మీ భర్తను సంతోషపెట్టడం ఎలా? ()

ముహమ్మద్ ఇబ్రాహీం అబ్దుల్ హలీం

షేఖ్ ముహమ్మద్ అబ్దుల్ హలీమ్ హమీద్ ఇంగ్లీషులో రచించిన "మీ భర్తను సంతోషపెట్టటం ఎలా?" అనే పుస్తకం ఆధారంగా ఈ వ్యాసం తయారు చేయబడినది.

  |

  మీ భర్తను సంతోషపెట్టడం ఎలా?

  ﴿كيف تسعدين زوجك؟ ﴾

  ] తెలుగు – Telugu – التلغو [

  షేఖ్ ముహమ్మద్ అబ్దుల్ హలీమ్ హామిద్

  అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్

  పునర్విమర్శ : షేఖ్ నజీర్ అహ్మద్

  2009 - 1430

  ﴿ كيف تسعدين زوجك؟ ﴾

  « باللغة التلغو »

  شيخ محمد عبد الحليم حامد

  ترجمة: محمد كريم الله

  مراجعة: شيخ نزير أحمد

  2009 - 1430

  మీ భర్తను సంతోషపెట్టటం ఎలా?

  షేఖ్ ముహమ్మద్ అబ్దుల్ హలీమ్ హమీద్ ఇంగ్లీషులో రచించిన "మీ భర్తను సంతోషపెట్టటం ఎలా?" అనే పుస్తకం ఆధారంగా ఈ వ్యాసం తయారుచేయబడినది.

  1. చిరునవ్వుతో, ఆహ్లాదంగా స్వాగతం పలకవలెను.

  ఆఫీసు, స్కూలు, ప్రయాణం లేక మిమ్మల్ని విడదీసిన కారణం ఏదేమైనా గాని, భర్త ఇంటి నుండి బయటకు పోయి, పని పూర్తి చేసుకుని, తిరిగి మరలి వచ్చినప్పుడు,

  · మంచి శుభాకాంక్షల పలుకులతో, ప్రేమతో నిండిన వాక్యాలతో ఆహ్వానించండి.

  · చిరునవ్వుతో ఆహ్వానించండి.

  · సుందరంగా అలంకరించుకోండి మరియు సుగంధ పరిమళాలు పూసుకోండి.

  · మంచివిషయాలతో, శుభవార్తలతో సంభాషణ మొదలు పెట్టండి. ఏవైనా కష్టాలు, చెడువార్తలు (అశుభమైన వార్తలు) ఉన్నట్లయితే, ఆయన విశ్రాంతి తీసుకునే వరకు దానిని ఆలస్యం చేయండి.

  · భోజనం మంచి రుచికరంగా మరియు ఆయన ఇంటికి రాకముందే తయారుగా ఉండేటట్లు ప్రయత్నించండి.

  2. మృదుమధురంగా, తియ్యగా గొంతుతో సంభాషించవలెను.

  ఇలా కవ్వించటం, నవ్వించటం కేవలం మీ భర్తతో మాత్రమే. ఇతర పరాయి మగవారి కఠినంగా మాట్లాడవలెను.

  3. శరీరాన్ని సువాసనలు వెదజల్లుతూ, అందంగా ఉండేటట్లు జాగ్రత్త వహించవలెను.

  · మీ శరీరం గురించి మరియు ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోండి.

  · ఎప్పుడూ నీటుగా, ఆకర్షణీయంగా ఉండే దుస్తులు ధరించండి.

  · ప్రతిరోజూ స్నానం చేయండి. నెలసరి బహిష్టు తర్వాత ఏవైనా రక్తపు మరకలు లేక దుర్వాసన ఉంటే వాటిని వెంటనే తొలగించండి.

  · భర్త ఇష్టపడే పర్ ఫ్యూమ్ లు, రంగులు, దుస్తులు ధరించటానికి ప్రయత్నించండి.

