ఆయన పూర్తి పేరు ముహమ్మద్ రషాద్ బిన్ అబ్దుస్సలామ్ అబ్దుర్రహ్మాన్ అష్షరీఫ్. 1925వ సంవత్సరం ఫలస్తీనా దేశంలోని అల్ ఖలీల్ పట్టణంలో జన్మించారు. ఇస్లామీయ ప్రపంచంలో ఆయన ఒక సుప్రసిద్ధ ఖారీ. అల్ ఖలీల్ లోని మస్జిద్ అల్ ఇబ్రాహీమీ మరియు మస్జిద్ అల్ అఖ్సాలో ఇమామ్ గా పనిచేసారు. 2002వ సంవత్సరం నుండి జోర్డాన్ లోని ఐష్ పట్టణంలో నివశిస్తున్నారు. అల్ అబ్దాలీ లోని మస్జిద్ అల్ మలిక్ అబ్దుల్లాహ్ అవ్వల్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.
ఆయన ఈజిప్టు కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త. 1404 అంటే 1984లో జన్మించారు. జామియ అజ్ హర్ లోని మఆహద్ అల్ ఖిరాఅాత్ నుండి తజ్వీద్ వ ఉలూమ్ అష్షరిఅహ్ లో యోగ్యత సంపాదించారు. ఆయన స్పెషలైజేషన్ ఖిరాత్ అష్ర అల్ కుబరా. ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ ఈసా అల్ మస్రావీ షేఖ్ ఉమూమ్ అల్ మఖారీ అల్ మస్రీయహ్ సంస్థలలో మెంబరు.