ఇస్లాం ధర్మం అనుతించిన ఆహార పదార్థాలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

వివరణ

ఇస్లాం మరియు ముస్లింల గురించి అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  ఇస్లాం ధర్మం అనుతించిన ఆహార పదార్థాలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

  ] తెలుగు – Telugu –تلغو [

  islamhouse.com

  2012 - 1433

  أسئلة وشبهات عن الغذاء في الإسلام

  « باللغة تلغو »

  موقع دار الإسلام

  2012 - 1433

  ఇస్లాం ధర్మం అనుతించిన ఆహార పదార్థాలపై కొన్ని ప్రశ్నోత్తరాలు

  1. ఆహారం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది ?

  యూదుల మరియు తొలి క్రైస్తవులు అనుసరించిన ఆహారపానీయాల నియమాల కంటే చాలా సులభమైన నియమాలు ఇస్లాం కొరకు నిర్దేశించబడినాయి – వేటాడిన క్రూరమృగాల మాంసం, పంది మాంసం మరియు అన్ని రకాల మత్తుపదార్థాలు లేక మాదకద్రవ్యాలు.

  2. ముస్లింలు ఎందుకు మాంసాహారం తింటారు?

  ‘శాకాహారం, మాంసాహార విసర్జన’ అనేది ప్రపంచంలో ఈనాడు నడుస్తున్న ఒక ఉద్యమం. అనేక మంది దీనిని పశువుల హక్కుతో జోడిస్తున్నారు. నిశ్చయంగా, మాంసం మరియు ఇతర మాంసాహార పదార్థాలు తినటమనేది పశువుల హక్కులను ఉల్లంఘించటమేనని అనేక మంది ప్రజలు పరిగణిస్తున్నారు.

  ఇస్లాం ధర్మం ప్రతి జీవిపై విధిగా దయ మరియు కనికరం చూపమని ఆదేశిస్తున్నది. అదే సమయంలో ఈ భూమిని మరియు దానిలోని అద్భుత వృక్ష జంతు జాలాలను మానవాళి ప్రయోజనం కొరకు అల్లాహ్ సృష్టించాడని ఇస్లాం ధర్మం ప్రకటిస్తున్నది. ఈ ప్రపంచంలోని వనరులన్నింటినీ అల్లాహ్ యొక్క అనుగ్రహంగా నమ్ముతూ మరియు తీర్పుదినాన వాటి గురించి అల్లాహ్ కు జవాబివ్వవలసి ఉందనే నిజాయితీతో నేర్పుగా, వివేకవంతంగా, తెలివిగా వాటిని అతడు ఉపయోగించుకోవాలా లేదా అనే నిర్ణయించుకునే స్వేచ్ఛ అతడికి ఇవ్వబడింది.

  ఈ వాదన యొక్క వివిధ ఇతర కోణాలను చూద్దాం.

  1. ముస్లిం ఒక స్వచ్ఛమైన శాకాహారి కావచ్చు.

  ఒక ముస్లిం స్వచ్ఛమైన శాకాహారి అయినప్పటికీ ఒక అత్యంత మంచి ముస్లిం కావచ్చు. తప్పనిసరిగా మాంసాహారం భుజించాలనే ఆదేశం ముస్లింలపై లేదు.

  2. ఖుర్ఆన్ ముస్లింలకు మాంసాహార పదార్థాలు భుజించే అనుమతి ఇస్తున్నది.

  ఖుర్ఆన్ ముస్లింలకు మాంసాహార పదార్థాలు భుజించే అనుమతి ఇచ్చింది. క్రింది ఖుర్ఆన్ వచనం దీనిని ఋజువు చేస్తున్నది:

  "ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటింటండి. మీ కొరకు పచ్చిక మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మీకు తెలుపబడిన పశువులు తప్ప!" [దివ్యఖుర్ఆన్ 5:1]

  "మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో కొన్నిటి (మాంసం) మీరు తింటారు." [దివ్యఖుర్ఆన్ 16:5]

  "మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠం ఉంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపిస్తున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు." [దివ్యఖుర్ఆన్ 23:21]

  3. మాంసాహారం పుష్టికరమైనది మరియు మాంసకృత్తులలో ఎంతో సంపన్నమైంది.

  మాంసాహారం - మేలైన మాంసకృత్తుల ఒక మంచి మూలాధారం. బయోలాజికల్ గా దీనిలో మాంసకృతులన్నీ ఉన్నాయి. అంటే శరీరంలో తయారుకాని ఆవశ్యకమైన మొత్తం 8 ఆమినో ఆసిడ్లు మాంసాహారంలో ఉన్నాయి. ఇంకా మాంసాహారంలో ఐరన్, విటమిన్ B1 మరియు నియాసిన్ (niacin) కూడా ఉన్నాయి.

  4. మానవులు సర్వభక్షక పంటి వరస కలిగి ఉన్నారు

  ఒకవేళ ఆవు, మేక, గొర్రె మొదలైన శాకాహార జంతువుల పంటి వరస గమనించినట్లయితే, అవన్నీ ఒకే రకమైన పంటి వరుస కలిగి ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. ఈ జంతువులన్నీ శాకాహారం మేసేందుకు నికి అనువైన బల్లపరుపు (flat teeth) పంటి వరుస కలిగి ఉన్నాయి. ఒకవేళ సింహం, పులి, చిరుతపులి మొదలైన మాంసాహార జంతువుల పంటి వరుస గమనించినట్లయితే, అవన్నీ మొనదీరిన (pointed teeth) పంటి వరస కలిగి ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. అలాగే ఒకవేళ మానవుల పంటి వరసను గమనించినట్లయితే, వారు బల్లపరుపు పంటి వరస (flat teeth) మరియు మొనదీరిన (pointed teeth) రెండూ కలిగి ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. కాబట్టి వారికి శాకాహారం మరియు మాంసాహారానికి అనువైన పంటి వరసలు ఉన్నాయి. అంటే వారు సర్వభక్షకులన్నమాట. ఒకవేళ సృష్టికర్త మానవులను కేవలం శాకాహారులుగా మాత్రమే ఉండాలని భావిస్తే, వారికి మాంసాహారానికి అనువైన మొనదీరిన (pointed teeth) పంటి వరస ఎందుకు ఇచ్చినట్లు ? సృష్టికర్త మనల్ని శాకాహార మరియు మాంసాహార పదార్థాల్ని భుజించే విధంగా సృష్టించాడనేది లాజికల్ గా దీనికి సరైన జవాబు.

  5. మానవులు శాకాహారాన్ని మరియ మాంసాహారాన్ని జీర్ణం చేసుకోగలరు

  శాకాహార జంతువులు కేవలం వృక్షాది మొక్కలను మాత్రమే జీర్ణం చేసుకోగలుగుతాయి. అలాగే మాంసాహార జంతువులు కేవలం మాంసాన్ని మాత్రే జీర్ణం చేయుకుంటాయి. కానీ, మానవుల జీర్ణ వ్యవస్థ – శాకాహారాన్ని మరియు మాంసాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగలదు. ఒకవేళ సృష్టికర్త మనల్ని కేవలం శాకాహారులుగా మాత్రే ఉండాలని భావిస్తే, మనకు మాంసాహారాన్ని కూడా జీర్ణం చేసుకునే జీర్ణ వ్యవస్థ ఎందుకు ఇచ్చినట్లు?

  6. హిందూ ధర్మ గ్రంథాలు మాంసాహారానికి అనుమతించాయి.

  1. కఠినంగా అనేక మంది హిందువులు కేవలం శాకాహారులుగానే జీవిస్తున్నారు. మాంసాహారాన్ని భుజించటమనేది వారి ధర్మానికి విరుద్ధమని వారి అభిప్రాయం. కాని నిజానికి హిందూ ధర్మ గ్రంథాలు మానవులు మాంసాహారం తినవచ్చని అనుమతిస్తున్నాయి. హిందూ ఋషులు, మునులు మరియు సాధువులు మాంసాహారం భుజించేవారని వారి గ్రంథాలు తెలుపు తున్నాయి.
  2. హిందువుల ధర్మ శాస్త్ర గ్రంథమైన మనుస్మృతిలోని 5వ అధ్యాయం, 30వ వచనంలో ఇలా ఉంది.
   "వేటి మాంసం అయితే భుజించదగినదో, రోజు విడిచి రోజు దానిని తిన్నా, అతడు ఎలాంటి తప్పూ చేయటం లేదు. ఎందుకంటే దేవుడు కొన్నింటిని తినటానికే సృష్టించినాడు మరియు కొన్నింటిని తినబడటానికే సృష్టించాడు."
  3. అదే మనుస్మృతిలోని 5వ అధ్యాయం, 31వ వచనంలో ఇలా పేర్కొనబడింది,

  "బలిచ్చినవాడు మాంసం తినటం సరైనదే. ఇది దేవుడి నియమం అని సంప్రదాయబద్ధంగా ప్రసిద్ధి చెందింది."

  1. ఇంకా, మనుస్మృతి 5వ అధ్యాయం, 39 మరియు 40 వచనాలు ఇలా చెబుతున్నాయి
   "దేవుడు స్వయంగా బలిపశువులను బలి ఇవ్వబడటం కోసం సృష్టించాడు, ...., కాబట్టి బలి కోసం వధించడం హత్య క్రిందికి రాదు."
  2. మహాభారతం, అనుశాశన పర్వం 88వ అధ్యాయంలో శ్రాద్ధకర్మల (పితృకార్యముల) సమయంలో పితృదేవతలను సంతుష్ట పరచేందుకు వారికి ఏమి సమర్పించాలని ధర్మరాజు భీష్ముడిని ఇలా ప్రశ్నించాడు:

  "యుధిష్టిరుడు ఇలా పలికాడు, "ఓ పితామహుడా, పితృలకు ఏమి సమర్పిస్తే వారు సంతృప్తి చెందుతారో, ఏ పుణ్యం ఎక్కువ కాలం ఉంటుందో నాకు తెలుపుము, ఏది శాశ్వతంగా ఉంటుందో నాకు తెలుపుము!"

  "దానికి భీష్ముడు ఇలా జవాబిచ్చాడు, "పితృకార్యములో సమర్పించేందుకు ఉత్తమంగా ఉండేవి మరియు ఫలాలు అంటే పుణ్యాలు ఎక్కువ కాలం వరకూ లభిస్తూ ఉండే వాటి గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా విను ఓ యుధిష్టిరా. శ్రాద్ధకర్మలో ఒకవేళ నువ్వులు, అన్నము, బార్లీ, అంబలి, నీళ్ళు, దుంపలు, పళ్ళు మొదలైనవి సమర్పిస్తే, పితృదేవతలు ఒక నెల వరకు సంతుష్ట పడతారు. శ్రాద్ధకర్మలో ఒకవేళ చేపలు సమర్పిస్తే పితృదేవతలు రెండు నెలల వరకు సంతుష్టపడతారు. శ్రాద్ధకర్మలో ఒకవేళ గొర్రె మాంసం సమర్పిస్తే పితృదేవతలు మూడు నెలల వరకు, కుందేలు మాంసం సమర్పిస్తే నాలుగు నెలల వరకు, మేక మాంసం సమర్పిస్తే ఐదు నెలల వరకు, పంది మాంసం సమర్పిస్తే ఆరు నెలల వరకు, పక్షుల మాంసం సమర్పిస్తే ఏడు నెలల వరకు సంతుష్టపడతారు. ప్రీష్ట అనబడే దుప్పి మాంసం సమర్పిస్తే ఎనిమిది నెలల వరకు, రురు (Ruru) మాంసంతో తొమ్మిది నెలలు, గవయ (Gavaya) మాంసంతో పది నెలలు, దున్నపోతు మాంసంతో పదకొండు నెలలు పితృదేవతలు సంతుష్టపడతారు. పితృకార్యములో ఆవు మాంసం సమర్పిస్తే ఒక సంవత్సరం మొత్తం పితృదేవతలు సంతుష్టపడతారు. ఆవు మాంసం వలే పాయసం కూడా పితృదేవతలకు ఎంతో ప్రియమైంది. వధ్రింస అనబడే పేద్ద ఎద్దు సమర్పిస్తే, పితృదేవతలు మొత్తం పన్నెండు సంవత్సరాలు సంతుష్టపడతారు. ప్రతి సంవత్సరం వారు చనిపోయిన నెలలోని పున్నమి దినాలలో సమర్పించే ఖడ్గమృగ మాంసంతో పితృదేవతలు అనంత కాలం వరకు సంతుష్టపడతారు. పితృకార్యములలో కలస్క (Kalaska) అనబడే తోటకూర, కాంచన పుష్ప దళాలు, (ఎరుపు రంగు) మేక మాంసం సమర్పించినా అవి అనంత కాలం వరకు పితృదేవతలను సంతుష్టపరుస్తాయి.

  కాబట్టి సహజంగానే ఒకవేళ మీరు మీ పితృదేవతలను అనంత కాలం వరకు సంతుష్ట పరచాలంటే, పితృకార్యములో ఎరుపు రంగు మేక మాంసాన్ని సమర్పించాలని పై సంభాషణ ద్వారా తెలుస్తున్నది.

  7. హిందూ ధర్మం ఇతర ధర్మాలచే ప్రభావితమైంది

  హిందూ ధర్మ గ్రంథాలు తమ అనుచరులకు మాంసాహారం భుజించే అనుమతి ఇస్తున్నా, జైనమతం వంటి ఇతర మతాలచే ప్రభావితమై అనేక మంది హిందువులు శాకాహార భోజనాన్ని మాత్రమే తినాలనే నిర్ణయంతో ఉన్నారు.

  8. మొక్కలకు కూడా ప్రాణం ఉంది

  కొన్ని మతాలు శాకాహారాన్నే తమ ఆహార పద్ధతిగా చేసుకున్నాయి. ఎందుకంటే వారు జీవహత్యకు పూర్తిగా వ్యతిరేకం. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఏ జీవినీ చంపకుండా జీవించగలిగితే, అతడి జీవితం అత్యుత్తమమైన జీవితం అవుతుంది. పూర్వకాలంలో మొక్కలకు ప్రాణం ఉండదని ప్రజలు భావించేవారు. మొక్కలకు కూడా ప్రాణం ఉందనే విషయం ఈనాడు అందరికీ తెలిసిన సర్వసాధారణ విషయం. అందువలన శాకాహారులుగా జీవించటం ద్వారా అస్సలు జీవహత్య చేయకుండా ఉండవచ్చనే వారి లాజిక్ పూర్తికావటం లేదు.

  9. మొక్కలు కూడా బాధను అనుభవిస్తాయి

  ఇంకా వారు మొక్కలకు బాధ కలగదు కాబట్టి మొక్కలను త్రుంచటమనేది పశువులను వధించటం కంటే తక్కువ స్థాయి దోషమని వాదిస్తుంటారు. అయితే ఈనాడు మొక్కలు కూడా బాధ పడతాయని వైజ్ఞానిక శాస్త్రం చెబుతున్నది. కానీ, మొక్కల ఏడ్పులను మానవులు వినలేరు. 20 Hertz నుండి 20,000 Hertz పరిధి మధ్య లేని శబ్దతరంగాలను వినలేని మనిషి చెవుల అసమర్ధతయే దీనికి కారణం. 20 Hertz కంటే తక్కువ ఉండే మరియు 20,000 Hertz కంటే పైన ఉండే ఏ శబ్దతరంగాన్నీ మానవుడు వినలేడు. కుక్కలు 40,000 Hertz వరకు వినగలుగుతాయి. కాబట్టి 20,000 Hertz కంటే ఎక్కువ మరియు 40,000 Hertz కంటే తక్కువ ఫ్రీకెన్సీ గల నిశ్శబ్దమైన కుక్కల శబ్దాలు కేవలం కుక్కలు మాత్రేమే వినగలవు గానీ మానవులు వినలేరు. కుక్కలు తమ యజమాని ఈలను గుర్తిస్తాయి మరియు వెంటనే అతని వద్దకు చేరుకుంటాయి. అమెరికాలోని ఒక రైతు పరిశోధనలు చేసి, మొక్కల ఏడుపులు మానవుడికి వినపించే ఒక పరికరాన్ని కనిపెట్టాడు. మొక్కలు నీళ్ళ కోసం ఏడుపు ప్రారంభించినపుడు. వెంటనే అతడు ఆ పరికరం ద్వారా దానిని గ్రహించేసేవాడు. మొక్కలు సంతోషాన్ని మరియు బాధను కూడా అనుభవిస్తాయని, అవి ఏడుస్తాయనీ తాజా పరిశోధనలు చూపుతున్నాయి.

  10. రెండు ఇంద్రియాలు తక్కువగా ఉన్న జీవిని హత్య చేయడమనేది తక్కువ స్థాయి నేరం కాదు కదా!

  మొక్కలకు రెండు లేదా మూడు ఇంద్రియాలు తక్కువగా ఉంటాయని మరియు జంతువులు పంచేంద్రియాలు కలిగి ఉంటాయనే తన వాదనను ఒకసారి ఒక శాకాహారి వినిపించాడు.

  కాబట్టి, మొక్కలను చంపటమనేది జంతువులను చంపటం కంటే తక్కువస్థాయి నేరమని అతడి వాదన. ఒకవేళ మీ సోదరుడు పుట్టుకతోనే చెవిటివాడిగా మరియు మూగవాడిగా పుట్టి, ఇతర మానవులతో పోల్చినపుడు అతడికి రెండు ఇంద్రియాలు తక్కువగా ఉన్నాయని భావిద్దాం. యుక్తవయస్కుడైన తర్వాత అతడిని ఎవరో హత్య చేసారు. మీ సోదరుడికి రెండు ఇంద్రియాలు లేకపోవటం వలన హంతకుడికి తక్కువ శిక్ష విధించమని మీరు జడ్జి గారిని అడుగుతారా? వాస్తవానికి హంతకుడు ఒక అమాయక వ్యక్తిని చంపాడని, అందువలన అతడికి మరింత కఠినమైన శిక్ష విధించాలని మీరు జడ్డిగారికి విజ్ఞప్తి చేయరా ?

