పుస్తకాలు

అంశాల సంఖ్య: 903

 • PDF

  ఈ పుస్తకంలో మేము తరావీహ్ నమాజులో 20 రకాతులు చదివే పద్ధతి చాలా బలహీనమైన హదీథులపై ఆధారపడి ఉందని, దానిని ధృవీకరించే ఒక్క సహీహ్ హదీథు లేదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అలా 20 రకాతులు తరావీహ్ నమాజు చేసినట్లుగానీ, సహాబాలలు అలా చేసినట్లుగానీ లేదా వారి తర్వాతి తరం వారు చేసినట్లుగానీ ఎలాంటి ఋజువులు లేవని అహ్లె సున్నహ్ వల్ జమఅహ్ పండితుల వచనాలు మరియు అవగాహనల ఆధారంగా నిరూపించాము. ఆ పండితులలో సలఫ్ సాలెహీన్ (ముందుతరం ముస్లిం) ల ఇమాములు, పూర్వ మరియు వర్తమాన హదీథు పండితులు, 1424హి సంవత్సరం వరకు జీవించిన ధర్మవేత్తలు ఉన్నారు.

 • PDF

  ఈ విశ్వంలో సృష్టించబడిన మరియు ఉనికిలో ఉన్న ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశ్యం మరియు వివేకం ఉన్నది. అన్నింటి కంటే మానవజాతి అత్యుత్తమ సృష్టి ఎందుకంటే సర్వలోక సృష్టికర్త మానవులకు మంచి చెడులు గుర్తించే వివేకాన్ని ప్రసాదించాడు. సృష్టిలోని ప్రతి దానిని వారికోసం సృష్టించాడు. అధిక శాతం సృష్టితాల కంటే ఎక్కువగా వారికి బలాన్ని మరియు జ్ఞానాన్ని ఇచ్చాడు. తప్పకుండా వారి ఉనికి వెనుక ఒక ప్రబలమైన ఉద్ధేశ్యం ఉన్నది. అది ఈ పుస్తకంలో చర్చించబడింది.

 • PDF

  ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఎవరైనా గమనిస్తే, ముస్లిం ప్రపంచం వివేకం కోల్పోయి అశాంతి మరియు హింసలో మునిగి ఉండటం గుర్తించకుండా ఉండలేరు. పరిస్థితి ఇంతగా దిగజారటంలో ఎలా వలసవాదం మరియు పాశ్చాత్య దేశాల జోక్యం ప్రాథమిక పాత్ర వహించిందో ఈ వ్యాసం చర్చించింది.

 • PDF

  జ్ఞానం ప్రసాదించబడని క్రైస్తవుల జీవితాల గురించి ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ముస్లింలతో ఆయనకున్న ప్రత్యక్ష సంబంధాల ద్వారా ఇస్లాం గురించి మరియు మిషనరీ స్కూళ్ళ నుండి క్రైస్తవత్వం గురించి ఆయన జ్ఞానం సంపాదించారు. రచయిత క్రైస్తవ ధర్మంలో చాలా లోతుగా పోయి, ఒకప్పుడు ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాలలో కామన్ ఉండిన అంశాలను వెలికి తీసారు.

 • PDF

  చిరకాలంగా ఇస్లాం ధర్మ ప్రవక్తకు మరియు ఆయన ధర్మం సందేశానికి విరుద్ధంగా అనుమానాలు లేపుతూ, ఆయనపై దోషారోపణలు చేస్తున్న ఇస్లాం ధర్మ బద్ధశత్రువులు, వారి మిషనరీ సైన్యాలు మరియు ఓరియంటలిష్టులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రధాన లక్ష్యం అయ్యారు. ఆయన అంటే ఎవరో తెలియని ఆమాయకుల దృష్టిలో ఇస్లాం ధర్మ ప్రవక్త గురించి చెడు అభిప్రాయం కలుగుజేసి, వారిని ఇస్లాం గురించి అధ్యయనం చేయకుండా దూరంగా ఉంచటం, ఇస్లాం ధర్మప్రచార మార్గంలో ముళ్ళ కంపలు పరచటమే వారి ప్రధాన ఉద్దేశ్యం. తద్వారా అది మానవాళికి మార్గదర్శకత్వం వహించకుండా ఆపాలనేది వారి తీవ్ర ప్రయత్నం.

