• video-shot

  PDF

  మీ మొదటి పండుగ దినాన్ని ఉత్తమదినంగా చేసే మార్గదర్శిని: నవముస్లింలారా, మీ మొదటి పండుగ దినాన్ని మరిచిపోలేని ఉల్లాసవంతమైన దినంగా, అల్లాహ్ యొక్క దీవెనలు నిండిన దినంగా జరుపుకోండి. ఎలాగైతే అల్లాహ్ యొక్క మెప్పు సంపాదించాలనే లక్ష్యంతో రమదాన్ నెల మొత్తం మీరు మొదటిసారి ఉపవాసం ఉండటమనేది మీరు సాధించిన ఒక గొప్ప విజయం. బాధాకరమైన విషయం ఏమిటంటే అనేక మంది నవ ముస్లింలు పండుగ రోజున నిరాశ, నిస్పృహలో పడి ఉంటారు. పండుగ రోజున ఏమి చేయాలో మరియు పండుగ రోజున వీలయినంత ఎక్కువగా ప్రయోజనం పొందటానికి ఎలా ప్రయత్నించాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. అల్హందులిల్లాహ్ నిజంగా పండుగ రోజు ఒక సంతోషకరమైన రోజు. మీ మొదటి పండుగరోజు ఆనందదాయకంగా, ఉల్లాసవంతంగా జరుపుకోవడానికి మా ఉచిత మార్గదర్శినిని డౌన్లోడు చేసుకోండి.

 • video-shot

  ఉపవాసం వచనాలు ఇంగ్లీష్

  JPG

  ఈ పోస్టర్ లో ఉపవాసం గురించి అల్లాహ్ యొక్క ఆదేశం పేర్కొనబడింది, "ఓ విశ్వాసులారా! ఇంతకు పూర్వపు ప్రజల కోసం ఆదేశించబడినట్లుగానే మీ కోసం కూడా ఉపవాసం విధిగావించబడింది. తద్వారా మీరు దైవభక్తిపరాయణులు అవగలరు"

 • video-shot

  వాలెంటీన్ దినం ఇంగ్లీష్

  JPG

  వాలెంటీన్ దినం గురించి ఇస్లామీయ ధర్మాదేశం ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ ఇబ్నె సాలెహ్ అల్ ఉతైమీన్ ఇచ్చిన జవాబు.

 • video-shot

  JPG

  ఈ పోస్టర్ లో ఫర్ద్ నమాజుల తర్వాత సులభ పద్ధతిలో అల్లాహ్ యొక్క ధ్యానం అంటే దిక్ర్ చేయడంలోని శుభాల గురించి తెలుపబడింది.

 • video-shot

  JPG

  ఈ పోస్టర్ లో హజ్ యాత్రకు సంబంధించిన ఆరాధనలు, ఆచరణల సంక్షిప్త సారాంశం. దీని ద్వారా హజ్ యాత్రికుడు సులభమైన పద్ధతిలో హజ్ యాత్రలో ఆచరించవలసిన వివిధ అంశాల గురించి తెలుసుకోగలడు.

 • video-shot

  లైలతుల్ ఖదర్ ఇంగ్లీష్

  JPG

  ఈ పోస్టర్ లో ఖుర్ఆన్ లోని అల్లాహ్ యొక్క వచనం, "లైలతుల్ ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" గురించి వివరించబడింది.

 • video-shot

  PDF

  మనం ఎందుకు ఇస్లాం ధర్మాన్ని ఎంచుకోవాలి అనే విషయంపై కొన్ని ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. సృష్టికర్త, స్వచ్ఛమైన మరియు స్పష్టమైన దైవభావన, పాపవిమోచన, జవాబుదారీతనం మరియ న్యాయం, సార్వజనిక సందేశం, ప్రాక్టికల్ మరియు సంతులిత జీవన విధానం మొదలైన కొన్ని ముఖ్యాంశాలను వివరిస్తున్నది.