  దీని గురించి ఖుర్ఆన్ ఇలా చెబుతున్నది:

  "ఓ ప్రజలారా! భూమి పై ఉన్నవాటిలో నుండి ధర్మబద్ధమైన వాటిని మరియు ఉత్తమమైన వాటిని తినండి" [అల్ ఖుర్ఆన్ 2:168]

  11. అపరిమితంగా పెరిగిపోయే ఆవుల సంఖ్య

  ఒకవేళ ప్రతి మానవుడు శాకాహారి అయితే, ఆవుల సంఖ్య అపరిమితంగా పెరిగి పోతుంది. ఎందుకంటే వాటి సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. తన సృష్టితాల మధ్య ఎలా సమతౌల్యాన్ని కాపాడాలో మహావివేకి అయిన అల్లాహ్ కు బాగా తెలుసు. కాబట్టి ఆయన మన కొరకు గోమాంసాన్ని అనుమతించటంపై ఆశ్చర్య పడవలసిన పనిలేదు.

  12. అందరూ మాంసాహారులు కాకపోవటం వలన మాంసం ధరలు సముచితంగా ఉంటాయి.

  కొంతమంది ఖచ్ఛితంగా శాకాహారులుగానే ఉండటంపై మనకేమీ అభ్యంతరం ఉండకూడదు. అయితే వారు మాంసాహారులను నిందించకూడదు. వాస్తవానికి ఒకవేళ భారతీయులందరూ మాంసాహారులుగా మారితే, ప్రస్తుత మాంసాహారులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మాంసం ధర పెరిగిపోతుంది.

  3. ముస్లింలు ఎందుకు అమానుషంగా జంతువులను హింసిస్తూ, నెమ్మదిగా మరియు బాధిస్తూ వధిస్తారు?

  జంతువులను వధించే ఇస్లామీయ పద్ధతిని జిబిహా చేయటం అంటారు. ఇది అనేక మంది ప్రజల విమర్శలకు లక్ష్యంగా మారింది.

  దీనికి జవాబిచ్చే ముందు, జంతువులను వధించే విషయంలో ఒక ముస్లింకు మరియు ఒక శిక్కుమతస్థునికి మధ్య జరిగిన ఈ సంభాషణను ఒకసారి పరిశీద్దాం.

  ఒకసారి ఒక శిక్కు మతస్థుడు తోటి ముస్లింను ఇలా ప్రశ్నించాడు, "మేము వధించే విధంగా కాకుండా అంటే ఒక్క ఝట్కాతో కాకుండా మీరెందుకు జంతువులను గొంతు దగ్గరున్న రక్తనాళం కోసి వధిస్తారు.?" దానికి ఆ ముస్లిం ఇలా జవాబిచ్చాడు "మేము చాలా ధైర్యవంతులము మరియు సాహసవంతులము. అందువలన ముందు నుండే దాడి చేస్తాము. మేము మగవారం. మీరు వంచకులు, వెనుక నుండి దాడి చేస్తారు ".

  ఇక జోకులను ప్రక్కన పెట్టి, జబిహా పద్ధతి మానవోచిత పద్దతే కాకుండా, వైజ్ఞానికంగా కూడా ఉత్తమమైనదనే విషయాన్ని ఋజువు చేస్తున్న క్రింది విషయాలను మనం తప్పకుండా చదవాలి:

  1. జంతువులను వధించే ఇస్లామీయ పద్ధతి – జబిహా:

  జక్కైతుమ్ అనే క్రియాపదం జకహ్ (పవిత్రం చేసే) అనే మూలపదం నుండి వచ్చింది. దీని నామవాచక పదం తజ్కియా అంటే పవిత్రత. ఇస్లామీయ పద్ధతిలో వధించటానికి అంటే జిబా చేయటానికి క్రింది షరతులు పూర్తి చేయవలసి ఉంటుంది:

  a. చాలా పదునైన వస్తువుతో (కత్తితో), అతి వేగంగా మాత్రమే జంతువులను వధించాలి అంటే జబిహా చేయాలి. అలా చేయటం ద్వారా వధించబడే జంతువు బాధ తగ్గుతుంది.

  b. కంఠనాడిని, గొంతుకను మరియ మెడలోని నాళమును కత్తరించాలి

  జబిహా అనేది ఒక అరబీ భాషా పదం. దీని అర్థం వధించుట. వెన్నుపూస నాడిని కత్తిరించకుండా కంఠనాడిని, గొంతుకను మరియ మెడలోని నాళమును కత్తిరించటం ద్వారా జంతువులను వధించాలి.

  వధించబడిన జంతువు దేహంలోని రక్తం బయటికి రాకుండా, దాని తలను వేరు చేయకూడదు. దీని వెనుకనున్న ప్రయోజనం ఏమిటంటే – దాని దేహంలోని మొత్తం రక్తం బయటికి ప్రవహించేందుకు అవకాశం ఇవ్వటం ద్వారా సూక్ష్మజీవుల కొరకు మంచి కల్చర్ మీడియంగా ఉపయోగపడుతుంది. స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస నాడిని కత్తిరించకూడదు. ఎందుకంటే హృదయానికి వెళ్ళుతున్న నాడీతంతువులు డ్యామేజీ కాకూడదు, ఒకవేళ అలా జరిగితే గుండె ఆగిపోయి, రక్తం దాని దేహంలోని రక్తనాళాలలో నిలిచిపోతుంది.

  2. సూక్ష్మజీవులు మరియు బాక్టీరియా కొరకు రక్తం ఒక మంచి మీడియం.

  సూక్ష్మజీవులు, బాక్టీరియా, జీవాణువు విషం మొదలైన వాటి కొరకు రక్తం ఒక మంచి మీడియం. రక్తం ద్వారా ఇవి శరీరంలో ఒక చోట నుండి మరో చోటికి చేరుకుంటాయి. అందువలన జబిహా అనబడే ముస్లింల పద్ధతి చాలా ఆరోగ్యవంతమైంది (hygienic). ఎందుకంటే అనేక రోగాలకు కారణమైన సూక్ష్మజీవులు, బాక్టీరియా, జీవాణువు విషం మొదలైనవి కలిగి ఉన్న రక్తం ఆ జంతువు దేహం నుండి బయటికి ప్రవహించే పూర్తి అవకాశం ఇవ్వబడుతున్నది.

  3. ఎక్కువ సేపు మాంసం తాజా ఉంటుంది

  ఇస్లామీయ పద్దతిలో జబిహా చేయబడిన జంతువు మాంసం ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఎందుకంటే, ఇతర పద్ధతులలో వధించిన జంతు మాంసంలో కంటే జబిహా చేసిన జంతు మాంసంలో రక్తం మిగిలి ఉండక పోవటానికి ఎక్కువ అవకాశం ఉంది.

  4. వధించబడే జంతువుకు ఎక్కువ నొప్పి కలుగదు

  మెడలోని రక్తనాళాన్ని వేగంగా కోయటం వలన, నొప్పిని మెదడుకు చేర్చే రక్తప్రవాహం ఆగిపోతుంది. తద్వారా ఆ జంతువుకు నొప్పి కలుగదు. చనిపోతున్నప్పుడు జంతువు తన్నుకుంటుంది, గిజగిజలాడుతుంది, కదులుతుంది మరియు కాళ్ళుతో కొట్టుకుంటుంది – అది నొప్పితో అలా చేయదు. దాని అసలు కారణం రక్తం తగ్గి కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందటం మరియు శరీరం నుండి రక్తం బయటికి ప్రవహించటం.

  4. మనిషి తినే ఆహార పదార్థాల ప్రభావం అతని స్వభావంపై ఉంటుందని సైన్సు చెబుతున్నది. మరి అటువంటప్పుడు, మనిషిని హింస, దౌర్జన్యం చేసే ఉగ్రవాదిగా చేసే జంతుమాంసాన్ని భుజించే అనుమతి ఇస్లాం ధర్మం ముస్లింలకు ఎందుకు ఇస్తున్నది ?

  1. కేవలం శాకాహార జంతువులను మాత్రమే భుజించే అనుమతి:

  ఒక వ్యక్తి ఏమి తిన్నా దాని ప్రభావం అతని స్వభావంపై ఉంటుందనేది నేను అంగీకరిస్తున్నాను. అందువలనే హింసాత్మకంగా మరియు దౌర్జన్యంగా ప్రవర్తించే సింహం, పులి, చిరుతపులి మొదలైన మాంసభక్షక జంతువుల మాంసాన్ని ఇస్లాం ధర్మం నిషేధించింది. అలాంటి జంతువుల మాంసాన్ని తినటం వలన మనిషి కూడా హింస, దౌర్జన్యం చేసే ఉగ్రవాదిగా మార్చే అవకాశం ఉంది. అయితే కేవలం ఆవు, మేక, గొర్రె వంటి శాంతియుతంగా ఉండే శాకాహార సాధు జంతువుల మాంసాన్ని మాత్రమే భుజించే అనుమతి ఇస్తున్నది. ముస్లింలు శాంతియుతంగా ఉండే సాధు జంతువుల మాంసాన్ని భుజిస్తారు ఎందుకంటే వారు శాంతిని అమితంగా ప్రేమించే అహింసావాదులు.

  2. చెడు విషయాలను నిషేధించమని ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెబుతున్నది:

  ఖుర్ఆన్ పలుకుల తెలుగు భావానువాదం:

  "మంచి పనులు చేయమని మరియు చెడుపనుల నుండి దూరంగా ఉండమని ప్రవక్త ఆదేశిస్తాడు.". "మంచి వాటిని ఆయన అనుమతిస్తాడు మరియు చెడు వాటిని ఆయన నిషేధిస్తాడు," [దివ్యఖుర్ఆన్ 7: 157]

  "కాబట్టి, ఏదైతే ప్రవక్త మీకు ఆదేశిస్తారో, మీరు దానిని స్వీకరించండి మరియు దేని నుండైతే ఆయన దూరంగా ఉండమంటారో, దాని నుండి మీరు దూరంగా ఉండండి." [దివ్యఖుర్ఆన్ 59: 7]

  ఒక ముస్లిం కొరకు ‘మానవులు కొన్ని రకాల (మాంసభక్షక) జంతువుల మాంసం తినడం అల్లాహ్ కు ఇష్టం లేదని మరియు కొన్ని రకాల (సాధు) జంతువుల మాంసాన్ని తినటానికి అనుమతించాడనే’ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఒక్క ఉపదేశం చాలు.

  3. మాంసాహార జంతువుల మాంసాన్ని నిషేధిస్తున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు.

  సహీహ్ ముస్లిం మరియు సునన్ ఇబ్నె మాజా గ్రంథాలలోని ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన హదీథుతో పాటు సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం గ్రంథాలలో నమోదు చేయబడిన అనేక ప్రామాణిక హదీథుల ప్రకారం, క్రింది మాంసాహార జంతువుల మాంసాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారు:

  i. కోరపళ్ళు గల క్రూర జంతువులు అంటే మాంసభక్షక జంతువులు. ఉదా - పిల్లి జాతికి చెందిన సింహం, పులి, చిరుతపులి, పిల్లి, కుక్క, తోడేలు, సివంగి మొదలైనవి.

  ii. కొన్ని వాడిపళ్ళ జంతువులు. ఉదా - ఎలుకజాతికి చెందిన చిట్టెలుక, ఎలుక, గోళ్ళు కలిగిన కుందేలు మొదలైనవి.

  iii. కొన్ని ప్రాకెడు జంతువులు. ఉదా – పాము, తేలు, మొసలి మొదలైనవి.

  iv. గోళ్ళు కలిగి ఉండి ఇతర పశుపక్ష్యాదులను వేటాడే కొన్ని రకాల మాంసభక్షక పక్షులు. ఉదా – రాబందు, గద్ద, కాకి, గుడ్లగూబ మొదలైనవి.

  5. ఇస్లాం ధర్మంలో పందిమాంసం ఎందుకు నిషేధించబడింది?

  ఇస్లాం ధర్మంలో పందిమాంసం నిషేధించబడిందనే విషయం అందరికీ తెలిసినదే. ఈ నిషేధం వెనుక ఉన్న కొన్ని కారణాలు క్రింద తెలుబడినాయి:

  1. ఖుర్ఆన్ లో పందిమాంసం నిషేధించబడింది

  నాలుగింటి కంటే ఎక్కువ వచనాలలో ఖుర్ఆన్ పందిమాంసం తినవద్దని నిషేధిస్తున్నది. 2:173, 5:3, 6:145 మరియు 16:115 వచనాలలో పంది మాంసం నిషేధించబడింది.

  "మీకోసం నిషేధించబడినవి: చనిపోయిన జంతువుల మాంసం, రక్తం, పంది మాంసం మరియు అల్లాహ్ పేరుపై కాకుండా ఇతరుల పేరు మీద బలి ఇవ్వబడిన పశువుల మాంసం." [ఖుర్ఆన్ 5:3]

  పందిమాంసం ఎందుకు నిషేధించబడిందనే దానిని ఒక ముస్లిం అంగీరించేందుకు పైన పేర్కొనబడిన ఖుర్ఆన్ వచనాలు చాలు.

  2. బైబిలులో పందిమాంసం నిషేధించబడింది

  ఒక క్రైస్తవుడికి అతడి ధర్మ గ్రంథాలు బాగా నచ్చజెప్పగలుగుతాయి. బైబిలు గ్రంథం పంది మాంసాన్ని నిషేధిస్తున్నది. లేవీకాండములో ఇలా పేర్కొనబడింది:

  "పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తిన కూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు." [లేవీకాండము 11:7-8]

  బైబిల్ గ్రంథంలోని ద్వితీయోపదేశకాండములో కూడా పందిమాంసం నిషేధించబడింది.

  "మరియు పంది రెండు డెక్కలు గలదైనను నెమరువేయదు గనుక అది మీకు హేయము, వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరములను ముట్ట కూడదు." [ద్వితీయోపదేశకాండము Deuteronomy 14:8]

  అలాగే బైబిల్ గ్రంథంలోని యెషయాకాండములో పందిమాంసం గురించి ఇలా ప్రస్తావించబడింది.

  “తమ ఆలోచనల ననుసరించి చెడుమార్గమున నడచు కొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బల్యర్పణమును అర్పించుచు ఇటికెల మీద ధూపము వేయుదురు నా భయములేక నాకు నిత్యము కోపము కలుగజేయు చున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు”. యెషయా Isaiah 65: 2-5.

  3. అనేక రోగాలకు మూలకారణం పందిమాంసం.

  హేతువు, లాజిక్ మరియు సైన్సు ద్వారా నచ్చజెప్పగలిగినప్పుడే ఇతర ముస్లిమేతరులు మరియు నాస్తికులు కూడా దీనిని ఒప్పుకుంటారు. డెబ్బై కంటే ఎక్కువ రకాల రోగాలకు పందిమాంసం తినటమే ముఖ్యకారణం. పందిమాంసం తినే వ్యక్తిలో ఏలికపాము (roundworm), సన్నపాము (pinworm), కొంకి పురుగు (hookworm) మొదలైన రకరకాల క్రిములు ఏర్పడతాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది మామూలు భాషలో ఏలిక పాము (tapeworm) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన కండర పట్టిక లేదా నాడీ పట్టిక (Taenia Solium). ఇది పేగులో నివాసమేర్పరుచుకుంటుంది మరియు చాలా పొడువుగా ఉంటుంది. దాని అండాణువులు అంటే గుడ్లు రక్తప్రవాహంలో ప్రవేశిస్తాయి మరియు శరీరంలోని అన్ని అవయవాలలోనికి చేరతాయి. ఒకవేళ అవి మెదడులో ప్రవేశిస్తే, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తాయి. ఒకవేళ అవి హృదయంలో ప్రవేశిస్తే, హార్ట్ ఎటాక్ వచ్చేలా చేస్తాయి. ఒకవేళి అవి కంటిలో ప్రవేశిస్తే, చూపు కోల్పోయేలా చేస్తాయి. ఒకవేళ లివర్ (కాలేయం)లో ప్రవేశిస్తే, లివర్ చేడిపోయేలా చేస్తాయి. అవి దాదాపు శరీరంలోని అవయవాలన్నింటికీ హాని కలిగిస్తాయి, చెడిపోయేలా చేస్తాయి.

  మరో ప్రమాదకరమైన ఏలికపాము త్రిచుర తిచురసిస్ (Trichura Tichurasis). పందిమాంసాన్ని బాగా ఉడకబెడితే, ఈ క్రిములు (ova) చనిపోతాయనే ఒక తప్పుడు అభిప్రాయం చాలా మంది ప్రజలలో నాటుకుని ఉంది. అమెరికాలో చేపట్టిన ఒక రిసెర్చ్ ప్రాజెక్ట్ లో త్రిచుర తిచురసిస్ (Trichura Tichurasis) వ్యాధితో బాధ పడుతున్న 24 మందిలో 22 మంది బాగా ఉడకబెట్టిన పందిమాంసాన్ని తిన్నారు. దీనిని బట్టి మామూలుగా ఉడకబెట్టే ఉష్ణోగ్రత పందిలో ఉండే ఆ క్రిములను (OVA) చంపలేదు.

  4. పందిమాంసంలో క్రొవ్వు తయారయ్యే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి.

