ఇస్లాం గురించి, నేటి ప్రాపంచిక పరిస్థితుల గురించి ముస్లింలు మరియు ముస్లిమేతరులు అడిగిన అనేక లక్షల ప్రశ్నోత్తరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు, ధర్మప్రచారకులు, రచయిత షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ జవాబిచ్చారు. ఆ జవాబులను అనేక మంది ఇస్లామీయ పండితులతో కూడిన కమిటీ పునర్విచారించింది, సరిదిద్ధింది. ఇస్లాం ధర్మంలోని ప్రతి చిన్న, పెద్ద విషయం గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలని ప్రయత్నించే ప్రతి ఒక్కరి కోసం ఇది చాలా ఉపయోగకరమైన వెబ్సైటు.
ఒక మంచి ఇస్లామీయ వెబ్సైటు www.islamway.net. ఇందులో 8000 కంటే ఎక్కువ అంశాలకు సంబంధించిన 500 కంటే ఎక్కువ మంది ఇస్లామీయ పండితుల ఆడియోలు ఉన్నాయి. ఇంకా 200 కంటే ఎక్కువ ఖుర్ఆన్ పఠనం ఆడియోలు ఉన్నాయి.
- మస్జిద్ అల్ హరమ్ మరియు మస్జిదె నబవీ - రెండింటిలోని ధార్మిక మరియు పరిపాలనా సేవలను పర్యవేక్షించటం. - రెండు పవిత్ర మస్జిదులలో మంచిని ప్రోత్సహించే మరియు చెడును నిరోధించే బాధ్యతలు వహించటం. - మక్కా మరియు మదీనాలలోని రెండు పవిత్ర మస్జిదులలోని గ్రంథాలయాలను పర్యవేక్షించటం. - రెండు పవిత్ర మస్జిదులను పరిశుభ్రంగా ఉంచే మరియు వాటిని నిర్వహించే బాధ్యతలు వహించటం. - రెండు పవిత్ర మస్జిదుల నిర్వహణ ఖర్చులను విరాళాల మరియు ధర్మాదాయాల ద్వారా సమకూర్చే బాధ్యత. - రెండు పవిత్ర మస్జిదులలో వికలాంగుల వీల్ ఛైర్ల కొరకు అనుమతి జారీ చేయటం మరియు వీడియో షూటింగుల కొరకు అనుమతి జారీ చేయటం. - రెండు మస్జిదులలో నిర్మాణ పనుల ప్లానింగ్, నిర్వహణ మరియు ఆచరణ బాధ్యతలు నిర్వహించటం. - హజ్ సుప్రీమ్ కమిటీ ప్రెసిడెన్సీ మరియు సెంట్రల్ హజ్ కమిటీ పనులలో పాల్గొనటం.