• MP3

  డాక్టర్ అబ్దుల్ అజీజ్ అబ్దుర్రహీమ్ రచించిన తల్బియా యొక్క ఆరు భాగాలు అనే రచన యొక్క ఆడియో రికార్డింగు. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు ఇహ్రాం స్థితిలోనికి ప్రవేశించగానే, తల్బియా పలకటం ప్రారంభిస్తాము. మనం దీనిని కొన్ని వందల సార్లు పలుకుతాము. కాబట్టి దీని యొక్క అద్భుతమైన అర్థం, భావం తెలుసుకోవటం మనకు ఎంతో ముఖ్యం.

 • MP3

  ప్రవక్తలందరి ముఖ్య వృత్తి అయిన ధర్మప్రచారం చాలా ముఖ్యమైన పని. ఎవరైతే ధర్మప్రచారంలో అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారో, వారు ముందుగా కొన్ని అర్హతలు సంపాదించాలి మరియు కొన్ని ప్రాథమిక నైతిక గుణాలు అలవర్చుకోవాలి. కొందరు పండితుల రచనల నుండి సంకలనం చేయబడిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్.

 • MP3

  అబ్దుల్ ఖాలిఖ్ అష్షరీప్ తయారు చేసిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచారం మరియు ధర్మప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి తాయిఫ్ ప్రయాణం వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల గురించి వివరించబడింది.

 • MP3

  డాక్టర్ జమాల్ బదవీ వ్రాసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచార పద్దతి అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్. ఈ అత్యంత బాధ్యతాయుతమైన పనిలో ఆయన కొన్ని ప్రత్యేకమైన అంశాలను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిని ప్రస్తావించారు మరియు

 • MP3

  దావహ్ స్కిల్స్ అనే ఈ వీడియో రికార్డింగ్ ను జైనబ్ అషర్రీ తయారు చేసారు. ధర్మప్రచారాన్ని క్రమక్రమంగా కొనసాగిస్తూ, ఎదుటి వ్యక్తి దానిని స్వీకరించేలా చేసే పద్ధతి. ధర్మప్రచారకుడు తన సామర్ధ్యాన్ని మరియు ఎదుటి వాని స్పందన - ప్రతిస్పందనను గమనిస్తూ ధర్మప్రచారం చేసే పద్ధతి ఇక్కడ వివరించబడింది.

 • MP3

  దీనిలో రచయిత ఇలా పేర్కొన్నారు, "నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే నేను వారి అఖీదహ్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివాను. అలా చదవటానకి కూర్చున్న ప్రతిసారి నాలో రేగిన ఆధ్యాత్మిక భిన్నాభిప్రాయాలు, తుఫానులు నాకింకా గుర్తున్నాయి. నేను తిరగేసిన ప్రతిపేజీలో నాకు నా విశ్వాసాన్ని పరీక్షించే కొన్ని దైవదూషణలు, దైవనిందలు కనబడేవి. అయితే వాటి ప్రభావానికి లోను కాకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలు, అల్లాహ్ యొక్క గౌరవస్థానం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపైనే దృష్టి పెట్టాను."

 • MP3

  ఇస్లాం మీ జన్మ హక్కు. అవును. మీరు సరిగ్గానే చదివారు. ఇస్లాం మీ జన్మహక్కు. ప్రతి మానవుడు ఇస్లాం ధర్మంలోనే పుడతాడు. కాబట్టి మానవులందరూ సహజంగా తమకు తెలిసిన దాని వైపుకు ఆకర్షించబడతారు. ఇస్లాం ధర్మం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క చిట్టచివరి స్వచ్ఛమైన ధర్మం అని నిరూపించే కొన్ని హేతువాద మరియు వివేకవంత కారణాలు. కాబ్టటి ప్రతి ఒక్కరూ ఇస్లాం ధర్మాన్నే అనుసరించాలి.

 • MP3

  ఎలా కొంత మంది మహిళలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.

 • MP3

  ఇస్లాం ధర్మంపై ముస్లిమేతరులు అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి జవాబులు.

 • MP3

  సయీద్ ఆర్. అలీ పఠించిన ఈ దావహ్ ప్రజెంటేషన్ లో ధర్మ ప్రచారంలో పాల్గొనటానికి మీరేమీ పండితులు కావలసిన అవసరం లేదని తెలుపుతున్నారు. ఒకవేళ మనం ధర్మప్రచారం చేయకపోతే, ముస్లిమేతరులు ఇస్లాం ధర్మం గురించి ఎలా తెలుసుకోగలరు అని ప్రశ్నిస్తున్నారు. మీ శక్తిసామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయవద్దు. అసలు చేయకపోవటం కంటే కొంచెమైనా చేయడం మంచిది.

