عرض المواد باللغة الأصلية

أعلام وشخصيات

عدد العناصر: 976

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    మగ్రిబ్ కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    అల్ మగ్రిబ్ లోని ఖుర్ఆన్ పఠనాకర్తల పండితులలో ఒకరు

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ అష్ షువైఈ - సౌదీ అరేబీయాలోని పవిత్ర ఖుర్ఆన్ మరియు సైన్సెస్ సొసైటీ సభ్యుడు, రియాద్ నగరంలోని అతీఖహ్ ప్రాంతంలో ఉన్న అమీర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ మస్జిద్ యొక్క ఇమాం.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. దుబయ్ ఇన్వేష్టమెంట్ గ్రూప్, అల్ రీమ్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఈయన ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అహ్మద్ అబ్దుల్ ఫత్తాహ్ ముహమ్మద్ అల్ హద్దాద్. 1984వ సంవత్సరం ఆగష్టు 25వ తేదీన జన్మించారు. జామియ అజ్ హర్ నుండి 2007లో వివిధ భాషల అనువాదంలో పట్టభద్రులయ్యారు. అదే కాలేజీ నుండి 2008లో ఒక పరిశోధనలో మాస్టర్స్ చేసారు. అలాగే ఖుర్ఆన్ సైన్సులో కూడా. ఖిరాత్ అల్ అష్రహ్ లో ప్రావీణ్యం సంపాదించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    షేర్ జాద్ అబ్దుర్రహ్మాన్ బిన్ తాహ్ బిన్ హసన్ అల కూఫీ అల్ కుర్దీ అష్షాఫియీ. ఉత్తర ఇరాఖ్ లోని మోసల్ పట్టణంలో 1968వో జన్మించారు. ఇరాఖ్ మరియు ఇతర ప్రాంతాలలోని షేఖుల వద్ద విద్యాభ్యాసం చేసినారు. వారిలో కొందరు షేఖ్ అబ్దుల్లతీఫ్ ఖలీల్ అల్ సూఫీ, షేఖ్ అల్ హాఫిజ్ అలీ బిన్ హసన్ అల వసాబీ, షేఖ్ హాఫిజ్ ఖారీ అబ్దుర్రజ్జాఖ్ ముహమ్మద్ ఇమారతీ. ఇరాఖ్, యమన్ మరియు దుబయ్ లోని అనేక మస్జిదులలో ఇమాంగా పనిచేసారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన ఈజిప్టు కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త. 1404 అంటే 1984లో జన్మించారు. జామియ అజ్ హర్ లోని మఆహద్ అల్ ఖిరాఅాత్ నుండి తజ్వీద్ వ ఉలూమ్ అష్షరిఅహ్ లో యోగ్యత సంపాదించారు. ఆయన స్పెషలైజేషన్ ఖిరాత్ అష్ర అల్ కుబరా. ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ ఈసా అల్ మస్రావీ షేఖ్ ఉమూమ్ అల్ మఖారీ అల్ మస్రీయహ్ సంస్థలలో మెంబరు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    బోస్నియాకు చెందిన ఖారీ. పశ్చిమ క్రోషియా జామియా మస్జిద్ ఇమాం.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    భారతదేశంలోని జామియ దేవబంద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు బోధించే ఉపాధ్యాయుడు, భారతదేశ ఇస్లామీయ పండితుల నాయకుడు, అనేక భారతదేశ ఇస్లామీయ సంస్థలకు నాయకుడు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ ప్రాజెక్టు ఆరంభించారు. జామియ ఇస్లామీయహ్ లోని కుల్లియ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ మజ్లిస్ యొక్క సభ్యుడు, అంతేగాక అక్కడ ఉపాధ్యాయుడు కూడా. జామియ లోని లైబ్రరీల డీన్ గా కూడా పనిచేసారు. 1432 రమదాన్ లో మస్జిద్ నబవీలో తరావీహ్ నమాజులలో ఇమామ్ గా నియమించబడినారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు జజాఇ బిన్ ఫలీహ్ హమూద్ అస్సువైలీ. కువైత్ లో 1969లో జన్మించారు. కువైత్ లో ప్రసిద్ధ చెందిన ఖుర్ఆన్ పఠనాకర్తలలో ఆయన ఒకరు. కువైత్ లోని జావియ ఇస్లామీయ షరిఅహ్ మరియు స్టడీస్ కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. జాతల్ జామియలో ఉన్న మద్రసలో ఖుర్ఆన్ మరియు తజ్వీద్ అభ్యసించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393 అంటే 1973లో అరబీ భాషలో పట్టభద్రులయ్యారు. తర్వాత 1390 అంటే 1970 నుండి సనఆ లోని హయ్యల్ తహ్రీర్ లో ఉన్న జామియ మస్జిద్ లో ఖుర్ఆన్ టీచర్, ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయడం ప్రారంభించారు. 1421 అంటే 2000లో ఖుర్ఆన్ కరీమ్ కంఠస్థం ధృవీకరించే సంస్థకు మరియు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించారు. ఈజిప్టులో జరిగిన కొన్ని ఖుర్ఆన్ కంఠస్థ సమావేశాలలో పాల్గొన్నారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    కువైత్ దేశానికి చెందిన ఖారీ

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ సాదాతీ అష్షన్ఖీతీ, ప్రొఫెసర్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సఊద్ అల్ ఇస్లామీయ, రియాద్ నుండి ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థంలో ఇజాజత్ పొంది, అప్పటి నుండి రియాద్ పట్టణంలో నివసించసాగారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    సౌదీ అరేబియాకు చెందిన ఖారీ

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన 1986వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన ఇరాఖ్ దేశ రాజధాని నగరమైన బాగ్దాద్ లో జన్మించారు. ఆయన ఇరాఖ్ దేశ ఖుర్ఆన్ ఫఠనాకర్తల సంస్థలో సభ్యుడిగా పనిచేసారు. అనేక ఖుర్ఆన్ పఠనం పోటీలలో పాల్గొన్నారు. బాగ్దాద్ లో ఆయన 2007వ సంవత్సరం మే నెల 26వ తేదీన అమెరికన్ సైనిక దళాలతో ముఖాముఖీ పోరాడుతూ మరణించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు అహ్మద్ బిన్ ముహమ్మద్ అబ్దుల్లాహ్ బిన్ మయీద్ అల్ హవాషీ. సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలోని ఖమీస్ మిషాయిత్ పట్టణంలోని జామియ అల్ కబీర్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్. 1374లో అహద్ రహీదహ్ పట్టణంలో జన్మించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    1982 జులైలో, సూడాన్ లోని ఉత్తర కుర్దఫాన్ కు చెందిన అమరూబిహ్ ప్రాంతంలోని అల్ బనియ్యహ్ లో జన్మించారు. 2009వ సంవత్సరం, సెప్టెంబరులో షేఖ్ ఖిరా అల్ అజ్ హర్ నుండి ఖిరాత్ అనుమతి పత్రం పొందారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఆయన పూర్తి పేరు మహ్మూద్ అహ్మద్ అబ్దుల్ హకీమ్. 1915వ సంవత్సరం ఫిబ్రవరీ 1వ తేదీ, సోమవారం నాడు సయీద్ ఈజిప్టులోని ఖనా అల్ అరీఖహ్ ప్రాంతం, అబూ తషత్ కేంద్రం, అల్ కరంక్ అష్షహీరతుల్ తాబఅహ్ లో జన్మించారు. పదవ ఏట ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. తర్వాత ఆయన తండ్రి ఆయనను తంతా పట్టణంలోని మఆహద్ అల్ అహ్మదీలో రెండేళ్ళ చదువు కోసం చేర్పించారు. అక్కడ ఆయన తజ్వీద్, ఖిరాత్ నేర్చుకున్నారు. తర్వాత జామియ అజ్ హర్ లో ప్రవేశించారు. అక్కడ ఆయన రెండేళ్ళ వరకు విద్యాభ్యాసం చేసినారు. ఆ సమయంలో ఆనాటి సుప్రసిద్ధ ఖుర్రాలను అనుకరించి ఖుర్ఆన్ పఠనం చేయడం ప్రారంభించగా, ప్రజలు ఆయన ఖిరాత్ ను ఎంతో మెచ్చుకునేవారు. ఇంకా ఆయనను ఖిరాత్ విద్యలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆయన పేరు ఖిరాత్ లో దినదినానికి వ్యాపించసాగింది. 1940వ సంవత్సరంలో ఆయన తిలావత్ లో ఉద్ధండులైన ముహమ్మద్ రఫఅత్, అలీ మహ్మూద్, అస్సైఫీ మొదలైన ఖుర్రాలతో ఖుర్ఆన్ పఠనంలో పాల్గొని, వారి ప్రశంసలు అందుకున్నారు. 1982వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ, సోమవారం రోజున మరణించారు.

  • تلغو

    مؤلف, عدد العناصر : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