించటం వైపునకు మేము నిన్ను అహ్వానిస్తున్నాము. మరియు ఆయనను అనుసరించటం వైపునకు మరియు అల్లాహ్ ఆయనకు ఇచ్చి పంపించిన ఆయన ధర్మంపై ఆచరించటం వైపునకు మేము నిన్ను పిలుస్తున్నాము. అది ఇస్లాం ధర్మం, అల్లాహ్ వాక్కు అయిన దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు ఏవైతే ఆయన నుండి దృవీకరించబడ్డాయో అవి దాని మూలము. ఎందుకంటే అల్లాహ్ ఆయనను పరిరక్షించాడు ఆయన అల్లాహ్ ఆదేశమునే ఆదేశిస్తారు. మరియు అల్లాహ్ వారించిన వాటి నుండే వారిస్తారు. అయితే నీవు స్వచ్ఛమైన హృదయంతో అల్లాహ్ నా ప్రభువు మరియు నా ఏకైక దైవం అని నేను విశ్వసిస్తున్నాను అని పలుకు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నాను మరియు ఆయనను అనుసరిస్తున్నాను అని పలుకు. ఎందుకంటే దానితో మాత్రమే నీకు ముక్తి కలదు.

అల్లాహ్ మీకు, మాకు శుభమును మరియు మనుగడను ప్రసాదించు గాక ఆమీన్.

***

 మూడవ అధ్యాయం

 సత్య ధర్మం ఇస్లాం పరిచయం:

ఓ బుద్ధిమంతుడా నిన్ను సృష్టించి, నీకు ఆహారోపాధి కలిగించిన నీ ప్రభువు అల్లాహ్ అని మరియు ఆయన ఏకైక సత్య ఆరాధ్య దైవం అని, ఆయనకు ఎవరు సాటి లేరని మరియు నీవు ఆయనొక్కడినే ఆరాధించటం నీపై తప్పనిసరి అని నీవు గర్తించినప్పుడు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ వైపునకు మరియు ప్రజలందరి వైపునకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్త అని నీవు గుర్తించినప్పుడు నీవు ఇస్లాంధర్మమును గుర్తించి, దాన్ని విశ్వసించి, దానిపై ఆచరించనంత వరకు మహోన్నతుడైన అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నీ విశ్వాసము సరి కాదని నీవు తెలుసుకో. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ ఇష్టపడి, తన ప్రవక్తలందరికి ఆదేశించిన, వారి పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి ప్రజలందరి వద్దకు పంపించి, దానిపై ఆచరించటం వారికి తప్పనిసరి చేసిన ధర్మము అది.

***

 ఇస్లాం పరిచయం:

ప్రవక్తల పరి సమాప్తి మరియు ప్రజలందరి వైపునకు అల్లాహ్ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యుడు లేడు అని, మరియు నిస్సందేహంగా ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు' అని నీవు సాక్ష్యం పలకటం మరియు నమాజు స్థాపించడం, జకాతు చెల్లించడం, రమదాను ఉపవాసాలు ఉండటం, అల్లాహ్ గృహం [కాబతుల్లాహ్] హజ్జ్ చేయడం, ఒకవేళ నీకు వెళ్లగలిగే స్తోమత ఉన్నట్లైతే'.[13]

కావున ఇస్లాం అనేది అల్లాహ్ ప్రజలందరికి ఆదేశించిన సార్వత్రిక ధర్మం. మరియు అల్లాహ్ ప్రవక్తలు దాన్ని విశ్వసించారు మరియు అల్లాహ్ కొరకు తమ ఇస్లాంను ప్రకటించారు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ అది సత్య ధర్మం అని మరియు అది తప్ప వేరే దాన్ని ఎవరి నుండి ధర్మంగా స్వీకరించడని ప్రకటించాడు. మరియు మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు:

నిస్సందేహంగా ఇస్లాం ధర్మమే అల్లాహ్ వద్ద సమ్మతమైనది. [ఆలే ఇమ్రాన్: 19]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

మరియు ఎవడైనా అల్లాహ్ కు ఇస్లాం తప్ప ఇతర ధర్మాన్ని అవలంభించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు. [ఆలే ఇమ్రాన్: 85]

రెండు వచనాల సంక్షిప్త అర్థం:

మహోన్నతుడైన అల్లాహ్ తన వద్ద కేవలం ఇస్లామే ధర్మమని తెలియపరచాడు.- రెండవ ఆయతులో అల్లాహ్ సుబహానహు వతఆలా తాను ఎవరి నుండి కూడా ఇస్లాం తప్ప వేరే ధర్మమును స్వీకరించడని మరియు ముస్లిములు మాత్రమే మరణం తరువాత పుణ్యాత్ములని మరియు ఇస్లామేతర ధర్మం పై మరణించేవారు పరలోక నివాసంలో నష్టపోతారని మరియు నరకాగ్నిలో శిక్షింపబడతారని తెలియపరచాడు.

ఇందుకనే ప్రవక్తలందరు తమ ఇస్లాంను అల్లాహ్ కొరకు ప్రకటించారు. మరియు వారు ఇస్లాం స్వీకరించని వారి నుండి విసుగును ప్రకటించారు. మరియు యూదులు, క్రైస్తవుల్లోంచి ఎవరైతే ముక్తిని, సత్స్వభావమును ఆశిస్తాడో అతడు ఇస్లాంలో ప్రవేశించి, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాలి. చివరికి మూసా, ఈసా అలైహిమస్సలాంను నిజంగా అనుసరించే వాడవ్వాలి. ఎందుకంటే మూసా, ఈసా, ముహమ్మద్ మరియు అల్లాహ్ ప్రవక్తలందరు ముస్లిములు. అందరిని వారు ఇస్లాం వైపునకు పిలిచారు. ఎందుకంటే అది అల్లాహ్ వారికి ఇచ్చి పంపించిన అల్లాహ్ ధర్మం. మరియు ప్రవక్తల పరిసమాప్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడిన తరువాత నుండి లోకం ముగింపు వరకు వచ్చే వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్తగా విశ్వసించి, ఆయనను అనుసరించి మరియు ఆయనపై అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్ పై ఆచరించనంత వరకు తాను అల్లాహ్ కొరకు ముస్లిమునని స్వయంగా చెప్పుకోవటం సరికాదు. మరియు అల్లాహ్ అతని ఈ వాదనను స్వీకరించడు.

అల్లాహ్ తఆలా దివ్య ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత". [ఆలె ఇమ్రాన్: 31]

వచనము యొక్క సంక్షిప్త అర్ధం:

అల్లాహ్ పట్ల ప్రేమను వెలుబుచ్చే వారితో ఇలా పలకమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదేశిస్తున్నాడు: మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ మీరు ఆయన ప్రవక్త ముహమ్మద్ ను విశ్వసించి, ఆయనను అనుసరించనంత వరకు మిమ్మల్ని ప్రేమించడు మరియు మీ పాపములను మన్నించడు.

మరియు ఈ ఇస్లాం దేనినైతే ఇచ్చి అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రజలందరి వద్దకు పంపించాడో అది పరిపూర్ణమైన, సమగ్రమైన, స్వాభావికమైన ఇస్లాం. దేనినైతే అల్లాహ్ పరిపూర్ణం చేసి తన దాసుల కొరకు ధర్మంగా ఇష్టపడ్డాడో. వారి నుండి వేరే ధర్మంను ఆయన స్వీకరించడు. మరియు అదే దేని గురించైతే దైవప్రవక్తలు శుభవార్తనిచ్చి దానిపై విశ్వాసమును కనబరచారో.

అల్లాహ్ తఆలా దివ్యఖుర్ఆన్ లో ఈ విధంగా సెలవిచ్చాడు:

ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను.

{అల్ మాయిదా: 3}

 వచనము యొక్క సంక్షిప్త అర్థం:

ప్రవక్తల పరి సమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన ఈ పవిత్ర వచనములో అల్లాహ్ తఆలా తెలియపరుస్తున్నాడు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా లో మక్కాలోని అరఫాత్ లో ఆల్లాహ్ తో రహస్యంగా వేడుకుంటూ, ఆయనను అర్ధిస్తూ ఉన్న ముస్లిములతో పాటు నిలబడి ఉన్నారు. మరియు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చివరి కాలములో జరిగినది. దాని తరువాత అల్లాహ్ ఆయనకు సహాయం చేశాడు. మరియు ఇస్లాం విస్తరించింది. మరియు ఖుర్ఆన్ అవతరణ పరిపూర్ణమయ్యింది.

పరిశుద్ధుడైన అల్లాహ్ తాను ముస్లిముల కొరకు వారి ధర్మమును పరిపూర్ణం చేశాడని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించి, ఆయనపై దివ్యఖుర్ఆన్ ను అవతరింపజేసి తన అనుగ్రహమును పూర్తి చేశాడని తెలియపరుస్తున్నాడు. మరియు తాను వారి కొరకు ఇస్లాంను ధర్మంగా ఇష్టపడ్డాడని, తాను దాని నుండి ఎన్నడు ఆగ్రహానికి లోను కాడని మరియు ఎవరి కోసము ధర్మంగా అది కాకుండా వేరే దాన్ని స్వీకరించడని తెలియపరుస్తున్నాడు.

మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా తెలియపరుస్తున్నాడు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రజలందరి వద్దకు తాను ఇచ్చి పంపించిన ఇస్లాం అది ప్రతీ కాలము, ప్రదేశము, సమాజము కొరకు పరిపూర్ణమైన, సమగ్రమైన, సముచితమైన ధర్మము. మరియు అది జ్ఞానము, సులభము, న్యాయము, మేలు కల ధర్మము. ఇస్లాం జీవితము యొక్క వివిధ రంగాల కొరకు స్పష్టమైన, పరిపూర్ణమైన, సరైన విధానము. కావున అది ధర్మము, రాజ్యం కలిగినది. అందులో పరిపాలనకు, తీర్పులకు, రాజకీయమునకు, సామాజికమునకు, ఆర్ధికమునకు మరియు మానవులకు వారి ఇహలోక జీవితంలో అవసరమగు ప్రతీ దానికి సరైన విధానం కలదు. మరియు అందులో మరణం తరువాత పరలోక జీవితంలో వారికి సౌభాగ్యము కలదు.

***

 ఇస్లాం మౌలికాంశాలు:

మరియు పరిపూర్ణ ఇస్లాం దేనినైతే ఇచ్చి అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపించాడో అది ఐదు మౌలికాంశాలపై నిర్మితమై ఉంది. వాటిని విశ్వసించి, వాటిని నెరవేర్చే వరకు మనిషి వాస్తవ ముస్లిం కాజాలడు. అవి:

అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవడూ లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం.

1)     నమాజ్ నెలకొల్పటం.

2)      జకాత్ చెల్లించటం.

3)     రమజాన్ మాసపు ఉపవాసములు పాటించటం.

4)     అల్లాహ్ పరిశుద్ధ గృహము వైపునకు మార్గం పొందగలిగితే హజ్ చేయటం.

మొదటి మౌలికాంశము

(అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం).

మరియు ఈ సాక్ష్యమివ్వటం దాని కొరకు కొన్ని అర్థాలు కలవు వాటిని తెలుసుకుని, వాటి పరంగా ఆచరించటం ముస్లింపై తప్పనిసరి అవుతుంది. ఇక ఎవరైతే దాన్ని తన నాలుకతో పలికి దాని అర్థంను తెలుసుకోడో మరియు దాని ప్రకారంగా ఆచరించడో అతడు దానితో ప్రయోజనం చెందడు.

'లా ఇలాహ ఇల్లల్లాహ్' అంటే ['లా మఅ్ బూద బి హక్ఖిన్ ఫిల్ అర్జి వలా ఫిస్సమాయి'ఇల్లల్లాహు వహ్దహూ']నిజానికి 'భూమ్యాకాశాలలో అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం మరొకడు లేడు'-ఆయన ['ఇలాహుల్ హక్ఖ్'] సత్యమైన దేవుడు'మరియు ఆయన తప్పప్రతీదేవుడు' అసత్యమే. మరియు ఇలాహ్ అంటే ఆరాధించబడేవాడు (అల్ మఅ్ బూద్) అని అర్థం.

మరియు అల్లాహేతరులను ఆరాధించేవాడు అల్లాహ్ ను తిరస్కరించేవాడు మరియు ఆయనతో పాటు సాటి కల్పించేవాడు అవుతాడు. ఒక వేళ అతనిచే ఆరాధింపబడినవాడు ఎటువంటి ప్రవక్త అయినా లేదా ఎటువంటి వలి అయినా సరే. మరియు ఒక వేళ అతను దాని ద్వారా అల్లాహ్ సాన్నిద్యం పొందే, ఆయన వైపు సాధనమును పొందే వాదనతో (ఆరాధించినా) అయినా సరే. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పోరాటం చేసిన ముష్రికులు కూడా ఇదే వాదనతో ప్రవక్తలను, అవ్ లియాలను ఆరాధించేవారు. కాని అది అసత్యం, తిరస్కరించబడిన వాదన. ఎందుకంటే అల్లాహ్ సాన్నిద్యము మరియు ఆయన వైపు సాధనమును పొందటం ఆయనను వదిలి ఇతరులను ఆరాధించటం ద్వారా జరగదు. అది కేవలం ఆయన నామముల ద్వారా ఆయన గుణముల ద్వారా మరియు ఆయన ఆదేశించిన నమాజు, దానధర్మములు, స్మరణ, ఉపవాసము, ధర్మపోరాటము, హజ్, తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం లాంటి సత్కార్యముల ద్వారా మరియు జీవించి ప్రత్యక్షంగా ఉన్న విశ్వాసపరుడు తన సోదరుని కొరకు దుఆ చేసినప్పుడు అతని దుఆ ద్వారా మాత్రమే సాధ్యమగును.

మరియు ఆరాధన యొక్క చాలా రకాలు కలవు. వాటిలో నుంచి:

1)   దుఆ:

మరియు అది మహోన్నతుడైన అల్లాహ్ తప్ప ఎవరు సామర్ధ్యం వహించని అవసరాలను అర్ధించటం. ఉదాహరణకు వర్షమును కురిపించటం, వ్యాధిగ్రస్తునికి నయం చేయటం, సృష్టితాలు తొలగించలేని కష్టములను తొలగించటం. మరియు స్వర్గమును కోరటం, నరకము నుండి విముక్తిని కోరటం, సంతానమును, ఆహారోపాధిని, శుభము అలాంటి వాటిని కోరటం.

అయితే వీటన్నిటిని అల్లాహ్ ని తప్ప వేరే వారి నుండి అర్ధించకూడదు. ఎవరైతే వీటిలో నుంచి దేనినైనా సృష్టి రాసుల్లోంచి జీవించి ఉన్న వారి నుండి లేదా మరణించిన వారి నుండి అర్ధిస్తే అతను వారిని ఆరాధించాడు. అల్లాహ్ తఆలా తన దాసులను తన ఒక్కడినే అర్ధించమని ఆదేశిస్తూ మరియు దుఆ ఆరాధన అని తెలియపరుస్తూ సెలవిచ్చాడు. ఎవరైతే దాన్ని ఆయనకు తప్ప ఇతరులకు చేస్తాడో అతను నరకవాసులలో అవుతాడు:

 అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు". [గాఫిర్: 60]

మరియు అల్లాహ్ తాను కాకుండా పిలవబడే వారు ఒక వేళ వారు ప్రవక్తలైనా, అవ్ లియాలైన వారికి ఎటువంటి లాభము, నష్టము యొక్క అధికారం లేదని తెలియపరుస్తూ ఇలా సెలవిచ్చాడు:

వారితో ఇలా అను: "ఆయన (అల్లాహ్) ను కాదని మీరెవరినైతే (ఆరాధ్యదైవాలుగా) భావించారో, వారిని అర్థించి చూడండి; మీ ఆపదను తొలగించటానికి గానీ, దానిని మార్చటానికి గానీ వారికి ఎలాంటి శక్తి లేదు". [అల్ ఇస్రా: 56] మరియు దాని తరువాత వచనము ]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి. [అల్ జిన్: 18]

2)   వధ (జుబహ్), మొక్కుబడి మరియు నైవేద్యములు పెట్టటం:

మనిషి తాను రక్తమును ప్రవహింపజేసి లేదా నైవేద్యములు సమర్పించి లేదా మొక్కుబడులు చెల్లించి సాన్నిద్యం పొందటం అల్లాహ్ ఒక్కడి కొరకే సరైనది. మరియు ఎవరైతే సమాధి కొరకు లేదా జిన్నుల కొరకు వధించటంలా అల్లాహేతరుల కొరకు వధిస్తే అతడు అల్లాహేతరులను ఆరాధించాడు. మరియు అల్లాహ్ శాపమునకు హక్కుదారుడయ్యాడు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

(ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా నా నమాజ్ నా బలి (ఖుర్బానీ), నా జీవితం మరియు నా మరణం, సర్వ లోకాలకు ప్రభువైన అల్లాహ్ కొరకే! [అల్ అన్ఆమ్: 162-163]

మరియు దైవప్రవక్త ఇలా సెలవిచ్చారు: అల్లాహేతరుల కొరకు జుబహ్ చేసే వాడిని అల్లాహ్ శపించాడు. [14]

ఎవరైన మనిషి ఇలా పలికినప్పుడు: "నా ఫులా పని అయితే నేను ఫులా కొరకు మొక్కుబడిని సదఖాగా చెల్లిస్తాను లేదా ఫులా పని చేస్తాను" అప్పుడు ఈ మొక్కుబడి అల్లాహ్ తోపాటు సాటి కల్పించినట్లు అవుతుంది. ఎందుకంటే అది సృష్టిరాసుల కొరకు చేయబడిన మొక్కుబడి. మరియు మొక్కుబడి అన్నది ఆరాధన. దాన్ని అల్లాహ్ కొరకు తప్ప ఇతరుల కొరకు సమ్మతం కాదు. ధర్మబద్ధమైన మొక్కుబడి ఏమిటంటే ఇలా పలకటం "నా ఫులా కార్యం పూర్తయితే నేను అల్లాహ్ కొరకు ఫులా సదఖా ఇస్తానని మొక్కుకుంటున్నాను లేదా నేను ఫులా ఆరాధన చేస్తాను".

3)   ఇస్తిగాస (మొరపెట్టుకోవటం), ఇస్తిఆన (సహాయం అర్ధించటం), ఇస్తిఆజ (శరణు వేడుకోవటం) [15]:

అల్లాహ్ ఒక్కడితో మాత్రమే మొరపెట్టుకోవాలి మరియు సహాయం అర్ధించాలి మరియు ఆశ్రయం కోరాలి.

అల్లాహ్ తఆలా దివ్యఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు:

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీతోనే సహాయమును అర్థిస్తున్నాము [అల్ ఫాతిహ: 5]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.[16] ఆయన సృష్టించిన ప్రతీ దాని కీడు నుండి. [17] [అల్ ఫలఖ్: 1-2]

మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: -

 నిశ్చయంగా నాతో మొరపెట్టుకోకూడదు. అల్లాహ్ తో మాత్రమే మొరపెట్టుకోవాలి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నీవు అర్థించినప్పుడు అల్లాహ్ తో అర్థించు మరియు నీవు సహాయం కోరినప్పుడు అల్లాహ్ తో సహాయం కోరు.

మరియు జీవించి అందుబాటులో ఉన్న మనిషితో మొరపెట్టుకోవటం సమ్మతమే. అతను పూర్తి చేసే సామర్ధ్యం కలవాటిలో అతనితో సహాయం కోరవచ్చు. ఇక శరణు వేడుకోవటం అనేది ఒక్కడైన అల్లాహ్ తో మాత్రమే చేయాలి. మరణించిన వారితో, అదృశ్యమై ఉన్నవారితో మొరపెట్టుకో కూడదు. మరియు వారితో సహాయం కోరకూడదు. ఎందుకంటే వారికి దేని సామర్ధ్యమూ ఉండదు. ఒకవేళ వారు ప్రవక్త అయిన లేదా వలీ అయినా లేదా దూత అయినా సరే.

మరియు అగోచర విషయాల జ్ఞానము అల్లాహ్ కు మాత్రమే కలదు. ఎవరైన తనకు అగోచర జ్ఞానముందని దావా చేస్తే అతడు అవిశ్వాసపరుడవుతాడు. అతన్ని తిరస్కరించటం అనివార్యమవుతుంది. ఒక వేళ ఏదైన విషయం గురించి జ్యోతిష్యం చెబితే అది జరిగితే అది అచింతితముగా జరిగినది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైన జ్యోతిష్యుని వద్దకు లేదా సిద్దాంతి వద్దకు వెళ్ళి అతను చెబుతున్నది నిజమని విశ్వసిస్తాడో అతడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని తిరస్కరించాడు.[18]

తవక్కుల్ (నమ్మకం), రజా (ఆశ కలిగి ఉండటం) [19] మరియు ఖుషూ (భయభీతి): మనిషి అల్లాహ్ పై తప్ప ఎవరిపై నమ్మకమును కలిగి ఉండకూడదు. మరియు అల్లాహ్ తో మాత్రమే ఆశించాలి. మరియు ఒక్కడైన అల్లాహ్ కొరకు మాత్రమే భయభక్తి కలిగి ఉండాలి.

విచారకరమైన విషయం ఏమిటంటే ఇవాళ్ళ చాలామంది ఇస్లాంతో సంబంధం ఉన్నవారు అల్లాహ్ తోపాటు సాటి కల్పిస్తున్నారు. వారు ఆయనను వదిలి జీవించి ఉన్నవారితో మరియు సమాధులలో ఉన్నవారితో వేడుకుంటున్నారు. మరియు వారి సమాధులకు ప్రదక్షణలు చేస్తున్నారు. మరియు వారితో తమ అవసరాలను తీర్చమని కోరుతున్నారు. మరియు ఇది అల్లాహేతరుల ఆరాధన. దీన్ని చేసేవాడు ముస్లిం కాడు. ఒక వేళ అతను ఇస్లాం యొక్క దావా చేసి, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని పలికి, నమాజు చదివి, ఉపవాసముండి, బైతుల్లాహ్ హజ్ చేసినా సరే.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు". [జుమర్: 65]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

{ఓ ఇస్రాయీలీ సంతతి జనులారా !అల్లాహ్'నే ఆరాధించండి, ఆయనే నాకు ప్రభువు మరియు మీకు కూడా ప్రభువు, ఎవడైతే అల్లాహ్'కు ఇతరులను సాటి కల్పిస్తాడో అతని కొరకు అల్లాహ్ స్వర్గం' నిషేదించాడు, మరియు అతని నివాసం నరకాగ్ని అవుతుంది మరియు దౌర్జన్యపరులకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు}. [అల్ మాయిదా: 72]

అల్లాహ్ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఆజ్ఞాపిస్తూ తన జాతిప్రజలకు ఉపదేశించమని సెలవిచ్చాడు:

{(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా మీ ఆరాధ్య దైవం ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములుగా (షరీక్ లుగా) కల్పించుకోరాదు"}. {అల్ కహఫ్: 110}

మరియు ఈ అజ్ఞానులందరిని చెడ్డ, తప్పుదారి పట్టిన పండితులు మోసం చేశారు. వారు కొన్ని శాఖలను తెలుసుకున్నారు. మరియు ధర్మానికి ఆధారమైన తౌహీదు (ఏకేశ్వరవాదము) గురించి తెలుసుకోలేకపోయారు. అందుకే వారు షఫాఅత్, వసీల పేర్ల అర్థం తెలియకపోవటం వలన షిర్క్ వైపు అహ్వానించసాగారు. మరియు కొన్ని పాత ఆధారాలు మరియు అసత్యపు హదీసుల విషయంలో చెడు వాదనలు మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై కల్పించుకున్న హదీసులు మరియు షైతాను వారి కోసం నేసిన కథలు, కలలు మరియు వారి పుస్తకములలో వారు సేకరించుకన్నటువంటి దానికి పోలిన తప్పుడు మార్గాలు ఇందులో వారి వాదనలు. వాటి ద్వారా అల్లాహేతరుల కొరకు తమ ఆరాధనకు మద్దతు ఇవ్వటానికి; షైతానుకు మరియు మనోవాంఛలను అనుసరిస్తూ మరియు మునుపటి ముష్రికుల పరిస్థితిలా తండ్రితాతలను గుడ్డిగా అనుకరిస్తూ.

అల్లాహ్ తన ఈ వాక్యములో మేము సాధనమును వెతకాలని మమ్మల్ని ఆదేశించాడు: وَابْتَغُوا إِلَيْهِ الْوَسِيلَةَ (మీరు ఆయన సామిప్యమును పొందే సాధనం వెతకండి) [అల్ మాయిద: 35] అవి: అల్లాహ్ ఏకేశ్వరోపాసనతో పాటు సత్కర్మలు, నమాజు, దానధర్మాలు, ఉపవాసములు, హజ్, ధర్మపోరాటం మంచి గురించి ఆదేశించటం, చెడు నుండి వారించటం, బంధుత్వాలను కలపటం మొదలగునవి. ఇక మృతులను వేడుకోవటం మరియు ఆపదల, కష్టాల సమయంలో వారితో మొర పెట్టుకోవటం ఇవన్నీ అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించటం అవుతుంది.

దైవప్రవక్తల్లోంచి, ఔలియాల్లోంచి మరియు ముస్లిముల్లోంచి ఇతరుల సిఫారసు. అల్లాహ్ వారికి సిఫారసు చేసే అనుమతినిస్తాడు. అది సత్యమవటంను మేము విశ్వసిస్తున్నాము. కాని అది మృతుల నుండి కోరకూడదు. ఎందుకంటే అది అల్లాహ్ హక్కు. అది అల్లాహ్ అనుమతితో ఇతరులకు లభిస్తుంది. కావున అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన చేసేవాడు దాన్ని అల్లాహ్ తో ఇలా కోరుతూ ఇలా పలకాలి: ఓ అల్లాహ్ నా విషయంలో నీ ప్రవక్త, నీ పుణ్య దాసుల సిఫారసును స్వీకరించు. (అంతే కానీ) ఓ ఫులా వ్యక్తి నా కొరకు సిఫారసు చేయి అని కోరకూడదు. ఎందుకంటే అతను మృతుడు. మృతుని నుండి ఎన్నడు ఏది అడగకూడదు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు:

ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింప బడతారు".

 [అజ్జుమర్: 44]

(ఆ కార్యాలన్నీ)ఇస్లాంకు విరుద్ధమైన నిషేధిత బిదఅత్ లలోంచివి, వాటినుంచి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసులలో, సహీహైన్, సునన్ లలో వారించారు. సమాధుల పై సజ్దా చేసే ప్రదేశములను, తివాచీలను ఏర్పరచటం, వాటిపై కట్టడాలు కట్టడం, వాటిని దృఢంగా చేయటం, వాటి పై వ్రాయటం, వాటిపై పరదాలు వేళాడదీయటం, మఖ్బరాలో నమాజు చేయటం వీటన్నిటినీ మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఎందుకంటే ఇవి సమాధిపూజకు పెద్ద కారకం.

అజ్ఞానులు చాలా పట్టణాల్లో సమాధుల వద్ద చేసేది అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం అవుతుందని దీనితో స్పష్టమవుతుంది. ఉదాహరణకు: మిస్ర్ లో బదవీ, జైనబ్ సమాధి మరియు ఇరాఖ్ లో అబ్దుల్ ఖాదర్ జీలాని సమాధి మరియు నజఫ్ లో, ఇరాఖ్ లోని కర్బలాలో ఆలెబైత్ రజిఅల్లాహు అన్హుమ్ వైపు మోపబడిన సమాధులు. మరియు చాలా పట్టణాల్లో కల ఇతర సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయటం మరియు సమాధుల్లో ఉన్నవారి నుండి అవసరాలను తీర్చమని అడగటం మరియు వారిలో లాభం, నష్టం కలిగించే విశ్వాసం కలిగి ఉండటం.

వీరందరు తమ ఈ చర్య వలన అపమార్గమునకు లోనైన ముష్రికులు అని స్పష్టమవుతుంది. ఒక వేళ వారు ముస్లిములని వాదించి, నమాజు చదివి, ఉపవాసములుండి, బైతుల్లాహ్ హజ్ చేసి, నోటితో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని పలికినా ఎందుకంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ నోటితో పలికిన వాడు దాని భావమును అర్థం చేసుకుని దాని ప్రకారం ఆచరించనంత వరకు అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన చేసిన వాడు కాడు. దీని గురించి ఇంతకు ముందే తెలియజేయటం జరిగినది. ఇక ముస్లిమేతరుడు దాన్ని మొదట పటించటంతో ఇస్లాంలో ప్రవేశిస్తాడు. మరియు అతని నుండి దానికి వ్యతిరేకమైన షిర్క్ పై కొనసాగటం ఏ విధంగానైతే అజ్ఞానులున్నారో లేదా ఇస్లాం విధుల్లోంచి దేనినైనా స్పష్టమైన తరువాత తిరస్కరించటం లేదా ఇస్లాంకు విరుద్ధమైన ధర్మమును విశ్వసించటం వంటివి స్పష్టమయ్యే వరకు ముస్లింగా చలామణి అవుతాడు.

మరియు దైవప్రవక్తలు, ఔలియాలు [20] తమను వేడుకుని, తమతో మొరలు పెట్టుకునే వారి నుండి విసుగును చూపుతారు. ఎందుకంటే అల్లాహ్ వారిని తన ఒక్కడి ఆరాధన వైపునకు ప్రజలను పిలవటం కొరకు మరియు తనను వదిలి ఎవరైన ప్రవక్త లేదా వలీ లేద వేరేవారి ఆరాధనను వదలటం వైపునకు పిలవటం కొరకు పంపించాడు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఔలియాలతో ప్రేమ అంటే వారి ఆరాధన చేయటం కాదు. ఎందుకంటే వారి ఆరాధన చేయటం వారితో శతృత్వం చేసినట్లే. వారితో ప్రేమ వారిని అనుసరించటంలో మరియు వారి మార్గంపై నడవటంలో ఉంది. వాస్తవమైన ముస్లిం ఎవడంటే అతడు ప్రవక్తలను మరియు ఔలియాలను ప్రేమిస్తాడు. కాని వారిని ఆరాధించడు.

మరియు మన స్వయన్ని, ఇంటివారిని, సంతానముని, ప్రజలందరిని ప్రేమించటం కన్నా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించటం మన పై తప్పనిసరి అని మేము విశ్వసిస్తున్నాము.

***

 ముక్తి పొందే వర్గం:

లెక్కలో ముస్లిముల సంఖ్య చాలా ఉంది. కాని వాస్తవానికి వారు చాలా తక్కువ. ఇస్లాంతో సంబంధం ఏర్పరుచుకున్న వర్గములు చాలా ఉన్నవి. అవి 73 వర్గముల వరకు చేరిపోయినవి. వారి మొత్తం సంఖ్య వెయ్య మిలియన్లు [21] అంతకంటే ఎక్కువే ఉంది. కాని వాస్తవ ముస్లిం వర్గం ఒక్కటే. వారు అల్లాహ్ తఆలా యొక్క ఏకేశ్వరోపాసన చేస్తారు. మరియు విశ్వాసములో, సత్కార్యములు చేయటంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన అనుచరుల మార్గం పై నడుస్తారు. ఎలాగైతే దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన మాటల్లో ఇలా తెలియపరచారు: యూదులు డబ్బై ఒకటి వర్గములుగా విడిపోయారు. మరియు క్రైస్తవులు డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు ఈ సమాజం (ఉమ్మత్) డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది. వారిలో నుంచి ఒక వర్గము తప్ప అందరు నరకాగ్నిలో ఉంటారు. ప్రవక్త అనుచరులు ఓ దైవ ప్రవక్త వారు ఎవరు ? అని ప్రశించారు. ఆయన సమాధానమిస్తూ: ఈ రోజు నేను మరియు నా అనుచరులు ఉన్న దానిపై నడిచే వారు అన్నారు.[22]

మరియు దేనిపైనైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన అనుచరులు ఉన్నారో అది లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ యొక్క అర్థమును విశ్వసించటం మరియు అల్లాహ్ ఒక్కడినే వేడుకుని దానిపై ఆచరించటం మరియు జుబాహ్, మొక్కుబడులు అల్లాహ్ ఒక్కడి కొరకే చేయటం మరియు మొరపెట్టుకోవటం, సహాయం అర్ధించటం, శరణు వేడుకోవటం అల్లాహ్ ఒక్కడితోనే చేయటం మరియు లాభం చేకూర్చే నష్టం కలిగించే శక్తి అల్లాహ్ ఒక్కడికే ఉందని విశ్వసించటం మరియు అర్కానె ఇస్లాంను పరిశుద్ధుడైన ఆయన కొరకు ప్రత్యేకించటం మరియు ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, మరణాంతరం లేపబడటంను, లెక్క తీసుకోబడటంను, స్వర్గమును, నరకమును, మంచి చెడు విధి వ్రాత అంతా మహోన్నతుడైన అల్లాహ్ తరుపు నుండి అని విశ్వసించడం. మరియు వివిధ విషయాల్లో ఖుర్ఆన్, హదీసు ప్రకారం తీర్పునివ్వాలి. మరియు వాటి తీర్పుతో సంతృప్తి చెందాలి. మరియు అల్లాహ్ స్నేహితులతో స్నేహం చేయాలి. మరియు ఆయన శతృవులతో శతృత్వం చేయాలి. మరియు అల్లాహ్ వైపు పిలవాలి. మరియు ఆయన మార్గంలో కలిసికట్టుగా ధర్మపోరాటం చేయాలి. పుణ్యాత్ములైన ముస్లిం పాలకులు మంచి గురించి ఆదేశిస్తే వారి మాట విని వారికి విధేయత చూపాలి. ఎక్కడ ఉన్నా సత్య మాటలు పలకాలి. మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణుల పట్ల ఆయన ఇంటి వారి పట్ల ప్రేమానురాగాలు చూపాలి. వారితో స్నేహం చేయాలి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల పట్ల ప్రేమానురాగాలు చూపాలి. మరియు వారి వారి స్థానములను బట్టి గౌరవించాలి. మరియు వారందరి ప్రసన్నత కొరకు అల్లాహ్ తో వేడుకోవాలి. మరియు వారి మధ్య ఉన్న విభేదాలను వదిలివేయాలి [23]. మరియు ఆ మునాఫిఖుల మాటలను ఎవరైతే ప్రవక్త అనుచరుల విషయంలో విభేదాలు సృష్టించటానికి మరియు ముస్లిముల మధ్య దూరాలను పెంచటానికి చేశారో వాటిని త్యజించాలి. వాటితో కొందరు పండితులు, చరిత్రకారులు మోసపోయి తమ పుస్తకాల్లో దాన్ని మంచి ఉద్దేశంతో ప్రస్తావించారు. ఇది తప్పు.

మరియు ఎవరైతే తమను ఆలె బైత్ కు (ప్రవక్త ఇంటివారు) ఆపాదించుకుని తమ పేరును సయ్యిద్ పెట్టుకుంటారో వారు తమ వంశావళి సరి అవటం గురించి క్షుణ్నంగా సమీక్షించుకోవాలి. మరియు పరిశోధించుకోవాలి. ఎందుకంటే తమను తమ తాతముత్తాతలను వదిలి ఇతరుల వైపు ఆపాదించుకునే వారిని అల్లాహ్ శపించాడు. వంశావళి ఆలె బైత్ తో నిరూపితమైనవారు అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన చేయటంలో, పాప కార్యములను త్యజించటంలో మరియు ప్రజలు తమ వైపు వాలటంను మరియు తమ మోకాళ్ళను, తమ పాదములను ముద్దుపెట్టుకోవటంను ఇష్టపడకపోవటంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయన ఇంటివారిని అనుసరించటం తప్పనిసరి. మరియు ప్రత్యేక దుస్తులతో తమ ముస్లిం సోదరుల నుండి వేరు చేసుకోకూడదు. ఎందుకంటే ఇవన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దానికి విరుద్ధము. మరియు ఆయన దాని నుండి నిర్దోషి. మరియు అత్యంత దైవభీతిపరుడు అల్లాహ్ వద్ద గౌరవోన్నతుడు.

అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కలిగించుగాక.

***

 పరిపాలన మరియు చట్టం చేయటం అల్లాహ్ ఒక్కడి హక్కు. ఎందుకంటే చట్టం అనేది న్యాయము, కారుణ్యము మరియు గౌరవము అవుతుంది:

విశ్వసించటం మరియు ఆచరించటం తప్పనిసరి అయిన లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థములోంచిది: తీర్పు మరియు శాసనం ఒక్కడైన అల్లాహ్ హక్కు. కావున వ్యవహారములలోంచి ఏ వ్యవహారములో (అయిన) అల్లాహ్ ధర్మశాస్త్రమునకు విరుద్ధమైన ఎటువంటి చట్టమును ప్రవేశపెట్టటం మానవులలోంచి ఎవరికి సమ్మతం కాదు. మరియు అల్లాహ్ అవతరింపజేసిన దానిని కాకుండా ఇతర వాటితో తీర్పునివ్వటం ఏ ముస్లింనకూ సమ్మతం కాదు. మరియు అల్లాహ్ ధర్మశాసనమునకు విరుద్ధమైన తీర్పును ఇష్టపడటం అతనికి సమ్మతం కాదు. మరియు అల్లాహ్ నిషేధించిన వాటిని హలాల్ (సమ్మతం) చేసుకోవటం లేదా అల్లాహ్ హలాల్ చేసిన వాటిని నిషేధించుకోవటం ఎవ్వరికి సమ్మతం కాదు. ఎవరైతే ఇలా ఉద్దేశపూర్వకంగా విరుద్ధంగా చేస్తాడో లేదా దాన్ని ఇష్టపడుతాడో అతడు అల్లాహ్ ను తిరస్కరించాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ప్రకారం తీర్పు చెయ్యరో వారే అవిశ్వాసులు. [అల్ మాయిదా: 44]

***

 అల్లాహ్ ప్రవక్తలను ఇచ్చి పంపించిన కార్యచరణ:

ప్రజలను తౌహీద్ వాక్కు అయిన లా ఇలాహ ఇల్లల్లాహ్ వైపు మరియు అది సూచించిన ఆచరణ వైపు పిలవటం. అది ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయటం మరియు సృష్టితాల ఆరాధన చేయటం నుండి మరియు వాటి శాసనాల నుండి వైదొలగి ఎటువంటి సాటి లేని ఒక్కడైన సృష్టికర్త ఆరాధన వైపుకు మరియు ఆయన ధర్మశాసనం వైపుకు మరలటం.

మరియు దివ్యఖుర్ఆన్ ను యోచనతో పఠించి గుడ్డి అనుకరణ నుండి దూరంగా ఉన్న వాడికి మేము స్పష్టంగా తెలియపరచినది వాస్తవమని పూర్తిగా అర్థమవుతుంది. మరియు అల్లాహ్ పరిశుద్ధుడైన తనతో మరియు సృష్టితాలతో మానవుని అనుబంధమును నిర్ణయించాడని తెలుసుకుంటాడు. విశ్వాసపరుడైన తన దాసుడు తనతో ఏ విధంగా అనుబంధం కలిగి ఉండాలని ఆదేశించాడంటే ఆరాధన యొక్క అన్నీ రకములను ఆయన కోసం ప్రత్యేకిస్తూ ఆరాధించాలి. వాటిలో నుండి దేనిని కూడా ఇతరుల కొరకు చేయకూడదు. మరియు దైవప్రవక్తలతో, అల్లాహ్ పుణ్య దాసులతో అనుబంధము ఎలా చేశాడంటే వారి పట్ల ప్రేమను మరియు వారిని అనుసరించటమును పరిశుద్ధుడైన, మహోన్నతుడైన తనను ప్రేమించటమునకు అనుసరణగా చేశాడు. మరియు అతని సంబంధము తన శతృవులైన అవిశ్వాసపరులతో వారిపట్ల ద్వేషమును కలిగి ఉండటంగా చేశాడు. ఎందుకంటే అల్లాహ్ వారిని ద్వేషిస్తాడు. మరియు దానితో పాటు అతడు వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించాలని మరియు దాన్ని వారి ముందు స్పష్ట పరచాలని తద్వారా వారు సన్మార్గం పొందుతారని ఆదేశించాడు. వారు ఇస్లాంను నిరాకరించి, అల్లాహ్ ఆదేశమును శిరసావహించటం నుండి విముఖత చూపినప్పుడు ముస్లింలు వారితో ధర్మపోరాటము చేయాలి. చివరికి ఎటువంటి ఉపద్రవం లేకుండా ధర్మమంతా అల్లాహ్ కొరకు ప్రత్యేకమైపోవాలి. ఇది తౌహీద్ వాక్కు అయిన లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థము. దాన్ని అర్థం చేసుకుని.దాని ప్రకారం ఆచరించటం ఒక ముస్లింపై తాను వాస్తవ ముస్లిం అవుటకు తప్పనిసరి.

 ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం యొక్క అర్థం.

         ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యం పలకటం యొక్క అర్థం ఏమిటంటే అల్లాహ్ ప్రవక్త అయిన ముహమ్మద్ ప్రజలందరి వైపుకు పంపించబడిన ప్రవక్త అని తెలుసుకుని విశ్వసించాలి. మరియు ఆయన ఒక దాసుడు, ఆయన ఆరాధన చేయబడదు మరియు ఆయన తిరస్కరించబడని ఒక ప్రవక్త. అంతే కాదు ఆయనకు విధేయత చూపబడును మరియు ఆయనను అనుసరించబడును. ఆయనను అనుసరించినవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఆయనకు అవిధేయత చూపినవాడు నరకంలో ప్రవేశిస్తాడు. అల్లాహ్ ఆదేశించిన ఆరాధనల ధర్మశాసనాల విషయంలో లేదా వివిధ రంగాలలో ఉన్న ఆదేశాల, శాసనాల వ్యవస్థలో గాని లేదా హలాల్, హరామ్ చేసే విషయంలో గాని ధర్మశాసనాలను పొందటం అనేది ఈ పవిత్ర ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంతో మాత్రమే (సాధ్యం) అని తెలుసుకుని విశ్వసించటం. ఎందుకంటే ఆయన అల్లాహ్ ధర్మశాసనములు ఇచ్చి పంపించబడ్డ దైవ ప్రవక్త . కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గంతో కాకుండా ఇతరుల మార్గంతో వచ్చిన ధర్మశాసనాలను స్వీకరించటం ఏ ముస్లింనకు సమ్మతం కాదు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

దైవప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని మీరు పుచ్చుకోండి. ఆయన మిమ్మల్ని వారించిన దాన్ని వదిలివేయండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు. [అల్ హష్ర్: 7]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దాని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు! [అన్నిసా: 65]

రెండు ఆయతుల అర్థం:

అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన వాటన్నిటిలో మరియు ఆయన వారించిన వాటన్నిటి నుండి ఆగిపోవటంలో ఆయనను అనుసరించమని మొదటి ఆయతులో ముస్లిములకు ఆదేశించాడు. ఎందుకంటే ఆయన అల్లాహ్ ఆదేశించిన వాటినే ఆదేశించారు. ఆయన వారించిన వాటినే ఆయన వారించారు.

రెండవ ఆయతులో పరిశుద్ధుడైన అల్లాహ్ తన స్వయముపై ప్రమాణం చేసి ఇలా పలుకుతున్నాడు ఏ వ్యక్తి తనకు మరియు ఇతరులకు మధ్య ఉన్న తగాదాల [24] విషయంలో దైవప్రవక్తను న్యాయ నిర్ణేతగా ఉంచుకుని ఆ తరువాత ఆయన తీర్పును అది అతనికి అనుగుణంగా ఉన్నా లేదా అతనికి వ్యతిరేకంగా ఉన్నా సంతృప్తి చెందనంత వరకు అల్లాహ్ పై, ఆయన ప్రవక్త పై అతని విశ్వాసము సరియైనది కాదు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ‘ఎవరైతే మా ఆదేశాలలో లేని వాటిని ఆచరిస్తాడో అవి తిరస్కరించబడుతాయి.[25]

***

 నిదాఉ – పిలుపు:

         ఓ బుద్ది జీవుడా నీవు లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదు ర్రసూలుల్లాహ్ అర్థము తెలుసుకుంటే మరియు ఈ సాక్ష్యము ఇస్లాం తాళమని మరియు అది నిర్మితమైన పునాది అని తెలుసుకుంటే నీవు ఇహపరాల్లో శుభమును పొందటానికి మరియు నీవు మరణాంతరం అల్లాహ్ శిక్ష నుండి విముక్తి పొందటానికి నీవు స్వచ్ఛమైన మనస్సుతో అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వఅష్హదు అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్ అని పలికి ఈ సాక్ష్యము అర్థము ప్రకారం ఆచరించు.

మరియు ఇస్లాం యొక్క మిగిలిన మూలస్తంభములపై ఆచరణతోనే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు ర్రసూలుల్లాహ్ అని సాక్ష్యం పలకటం పూర్తి అవుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ పట్ల నిజాయితీగా చిత్తశుద్ధితో వాటిని నిర్వర్తించటం ద్వారా తనను ఆరాధన చేయటం కొరకు అల్లాహ్ ముస్లింపై ఈ మూలస్తంభాలను విధిగావించాడు. ఎవరైన ఎటువంటి షరయీ కారణం లేకుండా వాటిలో నుండి ఏ ఒక్కటిని వదిలివేసినా అతడు లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థమును ఖాళీగా వదిలేశాడు. మరియు అతని సాక్ష్యము సరైనదిగా పరిగణించబడదు.

***

 ఇస్లాం మూలస్తంభముల్లోంచి రెండవది (నమాజు):

         ఓ బుద్ది జీవుడా నమాజు ఇస్లాం మూలస్తంభముల్లోంచి రెండవది అని తెలుసుకో. అది రేయింబవళ్ళలో ఐదుపూటల నమాజు. అల్లాహ్ తనకు మరియు ముస్లింనకు మధ్య అనుబంధము ఉండటానికి ధర్మబద్ధం చేశాడు. అతడు అందులో ఆయనతో సంభాషిస్తాడు మరియు ఆయనను అర్ధిస్తాడు. మరియు ముస్లింను సిగ్గుమాలిన కార్యాల నుండి మరియు చెడుల నుండి అది నిర్మూలించేదిగా అవటానికి (ధర్మ బద్దం చేసాడు). కాబట్టి ఇహపరాల్లో అతనికి శుభమును కలిగించే మానసిక మరియు శారీరక సుఖము అతనికి లభించును.

         మరియు నమాజు కొరకు శరీర, వస్త్రముల మరియు నమాజు చదివే ప్రదేశము పరిశుద్ధతను అల్లాహ్ ధర్మబద్ధం చేశాడు. కావున ముస్లిం తన శరీరమును ఇంద్రియ అపవిత్రత నుండి మరియు తన హృదయమును నైతిక అపవిత్రత నుండి శుభ్రపరచటానికి మూత్రము, మలం లాంటి మాలిన్యములను శుభ్రమైన నీటితో శుభ్రపరచుకుంటాడు.

మరియు నమాజు ధర్మం యొక్క స్తంభము. మరియు షహాదతైన్ తరువాత అత్యంత ముఖ్యమైన మూలస్తంభము. ఒక ముస్లిం తాను వయోజనుడు అయిననాటి నుండి మరణించే వరకు దాన్ని పరిరక్షించటం తప్పనిసరి. మరియు తన ఇంటివారిని మరియు తన సంతానమును వారు ఏడు సంవత్సరాల వయస్సుకు చేరినప్పటి నుండి వారు దానికి అలవాటు పడటానికి దాని గురించి ఆదేశించటం తప్పనిసరి.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది.

 [అన్నిసా: 103]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు                      జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము".

[అల్ బయ్యినహ్: 5]

రెండు వచనాల సంక్షిప్త అర్థం:

1)     మొదటి ఆయతులో నమాజు విశ్వాసపరులపై ఒక ఆవశ్యక విధి అని మరియు వారు దాని నిర్ణీత సమయంలో దాన్ని నిర్వర్తించాలని తెలియపరచాడు.

2)     మరియు రెండవ ఆయతులో అల్లాహ్ తాను ప్రజలకు ఆదేశించినది మరియు ఆయన వారిని దేని కొరకు సృష్టించాడో అది వారు ఆయన ఒక్కడిని ఆరాధించటం అని మరియు వారు తమ ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించటం అని మరియు నమాజ్ నెలకోల్పడం అని మరియు హక్కుదారులకు జకాత్ చెల్లించడం అని తెలియపరచాడు.

మరియు నమాజు చదవటం ముస్లిం పై అన్నీ పరిస్థితులలో చివరికి భయాందోళన, అనారోగ్య స్థితి అయిన తప్పనిసరి. నిశ్చయంగా అతను తన శక్తి మేరకు నిలబడి గాని లేదా కూర్చుని గాని లేదా పడుకుని గాని నమజు చేయాలి. చివరికి అతను తన కళ్ళతో లేదా తన మనస్సుతో సైగతో తప్ప చేయలేకపోతే అతను సైగతో నమాజు చదవాలి. నమాజును వదిలే పురుషుడైనా లేదా స్త్రీ అయినా ముస్లిం కాడని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరచారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము నమాజు. దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు. [26]

ఐదుపూటల నమాజులు అవి:

ఫజర్ నమాజు, జుహర్ నమాజు, అసర్ నమాజు, మగ్రిబ్ నమాజు, ఇషా నమాజు.

v  ఫజర్ నమాజు సమయం తూర్పున ఉదయపు కాంతి బహిర్గతం అయినప్పటి నుంచి మొదలై సూర్యోదయం వరకు ఉంటుంది. దాన్ని చివరి వేళ వరకు ఆలస్యం చేయటం సమ్మతం కాదు.

v  మరియు జుహర్ నమాజు సమయం సూర్యుడు మిట్టమధ్యాహ్నం వాలినప్పటి నుండి మొదలై ప్రతీ వస్తువు యొక్క నీడ దానంత అయ్యే వరకు ఉంటుంది.

v  మరియు అసర్ నమాజు సమయం జుహర్ సమయం ముగిసిన తరువాత మొదలై సూర్యుడు పసుపు రంగులో మారేవారకు ఉంటుంది. మరియు దాన్ని చివరి వేళ వరకు ఆలస్యం చేయటం సమ్మతం కాదు. కాని సూర్యుడు స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్నంత వరకు నమాజు చేసుకోవాలి.

v  మరియు మగ్రిబ్ నమాజు సమయం సూర్యాస్తమయం తరువాత మొదలై సంధ్యారుణిమ ఎర్రదనం అదృశ్యమయ్యే వరకు ఉంటుంది. మరియు దాన్ని చివరి సమయం వరకు ఆలస్యం చేయటం సమ్మతం కాదు.

v  మరియు ఇషా సమయం మగ్రిబ్ సమయం ముగిసిన తరువాత మొదలై చివరి రాత్రి వరకు ఉంటుంది. దాని తరువాత ఆలస్యం చేయకూడదు.

ఒక వేళ ముస్లిం ఎటువంటి షరయీ ఆటంకం లేకుండా ఏ ఒక్క నమాజును దాని వేళ నుండి ఆలస్యం చేసి చదివినా అతడు పెద్ద పాపమును ఒడిగట్టినట్లే. అతడు అల్లాహ్ తో తౌబా చేయాలి. మరల అలా చేయకూడదు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఆ నమాజీలకు వినాశనం తప్పదు.(4) ఎవరైతే తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారో. (5)

[అల్ మాఊన్: 4, 5]

***

 నమాజు ఆదేశాలు: -

మొదట పరిశుద్ధత పాటించటం:

ఒక ముస్లిం నమాజు చేయటం ఆరంభించక ముందు పరిశుద్ధతను పాటించటం తప్పనిసరి. కాబట్టి అతను మొట్టమొదట తన మర్మావయవాలను ఒక వేళ వాటి నుండి మూత్రం గాని లేదా మలం గాని వెలువడితే పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత వుజూ చేయాలి.

మరియు వుజూ: మనస్సులో పరిశుద్ధతను గురించి సంకల్పించుకోవాలి. సంకల్పమును ఉచ్చరించకూడదు. ఎందుకంటే దాని గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడు దాన్ని పలకలేదు. మరియు బిస్మిల్లాహ్ అని పలకాలి. ఆ తరువాత పుక్కిలించాలి. ఆ తరువాత నీటిని ముక్కులో పీల్చి దాన్ని శుభ్రపరచాలి. ఆ తరువాత పూర్తి ముఖమును కడగాలి. ఆ తరువాత రెండు చేతులను కుడి వైపు నుంచి ప్రారంభిస్తూ మోచేతుల సమేతంగా కడగాలి. ఆ తరువాత పూర్తి తలను చేతులతో మసహ్ చేయాలి. మరియు చెవులను మసహ్ చేయాలి. ఆ తరువాత కాళ్ళను కుడి వైపు నుండి ప్రారంభిస్తూ మడమలతో సహా కడగాలి.

మరియు పరిశుద్ధతను పొందిన తరువాత మనిషి నుండి మూత్రము లేదా మలము లేదా గాలి విసర్జన జరిగితే లేదా నిదుర వలన లేదా మతిస్థిమితం కోల్పోవటం వలన బుద్ధి కోల్పోయిన అతను నమాజు చేయదలచినప్పుడు మరల పరిశుద్ధతను పాటించాలి. ఒక వేళ పురుషునికి లేదా స్త్రీకి నిద్రావస్థలో లేదా మేల్కొని ఉన్నప్పుడు కామంతో వీర్యస్ఖలనం వలన అశుద్ధావస్థకు లోనైతే అతను తన పూర్తి శరీరమును గుసులె జనాబత్ ద్వారా పరిశుభ్రతను కలిగించాలి. మరియు స్త్రీ ఋతుస్రావం నుండి పురుటి రక్తం నుండి పరిశుభ్రతను పొందిన తరువాత ఆమె తన పూర్తి శరీరమును గుసుల్ తో శుభ్రపరచుకోవాలి. ఎందుకంటే ఋతుస్రావమునకు, పురిటిస్రావమునకు గురి అయిన స్త్రీలు నమాజు చదవటం సరికాదు. వారు పరిశుభ్రతను పాటించనంతవరకు వారిపై నమాజు విధికాదు. కావున అల్లాహ్ వారికి అనుమతిస్తూ ఋతుస్రావము, పురిటిస్రావము దినములలో కోల్పయిన నమాజు ఖజా చేసే ఆదేశమును వారిపై నుండి తొలగించాడు. ఇక ఇతర కారణముల చేత వదిలిన నమాజును వారు పురషుల వలె ఖజా చేయటం వారి పై తప్పనిసరి.

నీరు లభించకపోయిన లేదా దాన్ని వాడటం వలన తనకు హాని కలుగుతుంటే ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడు నిశ్చయంగా అతడు తయమ్ముమ్ ద్వారా పరిశుద్ధతను పొందవచ్చు. తయమ్ముమ్ పధ్ధతి: మనస్సులో పరిశుద్ధతను పాటించే సంకల్పం చేసుకొని బిస్మిల్లాహ్ పలకాలి. ఆ తరువాత చేతులను మట్టిపై ఒక సారి కొట్టి వాటితో ముఖముపై మసహ్ చేసుకోవాలి. ఆ తరువాత కుడి చేయి ఉపరితలంపై ఎడమ చేతి అంతరభాగముతో మరియు ఎడమ చేయి ఉపరితలంపై కుడి చేయి అంతరభాగముతో మసహ్ చేయాలి. ఇలా చేయటం వలన పరిశుద్ధత పూర్తవుతుంది. ఈ తయమ్ముమ్ ఋతుస్రావమునకు, పురిటిస్రావమునకు గురి అయి పరిశుభ్రత పొందిన స్త్రీలకు మరియు అశుద్ధావస్థకు లోనయిన వారికి నీరు లభించనప్పుడు లేదా దాన్ని వాడటం వలన హాని కలిగే భయం ఉన్నప్పుడు వుజూ చేయదలచిన వారి కొరకు ఉంటుంది.

రెండవది: నమాజు పధ్ధతి

1)     ఫజర్ నమాజు:

v  రెండు రకాతులు ఎలాగంటే ముస్లిం పురుషుడైన లేదా స్త్రీ అయిన మక్కాలోని మస్జిదె హరాంలో ఉన్నటువంటి కాబా అయిన ఖిబ్లా వైపు అభిముఖమై నిలబడాలి. మరియు ఫజర్ నమాజ్ చదవాలని మనస్సులో సంకల్పించుకోవాలి. సంకల్పమును ఉచ్చరించకూడదు.

v  ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ తక్బీర్ చదవాలి. ఆ తరువాత ఇస్తిఫ్తాహ్ దుఆ చదవాలి. అది "సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక, వతబారకస్ముక, వతఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" ఆ తరువాత అఊజుబిల్లాహి మినష్షైతానిర్రజీమ్ చదివి ఫాతిహా సూరా చదవాలి. అది:

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్రహీమ్, మాలికియౌమిద్దీన్, ఇయ్యాకనాబుదు వఇయ్యాకనస్తయీన్, ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్తఅలైహిమ్, గైరిల్ మగ్జూబి అలైహిమ్ వలజ్జాల్లీన్.

(అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో[27] స్థుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు తీర్పుదినానికి స్వామి మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీతోనే సహాయాన్ని అర్థిస్తున్నాము. మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.)

[అల్ ఫాతిహ: 1-7]

సామర్థ్యం ఉంటే ఖుర్ఆన్ పఠనము తప్పనిసరిగా అరబి భాషలో చేయాలి. ఆ తరువాత "అల్లాహు అక్బర్" అని పలికి తలను, వీపును వంచుతూ రకూ చేయాలి. అరచేతులను మోకాళ్ళపై ఉంచాలి. ఆ తరువాత "సుబ్హాన రబ్బియల్ అజీమ్" అని పలకాలి, ఆ తరువాత "సమిఅల్లాహులిమన్ హమిదహ్" అని పలుకుతూ పైకి లెగాలి. తిన్నగా నిలబడినప్పుడు "రబ్బనా వలకల్ హమ్ద్" అని పలకాలి. ఆ తరువాత "అల్లాహు అక్బర్" అని పలికి రెండు కాళ్ళ చివర్లను, మోకాళ్ళను, రెండు చేతులను, నుదుటను, ముక్కును నేలపై ఆనిస్తు సజ్దా చేయాలి. ఆ తరువాత సజ్దాలో "సుబ్హాన రబ్బియల్ ఆలా" అని పలకాలి. ఆ తరువాత "అల్లాహు అక్బర్" అని పలుకుతూ కూర్చోవాలి. కూర్చున్నప్పుడు "రబ్బిగ్ఫిర్లీ" అని చదవాలి. ఆ తరువాత "అల్లాహు అక్బర్" అని పలికి నేల పై రెండోసారి సజ్దా చేయాలి. మరియు "సుబ్హాన రబ్బియల్ ఆలా" అని పలకాలి. ఆ తరువాత "అల్లాహు అక్బర్" అని పలుకుతూ నిలబడాలి. ఆ తరువాత సూరె ఫాతిహా చదవాలి. అది (అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్) దాని చివరి వరకు మొదటి రకాత్ లో ముందు ప్రస్తావించబడినట్లు. ఆ తరువాత తక్బీర్ చదివి రుకూ చేయాలి. ఆ తరువాత లెగాలి. ఆ తరువాత సజ్దా చేయాలి. ఆ తరువాత కూర్చోవాలి. ఆ తరువాత మొదటి రకాత్ లో చదివినటువంటి వాటిని ఈ స్థానములలో పలుకుతూ రెండవసారి సజ్దా చేయాలి.

v  ఆ తరువాత కూర్చుని ఇలా పలకాలి "అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదివ్వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదివ్వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్" సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు సద్వర్తనులైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, ఓ అల్లాహ్! నీవు ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబీకులపై శాంతిని కురిపించు ఎలాగైతే నీవు ఇబ్రాహీము మరియు ఇబ్రహీము కుటుంబీకులపై శాంతిని కురిపించావో, నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు. ఓ అల్లాహ్! నీవు ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబీకులపై శుభాలు కురిపించు. ఎలాగైతే నీవు ఇబ్రహీము మరియు ఇబ్రహీము కుటుంబీకులపై శుభాలు కురిపించావో, నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు. ఆ తరువాత "అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్" అని పలుకుతూ కుడివైపుకు ముఖమును త్రిప్పాలి. ఆ తరువాత "అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్" అని పలుకుతూ ఎడమ వైపుకు ముఖమును త్రిప్పాలి. ఇలా ఫజర్ నమాజు పూర్తవుతుంది.

2)     ఇక జుహర్, అసర్ మరియు ఇషా నమాజులు:

v  వాటిలో నుంచి ప్రతీ నమాజు నాలుగు రకాతులు. మొదటి రెండు రకాతులు ఫజర్ రెండు రకాతులు చదివినట్లు చదవాలి. కాని రెండు రకాతుల తరువాత తషహ్హుద్ కొరకు కూర్చుని సలాం తిరగక ముందు చదవవలసినవి చదివి సలాం తిరగకుండా లేచి నిలబడాలి. మొదటి రెండు రకాతుల వలె రెండు రకాతులను చదివి ఆ తరువాత రెండవసారి తషహ్హుద్ కొరకు కూర్చోవాలి. మరియు మొదట కూర్చున్నప్పుడు చదివిన వాటిని చదవాలి. మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ చదవాలి. ఆ తరువాత ఫజర్ నమాజులో సలాం తిరిగినట్లు కుడివైపున సలాం తిరగాలి. ఆ తరువాత ఎడమవైపు సలాం తిరగాలి.

3)     ఇక మగ్రిబ్ నమాజు:

v  అది మూడు రకాతులు. మొదటి రెండు రకాతులు ముందు ప్రస్తావించినట్లు చదవాలి. ఆ తరువాత కూర్చుని ఇతర నమాజులలో చదివినవి చదవాలి. కాని సలాం తిరగకూడదు. ఇంకా నిలబడి మూడవ రకాతును చేయాలి. అందులో ముందు చేసినట్లు, చదివినట్లు చేయాలి, చదవాలి. ఆ పిదప రెండవ సజ్దా చేసిన తరువాత కూర్చోవాలి. ప్రతీ నమాజులో తషహ్హుద్ లో చదివినవి చదవాలి. ఆ తరువాత కుడివైపుకు సలాం తిరగాలి ఆ తరువాత ఎడమవైపుకు తిరగాలి. రకూలో, సజ్దాలో చదివే వాటిని పదేపదే చదవటం మంచిది.

పురుషులు ఈ ఐదు పూటల నమాజులను జమాఅత్ తో మస్జిదులో చదవటం తప్పనిసరి. వారిలో నుంచి ఖుర్ఆన్ ను మంచిగా చదివేవారు, నమాజు గురించి అవగాహన కలిగిన వారు, ధర్మం గురించి బాగా అవగాహన కలిగిన వారు ఇమామత్ చేయాలి. మరియు ఫజర్ నమాజులో, మగ్రిబ్, ఇషా నమాజుల మొదటి రెండు రకాతులలో ఇమామ్ ఖుర్ఆన్ పారాయణంను బిగ్గరగా చేయాలి. మరియు వెనుక ఉన్నవారు అతన్ని వినాలి.

మరియు స్త్రీలు ఇండ్లలో పూర్తి పరదాతో, సంరక్షణతో నమాజును చేయాలి. వారు ముఖం తప్ప మిగిలిన శరీరమంతా చివరకు కాళ్ళు, చేతులను కప్పుకోవాలి. ఎందుకంటే ముఖము తప్ప అవన్ని కప్పవలసిన అవయవములు. స్త్రీ పురుషుల నుండి వేరై నమాజు చేయవలసినదిగా ఆదేశించబడినది. ఎందుకంటే అది ఫిత్నా. దానితో ఆమె గుర్తించబడి బాధింపబడవచ్చు. ముస్లిం స్త్రీ మస్జిదులో నమాజు చేయదలచుకుంటే ముసుగు ధరించి, సువాసన వెదజల్లే వాటిని పూసుకోకుండా వెళ్ళటానికి అనుమతి ఉంది. మరియు ఆమె పురుషుల వెనుక పంక్తుల్లో నమాజు చదవాలి. ఆమె వారిని ఫిత్నాకి గురి చేయకుండా ఉండటానికి మరియు ఆమె వారితో ఫిత్నాకి గురికాకుండా ఉండటానికి.

ఒక ముస్లిం నమాజును వినయ, నిమమ్రతతో, హృదయపూర్వకంగా అల్లాహ్ కొరకు చేయడం తప్పనిసరి. మరియు అతడు తన నిలబడటమును, రుకూ చేయటమును, సజ్దా చేయటమును ప్రశాంతంగా చేయాలి. తొందరపడకూడదు. మరియు పనికిరాని పనులు చేయకూడదు. ఆకాశం వైపుకు కళ్ళెత్తి చూడకూడదు. మరియు ఖుర్ఆన్ తప్ప వేరేవాటిని చదవకూడదు. నమాజ్ యొక్క దుఆలు వాటి స్థానములో చదవాలి [28]. ఎందుకంటే అల్లాహ్ తన స్మరణ కొరకు నమాజు గురించి ఆదేశించాడు.

జుమా దినమున ముస్లిములు రెండు రకాతులు జుమా నమాజు పాటించాలి. అందులో ఇమామ్ ఖుర్ఆన్ పారాయణమును ఫజర్ నమాజు వలె బిగ్గరగా చేయాలి. మరియు నమాజు ముందు రెండు ఖుత్బాలను ఇవ్వాలి. వాటిలో ముస్లిములకు హితభోదన చేయాలి. మరియు వారికి ధర్మము యొక్క విషయములు నేర్పించాలి. జనం ఇమామ్ తో పాటు దానిలో హాజరు అవటం తప్పనిసరి. అది జుమా రోజు జుహర్ నమాజు అవుతుంది.

***

 ఇస్లాం మూలస్తంభముల్లోంచి మూడవది (జకాతు)

మరియు ధర్మార్ధము తీయు భాగమునకు [29] చేరిన సంపద యజమాని అయిన ప్రతీ మస్లిం ప్రతీ సంవత్సరం తన సంపద నుండి జకాత్ తీయాలని అల్లాహ్ ఆదేశించాడు. అది నిరుపేదలకు ఇతరులకు ఎవరికైతే జకాత్ సొమ్ము ఇవ్వవలసినదో దాని హక్కుదారులకు ఖుర్ఆన్ లో స్పష్టపరచిన విధంగా ఇవ్వవలెను.

బంగారము యొక్క నిసాబ్ ఏడున్నర తులాలు మరియు వెండి నిసాబ్ యాభై రెండున్నర తులాలు. లేదా వాటికి సమానమైన కరెన్సి మరియు వ్యాపారపు సామగ్రిలో కూడా అది నిసాబ్ కు చేరి దానిపై ఒక సంవత్సరం గడిచిపోతే వాటి యజమానిపై వాటిలో నుంచి జకాత్ తీయటం అనివార్యమవుతుంది. ధాన్యముల, ఫలాల నిసాబ్ మూడువందల సాలు. అమ్మటానికి సిద్ధం చేసి ఉంచిన భూమిలో దాని వెలలో జకాత్ చెల్లించాలి. అద్ది కొరకు సిద్ధం చేయబడిన భూమిలో దాని అద్దిలో జకాత్ చెల్లించాలి. బంగారం, వెండి మరియు వ్యాపారపు సామగ్రిలో జకాత్ పరిమాణం ప్రతీ సంవత్సరం నలభైయ్యొవ భాగము అంటే 2.5% చెల్లించాలి మరియు ధాన్యము మరియు ఫలాలలో జకాత్ ఒక వేళ అవి ఎటువంటి శ్రమ, కష్టం లేకుండా పండిస్తే ఉదాహరణకు కాలువల, ప్రవహించే సెలయేరుల లేదా వర్షం నీటితో పండిస్తే 10% జకాత్ చెల్లించాలి. మరియు శ్రమతో కష్టంతో పండిస్తే ఉదాహరణకు నీటి మోటర్ల ద్వారా పండిస్తే 5% జకాత్ చెల్లించాలి.

ధాన్యములు మరియు పండ్ల జకాత్ చెల్లించే సమయం కోతకోసే సమయం ఉంటుంది. ఒక వేళ సంవత్సరంలో రెండూ లేక మూడు సార్లు పంట కోస్తే కోసినప్పుడల్ల జకాత్ తీయవలెను. ఒంటెలు, ఆవులు, మేకల జకాత్ పరిమాణం గురించి ఫిఖా పుస్తకాల్లో స్పష్టంగా ఉన్నది. వాటిని చూసుకోవాలి.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని, నమాజ్ ను స్థాపించాలని మరియు జకాత్ ఇవ్వాలని. ఇదే సరైన ధర్మము".

 [అల్ బయ్యిన: 5]

జకాత్ చెల్లించటంలో పేదవారి మనస్సులను ఆనందపరచటం మరియు వారి అవసరాలను తీర్చటం మరియు వారికి మరియు ధనవంతులకు మధ్య ప్రేమ బంధాలను బలోపేతం చేయటం జరుగుతుంది.

ఇస్లాం ధర్మం సమిష్టి సహకారాన్ని మరియు ఆర్ధిక సహాయమును ముస్లింల మధ్య జకాత్ లో పరిమితం చేయలేదు. ఇంకా కరువు కాలములో పేదవారిని ఆదుకోవటమును ధనికులపై అనివార్యం చేశాడు. తన పొరుగు వారు పస్తులుండి తాను కడుపు నిండా తినటమును ముస్లిం పై నిషేధించాడు. మరియు ముస్లిం పై ఫిత్రాను అనివార్యం చేశాడు. దాన్ని అతడు ఈదుల్ ఫితర్ (రమజాన్ పండుగ) దినమున తీస్తాడు. అది ఊరిలో తినే ఆహారం నుండి ఒక సా ఆహారం ప్రతి మనిషి తరపు నుండి ఖచ్చితంగా తీయాలి చివరకు పిల్లల తరపు నుండి కూడా తీయాలి. సేవకుని తరపు నుండి అతని యజమాని తీయాలి. మరియు అల్లాహ్ ప్రమాణము యొక్క పరిహారమును [30] ముస్లింపై అనివార్యం చేశాడు. ఏదైన పని చేస్తానని ప్రమాణం చేసి ఆ పని చేయనప్పుడు పరిహారమును చెల్లించాలి. మరియు అల్లాహ్ ధర్మబద్ధం చేయబడిన మొక్కుబడులను పూర్తి చేయటమును ముస్లింపై అనివార్యం చేశాడు. మరియు అల్లాహ్ స్వచ్ఛంద దానధర్మాలను చేయటముపై ముస్లింను ప్రోత్సహించాడు. మరియు ఆయన మార్గంలో పుణ్య కార్యంలో ఖర్చు చేసే వారికి మంచి ప్రతిఫలం యొక్క వాగ్దానం చేశాడు. మరియు వారి కొరకు ప్రతిఫలమును రెట్టింపు చేస్తాడని వాగ్దానం చేశాడు. ఒక పుణ్యమును పది నుండి ఏడువందల వరకు ఇంకా అధికంగా రెట్టింపు చేస్తాడు.

***

 ఇస్లాం మూలస్తంభముల్లోంచి నాల్గవది (ఉపవాసములు):

రమజాను నెల ఉపవాసములు ఉండటం. అది హిజ్రీ సంవత్సర నెలల్లోంచి తొమ్మిదో నెల.

ఉపవాసములుండే విధానం:

ü  సుబ్హే సాదిఖ్ స్పష్టమవ్వక మునుపు (ఫజర్ కన్న ముందు) ఒక ముస్లిం ఉపవాసం ఉండటానికి సంకల్పించుకోవాలి.

ü  ఆ తరువాత అతడు సూర్యాస్తమయం వరకు తినటం నుండి, త్రాగటం నుండి సంభోగము - లైంగిక కలయిక - నుండి ఆగిపోవాలి.

ü  ఆ తరువాత ఉపవాసమును విరమించాలి.

ఇలా రమజాన్ మాసపు రోజులన్నీ చేయాలి. దీని ద్వారా అల్లాహ్ మన్నతను, ఆయన ఆరాధనను ఆశించాలి.

ఉపవాసముండటంలో లెక్కలేనన్ని ప్రయోజనాలు (లాభాలు) కలవు. అందులో ముఖ్యమైన ప్రయోజనాలు:

1)     అది అల్లాహ్ కొరకు ఆరాధన. మరియు ఆయన ఆదేశములను పాటించటం. దాసుడు తన కామ కోరికలను, తన తినటమును, తన త్రాగటమును అల్లహ్ కోసం వదిలివేస్తాడు, అది అల్లాహ్ యొక్క భీతి కారకాల్లోంచి పెద్దది.

2)     ఉపవాసం యొక్క ఆరోగ్య, ఆర్ధిక మరియు సామాజిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. నమ్మకముతో, విశ్వాసముతో ఉపవాసముండేవారు మాత్రమే వాటిని గుర్తిస్తారు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

{ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడిందో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} (183)

ఇది (ఈ ఉపవాసం) నిర్ణయించబడిన రోజులకు మాత్రమే. కానీ, మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై ఉంటే, లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో (ఆ ఉపవాసాలు) పూర్తి చేయాలి. కాని దానిని పూర్తి చేయటం దుర్భరమైన వారు పరిహారంగా, ఒక పేదవానికి భోజనం పెట్టాలి. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ మేలు చేయదలిస్తే, అది అతని మేలుకే! కాని మీరు తెలుసుకో గలిగితే ఉపవాసం ఉండటమే, మీకు ఎంతో ఉత్తమమైనది. (184)

 రమజాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాసముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైన వాడు, లేక ప్రయాణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినాలలో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు మీరు అల్లాహ్ మహనీయతను (ఘనతను) కొనియాడటానికి. మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి! (185)

[అల్ బఖరా: 183-185]

***

దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ తఆలా మరియు హదీసులలో ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టపరచిన ఉపవాస ఆదేశములు.

1)     వ్యాధిగ్రస్తుడు, ప్రయాణికుడు ఇద్దరు ఉపవాసములను వదలవచ్చు. వదిలివేసిన ఉపవాసములను రమజాన్ తరువాత వేరే దినములలో పూర్తి చేసుకోవాలి. ఋతుస్రావమునకు, పురిటిస్రావమునకు గురి అయిన స్త్రీలు ఉపవాసముండటం సరి కాదు. వారు ఋతుస్రావ దినములలో, పురిటి స్రావ దినములలో ఉపవాసమును వదిలివేయాలి. వారు వదిలేసిన ఉపవాసములను ఇతర దినములలో పూర్తి చేసుకోవాలి.

2)     మరియు ఇదే విధంగా గర్భిణీలు మరియు పాలుపట్టే స్త్రీలు తమ స్వయంపై లేదా తమ సంతానముపై భయపడినప్పుడు వారు ఉపవాసమును వదిలివేసి వాటి ఖజా చేయాలి.

3)     ఒక వేళ ఉపవాసి మరిచిపోయి తింటే లేదా త్రాగితే ఆ తరువాత అతనికి గుర్తువస్తే అతని ఉపవాసము సరిఅయినదే. ఎందుకంటే అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతివారి కొరకు మరచిన దాన్ని, పొరపాటును, బలవంతమును మన్నించివేశాడు. మరియు అతడు తన నోటిలో ఉన్న దాన్ని తీసివేయాలి.

***

 ఇస్లాం మూలస్తంభముల్లోంచి ఐదవది (హజ్)

అది జీవితంలో ఒక సారి అల్లాహ్ పవిత్ర గృహపు హజ్ చేయటం. దాని కన్నా ఎక్కువసార్లు చేస్తే అది నఫిల్ అవుతుంది. హజ్ లో లెక్కలేనన్ని ప్రయోజనాలు కలవు.

మొదటిది: అది ఆత్మ, శరీరం, డబ్బుతో అల్లాహ్ కొరకు ఆరాధన చేయటం.

రెండవది: అందులో అన్నీ ప్రాంతముల ముస్లిములు సమావేశమవటం జరుగును. వారు ఒకే స్థలంలో కలుస్తారు. మరియు ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. ఒకే సమయంలో ఒకే ప్రభువును ఆరాధిస్తారు. యజమానికి, బానిసకు మరియు ధనికునికి, పేదవానికి మరియు తెల్లవారికి, నల్లవారికి మధ్య వ్యత్యాసం ఉండదు. అందరు అల్లాహ్ సృష్టి మరియు ఆయన దాసులు. ముస్లిముల కొరకు పరిచయాలు, సహాయసహకారాలు లభించును. మరియు వారు అల్లాహ్ వారందరిని మరల లేపి లెక్క తీసుకోవటం కొరకు ఒకే ప్రాంతములో సమీకరించే రోజును గుర్తు చేసుకుంటారు. కావున వారు మరణాంతర జీవితం కొరకు అల్లాహ్ విధేయతతో సిద్ధం అవుతారు.

ముస్లిముల ఖిబ్లా అయిన కాబా చుట్టు ప్రదక్షిణ చేయటము యొక్క ఉద్దేశము, దైనివైపైతే అల్లాహ్ అన్నీ నమాజులలో వారు ఎక్కడ ఉన్నా వారిని అభిముఖమవమని ఆదేశించాడో మరియు మక్కాలో కల ఇతర ప్రాంతములలో వాటి కొరకు నిర్ణయించబడిన సమయములలో ఆగే ఉద్దేశము. అవి అరఫాత్ మరియు ముజ్దలిఫా మరియు మినాలో బస చేయటం. వీటి ఉద్దేశము ఈ పరిశుద్ధ ప్రదేశాలలో అల్లాహ్ ఆదేశించిన విధంగా అల్లాహ్ ఆరాధన చేయటం.

ఇక స్వయంగా కాబా మరియు ఈ ప్రదేశాలు మరియు సృష్టిరాసులన్ని ఆరాధించబడవు. అవి లాభం చేకూర్చలేవు మరియు నష్టం కలిగించలేవు. ఆరాధన మాత్రం ఒక్కడైన అల్లాహ్ కొరకే. మరియు ఒక్కడైన అల్లాహ్ యే లాభం కలిగించేవాడు నష్టం కలిగించేవాడు. ఒక వేళ అల్లాహ్ బైతుల్లాహ్ హజ్ చేయటమును ఆదేశించకుండా ఉంటే ముస్లింకు హజ్ చేయటం సమ్మతమయ్యేది కాదు. ఎందుకంటే ఆరాధన తోచిన విధంగా చేయటం జరగదు. అది అల్లాహ్ తన గ్రంథంలో లేదా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ లో ఆదేశించిన విధంగా చేయాలి.

అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు:

మరియు అల్లాహ్ కొరకు ప్రజలపై దైవగృహ సందర్శన హజ్జ్ స్తోమత కలిగి ఉన్నవారు చేయవలసి ఉంది;మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు.

[ఆలే ఇమ్రాన్: 97]

మరియు జీవితంలో ఒక సారి ఉమ్రా చేయటం అది హజ్ తో పాటు అయిన లేదా ఇతర సమయంలో అయిన చేయటం ప్రతీ ముస్లింపై తప్పనిసరి. మరియు మదీనాలో ఉన్న మస్జిదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదును సందర్శించటం హజ్ లో లేదా వేరే సమయములలో తప్పనిసరి కాదు. అది ముస్తహబ్ కార్యము. అది చేసినవారికి పుణ్యము లభించును. వదిలిన వారు శిక్షింపబడరు. ఇక ఈ హదీసు "ఎవరైతే హజ్ చేసి నన్ను సందర్శించరో వారు నాపై దుర్మార్గమునకు పాల్పడ్డారు" ప్రామాణికమైనది కాదు. అందులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అబద్దమును ఆపాదించటం జరిగినది [31].

మరియు మస్జిదె నబవీ జియారత్ కొరకు చేసే ప్రయాణమునకు అనుమతి ఉంది. జియారత్ చేసే వ్యక్తి అక్కడ చేరుకున్న తరువాత అందులో రెండు రకాతులు తహియ్యతుల్ మస్జిద్ నమాజు చదవాలి. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించటానికి అనుమతి ఉన్నది. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై వినయంగా నెమ్మదిగా "అస్సలాము అలైకుమ్ యా రసూలల్లాహ్" అని పలుకుతూ సలాం చేయాలి. ఆయనతో ఏమీ ఆశించకూడదు. కాని సలాం చేసి మరలిపోవాలి ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జాతి వారిని ఆదేశించారో మరియు ఆయన సహచరులు రజియల్లాహు అన్హుమ్ ఎలా చేశారో ఆ విధంగా.

ఇక ఎవరైతే నమాజులో నిలబడినట్లు వినయంతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్ద నిలబడుతారో మరియు ఆయనతో తమ అవసరాలను కోరుతారో లేదా ఆయనతో మొర పెట్టుకుంటారో లేదా అల్లాహ్ వద్ద ఆయనను మధ్యవర్తిగా చేసుకుంటారో వారందరు అల్లాహ్ తోపాటు సాటి కల్పించేవారు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నుండి నిర్దోషి. కావున ప్రతీ ముస్లిం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో లేదా ఇతరులతో ఇలా చేయటం నుండి దూరంగా ఉండాలి. ఆ పిదప ఆయన సహచరులైన అబూబకర్ మరియు ఉమర్ రజిఅల్లాహు అన్హుమా సమాధుల జియారత్ చేయాలి. ఆ తరువాత బఖీ వారి మరియు అమరమరణం పొందిన వారి సమాధుల జియారత్ చేయాలి. ముస్లిముల సమాధుల జియారత్ ధర్మబద్ధం చేయబడిన జియారత్ . అందులో జియారత్ చేసేవాడు చనిపోయిన వారికి సలాం చేస్తాడు. మరియు వారి కొరకు అల్లాహ్ తో దుఆ చేస్తాడు. మరియు మరణమును గుర్తు చేసుకుని మరలుతాడు.

మరియు ఇది హజ్ మరియు ఉమర విధానం:

హజ్ చేసే వ్యక్తి శుద్ధమైన హలాల్ సంపదను ఎంచుకోవాలి. హరాం సంపద నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే హరాం సంపద హజ్ ను మరియు దుఆను స్వీకరించకపోవటానికి కారణమగును. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఈ విధంగా వచ్చినది: ప్రతీ ఆ మాంసము ఏదైతే హరాం సంపదతో పెరిగి పోషించబడుతుందో అది నరకాగ్నికి ఎక్కువ హక్కు కలిగి ఉన్నది. [32]. పుణ్యాత్ములైన ఏకేశ్వరోపాసన చేసే వారిని, విశ్వాసపరులని హజ్ లో సాహచర్యం కోసం ఎంచుకోవాలి.

***

మవాఖీత్ (హజ్, ఉమ్రా కొరకు ఇహ్రామ్ ధరించే ప్రదేశములు)

హజ్ చేసే వ్యక్తి మీఖాత్ కు చేరుకున్న తరువాత అతడు బండిలో కాని లేదా ఇతరవాటిలో ఉన్నా ఇహ్రామ్ ధరించాలి. మరియు ఒక వేళ అతడు విమానములో ఉంటే మీఖాత్ కు దగ్గర చేరుకున్న తరువాత దాన్ని దాటక ముందే ఇహ్రామ్ ధరించాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు ఇహ్రామ్ ధరించే మవాఖీత్ ను ఆదేశంచిన ప్రదేశములు ఐదు కలవు. అవి:

1)     మదీనా వాసుల కొరకు జుల్ హులైఫా (అబ్యారు అలీ)

2)     జుహఫా ఇది షామ్, మిసర్, మగ్రిబ్ వాసుల కొరకు. ఇది రాబిగ్ పట్టణమునకు దగ్గర ఉన్నది.

3)     ఖర్నుల్ మనాజిల్ (సైల్ లేదా వాదియె మహ్రమ్) నజ్ద్, తాయిఫ్ వాసుల కొరకు మరియు వారి వైపు నుంచి వచ్చేవారి కోసం.

4)     జాతె ఇర్ఖ్ ఇరాఖ్ వాసుల కొరకు.

5)     యలమ్లమ్ యమన్ వాసుల కొరకు.

మరియు అక్కడి వాసులుకాని వారు ఈ మీఖాత్ ల గుండా వెళితే అవి వారి కొరకు మీఖాత్ అగును వారు అక్కడి నుంచే ఇహ్రాం ధరించాలి. మరియు మక్కా వాసులు మరియు మీఖాతులలో ఇళ్ళు కల వారు తమ ఇండ్ల వద్ద నుండే ఇహ్రామ్ ధరించాలి.

***

ఇహ్రాం విధానం:

            ఇహ్రాం కట్టే ముందు గుసుల్ చేయటం, పరిశుద్ధతను పాటించటం, సుగందద్రవ్యాలను పూసుకోవటం మంచిది. ఆ తరువాత మీఖాత్ నుండి ఇహ్రామ్ దుస్తులను ధరించాలి. విమానంలో ప్రయాణించే వారు తమ ఊరి నుండే ఇహ్రామ్ దుస్తులను ధరించాలి. ఆ తరువాత మీఖాత్ కు దగ్గరైనప్పుడు లేదా దానికి సమాంతరం అయినప్పుడు సంకల్పించుని తల్బియా చదవాలి. మగవారి ఇహ్రామ్ దుస్తులు పైన కప్పుకునే ఒక దుప్పట మరియు క్రింద కట్టుకునే ఇజార్ కుట్టబడకుండా ఉండాలి వాటిని శరీరం పై చుట్టుకోవాలి. తలను కప్పకూడదు. ఇక స్త్రీల కొరకు ఇహ్రామ్ దుస్తులు ప్రత్యేకంగా ఏమి లేవు. వారు విశాలమైన, శరీరమును కప్పే దుస్తులు ధరించాలి. ఏ పరిస్థితిలో కూడా వారిని చూసే ప్రజలను ఫిత్నాకి గురి చేసేవి కాకుండా ఉండాలి. మరియు వారు ముఖమును, చేతులను కప్పే బుర్ఖా, చేతి గ్లౌజులు లాంటి దుస్తులు ధరించకూడదు. కాని వారు పురుషుల దృష్టి పడే సమయంలో ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమణులైన ఉమ్మహాతుల్ మూమినీన్ మరియు అనుచరుల భార్యలు చేసేవారో అలా తమ తలపై ఉన్న దుపట్టాతో ముఖమును కప్పుకోవాలి.

            ఆ పిదప హాజీ ఇహ్రామ్ దుస్తులు ధరించిన తరువాత మనస్సులో ఉమ్రా కోసం సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రతన్ అని పలుకుతూ తల్బియ చదవాలి. మరియు ఉమ్రాని హజ్ తో కలిపి తమత్తు చేసుకోవాలి [33]. మరియు తమత్తు హజ్ ఎంతో మంచిది. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన అనుచరులకు దాని గురించి ఆదేశించారు. దాన్ని వారిపై తప్పనిసరి చేశారు. తన ఆదేశమును పాలించటంలో సంకోచించిన వారిపై ఆగ్రహం చూపారు. కాని తనతో పాటు హదీ జంతువు ఉన్నవాడు తప్ప[34]. అతను ఖారిన్ గా ఉండిపోతాడు. ఏ విధంగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారో. ఖారిన్ అంటే తల్బియాలో "అల్లాహుమ్మ లబ్బైక్ ఉమ్రతన్ వహజ్జన్" ఓ అల్లాహ్ నేను ఉమ్రా మరియు హజ్ కొరకు హాజరయ్యాను అని పలికేవాడు. ఖుర్బానీ దినము నాడు తన హదీని జుబాహ్ చేయనంత వరకు తన ఇహ్రాంను వీడకూడదు.

ముఫ్రిద్ అంటే కేవలం హజ్ సంకల్పం చేస్తాడు మరియు అల్లాహుమ్మ లబ్బైక్ హజ్జన్                                     (ఓ అల్లాహ్ నేను హజ్ కొరకు హాజరయ్యాను ) అని పలుకుతాడు.

***

ఇహ్రామ్ కట్టిన వ్యక్తి పై నిషేధిత విషయాలు.

ముస్లిం ఇహ్రామ్ సంకల్పించుకున్నప్పుడు అతని పై ఈ విషయాలు నిషేధించబడుతాయి:

1)     సంభోగం చేయటం మరియు దానికి సంభందించిన కార్యాలు ముద్దు పెట్టుకోవటం, కామంతో ముట్టుకోవటం, వాటి గురించి మాట్లాడటం, పెండ్లిచూపులు, వివాహమాడటం. అయితే ఇహ్రామ్ ధరించిన వ్యక్తి వివాహం చేసుకోకూడదు మరియు వివాహం చేయించకూడదు.

2)     గుండు చేయించుకోవటం మరియు వెంట్రుకలు కత్తిరించటం.

3)     గోళ్ళు కత్తిరించటం

4)     అతుక్కుని ఉండే వాటితో పురుషుని తలను కప్పుకోవటం. ఇక గొడుగుతో, గుడారముతో, కారుతో నీడను పొందటంలో ఎటువంటి ఆటంకము లేదు.

5)     సువాసనను వెదజల్లే సుగంద ద్రవాలను పూసుకోవటం మరియు వాటి వాసన పీల్చటం.

6)     భూమిపై ఉండే జంతువులను వేటాడటం మరియు వాటిని సూచించటం.

7)     పురుషుడు కుట్టబడిఉన్న వస్తువును తొడగటం. మరియు స్త్రీ తన ముఖము పై మరియు చేతుల పై కుట్టబడిన వస్తువును తొడగటం. మరియు పురుషులు చెప్పులు తొడగవచ్చు అవి లభించకపోతే చర్మపు మేజోళ్ళు తొడగవచ్చు.

మరియు ఒక వేళ ఈ నిషేధిత వాటిని తెలియక లేదా మరచిపోయి పాల్పడితే దాన్ని తక్షణం వదిలివేయాలి. దాని పై ఎటువంటి పరిహారం లేదు.

ముహ్రిమ్ (హాజీ) కాబాకు చేరుకున్న తరువాత దాని చుట్టు ఏడు సార్లు తవాఫె ఖుదూమ్ (ప్రదక్షిణలు) [35] చేయాలి. హజ్రే అస్వద్ వైపు నుండి ఆరంభించాలి. మరియు ఇది ఉమ్రా తవాఫ్ అవుతుంది. తవాఫ్ కొరకు ప్రత్యేక దుఆ ఏమీ లేదు. కాని అల్లాహ్ స్మరణ చేయాలి మరియు తమకు సౌలభ్యమైన దుఆలు చేయాలి [36]. ఆ తరువాత సౌలభ్యమయితే మఖామె ఇబ్రాహీమ్ వద్ద రెండు రకాతులు నమాజ్ చదవాలి [37]. లేకపోతే హరంలో ఏ ప్రదేశంలోనైన చదవవచ్చు. ఆ తరువాత సయీ చేసే ప్రదేశమునకు [38] వెళ్ళాలి. సఫా నుండి ఆరంభిస్తూ దానిపై ఎక్కి ఖిబ్లాకి అభిముఖమై నిలబడాలి తక్బీర్ చదవాలి మరియు లా ఇలాహ ఇల్లల్లాహ్ పఠించి దుఆ చేయాలి. ఆ తరువాత మర్వా వైపునకు సయీ చేయాలి. దాని పై ఎక్కి ఖిబ్లాకి అభిముఖమై నిలబడి తక్బీర్ చదవాలి. లా యిలాహ ఇల్లల్లాహ్ చదివి దుఆ చేయాలి. ఆ తరువాత సఫా వైపునకు మరలాలి. ఈ విధంగా ఏడు సార్లు చేయాలి. సఫా నుండి మర్వాకు ఒక ప్రదక్షిణ మరియు మర్వా నుండి సఫాకు ఒక ప్రదక్షిణ అవుతుంది. ఆ తరువాత తల వెంట్రుకలు కత్తిరించాలి. స్త్రీ అయితే అంగుళం అంత భాగం వెంట్రుకలను కత్తిరించాలి. దీనితో ముతమత్తిఅ్ యొక్క ఉమ్రా పూర్తవుతుంది. మరియు అతడు తన ఇహ్రామ్ ను తీసివేయాలి. మరియు ఇహ్రామ్ వలన అతని పై నిషేధమైన ప్రతీది అతనికి సమ్మతమగును.

ఒక వేళ ఇహ్రామ్ కి ముందు లేదా తరువాత స్త్రీకి ఋతుస్రావం లేదా పురిటిస్రావం కలిగితే ఆమె హజ్జే ఖీరాన్ చేయాలి. అంటే హజ్ మరియు ఉమ్రా ఇహ్రాం ధరించాలి. మరియు ఇతర హాజీలు లాగా హజ్ మరియు ఉమ్రా తల్బియ చదవాలి. ఎందుకంటే ఋతుస్రావం మరియు పురిటిస్రావం ఇహ్రామ్ బూనుకోటానికి మరియు అరఫా, ముజ్దలిఫాలో బస చేయటమునకు ఆటంకము కాదు. అవి కేవలం బైతుల్లాహ్ ప్రదక్షిణ (తవాఫ్) చేయటము నుండి ఆపుతాయి. కావున ఇటువంటి స్థితిలో ఉన్న స్త్రీ బైతుల్లాహ్ ప్రదక్షిణ తప్ప హాజీలు చేసే కార్యాలన్ని చేయవచ్చు. దాన్ని పరిశుద్ధురాలయ్యే వరకు ఆలస్యం చేయాలి. ఒక వేళ ప్రజలు హజ్ ఇహ్రామ్ బూనుకోక ముందు మరియు మినాకు బయలుదేరక ముందు పరిశుద్ధురాలైతే గుసుల్ చేసి తవాఫ్ మరియు సయీ చేసుకోవాలి. మరియు తన వెంట్రుకలను కత్తిరించుకుని తన ఉమ్రా ఇహ్రామ్ నుండి హలాల్ అయిపోవాలి. ఆ తరువాత హాజీలతో వారు ఎనిమిదో రోజు ఇహ్రామ్ ధరించినప్పుడు హజ్ కొరకు ఇహ్రామ్ ధరించాలి. ఒక వేళ ఆమె హాజీలు హజ్ ఇహ్రామ్ ధరించే వరకు పరిశుద్ధరాలు కాకపోతే హజ్జే ఖీరాన్ చేసుకోవాలి. మరియు ఆమె తన ఇహ్రామ్ లోనే ఉండి వారితో పాటు తల్బియా చదవాలి. మరియు హాజీలు చేసే కార్యాలన్ని మినాకి బయలుదేరటం, అరఫాత్ లో, ముజ్దలిఫాలో బస చేయటం, రాళ్ళు కొట్టటం, ఖుర్బానీ ఇవ్వటం మరియు ఖుర్బానీ దినమున తన తల వెంట్రుకలను కత్తిరించటం అన్ని చేయాలి. ఆమె పరిశుద్ధురాలైనప్పుడు గుసుల్ చేసి హజ్ తవాఫ్ మరియు హజ్ సయీ చేసుకోవాలి.

ఈ తవాఫు (ప్రదక్షిణ), సయీ ఆమె హజ్ మరియు ఉమ్రా కొరకు సరిపోతుంది. ఇలాంటి సమస్య ఆయిషా రజిఅల్లాహు అన్హాకి జరిగినది. మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమెతో పరిశుద్ధత పాటించిన తరువాత ఇతర హాజీలతో కలిసి తవాఫె ఇఫాజా మరియు సయీ చేసినప్పుడు ఆమె తవాఫు మరియు సయీ ఆమె హజ్, ఉమ్రాకి సరిపోతుందని తెలిపారు. ఎందుకంటే హజ్జె ఖీరాన్ చేసే వారి పై మున్ఫరిద్ వలె ఒక తవాఫ్ [39] మరియు సయీ అనివార్యమగును. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు ఆధారము. ఇంకొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట: ఉమ్రా హజ్ లో ప్రళయ దినం వరకు ప్రవేశించింది. అల్లాహ్ కి బాగా తెలుసు.

హాజీలు జిల్ హిజ్జా యొక్క ఎనిమిదో తారీకున మక్కాలోనే తమ నివాసము నుండి హజ్ కొరకు ఇహ్రామ్ ధరించాలి. ఏ విధంగానైతే ఉమ్రా కొరకు మీఖాత్ నుండి ఇహ్రామ్ కట్టుకుని వచ్చారో అలా. అయితే గుసుల్ చేసి ఇహ్రామ్ వస్త్రములను తొడగాలి. హాజీ పురుషుడైనా లేదా స్త్రీ అయినా హజ్ కొరకు సంకల్పించుకోవాలి. ఆ తరువాత అల్లాహుమ్మ లబ్బైక్ హజ్జన్ అని తల్బియా పలకాలి. మరియు యౌమున్నహర్ [40] ముజ్దలిఫా నుండి మినాకు మరలి జమరాత్ కు రాళ్ళను కొట్టి పురుషుడు తల వెంట్రుకలను గొరికించుకోనంత వరకు మరియు స్త్రీ వెంట్రుకలను కత్తిరించుకోనంత వరకు మునుపటి ఇహ్రామ్ నిషేధాల నుండి దూరంగా ఉండాలి.

హాజీ ఎనిమిదో రోజు ఇహ్రాం వేసుకున్నప్పుడు హాజీలందరితో కలిసి మినాకి వెళ్ళాలి. మరియు అక్కడ రాత్రి గడపాలి. అక్కడ ప్రతీ నమాజును వాటి సమయములలో ఖసర్ చేసి, సమీకరించకుండా (జమా చేయకుండా) చదవాలి. తొమ్మిదో రోజు అరఫా దినమున సూర్యోదయం అయిన తరువాత హాజీలందరితో కలిసి నమిర వెళ్ళాలి. అక్కడ కూర్చోవాలి. చివరికి ఇమామ్ తో లేదా తాను ఉన్న నివాసములో జుహర్ మరియు అసర్ నమాజులను కలిపి ఖసర్ చేసి చదవాలి. ఆ తరువాత సూర్యుడు నడినెత్తు నుండి వాలిన తరువాత అరఫా వైపు మరలాలి. ఒక వేళ మినా నుండి (నమిరకి వెళ్ళకుండా) అరఫాకి వెళ్ళి (నమిరకి వెళ్ళకుండా) కూర్చోవటం సమ్మతమే. అరఫా అంతా బస చేసే చోటు.

అరఫాలో హాజీలు అల్లాహ్ స్మరణను, దుఆను మరియు ఇస్తిగ్ఫార్ ను అధికంగా చేయాలి. మరియు కొండవైపు కాకుండ ఖిబ్లా వైపు అభిముఖమవ్వాలి. ఎందుకంటే కొండ అరఫాత్ యొక్క ఒక భాగము మాత్రమే. ఆరాధనను భావిస్తూ దాని పై ఎక్కడం సరికాదు. దాని రాళ్ళను ముట్టుకోవటం సమ్మతం కాదు. ఇది బిద్అతె ముహర్రమ.

మరియు హాజీలు సూర్యుడు అస్తమించనంతవరకు అరఫా నుండి మరలకూడదు. ఆ పిదప సూర్యస్తమయం అయిన తరువాత హాజీలు ముజ్దలిఫాకి మరలి వెళ్ళాలి. ముజ్దలిఫా చేరుకో గానే మగ్రిబ్, ఇషా నమాజులను సమీకరించి అలస్యం చేస్తూ ఖసర్ చేసి చదవాలి. ఆ తరువాత అక్కడే రాత్రి గడపాలి. ఫజర్ వేళ అవగానే ఫజర్ నమాజు చదివి అల్లాహ్ స్మరణ చేయాలి. ఆ తరువాత సూర్యోదయం అవక మునుపు మినా వైపు మరలాలి. మినా చేరుకున్న తరువాత సూర్యోదయం అయిన తరువాత జమ్రయే ఉఖబాని చిన్నవీ కాకుండా పెద్దవీ కాకుండా శనగ గింజంత ఏడు రాళ్ళతో కొట్టాలి. దాన్ని చెప్పులతో కొట్టకూడదు. ఎందుకంటే అది షైతాను అలంకరించిన వ్యర్ధ కార్యము. ఇర్గాముష్షైతాను (షైతానును అవమానపరచటం) [41] ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మరియు ఆయన మార్గమును అనుసరించటంలో మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వారించిన వాటిని త్యజించటంలో ఉన్నది.

ఆ తరువాత హాజీ ఖుర్బానీ ఇవ్వాలి. ఆ తరువాత తన సిరోముండనం చేయాలి. స్త్రీ అయితే వెంట్రుకలను కత్తిరించాలి. పురషులు కూడా వెంట్రుకలను కత్తిరించవచ్చు కాని సిరోముండనం ఉత్తమం. ఆ తరువాత తన దుస్తులను ధరించాలి. అతనికి ఇహ్రాం వలన స్త్రీలు తప్ప నిషిద్ధమైన కార్యాలన్ని సమ్మతమవుతాయి. ఆ తరువాత మక్కా వెళ్ళి తవాఫె ఇఫాజ మరియు సయీ చేయాలి. దీనితో అతనికి భార్యతో సహా అన్ని సమ్మతమవుతాయి. ఆ తరువాత మినాకు తిరిగి వెళ్ళి మినాలో మిగిలిన పండుగ రోజు దాని తరువాత రెండు రోజులు వాటి రాత్రులతో సహా తప్పనిసరిగా గడపాలి. మరియు పదకుండు, పన్నెండు తారీకున సూర్యుడు మిట్టమధ్యాహ్నం వాలిన తరువాత మూడు జమరాతులకు రాళ్ళు కొట్టాలి. మినాకు దగ్గరలో ఉన్న జమరతుస్సుగ్రా నుండి ఆరంభించాలి. ఆ తరువాత వుస్తా ఆ తరువాత పండుగ రోజు కొట్టిన ఉఖ్బానీ రాళ్ళు కొట్టాలి. ప్రతీ జమరాకి ఏడు రాళ్ళు కొట్టాలి. ప్రతీ రాయి కొట్టేటప్పుడు తక్బీర్ చదవాలి. మరియు రాళ్ళను మినాలో తమ నివాసము [42] నుండే తీసుకుని వెళ్ళాలి. చోటు దొరకనివారు గుడారాలు ముగిసే చోటు దిగాలి.

రాళ్ళను కొట్టిన తరువాత పన్నెండో తేదీన మరలాలనుకుంటే మరలవచ్చు. ఒక వేళ పదమూడో తేదీకు వాయిదా వేసుకుంటే ఎంతో మంచిది. మరియు జవాల్ తరువాత రాళ్ళను కొట్టాలి. ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు బైతుల్లాహ్ కి తవాఫుల్ విదాఅ్ చేయాలి. ఆ తరువాత వెంటనే ప్రయాణం చేయాలి. ఋతుస్రావమునకు మరియు పురిటి స్రావమునకు గురైన స్త్రీ హజ్ తవాఫ్ చేసి ఉంటే ఆమెకు తవాఫె విదాఅ్ నుండి మినహాయింపు కలదు.

ఒక వేళ ఎవరైన హాజీ ఖుర్బానీ ఇవ్వటంను పదకుండూ లేదా పన్నెండు లేదా పదమూడవ తేది వరకు ఆలస్యం చేయదలచినా అతనికి సమ్మతమగును. ఎవరైన మినా నుండి వాపసు అయిన తరువాత తవాఫ్ మరియు సయీ చేయదలచితే అది అతనికి సమ్మతమగును. కాని పదో తారీకున చేయటం ఉత్తమం.

మరియు అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై శుభాలను, శాంతిని కలిగించుగాక.

***

 అల్ ఈమాను (విశ్వాసం):

         అల్లాహ్ ముస్లింలకు అల్లాహ్ పై, ఆయన ప్రవక్త పై మరియు ఇస్లాం ప్రాథమిక విధుల పై విశ్వాసముతో పాటు దైవదూతలను [43] మరియు తన ప్రవక్తల పై అవతరింపజేసిన ఆయన గ్రంధములను [44] విశ్వసించటమును అనివార్యం చేశాడు. వాటి పరంపర సమాప్తి దివ్యఖుర్ఆన్. అది గ్రంధములన్నింటిని రద్దుపరచినది. మరియు ఆయన దాన్ని గ్రంధములన్నింటి పై పరిరక్షకునిగా చేశాడు. అలాగే అల్లాహ్ తఆలా తాను మొదట నుంచి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు పంపించిన ప్రవక్తలను విశ్వసించమని ఆదేశించాడు. ఎందుకంటే వారి దైవదౌత్యము ఒక్కటే వారి ధర్మము ఒక్కటే అది ఇస్లాం ధర్మము. వారిని పంపించిన వాడు ఒక్కడే ఆయనే సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్. కావున ఒక ముస్లిం అల్లాహ్ ఖుర్ఆన్ లో ప్రస్తావించిన తమతమ జాతుల వద్దకు పంపించబడిన ప్రవక్తలను విశ్వసించాలి. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిసమాప్తి అని, ప్రజల వద్దకు పంపించబడ్డ అల్లాహ్ ప్రవక్త అని విశ్వసించాలి. ఆయన పంపించబడిన తరువాత ప్రజలందరు ఆయన సమాజమే చివరికి యూదులు, క్రైస్తవులు మరియు వేరే ధర్మాలవారు ఆయన సమాజంలోని వారే. ఎందుకంటే భూమిపై ఉన్నవారందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహినసల్లం ఉమ్మత్. ఆయనను అనుసరించటం అల్లాహ్ వద్ద నుండి తప్పనిసరి చేయబడినవారు.

         మరియు మూసా, ఈసా, ప్రవక్తలందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించకుండా ఇస్లాంలో ప్రవేశించని వారి నుండి విసుగును ప్రదర్శిస్తారు. ఎందుకంటే ముస్లిం అన్నవాడు ప్రవక్తలందరిని విశ్వసించి వారిని అనుసరిస్తాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించనివాడు మరియు ఆయనను అనుసరించి ఇస్లాం ధర్మంలో ప్రవేశించనివాడు ప్రవక్తలందరిని అవిశ్వసించి వారిని తిరస్కరించినవాడు. ఒక వేళ అతడు వారిలోనుండి ఏ ఒక్కరినీ అనుసరించినట్లు దావా చేసినా. ఈ విషయంలో అల్లాహ్ వాక్కుతో ఆధారాలు రెండవ అధ్యాయంలో ప్రస్తావించబడినవి.

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:  ఎవరి (చేతిలో) ఆదీనంలో ముహమ్మద్ ప్రాణం ఉందో ఆయన సాక్షిగా"ఈ (జాతిలో) సమాజంలోని యూదుడైనా క్రైస్తవుడైనా, ఇంకెవరైనా నాగురించి వినకుండా, నాకు ఇచ్చి పంపించ బడ్డ ( ఖుర్ఆన్ ) దాని అనుసారంగా విశ్వసించకుండానే మరణిస్తే అతను నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు [45].

మరియు మరణాంతరం లేపబడటం, లెక్కతీసుకోబడటం, ప్రతిఫలం ఇవ్వబడటం, స్వర్గము, నరకమును విశ్వసించటం మరియు అల్లాహ్ విధివ్రాతను విశ్వసించటం ముస్లిం పై తప్పనిసరి.

 తఖ్దీర్ పై విశ్వాసమును కనబరచటం యొక్క అర్ధం:

         అల్లాహ్ కు ప్రతీది తెలుసు అని మరియు భూమ్యాకాశములను సృష్టించక ముందే దాసుల కర్మల గురించి ఆయనకు తెలుసు అని ముస్లిం విశ్వసించాలి. ఆ జ్ఞానమును అల్లాహ్ తన వద్ద లౌహె మహ్ఫూజ్ లో వ్రాసి ఉంచాడు. మరియు అల్లాహ్ తలచుకున్నది జరిగినదని, ఆయన తలవనిది జరగలేదని ముస్లిం తెలుసుకోవాలి. అల్లాహ్ దాసులను తనపై విధేయత చూపటం కొరకు సృష్టించాడు. మరియు దాన్ని వారికి స్పష్టపరచాడు మరియు దాని గురించి వారికి ఆదేశించాడు. మరియు తన పై అవిధేయత చూపటం నుండి వారిని వారించాడు. మరియు వాటిని వారికి స్పష్టపరచాడు. మరియు అల్లాహ్ ఆదేశములను పాటించటానికి వారికి సామర్ధ్యమును, ఇచ్ఛను ప్రసాదించాడు. తద్వారా వారికి పుణ్యం ప్రాప్తిస్తుంది. మరియు ఆయనపై అవిధేయత చూపేవారు శిక్షకు అర్హులవుతారు.

         మరియు దాసుని ఇచ్ఛ అల్లాహ్ ఇచ్ఛను అనుసరిస్తుంది. ఇక అల్లాహ్ తన దాసులకు ఇచ్ఛను మరియు ఎంపికను ప్రసాదించని విధివ్రాతలు (కొన్ని ఉంటాయి అవి) వారి కోరికలకు భిన్నంగా జరుగుతాయి. ఉదాహరణకు పొరపడటం, మరచిపోవటం మరియు బలవంతం చేయబడటం, పేదరికం, అనారోగ్యము, ఆపదలు ఇంకా అటువంటి విషయాలు. అల్లాహ్ వాటి వలన పట్టుకోడు. మరియు వాటి వలన మనిషిని శిక్షించడు. అంతేకాదు ఆపదలపై, పేదరికంపై, అనారోగ్యంపై సహనం చూపి అల్లాహ్ విధివ్రాతతో సంతుష్టపడినప్పుడు అతనికి గొప్ప పుణ్యమును ప్రసాదిస్తాడు.

ఈ ప్రస్తావించబడిన వాటన్నింటిని విశ్వసించటం ముస్లింపై తప్పనిసరి.

మరియు అల్లాహ్ పై దృఢ విశ్వాసమును కలిగిన వారు, ఆయనకు అత్యంత సన్నిహితులు, స్వర్గంలో ఉన్నత స్థానం కలిగిన వారు సత్పురుషులు (ముహ్సినూన్). వారే అల్లాహ్ ను ఆరాధిస్తారు. మరియు ఆయనను గౌరవిస్తారు. మరియు ఆయనను వారు చూస్తున్నట్లు ఆయనతో భయపడుతారు. మరియు తమ గోప్యంలో మరియు బహిరంగంలో ఆయనకు అవిధేయత చూపరు. మరియు వారు ఎక్కడున్నా తమను ఆయన వీక్షిస్తున్నాడని విశ్వసిస్తారు. వారి కర్మల్లోంచి, వారి మాటల్లోంచి, వారి సంకల్పాల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. కావున వారు ఆయన ఆదేశమునకు కట్టుబడి ఉంటారు. మరియు ఆయనపై అవిధేయత చూపటమును వదిలివేస్తారు. వారిలో నుండి ఏ ఒక్కడి నుండైనా అల్లాహ్ ఆదేశమునకు భిన్నంగా పొరపాటు జరిగితే తక్షణమే అల్లాహ్ వైపు నిజమైన తౌబా చేస్తాడు. తన పొరపాటుపై సిగ్గుపడుతాడు. మరియు అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటాడు. మరల అలా చేయడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.

[అన్ నహ్ల్: 128]

***

 ఇస్లాం ధర్మం పరిపూర్ణమవటం:

దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను, మీ పై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సంతృప్తిసమ్మతితో ఇష్టపడ్డాను}

 {అల్ మాయిదా: 3}

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

{నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;}

 [అల్ ఇస్రా: 9]

ఖుర్ఆన్ గురించి శక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

మేము నీపై ఈ గ్రంధాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి (ముస్లింలకు) అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త.

[అన్ నహ్ల్: 89]

ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నేను మిమ్మల్ని చాలా స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన రహదారిపై వదిలివేశాను. దాని రాత్రి పగటివలె ప్రకాశవంతంగా ఉన్నది. నా తరువాత నాశనం అయ్యేవాడు మాత్రమే దాని నుండి తప్పిపోతాడు [46]. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను మీలో రెండు విషయములను వదిలి వెళుతున్నాను మీరు వాటిని అట్టిపెట్టుకున్నంతవరకు మీరు అపమార్గముకు గురి కారు. అవి అల్లాహ్ గ్రంధము మరియు ఆయన ప్రవక్త విధానము.[47]

ముందు ప్రస్తావించబడిన ఆయతులలో:

మొదటి ఆయతులో అల్లాహ్ తాను ముస్లింల కొరకు వారి ధర్మమును పరిపూర్ణం చేశాడని తెలియపరుస్తున్నాడు. అందులో ఎన్నటికి ఎటువంటి లోపము ఉండదు. మరియు అందులో ఎన్నటికి ఎటువంటి పెరుగుదలకు ఆస్కారం లేదు. అది ప్రతీ కాలము, ప్రదేశము, సమాజము కొరకు సరైనది. మరియు ఈ పరిపూర్ణమైన, గొప్పదైన, సమగ్రమైన ధర్మము ద్వారా మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యము ద్వారా, ఇస్లాంను బహిరంగపరచి, ముస్లింలకు వారి శతృవులకు వ్యతిరేకంగా సహాయం చేసి ముస్లిములపై తన అనుగ్రహమును పూర్తి చేశాడని తెలియపరుస్తున్నాడు. మరియు ప్రజల కొరకు ధర్మంగా ఇస్లాంను ఇష్టపడ్డాడని తెలియపరుస్తున్నాడు. ఎన్నడు దాని నుండి ఆగ్రహానికి లోను కాడు. మరియు ఎన్నటికి ఏ ఒక్కరి నుండి అది తప్ప వేరే ధర్మమును స్వీకరించడు.

మరియు రెండవ ఆయతులో దివ్యఖుర్ఆన్ ఒక సంపూర్ణ ప్రణాళిక అని అందులో ధర్మ, ప్రాపంచిక వ్యవహారాలన్నిటి యొక్క స్పష్టమైన మరియు సంతృప్తికరమైన సూచనలు, భోదనలు ఉన్నవని అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. మరియు ఖుర్ఆన్ మార్గదర్శకం చేయ్యని ఏ మంచి లేదు. మరియు హెచ్చరించని ఎటువంటి చెడు లేదు. మరియు ప్రతీ సమస్యకు, భూత, వర్తమాన, భవిష్యత్తు యొక్క అన్ని సమస్యలకు సరైన పరిష్కారం ఖుర్ఆన్ లో కలదు. ఖర్ఆన్ పరిష్కారమును విభేదించే ప్రతీ పరిష్కారం అజ్ఞానము, దుర్మార్గము అవుతుంది.

జ్ఞానం, విశ్వాసం, రాజకీయం, న్యాయ, నిర్ణయ వ్యవస్థ మరియు మానసిక, సామాజిక, ఆర్ధిక జ్ఞానం మరియు శిక్షల వ్యవస్థ మరియు మానవునికి అవసరమైన ఇతర విషయాలు వీటన్నిటిని అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటల్లో పరిపూర్ణంగా స్పష్టపరచాడు. ఏ విధంగానైతే అల్లాహ్ ఈ ప్రస్తావించబడిన ఆయతులో తెలియపరచాడో:

మరియు మేము ప్రతీది స్పష్టపరిచే గ్రంధమును మీపై అవతరింపజేశాము.

[అన్నహల్: 89]

వచ్చే అధ్యాయంలో ఇస్లాం ధర్మం యొక్క పరిపూర్ణత మరియు దాని సమగ్రమైన, సరైన విధానం గురించి సవిస్తరమైన, సంక్షిప్త ప్రకటన కలదు.

***

 నాల్గవ అధ్యాయం

 ఇస్లాం యొక్క పాఠ్యప్రణాళిక: -

 1)   జ్ఞానము విషయంలో:

అల్లాహ్ తఆలా మొట్టమొదట మానవునిపై తప్పనిసరి చేసిన విషయం జ్ఞానమును నేర్చుకోవటం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

కావున (ఓ ముహమ్మద్!) తెలుసుకో! నిశ్చయంగా, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. కావున నీ పాపాలకు మరియు విశ్వాస స్త్రీల కొరకు మరియు విశ్వాస పురుషుల కొరకు కూడా క్షమాపణ వేడుకో! మరియు అల్లాహ్ కు మీ కార్యకలాపాలు మరియు మీ (అంతిమ) నివాసం కూడా తెలుసు.

 [ముహమ్మద్: 19]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

{మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును}.

[అల్ ముజాదల: 11]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

{మరియు నువ్వు చెప్పు'ఓ నా ప్రభువా ! నా జ్ఞానంలో వృద్ధిని అనుగ్రహించు}.

[తాహా: 114]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను అడిగి తెలుసుకోండి.

[అల్ అంబియా: 7]

మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రామాణికమైన హదీసులో ఇలా సెలవిచ్చారు: విధ్యను అభ్యసించటం ప్రతీ ముస్లింపై తప్పనిసరి. [48] ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: పున్నమి చంద్రుడి ప్రాధాన్యత నక్షత్రాలన్నిటిపై ఎలా ఉందో అలా ఆరాధ్యుడిపై ఒక జ్ఞానవంతుడి యొక్క ప్రాధాన్యత కలదు. [49]

ఇస్లాంలో జ్ఞానం దాని అవసరపరంగా విభాగాలుగా విభజించబడింది:

మొదటి విభాగము: పురుషుడైనా లేదా స్త్రీ అయినా ప్రతీ ముస్లింపై తప్పనిసరి కర్తవ్యం. దాని గురించి తెలియకపోవటం వలన ఎవరు క్షమించబడరు. మరియు అది అల్లాహ్ పరిచయం మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయం మరియు ఇస్లాం ధర్మమునకు అవసరమగు విషయాల పరిచయం [50].

రెండవ విభాగము: ఫర్జే కిఫాయా. అంటే కొంత మంది దాన్ని పాటిస్తే మిగతా వారి నుండి పాపము తొలగిపోతుంది. మిగిలిన వారు పాటించటం మంచిది. తప్పనిసరి కాదు. మరియు వారు ఫిఖ్హీ, షరయీ విషయాలలో ఎంత నైపుణ్యం పొందాలంటే భోదించటానికి, తీర్పులివ్వటానికి, ఫత్వా ఇవ్వటానికి అర్హులైపోవాలి. మరియు ప్రజలకు ధర్మపరంగా భోదించాలి. ఇందులో అన్నీ ప్రాపంచిక శాస్త్రాలు మరియు కళలు వస్తాయి. దీని ద్వారా ముస్లింలు స్వయంగా బాధ్యులై ఇతరుల అవసరం లేకుండా ఉంటారు. కావున ముస్లిం పాలకులు సరిపోయే వారు లభించనప్పుడు ముస్లింలకు వారి జీవితమునకు అవసరమయ్యే విషయాల్లో సరిపోయే ఉలమాలను తయారు చేయటం అవసరం.

 2)    అఖీద విషయంలో

పరిశుద్ధుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రజలందరితో వారు ఒక్కడైన అల్లాహ్ దాసులని మరియు వారు ఆయన ఒక్కడినే ఆరాధించటం వారిపై తప్పనిసరి అని ప్రకటించమని ఆదేశించాడు. మరియు ఆయన కొరకు తమ ఆరాధనలో ఎటువంటి మధ్యస్థము లేకుండా అల్లాహ్ తో సంబంధము కలిగి ఉండమని వారిని ఆదేశించాడు. దీని వివరణ లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్ధంలో ప్రస్తావించబడినది. మరియు వారు అల్లాహ్ ఒక్కడిపై నమ్మకము కలిగి ఉండాలని మరియు ఆయన ఒక్కడితోనే భయపడాలి అని మరియు ఆయన ఒక్కడిపైనే ఆశను కలిగి ఉండాలని [51] ఆదేశించాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే లాభమును, నష్టమును కలిగించేవాడు. మరియు ఆయన స్వయంగా వర్ణించిన మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్ణించిన సంపూర్ణ గుణములతో ఆయనను వర్ణించమని ఆదేశించాడు. దాని గురించి ముందు ప్రస్తావన జరిగినది.

 3)    ప్రజలతో సన్నిహితంగా ఉండటం:

అల్లాహ్ తఆలా ముస్లింను మానవులను అవిశ్వాస చీకటుల నుండి రక్షించి ఇస్లాం కాంతివైపు తీయుటకు ప్రయత్నించే మంచి మనిషిగా ఉండమని ఆదేశించాడు. అందుకనే నేను కొన్ని విధి కార్యాలను నిర్వర్తిస్తూ ఈ పుస్తకమును వ్రాసి ప్రచురించాను.

మరియు అల్లాహ్ ఒక ముస్లిం ఇతరులతో బంధం ఏర్పరచుకునే బంధమైన అల్లాహ్ పై విశ్వాస బంధమును ఏర్పరచుకోమని ఆదేశించాడు. కావున అతడు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండే అల్లాహ్ పుణ్య దాసులను ఇష్టపడాలి ఒక వేళ వారు ప్రజల్లో దూరమైనవారైన సరే. మరియు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపేవారిని మరియు అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు అవిధేయులైన వారిని ద్వేషించాలి ఒక వేళ వారు ఎంత దగ్గరి బంధువులైనా సరే. ఈ సంబంధము విడిపోయేవారిని సమీకరిస్తుంది మరియు విభేదించుకునేవారిని కలుపుతుంది. దీనికి భిన్నంగా వంశము, స్వదేశము, భౌతిక ప్రయోజనాల బంధము అవి తొందరగా విడిపోతాయి.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:

అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు - ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివార జనులైనాసరే (ససేమిరా వారిని ప్రేమించరు).

[అల్ ముజాదల: 22]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

నిశ్చయంగా మీలో భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు.

[అల్-హుజ్'రాత్: 13 ]

మొదటి ఆయతులో అల్లాహ్ ను విశ్వసించేవాడు అల్లాహ్ శతృవులను ఒక వేళ వారు ఎంత దగ్గర బంధువులైనా సరే ఇష్టపడడని అల్లాహ్ తెలియపరుస్తున్నాడు.

రెండవ ఆయతులో అల్లాహ్ తఆలా తన వద్ద ప్రజలందరిలో కెల్ల గౌరవంతుడు మరియు తన వద్ద ఇష్టమైన వాడు తన పై విధేయత చూపే వాడు ఒక వేళ అతడు ఏ జాతికి మరియు ఏ రంగుకి చెందినవాడైనా సరే అని తెలియపరుస్తున్నాడు.

మరియు అల్లాహ్ శతృవుతో, స్నేహితునితో న్యాయంగా వ్యవహరించమని ఆదేశించాడు. మరియు ఆయన హింసను తన స్వయం పై నిషేధించుకున్నాడు. మరియు దానిని తన దాసుల మధ్య కూడా నిషేధించాడు. మరియు నీతి, నిజాయితీ గురించి ఆదేశించాడు. మరియు అవినీతిని నిషేధించాడు. మరియు తల్లిదండ్రల పట్ల ఉత్తమంగా మెలగటము, బంధుత్వాలను కలపటము, నిరుపేదలకు మేలు చేకూర్చటము మరియు మంచి కార్యములలో పాలుపంచుకోవటం గురించి ఆదేశించాడు. మరియు ప్రతీ దానితో చివరికి జంతువులతో ఉత్తమంగా మెలగటము గురించి ఆదేశించాడు. దానిని శిక్షకు గురిచేయటమును అల్లాహ్ నిషేధించాడు. మరియు దానిపై దయ చూపటం (ఇహ్సాన్) [52] గురించి ఆదేశించాడు.ఇక హాని కలిగించే జంతువులైన పిచ్చికుక్క, పాము, తేలు, ఎలుక, గ్రద్ధ, బల్లులను వాటి కీడు నుండి భద్రంగా ఉండటానికి హతమార్చవచ్చు. వాటిని వేదనకు గురి చేయకూడదు.[53]

 4)    విశ్వాసపరుని ధ్యానము మరియు హృదయ హితోపదేశ విషయంలో:

అల్లాహ్ ప్రజలను వారు ఎక్కడ ఉన్నా వీక్షిస్తున్నాడని మరియు ఆయన వారి కర్మలన్నిటి గురించి తెలుసుకునేవాడని మరియు వారి సంకల్పములను తెలుసుకునేవాడని మరియు ఆయన వారి కర్మలను, వారి మాటలను లెక్కవేస్తున్నాడని ప్రజలకు స్పష్టపరుస్తూ దివ్యఖుర్ఆన్ లో ఆయతులు వచ్చినవి. మరియు ఆయన దూతలు వారిపై బాధ్యులుగా ఉండి వారి నుండి గోప్యంగా, బహిరంగంగా జరిగే వాటన్నిటిని వ్రాస్తుంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే వారు పాల్పడే కార్యాల, వారి మాటల పరంగా వారి లెక్కతీసుకుంటాడు. మరియు వారు ఇహలోకంలో ఆయనపై అవిధేయతకు పాల్పడి, ఆయన ఆదేశమునకు విభేదించినప్పుడు ఆయన తన బాధాకరమైన శిక్ష నుండి భయపెడుతున్నాడు. కావున అది అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచేవారికి పెద్ద మందలింపు అయ్యింది. మరియు ఆయనపై అవిధేయతకు పాల్పడటం నుండి అది వారిని ఆపుతుంది. వారు అల్లాహ్ కు భయపడి పాపాలను మరియు విభేదాలను విడనాడుతారు.

ఇక ఎవడైతే అల్లాహ్ తో భయపడకుండా పాపమును చేసే సామర్ధ్యం కలిగినప్పుడు పాపాలకు పాల్పడుతాడో అతనిని ఇహలోకంలో ఆపటానికి అల్లాహ్ హద్దులను ఏర్పరచాడు. అది అల్లాహ్ ముస్లిములను వారు మంచి గురించి ఆదేశించమని మరియు చెడు నుండి వారించమని ఆదేశించాడు. కావున ప్రతీ ముస్లిం పాపము గురించి ఇతరులు దానికి పాల్పడుతుండగా చూసి తాను అల్లాహ్ ముందు ప్రశ్నించబడుతాడని భావిస్తాడు. చివరికి అతనిని దాన్ని పాల్పడటం నుండి చేతితో ఆపే సామర్ధ్యం లేకపోతే నోటితో ఆపుతాడు. మరియు అల్లాహ్ ముస్లిం పాలకులకు [54] అల్లాహ్ ఆదేశములను విభేదించేవారిపై హద్దులను నెలకొల్పమని ఆదేశించాడు. అవి పాపమునకు పాల్పడిన వారిని వారి పాపములను బట్టి శిక్షలు. వాటి గురించి అల్లాహ్ దివ్యఖుర్ఆన్ లో వివరించాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన హదీసులలో వివరించారు. మరియు పాపాత్ములపై వాటిని జారీ చేయమని ఆదేశించాడు. దీని ద్వారా న్యాయము, శాంతి మరియు శ్రేయస్సు విస్తృతమవుతాయి.

 5)    సామాజిక బాధ్యత వహించటం, సహకార విషయంలో:

ముస్లింలు పరస్పరం ఆర్ధికంగా, నైతికంగా సహకరించుకోవాలని అల్లాహ్ ఆదేశించాడు. జకాత్, దానధర్మాల అధ్యాయంలో దాని ప్రకటన జరిగినది. మరియు అల్లాహ్ ముస్లింపై ప్రజలను ఏ రకమైన బాధను కలిగించటంను నిషేధించాడు. చివరికి దారిలో బాధను కలిగించే వస్తువును ఉంచటం దానిని అల్లాహ్ నిషేధించాడు. మరియు ముస్లిం దాన్ని చూసినప్పుడు ఒక వేళ దాన్ని ఇతరులు పెట్టినా అతడు తొలగించాలని ఆదేశించాడు. బాధను కలిగించే వాడికి శిక్ష ద్వారా హెచ్చరించినట్లు దానిపై పుణ్యము గురించి అతనికి వాగ్దానం చేశాడు.

