వివరణ

మీకు తెలుసా - సృష్టికర్త ప్రతి మెదడులోను తనకై ఒక ప్రత్యేక భాగాన్ని రిజర్వ్ చేసుకున్నాడు - ఇది వైజ్ఞానికంగా నిరూపితమైనది. పూర్తి వివరాలు ఈ వ్యాసంలో ఉన్నాయి. ...

పూర్తి వివరణ

సృష్టికర్త పై విశ్వాసం
 
ప్రతి కాలంలోను దాదాపుగా మానవులందరూ దైవవిశ్వాసంతోనే జీవించారు. అతిప్రాచీనకాలంనుండిఅత్యాధునికనాగరికతలువిరజిల్లుతున్నఈరోజు వరకుదాదాపుఅన్నిమతాలుదైవమేకేంద్రంగామానవజీవితమునకుపునాదులువేసినవి. వాస్తవంగా 20 శతాబ్దంలోకమ్యూనిజంతెరపైవచ్చేవరకుచరిత్రలోఅతికొద్దిమందిమాత్రమే దైవాన్నితిరస్కరించి నాస్తికులుగా మిగిలిపోయారు. ఈరోజున పశ్చిమ దేశాల సెక్యులర్ సమాజములలోని నూతన సామాజిక శాస్త్రవేత్తలు డార్విన్ సిద్ధాంతాలవంటి అపొహల ఆధారంగా దైవవిశ్వాసం కేవలం మానవుడిలోని ఒక భ్రమ మాత్రమేనని వాదిస్తున్నారు. అయినా వాటిని ఎవరూ నమ్ముతున్నట్లుగా కనవడటం లేదు. సామాన్య మానవుడి నుండి ప్రసిద్ధ శాస్త్రవేత్తల వరకు అక్కడి ప్రజలందరూ దేవుడిని దృఢంగా విశ్వాసిస్తున్నారు.
పురావస్తు శాఖ అందిస్తున్న స్పష్టమైన సమాచారము ఆధారంగా దేవుడున్నాడనే దృఢమైన దైవవిశ్వాసం సహజంగా పుట్టుకతో వచ్చేదని, నేర్చుకుంటే వచ్చేది కాదని మానవజాతులను, సంస్కృతులను పరిశోధించే కొందరు శాస్తవేత్తలు అభిప్రాయబడ్డారు. అనేక సామాజిక శాస్త్రవేత్తల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, కొత్తగా ఇటీవల కనుక్కున్న వైజ్ఞానిక పరిశోధనలు అల్పసంఖ్యాక వైజ్ఞానికుల అభిప్రాయములను అంటే దైవవిశ్వాసం సహజమైనదనే అభిప్రాయమును బలపరుస్తున్నాయి. కాలిఫోర్నియా విశ్వవిధ్యాలయము, శాన్ డీగో లోని శాస్త్రవేత్త డాక్టర్ విలయనూర్ రామచంద్రన్,“God Spot is found in the Brain,” (మెదడులో దేవుడి స్థానం కనిపెట్టబడినది) అనే పరిశోధనా పత్రంలో మతపరమైన దైవవిశ్వాస గుణము మెదడులో నిక్షిప్తమైవుంటుందనే విషయము చాటిచెప్పెను.
 
 
మెదడులో దేవుడి స్థానం కనిపెట్టబడినది
స్టీవ్ కన్నర్
వైజ్ఞానిక విలేఖరి
మతాన్ని నమ్మటం అనే మానవుడి ఇంగిత జ్ఞానవికాసానికి కారణమైన మెదడులోని దైవస్థానమును కనుగొన్నామని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు
అధ్యాత్మిక అనుభవములలో అపారజ్ఞానం కలిగిన మూర్ఛరోగ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, దేవుడి గురించిన ఆలోచనలు రాగానే మెదడు ముందుభాగంలోని ఒక నరాల విద్వుత్ ప్రవాహక మార్గము లో విద్రుత్ ప్రవహించటం వారు గుర్తించారు.
 పరిశోధన మరియు దాని పర్యవసానాలు ప్రారంభదశలో ఉన్నప్పటికీ తొలి ఫలితాల ఆధారంగా మతపరమైన దైవవిశ్వాసగుణం మెదడులో నిక్షిప్తమైవుందని వైజ్ఞానికులు అభిప్రాయపడుతున్నారు.
తాము తరచుగా తీవ్రమైన చెప్పనలవికాని బాధను అనుభవస్తుంటామని మరియు తరచుగా మతపరమైన అధ్యాత్మిక భావనములు తమను పట్టుకుని పీడిస్తున్నట్లు అనిపిస్తుందని మెదడు ముందుభాగం హఠాత్తుగా పట్టుకుపోయినట్లై బాధతో తల్లడిల్లుతున్న మూర్ఛరోగులు తెలుపుతున్నారు ,
హఠాత్తుగా మెదడు పట్టుకుపోయినట్లవటానికి (మూర్ఛపోవటానికి) కారణం, మెదడు లోని దైవస్థానంలో ఉన్న నరాలు అతిగా ఉద్రేకపడటమే అనే వివరణ మాత్రమే వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని కాలిఫోర్నియా విశ్వవిధ్యాలయము, శాన్ డీగో లోని నాడీశాస్త్రజ్ఞుల (న్యూరోసైంటిస్ట్ ల) బృందం అభిప్రాయబడినది. పోయిన వారం జరిగిన సదస్సులో శాస్త్రవేత్తలు ఇలా ప్రకటించారు. "నాడీమండలములోని కొన్ని కణతలు మతానికే అంకితమై ఉండవచ్చును. ఇది సమాజంలో శాంతి మరియు సుస్థిరం నెలకొల్పమని ఆజ్ఞాపిస్తుండవచ్చును"
ఒక మానవుడు ఏదైనా మతాన్ని విశ్వసిస్తున్నాడా?అంటే దేవుడిని నమ్మతున్నాడా? అనేది నాడీమండలంలోని ఆ విద్యుత్ ప్రవాహక ప్రదేశం యొక్క విస్తీరణంపై ఆధారపడి ఉన్నదని ఫలితములు సూచిస్తున్నాయి. మామూలు ప్రజలలోని మూర్ఛరోగులను మరియు సాంప్రదాయమైన మతాభిమానాలు గల మూర్ఛరోగులను పోల్చుతూ అధ్యయనము సాగినదని పరిశోధకుల బృందపు ముఖ్య శాస్త్రవేత్త అయిన డాక్టర్ విలయనూర్ రామచంద్రన్ తెలియజేసెను.
వారి చర్మముపై అమర్చిన విద్యుత్ ప్రవాహాన్ని పర్యవేక్షించే యంత్రాలు - ఇదే మెదడులోని నాడీమండలపు కణతల చైతన్యమును పరీక్షించడానికి ఉపయోగించే ప్రామాణిక పద్ధతి. దీని ద్వారా పై రెండు తరగతులకు చెందిన మూర్ఛరోగులు ఆధ్యాత్మిక (మతమునకు సంబంధించిన) ఆరాధనా పదములకు ఒకే విధంగా స్పందిస్తున్నట్లుగా కనిపెట్టడం జరిగినది. 
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మానవజాతి చరిత్రలో కనిపెట్టబడిన ఈ అసాధారణ లక్షణము, డార్వీనియన్ అవలంబన వలే మానవుల మధ్య సహాయసహకారములు పెంపొందించటానికి మెదడులోని అత్యంత క్లిష్టమైన విద్యుత్ ప్రవాహక వ్యవస్థలో నిర్మించబడినదని డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని (మానవుడు కోతి నుండి పుట్టాడని) విశ్వసించే శాస్త్రజ్ఞులు అభిప్రాయబడుతున్నారు.
ఒకవేళ ఈ పరిశోధన అసత్యమైన దైనట్లైతే మరియు మెదడులో దేవుడు స్థానం పదిలంగా లేకపోయినట్లైతే, నాస్తికులు ఈ విద్యుత్ ప్రవాహక వ్యవస్థను వేరే విధంగా నిర్వచించటానికి ప్రయత్నించేవారు.
"మెదడులో దేవుడు స్థానం ఉన్నదా లేదా అనేది శాస్త్రజ్ఞులకు ఎదురయ్యే ప్రశ్న, కాని మతధర్మజ్ఞులకు కాదు. దేవుడు మనలో దైవవిశ్వాసానికి సంబంధించిన ఒక శరీరభాగాన్ని కూడా సృష్టించి ఉంచాడేమో అనేది ఆశ్చర్యకరం కాకపోవచ్చును" అని 1997 నవంబరు 2తేదీదిసండేటైమ్స్లోఆక్స్ ఫర్డ్ బిషప్ రిచర్డ్ హారిస్ యొక్క ప్రతినిధి ప్రకటించారు.
 
పెరుగుతున్న సాక్ష్యాల ఆధారంగా మతపరమైన దైవవిశ్వాసగుణం మెదడులో నిక్షిప్తమైవుందనే అభిప్రాయము బలపడుతున్నది. అయినప్పటికీ కొందరిలో 'వాస్తవంగామతమనేది కేవలం మానవుడి సృష్టి మాత్రమే' అనే తప్పుడు ఆలోచనలను మానవ సమాజంలో వ్యాపించి ఉన్న రకరకాల దైవవిశ్వాసములు కలిగజేస్తున్నాయి. కొందరు దైవవిశ్వాసులలో కూడా ఇలాంటి ఆలోచనలే చోటుచేసుకున్నాయి.ఇటువంటి గందరగోళ పరిస్థితులలో వివిధ మతములపై జరిగిన అనేక పరిశోధనల ద్వారా వాటిని కలిపే ఒక మూల ధార్మిక సిద్ధాంతము కనిపెట్ట బడినది. రకరకాల దేవుళ్ళందరిలోను కేవలం ఒకే ఒక్కడు సర్వశ్రేష్ఠుడని విశ్వసించేదే ఆ మూల సిద్ధాంతం. ఇంకా ఏకేశ్వరోపాసనకు పునాదివంటీ విశ్వాసమును   నిష్ఠాపరులైన బహుదైవారాధకులు (అద్వైత పండితులు) సైతం దృఢంగా నమ్ముతారని ఋజువు అయినది. eg.,- వివిధ మతాల అధ్యయనంలో  హిందూమత దైవసిద్ధాంతం విభిన్నమైనదనే విషయం తెలుస్తుంది. మొట్టమొదట ప్రజలు ఏక దైవారాధకులుగా ఉండేవారని క్రమేణా వారిలో బహుదైవారాధన చోటు చేసుకుందని హిందూమతం స్పష్టంగా ప్రకటిస్తున్నది. హిందూమతంలో అనేకదేవుళ్ళను మరియు విగ్రహములను పూజిస్తున్నప్పటికీ బ్రహ్మదేవుడిని మాత్రమే అందరి కంటే సర్వశ్రేష్ఠుడిగా విశ్వసిస్తారు.
 
సంప్రదాయపరంగా విభిన్న దశలలో బహుదైవారాధన నుండి ఏకదైవారాధనగా మతం మారిపోయిందని మానవ జాతులను, వారి సంస్కృతులను పరిశోధించే శాస్త్రజ్ఞులలో అనేకులు నిశ్చయించినారు. వారి అభిప్రాయం ప్రకారం ఆదిమానవుడి నుండి రకరకాల ప్రాకృతిక శక్తులను విభిన్నమైన దైవాలుగా పూజించటం మొదలైనది, క్రమంగా అటువంటి లెక్కించలేనన్ని మానవాతీత శక్తులన్నింటినీ రెండు దైవాలుగా (ద్వైత్వం) సమీకరించటం, అంటే మంచీ చెడూ అనే రెండు విభిన్న తత్వాల దైవాలుగా సమీకరించటం జరిగినది. కాలక్రమములో చివరికి దేవుడు ఒక్కడే అనే విశ్వాసంగా రూపాంతరము చెందినట్లు ఆభిప్రాయపడుతున్నారు.
 
కాబట్టి మతానికి దివ్యమైన ఆరంభమేదీ లేదని మరియు కేవలం పూర్వికుల సాంకేతిక అజ్ఞానం వలన అప్పటి మానవాతీతశక్తులే కాలక్రమంలో మతాలుగా రూపాంతరం చెందినవని   మానవజాతులను, వారి సంస్కృతులను పరిశోధించే సామాజిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందువలన వైజ్ఞానిక పరిశోధనలు ప్రకృతిక రహస్యాలన్నింటినీ వెలికితీస్తాయని, వాటిని అర్థంచేసుకోవడానికి మతసిద్ధాంతాలపై ఆధారపడనవసరం లేదని మరియు అంతిమంగా మతాలన్నీ నామరూపాల్లేకుండా సమసి పోతాయని ఆ శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు.
 
కాని దీనికి పూర్తిగా వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని సర్వలోకసృష్టికర్త పై మానవుడి అచంచల స్వాభావిక విశ్వాసము బలపరుస్తున్నది. ఆ సిద్ధాంతము ప్రకారం మానవుడు ఏకదైవారాధకుడిగా ప్రపంచ జీవితం మొదలు పెట్టి, క్రమేణా దారితప్పిపోయి, చివరికి అనేక రకాలైన బహుదైవారాధనలలో మునిగిపోయి ఉన్నాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రాచీనజాతులలో కనుగొనబడిన ఏకైక సర్వలోక శక్తిమంతుడిని మాత్రమే విశ్వాసించడమనే వాస్తవము మరింత బలపరుస్తున్నది. కాలక్రమంలో వారు అనేక దేవుళ్ళను, మానవాతీత శక్తులను నమ్మటం మొదలు పెట్టినారు. అయినప్పటికీ వివిధ ఆరాధ్యదైవాలలో అందరికంటే సర్వశ్రేష్ఠుడిగా వాటిలోని ముఖ్యదేవుడిని విశ్వసిస్తారని కనుగొనబడినది. అలాగే అనేక బహుదైవారాధ మతాలలో వారు పూజించే రకరకాల దైవములలో ఒకే ఒక దేవుడిని ప్రధానమైన దేవుడిగా పూజించటం కనబడుతుంది. దీనిని బట్టి ప్రజలు దారితప్పిపోక ముందు ఏకదైవారాధన మాత్రమే చేసేవారని ఋజువవుతున్నది. కాలక్రమంలో కొందరు దేవుడి ప్రత్యేక సుగుణాలను సృష్టిలోని ఇతరులకు కట్టబెట్టి, వాటిని చిన్న చిన్న దేవుళ్ళుగా నిలబెట్టారు, మరికొందరు వాటిని కష్టకాలంలో ప్రధాన దేవుడికి సిఫార్సుచేసే మధ్యవర్తులని నమ్మింపజేస్తున్నారు. అయినప్పటికీ సర్వశ్రేష్ఠుడైన ఆ ఏకైక దేవుడే ఈనాటికి కూడా ఏదో ఒక రూపంలో అనేక మతములలో మూలదైవముగా ఆరాధింపబడుతున్నాడు.
 
 
ఫీడ్ బ్యాక్