కుర్దీ దేశస్థులు. ఇస్లామీయ ప్రచారకులు. ఖుర్ఆన్ ను కంఠస్థం చేసినారు. ధహూక్ లోని అష్షరీఅత్ వ అద్దరసాత్ అల్ ఇస్లామీయ కాలేజీలోన చదివారు. 2002 వ సంవత్సరంలో మరణించారు
అహ్మద్ బిన్ ఖుదర్ అత్తరాబ్లసీ - కువైత్ దేశానికి చెందిన ఖారీ. హఫ్స్ మరియు ఖాలూన్ రివాయతులలో ఆయన ఖుర్ఆన్ పఠనం రికార్డు చేయబడింది. విచిత్రమేమిటంటే ఆయన కువైట్ ఫుట్ బాల్ టీమ్ లో గోల్ కీపర్ గా పనిచేసేవారు.
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆయన 19-6-1398 హి సంవత్సరంలో జన్మించారు. 1415 సంవత్సరంలో ఆయన ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. మానవ వనరుల నిర్వహణలో మాస్టర్స్ పూర్తి చేసారు. పెట్రోకెమికల్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. జనరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సౌదీ ఎయిర్ లైన్సు المؤسسة العامة للخطوط الجوية العربية السعودية లో పనిచేస్తున్నారు. బాగ్దాద్ లోని మస్జిద్ రమదాన్ లో 1415లో ఇమామ్ గా సేవలందించారు. తర్వాత మస్జిద్ అల్ హదీ, అందలూస్ కు మారినారు. ఆ తర్వాత అజ్జహరాఅ లోని మస్జిద్ అస్సయిదహ్ ఖతీజహ్ బిన్తె ఖువైలిద్ కు మారినారు. ప్రస్తుతం తహ్లియాలోని మస్జిద్ అత్తఖ్వాలో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేస్తున్నారు.
సౌదీ అరేబియాలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు మరియు పండితులలో ఒకరు. మక్కాలో జన్మించారు. అల్ హరమ్ అష్షరీఫ్ లో విద్యాభ్యాసం కొనసాగించారు మరియు అక్కడ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేసారు. ఆయన సౌదీ రేడియో తరచుగా ఖుర్ఆన్ పఠనం చేసే ఒక గొప్ప ఖారీ. అష్షాతబీ పద్ధతిలో అల్ ఖిరఆత్ అల్ అష్ర పండితులు.
ఆయన ఖుర్ఆన్ పఠనాకర్త. మహ్మూద్ రషాద్ అల్ షీమీ, ఈజిప్టు దేశస్థుడు, ఈజిప్టు దేశపు రేడియోలో ఖుర్ఆన్ పఠించే గొప్ప ఖారీ, పది రకాలలో ఖుర్ఆన్ పఠించే ప్రావీణ్యం ఉన్న గొప్ప ఖారీ, మస్జిద్ మూదీ అల్ అమ్ర్ యొక్క ముఅద్దన్. నిఖాబతుల్ ఖుర్రా సొసైటీ సభ్యుడు