ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా పాఠాలు, విద్యాశాఖ, తెలుభాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్

వివరణ

ఇస్లామిక్ స్టడీస్ డిప్లొమా కోర్సు, విద్యాశాఖ, తెలుగు భాషా విభాగం, రబ్వహ్ ఇస్లామీయ కేంద్రం, రబ్వహ్, రియాద్.
ఈ కోర్సు 5 సెమిష్టర్లలో దాదాపు రెండున్నర సంవత్సరాల లోపు పూర్తి అవుతుంది. ఒక్కో సెమిష్టరు నాలుగు నెలలు. ముస్లింలకు మరియు నవ ముస్లింలకు అవసరమైన ప్రాథమిక ఇస్లామీయ సబ్జెక్టులు ఇక్కడ ప్రామాణిక ఆధారాలతో బోధించ బడును. వీటిలో కొన్ని - బేసిక్ అరబీ భాష, ఖుర్ఆన్, అత్తౌహీద్ (ఏక దైవత్వం), అల్ ఫిఖ్ ( ఇస్లామీయ ధర్మ శాస్త్రం), అల్ హదీథ్ ( ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు), అద్దావహ్ (ఇస్లామీయ ధర్మప్రచారం), సీరహ్ (ప్రవక్త ముహమ్మద్ (స) జీవిత చరిత్ర). త్వరలో క్రొత్త సెమిష్టరు ప్రారంభం కానున్నది. కాబట్టి మీ స్నేహితులతో పాటు మీరూ తప్పకుండా ఈ కోర్సులో చేరవలెను. సీట్లు పరిమితం. తెలుగులో 1995-1415 సంవత్సరంలో మొదలు పెట్టినప్పటి నుండి, నేటి వరకు వేల సంఖ్యలో ప్రజలు ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసారు. చాలా మంది తమ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం సెంటరుకు వచ్చి, ఇస్లాం ధర్మంలో అవసరమయ్యే ఇమామత్ చేయడం, ఖుత్బా ప్రసంగం ఇవ్వడం వంటి ఇతర సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి