ఆయన పూర్తి పేరు మహ్మూద్ అహ్మద్ అబ్దుల్ హకీమ్. 1915వ సంవత్సరం ఫిబ్రవరీ 1వ తేదీ, సోమవారం నాడు సయీద్ ఈజిప్టులోని ఖనా అల్ అరీఖహ్ ప్రాంతం, అబూ తషత్ కేంద్రం, అల్ కరంక్ అష్షహీరతుల్ తాబఅహ్ లో జన్మించారు. పదవ ఏట ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. తర్వాత ఆయన తండ్రి ఆయనను తంతా పట్టణంలోని మఆహద్ అల్ అహ్మదీలో రెండేళ్ళ చదువు కోసం చేర్పించారు. అక్కడ ఆయన తజ్వీద్, ఖిరాత్ నేర్చుకున్నారు. తర్వాత జామియ అజ్ హర్ లో ప్రవేశించారు. అక్కడ ఆయన రెండేళ్ళ వరకు విద్యాభ్యాసం చేసినారు. ఆ సమయంలో ఆనాటి సుప్రసిద్ధ ఖుర్రాలను అనుకరించి ఖుర్ఆన్ పఠనం చేయడం ప్రారంభించగా, ప్రజలు ఆయన ఖిరాత్ ను ఎంతో మెచ్చుకునేవారు. ఇంకా ఆయనను ఖిరాత్ విద్యలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవాలని ప్రోత్సహించేవారు. ఆ విధంగా ఆయన పేరు ఖిరాత్ లో దినదినానికి వ్యాపించసాగింది. 1940వ సంవత్సరంలో ఆయన తిలావత్ లో ఉద్ధండులైన ముహమ్మద్ రఫఅత్, అలీ మహ్మూద్, అస్సైఫీ మొదలైన ఖుర్రాలతో ఖుర్ఆన్ పఠనంలో పాల్గొని, వారి ప్రశంసలు అందుకున్నారు. 1982వ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ, సోమవారం రోజున మరణించారు.