(1) అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో
(2) సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.
(3) అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత
(4) తీర్పుదినానికి స్వామి
(5) మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము
(6) మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి
(7) నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు