• MP3

    ఇస్లాం ధర్మ సహాబాల వృత్తాంతాల కార్యక్రమం (ఖిస్సత్ ఇస్లామ్ సహాబీ) - సౌదీ అరేబియాలోని అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ రేడియో సీరియల్ గా ప్రసారం చేయబడిన సహాబాల (రదియల్లాహు అన్హుమ్) వృత్తాంతాలన్నింటినీ ఒకచోట చేర్చి, ఈ ప్రోగ్రాం తయారు చేసినారు. దీనిని డాక్టర్ హసన్ హబషీ (అల్లాహ్ ఆయనపై అనుగ్రహం చూపుగాక) తయారు చేసినారు.

  • MP3

    ఇస్లామీయ షరిఅతు అమలు చేయడం ద్వారానే శాంతి భద్రతలు స్థాపించబడతాయి. ఇస్లామీయ షరిఅతు సృష్టిపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో వారు అల్లాహ్ యొక్క ధర్మంపై ఉన్నట్లే. అలాంటి అల్లాహ్ యొక్క దాసులు శాంతి భద్రతలలో, సుఖశాంతులలో ఉంటారు. మరి ఎవరైతే తమ ఇష్టానుసారం జీవిస్తారో, తమ సంపద మరియు తమ కోరికల ఆధారంగా జీవిస్తారో, వారు ఒక్కసారి తమ జీవితం గురించి ఆలోచించుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి.

  • MP3

    శాంతిభద్రతలపై తౌహీద్ ప్రభావం - రియాద్ లోని ఒక పెద్ద మస్జిదులో చేసిన ప్రసంగంలో షేఖ్ ఇహపరలోకాలలో శాంతిభద్రతల గురించి తెలుపుతూ, తౌహీద్ లేకుండా శాంతిభద్రతల స్థాపన జరగదని తెలిపినారు. శాంతిభద్రతల స్థాపనకు ముఖ్యమైన పరికరం ఏకదైవత్వమనే తౌహీద్ సిద్ధాంతమనీ, అదే శాంతిభద్రతలను స్థాపించే మార్గం చూపుతుందని స్పష్టం చేసారు.

  • MP3

    ఇస్లాం యొక్క అనుగ్రహాలు - షేక్ సయీద్ బిన్ వహాఫ్ అల్ గహతానీ చేసిన ఈ ప్రసంగం రియాద్ లోని పెద్ద జామియా మస్జిదులో రికార్డు చేయబడింది. మానవజాతిపై సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయని ఆయన తెలిపినారు. దీనికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఆయన తెెలిపినారు.

  • MP3

    రియాద్ లోని ప్రధాన జామియా మస్జిదులో అల్ షేఖ్ ఇచ్చిన ప్రసంగం. దీనిలో ఆయన ఇస్లాం ధర్మంలోని కొన్ని శుభాల గురించి వివరించారు మరియు ఇస్లాం ధర్మంలోని అద్భుతాలను పరిచయం చేసారు. తర్వాత ఆయన ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చారు.

  • MP3

    ఇస్లామీయ ప్రాథమిక నియమాలు - కువైత్ లో జరిగిన కార్యక్రమం 2-1-1432 హి

  • MP3

    ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మరియు సలఫ్ సాలెహీన్ల అవగాహనలో పవిత్ర ఉమ్రహ్ యాత్రలోని మహిమలు, ఔన్నత్యం, దానిలోని కొన్ని సందేహాలకు సమాధానాలు.

  • MP3

    ఒక ముస్లింపై తోటి ముస్లిం యొక్క హక్కులు - ఈ ప్రసంంగంలో ఇస్లామీయ షరిఅతులో ఒక ముస్లింపై తోటి ముస్లిం యొక్క హక్కుల గురించి అల్ షేక్ చక్కగా వివరించారు. సౌభ్రాతృత్వాన్ని స్థాపించుటంలో ఆ హక్కుల ప్రాధాన్యత మరియు వాటి సంరక్షణ గురించి, దాని ద్వారా ముస్లిం సమాజం ఎలా బలపడుతుందనే విషయం గురించి వివరించారు.

  • MP3

    ఒక ముస్లింపై తోటి ముస్లిం యొక్క హక్కులు - ఒక ముస్లింపై తోటి ముస్లిం సోదరుడి హక్కుల గురించి అల్ షేఖ్ ఇక్కడ చక్కగా వివరించారు. ఈ హక్కుల ప్రాధాన్యత గురించి మరియు వాటిని సంరక్షించే బాధ్యతను ముస్లింలు ఎంత ముఖ్యమైన విషయంగా పరిగణించాలో బోధిస్తు చేసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాలు.

  • MP3

    సామాజిక హక్కులు: ఇప్పటికే పాశ్చాత్య దేశాలలోని ఇస్లామీయ సమాజ నివేదికల ద్వారా ఇస్లాం ధర్మంలోని సామాజిక హక్కులు మరియు వాటి గౌరవనీయ స్థానం గురించి అందరికీ అర్థం అవుతున్నది. వాటికి తగిన స్థానం ఇవ్వకపోతే సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది మరియు తీవ్రపరిణామాలు ఎదురవుతాయి.

ఫీడ్ బ్యాక్