పుస్తకాలు

అంశాల సంఖ్య: 168

 • PDF

  సత్యమార్గం తెలుసుకున్న ప్రతి నవముస్లిం కొరకు ఇదొక మంచి బహుమతి. ఇది వారి దైవవిశ్వాసాన్ని మరింతగా పటిష్టం చేయడానికి మరియు భద్రపరుచుకోవడానికి పనికి వస్తుంది. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు వెళ్తున్నారా? మార్గదర్శకత్వం కోసం ఒక సింపుల్ మరియు స్పష్టమైన గైడు మీకు కావాలా ? సులభంగా మీరు హజ్ మరియు ఉమ్రహ్ చేయగలగాలనేదే ఈ పుస్తకం యొక్క ధ్యేయం మరియు ఉద్దేశ్యం. ఈ పుస్తకం చాలా సులభమైన పదాలతో వ్రాయబడింది, హజ్ మరియు ఉమ్రహ్ లో చేయవలసిన ఆచారాన్నీ సింపుల్ చిత్రపటాలతో చాలా స్పష్టంగా పేర్కొనబడినాయి. ఎలాంటి క్లిష్టమైన రిఫరెన్సులు, అభిప్రాయభేదాలు లేకుండా స్పష్టమైన వివరణలతో ఈ పుస్తకం తయారు చేయబడింది. ఇది ఒక సింపుల్ గైడ్!

 • మోడరేట్ ధర్మం ఇంగ్లీష్

  PDF

  'వసతియ్యహ్ అహ్లె సున్నహ్ బైనల్ ఫిరాఖ్' (వివిధ వర్గాల మధ్య అహ్లె సున్నతుల్ జమఆత్ యొక్క మితతత్వం) అనే పేరుతో ప్రచరించబడిన పి.హెచ్.డి థీసిస్ లోని మూడవ భాగం నుండి ఇది సంకలనం చేయబడింది. దీనిని సౌదీ అరేబియాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ముహమ్మద్ బకరీమ్ ముహమ్మద్ బఅబ్దుల్లాహ్ తయారు చేసినారు. నేను ఈ థీసిస్ యొక్క మూడవ భాగంలో నుండి 'Moderation of the Muslims between extremism and negligence' (తీవ్రవాదం మరియు నిర్లక్ష్యాల మధ్య ముస్లింల మధ్యేమార్గం) అనే భాగాన్ని ఇంగ్లీషులోనికి అనువదించాను.

 • PDF

  ఎలా నిజమైన దైవవిశ్వాసం కలిగిన మహిళలు అత్యుత్తమ మహిళలుగా గుర్తింపు పొందారనే అద్భుత విషయాన్ని ఈ పుస్తకం స్పష్టం చేస్తున్నది. మనం దీని ద్వారా ఒక ముస్లింగా జీవించడంలోని శుభాలు మరియు అనుగ్రహాలను ముఖ్యంగా ఒక ముస్లిం మహిళ విషయంలో బాగా అర్థం చేసుకోగలం. ఇస్లాం ధర్మాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునే వైపు ఇది దారి చూపగలదు. ఇస్లాం ధర్మంలోని నియమనిబంధనలన్నీ వాస్తవానికి మానవ సమాజ కళ్యాణానికే అనే విషయం అర్థం చేసుకోవడంలో కలిగే అపోహలు, అపార్థాలను దూరం చేయగలదు. ఈ ఇస్లామీయ ధర్మాజ్ఞలు మానవులను హానికరమైన అనేక చెడుల నుండి కాపాడి, సురక్షితంగా జీవించేలా సహాయపడతాయి.

 • PDF

  ఇది الإتباع وفقه السلف فيه అనే అరబీ పుస్తకం యొక్క ఇంగ్లీషు అనువాదం. దీని రచయిత గొప్ప ఇస్లామీయ పండితుడు షేక్ వసియుల్లాహ్ ఇబ్నె ముహమ్మద్ అబ్బాస్ (అల్లాహ్ ఆయనను రక్షించుగాక మరియు ఇహపరలోకాలలో ఆయన స్థాయి ఉన్నత పరుచుగాక).

 • కపటుల లక్షణాలు ఇంగ్లీష్

  PDF

  అష్షంఖితి అనుబంధం (appendix) నుండి షేఖుల్ ఇస్లాం ఇబ్నె అల్ ఖయ్యిమ్ అల్ జౌజియ్యహ్ దీనిని తయారు చేసారు. అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో కపటుల కుతంత్రాలను స్పష్టంగా తెలిపినాడు. విశ్వాసులు కపటుల బారి పడకుండా తమను తాము కాపాడుకోవడానికి వారి కపట విశ్వాసాలు, వారి లక్షణాలు, వారి లక్ష్యాలను సవివరంగా పేర్కొన్నాడు. అల్లాహ్ సూరహ్ అల్ బఖరహ్ లో మానవజాతిని మూడు భాగాలలో విభజించినాడు: విశ్వాసులు, అవిశ్వాసులు మరియు కపటులు. విశ్వాసుల గురించి నాలుగు వచనాలలో, అవిశ్వాసుల గురించి రెండు వచనాలలో మరియు కపటుల గురించి పదమూడు వచనాలలో వివరించినాడు. దీని ద్వారా కపటులు ఇస్లాం ధర్మానికి ఎంత తీవ్రమైన హాని కలుగుజేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారో అర్థం అవుతున్నది. వారి ద్వారా జరిగే హాని చాలా తీవ్రమైంది ఎందుకంటే వారు ముస్లింల వలే ప్రవర్తిస్తూ, ఇస్లాం ధర్మానికి సహాయపడుతున్నట్లుగా మరియు సమర్ధిస్తున్నట్లుగా నటిస్తారు. వాస్తవానికి వారు ఇస్లాం ధర్మానికి బద్ధ శత్రువులు మరియు దానిని సర్వనాశనం చేసే అవకాశం కోసం కాచుకుని కూర్చుని ఉంటారు. లోలోపల ఇస్లామీయ సమాజంలో అరాచకత్వాన్ని మరియు అజ్ఞానాన్ని వ్యాపింపజేస్తూ ఉంటారు. వారు పాటిస్తున్నదే సరైన ఇస్లాం ధర్మమని అమాయకులను మోసగిస్తూ, దారి తప్పించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

 • PDF

  అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలు చూపిన కొన్ని మహిమలు. చంద్రబింబం రెండుగా చీలిపోవడం, మక్కా నుండి జెరుసలెంకు మరియు అక్కడి నుండి స్వర్గాలకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుత ప్రయాణం. ఇంకా ఆయన చూపిన అనేక మహిమలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.

 • PDF

  ఇది ఇస్లామీయ పండితులు ఇబ్నె తైమియ్యహ్ రచించిన సుప్రసిద్ధ కితాబుల్ ఈమాన్ అనే పుస్తకం యొక్క మొట్టమొదటి పూర్తి ఇంగ్లీషు అనువాదం. ఈమాన్ (దైవవిశ్వాసం) అనేది ఇస్లాం ధర్మం యొక్క ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలో మరియు మొత్తం మీద ధర్మం యొక్క అసలు ప్రాతిపదిక ఏమిటో అది నిర్వచిస్తున్నది.

 • PDF

  శాశ్వత సుఖసంతోషాలు సర్వలోక సృష్టికర్తను విశ్వసించడంలో మరియు ఆయన చూపిన మార్గంలో జీవించడంలోనే ఉంటాయనేది ఇక్కడ స్పష్టం చేయబడుతున్నది. అంతేగానీ, మానవ నిర్మిత ప్రాపంచిక అంశాలలో శాశ్వత సంతోషం లభించదనీ, అది కొంతకాలానికే ఆవిరై పోతుందనే కఠోర సత్యం ఇక్కడ తెలుపబడుతున్నది.

 • PDF

  సత్యం మరియు దయాగుణం - ఇవి రెండూ సమాజ మరియు వ్యక్తిగత సుఖసంతోషాలకు చిహ్నాలు. అలాంటి సుఖసంతోషాలకు చిత్తశుద్ధి మరియు దయాగుణం అనేవి తాళం చెవులు. అయితే, అసత్యం పలకడం మరియు అసూయాద్వేషాలు పెంచుకోవడంతో దుఃఖం మరియు దౌర్భాగ్యం జత కట్టి ఉన్నాయి. ఇస్లాం ధర్మం మొదలైన తర్వాత సత్యం పలకని మరియు దయాగుణం చూపని ఏ వ్యక్తి పైనా అల్లాహ్ అనుగ్రహం చూపలేదు. అలాగే అసత్యం పలికే మరియు అసూయాద్వేషాలతో రగిలే వానితో ఎలాంటి పని తీసుకోలేదు. ఈ ప్రచురణలో అన్ని రకాల అసత్యాలు మరియు అసూయాద్వేషాలు చర్చించబడినాయి. అలాగే మన నిత్యజీవితంలో వాటికి సంబంధించిన ఇస్లామీయ ధర్మాజ్ఞలు కూడా స్పష్టంగా తెలుపబడినాయి.

 • PDF

  ఇస్లాం గురించి 40 ముఖ్య ప్రశ్నలు

 • PDF

  పిల్లల కోసం దుఆలు అనే పుస్తకంలో పిల్లల కోసం ప్రత్యేకమైన దుఆలు ఉన్నాయి.

 • PDF

  ముస్లింలలో ఈమాన్ (దైవ విశ్వాసం) బలహీనపడటమనే విషయం సర్వసాధారణమై పోయింది. అనేక మంది ప్రజలు తమ మనస్సు బండరాయిలా మారిపోయిందని చెబుతుండడం వింటుంటాము - నా మనస్సంతా కఠినత్వంతో నిండిపోయినట్లు అనిపిస్తున్నది, ఆరాధనలలో సంతృప్తి కలగడం లేదు, నాలోని ఈమాన్ అడుగంటిపోయినట్టు అనిపిస్తున్నది, ఖుర్ఆన్ పఠనం నాలో చలనం తీసుకురావటం లేదు, చాలా తేలిగ్గా నేను పాపాలలో పడిపోతున్నాను. అనేక మంది ప్రజలలో మనకు ఇలాంటి ఆందోళన కనబడుతుంది. ఈ సమస్య ప్రతి వినాశానికి మరియు అనర్థానికి కారణం.

 • PDF

  ఈ పుస్తక ఆరంభంలో దీని రచయిత ఇలా పలికారు, "అమెరికాలోని ముస్లింలు ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ఇస్లాం గురించి లోతైన అవగాహన అవసరం. వారిలో అసాధారణమైన సామర్ధ్యం ఉంది. వారిలో తెలివితేటలు, శ్రమించడం మరియు ఇచ్చిన మాటపై నిలబడటం మొదలైన ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. అయితే అవి కనుగొనబడని బంగారు మరియు వెండి గనుల మాదిరిగా బహిర్గతం కాలేదు."

 • ఇదియే ఇస్లాం ఇంగ్లీష్

  PDF

  ఇది డాక్టర్ సాలెహి ఇబ్నె అబ్దుల్ అజీజ్ ఆలె షేఖ్ ఇచ్చిన ఒక ఉపన్యాసం. దైవవిశ్వాసం, ఆరాధన, చట్టం, పరిపాలనా వ్యవస్థ, నీతి, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాలు మరియు ఇతర విషయాలలో ఇస్లామీయ పద్ధతిని ఆయన వివరించారు.

 • PDF

  తఖ్లీద్ అనే పదం ఖలాదహ్ అనే మూలపదం నుండి వ్యుత్పన్నమైంది. భాషాపరంగా ఖలాదహ్ అంటే కుక్క మెడ చుట్టూ వేసే పట్టీ వంటి పట్టీని ధరించడం. తఖ్లీద్ అనే పదానికి ఇస్లామీయ అర్థం ఏమిటంటే సాక్ష్యాధారాలు తెలుసుకోకుండా ఉమ్మతులోని ఏదో ఒక ఇమాము అభిప్రాయాన్ని అనుసరించడం. కాబట్టి తఖ్లీద్ పాటించే వ్యక్తిని ముఖల్లిద్ అంటారు.

 • హదీథుల సంకలనం ఇంగ్లీష్

  PDF

  ఈ చిరుపుస్తకంలో హదీథుల సంకలనం ఎలా జరిగిందనే విషయాన్ని షేఖ్ అబ్దుల్ గఫ్ఫార్ హస్సాన్ చక్కగా వివరించారు. హదీథులను భద్రపరచడం మరియు సంకలనం చేయడంలో తీసుకున్న వివిధ జాగ్రత్తలను ఆయన ఇక్కడ వివరించారు. ఉదాహరణకు - హదీథులు భద్రపరచిన పద్ధతి, హదీథులు సంకలనం చేయబడిన కాలం మరియు మొట్టమొదటి హదీథు గ్రంథం మొదలైనవి.

 • PDF

  ఈ పుస్తకంలో మేము తరావీహ్ నమాజులో 20 రకాతులు చదివే పద్ధతి చాలా బలహీనమైన హదీథులపై ఆధారపడి ఉందని, దానిని ధృవీకరించే ఒక్క సహీహ్ హదీథు లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అలా 20 రకాతులు తరావీహ్ నమాజు చేసినట్లుగానీ, సహాబాలలు అలా చేసినట్లుగానీ లేదా వారి తర్వాతి తరం వారు చేసినట్లుగానీ ఎలాంటి ఋజువులు లేవని అహ్లె సున్నహ్ వల్ జమఅహ్ పండితుల వచనాలు మరియు అవగాహనల ఆధారంగా నిరూపించాము. ఆ పండితులలో సలఫ్ సాలెహీన్ (ముందుతరం ముస్లిం) ల ఇమాములు, పూర్వ మరియు వర్తమాన హదీథు పండితులు, 1424హి సంవత్సరం వరకు జీవించిన ధర్మవేత్తలు ఉన్నారు.

 • PDF

  ఈ విశ్వంలో సృష్టించబడిన మరియు ఉనికిలో ఉన్న ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశ్యం మరియు వివేకం ఉన్నది. అన్నింటి కంటే మానవజాతి అత్యుత్తమ సృష్టి ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మానవులకు మంచి చెడులు గుర్తించే వివేకాన్ని ప్రసాదించాడు. సృష్టిలోని ప్రతి దానిని వారికోసం సృష్టించాడు. అధిక శాతం సృష్టితాల కంటే ఎక్కువగా వారికి బలాన్ని మరియు జ్ఞానాన్ని ఇచ్చాడు. తప్పకుండా వారి ఉనికి వెనుక ఒక ప్రబలమైన ఉద్ధేశ్యం ఉన్నది. అది ఈ పుస్తకంలో చర్చించబడింది.

 • PDF

  ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఎవరైనా గమనిస్తే, ముస్లిం ప్రపంచం వివేకం కోల్పోయి అశాంతి మరియు హింసలో మునిగి ఉండటం గుర్తించకుండా ఉండలేరు. పరిస్థితి ఇంతగా దిగజారటంలో ఎలా వలసవాదం మరియు పాశ్చాత్య దేశాల జోక్యం ప్రాథమిక పాత్ర వహించిందో ఈ వ్యాసం చర్చించింది.

 • PDF

  జ్ఞానం ప్రసాదించబడని క్రైస్తవుల జీవితాల గురించి ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ముస్లింలతో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాల ద్వారా ఇస్లాం గురించి మరియు మిషనరీ స్కూళ్ళ నుండి క్రైస్తవత్వం గురించి ఆయన జ్ఞానం సంపాదించారు. రచయిత క్రైస్తవ ధర్మంలో చాలా లోతుగా పోయి, ఒకప్పుడు ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలలో కామన్ ఉండిన అంశాలను వెలికి తీసారు.

ఫీడ్ బ్యాక్