మరియు అల్లాహ్ విశ్వాసపరునిపై అతడు తన స్వయం కొరకు ఇష్టపడినట్లే తన సోదరుని కొరకు ఇష్టపడటమును మరియు తన స్వయం కొరకు ద్వేషించుకున్న దాన్ని తన సోదరుని కొరకు ద్వేషించటంను అనివార్యం చేశాడు. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

మరియు సత్కార్యాల్లో, అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనులలో ఎవరితోను సహకరించకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు.

 [అల్ మాయిదా: 2]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

విశ్వాసులు అన్నదమ్ములు. కనుక మీ అన్నదమ్ముల మధ్య మీరు సర్దుబాటుకు ప్రయత్నించండి.

 [అల్ హుజరాత్: 10]

మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ'అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

 [అన్ నిసా: 114]

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ’తన కోసం కోరుకున్నది, తన సోధరునికోసం కోరుకునేంతవరకు మీలో ఎవ్వరూ (ముమిన్ ) విశ్వాసి కాజాలరు’ [55] మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన జీవిత చివరి కాలంలో హజ్జతుల్ విదాఅ్ లో తన గొప్ప ప్రసంగంలో [56] తాను ముందు ఆదేశించిన వాటిని దృవీకరిస్తూ తెలిపారు. అహ్మద్ ఉల్లేఖించారు.

ఓ ప్రజలారా వినండి! నిశ్చయంగా మీ ప్రభువు ఒక్కడే. మీ తండ్రి ఒక్కడే. వినండి! ఏ అరబ్బునకు అరబ్బేతరునిపై మరియు ఏ అరబ్బేతరునికి ఏ అరబ్బునిపై మరియు ఏ ఎర్రవానికి ఏ నల్లవానిపై మరియు ఏ నల్లవానికి ఏ ఎర్రవానిపై ఎటువంటి ప్రాధాన్యత లేదు కాని దైవభీతి వలన. ఏమీ నేను చేరవేశానా ? వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేరవేశారు అని సమాధానం ఇచ్చారు [57]. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా ప్రవచించారు: నిశ్చయంగా మీ రక్తము, మీ సంపదలు, మీ మానమర్యాదలు మీపై మీ ఈ దినము మీ ఈ పట్టణంలో మీ ఈ నెలలో మీరు మీ ప్రభువును కలుసుకునే రోజు వరకు నిషేధించబడినట్లు నిషేధించబడ్డాయి. వినండి నేను చేరవేశానా ?. వారు అవును అని సమాధానమిచ్చారు. అప్పుడు ఆయన తన వేలును ఆకాశం వైపు ఎత్తి ఓ అల్లాహ్ నీవు సాక్ష్యంగా ఉండు అని పలికారు [58].

 6)    అంతర్గత రాజకీయాల విషయంలో:

అల్లాహ్ తఆలా ముస్లింలను వారు తమలో నుంచే ఎవరినైనా ఎన్నుకుని అతడిని ఇమామ్ గా నియమించుకోవాలి అని ఆదేశించాడు. మరియు వారు విడిపోకుండా ఐకమత్యంగా ఉండి ఒకే సమాజంగా అయిపోవాలని వారిని ఆదేశించాడు. మరియు వారు తమ నాయకునికి, తమ పాలకులకి విధేయులుగా ఉండాలని ఆదేశించాడు కాని వారు అల్లాహ్ కు అవిధేయత చూపమని ఆదేశిస్తే వేరే విషయం. ఎందుకంటే సృష్టికర్తకు అవిధేయత చూపి సృష్టికి విధేయత చూపటం సరికాదు.

మరియు ఒక ముస్లిం తాను ఇస్లాం ధర్మమును బహిర్గతం చేయలేని పట్టణంలో ఉంటే అతడు ఇస్లాం ఉన్న పట్టణాల వైపుకు వలస వెళ్ళాలని అల్లాహ్ అతనికి ఆదేశించాడు [59]. ఆ పట్టణాల్లో వ్వవహారములన్ని ఇస్లాం ధర్మానికి అనుగుణంగా నిర్ణయించబడును మరియు ముస్లిం ఇమామ్ అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారంగా తీర్పు ఇస్తాడు.

ఇస్లాం ప్రాదేశిక హద్దులను మరియు జాతీయ లేదా ప్రజాకర్షక జాతీయతలను అంగీకరించదు. కాని ముస్లిం జాతీయత ఇస్లాం. మరియు దాసులందరు అల్లాహ్ దాసులు. మరియు భూమి అల్లాహ్ యొక్క భూమి. ముస్లిం అందులో ఎటువంటి ఆటంకము లేకుండా అల్లాహ్ ధర్మమునకు కట్టుబడి చలనం సాగించాలి. ఏదైన విషయంలో దాన్ని ఉల్లంఘిస్తే అతనిపై అల్లాహ్ ఆదేశము జారీ అవుతుంది. అల్లాహ్ ధర్మశాసనాలపై అమలు మరియు దాని హద్దులను నెలకోల్పటంలోనే [60] శాంతి స్థాపన మరియు ప్రజల నిలకడ మరియు వారి రక్తముల పరిరక్షణ మరియు వారి మానముల, వారి సంపదల భద్రత కలదు. మరియు అంతా మేలు కలుగును. ధర్మశాసనముల నుండి విముఖత చూపటంలో అంతా చెడు కలుగును.

అల్లాహ్ తఆలా మత్తు పదార్థాలను మరియు మాదకద్రవ్యాలను మరియు బుద్ధిని కోల్పోయేటట్లు చేసే పదార్థములను నిషేధించి బుద్ధులను పరిరక్షించాడు. మరియు మత్తు పదార్థములను సేవించే వారికి శిక్షగా నలభై నుంచి ఎనభై వరకు కొరడా దెబ్బలను దాన్ని చేసిన ప్రతీ సారి విధించాడు. అతనిని వారించటానికి మరియు అతని బుద్ధి పరిరక్షణ కొరకు మరియు అతని కీడు నుండి ప్రజలకు రక్షణగా.

అల్లాహ్ తఆలా అన్యాయంగా దురాక్రమణకు పాల్పడే వాడి నుండి ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా ముస్లిముల రక్తమును పరిరక్షించాడు. కాబట్టి హంతకుడు హతమార్చబడుతాడు. మరియు అల్లాహ్ ముస్లిం కొరకు అతని ప్రాణము నుండి మరియు అతని మానము నుండి మరియు అతని సంపద నుండి రక్షణను ధర్మబద్ధం చేసినట్లే గాయాల విషయంలో ప్రతీకారమును ధర్మబద్ధం చేశాడు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది. బహుశా దీని వల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు.

 [అల్ బఖర: 179]

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:

తన సంపద రక్షణ కోసం చంపబడినవాడు అమరవీరుడు. మరియు తన ధర్మ రక్షణ కోసం చంపబడినవాడు అమరవీరుడు. మరియు తన రక్త రక్షణ కోసం చంపబడినవాడు అమరవీరుడు. మరియు తన ఇంటివారి రక్షణ కోసం చంపబడినవాడు అమరవీరుడు [61].

ముస్లిం గైర్ హాజరీలో అతను ద్వేషించే మాటలను ఎటువంటి హక్కు లేకుండా మాట్లాడటమును నిషేధించి మరియు నైతిక నేరములైన వ్యభిచారము మరియు స్వలింగసంపర్కము అవి ధర్మబద్ధంగా నిరూపించకుండానే వాటి ద్వారా ఒక ముస్లింపై అభాండమును మోపే వారిపై శిక్షను ధర్మబద్ధం చేసి అల్లాహ్ ముస్లిముల మానమర్యాదలను రక్షించాడు.

మరియు అల్లాహ్ తఆలా వ్యభిచారమును నిషేధించి వంశావళిని చట్టవిరుద్ధమైన కలయికల నుండి రక్షించాడు [62]. మరియు మానములను నైతిక పాపములతో అపవిత్రం అవటం నుండి రక్షించాడు. అది పెద్దపాపములలో షుమారు చేయబడుతుంది. మరియు దానికి పాల్పడే వాడిపై వ్యభిచార శిక్ష నెలకొల్పే షరతులకు చేరినప్పుడు అతడిపై నిరోధక శిక్షను విధించాడు.

అల్లాహ్ తఆలా సంపదలను రక్షించాడు: దొంగతనం, మోసం, జూదం, లంచం మరియు ఇతర నిషేధిత సంపదలను నిషేధించటం ద్వారా మరియు దొంగకు, బందిపోటుకు నిరోధకశిక్షను ధర్మబద్ధం చేయటం ద్వారా. అది చేతులు నరకటం దాని షరతులన్ని వర్తించినప్పుడు. లేదా దొంగతనం నిరూపితమై చేతులు నరికే శిక్షకు షరతులు లేనప్పుడు నిరోధక శిక్షను అమలు చేయాలి.

ఈ శిక్షలను ధర్మబద్ధం చేసినవాడు జ్ఞానం కలవాడైన, వివేకవంతుడైన అల్లాహ్. సృష్టితాల స్థితులను మెరుగుపరిచేవాటి గురించి బాగా తెలిసినవాడు అతడే. మరియు అతడు వారిపై అపారంగా కరుణించేవాడు. ఆయన ఈ శిక్షలను ముస్లింలలో తప్పిదాలు చేసేవారి పాపములకు పరిహారంగా మరియు సమాజమును వారి కీడు నుండి మరియు ఇతరుల కీడు నుండి రక్షణగా చేశాడు. మరియు ఇస్లాం శతృవుల్లోంచి, నామమాత్రపు ముస్లిముల్లోంచి ఎవరైతే హంతకుడిని హత్యచేయటమును మరియు దొంగతనం చేసేవారి చేతిని నరకటంను నిందిస్తున్నారో వారు రోగి యొక్క ఆ చెడు అవయవమును కోయటమును నిందిస్తున్నారు దేనినైతే కోయకపోవటం వలన దాని చెడు సమాజంలో వ్యాపిస్తుంది [63]. వారు తమ దుర్మార్గ లక్ష్యాల వలన నిర్దోషులను హతమార్చటమును మంచిగా భావిస్తున్నారు.

 7)    బాహ్య రాజకీయం:

అల్లాహ్ ముస్లిములను మరియు వారి పాలకులను ముస్లిమేతరులని ఇస్లాం వైపుకు ఆహ్వానించమని ఆదేశించాడు. దాని ద్వారా వారిని అవిశ్వాస చీకటుల నుండి రక్షించి అల్లాహ్ పై విశ్వాస వెలుగు వైపునకు తీయటానికి. మరియు ఇహలోక జీవిత భౌతిక విషయాలలో మునిగిపోయే మరియు ముస్లిములు వాస్తవానికి అనుభవించే ఆధ్యాత్మిక ఆనందాన్ని కోల్పోయే దుస్తితి నుండి వారిని రక్షించటానికి. ముస్లింనకు అల్లాహ్ ఆదేశము ఏమిటంటే అతను తన మంచితనంతో ప్రయోజనం కలిగించే మంచి మనిషిగా ఉండాలి మరియు అతడు మానవులందరిని రక్షించటానికి ప్రయత్నించాలి. మానవ ప్రణాళికలకు భీన్నంగా. ఎందుకంటే అవి మానవుడిని మంచి పౌరుడిగా ఉండమని మాత్రమే కోరుతుంది. మరియు ఇది వాటి చెడుపై మరియు వాటి లోపముపై ఆధారము. మరియు ఇస్లాం మంచితనము మరియు దాని పరిపూర్ణతకు ఆధారము.

మరియు అల్లాహ్ ముస్లిములకు అల్లాహ్ శతృవులతో పోరాడటానికి వీలైనంత శక్తిని సిద్ధం చేసుకోమని ఆదేశించాడు. దాని ద్వారా ఇస్లాంను మరియు ముస్లిములను రక్షించటానికి మరియు దాని ద్వారా అల్లాహ్ శతృవులను, తమ శతృవులను భయభ్రాంతులకు గురిచేయటానికి. అలాగే అల్లాహ్ తఆలా ముస్లిమేతరులతో ఇస్లామీయ చట్టం వెలుగులో ఒప్పందాలు చేసుకోవటానికి ముస్లిములకు అనుమతించాడు. మరియు ముస్లిములపై వారు తమ శతృవులతో చేసిన ప్రమాణమును భంగపరచటమును నిషేధించాడు. కాని శతృవులు దాన్ని భంగపరచటం విషయంలో లేదా దాన్ని చేసే చర్యల్లో మొదలు పెడితే తప్ప. వారు దాన్ని భంగమైనట్టుగా భావిస్తారు.

ముస్లిమేతరులతో యుద్ధమును ఆరంభమునకు ముందు అల్లాహ్ తఆలా ముస్లిములకు తమ శతృవులను మొదట ఇస్లాంలో ప్రవేశమవటం వైపునకు ఆహ్వానించమని ఆదేశించాడు. ఒక వేళ వారు నిరాకరిస్తే వారితో జిజియా (సంకము) చెల్లించమని మరియు అల్లాహ్ ఆదేశమునకు శిరసావహించమని [64] కోరాలి. ఒక వేళ వారు నిరాకరిస్తే ధర్మం అంతా ఆయన కొరకు అయ్యి ఎటువంటి ఫిత్నా [65] ఉండనంత వరకు పోరాటం జరగాలి.

యుద్ధ సందర్భంలో పోరాడే వారితో అభిప్రాయమును లేదా చర్యను పంచుకునే వారు మినహా అల్లాహ్ ముస్లిములపై పిల్లలను, స్త్రీలను, వృద్ధులను, దేవాలయాల్లో ఉన్న సన్యాసులను హతమార్చటమును నిషేధించాడు. మరియు వారిని ఖైదీలతో మంచిగా వ్యవహరించమని ఆదేశించాడు. దీనితో ఇస్లాంలో యుద్ధము ఉద్దేశము నియంత్రణ మరియు దోపిడీ ఉద్దేశముతో కాదని మనకు అర్ధమవుతుంది. దాని ఉద్దేశము సత్యమును మరియు సృష్టిరాసుల పట్ల కారుణ్యమును వ్యాపింపజేయటం. మరియు ప్రజలను సృష్టిరాసుల ఆరాధన నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ ఆరాధన వైపుకు తీయటం మాత్రమే.

 8)    స్వేచ్ఛ విషయంలో:

 (a) విశ్వాస స్వేచ్ఛ:

      అల్లాహ్ తఆలా ఇస్లాం ధర్మంలో ముస్లీమేతరులలోంచి వారి ముందు ఇస్లాం ప్రకటన అయిన తరువాత మరియు దాని వైపు వారు పిలవబడిన తరువాత దాని పాలన క్రిందకు వచ్చే వారికి మత స్వేచ్ఛను ప్రసాదించాడు. ఒక వేళ వారు ఇస్లాంను ఎంచుకుంటే అందులో అతని శుభము మరియు మనుగడ కలదు. ఒక వేళ తన ధర్మంపై ఉండటమును ఎంచుకుంటే అతడు తన స్వయం కొరకు అవిశ్వాసమును, నిర్భాగ్యమును, నరకాగ్నిలో శిక్షను ఎంచుకున్నాడు. దీనితో అతనిపై ఆధారం నిరూపితమవుతుంది. మరియు అల్లాహ్ ముందు అతనికి ఎటువంటి సాకు ఉండదు. అప్పుడు ముస్లిములు అతనిని లోబడి ఉండి జిజియా చెల్లించే షరతుపై అతని ధర్మంపై వదిలివేస్తారు. మరియు అతడు ఇస్లాం నిబంధనలకు లోబడి ఉంటాడు. మరియు ముస్లింల ముందు అవిశ్వాసం యొక్క ఆచారాలను ప్రదర్శించడు.

      ఇక ముస్లిం ఇస్లాంలో ప్రవేశించిన తరువాత అతని నుండి మతభ్రష్టత్వం అంగీకరించబడదు. ఒక వేళ అతను మతభ్రష్టుడైతే అతని శిక్ష హత్యే అవుతుంది. ఇది ఎందుకంటే అతను సత్యమును తెలుసుకున్న తరువాత దాని నుండి మరలిపోవటం వలన జీవనం సాగించే అర్హతను కోల్పోయాడు. కాని అతను పశ్చాత్తాపముతో అల్లాహ్ వైపు మరలి ఇస్లాం వైపునకు మరలితే వేరేవిషయం [66].

ఒక వేళ ఎవరైన ఇస్లాం నుండి తొలగించే కార్యమునకు పాల్పడితే అతడు ఆ కార్యంను వదిలివేస్తూ, దానిపై అయిష్టత చూపుతూ అల్లాహ్ తో మన్నింపును వేడుకుంటూ ఆ కార్యం నుండి తౌబా చేయాలి.

 ఇస్లాం నుండి తొలగించే కార్యాలు చాలా కలవు వాటిలో ప్రసిద్ధిచెందినవి:

      అల్లాహ్ తోపాటు సాటి కల్పించటం అంటే దాసుడు అల్లాహ్ తో పాటు ఇంకొక ఆరాధ్య దైవమును ఏర్పరచుకోవటం. ఒక వేళ అది అల్లాహ్ కు మరియు తనకు మధ్య మధ్యవర్తిని నియమించుకుని అతడిని వేడుకుని, ఆయనకు సాన్నిద్యమును కోరినా (అది షిర్కే అవుతుంది). వారు దైవత్వము, ఆరాధన అర్థము తెలుసుకోవటం వలన అతని దైవత్వమును పేరుని బట్టి, అర్థమును బట్టి అంగీకరించినా(అది షిర్కే) ఎలాగైతే అజ్ఞాన కాలపు బహుదైవారాధకులు తమ పూర్వ పుణ్యాత్ముల విగ్రహాలు తయారు చేసుకుని వారి సిఫారసుని కోరే ఉద్దేశంతో వారిని ఆరాధించేవారు. లేదా అది అల్లాహ్ తోపాటు ఆరాధ్య దైవమని మరియు దాని ఆరాధన ఆయన ఆరాధన అని అంగీకరించకపోయినా (షిర్కే అవుతుంది) ఎలాగైతే పేరుకి నామమాత్రపు ముస్లిములైన వారి పరిస్థితి ఉందో. వారిని తౌహీద్ విశ్వాసం వైపు పిలిచినా వారు దాన్ని స్వీకరించరు. వారు షిర్క్ అంటే విగ్రహాలకు సాష్టాంగపడటం లేదా అల్లాహ్ ను వదిలి ఏదైన వస్తువును ఇది నా దైవం అని పలకటం మాత్రమే (షిర్క్) అని భావిస్తున్నారు.

వారి ఉపమానము మధ్యమును వేరే పేరు పెట్టి త్రాగే వారిలా ఉన్నది. వారి పరిస్థితుల వివరణ ముందు ప్రస్తావించబడినది. అల్లాహ్ తఆలా ఇలా సెలవిస్తున్నాడు: కాబట్టి నీవు ధర్మాన్ని ఆయనకు (అల్లాహ్ కు) మాత్రమే ప్రత్యేకిస్తూ అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు {వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదిలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు):

"వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిద్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు}.

 [అజ్ జుమర్: 2-3]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

ఈ అల్లాహ్ యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదిలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.(13) మీరు వారిని వేడుకున్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు.(14)

[ఫాతిర్: 13-14]

1.      బహుదైవారాధకులను మరియు ఇతర అవిశ్వాసపరులను అవిశ్వాసపరులని పరిగణించకపోవటం: యూదులు, క్రైస్తవులు, నాస్తికులు, మజూసీలు మరియు తాగూత్ కి పాల్పడిన వారిలా, వారు అల్లాహ్ అవతరింపజేసిన వాటితో కాకుండా ఇతరవాటితో తీర్పునిస్తారు మరియు వారు అల్లాహ్ తీర్పును ఇష్టపడరు. ఎవరైతే వారిని అల్లాహ్ కాఫిర్ లని (అల్లాహ్ ను తిరస్కరించిన వారని) తెలుసుకున్న తరువాత కూడా వారిని అవిశ్వాసపరులుగా పరిగణించలేదో అతడు అవిశ్వాసపరుడే అవుతాడు.

2.       పెద్ద షిర్క్ తో కూడుకున్న మంత్రజాలమును చేసిన వాడు లేదా అది చేయటం అవిశ్వాసం అని తెలిసిన తరువాత దాన్ని ఇష్టపడిన వాడు అవిశ్వాసమునకు పాల్పడ్డాడు.

3.      ఏదైన ధర్మశాసనమును లేదా వ్యవస్థను ఇస్లాం ధర్మశాసనం కంటే మంచిదని లేదా ప్రవక్తేతరుల తీర్పు ప్రవక్త తీర్పు కంటే గొప్పదని లేదా అల్లాహ్ ఆదేశము కాకుండా ఇతరుల ఆదేశం సమ్మతమని విశ్వసించటం.

4.       ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ద్వేషమును కలిగి ఉండటం లేదా ఏదైన విషయము ఆయన ధర్మములోనిది అని తెలిసి ద్వేషమును కలిగి ఉండటం.

5.      ఏదైన విషయము ఇస్లాం ధర్మములోనిది అని తెలిసి హేళన చేయటం [67].

6.      ఇస్లాం విజయం పట్ల ద్వేషంను కలిగి ఉండటం లేదా దాని పరాజయంతో సంతోషపడటం

7.      అవిశ్వాసులతో స్నేహం చేసేవాడు వారిలో షుమారు చేయబడుతాడని తెలిసి కూడా వారితో వారి ప్రేమ, వారితో సహాయం ద్వారా స్నేహం చేయటం.

8.      ఏ విషయంలోనైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మశాసనం (షరీఅత్) ను అదిగమించడానికి ఏ ఒక్కరికి అవకాశం లేనప్పటికీ తనకు తాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరీఅత్ యొక్క పరిమితులను అదిగమించగలడని విశ్వసించటం.

9.      అల్లాహ్ ధర్మము నుండి విముఖత చూపటం. కాబట్టి ఎవరైతే ఇస్లాంను తెలుసుకున్న తరువాత దాని నుండి విముఖత చూపుతాడో అంటే దాన్ని నేర్చుకోడో మరియు దాని ప్రకారం ఆచరించడో వాడు కాఫిర్ అయిపోతాడు.

10.   సంయోగము ఉన్న ఇస్లాం ఆదేశముల్లోంచి ఏదైన ఆదేశమును తిరస్కరించటం. మరియు దాని లాంటి ఆదేశం గోప్యంగా ఉండకూడదు. ఈ నవాఖిజ్ (ఇస్లాంను విచ్ఛిన్నం చేసే) పై సూచించే ఆధారాలు ఖుర్ఆన్ మరియు సున్నత్ లో చాలా కలవు.

 (b) అభిప్రాయ స్వేచ్ఛ:

      ఇస్లాం బోధనలకు ఆ అభిప్రాయం విరుద్ధం అవకూడదు అనే షరతుపై అల్లాహ్ తఆలా ఇస్లాంలో అభిప్రాయ స్వేచ్ఛను ఇచ్చాడు. కాబట్టి ముస్లిం ప్రతి ఒక్కరి ముందు సత్యవాక్యాన్ని పలకమని అల్లాహ్ ఆదేశించాడు. అల్లాహ్ విషయంలో అతన్ని నిందించే వాడి నిందన పట్టుకోకూడదు. మరియు ఆయన దాన్ని గొప్ప జిహాద్ గా చేశాడు. మరియు ముస్లింల పాలకులకు హితోపదేశం చేయమని మరియు వారిని విభేదాల నుంచి వారించమని ఆదేశించాడు. మరియు అసత్యం వైపు పిలిచే వారిని ఖండించమని మరియు వారిని వారించమని అతనికి ఆదేశించాడు. ఇది అభిప్రాయమును గౌరవించే గొప్ప మరియు అందమైన వ్యవస్థ. ఇక అల్లాహ్ ధర్మశాసనమునకు విరుద్ధమైన అభిప్రాయము దాన్ని వ్యక్తపరచటమునకు అనుమతించబడదు. ఎందుకంటే అది విధ్వంసం, చెడును వ్యాపింపచేయటం మరియు హక్కుతో పోరాడటం.

 (c) వ్యక్తిగత స్వేచ్ఛ:

      మరియు అల్లాహ్ ఇస్లాంలో పరిశుద్ధ ఇస్లామీయ ధర్మశాసనాల పరిధిలో వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించాడు. కాబట్టి ఆయన మనిషికి అతను పురుషుడైన లేదా స్త్రీ అయిన అతనికి మరియు ఇతరులకి మధ్య ఉన్న అతని వ్యవహారాలైన క్రియావిక్రయాలు, ఇవ్వటం, సమర్పించటం, మన్నింపు లాంటి విషయాల్లో స్వేచ్ఛను ప్రసాదించాడు. మరియు స్త్రీ పురుషుల్లోంచి ప్రతీ ఒక్కరికి జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. కావున వారిలో నుంచి ఏ ఒక్కరికి వారికి ఇష్టం లేని వారిని ఎంచుకోవటంపై బలవంతం చేయబడదు. మరియు స్త్రీకి ధర్మం విషయంలో సమానం కాని పురుషుడిని ఎంచుకునే అనుమతి లేదు. ఆమె విశ్వాసమును, ఆమె గౌరవమును కాపాడటానికి. మరియు ఇది ఆమెకి మరియు ఆమె కుటుంబమునకు ప్రయోజనం చేకూర్చటానికి.

      మరియు స్త్రీ సంరక్షకుడు - ఆమె దగ్గరి బంధువు లేదా అతని ప్రతినిధి - అతడు ఆమె వివాహం చేసే బాధ్యతను తీసుకుంటాడు. ఎందుకంటే స్త్రీ స్వయంగా వివాహం చేసుకోదు అలా చేయటం వలన ఆమె వ్యభిచార స్త్రీకి సమానమవుతుంది కాబట్టి. అప్పుడు అతడు (సంరక్షకుడు) వివాహం చేసుకునే వ్యక్తితో నేను ఫలా స్త్రీని నీకిచ్చి వివాహం చేస్తున్నాను అంటాడు. అప్పుడు అతడు తన మాటల్లో నేను ఈ వివాహమును స్వీకరిస్తున్నాను (అని అంటాడు). వివాహ సమయంలో ఇద్దరు సాక్షులు హాజరై ఉండాలి.

      ఇస్లాం అల్లాహ్ ధర్మబద్ధం చేసిన హద్దులను జవదాటటమునకు ముస్లింనకు అనుమతి ఇవ్వదు. అతను మరియు అతని ఆదీనంలో ఉన్నవి అల్లాహ్ ఆదీనంలో ఉన్నవి. కావున అల్లాహ్ తన దాసుల కొరకు కారుణ్యంగా నియమించిన అల్లాహ్ ధర్మశాసనాల హద్దుల్లో ఉండి అతను కార్యనిర్వహణ చేయటం అతనిపై తప్పనిసరి. ఎవరైతే వాటిని అదిమి పట్టుకుంటాడో అతడు సన్మార్గం పొందుతాడు మరియు సాఫల్యం చెందుతాడు. మరియు ఎవరైతే వాటిని విభేదిస్తాడో అతడు నిర్భాగ్యుడైపోతాడు మరియు నాశనమైపోతాడు. అందుకనే అల్లాహ్ వ్యభిచారమును, స్వయంసంపర్కమును తీవ్రంగా నిషేధించాడు. మరియు ఆత్మహత్య చేసుకోవటమును మరియు అల్లాహ్ సృష్టించిన సృష్టిరూపమును మార్చటమును ముస్లింపై నిషేధించాడు.

      ఇక మీసములను కత్తిరించటం, గోళ్ళను కత్తిరించటం, బొడ్డు క్రింద వెంట్రుకలను మరియు సంకలో వెంట్రుకలను తొలగించటం, సున్తీ చేయటం అల్లాహ్ తఆలా వాటిని చేయటం గురించి ఆదేశించాడు.

      మరియు అల్లాహ్ శతృవుల ప్రత్యేక విషయాలలో వారిని పోలి ఉండటమును అల్లాహ్ ముస్లింపై నిషేధించాడు. ఎందుకంటే వారిని పోలి ఉండటం మరియు బాహ్య విషయాలలో వారిని ప్రేమించడం వారిని పోలి ఉండటం వైపు మరియు హృదయంలో వారిని ప్రేమించటం వైపు దారితీస్తుంది.

మరియు అల్లాహ్ ఒక ముస్లిం సరైన ఇస్లామీయ ఆలోచనకు మూలం అవ్వాలని మరియు మానవుల ఆలోచనలకు మరియు వారి అభిప్రాయములకు మూలం కాకుడదు అని కోరుకుంటున్నాడు. మరియు అల్లాహ్ ఒక ముస్లిం అనుకరించేవాడు (ముఖల్లిద్) కాకుండా మంచి నమూనా అవ్వాలని కోరుకుంటున్నాడు.

      ఇక సరైన పరిశ్రమలు మరియు వృత్తిపరమైన నైపుణ్యతల విషయానికి వస్తే ఇస్లాం వాటిని నేర్చుకోవాలని మరియు వాటి నుండి గ్రహించాలని ఆదేశిస్తుంది. ఒక వేళ అది ముస్లిమేతరుల వద్ద ఉన్నా సరే. ఎందుకంటే మనిషికి అసలైన నేర్పించేవాడు అల్లాహ్. అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు: ఆయన మానవుడికి తెలియని విషయాలను భోదించాడు. [అల్ అలఖ్: 5]

      మనిషి తన వ్యక్తిగత స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవటంలో, తన గౌరవమును కాపాడుకోవడంలో మరియు తన మరియు ఇతరుల చెడు నుండి తనను తాను రక్షించుకోవడంలో ఇది మనిషి యొక్క సంస్కరణ మరియు సుహృద్భావానికి అత్యున్నత ప్రదేశం.

 (d) నివాసం యొక్క స్వేచ్ఛ:

      అల్లాహ్ ముస్లింనకు నివాస స్వేచ్ఛను ఇచ్చాడు. కాబట్టి అతని అనుమతి లేకుండా ఎవరూ అతని వద్దకు ప్రవేశించకూడదు మరియు అతని ఆశ్రమంలో అతని అనుమతి లేకుండా అతనివైపు తొంగి చూడకూడదు.

 (e) సంపాదన స్వేచ్ఛ:

      మరియు అల్లాహ్ తాను నిర్దేశించిన పరిమితుల్లో సంపాదించడానికి మరియు ఖర్చు పెట్టటానికి అల్లాహ్ ముస్లింకు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి అతను తన స్వయమునకు మరియు తన కుటుంబమునకు సరిపోవటానికి మరియు పుణ్య మార్గముల్లో, మంచి మార్గముల్లో ఖర్చు చేయడానికి అతనికి పనిచేయమని మరియు సంపాదించమని అల్లాహ్ ఆదేశించాడు. అదే సమయంలో అల్లాహ్ అతనిపై వడ్డీ, జూదం, లంచం, దొంగతనం, యాజకత్వం, మంత్రజాలం, వ్యభిచారం, స్వలింగసంపర్కం లాంటి నిషేధిత సంపాదనలను నిషేధించాడు. మరియు అల్లాహ్ ప్రాణం కల వాటి రూపములను తయారు చేయటం[68] పై సొమ్ము, మధ్యం, పంది, నిషేధిత ఆటల పరికరాల పై సొమ్ము మరియు పాటపాడటం, నాట్యం చేయటం పై వేతనం లాంటి నిషేధిత సొమ్ములను నిషేధించాడు. వీటి నుండి సంపాదించటమును నిషేధించబడినట్లే వాటిలో ఖర్చు చేయటం కూడా నిషేదమే. మరియు ఒక ముస్లిం కొరకు ధర్మబద్ధం చేయబడిన మార్గముల్లో తప్ప వేరే వాటిలో ఖర్చు చేయటం సరికాదు. మరియు ఇది మనిషి హలాల్ సంపాదన ద్వారా ధనికునిగా, సంతోషముగా జీవించటానికి అతని కొరకు సంపాదించటం మరియు ఖర్చు చేయటం పరంగా మార్గదర్శకం మరియు సంస్కరణ యొక్క ఉత్తమ స్థానం.

 9)    కుటుంబం విషయంలో:

అల్లాహ్ తఆలా ఇస్లామీయ షరీఅత్ లో కుటుంబమును అత్యంత సంపూర్ణ వ్వవస్థగా తీర్చిదిద్దాడు. దాన్ని పాటించేవారికి సంతోషకరమైన జీవన కారకాలు లభిస్తాయి. కాబట్టి ఆయన తల్లిదండ్రల పట్ల మంచి మాటలతో మరియు వారు ఒక వేళ దూరంగా ఉంటే వారిని పదేపదే కలవటానికి వెళ్ళటంతో మరియు వారి సేవ చేయటంతో మరియు వారి అవసరాలను తీర్చటంతో మరియు వారి ఖర్చులను భరించటంతో మరియు వారిరువురు లేదా ఒకరు నిరుపేదలైతే వారికి నివాసమును ఏర్పాటు చేయటంతో మంచిగా మెలగటమును ధర్మబద్దం చేశాడు. మరియు అల్లాహ్ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే వారికి శిక్ష ద్వారా హెచ్చరించాడు. మరియు వారి పట్ల మంచిగా మెలిగే వారికి సుఖవంతమైన జీవితము యొక్క వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వివాహమును ధర్మబద్ధం చేశాడు. మరియు దాని ధర్మబద్ధం అవటంలో కల విజ్ఞతను తన గ్రంధంలో మరియు తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోటితో స్పష్టపరచాడు.

***

 వివాహం ధర్మబద్ధం అవటంలో కల విజ్ఞత

1.      వివాహము ద్వారా పవిత్రత యొక్క అతిపెద్ద కారకం ఏర్పాటు అవుతుంది. మరియు హరాం కార్యమైన వ్యభిచారము నుండి మర్మాంగముల రక్షణ కలుగును మరియు హరాం వైపు చూడటం నుండి కళ్ళకు భద్రత లభించును.

2.      వివాహం ద్వారా భార్యాభర్తల్లోంచి ప్రతి ఒక్కరికి తన జీవిత భాగస్వామి ద్వారా మనశ్శాంతి మరియు భరోసా లభించును. ఎందుకంటే అల్లాహ్ వారి మధ్య ఆప్యాయతను మరియు కనికరమును ఉంచాడు.

3.      వివాహం ద్వారా ముస్లిముల సంఖ్య ధర్మబద్ధంగా అధికమగును. అందులో పరిశుభ్రత మరియు ప్రయోజనం ఉండును.

4.      వివాహం ద్వారా భార్యాభర్తలు ఇరువురు అల్లాహ్ చేసిన విధంగా తమ స్వభావానికి సరిపోయే పనులు చేసినప్పుడు తమ జీవిత భాగస్వామికి సేవచేస్తారు.

కావున పురుషుడు ఇంటి వెలుపల పనిచేస్తాడు. మరియు తన భార్య మరియు పిల్లల కోసం ఖర్చు చేయడానికి డబ్బు సంపాదిస్తాడు. మరియు భార్య ఇంటి లోపల పని చేస్తుంది. కాబట్టి ఆమె గర్భం మోస్తుంది మరియు పిల్లలకు పాలు పట్టిస్తుంది. మరియు పిల్లలను పోషిస్తుంది మరియు తన భర్త కొరకు ఆహారమును, ఇంటిని, పరుపుని సిద్ధం చేస్తుంది. అతడు అలసిసలసి ఇంటికొచ్చినప్పుడు అతని నుండి అలసట మరియు బాధ తొలగిపోతుంది. మరియు అతడు తన భార్య ద్వారా తన సంతానము ద్వారా తన మనస్సును కుదుటపరచుకుంటాడు. మరియు వారందరు స్వేచ్ఛగా, సంతోషంగా జీవనం గడుపుతారు. మరియు ఆమె తన స్వయం కొరకు లేదా తన భర్త సంపాదనలో ఇద్దరి అంగీకారంతో భర్తకు సహాయంగా నిలబడటంలో తప్పు లేదు. కాని ఆమె పరాయి పురుషులతో కలిసి కూర్చోకుండా వారితో దూరంగా ఉండే పనులను చేయాలనేది షరతు. ఇది ఆమె తన ఇంటిలో లేదా తన సొంత వ్యవసాయ భూమిలో లేదా తన భర్త వ్యవసాయ భూమిలో లేదా తన కుటుంబం వారి భూమిలో అయితేనే సాధ్యమగును. ఇక పురుషులతో కలిసి కూర్చునే ప్రదేశాలు ఫ్యాక్టిరీ లేదా ఆఫిస్ లేదా షాపులు లేదా అటువంటి ప్రదేశాలు స్త్రీ కొరకు సమ్మతం కాదు. ఒక వేళ ఆమె పని చేయటానికి ఇష్టపడినా ఆమె భర్త లేదా ఆమె పిల్లలు లేదా ఆమె కుటుంబం వారికి ఆమెకు అనుమతించటం సమ్మతం కాదు. ఆమె అలా పనిచేయటంలో సమాజంలో చెడు ప్రబలే ఆవశ్యకత ఉండటం వలన. ఇక స్త్రీ పరాయి పురుషుల ముందు రాకుండా తన ఇంటిలోనే సురక్షితంగా పరదాలో భద్రంగా ఉన్నంత కాలం పాపాత్ముల చేతులు ఆమెకు చేరుకోవు మరియు దుర్మార్గ కళ్ళు ఆమెపై పడవు. ఆమె ప్రజల మధ్యకు వస్తే అప్పుడు ఆమె తన విలువైన శీలమును కోల్పోతుంది మరియు తోడేల్ల మధ్య మేకలా అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆమె కొంచెం సమయం గడుపుతుందో లేదో ఆ చెడ్డవారందరు ఆమె గౌరవమును మర్యాదను చీల్చి చెండాడేస్తారు.

మరియు ఒక వేళ భర్త ఒక భార్యతో సంతృప్తి చెందకపోతే అల్లాహ్ అతనికి నలుగురు భార్యల వరకు వివాహం చేసుకునే అనుమతిచ్చాడు. కాని అతడు నివాసం, ఖర్చు, రాత్రి గడపటం విషయంలో వారి మధ్య న్యాయంగా వ్యవహరించాలనేది షరతు. ఇక హృదయ ప్రేమ విషయంలో న్యాయం షరతు కాదు. ఎందుకంటే మనిషికి దాని శక్తి లేదు. మరియు దాని విషయంలో అతడు నిందించబడడు. మరియు అల్లాహ్ తన మాటలో మనిషి శక్తిని నిరాకరించిన న్యాయం ఏమిటంటే: మీరు ఎంతగా ఆశించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్నీవిధాలా న్యాయం చేయటమన్నది మీ వల్ల కాని పని. [అన్నిసా: 129] అది ప్రేమ మరియు దానికి సంబంధించిన విషయము. అయితే ఈ న్యాయము దాని లభించకపోవటమును అల్లాహ్ బహుళ వివాహము నుండి ఆటంకపరిచేదిగా చేయలేదు. ఎందుకంటే అతనికి (భర్తకి) సాధ్యం కాదు. అల్లాహ్ ప్రవక్తల కొరకు మరియు భార్యల మధ్య న్యాయం చేసే సామర్ధ్యం కలవారి కొరకు బహుళ వివాహమును ధర్మబద్ధం చేశాడు. ఎందుకంటే అల్లాహ్ కు పురుషుల, స్త్రీల ప్రయోజనాల గురించి బాగా తెలుసు కాబట్టి అది పురుషుల కొరకు మరియు స్త్రీల కొరకు మంచిది. అది ఎందుకంటే ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తి లైంగిక సుముఖత కలిగి ఉంటాడు దాని వలన అతడు నలుగురు స్త్రీల లైంగిక అవసరాన్ని పూరించగలడు. మరియు వారికి ఉపశమనం కలిగించగలడు. ఇది క్రైస్తవులవలే [69] మరియు ఇతరుల వలే ఒక స్త్రీకి మాత్రమే పరిమితమైతే, ఏ విధంగా నైతే పేరుకి ముస్లింలు అయిన వారు ప్రకటించారో.ఈ ఉపద్రవాలు సంభవిస్తాయి:

ఒకటి: ఒక వేళ భర్త విశ్వాసపరుడై, అల్లాహ్ కు విధేయుడై ఉండి అల్లాహ్ కు భయపడుతూ ఉంటే నిశ్చయంగా అతడు ఈ నియమము, నిబంధము వలన తన జీవితాన్ని లేమిగా భావిస్తాడు. మరియు ధర్మసమ్మతమైన తన కోరికలను అణచివేయటానికి బలవంతం చేయబడుతాడు ఎందుకంటే ఒక్కటైతే గర్భము చివరి మాసములు, పురిటిరక్త స్రావము, ఋతుస్రావము మరియు అనారోగ్యము ఇవి భర్తను ఆమెతో ప్రయోజనం చెందటం నుండి నిరోధిస్తాయి. అప్పుడు అతను తన జీవితపు కొన్ని దినములు భార్య లేనట్లు జీవించవలసి వస్తుంది. ఈ పరిస్థితి ఆమె అతనిని ఇష్టపడి, అతడు ఆమెను ప్రేమించి ఆమె అతనిని ప్రేమిస్తుండగా జరుగుతుంది. ఇక ఆమె అతనిని ఇష్టపడకుండా ఉంటే పరిస్థితి దాని కన్న అధ్వాన్నంగా తయారవుతుంది.

రెండు: ఒక వేళ భర్త అల్లాహ్ కు అవిధేయుడై, అవినీతిపరుడైతే అతడు వ్యభిచారమునకు పాల్పడుతాడు. మరియు తన భార్యను విస్మరిస్తాడు. బహుళ భార్యల విషయమును నిరాకరించేవారు చాలా మంది వ్యభిచారమునకు పాల్పడుతున్నారు. బహుళ భార్యల అపరిమిత విషయంలో అవినీతికి పాల్పడుతున్నారు. మరియు ఇంతకంటే పెద్ద విషయం ధర్మబద్ధం చేయబడిన బహుళ భార్యలను నిరాకరించే వాడు, దానిని అల్లాహ్ సమ్మతించాడని తెలిసి కూడా దానిలో లోపమును చూపేవాడు అవిశ్వసించిన వాడవుతాడు.

మూడు: బహుళ భార్యల విషయము నిషేధించబడితే చాలా మంది స్త్రీలకు వివాహాలు జరగవు మరియు సంతానము కలగదు. అప్పుడు శీలవతులైన పుణ్య స్త్రీల్లోంచి చాలా మంది వివాహం కాకుండా, అభాగ్యులుగా జీవిస్తారు. మరియు వేరే స్త్రీలు అశ్లీలతకు పాల్పడే వేశ్యలుగా జీవిస్తారు. అపరాధులు వారి మానములతో ఆడుకుంటారు.

యుద్ధాల్లో మరియు ప్రమాదకరమైన చర్యల్లో పాల్గొనటం వలన పురుషులు చనిపోవటం వలన పురుషుల కన్నా స్త్రీలు అధికంగా ఉన్నారన్న విషయం అందరికి తెలుసు. అలాగే యుక్త వయస్సు నుండే స్త్రీలు వివాహం కొరకు సిద్ధంగా ఉంటారన్న విషయము తెలుసు. ఇక పురుషులు యుక్త వయస్సు వచ్చినా కూడా వివాహం కొరకు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే వారిలో చాలా మంది మహర్ ఇవ్వలేక, వైవాహిక జీవిత బాధ్యతలకు ఖర్చు చేయలేక వివాహం చేసుకోలేకపోతున్నారు. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే ఇస్లాం స్త్రీకు న్యాయం చేకూర్చింది మరియు ఆమె పై దయ చూపింది. ఇక ధర్మబద్ధమైన బహుళ భార్యల విషయంలో వ్యతిరేకించేవారు స్త్రీకి, సద్గుణాలకు, దైవప్రవక్తలకు శతృవులు. బహుళ భార్యలు అన్నది దైవప్రవక్తల సంప్రదాయము. ఎందుకంటే వారు స్త్రీలను వివాహం చేసుకుంటారు మరియు అల్లాహ్ వారికి సూచించిన పరిమితుల విషయంలో వారి మధ్య వారు సమీకరిస్తారు.

భర్త ఇంకొక భార్యను వివాహం చేసుకున్నప్పుడు మొదటి భార్య అనుభవించే అసూయ మరియు విచారము భావోద్వేగ విషయము. భావోద్వేగమును ధార్మిక ఆదేశాల్లోంచి ఏ ఆదేశము కన్న ముందు ఉంచటం సరికాదు. మరియు స్త్రీ వివాహానికి ముందు కాబోయే భర్తతో తనను వివాహం చేసుకున్న తరువాత ఇంకొక వివాహం చేసుకోకూడదని స్వయంగా షరతు పెట్టవచ్చు. ఒక వేళ అతడు ఆ షరతును అంగీకరిస్తే షరతును పూర్తిచేయటం తప్పనిసరి. ఒక వేళ అతను రెండవ వివాహం చేసుకుంటే మొదటి భార్య వివాహ బంధంలో ఉండే లేదా వివాహ బంధమును రద్దు చేసుకునే అనుమతి కలదు. మరియు భర్త భార్యకు ఇచ్చినది ఏదీ తీసుకోకూడదు.

మరియు అల్లాహ్ తలాఖ్ ను (విడాకులను) ధర్మబద్ధం చేశాడు. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య విభేదాలు, వ్యతిరేకతలు తలెత్తినప్పుడు మరియు భార్యాభర్తల్లోంచి ఒకరికి ఇంకొకరిపై ప్రేమ లేనప్పుడు; వారిరువురు విభేదాల్లో, వ్యతిరేకతలలో జీవనం కొనసాగించకుండా ఉండటానికి మరియు వారిలో ప్రతి ఒక్కరు తాము తమ మిగిలిన జీవితంలో సంతృప్తి చెందే ఇష్టమైన జతను పొందటానికి మరియు వారిలో నుండి ప్రతి ఒక్కరు ఇస్లాంపై మరణించినప్పుడు పరలోకంలో [70] సంతోషమును పొందటానికి(అల్లాహ్ తలాఖ్ను ధర్మబద్ధం చేశాడు).

 10)                    ఆరోగ్యం విషయంలో:

ఇస్లామీయ ధర్మశాస్త్రము వైద్యము యొక్క అన్ని మూలాలను తీసుకుని వచ్చింది. దివ్యఖుర్ఆన్ లో మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో అనేక మానసిక, శారీరక వ్యాధుల ప్రకటన కలదు. మరియు వాటి భౌతిక మరియు ఆధ్యాత్మిక చికిత్స ప్రకటన కలదు.

అల్లాహ్ తఆలా ఇలా సెలవిచ్చాడు:

ఖుర్'ఆను' లో మనము విశ్వాసుల కొరకు ఆసాంతం స్వస్థత కారుణ్య ప్రదాయినిని అవతరింపజేస్తున్నాము.

[అల్ ఇస్రా: 82]

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ ఏ రోగమును దించినా దానితో పాటు దాని వైద్యమును దించుతాడు. దాన్ని కొందరు తెలుసుకుంటారు మరియు కొందరు తెలుసుకోరు [71].

ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీరు వైద్యం చేసుకోండి, నిషిద్ధవాటితో వైద్యం చేసుకోకండి [72]. అల్లామా ఇమామ్ ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ పుస్తకం "జాదుల్ మఆద్ ఫీ హద్యి ఖైరిల్ ఇబాద్" లో దీని వివరణ కలదు. కావున ఈ పుస్తకమును సమీక్షించాలి. ఇది ఇస్లాంను మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను తెలపటానికి అత్యంత ఉపయోగకరమైన, సరైన మరియు సమగ్రమైన ఇస్లామీయ పుస్తకాలలో ఒకటి.

 11)  ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమ మరియు వ్యవసాయం:

 ప్రజలకు నీరు, ఆహారం, ప్రజా ఉపయోగం మరియు వారి పునరావాసం, వారి నగరాల మరియు గ్రామాల పరిశుభ్రత, వాటిలో ట్రాఫిక్ నిబంధనలకు హామీ ఇవ్వడం, మోసం మరియు అబద్ధాలపై యుద్ధం మొదలైన వాటికి అవసరమైన అన్నీ విషయాలు ఇస్లాంలో వివరంగా ఉన్నాయి

 12)                    గోప్య శతృవుల ప్రకటన మరియు వారి నుండి రక్షణ విషయంలో:

అల్లాహ్ తఆలా తన ముస్లిం దాసుని కొరకు దివ్యఖుర్ఆన్ లో అతనిని ఇహపరాల్లో వినాశనం వైపునకు తీసుకునిపోయే శతృవులు వారిని అనుసరించినప్పుడు ఉన్నారని స్పష్టపరచాడు. కాబట్టి ఆయన తన దాసుడిని వారి నుండి హెచ్చరించాడు. మరియు అతని కొరకు వారి నుండి తప్పించుకునే మార్గమును తెలియపరచాడు. ఆ శతృవులందరు వీరు:

 వారిలో మొదటివాడు: శపించబడిన షైతాను: ఇతడు ఇతర శతృవులను మానవునికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ప్రేరేపిస్తాడు. అతడు మన తల్లిదండ్రులైన ఆదం, హవ్వాలకు శతృవు. అతడే వారిని స్వర్గంలో నుంచి బయటకు తీశాడు. మరియు అతడు ఇహలోక ముగింపు వరకు ఆదమ్ సంతతి కొరకు శాశ్వత శతృవు. వారిని అల్లాహ్ పట్ల అవిశ్వాసములో పడవేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు చివరికి అల్లాహ్ వారిని అతనితో పాటు నరకంలో శాశ్వతంగా ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ రక్షించుగాక. మరియు అతడు ఎవరినైతే అవిశ్వాసంలో పడవేయలేడో వారిని అల్లాహ్ ఆగ్రహమునకు మరియు ఆయన శిక్షకు గురి చేసే పాప కార్యములలో పడవేస్తాడు.

మరియు షైతాను ఎలాంటి సృష్టి అంటే అతడు మనిషి రక్తం ప్రవాహముతో ప్రవహిస్తాడు. అతని మనస్సులో దుష్ప్రేరణలు కలిగిస్తాడు. మరియు చెడును అతని ముందు అలంకరించి చూపుతాడు. చివరికి అతను అతడిని అనుసరించినప్పుడు అతడు అతనిని అందులో పడవేస్తాడు. అతడి నుండి తప్పించుకొనుటకు మార్గం అల్లాహ్ సుబహానహు వతఆలా తెలియపరచినట్లు ముస్లిం క్రోధానికి గురైనప్పుడు లేదా పాపకార్యము చేయటానికి పూనుకున్నప్పుడు "అఊజుబిల్లాహి మినష్షైతానిర్రజీమ్" (నేను ధూత్కరించబడిన షైతాను నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను) అని చదవాలి. మరియు తన మనస్సులో మదిలిన చెడు షైతాను తరుపు నుండి అని, అతడిని వినాశనంలో పడవేయటానికని మరియు ఆ తరువాత అతని నుండి విసుగు చూపుతాడని తెలుసుకోవాలి.

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు.

[ఫాతిర్: 6]

రెండవ శతృవు మనోవాంఛ: అందులో నుంచి మనిషి సత్యమును తిరస్కరించటానికి సిద్ధమైపోతాడు. దానిని ఇతరులు తీసుకుని వస్తే తిరస్కరిస్తాడు. అల్లాహ్ ఆదేశమును తిరస్కరించటం అందులో నుంచే ఎందుకంటే అది తన కోరికకు భిన్నంగా ఉన్నది. భావోద్వేగాలను సత్యము, న్యాయముపై ప్రాధాన్యతనివ్వటం కూడా మనోవాంఛలోనుంచే. కాబట్టి ఈ శత్రువు నుండి రక్షించుకోడానికి మరియు తప్పించుకోటానికి మార్గం మనోవాంఛలను అనుసరించటం నుండి అల్లాహ్ రక్షణ కోరటం. మరియు స్వీయ కోరికలను అనుసరించకపోవడం (రక్షణ యోక్క పద్దతి) కాదు కానీ సత్యాన్ని మరియు మార్గదర్శకాన్నిఅది చేదుగా మరియు కష్టంగా అనిపించినప్పటికీ అంగీకరించడం మరియు దాని అవసరాలను అనుసరించడం మరియు షైతాను నుండి అల్లాహ్ రక్షణను కోరుకోవాలి.

మూడవ శతృవు: చెడును చేయటం పై ప్రేరేపించే మనస్సు (నఫ్సె అమ్మార): అది ప్రేరేపించే చెడు ఏమిటంటే మనిషి తన మనస్సులో కలిగే నిషేధిత మనోవాంఛలైనటువంటి వ్యభిచారము, మధ్యమును సేవించటము, రమదాన్ మాసములో ఎటువంటి కారణం లేకుండా ఉపవాసమును విడవటం అలాగే అల్లాహ్ నిషేధించినటువంటి వాటికి పాల్పడటం. ఈ శతృవు నుండి భద్రత ఎలాగంటే మనస్సు యొక్క చెడు నుండి, షైతాను నుండి అల్లాహ్ రక్షణ కోరటం. మరియు ఈ నిషేధిత కోరికను నెరవేర్చడం నుండి సహనం చూపటం మరియు అల్లాహ్ మన్నత కొరకు వీటి నుండి దూరంగా ఉండటం ఎలాగంటే కోరిక ఉండి కూడా హాని కలిగించే వాటిని తినటం మరియు త్రాగటం నుండి దూరంగా ఉంటామో అలా. మరియు ఈ నిషేధిత కోరికలు అంతమైపోతాయని గుర్తు ఉంచుకోవాలి. ఆ తరువాత బాధపడటం మరియు సిగ్గుతో క్రుంగిపోవటం తప్ప ఇంకేమి ఉండదు.

నాల్గవ శతృవు: మనుషులలోని షైతానులు: వీరు ఆదం సంతతిలో నుంచి అవిధేయులైనవారు. వీరి ద్వారా షైతాను ఆడుతాడు. వారు చెడును చేస్తారు మరియు తమతో కూర్చునే వారికి దానిని అలంకరించి చూపుతారు. ఈ శతృవును వదిలించుకునే మార్గం ఏమిటంటే అతడి నుండి జాగ్రత్తగా ఉండటం మరియు దూరంగా ఉండటం మరియు అతనితో పాటు కూర్చోకుండా ఉండటం.

 13)                    ఉన్నత లక్ష్యం మరియు సంతోషకరమైన జీవిత విషయంలో:

 పరిశుద్ధుడైన అల్లాహ్ తన ముస్లిం దాసులకు చూపించిన ఉన్నత లక్ష్యం ఈ ప్రాపంచిక జీవితం మరియు అందులో ఉన్న అంతమైపోయే అష్టఐశ్వర్యములు కావు. ఇది కేవలం నిజమైన మరియు శాశ్వతమైన భవిష్యత్తు కోసం ఒక తయారీ మాత్రమే. అది మరణాంతరం పరలోక జీవితము. నిజాయితీగల ముస్లిం ఈ జీవితంలో మరణాంతర జీవితం కొరకు ఒక సాధనంగా మరియు దాని కోసం ఒక పొలంగా పనిచేస్తాడు. మరియు అదే అంతిమ లక్ష్యం కాదు.

మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు అది గుర్తు చేస్తుంది:

{మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.}

[జారియాత్: 56]

అల్లాహ్ సెలవిచ్చాడు: -

ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతీ వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును! మీరు అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా అయిపోకండి. అల్లాహ్ కూడా వారిని తమ ఆత్మలనే మరచిపోయిన వారిగా చేసేశాడు. ఇలాంటి వారే పరమ అవిధేయులు. నరకవాసులు మరియు స్వర్గవాసులు ఎన్నటికీ సమానులు కాలేరు. స్వర్గవాసులు మాత్రమే సాఫల్యం పొందినవారు.

[అల్ హషర్: 18-20]

మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: -

{మరియు అలాగే, ప్రతీవాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.}(7) {మరియు అలాగే, ప్రతీవాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.}(8)

[జల్'జల: 7-8]

నీతిమంతుడైన ముస్లిం ఈ ఆయతులలో మరియు వీటిని పోలినటువంటి అల్లాహ్ వాక్కులో యోచన చేస్తాడు. దాని ద్వారా ఆయన తన దాసులను వారిని సృష్టించిన లక్ష్యం వైపునకు మరియు వారి కొరకు నిరీక్షిస్తున్న భవిష్యత్తు వైపునకు దృష్టిని మళ్ళిస్తాడు. కాబట్టి అతను ఆ వాస్తవ శాశ్వతమైన భవిష్యత్తు కొరకు అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేస్తూ మరియు ఆయనను సంతోషమును కలిగించే ఆచరణ చేస్తూ ఆయన మన్నతను మరియు ఇహలోకంలో తన కొరకు ఉన్న గౌరవమును ఆయన ఆరాధన ద్వారా మరియు మరణాంతరం గౌరవొన్నతమైన నివాసములో ప్రవేశమును ఆశిస్తూ సిద్ధం అవుతాడు. అప్పుడు అల్లాహ్ అతనిని ఇహలోకంలో మంచి జీవనమును ఇచ్చి గౌరవిస్తాడు. అప్పుడు అతను అల్లాహ్ పర్యవేక్షణలో మరియు సంరక్షణలో జీవిస్తాడు. మరియు అల్లాహ్ వెలుగుతో చూస్తాడు. మరియు ఆయన ఆదేశించినటువంటి ఆరాధనలను నెరవేరుస్తాడు. మరియు వాటిలో అల్లాహ్ వేడుకోలుతో సంతుష్టపడుతాడు. మరియు తన హృదయంలో, తన నోటితో అల్లాహ్ స్మరణ చేస్తాడు. దాని ద్వారా అతని హృదయం సంతృప్తి చెందుతుంది.

మరియు అతడు తన మాటలతో, తన చేతలతో ప్రజలకు ఉపకారం చేస్తాడు. అప్పుడు అతను వారి నుండి తన ఉపకారము యొక్క గుర్తింపును మరియు అతనిని సంతోషమును కలిగించి అతని హృదయమును విశాలము చేసే ప్రార్ధనలను వింటాడు. మరియు అతను దిగజారిన అసూయపరుల నుండి తన ఉపకారము యొక్క తిరస్కారమును చూస్తాడు. అయినా కూడా అతడు వారికి ఉపకారమును చేయటము ఆపడు. ఎందుకంటే అతడు దాని ద్వారా అల్లాహ్ మన్నతను మరియు ప్రతిఫలమును ఆశిస్తాడు. మరియు అతడు ధర్మమును, ధర్మమును అనుసరించే వారిని ద్వేషించే చెడ్డవారి నుండి ఎగతాళిని మరియు బాధను వింటాడు మరియు చూస్తాడు. అది అతనికి అల్లాహ్ ప్రవక్తలను గుర్తు చేస్తుంది. అప్పుడు అతను దానిని అల్లాహ్ మార్గంలో అని తెలుసుకుంటాడు. అప్పుడు అది అతనికి ఇస్లాం పట్ల ఇష్టతను మరియు దానిపై స్థిరత్వమును అధికం చేస్తుంది. మరియు అతడు ఆఫిసులో లేదా పొలములో లేదా దుకాణములో లేదా ఫ్యాక్టిరీలో తన చేతితో శ్రమిస్తాడు దాని ఉత్పత్తి ద్వారా ఇస్లాంకు మరియు ముస్లిములకు ప్రయోజనం కలిగించటానికి మరియు తన చిత్తశుద్ధిని, సత్సంకల్పాన్ని పొందే రోజున అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని పొందటానికి మరియు తన కొరకు మరియు తన ఇంటివారి కొరకు ఖర్చు చేసే, దానం చేసే హలాల్ సంపదను పొందటానికి. కాబట్టి అతను అక్కర లేని హృదయంతో, గౌరవోన్నతుడుగా, ఉన్నదానితో సంతృప్తి చెందేవాడిగా జీవిస్తాడు. మరియు ప్రతిఫలమును అల్లాహ్ సుబహానహు వతఆలా నుండి ఆశిస్తాడు. ఎందుకంటే అల్లాహ్ బలవంతుడైన, వృత్తిపరుడైన విశ్వాసపరుడిని ఇష్టపడుతాడు. మరియు అతడు దుబారా చేయకుండా తింటాడు, త్రాగుతాడు. మరియు నిదురపోతాడు. తద్వారా అతడు అల్లాహ్ కు విధేయత చూపటానికి బలవంతుడిగా మారుతాడు. మరియు అతడు తన భార్యతో సమాగమం చేస్తాడు. ఆమెను మరియు తనను అల్లాహ్ నిషేధించిన వాటి నుండి భద్రంగా ఉంచటానికి మరియు అల్లాహ్ ను ఆరాధించే, తాను జీవించి ఉన్నప్పుడు మరియు మరణించినప్పుడు తన కొరకు దుఆ చేసే సంతానమును జన్మనివ్వటానికి. అప్పుడు అతని సత్కార్యము కొనసాగును. వారితో ముస్లిముల సంఖ్యాబలం అధికమగును. దానితో అతనికి అల్లాహ్ వద్ద నుండి పుణ్యం ప్రాప్తించును. మరియు అతడు ప్రతీ అనుగ్రహంపై అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. మరియు దానితో ఆయన ఆరాధనపై పట్టును సాధిస్తాడు. మరియు వాటిని అల్లాహ్ అనుగ్రహములుగా విశ్వసిస్తాడు. దానితో అతనికి అల్లాహ్ వద్ద నుండి పుణ్యం ప్రాప్తిస్తుంది. మరియు ఎప్పుడైన అతనికి ఆకలి, భయం, రోగం, ఆపదలు లాంటివి సంభవించినప్పుడు అవి అల్లాహ్ తరుపు నుండి తనకు పరీక్ష అని అల్లాహ్ తన గురించి తెలిసి కూడా [73] తన సహనమును మరియు విధివ్రాత పట్ల తన ఇష్టతను చూడటానికి అని విశ్వసిస్తాడు. కావున విశ్వాసపరుడు సహనం చూపుతాడు. మరియు సంతుష్టపడుతాడు. మరియు అల్లాహ్ సహనం చూపేవారి కొరకు సిద్ధం చేసి ఉంచిన తన పుణ్యమును ఆశిస్తూ అల్లాహ్ స్థుతులను పలుకుతాడు. అప్పుడు ఆపద అతనిపై సులభమైపోతుంది. మరియు అతడు ఒక రోగి వైధ్యం కొరకు చేదు మందును స్వీకరించినట్లు దాన్ని స్వీకరిస్తాడు.

ఒక ముస్లిం ఇహలోక జీవితంలో అల్లాహ్ ఆదేశించిన విధంగా జీవించినప్పుడు అతడు శాశ్వతమైన వాస్తవమైన భవిష్యత్తు కొరకు ఆచరిస్తాడు. ఇహలోక ఇబ్బందులు ఇబ్బంది కలిగించని మరియు మరణము అంతం చేయని శాశ్వత ఆనందాలను పొందటానికి. కావున అతడు ఎటువంటి సందేహం లేకుండా ఇహలోక జీవితంలో ఆనందంగా ఉంటాడు. మరియు మరణాంతరం పరలోక జీవితంలో ఆనందంగా ఉంటాడు.

అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.

[అల్ ఖిసస్: 83]

ఇలా తెలియపరచి మహోన్నతుడైన అల్లాహ్ సత్యం పలికాడు:

 {ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.}

 [అన్-నహ్ల్: 97]

మునుపటి పవిత్ర వచనములో మరియు దాని లాంటి దానిలో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలియపరచాడు: ఇహలోకంలో అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఆయనపై విధేయత చూపుతూ ఆచరించే పుణ్య పురుషునకు మరియు పుణ్య స్త్రీ కి ఆయన ప్రతిఫలం ప్రసాదిస్తాడని; మేము ముందే ప్రస్తావించిన ఇహలోకంలో శీఘ్రమైన ప్రతిఫలం సుఖభోగాల మంచి జీవనము మరియు ఆలస్యంగా లభించే ప్రతిఫలం మరణం తరువాత అది స్వర్గపు శాశ్వత అనుగ్రహాలు. ఈ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతున్నారు: విశ్వాసి సంగతి బహు ఆశ్చర్యమైనది అతనికి సంబంధించిన ప్రతీ విషయంలో మేలు ఉంటుంది'ఇది కేవలం విశ్వాసికి మాత్రమే లభ్యము'అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపుకుంటాడు. అతనికి అది మేలును ప్రసాదిస్తుంది, ఒకవేళ అతనికి కష్టం వస్తే సహనం వహిస్తాడు అది అతనికి మేలును చేస్తుంది. [74]

మరియు ఒక్క ఇస్లాంలోనే సరైన ఆలోచన ఉన్నదని మరియు మంచి చెడులకు సరైన కొలమానము మరియు పరిపూర్ణమైన, న్యాయపూరితమైన ప్రణాళిక ఉన్నదని స్పష్టమవుతుంది. మరియు మనస్తత్వశాస్త్రం, సమాజం, పోషణ, రాజకీయాలు, ఆర్ధికవ్వవస్థలో ఉన్న అన్నీ అభిప్రాయాలు మరియు సిద్ధాంతాలను ఇస్లాం వెలుగులో సరిచేయాలి. మరియు దాని నుండి పొందాలి. కాని అది లేకుండా ఈ వ్వవస్థ యొక్క విజయం అసాధ్యం మరియు దయనీయమైనది. అంతే కాదు దీన్ని తీసుకునే వారికి ఇహలోకంలో మరియు పరలోకంలో దుస్థితికి కారణమగును.

***


 ఐదవ అధ్యాయం

  కొన్ని సందేహాల పరిష్కారం:

ఒకటి: ఇస్లాంకు నష్టం కలిగించే వారు: ప్రజల్లోంచి ఇస్లాంకు నష్టం కలిగించే వారు రెండు రకాలు:

మొదటి రకం వారు: ఇస్లాంతో తమ సంబంధమును చూపే వారు మరియు తాము ముస్లింలని వాదిస్తారు. కాని వారు తమ మాటలు, తమ చేతల ద్వారా ఇస్లాంను వ్యతిరేకిస్తారు. వారు ఇస్లాంతో సంబంధము లేని దుశ్చర్యలకు పాల్పడుతారు. వారు ఇస్లాంకు ప్రాతినిధ్యం వహించరు. మరియు వారి చర్యలను ఇస్లాంకు ఆపాదించటం సరికాదు. మరియు వారందరు ఎవరంటే:

(ఎ) సమాధుల ప్రదక్షిణలు చేసి తమ అవసరాలను సమాధులలో ఉండేవారితో అర్ధించేవారు. మరియు వారికి లాభ, నష్టములను కలిగించే శక్తి ఉందని విశ్వసించే వారి లాంటి చెడు విశ్వాసాలు కలిగినవారు [75].

(బి) తమ నైతికవిలువలు, తమ ధర్మ విషయంలో క్షీణించినవారు:

వారు అల్లాహ్ విధిగావించిన వాటిని విడిచిపెట్టి వ్యభిచారం, మద్యపానం వంటి ఆయన నిషేధించిన వాటికి పాల్పడుతారు. మరియు అల్లాహ్ శతృవులను ప్రేమిస్తారు. మరియు వారిని పోలినవారైపోతారు.

(సి) ఇస్లాంకు నష్టం కలిగించే వారిలో నుంచి కొందరు ముస్లిములున్నారు. కాని అల్లాహ్ పై వారి విశ్వాసం బలహీనమైనది. మరియు ఇస్లాం బోధనలను వారు అన్వయించడం అసంపూర్ణంగా ఉంటుంది. వారు కొన్ని విధుల విషయంలో అశ్రద్ధ చూపుతారు. కాని వారు వాటిని విడవరు. మరియు వారు షిర్కె అక్బర్ లేదా ఇతర రకాల అవిశ్వాస కార్యాల స్థాయికి చేరుకోని కొన్ని నిషేధాలకు పాల్పడతారు. వారు చెడు నిషిద్ధ అలవాట్లకు అలవాటుపడ్డారు. ఇస్లాంకు వాటితో సంబంధము లేదు. మరియు అది వాటిని పెద్ద పాపములలో పరిగణిస్తుంది. ఉదాహరణకు: అబద్దము, మోసం, వాగ్దానం పూర్తి చేయకపోవటం మరియు అసూయ. వీరందరు ఇస్లాంకు నష్టం కలిగిస్తారు. ఎందుకంటే ముస్లిమేతరులలోంచి ఇస్లాం గురించి తెలియనివారు ఇస్లాం వారిని అలా చేయడానికి అనుమతిస్తుందని భావిస్తారు.

ఇక రెండవ రకము ఇస్లాంకు చెడు కలిగించేవారు. వారు ఇస్లాం శతృవులు. మరియు దానిపై అసూయచెందేవారు. వారందరు ఎవరంటే ప్రాచ్యవాదులు, యూదులు, క్రైస్తవ మిషనరీలు. మరియు ఇస్లాంను చూసి అసూయపడేవారు. వారు దాని పరిపూర్ణత, దాని మన్నింపు మరియు దాని వేగవంతంగా వ్యాపించటంపై ఆగ్రహం చెందువారు. ఎందుకంటే అది స్వాభావిక ధర్మం [76] స్వభావం ముందు దాన్ని ప్రవేశపెడితే అది దాన్ని స్వీకరిస్తుంది. కావున ప్రతి ముస్లిమేతరుడు ఆందోళనలో జీవిస్తాడు. మరియు తన మతం పట్ల లేదా తాను స్వీకరించే తన ధర్మం పట్ల అసంతృప్తితో ఉంటాడు. ఎందుకంటే అతడు అల్లాహ్ సృష్టించినటువంటి తన స్వభావమునకు వ్యతిరేకంగా ఉంటాడు. కాని వాస్తవ ముస్లిం అలా కాదు. అతడు తన ధర్మము పట్ల సంతోషిస్తూ, సంతృప్తి చెందుతూ జీవిస్తాడు. ఎందుకంటే అది అల్లాహ్ సూచించిన సత్యధర్మము. మరియు అల్లాహ్ ధర్మం అల్లాహ్ సృష్టించిన ప్రజల స్వభావమునకు అనుగుణంగా ఉంటుంది. అందుకనే మేము ప్రతీ క్రైస్తవునికి, యూదునికి మరియు ప్రతీ ఇస్లాం నుంచి వైదొలగిన వారికి ఇలా తెలుపుతాము: నిశ్చయంగా నీ పిల్లలు ఇస్లాం స్వభావం పై జన్మించారు. కాని నీవు మరియు వారి తల్లి అవిశ్వాసపు చెడు పోషణ ద్వారా వారిని ఇస్లాం నుండి తీసివేశారు. మరియు అది ఇస్లాంకు విరుద్ధం.

            మరియు ఈ ధ్వేషపూరిత ప్రాచ్యవాదులు మరియు మిషనరీలు ఇస్లాంపై మరియు ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అబద్దమును ఆపాదిస్తున్నారు:

1.      కొన్నిసార్లు ఆయన దైవదౌత్యమును తిరస్కరించటం ద్వారా.

2.      కొన్ని సార్లు ఆయనలో లోపాలను ఎత్తి చూపి. వాస్తవానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పరిపూర్ణులు మరియు ఆయన అల్లాహ్ తరపు నుండి ప్రతీ లోపము నుండి పరిశుద్ధులు.

3.      అన్నీ తెలిసిన వివేకవంతుడైన అల్లాహ్ ధర్మబద్ధం చేసిన న్యాయపూరితమైన ఇస్లాం ఆదేశాలను కొన్నిటిని ప్రజలకు ఇస్లాం అంటే ధ్వేషం కలిగించటానికి వక్రీకరించటం ద్వారా.

            కాని అల్లాహ్ వారి కుట్రలను త్రిప్పి కొడతాడు. ఎందుకంటే వారు సత్యము పై పోరాడుతున్నారు. మరియు సత్యం ఉన్నతమవుతుంది. దాని పై ఏదీ ఆదిపత్యం చెలాయించదు.

      అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత సహించరానిదైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు. (8) ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి ఉండేలా చేసి పంపాడు.ఈ విషయం అవిశ్వాసులకు ఇష్టం లేకపోయినాసరే.(9)

[అస్సఫ్: 8-9]

రెండు: ఇస్లాం ఆధారాలు:

            ఓ బుద్ధిమంతుడైన మానవుడా నీవు ఇస్లాం వాస్తవికతను తెలుసుకోదలచి ఉంటే దివ్యఖుర్ఆన్ ను మరియు సహీబుఖారీ, సహీ ముస్లిం, మువత్తా ఇమామ్ మాలిక్, ముస్నదె ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్, సుననె అబీదావుద్, సుననె నసాయీ, సుననె తిర్మిజీ, సుననె ఇబ్నె మాజ, సుననె దార్మీలో వ్రాయబడిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహీహ్ హదీసులను చదువు. మరియు ఇబ్నె హిషామ్ యొక్క ప్రవక్త గారి జీవిత చరిత్రను, అల్లామ ఇస్మాయీల్ ఇబ్నె కసీర్ యొక్క దివ్యఖుర్ఆన్ తఫ్సీర్ ను మరియు అల్లామ ముహమ్మద్ ఇబ్నె ఖయ్యిమ్ యొక్క జాదుల్ మఆది ఫీ హద్యి ఖైరిల్ ఇబాద్ పుస్తకమును చదువు. మరియు ఇస్లాం గురువుల, ఏకేశ్వరవాదకుల, అల్లాహ్ వైపు పిలిచేవారి పుస్తకాలను చదువు. మరియు షేకుల్ ఇస్లామ్ అహ్మద్ ఇబ్నె తైమియ మరియు ఇమాముల్ ముజద్దిద్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహ్హాబ్ లాంటివారి పుస్తకాలను చదువు. ఆయన ద్వారా మరియు అమీరుల్ మువహ్హిదీన్ ముహమ్మద్ ఇబ్నె సఊద్ ద్వారా అల్లాహ్ తఆలా పూర్తి అరబ్ ప్రాంతంలో మరియు ఇతర ప్రాంతములలో హిజ్రీ పన్నెండవ శతాబ్దంలో ఇస్లాం ధర్మమును మరియు తౌహీద్ విశ్వాసమును వ్యాపింపజేశాడు. ఆ తరువాత నుండి ఇప్పటి వరకు దాని మంచి ప్రభావములు కనబడుతున్నవి.

            ఇక ప్రాచ్యవాదుల మరియు తమకు ఇస్లాంతో సంబంధం ఉన్నదని చెప్పుకునే వర్గాల వారి పుస్తకాలు అవి దేని వైపు పిలుస్తున్నాయో ఆ విషయాలు ఇస్లాం ఆదేశములకు విరుద్ధంగా ఉన్నవి లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను లేదా సలఫె సాలిహీన్ లను దూషిస్తున్నవి లేదా తౌహీద్ వైపు పిలిచే ఇమాములైన ఇబ్నె తైమియా, ఇబ్నె ఖయ్యిమ్ మరియు ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహ్హాబ్ లాంటి వారి పట్ల ద్వేషమును చూపుతున్నవి. మరియు వారిపై అబద్దమును ఆపాదిస్తున్నవి, అవి తప్పుదోవ పట్టించే పుస్తకాలు. వాటి ద్వారా మోసపోవటం నుండి, వాటిని చదవటం నుండి జాగ్రత్తవహించండి.

మూడు: ఇస్లాం మత వర్గాలు:

            ముస్లింలందరి మతం ఒక్కటే. అది ఇస్లాం మతం. ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు దాని మూలము. ఇక హంబలీ, మాలికీ, షాఫియీ, హనఫీ లాంటి ఇస్లాం మత వర్గాలుగా పిలవబడే వర్గాలు ఇస్లామీయ ఫిఖా శాస్త్ర మదరసాలలో షుమారు చేయబడుతాయి. వాటి ఉలమాలు ఇస్లాం యొక్క నియమాలను అధ్యాయనం చేశారు. వాటన్నిటి మూలము ఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు. వాటి మధ్య ఉండే విభేదము అసాధారణమయిన విషయాలలో మాత్రమే కనబడును. ప్రతీ ఆలిమ్ తన విధ్యార్ధులకు ఖుర్ఆన్ మరియు హదీసు ఆధారాల ద్వారా ధృఢంగా ఉన్న మాటనే తీసుకోవాలని ఆదేశించారు. ఒక వేళ దానిని ఇతరులు పలికినా.

            మరియు వాటిలో నుండి ఏ ఒక్కటి కూడా ముస్లింపై తప్పనిసరి చేయబడలేదు. కాని అతనికి మాత్రం ఖుర్ఆన్ మరియు హదీసు వైపు మరలవలసిన బాధ్యత ఉన్నది. ఇక ఈ ఇస్లాం మత వర్గాలతో తమకు సంబంధం ఉన్నదని చెప్పుకునేవారు విశ్వాసములో తిరిగిపోయి సమాధుల వద్ద వారు చేసే కార్యాలు, ప్రదక్షిణలు మరియు సమాధిలో ఉన్నవారితో సహాయం అర్ధించటం, అల్లాహ్ గుణగణాలను వక్రీకరించి వాటిని అసలు అర్థం నుంచి మార్చివేయటం ఈ కార్యాలు చేసే వీరందరు విశ్వాసం విషయంలో తమ ఇస్లాం మత వర్గ ఇమామ్ లను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇమామ్ ల విశ్వాసం సలఫె సాలిహీన్ ల విశ్వాసము. దాని ప్రస్తావన ఫిరఖతున్నాజియలో ముందే తెలపబడింది.

నాలుగు: ఇస్లాం నుండి వైదొలగిన వర్గాలు:

            ఇస్లామీయ సమాజంలో ఇస్లాం నుండి వైదొలగిన కొన్ని వర్గాలు ఉన్నవి. అవి ముస్లింలని వాదిస్తాయి. కానీ వాస్తవానికి వారు ముస్లింలు కారు. ఎందుకంటే వారి విశ్వాసాలు అల్లాహ్ ను, ఆయన ఆయతులను మరియు ఆయన ఏకత్వమును తిరస్కరించే విశ్వాసాలు. వాటిలో నుండి కొన్ని వర్గాలు:

1)     బాతినీయ వర్గము:

            ఇది హులూల్ మరియు పునర్జన్మను విశ్వసిస్తుంది. మరియు ధర్మం యొక్క ఆధారాలకు ముస్లింలు ఏకీభవించిన దైవ ప్రవక్త స్పష్టపరచిన వాటికి బాహ్య అర్థమునకు వ్యతిరేకమైన అంతర్గత అర్థం ఉన్నదని విశ్వసిస్తుంది. మరియు ఈ అంతర్గత అర్థమును వారు తమ మనోవాంఛలకు తగినవిధంగా పెట్టుకుంటారు [77]. బాతినీయ వర్గము మొదలవ్వటానికి మూలం యూదుల, మజూసీల ఒక వర్గము. మరియు ఫారిస్ లోని ఫిలాసఫీల ఒక పెద్ద వర్గము. ఇస్లాం తారస్థాయికి చేరినప్పుడు వారు ఒక మతమును ఏర్పాటు చేయటానికి సమావేశమై సలహాలు తీసుకున్నారు. దాని ఉద్దేశం ముస్లింలను చెదరగొట్టి మరియు దివ్యఖుర్ఆన్ అర్థాల్లో ఉన్న ఆలోచనలను గందరగోళపరచి చివరికి ముస్లింల మధ్య దూరాలను పెంచటం. కావున వారు ఈ వినాశన మతాన్ని ప్రవేశపెట్టి దాని వైపు పిలుపునిచ్చారు మరియు ఆలె బైత్ కు చెందినవారని చెప్పుకున్నారు. మరియు వారు ప్రజల సానుభూతి పొందటానికి తాము షియాలు అని పేర్కొన్నారు. కావున చాలా మంది అజ్ఞానులు వారితో చేరిపోయారు. వారు వారిని అపమార్గమునకు లోను చేశారు.

2)     ఈ వర్గముల్లోంచి ఖాదియానీ వర్గము ఉంది. అది గులామ్ అహ్మద్ ఖాదియానీ ఎవరైతే దైవదౌత్యము గురించి దావా చేసి ప్రసిద్ధి చెందాడో అతనికి చెందిన వర్గము. అతను భారత దేశం మరియు దాని చుట్టు ప్రక్కల ఉన్న పెద్ద సమూహమును తనను విశ్వసించమని పిలుపునిచ్చాడు. ఆంగ్లేయులు భారతదేశమునకు వలస వచ్చిన కాలంలో వారు అతనిని, అతని అనుచరులను వాడుకున్నారు. మరియు అతనికి, అతని అనుచరులకు బహుమతులను ఇచ్చారు. చివరికి అజ్ఞానుల పెద్ద వర్గము అతనిని అనుసరించసాగింది. ఇస్లాంను బయటకు చూపే ఖాదియానీ వర్గం ఉద్భవించింది. మరియు అది ఇస్లాంను నాశనం చేయటానికి మరియు దాని నుండి ఇతరులను బయటకు తీయటానికి ప్రయత్నం చేసింది. గులామ్ అహ్మద్ ఖాదియానీ తస్దీఖె బరాహీనె అహ్మదియ పేరుతో ఒక పుస్తకమును రచించాడు. అందులో తనకు దైవదౌత్యం కలదని ప్రకటించుకున్నాడు మరియు అందు ఇస్లాం ఆధారాలను మార్పుచేర్పులు చేశాడు. అతని మార్పు చేర్పుల్లోంచి అతను జిహాద్ విషయంలో తన ప్రకటనను చేయటం.

      ఇస్లాం రద్దు పరచబడిందని మరియు ప్రతీ ముస్లిం ఆంగ్లేయులను స్వీకరించటం తప్పనిసరి అని. ఆ సమయంలో అతడు తిర్యాఖుల్ ఖులూబ్ అనే పేరు గల పుస్తకమును రచించాడు. చాలా మందిని అపమార్గమునకు లోను చేసిన తరువాత 1908వ సంవత్సరంలో మరణించాడు. అతని ప్రచారం, నాయకత్వం విషయంలో అతని మార్గభ్రష్ట వర్గమునకు హకీం నూరుద్దీన్ అనే వ్యక్తి ప్రాతినిధ్యం వహించాడు.

3)     ఇస్లాం నుండి వైదొలగిన బాతినీయ వర్గమునకు చెందిన ఒక వర్గము దానిని బహాయీయ అని పిలుస్తారు. దీనిని 19వ శతాబ్దం ఆరంభంలో ఈరాన్ లో అలీ ముహమ్మద్ అను పేరు గల వ్యక్తి స్థాపించాడు. అతన్ని ముహమ్మద్ అలీ అష్షీరాజీ అని పిలుస్తారు. అతడు షీఅ ఇస్నా అషరియా తెగకు చెందినవాడు. అతడు తన స్వయమును ఎదురు చూడబడుతున్న మహదీయుల్ ముంతజిర్ అని చెప్పుకుని ప్రసిద్ధి చెందాడు. మరియు తరువాత అల్లాహ్ తనలో ప్రవేశించాడని, తాను ప్రజల కొరకు దేవుడినని వాదించాడు. అల్లాహ్ అవిశ్వాసులు, నాస్తికులు పలికే మాటల నుండి ఉత్తముడు. మరియు అతడు మరణాంతర లేపబడటమును, లెక్క తీసుకోబడటమును, స్వర్గమును, నరకమును తిరస్కరించాడు. మరియు అవిశ్వాసపరులైన బ్రాహ్మణుల, బౌద్ధ మతస్తుల మార్గంపై నడిచాడు. మరియు అతడు యూదులు, క్రైస్తవులు, ముస్లిములను సమీకరించి వారి మధ్య తేడా లేదన్నాడు. ఆ తరువాత ప్రవక్తల పరిసమాప్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యమును తిరస్కరించాడు. మరియు చాలా ఇస్లామీయ ఆదేశాలను తిరస్కరించాడు. అతని మరణాంతరం అతని మంత్రి అయిన బహాఉ అని పిలవబడే వ్యక్తి అతనికి వారసుడయ్యాడు. అతని ప్రచారం వ్యాపించింది మరియు అతని అనుచరులు అధికమయ్యారు. ఆ వర్గమును అతని పేరు వైపు ఆపాదించబడింది. అది బహాయియ అని పిలవబడింది.

4)     మరియు ఇస్లాం నుండి వైదొలగిన వర్గములలో కొన్ని వర్గాలు సంఖ్యాపరంగా పెద్దవి - ఒకవేళ వారు ముస్లింలు అని వాదించినా, నమాజు పాటించినా, ఉపవాసాలుండినా, హజ్ చేసినా - వారు జిబ్రయీల్ అలైహిస్సలాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరవేసిన దైవదౌత్య విషయంలో అవినీతికి పాల్పడ్డారని వాదిస్తున్నారు. వాస్తవానికి ఆయన అలీ వైపునకు పంపించబడ్డారని వాదిస్తున్నారు. వారిలోని కొందరు అలీ అల్లాహ్ అని పలుకుతున్నారు. మరియు వారు ఆయనను గౌరవించటం విషయంలో మరియు ఆయన సంతానమును, ఆయన మనవళ్ళను, ఆయన సతీమణి ఫాతిమాని, ఆమె తల్లి ఖదీజా రజిఅల్లాహు అన్హుమ్ ని గౌరవించే విషయంలో అతిక్రమిస్తున్నారు. అంతే కాదు వారిని అల్లాహ్ తో పాటు ఆరాధ్య దైవాలుగా చేసి వారిని వేడుకుంటున్నారు మరియు వారు నిరపరాధులని మరియు అల్లాహ్ వద్ద వారి స్థానము ప్రవక్తలు అలైహిముస్సలాం స్థానము కన్న గొప్పదని విశ్వసిస్తున్నారు.

      మరియు వీరందరు ప్రస్తుతం ముస్లింల వద్ద ఉన్న ఖుర్ఆన్ లో హెచ్చు, తగ్గులు చేయబడినవని పలుకుతున్నారు. మరియు వారు తమ కొరకు ప్రత్యేక గ్రంధములను చేసుకున్నారు. మరియు వాటిలో తమ తరపు నుండి ఆయతులను, సూరాలను కల్పించుకున్నారు. మరియు వారు తమ ప్రవక్త తరువాత ముస్లిములలో గొప్పవారైన అబూబకర్, ఉమర్ రజిఅల్లాహు అన్హుమాను దూషిస్తున్నారు. మరియు విశ్వాసుల తల్లి హజ్రత్ ఆయిషా రజిఅల్లాహు అన్హాను దూషిస్తున్నారు. మరియు కలిమిలో, లేమిలో అలీ మరియు ఆయన సంతానమును సహాయం కొరకు వేడుకుంటున్నారు. మరియు అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధిస్తున్నారు. మరియు అలీ రజియల్లాహు అన్హు, ఆయన సంతానముతో వారికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే వారు వారిని అల్లాహ్ తోపాటు ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు అల్లాహ్ పై అబద్దమును ఆపాదించారు. మరియు ఆయన వాక్కులో మార్పుచేర్పులు చేశారు. అల్లాహ్ వారు పలుకుతున్న మాటల నుండి ఎంతో ఉన్నతుడు [78].

మరియు మేము ప్రస్తావించిన అవిశ్వాస వర్గాలు ఇవి. ఇవి తమను ముస్లింలు అని చెప్పుకునే కొన్ని అవిశ్వాస వర్గములు. వాస్తవానికి అవి దాన్ని నాశనం చేస్తున్నవి. ఓ బుద్ధిమంతుడైన ముస్లిముడా నీవు ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తుంచుకో ఇస్లాం అన్నది కేవలం ముస్లిం అని చెప్పుకోవటం కాదు. అది ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల పరిచయం. మరియు వాటిపై స్థిరత్వము మరియు వాటిపై ఆచరణ చేయటం. కావున దివ్యఖుర్ఆన్ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులలో యోచన చేయాలి. తద్వారా సన్మార్గము, వెలుగు, ఋజుమార్గమును పొందుతారు. వాటిపై నడిచేవాడు సర్వలోకాల ప్రభువు వద్ద అనుగ్రహాల స్వర్గములో సుఖభోగాలకు చేరుకుంటాడు.

***

 మోక్షం వైపుకు ఆహ్వానం:

ఓ ఇస్లాం స్వీకరించని బుద్దిమంతులైన మనుషులారా స్త్రీలైనా పురుషులైనా, మోక్షం, శుభాలవైపు పిలిచే ఈ పిలుపు వైపు నేను మీ దృష్టి మరలుస్తూ ఇలా పలుకుతున్నాను:

నీవు మరణాంతరం సమాధిలో ఆ తరువాత నరకాగ్నిలో అల్లాహ్ శిక్ష నుండి నిన్ను రక్షించుకో.

నీవు అల్లాహ్ ను ప్రభువుగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా మరియు ఇస్లాంను ధర్మంగా విశ్వసించి నిన్ను రక్షించుకో. మరియు సత్య మనస్సుతో లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని పలుకు, ఐదు పూటల నమాజును చదువు, నీ సంపద నుండి జకాత్ ను చెల్లించు, రమజాన్ మాసపు ఉపవాసములను పాటించు, నీకు స్థోమత ఉంటే అల్లాహ్ పరిశుద్ధ గృహ హజ్ ను పూర్తి చేయి.

మరియు అల్లాహ్ కొరకు నీ ఇస్లాంను ప్రకటించు. ఎందుకంటే దానితోనే మోక్షము మరియు శుభాలు [79] కలవు.

మరియు నీకు గొప్ప అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఎవరు లేరు. ఈ ఇస్లామే వాస్తవ ధర్మము. దానిని తప్ప దేనిని అల్లాహ్ ఎవరి నుండి ధర్మంగా స్వీకరించడు. మరియు నిశ్చయంగా నేను అల్లాహ్ ను, ఆయన దూతలను మరియు సృష్టిరాసులన్నింటిని సాక్ష్యంగా పెట్టి తెలుపుతున్నాను అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. మరియు ముహమ్మద్ అల్లాహ్ ప్రవక్త మరియు ఇస్లామే సత్యము. మరియు నేను ముస్లింని.

నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను ఆయన తన అనుగ్రహంతో మరియు తన భాగ్యంతో నన్ను, నా సంతానమును మరియు నా ముస్లిం సోదరులను నిజమైన ముస్లింగా మరణమును ప్రసాదించమని మరియు స్వర్గవనాల్లో మన సత్యప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దైవప్రవక్తలందరి, మన ప్రవక్త కుటుంబం, ఆయన అనుచరుల సామిప్యమును ప్రసాదించమని. మరియు నేను అల్లాహ్ తో వేడుకుంటున్నాను ఆయన ఈ పుస్తకమును చదివే లేదా వినే ప్రతీ ఒక్కరికి దీని ద్వారా ప్రయోజనం కలిగించమని. ఓ అల్లాహ్ నీవు సాక్ష్యంగా ఉండు నేను చేరవేసేశాను.

మరియు అల్లాహ్ కి బాగా తెలుసు మరియు అల్లాహ్ శుభాలను, కారుణ్యాలను మనప్రవక్త ముహమ్మద్ పై, ఆయన కుటుంబంపై, ఆయన అనుచరులపై కురిపించుగాక. మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే స్థుతులన్ని.

***



[1]తఆలా (మహోన్నతుడు): అల్లాహ్ గొప్పతనమును మరియు పొగడ్తలను తెలిపే పదము. మరియు ఆయనను గొప్పతనముతో మరియు పరిశుద్ధతతో అభివర్ణించబడింది.

[2] సృష్టించటంలో ఇలా ఒక దాని తరువాత ఒకటి చేయటం పరిశుద్ధుడైన అల్లాహ్ తలచుకున్న విజ్ఞత కొరకు, కాని ఆయన పూర్తి సృష్టిని కనురెప్ప వాల్చటం కన్న వేగంగా సృష్టించటంపై సామర్ధ్యం కలవాడు. ఎందుకంటే ఏదైన వస్తువును ఆయన తలుచుకుంటే దాన్ని కున్ (నీవు అయిపో) అని అంటాడు అంతే అది అయిపోతుంది అని ఆయన తెలియపరిచాడు.

[3]ఖుర్ఆన్ పరిభాష అయిన అరబ్ పరిభాషలో ఇస్తవా అలష్షైయి అంటే దాని అర్థం దాన్ని అధీష్టించాడు, ఆదిరోహించాడు. మరియు అల్లాహ్ తన సింహాసనమును అధీష్టించటం అది ఆయనకు తగిన విధంగా దాన్ని అధీష్టించటం. దాని వర్ణత ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. మరియు అల్లాహ్ తన స్వయం కొరకు వర్ణించుకున్న మరియు ఆయన ప్రవక్తలు వర్ణించిన అల్లాహ్ గుణాల వాస్తవికతను తిరస్కరించే మార్గభ్రష్టులు అనుకుంటున్నట్లు ఇస్తవా అర్థం ఆయన రాజ్యమును స్వాధీనపరుచుకున్నాడు అని కాదు. వారు అల్లాహ్ గుణాలను వాటి వాస్తవికతపై నిరూపిస్తే వారు అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చినట్లు భావించే వారు. ఈ భావన సరికాదు. ఎందుకంటే పోలిక అంటే వాటి విషయంలో ఇలా పలకటం: అవి ఇలా పోలి ఉన్నాయి లేదా సృష్టితాల లక్షణాల వలె ఇలా ఉన్నవి. ఇక వాటిని ఎటువంటి సాదృశ్యం గాని పోలికగాని వర్ణత గాని అంతరాయం గాని వ్యాఖ్యానం గాని లేకుండా అల్లాహ్ కు తగిన విధంగా నిరూపించటం ఇది ప్రవక్తల మార్గము దానిపై పూర్వ పుణ్యపురుషులు నడిచారు. మరియు ఒక వేళ చాలా మంది ప్రజలు దాన్ని వదిలేసినా అది విశ్వాసపరుడు అదిమి పట్టుకోవటం తప్పనిసరి అయిన హక్కు.

[4] సుబహానహు: అంటే అల్లాహ్ లోపము, కళంకము నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు.

[5] మరియు దానికి ఉదాహరణ: నాస్తికుడు (ముల్హిద్)

[6] మూతజిల అపమార్గమునకు లోనైన ఒక వర్గము. అది అల్లాహ్ మంచి పేర్లలో మార్పు చేర్పులు చేసింది. మరియు అల్లాహ్ తఆలా, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయమునకు విభిన్నంగా వాటి అర్థాలను వ్యాఖ్యానించారు.

[7] దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు: {శుభదాయకుడైన, మహోన్నతుడైన మన ప్రభువు ప్రతీ రాత్రి యొక్క చివరి మూడో వంతు మిగిలి ఉన్నప్పుడు భూమికి దగ్గర ఉన్న ఆకాశము వైపుకు దిగుతాడు. అప్పుడు ఇలా పలుకుతాడు: నన్ను వేడుకునేవాడు ఎవడున్నాడు నేను అతడిని స్వీకరిస్తాను, నన్ను ఎవరు అర్ధిస్తాడు నేను అతనికి ప్రసాదిస్తాను మరియు నాతో మన్నింపును ఎవరు కోరుకుంటారు నేను అతడిని మన్నిస్తాను}. [దీన్ని బుఖారీ (7494), ముస్లిం (758), తిర్మిజీ (3498) ఉల్లేఖించారు].

[8] జిన్నులు బుద్ధి గల జీవులు. అల్లాహ్ ఆదమ్ సంతతిని సృష్టించినట్లే వారినీ తన ఆరాధన కొరకు సృష్టించాడు. మరియు వారు భూమిలో మానవ సంతతితో పాటు నివాసముంటారు. కాని మానవ సంతతి వారిని చూడలేరు.

[9] ముగీర బిన్ షుఅ్ బ రజిఅల్లాహు అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఉల్లేఖించారు: మూసా అలైహిస్సలాం తన ప్రభువుతో స్వర్గములో తక్కువ స్థానం ఏది ? అని అడిగారు. దానికి ఆయన ఇలా సమాధానమిచ్చాడు: స్వర్గంలో స్వర్గవాసులు ప్రవేశించిన తరువాత ఒక వ్యక్తి వస్తాడు. అతనితో ఇలా పలకబడును: నీవు స్వర్గంలో ప్రవేశించు. అతను ఓ ప్రభువా ఎలా. వాస్తవానికి ప్రజలు తమ తమ నివాసముల్లో దిగారు మరియు తమ భాగములను తీసుకున్నారు అని అంటాడు. అప్పుడు అతనితో ఇలా పలకబడును: ఇహలోక రాజుల్లోంచి ఒక రాజు రాజ్యము లాంటిది నీకు ఉండటమును నీవు ఇష్టపడుతావా ?. అప్పుడు అతను ఓ నా ప్రభూ నేను ఇష్టపడుతాను అని అంటాడు. అప్పుడు అతనితో ఇలా పలకబడును: నీ కొరకు అది, అలాంటిది, అలాంటిది ఉంది. అతను ఐదవసారి ఓ నా ప్రభూ నేను ఇష్టపడుతున్నాను అంటాడు.అప్పుడు ఆయన ఇలా పలుకుతాడు: ఇది నీ కొరకు కలదు మరియు పది రెట్లు కలదు. మరియు నీ మనస్సు కోరినది, నీ కళ్ళు ఇష్టపడేది నీ కొరకు కలదు. అప్పుడు అతను ఓ నా ప్రభూ నేను ఇష్టపడ్డాను. మరియు ఇలా పలికారు (మూసా అలైహిస్సలాం): ఓ నా ప్రభూ వారిలో ఉన్నత స్థానం కలవాడు ఎవడు ?. ఆయన ఇలా సమాధానమిస్తాడు: వారందరి గౌరవమును నేను నా చేతితో నాటి దాని పై ముద్ర వేయాలనుకుంటున్నాను. అయితే ఏ కళ్ళు చూడలేదు, ఏ చెవులు వినలేదు, ఏ మానవ హృదయం ఆలోచించలేదు. దీన్ని ముస్లిం ఉల్లేఖించారు (189).

[10] తౌరాతు మరియు ఇంజీలులో వచ్చినట్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి శుభవార్తలను షేకుల్ ఇస్లాం అహ్మద్ ఇబ్నె తైమియ పుస్తకం "అల్ జవాబుస్సహీహ్ లిమన్ బద్దల దీనల్ మసీహ్" మొదటి సంపుటములో చూడండి. మరియు అల్లామ ముహమ్మద ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ పుస్తకం "హిదాయతుల్ హయారా" ను చూడండి. మరియు ఇబ్నె హిషామ్ పుస్తకం "అస్సీరతున్నబవియ్య" ను చూడండి. మరియు తారీఖ్ ఇబ్నె కసీర్, ఇతర వాటిలో మూజిజాతున్నుబువ్వహ్ ను చూడండి.

[11]వాటి పేరు ఖుర్ఆన్ లో ఆయాత్ అని ఉన్నది. మరియు అది సరైనది. మరియు మొజిజాత్ పదము ప్రస్తావించబడినది ఎందుకంటే అది అద్భుతాలకు ప్రత్యేకించబడినది.

[12]అస్సాలీల్ సూలూల్ బహువచనం. మరియు అది శనగ పప్పు వలే దాని కంటే తక్కువ పరిమాణంలో చర్మంపై బహిర్గతమయ్యే గింజ. అది నెలవంకలా గుండ్రమైన ముద్ర. మరియు దాని పరిమాణము పావురపు గుడ్డు అంత ఉంటుంది.

[13] దీన్ని ముస్లిం (8), అబూదావుద్ (4695) ఉల్లేఖించారు.

[14] దీన్ని ముస్లిం (1978), నసాయి (4422) ఉల్లేఖించారు.

[15] అల్ ఇస్తిఆన: అంటే సాధారణంగా సహాయం కోరటం. అల్ ఇస్తిగాస: అంటే క్లిస్టమైన, కఠినమైన పరిస్థితుల్లో సహాయం కోరటం. అల్ ఇస్తిఆజ: అంటే చెడును, అసహ్యమైన వాటిని తొలగించే వాటితో ఆశ్రయం, రక్షణ కోరటం.

[16] దీన్ని అహ్మద్ (5/317/22758), తబ్రానీ (10/246) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీన్ని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[17] దీన్ని తిర్మిజీ (2516), అహ్మద్ (2802), తబ్రానీ (2820) (12989) ఉల్లేఖించారు = మరియు తిర్మిజీ ప్రామాణికమైన, దృఢమైన హదీస్ అన్నారు.

[18] దీనిని అబూదావుద్ (3904), తిర్మిజీ (135), ఇబ్నెమాజ (639) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహ్ తర్గీబ్, తర్హీబ్ (3047) లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[19] తవక్కుల్ అంటే హృదయం యొక్క విశ్వాసం మరియు నమ్మకం ఉండవలసిన వారి పై దాని భరోసా ఉండటం. రజాఉ అంటే భవిష్యత్తులో లభించే ఇష్టమైన విషయముతో హృదయము యొక్క అనుబంధము.

[20] అల్లాహ్ యొక్క ఔలియాలు వారే ఎవరైతే అల్లాహ్ కొరకు ఏకేశ్వరోపాసన చేస్తారో, ఆయనకు విధేయులై ఉంటారో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయులై ఉంటారో. వారిలో నుంచి కొందరు తమ జ్ఞానము, తమ జిహాద్ మూలంగా గుర్తింపు పొందుతారు. వారిలో నుండి కొందరు గుర్తింపు పొందరు. వారిలో నుండి గుర్తింపు పొందినవారు ప్రజలు తమను గౌరవించటమును ఇష్టపడరు. వాస్తవానికి ఔలియాలు తాము ఔలియాలు అని చాటింపు చేసుకోరు. అంతేకాదు వారు తమను తాము పాపాలు చేసిన వారిగా భావిస్తారు. వారి కొరకు ప్రత్యేక దుస్తులు గాని లేదా ప్రత్యేక రూపము గాని ఉండదు. కాని వారు ఆ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించేవారై ఉంటారు. మరియు ప్రతీ ముస్లిం ఎవరైతే అల్లాహ్ ఏకేశ్వరోపాసన చేసి ఆయన ప్రవక్తను అనుసరిస్తాడో తన ఆరాధన, తన విధేయత చూపటంతో అల్లాహ్ కు దగ్గరై ఉంటాడు. దీనితోనే ఎవరైతే తాము అల్లాహ్ ఔలియాలని చాటింపు చేసుకుని ప్రజలు తమను గౌరవించాలని మరియు తమను పవిత్రులుగా కొనియాడాలని ప్రత్యేక దుస్తులను తొడుగుతారో. వారు అల్లాహ్ ఔలియాలు కాదు అని స్పష్టమవుతుంది. కాని వారు అసత్యపరులు.

[21] పుస్తకమును రచించిన కాలం 1395 హి/ 1975 క్రీ.శ లో ప్రకటించబడ్డ లెక్కల ప్రకారం.

[22] దీన్ని అబూదావుద్ (3842), ఇబ్నెమాజ (3226) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సహీహుల్ జామి (1082) లో మరియు సిల్సిలతుస్సహీహ (203) లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[23] అంటే ప్రవక్త అనుచరుల మధ్య ఉన్న విభేదాలను తీసుకుని విమర్శన, ప్రతివాదన చేయకూడదు.

[24] అతనికి మరియు ఇతరులకు మధ్య ఉన్న విభేదము.

[25] దీన్ని బుఖారీ (2697) మరియు ముస్లిం (1718) ఉల్లేఖించారు. మరియు పదాలు బుఖారీవి.

[26] దీన్ని తిర్మిజీ (2621) మరియు నసాయీ (463) మరియు అహ్మద్ (5/346) ఉల్లేఖించారు. మరియు అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామీలో దీన్ని ప్రామాణికమైనదిగా ప్రస్తావించారు.

[27]ఎందుకంటే ఒక వేళ ఖుర్ఆన్ ను అరబీలో చదవకపోతే అది ఖుర్ఆన్ అవ్వదు. అందుకనే ఖుర్ఆన్ పదాలు అనువదించబడవు. వాటి అర్థాలు అనువదించబడుతాయి. ఎందుకంటే దాని అక్షరాలు మరియు పదాలు అనువదించబడినప్పుడు దాని వక్చాతుర్యం మరియు అద్భుతం తొలగిపోతాయి. మరియు దాని కొన్ని పదాలు తొలగిపోతాయి. మరియు ఖుర్ఆన్ అరబీలో ఉండదు.

[28] కాని ఎవరినైన అప్రమత్తం చేయదలచుకుంటే లేదా అతనిని ప్రతిస్పందించాలనుకుంటే "సుబ్హానల్లాహ్" అని పలకాలి. ఇమామ్ తప్పు చేసినా లేదా అధికం చేసినా లేదా తక్కువ చేసిన ముఖ్తది దానిని పలకాలి. మరియు నమాజు చదివే వ్యక్తి తనను పిలిచే వారి కొరకు దానిని పలకాలి. స్త్రీ అయితే చప్పట్లు కొట్టి అప్రమత్తం చేయాలి. మాట్లాడకూడదు. ఎందుకంటే ఆమె గొంతు ఫిత్నా అవుతుంది.

[29] నిసాబ్ (ధర్మార్ధము తీయు భాగము): నిర్ణీత పరిమాణమునకు చేరిన సంపద దేనిలోనైతే జకాత్ చెల్లించటం అనివార్యమవుతుందో.

[30] ప్రమాణము యొక్క పరిహారం ఒక బానిసను విముక్తి చేయటం లేదా పదిమంది నిరుపేదలకు భోజనం తినిపించటం లేదా వారికి బట్టలు తొడిగించటం అవి అందుబాటులో లేకపోతే మూడు రోజులు ఉపవాసం ఉండటం.

[31] అటువంటిదే ఈ హదీసు: "మీరు నా స్థానము ద్వారా వసీలా చేసుకోండి నిశ్చయంగా నా స్థానము అల్లాహ్ వద్ద గొప్పది". ఇంకొక హదీసు: "ఏదైన రాయి విషయంలో మంచి ఆలోచన ఉంటే అది అతనికి ప్రయోజనం కలిగిస్తుంది". ఇవన్నీ మౌజూ (కల్పించబడిన) హదీసులు. అవి ప్రామాణికమైనవి కావు. మరియు అవి నమ్మదగిన హదీసు పుస్తకాల్లొ లభించవు. అవి మరియు అటువంటి విషయాలు షిర్క్ మరియు బిద్అత్ కార్యముల వైపు పిలిచే మార్గభ్రష్టుల పుస్తకాల్లో లభిస్తాయి. వారికి ఇంద్రియ జ్ఞానం లేదు.

[32] దీన్ని తబ్రానీ ఔసత్ లో (4480) మరియు బైహఖీ షూబుల్ ఈమాన్ లో (2/173/2) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు సిల్సిలతుస్సహీహ లో (6/212) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[33]ముతమత్తిఅ్ అంటే ఎవరైతే హజ్ కాలంలో ఉమ్రాను నెరవేర్చి ఆ తరువాత ఇహ్రామ్ నుండి పూర్తిగా హలాల్ అయిపోతాడు. అప్పుడు అతను ఇహ్రామ్ లో వారించబడిన వాటి నుండి ప్రయోజనం చెందుతాడు. ఆ తరువాత ఎనిమిదో రోజు హజ్ కొరకు ఇహ్రామ్ కడతాడు. మరియు ఖారిన్ అంటే హజ్ మరియు ఉమ్రాను కలిపి చేసి కేవలం హజ్ కార్యాలు మాత్రమే చేసేవాడు. కాని దానితో పాటు ఉమ్రా సంకల్పము కూడా చేసుకుంటాడు. ముఫ్రిద్ అంటే ఉమ్రా కాకుండా కేవలం హజ్ సంకల్పం చేసేవాడు.

[34] హదీ అంటే పశువుల్లోంచి ఒంటెలు లేదా ఆవులు లేదా మేకలలోంచి హజ్ చేసే వ్యక్తి ఖుర్బానీ ఇస్తాడు మరియు సదఖా చేస్తాడు మరియు తింటాడు.

[35] అంటే బైతుల్ హరాంలో ప్రవేశము అది హరముల్ మక్కీ.

[36] హజరే అస్వద్ మరియు రుక్నే యమాని మధ్య رَبَّنَا آتِنَا فِي الدُّنْيَا حَسَنَةً وَفِي الْآخِرَةِ حَسَنَةً وَقِنَا عَذَابَ النَّارِ

(ఓ మా ప్రభూ ఇహములో మంచిని మరియు పరములో మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి రక్షించు) [బఖరా 201] అని చదవాలి.

[37] అది మఖామే ఇబ్రాహీం అలైహిస్సలాం.

[38] అల్ మస్అ అంటే సఈ చేసే ప్రదేశము. మరియు అది సఫా మర్వా మధ్యన కొంచెం వేగముగా నడవటం. అవి రెండు చిన్న పర్వతములు.

[39] ఈ ప్రదక్షిణను (తవాఫ్ ను) పండుగ రోజు లేదా దాని తరువాత చేయాలి. ఇక హజ్ కన్నా ముందు చేసిన తవాఫె ఖుదూమ్ అని పిలవబడే తవాఫ్ నఫిల్ తవాఫ్ అగును. ముఫ్రిద్ మరియు ఖారిన్ లు ఒకే సయీ చేయాలి. ఒక వేళ దానిని తవాఫె ఖుదూమ్ తోపాటు చేసినా సరిపోతుంది. ఒక వేళ చేయక పోతే పండుగ రోజు లేదా దాని తరువాత తవాఫె ఇఫాజాతో సయీ చేసుకోవాలి.

[40] యౌమున్నహర్ అంటే అది పండుగ రోజు. జిల్ హిజ్జా మాసము యొక్క పదో తారీకు. మరియు దానికి ఈ పేరు పెట్టడానికి కారణం హాజీలు ఆరోజు నహర్ చేస్తారు అంటే తమ హదీ జంతువులను జుబాహ్ చేస్తారు.

[41] ఇర్గాముష్షైతాను అంటే అతనిని అవమానపరచటం

[42]తన నివాసమున్న చోటు.

[43]దైవదూతలు: అల్లాహ్ తఆలా కాంతితో సృష్టించిన సృష్టి. వారు చాలా ఉన్నారు. వారిని అల్లాహ్ తప్ప ఇంకెవరు లెక్కవేయలేరు. వారిలో కొందరు ఆకాశాల్లో ఉన్నారు. మరికొందరు ఆదం సంతతిపై బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

[44]అంటే అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరించిన గ్రంధములు సత్యమని ముస్లిములు విశ్వసించాలి. వాటిలో నుండి ఖుర్ఆన్ తప్ప ఇంకేమి వాస్తవరూపంలో మిగలలేదు. మరియు యూదుల వద్ద, క్రైస్తవుల చేతులలో ఉన్న తౌరాతు మరియు ఇంజీలు వారి ద్వారా వ్రాయబడినవి. ఎందుకంటే వాటిలో విబేధాలు ఉన్నవి. వాటి విషయంలో వారి మాటలు ఇలా ఉన్నవి: ఆరాధ్యదైవం ముగ్గురని, ఈసా అల్లాహ్ కుమారుడని. వాస్తవమేమిటంటే ఆరాధ్యదైవం ఒక్కడే అతడు అల్లాహ్. మరియు ఖుర్ఆన్ లో తెలుపబడినట్లు ఈసా అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త. ఇంకా ఆ గ్రంధముల్లో ఉన్న అల్లాహ్ వాక్కు ఖుర్ఆన్ ద్వారా రద్దుపరచబడినది. ఒక సారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్రత్ ఉమర్ రజిఅల్లాహు అన్హు చేతిలో తౌరాతు యొక్క ఒక కాగితమును చూసి ఆగ్రహమును వెలుబుచ్చారు. మరియు ఇలా సెలవిచ్చారు: "ఓ ఖత్తాబ్ కుమారుడా నా విషయంలో మీకు ఏదైన సందేహముందా. అల్లాహ్ సాక్షిగా ఒక వేళ మూసా జీవించి ఉంటే నన్నే అనుసరించేవారు". అప్పుడు ఉమర్ రజిఅల్లాహు అన్హు గారు కాగితమును పడవేశారు. మరియు ఇలా విన్నపించుకున్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త నా కొరకు మన్నింపు వేడుకోండి. దీన్ని అహ్మద్ (3/387) జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ నుండి ఉల్లేఖించారు. మరియు అల్బానీ రహిమహుల్లాహ్ దీన్ని అల్ ఇరవా లో (1589) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[45] దీన్ని ముస్లిం (153), అహ్మద్ (2/317) ఉల్లేఖించారు.

[46] దీన్ని అబూదావూద్ (4607), తిర్మిజి (2676), ఇబ్నె మాజ (43) ఉల్లేఖించారు. పదాలు దానివి. తేలికపాటి విభేదముతో అహ్మద్ (17142) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహ్ ఇబ్నె మాజలో (41) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[47] దీన్ని మాలిక్ (3339) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీలో (2937) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[48] దీన్ని ఇబ్నె మాజ (224), సగీర్ లో తబ్రానీ (22) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీలో (3808), (3809) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[49] దీన్ని తిర్మిజీ (2322), ఇబ్నె మాజ (4112) ఉల్లేఖించారు. మరియు అల్బానీ గారు దీనిని సహీహుల్ జామీలో (1609) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[50] దీని వివరణ మునుపటి మూడు అధ్యాయములలో ప్రస్తావించబడినది.

[51] అంటే అల్లాహ్ ముందు ఎటువంటి సామర్ధ్యము లేని మృతులు, విగ్రహాలు లాంటి సృష్టిరాసులతో భయపడకూడదు మరియు ఆశ పెట్టుకోకూడదు. ఇక సామర్ధ్యము కల జీవులతో భయము ఉదాహరణకి పులితో, దొంగలతో భయము. మరియు అలాగే సహాయం చేయుటకు సామర్ధ్యం కలవానిపై ఆశపెట్టుకోవటం ఉదాహరణకు దానం చేసేవాడితో మరియు దాతతో. ఆ రెండు అంటే భయపడటం మరియు ఆశపెట్టుకోవటం స్వాభావికమైనవి వాటిపై ఎటువంటి నింద లేదు.

[52] చివరికి హలాల్ జంతువును జుబాహ్ చేసే విషయంలో కూడా. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంగారు కత్తిని పదును చేసుకోమని మరియు జుబాహ్ చేయబడే జంతువుకు సుఖమును కలిగించమని ఆదేశించారు. జంతువులో జుబాహ్ చేసే స్థలం: గొంతు, అన్నవాహిక మరియు రక్తనాళమును కోయాలి. చివరికి దాని రక్తం పూర్తిగా తొలగిపోవాలి. మరియు ఒంటెను మెడ క్రింది భాగములో పొడవాలి. ఇక జంతువును విద్యుద్ఘాతం (కరెంట్ షాక్) లేదా తలపై కొట్టటం ద్వారా మరియు ఇటువంటి వేరేవాటి ద్వారా చంపడం నిషేధము. ఆ జంతువును తినటం సమ్మతం కాదు.

[53] ప్రజలను బాధించే అడవి కుక్క. బాధను కలిగించే అడవి మృగాలన్ని ఇందులో వస్తాయి.

[54] పాలకుడు లేదా నాయకుడు.

[55] దీన్ని బుఖారీ (13) మరియు ముస్లిం (45) ఉల్లేఖించారు. పదాలు ముస్లింవి.

[56] ఇవి దైవప్రవక్త హదీసు పుస్తకాలలో వేరు వేరు చోట్ల ప్రస్తావించబడిన గొప్ప సంక్షిప్త ప్రసంగాలు.

[57] దీన్ని అహ్మద్ (22978) ఉల్లేఖించారు మరియు అల్బానీ గారు దీనిని సిల్, సిలతుస్సహీహ లో (199/6) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[58] దీన్ని బుఖారీ (105) మరియు ముస్లిం (1679) ఉల్లేఖించారు. మరియు పదాలు బుఖారీవి.

[59] అతడికి ఆదేశించాడు - ఒక వేళ అతనికి శక్తి ఉంటే

[60] హద్దులు అంటే పాపములకు పాల్పడిన వారిపై ఇస్లామీయ ధర్మశాసన శిక్షలను విధించటం.

[61] దీన్ని అబూదావూద్ (275/2) మరియు నసాయి (316/2) మరియు అహ్మద్ (1652) ఉల్లేఖించారు. దానిని అల్బానీ గారు సహీహుత్తర్గీబ్ వత్తర్హీబ్ (1411), సహీహుల్ జామీ (4172) లో ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[62] మరియు అల్లాహ్ వంశావళిని అది నశించిపోవటం నుండి మరియు దాని మిశ్రమం నుండి రక్షించాడు. వ్యభిచారం కారణంగా ఒక వ్యక్తిని తండ్రి కాని వ్యక్తికి అపాదించటం జరిగేది.

[63] రోగి యొక్క చెడు అవయవమును రోగి, అతని ఇంటివారి కోరికతో అతని శరీర భద్రత కొరకు కోయటం ఉత్తమం.

[64] ఇస్లామీయ పరిపాలన నీడలో ఉండే ముస్లిములు జకాత్ చెల్లించాలి మరియు ముస్లిమేతరులు జిజియా చెల్లించాలి. ఇది నిర్ణయించబడిన రకము యవ్వనులైన పురుషుల నుండి తీసుకొనబడును. స్త్రీల నుండి, పిల్లల నుండి, పిచ్చివారి నుండి, పెద్ద వయస్సు కలవారి నుండి, పేదవారి నుండి తీసుకోబడదు. జిజియా అన్నది సులువుగా తీర్చగలిగే సొమ్ము అయి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రతీ సంవత్సరం ఒక దీనారు కన్న దాటలేదు. ఈ రకము ఎంత సులవంటే ప్రతీ ధనవంతుడు ప్రతీ సంవత్సరం ఒకసారి తేలికగా తీస్తాడు. ఈ సొమ్ము ఇస్లామీయ పరిపాలనలో శాంతియుతంగా జీవనం గడపటానికి బదులుగా చెల్లించే సొమ్ము. మరియు ఇస్లామీయ షరీఅత్ లో అన్ని జీవిత కార్యకలాపాలు మరియు అనుమతించదగిన లాభాలను వారు ఆచరించాలి. ఈ జిజియా ద్వారా ముస్లిముల తరపు నుండి వారి సంపద, వారి మానముల రక్షణ లభించును. వారు సురక్షితమైన జీవితాన్ని మరియు తమ సంపూర్ణ రక్షణను ఆస్వాదిస్తారు. అంతే కాక వారి ఆరాధనాలయాలకి మరియు వారి ధర్మానికి రక్షణ లభించును. ముస్లిములు వారి హక్కులను నిర్వర్తించటం నుండి మరియు వారి శతృవుల నుండి వారికి రక్షణ కల్పించనప్పుడు దాని షరతు అయిన రక్షణను కోల్పోవటం వలన వారి నుండి తీసుకున్న జిజియాను తిరిగి ఇచ్చివేస్తారు. ఒక వేళ వారు (ముస్లిమేతరులు) వారి దేశ రక్షణలో పాల్గొంటే జిజియా ఇవ్వటం తొలగిపోవును. ప్రభుత్వం వారి పేదలకు సహాయం చేయటంలో మరియు వారికి వైధ్యం చేయటంలో ముస్లింలకు చేసినవిధంగా నిలబడుతుంది.

[65] ఫిత్నా అన్నది ప్రజల వద్దకు ఇస్లాం చేరటం నుండి ఆపటం వలన మరియు ఎటువంటి బలవంతం లేకుండా ఇస్లాం స్వీకరించటం నుండి వారిని ఆపటం వలన ఏర్పడుతుంది.

[66] అర్రిద్దతు (మతభ్రష్టత): ఇస్లాంను వదిలి అవిశ్వాసమును ఎంచుకోవటం. ఇస్లాంను పూర్తి నమ్మకముతో ఎంచుకున్నవాడు అలా చేయడు. మరియు అతడు ఎక్కడ ఉన్నా ఏ ధర్మము మరియు ఏ సంస్కృతి అతడిని దాని నుండి మరల్చదు. ఎందుకంటే అది దాని పరిపూర్ణతకు మరియు దాని గొప్పతనమునకు చేరుకోదు. ముస్లిం సమాజంలో ప్రలోభాన్ని సృష్టించడం మరియు దానిని అవిశ్వాసం వైపునకు నెట్టడం లేదా కామం లేదా భౌతిక, సామాజిక ప్రయోజనాల వెనుక ప్రయత్నం చేయటం. ఈ విధంగా ఇస్లాంను వదిలి అవిశ్వాసమును ఎంచుకోవటం అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన దైవిక ప్రమాణాల నుండి వైదొలగిపోవటం అవుతుంది. ఇది ప్రస్తుతం చాలా దేశాలు దేశానికి ద్రోహం చేయటమును నేరపూరితం చేయటం మరియు దానికి మరణశిక్షను విధించటమును పోలి ఉంది. ఇస్లాం ధర్మంలో ధర్మం నుండి వైదొలగిన వారిపై శిక్షను విధించే హక్కు పాలకుని చేతిలో ఉంటుంది. పాలకుడు తీర్పు యొక్క నియమనిబంధనలకు అనుగుణంగా సమాజ పరిరక్షణ కొరకు ధర్మం నుండి మరలిపోయిన వారిపై శిక్షను విధిస్తాడు.

[67] అల్లాహ్ ను లేదా ఆయన ప్రవక్తలైన ముహమ్మద్ లేదా మూసా లేదా ఈసా అలైహిముస్సలాంలో నుంచి ఏ ఒక్కరినైనా లేదా ఇస్లాం ధర్మంలోని ఏదైన విషయమును హేళన చేయటం.

[68] ప్రాణమున్న వాటి చిత్రాలను చేతితో చిత్రించటం లేదా చెక్కపై చెక్కటం లేదా మట్టితో, ఇతర వాటితో తయారు చేయడం. మరియు ఇవి చిత్రాకారులకు హెచ్చరించే నుసూస్ (ఆధారాల్లో) లో వస్తాయి.

[69] దైవప్రవక్త ఈసా అలైహిస్సలాం బహుళ వివాహమును నిషేధించలేదు. దాన్ని క్రైస్తవులు తమ మనోవాంఛలను అనుసరిస్తూ వారించారు.

[70] ముస్లిం పుణ్య స్త్రీలను (వివాహం కాని స్త్రీలు లేదా విడాకులివ్వబడిన స్త్రీలు) మరణాంతరం అల్లాహ్ లేపి లెక్క తీసుకున్న తరువాత వారిని స్వర్గంలో ప్రవేశింపజేసినప్పుడు స్వర్గవాసుల్లోంచి ముస్లిం పురషులలోంచి ఎంచుకునే హక్కును వారికి ఇస్తాడు. అప్పుడు ఆ స్త్రీలు తమకు ఇష్టమైన వారిని వివాహమాడుతారు. మరియు ముస్లిం స్త్రీ ఒక సారి కన్న ఎక్కువ సార్లు వివాహం చేసుకొని ఉండి మరణించి ఆమె స్వర్గ వాసుల్లోంచి అయి ఉంటే ఇహలోకంలో తనకు ఇష్టమైన భర్త ఎవరుంటారో వారిని అక్కడ ఎంచుకుంటుంది.

[71] దీన్ని అహ్మద్ (1/377, 413, 453) మరియు ఇబ్నె మాజ (2/340) మరియు ఇబ్నె హిబ్బాన్ (1394) మరియు హాకిమ్ (4/196) ఉల్లేఖించారు. మరియు అల్బానీ రహిమహుల్లాహ్ సిల్ సిలతుస్సహీహ లో (451) ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[72] దీన్ని అబూదావుద్ (3874) ఉల్లేఖించారు. మరియు అల్బానీ రహిమహుల్లాహ్ సహీహుల్ జామిలో (1762) దీన్ని ప్రామాణికమైనదిగా తెలియపరచారు.

[73] అల్లాహ్ తన దాసులకు వారిలో నుండి ఎవరు విధేయత చూపుతాడో మరియు ఎవరు అవిధేయత చూపుతాడో ముందే తెలిసి కూడా వారిని ఆదేశిస్తాడు మరియు వారిని వారిస్తాడు. కాని ఆయన ఈ జ్ఞానమును బహిర్గతం చేయటానికి చివరికి ఆయన దాసుడికి అతని కర్మల పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు. కాబట్టి అపరాధి "నేను చేయని పాపముపై నా ప్రభువు నన్ను శిక్షించి నాపై హింసకు పాల్పడ్డాడు" అని పలకకూడదు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "మరియు నీ ప్రభువు దాసులను హింసించేవాడు కాదు". [ఫుస్సిలత్: 46]

[74] దాన్ని ముస్లిం (2999), అహ్మద్ (332/4), దార్మీ (2777) ఉల్లేఖించారు.

[75] ఉదాహరణకు ఇస్లాం పేరుతో అమాయకుల ప్రాణాలు తీసే ఖవారిజ్ లు. మరియు వారు ఇస్లాం శతృవుల కుట్రలో నుంచి భాగము.

[76] ప్రవక్తల పరిసమాప్తి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: పుట్టే ప్రతీ పిల్లవాడు స్వభావంపైనే పుడుతాడు. అయితే అతని తల్లిదండ్రులు అతనిని యూదునిగా, క్రైస్తవునిగా, మజూసీగా చేసేస్తారు. [దీనిని బుఖారీ (1292), ముస్లిం (2658) ఉల్లేఖించారు మరియు పదాలు ముస్లింవి]. ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియపరిచారు: మనిషి ఇస్లాం స్వభావంపై జన్మించి దాని స్వభావమును విశ్వసిస్తాడు. ఒక వేళ అతనికి ఎంచుకునే అనుమతి ఇస్తే ఎటువంటి సంకోచము లేకుండా ఇస్లాంను ఎంచుకుంటాడు. యూదమతం, క్రైస్తవ మతం, మజూసీ మతం మరియు ఇతర అసత్య మతాలను, ధర్మాలను వాటిపై పోషించబడటం వలన స్వీకరించటం జరుగును.

[77] బాతినీయ వర్గమునకు అనేక పేర్లు కలవు. మరియు భారతదేశం, సిరియా, ఇరాన్, ఇరాక్ మరియు అనేక ఇతర దేశాలలో విస్తరించి ఉన్న అనేక శాఖలుగా విభజించబడ్డాయి. దీనిని ముతఖద్దిమీన్ లో నుంచి ఒక పెద్ద సంఖ్య సవివరంగా తెలియపరచింది. వారిలో నుంచి అల్లామా షహ్రిస్తానీ తన ప్రసిద్ధ పుస్తకం అల్ మిలల్ వన్నిహల్ లో సవివరంగా తెలియపరచారు. మరికొంత మంది చరిత్రకారులు దాని గురించి వర్ణించారు. మరియు కొన్ని క్రొత్త వర్గములను తెలియరచారు. అవి ఖాదియానీ, బహాయీ మరియు ఇతర వర్గములు. మరియు అదేవిధంగా ఉస్తాద్ ముహమ్మద్ సయీద్ కీలానీ తన పుస్తకం జైలిల్ మిలల్ వన్నిహల్ లో మరియు జామియా ఇస్లామియా మదీనా మునవ్వరా లో గురువులుగా పని చేస్తున్న షేక్ అబ్దుల్ ఖాదిర్ షీబతుల్ హమ్ద్ తన పుస్తకం అల్ అద్యాను వల్ ఫిరఖు వల్ మజాహిబుల్ ముఆసిరాలో ఈ వర్గముల గురించి సవివరంగా తెలియపరచారు.

[78] తమ ముఖాలు మరియు ఛాతీలను కొట్టడం మరియు గొలుసులు మరియు కత్తులతో తమ శరీరాలను కొట్టడం ద్వారా ఇస్లాం ప్రతిష్టను దెబ్బతీయడం వారి చర్యల్లో ఒకటి.

[79] ఇహలోకంలో మంచి జీవితంతో మరియు పరలోకంలో స్వర్గంతో.