కేటగిరీలు

సున్నతు నమాజులు

ఫర్ద్ నమాజులకు ముందు లేదా తర్వాత మరియు ఇతర సమాయాలలో చేసే సున్నతు నమాజులు. వాటిలో : కొన్ని నిర్ణీత సమయాలలో చేయవలసి ఉన్నది. మరికొన్ని ఏ సమయంలోనైనా చేయవచ్చు. కొన్ని ఉదాహరణలు - అల్ కుసూఫ్, అల్ ఇస్తస్ఖాఅ, తరావీహ్, ఫర్ద్ నమాజుల తర్వాత ఉత్తమమైన నమాజైన విత్ర్ నమాజు. మోమిన్లు వీలయినంత ఎక్కువగా సున్నతు నమాజు చేయడం మంచిది. ఇక్కడ సున్నతు నమాజులకు సంబంధించిన అనేక అంశాలు చేర్చబడినాయి. 1) సునన్ రవాతిబ్, 2) సలాతుల్ తహజ్జుద్, 3) సలాతుల్ విత్ర్, 4) సలాతుల్ తరావీహ్, 5) సలాతుల్ ఈదైన్, 6) సలాతుల్ కుసూఫ్ మరియు ఖుసూఫ్, 7) సలాతుల్ ఇస్తస్ఖాఅ, 8) సలాతుల్ దుహా, 9) సలాతుల్ ఇస్తిఖారహ్.

అంశాల సంఖ్య: 5

 • video-shot

  MP4

  30 గ్రహాల మరియు నక్షత్రాల సిఫారసుతో వర్షం కోసం దుఆ చేయుట ఎందుకు నిషేధించబడింది అనే అంశంపై కితాబుత్తౌహీద్ వివరణ : ఈ వీడియోలలో షేఖ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రచించిన కితాబుత్తౌహీద్ అనే గొప్ప పుస్తకం నుండి షేఖ్ ఇబ్రాహీం జైదాన్ అనేక విషయాలు వివరించారు. ఈ పుస్తకంలో స్పష్టంగా ఇస్లామీయ మూలసిద్ధాంతమైన తౌహీద్ గురించి, ఈ తౌహీద్ ను విశ్వసించడానికే సర్వలోక సృష్టికర్త మానవులను మరియు జిన్నాతులను సృష్టించాడనే సత్యం గురించి వివరించబడింది.

 • video-shot

  MP4

  ఈ భాగంలో రెండు పండుగలలో చేసే నమాజు గురించిన నియమాలు మరియు దాని ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరించబడింది.

 • video-shot

  MP4

  ఈ భాగంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం పట్టినపుడు చేసే నమాజు యొక్క నియమాలు, దానిలోని దీవెనలు మరియు దానికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.

 • video-shot

  MP4

  ఈ భాగంలో వర్షం కురవాలని వేడుకుంటూ చేసే సలాతుల్ ఇస్తిస్ ఖా మరియు దాని నియమాలు, దానిలోని దీవెనలు మరియు దానికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.

 • video-shot

  MP4

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుమారుడు ఇబ్రాహీమ్ రదియల్లాహు అన్హు చనిపోయిన రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. ఇది చూసి ప్రజలు ఆ పసిబాలుడి మరణమే దానికి కారణమని చెప్పుకోసాగారు. అది విన్న వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం "సూర్యూడు, చంద్రుడు అల్లాహ్ యొక్క సూచనలలోని కొన్ని సూచనలనీ, ఒకరి చావుబ్రతుకులు వాటిని ప్రభావితం చేయవనీ, ఒకవేళ ఎవరైనా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం చూస్తే, వెంటనే నమాజు చేసి, అల్లాహ్ వద్ద శరణు వేడుకోవాలని" బోధించారు.

ఫీడ్ బ్యాక్