 • PDF

  అనేక కారణాల వలన నేటి కాలంలో ఇలాంటి పుస్తకం అవసరం చాలా ఉంది. మొదటి కారణం ఏమిటంటే, ఇస్లాం ధర్మ సందేశంలో మరియు ఇహపరలోకాలలో మానవాళి సంక్షేమ ప్రక్రియలో ఆత్మ శుద్ధీకరణకు కేంద్రీయ స్థానం ఇవ్వబడింది. నిస్సందేహంగా ఇదే మొత్తం ప్రవక్తలు మరియు సందేశహరులందరి ప్రధాన కార్యమై ఉండింది.

 • PDF

  ఇస్లాం ధర్మం ఒక విశ్వజనీన ధర్మం. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య చేయబడిన కంపెరిటివ్ అధ్యయనంలో ఇస్లాం ధర్మం యొక్క పరమతసహన గుణాన్ని పాఠకుడు గుర్తిస్తాడు.

 • PDF

  మిస్ గాడెడ్ అనే ఈ ప్రచురణను లారెన్స్ బి. బ్రౌన్ అనే ఒక వైద్యుడు రచించినాడు. ఇది సాక్ష్యాధారాలలో పటిష్టమైంది మరియు వ్రాతలో నిపుణతతో నిండి ఉంది. సుశిక్షిత ధర్మాల జటిల ప్రపంచంలో ముద్దలు ముద్దలుగా జమ అయిన ఉన్న ధార్మిక మిస్ డైరక్షన్ల చిక్కుముళ్ళ నుండి ఉమ్మడి దారాలను వేరుచేసినాడు. ఇది చిత్తశుద్ధితో కూడిన సత్యాన్వేషణ. ఈ విషయంపై జరిగే వివేకవంతమైన చర్చలలో కనబడుతున్న శూన్యాన్ని నింపేందుకు యూదధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాలలోని అవినీతి మరియు సామ్యాలను బయట పెడుతున్నది. క్రమబద్ధమైన ధర్మం గురించి ముఖ్యంగా బైబిల్ యొక్క ఖచ్చితమైన మరియు భాషాపరమైన అనువాదంపై సందేహపడుతూ అపనమ్మకంతో ఉన్న పాఠకుల అనేక ప్రశ్నలకు ఇది స్పష్టమైన జవాబు ఇస్తున్నది మరియు వారితో తన ప్రశ్నలకు జవాబు చెప్పమంటున్నది. పత్రాల, ఆచారాల మరియు నియమనిబంధనల గురించి సమగ్ర, చారిత్రక విశ్లేషణలను మీ ముందు ఉంచుతున్నది. దీని అసలు లక్ష్యం ఏమిటంటే యూద ధర్మం, క్రైస్తవధర్మం మరియు ఇస్లాం ధర్మాల దివ్యావతరణలలోని సత్యాసత్యాలను నిస్పక్షపాతంగా పరీక్షించడం మరియు వాటి యొక్క తార్కిక ముగింపుకు చేర్చే ఉల్లేఖనల పరంపర జాడ వెలికితీయడం. అసలు దేవుడంటే అర్థం ఏమిటి అనే దానిని ఆసక్తికరమైన మరియు ఖచ్చితమైన ఈ రచన పూర్తిగా సంబోధిస్తున్నది.

 • PDF

  చక్రవర్తి హెరాక్యులస్ (Heraclius), ఖొస్రోస్ 2 (Chosroes II), ముఖౌఖిస్ (Muqawqis), నెగస్ (Negus), సిిరియా గవర్నర్ మరియు బహ్రెయిన్ రాజులకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపిన ఇస్లామీయ ధర్మోపదేశ ఉత్తరాలు. హిజ్రీ 6వ సంవత్సరం చివరి భాగంలో, హుదైబియా ఘటన తర్వాత మదీనా వైపుకు తిరిగి వస్తున్నపుడు, అరేబియా ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న పరిపాలకులను ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానిస్తూ సందేశం పంపాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించుకున్నారు. తన దూతల స్థానాన్ని ధ్రువపర్చేందుకు, "ముహమ్మద్ - అల్లాహ్ యొక్క ప్రవక్త" అనే పదాలు చెక్కిన ఒక వెండి రాజముద్ర తయారు చేయబడింది.

