107 - Al-Maa'un ()

|

(1) తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?

(2) అతడే అనాథులను కసరి కొట్టేవాడు;

(3) మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.

(4) కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు!

(5) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో!

(6) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)!

(7) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో!