(1) ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!
(2) మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;
(3) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.
(4) మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;
(5) మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.
(6) మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"