 • ఖలీఫాల చరిత్ర ఇంగ్లీష్

  PDF

  ఇస్లామీయ సామ్రాజ్యంలోని మొదటి నలుగురు ఖలీపాల (రదియల్లాహు అన్హుమ్) గురించి ప్రామాణిక హదీథులతో ప్రస్తావించబడింది. పరిపాలనలో వారు చూపిన న్యాయవర్తన, నైతిక నిష్ఠ, చిత్తశుద్ధి, సరళత, నిష్కాపట్యం, సజ్జనత్వం మరియు వివేకం ప్రదర్శించబడింది. సున్నతులను అనుసరించడంలో వారు చూపిన చొరవ మరియు ఇచ్చిన ప్రాధాన్యత గురించి కూడా పేర్కొనబడింది.

 • PDF

  గాడెడ్ అంటే సర్వలోక సృష్టికర్త చూపిన సన్మార్గాన్ని జాగ్రత్తగా పరిశీలించారా ? ఇస్లాం ధర్మంలోని దైవవాణి సంపూర్ణత మత ధర్మవేత్తలలో ప్రసిద్ధులందరినీ ఛాలెంజ్ చేస్తున్నది. ధార్మిక పండితుడు మరియు వైద్యుడు అయిన లారెన్స్ బి. బ్రౌన్ (Laurence B. Brown) యూద క్రైస్తవ ధర్మాలలో రాబోయే ప్రవక్త ముహమ్మద్ మరియు మొత్తం మానవజాతి కొరకు పంపబడే అంతిమ దైవవాణి ఖుర్ఆన్ గురించి ముందుగానే చెప్పబడిన భవిష్యవాణిని బయటపెడుతూ మిస్ గాడెడ్ అంటే మత భ్రష్టుల గురించి ముగించినాడు. మిస్ గాడెడ్ మరియు గాడెడ్ పేరుతో తయారైన ఈ రెండు పరిశోధనా పత్రాలు మానవులు చేసిన మార్పులు చేర్పులకు గురైన దివ్యగ్రంథాలు మరియు స్వచ్ఛంగా మిగిలిన ఉన్న సృష్టికర్త యొక్క అంతిమ దివ్యగ్రంథములను జాగ్రత్తగా పరిశీలిస్తూ, వాటిలో ఏది సత్యమైనదనే విషయాన్ని తెలుపుతున్నాయి. అంతేగాక అంతిమ మరియు సంపూర్ణ దివ్యవాణి యొక్క ఆవశ్యకతను గురించి చర్చిండమే కాకుండా అది తప్పకుండా అవసరమని డిమాండ్ చేస్తున్నాయి. చివరికి, ఇప్పుడు మన వద్ద మూడు అబ్రహామిక్ ధర్మాలైన యూద ధర్మం, క్రైస్తవ ధర్మం మరియు ఇస్లాం ధర్మాల గురించి క్షుణ్ణంగా పరిశోధించబడిన ఒక సమగ్ర మార్గదర్శిని మన ముందు ఉన్నది. చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేసే వ్యక్తి వీటి ద్వారా అసలు లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

 • PDF

  ఉపోద్ఘాతంలో రచయిత ఇలా తెలిపినాడు, "ప్రతిరోజు సూర్యుడు సత్యాన్ని గ్రహించి, ఇంత వరకు తప్పుడు దారిలో ఉన్నందుకు పశ్చాత్తాప పడుతూ తమ ప్రభువుకు సమర్పించుకునే క్రొత్తవారిపై తన కాంతిని వెదజల్లుతున్నాడు. వారు స్వర్గంలో ఆయన ప్రసాదించబోయే అంతిమ సుఖసంతోషాల అనుగ్రహం కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇస్లాం ధర్మంలో ప్రవేశించిన ఈ నవముస్లింలు తమలోని చిత్తశుద్ధి, ఇస్లామీయ ధర్మబోధనలపై చూపుతున్న ఆసక్తి మరియు దృఢమైన నమ్మకాలతో, ఈనాటి ముస్లిం సమాజానికి ఒక క్రొత్తదనాన్ని చేర్చుతున్నారు. పూర్వ జీవితంలోని తమ మొత్తం అనుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాలను దృష్టిలో పెట్టుకుని, వారు ఇస్లామీయ ధర్మాన్ని దృఢంగా పట్టుకోవాలని మరియు తమకు సృష్టికర్త చూపిన ఈ సరికొత్త జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. తద్వారా వారు సులభమైన మరియు ఖచ్చితమైన జీవన విధానాన్ని కనుగొంటున్నారు."

