ఆయన 1986వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇరాఖ్ దేశ రాజధాని నగరమైన బాగ్దాద్ లో జన్మించారు. ఆయన ఇరాఖ్ దేశ ఖుర్ఆన్ ఫఠనాకర్తల సంస్థలో సభ్యుడిగా పనిచేసారు. అనేక ఖుర్ఆన్ పఠనం పోటీలలో పాల్గొన్నారు. బాగ్దాద్ లో ఆయన 2007వ సంవత్సరం మే నెల 26వ తేదీన అమెరికన్ సైనిక దళాలతో ముఖాముఖీ పోరాడుతూ మరణించారు.
మక్కా పట్టణంలోని సుప్రసిద్ధ ఖారీలలో ఆయన ఒకరు. సిరియా దేశస్థులు. ఖిర్ఆత్ మరియు వాటి సైన్సులలో ఉద్ధండులు. తన తండ్రి సయీద్ అల్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ నుండి ఆయన ఖుర్ఆన్ విద్యలు నేర్చుకున్నారు. ఉమ్ముల్ ఖురఅ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. అష్ షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అష్రహ్ లో ప్రావీణ్యత సంపాదించారు.