  · హెయిర్ స్టైలు, పర్ ఫ్యూమ్ లు తరచుగా మారుస్తూ ఉండండి. అయితే ఇంట్లోని ఇతర స్త్రీపురుషుల ముందు హద్దుమీరి, అతిగా కనబడకుండా జాగ్రత్త వహించండి.

  · మాసిన దుస్తులలో, అందవిహీనంగా ఉన్నప్పుడు మీ భర్త మిమ్మల్ని చూడకుండా జాగ్రత్త వహించండి.

  · పచ్చ పొడిపించుకోవటం వంటి నిషేధింపబడిన అలంకరణలకు దూరంగా ఉండండి.

  4. రతి సంభోగం

  · భర్త పిలిచినప్పుడు ఆలస్యం చెయ్యక, వెంటనే సంభోగంలో పాల్గొనటానికి ముందుకు రండి.

  · సాధ్యమైనంత వరకు మీ శరీరాన్ని పరిశుభ్రంగా, మంచి సువాసనలతో ఉండేటట్లు జాగ్రత్త వహించండి. సంభోగ సమయంలో బయటకు వచ్చే వీర్యాన్ని, ఇతర ద్రవాలను వెంటనే శుభ్రపరుచుకోండి.

  · మీ భర్తతో ప్రేమగా వ్యవహరించండి.

  · తన కోరికను పూర్తిగా తీర్చుకుని, సంతృప్తి చెందే వరకు ఆయనకు సహకరించండి.

  · మీకు కోరిక కలిగినప్పుడు, వీలు చూసుకుని రతి సంభోగం కోసం భర్తను ప్రేరేపించండి, ప్రోత్సహించండి. దానికి సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎన్నుకోండి. ఉదాహరణకు ప్రయాణం నుండి మరలి వచ్చిన తర్వాత, సెలవు దినాలలో ప్రయత్నించటం మంచిది.

  5. అల్లాహ్ ప్రసాదించిన దానికి తృప్తి చెందవలెను.

  · ఒకవేళ మీ భర్త బీదరికంలో లేక చిన్న ఉద్యోగంలో ఉన్నట్లయితే, దాని గురించి నిరాశ పడవద్దు.

  · మీ కంటే కటిక బీదవారు, రోగులు, వికలాంగులు మొదలైనవారి అసహాయక పరిస్థితులను గమనించి, వారి కంటే ఎక్కువగా మీకు ప్రసాదించిన శుభాలకు బదులుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండండి.

  · ఈమాన్ (విశ్వాసం) మరియు తఖ్వా (భయభక్తులు) లలోనే అసలైన సుఖసంతోషాలు, మనశ్శాంతి లభిస్తాయనే విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోండి.

  6. ప్రాపంచిక సుఖసౌకర్యాల గురించి భిన్నంగా ఉండవలెను.

  · ఈ ప్రపంచాన్ని కేవలం ఆశలు మరియు కోరికలు తీర్చుకునే స్థానంగా పరిగణించవద్దు.

  · జీవితాన్ని సుఖసంతోషాలతో, పొందికగా, మంచిగా సాగిస్తూ, సంపూర్ణ సాఫల్యం సాధించాలంటే కేవలం హలాల్ పనులు చేస్తూ జీవించటంతోనే సరిపోదు. తమకు ప్రసాదించిన సౌకర్యాలతో పరలోకంలో కూడా సుఖసంతోషాలతో జీవించటానికి అంటే స్వర్గంలో శాశ్వతస్థానం సంపాదించటానికి మనస్పూర్తిగా ప్రయత్నించటం తప్పనిసరి.

  · అనవసరమైన వాటిని తీసుకు రమ్మని మీ భర్తను ఇబ్బంది పెట్టవద్దు.

  · ఖర్చులు తగ్గించటానికి మీ భర్తను ప్రోత్సహించండి. దాని ద్వారా కొంత ధనాన్ని ఆదా చేసి, పేదలకు దానధర్మాలు చేయండి, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి.