 • PDF

  డాక్టర్ బ్రౌన్ సృష్టించిన రెండు ధార్మిక సునామీలైన మిస్ గాడెడ్ మరియు గాడెడ్ ల తర్వాత, ఈ ఆవశ్యకమైన ఇస్లామీయ మౌలిక అంశం వ్రాయబడింది. రెండు సాక్ష్యప్రకటనల ఉచ్ఛరణ ఇస్లాం ధర్మంలో ప్రవేశింపజేస్తుంది. మరి ఆ తర్వాత ఏమి చేయాలి, ఇస్లామీయ జీవన విధానాన్ని ఎలా అలవర్చుకోవాలనే అంశాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • PDF

  జీవితం అంటే ఏమిటి మరియు ఆరాధన అంటే ఏమిటి అనే వాటి గురించి ఇస్లాం ధర్మం ఇస్తున్న ఒక సంక్షిప్త వివరణ

 • PDF

  ఇస్లామీయ సమాజ గొప్ప ధర్మవేత్తలు అహ్మద్ రజా ఖాన్ యొక్క సిద్ధాంతాలను ఖండిస్తున్నారనే సత్యాన్ని అమాయక బరేల్వీలకు తెలియజేయాలనే సదుద్ధేశంతో నేను ఈ చిరుపుస్తకాన్ని సంకలనం చేసినాను. అయితే బరేల్వీ పండితులు అమాయక ప్రజల హృదయాలలో అహ్లె సున్నతుల్ జమఅతు అంటే ద్వేషాన్ని నూరి పోస్తున్నారు. అలాంటి బరేల్వీ పండితుల దుష్ ప్రచారం వలన ప్రజలు అసలు ఇస్లామీయ పండితుల బోధనలకు దూరమవుతున్నారు. అందుకే ఈ చిరుపుస్తకంలో, సూఫీలు తమ రచనలలో వ్రాసిన వాటిలో నుండే నేను సంకలనం చేసాను. తద్వారా వారి అసత్యాలను అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆ సూఫీ పండితులు అసత్యవాదులని వారు చెప్పలేరు కదా.

 • PDF

  ఇహలోక జీవితంలో కలిగే ఆనందం అల్లాహ్ ను ఆరాధించడంలో ఉందని మరియు పరలోక జీవితంలో కలిగే ఆనందం ఆయనను చూడటంలో ఉందని రచయిత చెబుతున్నారు. కాబట్టి, ఇక నుండి మీరు నమాజు కొరకు వెళుతున్నప్పుడు, మీరు అల్లాహ్ ను ప్రేమిస్తున్నందు వలన, ఆయన జ్ఞాపకం రావటం వలన, ఆయనతో పాటు గడపేందుకు నమాజుకు వెళుతున్నాననే భావనతో వెళ్ళాలి. దీని వలన మనస్సు సంతుష్ట పడుతుంది. దాని ద్వారా మీరు మనశ్శాంతి మరియు సంతృప్తి పొందగలరు. దీన కోసమే నమాజు నిర్దేశించబడింది.

 • PDF

  ఈ పుస్తకంలో ఎవరికీ మరియు దేనికీ అల్లాహ్ యొక్క ఏకత్వంలో భాగస్వామ్యం, సాటి కల్పించకుండా జీవించినవారిని అల్లాహ్ అనుగ్రహంతో స్వర్గంలోనికి చేర్చే కొన్ని మంచి పనులు మాత్రమే ప్రస్తావించబడినాయి.

 • PDF

  సోదరుడు మిర్జా ఈ పుస్తకంలోని సంభాషణలో ఏది నిషేదించబడింది మరియు ఏది అయిష్టమైనది అనే వాటి కోసం ఒక అధ్యాయాన్ని కేటాయించారు. ఉదాహరణకు చాడీలు, వ్యర్థప్రసంగాలు మరియు అపనిందలు మొదలైనవి. ఖుర్ఆన్ మరియు సున్నతుల సాక్ష్యాధారాలతో చెడు మాటల నుండి మన నాలుకను కాపాడుకోవడం తప్పనిసరి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా నిరూపించినారు.

 • ఓ మనిషీ ! తెలుగు

  PDF

  అల్లాహ్ అంటే ఎవరు, ఇస్లాం అంటే ఏమిటి, మనం ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనే ముఖ్యాంశాలను నిష్పక్షపాతంగా తెలుసుకో వాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక చాలా ఉపయోగకరమైన వ్యాసం.

 • PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూచించిన వైద్యవిధానం ఈ పుస్తకంలో క్షుణ్ణంగా చర్చించబడింది.

ఫీడ్ బ్యాక్