 • MP3

  మై పాథ్ టు ఇస్లాం అనే ఈ వృత్తాంతంలో ఎలా హుడా డాడ్జ్ Huda Dodge ఇస్లాం స్వీకరించారో తెలిపినారు. దీని చదవటం ద్వారా మీలో ధర్మప్రచారంలో పాల్గొనాలనే ఆలోచన రేకిత్తించవచ్చు లేదా మీ దైవవిశ్వాసం పెరగవచ్చు. ఏదేమైనా దీనిని తప్పక చదవండి. ఇది కేవలం ఇస్లాం స్వీకరించిన ఒక మహిళ యొక్క వృత్తాంతం కానీ ఇంకా అనేక మంది ఇస్లాం ధర్మంలో ప్రవేశించక, తమ అజ్ఞానంలోనే జీవిస్తున్నారు.

 • MP3

  "The way to Happiness" అంటే సంతోషం వైపు తీసుకు పోయే మార్గం అనే ఈ పుస్తకంలో అసలు సంతోషం అంటే ఏమిటి, దానిని పొందే మార్గం ఏమిటి అనే అంశాలపై చర్చ జరిగింది.

 • MP3

  ఇంగ్లీషు అనువాదంతో సహా ఖుర్ఆన్ చివరి పదవ భాగం వివరణ పఠనం - షేఖ్ సాద్ అల్ గామ్దీ కంఠస్వరంలో

 • కోపానికి మందు ఇంగ్లీష్

  MP3

  కోపమనేది ఆరోగ్యవంతమైన ఒక మామూలు భావోద్రేకం. కానీ హద్దుమీరితే అది చాలా తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. కోపమనేది షైతాను యొక్క మరో రూపం, నిషేధించబడింది, ఉత్తమ లక్షణాలను నాశనం చేసే ఒక గుప్తమైన షైతాను ఆయుధం.

 • MP3

  దావహ్ లో జరిగే చర్చలు సఫలం కావడానికి పనికి వచ్చే కిటుకులను డాక్టర్ ఫజలుర్రహ్మాన్ ఈ దావహ్ ట్రయినింగు ప్రోగ్రామ్ లో ఇచ్చినారు. దావహ్ గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలతో ప్రారంభించి, వివిధ దావహ్ పద్ధతులు వివరణతో ముగించినారు.

 • MP3

  మీ మెదడును మెలితిప్పే లేదా మీ ధర్మాన్ని మార్చే ఉద్దేశ్యం నాకు లేదు. నా ఉద్దేశ్యం మరియు లక్ష్యం ఏమిటంటే మీ జ్ఞాన పరిధి పెంచుకోవడం కోసం ఇస్లాం గురించి మీరు తెలుసుకోవాలి, ఇస్లాం స్వీకరించాలా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

 • MP3

  మానవజాతి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నిర్దేశించిన ఉత్తమ చట్టం షరిఅహ్ చట్టం. దానిని అనుసరించమని ఆయన ఆదేశించినాడు. షరిఅహ్ చట్టం యొక్క ప్రధాన మూలం ఖుర్ఆన్ గ్రంథం. దీనిలో ప్రాథమిక నియమాలు ప్రస్తావించబడినాయి మరియు సున్నతులనబడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనవిధానం మరియు బోధనలు వాటి ఆచరణాత్మక వివరాలను అందజేస్తున్నాయి. ఉదాహరణకు, ఖుర్ఆన్ లో 'నమాజు స్థాపించండి, ఉపవాసాలు పాటించండి, జకాతు చెల్లించండి, సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు మార్గాలలో సంపాదించవద్దు మరియు ఖర్చు పెట్టవద్దు' మొదలైన ధర్మాజ్ఞలు పేర్కొనబడినాయి. అయితే, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో వివరించబడలేదు. వాటి ఆచరణ పద్దతి మనకు సున్నతులలో లభిస్తుంది.

 • జీవిత లక్ష్యం ఇంగ్లీష్

  MP3

  ఉపన్యాసకులు : ఖాలిద్ యాసీన్

  1994లో సౌదీ అరేబియాలో షేఖ్ ఖాలిద్ యాసీన్ ఈ ప్రసంగం చేయగా, అక్కడి శ్రోతలలో నుండి 43 మంది ప్రజలు వెంటనే ఇస్లాం ధర్మం స్వీకరించారు.

 • MP3

  ఉపన్యాసకులు : బిలాల్ ఫిలిఫ్స్

 • MP3

  ఉపన్యాసకులు : అబ్దుర్రహీం గరైన్

ఫీడ్ బ్యాక్