ఆయన పూర్తి పేరు బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ బలీలహ్. హిజ్రీ 1395వ సంవత్సరంలో మక్కాలో జన్మించారు. అక్కడే ఆయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ, పట్టభద్రులయ్యారు. హిజ్రీ 1422వ సంవత్సరంలో ఆయన ఉమ్ముల్ ఖురఅ ఇస్లామీయ విశ్వవిద్యాలయం, మక్కా లోని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసారు. హిజ్రీ 1429వ సంవత్సరంలో మదీనాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ లో పి.హెచ్.డీ పూర్తి చేసారు. అల్ హరమ్ అల్ మక్కీలో ఫిఖ్ హ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేయసాగారు. తాయిఫ్ లోని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మక్కాలోని హయ్యల్ అజీజియహ్ లో ఉన్న అల్ అమీరత్ నౌఫ్ జామియహ్ మస్జిదులో, తర్వాత ఇబ్నె బాజ్ జామియహ్ మస్జిద్ లో ఇమామ్ గా పనిచేసిన తర్వాత, 12/9/1434 తేదీన మస్జిద్ అల్ హరమ్ ఇమాం గా నియుక్తులయ్యారు.