కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఆలోచించే అతి ముఖ్యమైన అంశంపై ప్రసంగించారు. దీనిలోని ప్రతి విషయం గురించి మనమందరమూ సరైన జ్ఞానం కలిగి ఉండటం తప్పనిసరి. వివాహబంధంలోని శుభాలు మరియు ప్రయోజనాలు, దానిని ఆలస్యం చేయడం వలన కలిగే అనర్థాల గురించి ఆయన వివరించారు. చివరిగా ఆయన సమాజంపై చెడు ప్రభావం చూపుతున్న బాయ్ ఫ్రెండ్ మరియు గర్ల్ ఫ్రెండ్ తప్పుడు సంబంధాల్ని గురించి చర్చించారు.

 • video-shot

  MP4

  కుటుంబ వ్యవస్థ అనేది మానవజాతిపై సర్వలోక సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ యొక్క అనేక అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం. ఒకవేళ అల్లాహ్ తలిస్తే, మనల్ని కామేచ్ఛలు లేకుండానే సృష్టించి ఉండేవాడు. కానీ ఆయన మనల్ని స్త్రీపురుష జంటలలో సృష్టించాడు. తద్వారా మనం ఒకరిలో మరొకరు సుఖాన్ని మరియు ప్రశాంతతను పొందుగలము. కుటుంబ వ్యవస్థ సమాజ నిర్మాణంలో ముఖ్యమైన ఇటుక రాయి వంటిది. అయితే ప్రతి అనుగ్రహంతో పాటు కొన్ని బాధ్యతలు, పరీక్షలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి జంట తమ వివాహ బంధాన్ని అత్యుత్తమంగా కొనసాగించేందుకు చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ ఖుత్బహ్ ప్రసంగాన్ని షేఖ్ యాసిర్ ఖాదీ ముస్లిం దంపతుల పరస్పర హక్కులు మరియు బాధ్యతల కొరకు అంకితం చేసారు.

 • video-shot

  MP4

  సాఫల్యవంతమైన వివాహబంధం యొక్క తాళపుచెవులు అనే ఈ ఆసక్తికరమైన ఉపన్యాసాన్ని షేఖ్ అబూ హంజా ఇచ్చినారు.

 • PDF

  నా మరదలు త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నది. తనను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి గురించి ఆమె కొంచెం కలత చెందుతున్నది. అసలు విషయం ఏమిటంటే, మీలాదున్నబీ పండుగను గట్టిగా సమర్ధించే వ్యక్తిని పెళ్ళాడవచ్చా లేదా అని ఆమె నన్ను ప్రశ్నించింది. ఇది ఇస్లాంలో బిదఅ అంటే నూతన కల్పితం అని నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అలాంటి వ్యక్తులను అంటే మీలాదున్నబీ పండుగ జరుపుకునే వ్యక్తులను ఎవరైనా పెళ్ళి చేసుకోవచ్చా లేదా. నేటి కాలంలో అనేక మంది ప్రజలు దీనిలో చిక్కుకుని ఉన్నారు, దీనిని ఒక ఆరాధనా భావిస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నారు, ఈ సందర్భంలో అనేక హదీథులు ప్రస్తావిస్తున్నారు, పాటలు పాడుతున్నారు మరియు దుఆలు చేస్తున్నారు. నిజానికి ప్రజలు నిలబడి, పాటలు పాడతారు. మీ వెబ్ సైటులో ఇవ్వబడిన ఫత్వా ఇలాంటి ఆచారం గురించే అనుకుంటా. మరి అలాంటి ఆచారాన్ని పాటించే వ్యక్తిని ఎవరైనా పెళ్ళి చేసుకోవచ్చా ? ఎవరినైనా అడగడానికి నేను ఎక్కువగా భయపడేది ఏమిటంటే అసలు అలాంటి వ్యక్తులు ముస్లింలేనా ? షేఖ్, ఒకవేళ సమాధానం ఇవ్వకపోవడంలో వివేకముందని మీరు భావిస్తే, నా రెండో ప్రశ్నకు జవాబు ఇవ్వవద్దని మనవి చేస్తున్నాను.

 • PDF

  ఒక ఆదర్శవంత ముస్లిం మహిళ మరియు తన భర్తతో ఆమె ఉత్తమ సంబంధం

 • PDF

  పెళ్ళి మరియు దాని గురించిన వివిధ ధర్మాజ్ఞలు తెలిపే ఒక వివరణాత్మక మార్గదర్శిని.

ఫీడ్ బ్యాక్