1963లో మొరాకో దేశంలో జన్మించారు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠోపాఠం చేసారు. దారుల్ బైదాఅ విద్యాసంస్థలలో నుండి హిజ్రీ 1413వ సంవత్సరం రబియ అత్ తానీ నెల 24వ తేదీ అంటే 1992వ సంత్సరం అక్టోబరు నెల 22వ తేదీన చేరినారు. దారుల్ బైద్అలోని అస్సబీల్ బయీన్ అల్ షఖ్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. ఖుర్ఆన్ సొసైటీలలో సభ్యులయ్యారు. 2005వ సంవత్సరం అల్ మసీరతుల్ ఖురానీయ్యహ్ లో మరియు 2010లో అల్ ముస్హఫ్ సున్నతులో సభ్యులయ్యారు. హిఫ్స్ అల్ ఖుర్ఆన్ బైతక్ (احفظ القرآن في بيتك) అనే ఆయన ప్రాజెక్టు ఖుర్ఆన్ కంఠస్థం చేయాలనుకున్న వారికి జామియహ్ అల్ షరాహ్ మస్జిద్ నుండి ప్రత్యేక సేవలందించింది. ఆయన అనేక పద్ధతులలో చక్కటి ఖిర్ఆత్ తో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి చెందిన అబ్దుల్ కరీమ్ గారు చక్కని తెలుగులో ఇస్లాం ధర్మం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎలాంటి కల్పిత గాథలు లేకుండా, స్వచ్ఛమైన ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మాత్రమే ఉపన్యసించడాన్ని ప్రజలు ఆయన ఉపన్యాసాల నుండి ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు. అల్లాహ్ ఆయన సేవలు స్వీకరించుగాక మరియు ఆయనను కాపాడుగాక!
కువైత్ దేశంలోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల రదియల్లాహుఅన్హుమా జీవితాన్ని రిసెర్చ్ చేస్తున్న ఒక ప్రఖ్యాత సంస్థలోని పరిశోధకుడు.