  7. ప్రశంసించటం

  · ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఒక హదీథ్ ఆధారంగా నరకవాసులలో స్త్రీలే అధికశాతాన్ని ఆక్రమిస్తారు. ఎందుకంటే ఎక్కువ శాతం స్త్రీలు, తమకు లభించిన మంచికి, శుభాలకు తృప్తిపడి, కృతజ్ఞతలు తెలుపకుండా, వాటిని నిరక్ష్యంచేస్తూ, తృణీకరిస్తూ, నిరాకరిస్తూ, అసంతృప్తితో ఉంటారు.

  · కృతజ్ఞతగా ఉండకపోవటం వలన మీ భర్త నిరాశ చెందుతారు. ఇంకా మీ భర్తలో "ఇంత చేసినా కృతజ్ఞత చూపనప్పుడు, నేనెందుకు ఆవిడ గురించి ఆలోచించాలి?" అనే ప్రశ్నలు ఉద్భవించటం మొదలగును.

  · కృతజ్ఞతాపూర్వకంగా ఉండటం వలన మీ భర్త మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు. అంతేకాక మీకు అన్ని విధాల సుఖసంతోషాలు సమకూర్చటానికి పూర్తిగా ప్రయత్నిస్తారు.

  8. అంకిత భావం మరియు విధేయత

  · మీ భర్త అనారోగ్యం పాలుకావటం, వ్యాపారంలో ఘోరంగా నష్టపోవటం, ఉద్యోగం పోగొట్టుకోవటం, ఎక్సిడెంటుకు గురికావటం మొదలైన కష్టపరిస్థితులలో ఉన్నప్పుడు, ఆయనపై ప్రత్యేక శ్రద్ధ చూపవలెను.

  · మీ స్వంత ఆదాయంతో, ఇస్లాం పరిధిలోని ఉద్యోగంతో, ధనంతో, సంపదతో సహాయసహకారాలు అందించి, ఆయనకు చేదోడువాదోడుగా నిలవవలెను.

  9. శిరసావహించటం

  · హరామ్ అంటే ఇస్లాం ధర్మంలో నిషేధింపబడిన విషయాలలో తప్ప, మిగిలిన అన్ని విషయాలలో ఆయన ఆదేశాలను తు.చ. తప్పక పాటించవలెను. మనస్పూర్తిగా శిరసావహించవలెను.

  · ఇస్లాం ధర్మంలో, కుటుంబానికి నాయకుడు భర్త. అయితే ఆ నాయకుడికి సరైన సలహాలు అందించి, సంప్రదింపులు జరిపే బాధ్యతాయుతమైన మహామంత్రి స్థానం భార్యదే.

  10. భర్త కోపాన్ని పోగొట్టటానికి కృషి చేయవలెను.

  ముందుగా, అతనికి కోపం తెప్పించే వాటికి దూరంగా ఉండండి. కాని ఒకవేళ ఎప్పుడైనా అలా చేయలేకపోతే, క్రింది పద్ధతుల ద్వారా ఆయనను సంతుష్టపరచటానికి ప్రయత్నించటవలెను:

  · ఒకవేళ మీదే తప్పైతే, వెంటనే క్షమాపణ అడగండి.

  · ఒకవేళ ఆయనిదే తప్పైతే: వాదోపవాదాలకు దిగకుండా, మీ హక్కు గురించి వాదించే బదులు ఆయన కోపం తగ్గే వరకు నిరీక్షించండి, ఆ తర్వాత శాంతియుతంగా దానిని ఆయనతో చర్చించండి.

  · ఒకవేళ వేరే ఇతర కారణాల వలన ఆయన కోపంగా ఉంటే: ఆయన కోపం తగ్గే వరకు నిశ్శబ్దంగా ఉండి, ఆ కోపానికి కారణం ఏమై ఉంటుందో కనిపెట్టండి – అది అలసిపోవటం, ఆఫీసులో సమస్యలు, ఎవరైనా ఆయనను అవమానించి ఉండవచ్చు.

  · అనేక ప్రశ్నలు అడిగి వేధించకండి. జవాబు కోసం నిలదీయ కండి. ఉదాహరణకు

  1) ఏమి జరిగినదో నాకు చెప్పవలసినదే!

  2) మీకు ఎందుకంత కోపం వచ్చినదో నాకు తప్పకుండా తెలియవలసినదే!

  3) మీరు నా నుండి ఏదో దాస్తున్నారు. అది తెలుసుకునే హక్కు నాకుంది!

  11. ఆయన ఇంట్లో లేనప్పుడు కుటుంబాన్ని సంరంక్షించే బాధ్యత సరిగ్గా నిర్వర్తించవలెను.

  · ఆయన ఇంట్లో లేనప్పుడు, ఎటువంటి అసాంఘిక, అనైతిక, అధర్మ, అశ్లీల సంబంధాలు ఏర్పరచుకోకుండా స్వయంగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

  · కుటుంబ రహస్యాలను గోప్యంగా ఉంచండి, ముఖ్యంగా భార్యాభర్తల సంభోగం వంటి ప్రైవేటు విషయాలు ఇతరులకు తెలియటమనేది ఏ మగవాడూ ఇష్టం పడడనే విషయం గుర్తుంచుకోండి.

  · జాగ్రత్తగా ఇంటి బాధ్యత, పిల్లల రక్షణ బాధ్యత వహించండి.

  · ఆయన యొక్క ధనాన్ని మరియు సంపదను కాపాడండి.

  · ఆయన అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితులలోను ఇంటి నుండి బయటకు వెళ్ళకండి మరియు భర్త అనుమతితో బయటకు వెళ్తున్నా కూడా పూర్తి పరదాలోనే వెళ్ళండి. అది ఇతరుల దృష్టి నుండి మీకు సరైన రక్షణ కల్పించును. ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచించక, అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నాననే ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవండి. దీని వలన మీకు ఎన్నో శుభాలు కలుగును.

  · ఆయన ఇష్టపడని వారిని ఇంట్లోనికి అస్సలు రానివ్వవద్దు.

  · ఎక్కడైనా సరే, మహ్రమ్ కాని వ్యక్తితో మీరు ఏకాంతంలో అస్సలు కలవవద్దు, పరిచయాలు పెంచుకోవద్దు. అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే మొగ్గలోనే త్రుంచి వేయండి.

  · భర్త దగ్గర లేనప్పుడు, ఆయన తల్లితండ్రులతో మరియు ఆయన బంధువులతో మంచిగా మెలగండి.

  12. ఆయన కుటుంబంపై మరియు బంధుమిత్రుల పై గౌరవాభిమానాలు చూపవలెను.

  · ఇస్లామీయ షరిఅహ్ పరిధి లోపల, ఆయన బంధుమిత్రులతో, అతిథులతో వీలయినంత ఉత్తమంగా ప్రవర్తించండి, సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించండి మరియు ప్రత్యేకంగా ఆయన తల్లితండ్రులతో మంచిగా మెలుగుతూ, వారిని సంతోషపెట్టటానికి మనస్పూర్తిగా ప్రయత్నించండి.

  · ఆయన బంధువులతో సాధ్యమైనంత వరకు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా చూసుకోండి.

  · తల్లి - భార్యల మధ్య ఎవరో ఒకరిని మాత్రమే ఎన్నుకోవలసిన కఠిన పరిస్థితి ఆయనకు ఎదురవకుండా చూడండి.

  · ఆయన అతిథులు కూర్చోవటానికి మంచి స్థలాన్ని ఏర్పాటు చేయవలెను. అతిథి మర్యాదలలో లోపం రాకుండా చూసుకోండి. వారి భార్యలను, స్త్రీలను సాదరంగా ఆహ్వానించండి.

  · తన చుట్టాలను దర్శించటానికి, వారిని మీ ఇంటికి రమ్మని ఆహ్వానించటానికి ఆయనను ప్రోత్సహించండి.

  · ఆయన తల్లితండ్రులకు, అక్కచెల్లెళ్ళకు ఫోను చేయటం, ఉత్తరాలు వ్రాయటం, బహుమతులు పంపటం, వారి ఇబ్బందులలో సహాయపడటం వంటివి చేస్తుండవలెను.

  13. పరిమిత అంటే హద్దులు దాటని కోపతాపాలు, ఈర్ష్యాసూయలు

  · భర్త గురించి చెడుగా చెప్పేవారిపై కోపం రావటమనేది భార్యకు తన భర్తపై ఉన్న ప్రేమను సూచిస్తుంది. అయితే అది హద్దుమీరి ఇస్లామీయ పరిధి దాటకుండా చూసుకోవలెను. ఉదాహరణకు, ఆయనను అవమానించే లేదా ఆయనపై చాడీలు చెప్పే వారిని అగౌరవ పరచటం, తీవ్రంగా కోప్పడటం మొదలైనవి.

  · భర్తపై క్రొత్తక్రొత్త సందేహాలను మీరే సృష్టించుకోవటం లేదా ఆయనను అనుమానించటం లాంటివి చేయవద్దు.

  14. సహనంతో, మానసికోద్వేగమైన సహాయసహకారాలు అందించటం- Emotional Support

  · బీదరికం, అనారోగ్యం లాంటి కష్టకాలాలు ఎదురైనప్పుడు సహనంతో, ఓర్పుతో ఉండండి.

  · కష్టనష్టాలు మీకు, మీ భర్తకు, మీ పిల్లలకు లేక బంధుమిత్రులకు, ఎవరికి ఎదురైనా ఓర్పు వహించండి. ఉదాహరణకు తుఫాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు, ఎక్సిడెంటులు, మరణాలు మొదలైనవి.

  · ఇస్లామీయ ధర్మప్రచారంలో ఇబ్బందులకు గురైనప్పుడు (అరెష్టు కావటం, కాల్పులకు గురవటం, జైలుకు తరలింపబడటం మొదలైనవి) ఓర్పుతో ఉండండి.

  · ఓర్పు పట్టి, ఆయనను అల్లాహ్ మార్గంలో ఇంకా గట్టిగా కృషి చేయటానికి ప్రోత్సహించండి. స్వర్గం గురించి జ్ఞాపకం చేయండి.

  · ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నప్పుడు, దానికి బదులుగా మంచి ప్రవర్తనను ఆయన ముందు పెట్టండి. అంటే చెడును మంచితో ఎదుర్కొనండి. ఇది అత్యుత్తమమైన పద్ధతి.

  15. అల్లాహ్ కు విధేయత చూపటంలో, ఇస్లామీయ ధర్మప్రచారంలో జిహాద్ వంటి సందర్భాలలో భర్తకు పూర్తి సహాయసహకారాలందించవలెను.

  · ఎక్కవ ఆరాధనలు చేసేటట్లు భర్తతో కోపరేట్ చేయండి. ఆయనకు వివిధ సున్నత్ నమాజులు, ఐచ్ఛిక ఆరాధనల గురించి జ్ఞాపకం చేయండి.

  · రాత్రి సమయాలలో నమాజు చేయటానికి అవకాశం ఉన్నప్పుడల్లా ప్రోత్సహించండి.

  · ఖుర్ఆన్ పఠనం మరియు ఖుర్ఆన్ వినటం అప్పుడప్పుడూ భర్తతో కూడా కలిసి చేయండి.

  · ఇస్లామీయ ఉపన్యాసాలను మీరు స్వయంగా వినటమే కాకుండా వీలయినప్పుడు భర్తతోనూ కలిసి వినండి.

  · ఫజర్ తర్వాత మరియు మగ్రిబ్ కంటే ముందు వేడుకోవటానికి ప్రత్యేకించబడిన ఉత్తమ సమయాలు. మరి వాటి విశిష్ఠత గురించి అల్లాహ్ ప్రత్యేకంగా తెలిపి ఉన్నాడనే విషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి.

  · మీ చుట్టుప్రక్కల స్త్రీలకు మరియు పిల్లలకు ఇస్లామీయ ధర్మ ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయండి.

  · స్త్రీలకు సంబంధించిన ఇస్లామీయ నియమనిబంధనలు మరియు ఉత్తమ ప్రవర్తనల గురించి అభ్యసించండి.

  · భర్త యొక్క ఇస్లామీయ కార్యకలాపాలకు తోడ్పాటు నివ్వండి. వివేకవంతమైన సలహాలు ఇవ్వండి, ఆయన సాధకబాధలను పంచుకోండి.

  · మీ యొక్క కొన్ని హక్కులను మరియు కొంత సమయాన్ని ఆయన చేస్తున్న ఇస్లామీయ ధర్మ ప్రచారం కోసం త్యాగం చేయండి మరియు ఆ పవిత్ర కార్యక్రమాలకు అప్పగించి, మీరు కూడా పుణ్యం సంపాదించండి.

  · సమాజశ్రేయస్సు కొరకు మరియు ఇస్లామీయ ధర్మ రక్షణ అవసరం కలిగినప్పుడు జిహాద్ (ధర్మయుద్ధం) లో పాల్గొనటానికి ప్రోత్సహించండి. మీరు మరియు మీ పిల్లలు అల్లాహ్ యొక్క సంరక్షణలో ఉంటారని ఆయనకు ధైర్యానివ్వండి. హద్దు మీరిన చెడును రూపుమాపమని ప్రతి ధర్మం ఆదేశిస్తున్నది. మంచిని ప్రోత్సహించమని మరియు చెడును నిరోధించమని ఖుర్ఆన్ లో అల్లాహ్ అనేకసార్లు ఆజ్ఞాపించెను.

  16. ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం

  · నీటుగా, అలంకరించి, మంచిగా సరిదిద్ది ఉంచవలెను.

  · ఫర్నిచర్ స్థానాన్ని అటూ ఇటూ మారుస్తూ ఉండండి. దీని ద్వారా పాతదనంతో బోర్ చెందకుండా ఉంటారు.

  · ఇంటిని నడపటంలో అవసరమైన అన్ని రకాల నైపుణ్యాన్ని నేర్చుకోండి. ఉదాహరణకు కుట్టుపని, ఇంటి లోపలి అలంకరణ...

  · పిల్లలను ఇస్లామీయ పద్ధతిలో ఉత్తమంగా, ఉన్నతంగా పెంచే విధానం గురించి పరిశోధించండి, నేర్చుకోండి.

  · రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన భోజనాన్ని తయారు చేయండి.

  17. ఆర్థిక సంరంక్షణ మరియు కుటుంబ సంరక్షణ

  · ఆయన అనుమతి లేకుండా ఆయన ధనం నుండి దానధర్మాలు కూడా చేయవద్దు. ఆయన తప్పకుండా ఒప్పుకుంటారని ఖచ్చితంగా తెలిస్తేనే అలా దానధర్మాలు చేయండి.

  · ఆయన ఇంటిని, ఆయన కారును, ఆయన వస్తువులను ఇంటిలో లేనప్పుడు జాగ్రత్తగా కాపాడండి.

  · పిల్లలను శుభ్రమైన, మంచి దుస్తులలో నీటుగా ఉంచండి. మంచి ఆరోగ్యానికి అవసరమైన బలవర్ధక పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వటంలో అశ్రద్ధ చేయవద్దు. ఇంకా వారి చదువు గురించి, ప్రవర్తన గురించి శ్రద్ధ తీసుకోండి. వారికి ఇస్లాం గురించి బోధించండి. వారికి ప్రవక్తల మరియు సహాబాల (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల) గాధలు చెప్పండి.

  ఇక చివరిగా, దయచేసి ఈ పుస్తకాన్ని వ్రాసిన షేఖ్ ముహమ్మద్ అబ్దుల్ హలీమ్ హామిద్, ఇంగ్లీషు అనువాదకుడు అబూ తల్హా, పునర్విమర్శకుడు ఆదం ఖురైష్, ఇతర భాషల అనువాదకులు మరియు పునర్విమర్శకుల కోసం ప్రార్థించవలెను. ఈ అనువాదంలో ఏవైనా తప్పులుంటే మమ్మల్ని క్షమించండి. Muslim Students' Association University of Alberta Edmonton, Canada February, 1999