 • video-shot

  PNG

  ఇది చాలా మంచి వ్యాసం. ఇస్లాం ధర్మంలోని స్వచ్ఛమైన ఏకదైవత్వం గురించి వివరిస్తున్నది. కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధింపబడే అర్హతలు గలవాడని, ఎలాంటి మాధ్యమం లేకుండా డైరక్టుగా ఆయనను ఆరాధించాలని మరియు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్, ఈ సృష్టిని పోలి లేడని అలాగే ఈ సృష్టి కూడా ఆయనను పోలి లేదని సంక్షిప్తంగా ప్రస్తావిస్తున్నది. అల్లాహ్ పంపిన ప్రవక్తలందరూ ప్రజలకు అందజేసిన పిలుపు ఇదే.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్న అసలు స్థానం గురించి ప్రస్తావించబడింది. మామూలుగా ప్రజలలో వ్యాపింపజేయ బడుతున్న అసత్యాలకు అది చాలా భిన్నంగా ఉంది. ధార్మిక విధులు, వివాహం, సామాజిక పాత్ర మొదలైన దృష్టికోణాలలో ఇస్లాం ఏమంటుంది మరియు ఇస్లాంలో ఆమెకు ఇవ్వబడిన ఉన్నత స్థానం గురించి చక్కగా వివరించబడింది.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో ఇస్లాం గురించి ఒక సమగ్ర రూపంలో చర్చించబడింది. ఇస్లాం ధర్మంలోని ధార్మిక విధులు, ఇస్లామీయ జీవిత విధానం, ఈనాటి సమస్యలకు ఇస్లామీయ పరిష్కారం, ఇస్లామీయ భావనాపరంగా ప్రవక్తత్వం, ఇస్లాం ధర్మం తెలుపుతున్న మరణానంతర జీవితం ... మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కొన్ని ముఖ్యాంశాలు ప్రస్తావించబడినాయి. ఉదాహరణకు - ఇస్లాం ధర్మంలో ప్రవక్తత్వ భావన, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిగత జీవితం, ప్రవక్తత్వం తర్వాత ఆయన జీవితం మొదలైనవి. అసాధారణమైన జీవితం గడిపిన అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఎందుకు సామాన్య యూరోపు దేశ ప్రజలకు మరియు అమెరికన్లకు చాలా తక్కువగా తెలుసు అని ప్రశ్నిస్తున్నది.

 • video-shot

  PDF

  ఈ కరపత్రంలో ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నదో వివరిస్తున్నది. ప్రవక్త జీసస్ ఒక మానవ ప్రవక్త అనీ మరియు క్రైస్తవులు నమ్ముతున్నట్లుగా ఎలాంటి దైవత్వమూ ఆయనలో లేదనీ రచయిత తగిన సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాడు.

 • video-shot

  PDF

  ఈ కరపత్రం మొదటి పేజీలో ఇలా ప్రశ్నించబడింది, "ప్రజల, పశుపక్ష్యాదుల, చెట్టుపుట్టల, గ్రహాల, భూమి, నీరు మొదలైన వాటితో పాటు మొత్తం భూమండలం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడే నియమనిబంధనలు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును - తప్పకుండా ఉండాలి !"

 • video-shot

  PDF

  ఈ కరపత్రం ఖుర్ఆన్ మరియు సైంటిఫిక్ మహిమలలో దాని ప్రత్యేకతలను గురించి వివరిస్తున్నది.

 • video-shot

  PDF

  జ్ఞానం సంపాదించడంలో మరియు తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఇస్లాం ధర్మం స్త్రీలకు కూడా పురుషులతో పాటు సమాన హక్కులు ప్రసాదించిందని విషయాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. ఇంకా, ప్రతిఫలం మరియు బాధ్యతల విషయంలో స్త్రీపురుషుల మధ్య ఎలాంటి భేదం లేదని స్పష్టంగా తెలుపుతున్నది.

 • video-shot

  PDF

  మానవ జీవితపు కొన్ని పరమార్థాలను ఈ కరపత్రం చక్కగా వివరిస్తున్నది. ప్రారంభంలో, అల్లాహ్ నే ఎందుకు సర్వలోక సృష్టికర్త అని విశ్వసించాలనే దానికి కొన్ని జవాబులు ప్రస్తావించింది. తర్వాత, ఈ ప్రాపంచిక జీవితపు కొన్ని ముఖ్యోద్దేశాలన ప్రస్తావించింది.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించకుండా దారి తప్పించే షైతాను పన్నాగాలు, ధర్మంలో నూతన కల్పితాలు, పాపకార్యాలు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం మొదలైన షైతాను యొక్క కొన్ని ముఖ్య కుతంత్రాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. చివరిగా మనం షైతానును ఎలా ఓడించాలో సూచిస్తున్నది.

 • video-shot

  PDF

  ప్రవక్త జీసస్ (ఈసా అలైహిస్సలాం) గురించిన సత్యం ఏమిటి అనే ముఖ్యాంశాన్ని ఈ కరపత్రం చర్చిస్తున్నది. అనేక మంది ప్రజలు చెబుతున్నట్లుగా ఆయన దేవుడు కాడని, ఆయన అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త అని స్పష్టం చేస్తున్నది. ఆయన చూపిన కొన్ని మహిమలను పేర్కొంటూ, సిలువ పైకి ఎక్కిండంలో సత్యాసత్యాల గురించి ప్రస్తావించింది. చివరిగా ఆయన పునరాగమనం గురించి తెలుపుతున్నది.

 • video-shot

  PDF

  ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క అనంత కారుణ్యం గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. అల్లాహ్ యొక్క కారుణ్యానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు, సృష్టిపై ఆయన యొక్క దయాదాక్షిణ్యాలు మరియు మనపై అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని ఎలా పెంచుకోగలం అనే కొన్ని ముఖ్యాంశాల గురించి ఇది ప్రస్తావించింది.

పేజీ : 4 - నుండి : 1
ఫీడ్ బ్యాక్