  కండరాలు ఏర్పరచే పదార్థాలు పందిమాంసంలో చాలా తక్కువగా ఉంటాయి. దానిలో మితిమీరి క్రొవ్వు ఉంటుంది. ఈ క్రొవ్వు నాళములలో జమ అయి, హైపర్ టెన్షన్ కు మరియు హార్ట్ ఎటాక్ కు కారణమవుతుంది. దాదాపు 50% కంటే ఎక్కువ అమెరికన్లు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నారనే విషయం ఆశ్చర్యకరమైనదేమీ కాదు.

  5. ఈ భూమిపై అత్యంత మురికిగా, రోతగా, అసహ్యకరంగా ఉండే జంతువులలో పంది ఒకటి.

  ఈ భూమిపై అత్యంత మురికిగా, రోతగా, అసహ్యకరంగా ఉండే జంతువులలో పంది ఒకటి. అది పెంటలో, మలములో, మురికిలో, మలినంలో ఉంటుంది మరియు పెరుగుతుంది. అది సృష్టికర్త సృష్టించిన ఒక గొప్ప పాకీ జంతువు. అనేక గ్రామాలలో అధునాతన టాయిలెట్లు ఉండవు మరియు నిర్మానుష్య ప్రదేశాలలో ప్రజలు మలమూత్ర విసర్జన చేస్తుంటారు. తరుచుగా ఈ పందులే ఆ ప్రదేశాలను పరిశుద్ధపరుస్తుంటాయి.

  ఆస్ట్రేలియా వంటి ఆధునిక దేశాలలో పందులు చాలా పరిశుద్ధమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంలో పందుల పెంపుదల జరుగుతుంది కదా అని కొందరు వాదించవచ్చు. ఆలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో కూడా పందులను మందలు మందలుగా ఉంచుతారు. మీరు వాటిని ఎంత పరిశుద్ధంగా ఉంచాలనుకున్నా, అవి ప్రకృతి సహజంగా మురికి జంతువులు. అవి తమ స్వంత మలమును తినటమే కాకుండా ఇరుగు పొరుగు మలమును కూడా తింటూ ఎంజాయి చేస్తాయి.

  6. అస్సలు సిగ్గూ లజ్జా లేని జంతువులలో పంది ఇతర వాటి కంటే ఎంతో దిగజారి పోయి ఉంది.

  ఈ భూమిపై ఏమాత్రం సిగ్గూ లజ్జాలేని జంతువు పంది. తన సహవాసితో వ్యభిచరించమని స్వయంగా తోటి మిత్రులను పిలిచే ఏకైక జంతువు పంది. అమెరికాలో అనేకమంది పందిమాంసం తింటారు. డాన్సు పార్టీల తర్వాత, అక్కడ చాలా మంది తమ భార్యలను మార్చుకుంటారు అంటే "నువ్వు నా భార్యతో పడుకో, నేను నీ భార్యతో పడుకుంటాను" అంటారు. పందిమాంసం తింటే, పంది లాగానే ప్రవర్తిస్తారు కదా. అమెరికా చాలా అభివృద్ధి చెందిన మరియు అధునాతనమైన దేశంగా మన భారతీయులు పరిగణిస్తారు. వారేమి చేస్తారో, దానినే కొన్నేళ్ళ తర్వాత మన వాళ్ళు కూడా అనుసరిస్తారు. ఐస్ లాండ్ మ్యాగజైన్ (Island magazine) లో ప్రచురించబడిన ఒక వ్యాసం ప్రకారం ఇలాంటి అలవాటు ముంబాయిలోని భాగ్యవంతులలో మామూలై పోయింది. (అంతేగాక, భార్యలను మార్చుకోవటం నావికాదళ ఆఫీసర్లలో మామూలు విషయమై పోయిందనే వార్త దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తాపత్రికలలో ప్రచురించిబడింది.)

  6. ఇస్లాం ధర్మంలో మద్యపానం ఎందుకు నిషేధించబడింది?

  అనంతకాలం నుండి మానవ సమాజాన్ని పీడిస్తున్న ఉపద్రవాల లిష్టులో మద్యపానం కూడా ఉన్నది. ఒకటి. ప్రపంచ మంతటా అది లెక్కించలేనన్ని ప్రాణాలు తీసుకుంటున్నది మరియు మిలియన్ల కొద్దీ జనాలను తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తున్నది. సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మద్యపానమే మూలకారణం. ప్రపంచ వ్యాప్తంగా ఆకాశాన్ని అందుకుంటున్న నేరాల సంఖ్య, పెరుగుతున్న మానసిక వ్యాధులు మరియు బీటలు వారుతున్న మిలియన్ల కొద్దీ ఇళ్ళూ ఈ మద్యపానం యొక్క భయంకర వినాశక శక్తికి మూగ నిదర్శనాలు.

  1. ఖుర్ఆన్ లో మద్యపాన నిషేధం గురించి :

  క్రింది వచనంలో మద్యపానం సేవించడాన్ని దివ్యఖుర్ఆన్ నిషేధిస్తున్నది:

  "ఓ విశ్వాసులారా! మత్తు పదార్థాలు, జూదం, ఉంగరం రాళ్ళు, అదృష్టదురదృష్టాలు తెలుసుకోవాలని వేసే బాణాలు మొదలైనవి షైతాను చేతి దుష్ట కార్యాల లోనివి. వాటి నుండి దూరంగా ఉండటం ద్వారా మీరు సాఫల్యవంతులు కావచ్చు. " [దివ్యఖుర్ఆన్ 5:90]

  1. బైబిల్ గ్రంథంలో మద్యపాన నిషేధం:

  క్రింది వచనాలలో మద్యపానం సేవించడాన్ని బైబిల్ గ్రంథం నిషేధిస్తున్నది :

  a. "ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానము లేనివారు." [సామెతలు - Proverbs 20:1]

  b. "మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు." [ఎఫెసీయులకు - Ephesians 5:18]

  1. మద్యం నియామక నాడీ కేంద్రాన్ని (inhibitory centre) అడ్డుకుంటుంది.

  మానవుడి మెదడు ‘ఒక నియామక నాడీ కేంద్రాన్ని’ కలిగి ఉంటుంది. అది మానవుడిని అతడు చెడుపనులని భావించే పనులను చేయకుండా ఆపుతుంది. ఉదాహరణకు – మామూలుగా ఒక వ్యక్తి తన తల్లిదండ్రులను లేక పెద్దలను సంబోధించేటప్పుడు అసభ్యకరమైన భాష వాడడు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి మలమూత్ర విసర్జన చేయవలసి వస్తే, అతడు పబ్లిక్ ప్రాంతాలలో చేయకుండా అది నిరోధిస్తున్నది. కాబట్టి అతడు టాయిలెట్లను వినియోగిస్తాడు.

  ఎవరైనా వ్యక్తి మద్యం సేవించినపుడు, అతడి నియామక నాడీ కేంద్రం పనిచేయటం ఆపేస్తుంది. అందువలననే మద్యం సేవించినపుడు, అతడు తన మామూలు ప్రవర్తనకు విరుద్ధంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు ఆలాంటి స్థితిలోని ఒక తాగుబోతు తన తల్లిదండ్రులను సంబోధిస్తున్నపుడు, అసభ్యకరమైన భాష వాడతాడు. తన తప్పును గ్రహించడు. చాలా మంది తాగుబోతులు తమ బట్టలలోనే పాసు పోసుకుంటారు, సరిగ్గా మాట్లాడలేరు మరియు నడవలేరు. అసభ్యకరంగా ప్రవర్తిస్తారు కూడా.

  1. వ్యభిచారం, మానభంగాలు, అసభ్యకరమైన ప్రవర్తన మరియు ఎయిడ్స్ వంటివి తాగుబోతుల్లో సర్వసాధారణం:

  అమెరికాలోని జస్టిస్ విభాగానికి చెందిన నేషనల్ క్రైమ్ విక్టిమైజేషన్ సర్వే బ్యూరో ఆఫ్ జస్టిస్ (National Crime Victimization Survey Bureau of Justice, ﷻ‬.S. Department of Justice) ప్రకారం, కేవలం 1996వ సంవత్సరలోనే సగటున2,713 రేప్ కేసులు జరిగినాయి. రేప్ చేసిన సమయంలో చాలా మంది రేపిష్టుల మద్యం మత్తులో ఉన్నారని సంఖ్యలు తెలుపుతున్నాయి. అసభ్యకరంగా ప్రవర్తించిన కేసుల విషయంలో కూడా ఇలాగే ఉంది.

  గణాంకశాస్త్ర లెక్కల ప్రకారం, దాదాపు 8% అమెరికన్లు అంటే 12 లేదా 13 మంది అమెరికన్లలో ఒకరు వివాహేతర సంబంధాలు కలిగిఉన్నారు. దాదాపు ఆ కేసులన్నింటిలో ఇద్దరూ లేదా ఇద్దరిలో ఒకరు మత్తుపదార్థాలు సేవించేవారే.

  అత్యంత భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి యొక్క ప్రధాన కారణాలలో ఒక ముఖ్యమైన కారణం మద్యపానం.

  1. ప్రతి తాగుబోతు ఆరంభంలో నలుగురితో కలిసి తాగినవాడే.

  తాము ‘సోషల్ డ్రింకర్ల’ మని గొప్పగా చెప్పుకుంటూ చాలా మంది తాగుబోతులు మద్యపానాన్ని సమర్థిస్తూ వాదిస్తుంటారు. తాము ఒకటి లేదా రెండు పెగ్గులు మాత్రమే తీసుకుంటామని మరియు తమకు సెల్ఫ్ కంట్రోలు (స్వయం నియంత్రణ) ఉండటం వలన తామెప్పుడూ తాగుబోతులుగా మారమని దావా చేస్తుంటారు. అయితే ప్రతి తాగుబోతు సోషల్ డ్రింకర్ గానే మద్యం తాగటం మొదలు పెట్టాడని పరిశోధనలు తెలుపుతున్నాయి. తాను మద్యం మత్తులో మునిగి పోవాలి లేదా తాగుబోతుగా మారాలి అనే సంకల్పంతో ఏ తాగుబోతూ మద్యం త్రాగడం మొదలు పెట్టలేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగుతున్నాను, అయినా నా సెల్ఫ్ కంట్రోల్ కారణంగా మద్యం మత్తులో పూర్తిగా మునిగి పోయేటంత ఎక్కువగా నేనెన్నడూ మద్యం సేవించలేదని చెప్పగలిగే సోషల్ డ్రింకర్ ఒక్కడూ లేడు.

  1. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఒక్కసారి మత్తులో పూర్తిగా మునిగిపోయి, ఏదైనా సిగ్గుమాలిన పని చేస్తే, అది అతనితో జీవితాంతం ఉండిపోతుంది.

  ఒక సోషల్ డ్రింకర్ ఒకసారి సెల్ఫ్ కంట్రోల్ కోల్పోయి, ఆ మత్తులో మానభంగానికి లేదా అత్యాచారానికి పాల్బడ్డాడని భావిద్దాం. మత్తు దిగిన తర్వాత తను చేసిన తప్పు గ్రహించి అతడు పశ్చాత్తాప పడినా, చేసిన దోషము జీవితాంతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. బలాత్కారం చేసిన వ్యక్తి మరియు బలాత్కారానికి గురైన వ్యక్తి – ఇద్దరికీ చక్కబెట్టలేనంత మరియు చెరపి వేయలేనంత ఎక్కువ నష్టం జరుగుతుంది.

  1. అనేక హదీథులలో మద్యపానం నిషేధించబడింది.

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు:

  a. సునన్ ఇబ్నె మాజా 3వ గ్రంథం, 30వ అధ్యాయంలోని 3371వ హదీథు.

  "అన్ని చెడుల తల్లి మద్యపానం మరియు అన్ని చెడుపనులలో అత్యంత సిగ్గుమాలిన పని."

  b. సునన్ ఇబ్నె మాజా 3వ గ్రంథం, 30వ అధ్యాయంలోని 3392వ హదీథు.

  "మత్తు కలిగించేది ఏదైనా సరే నిషేధించబడింది – అది చిన్న మోతాదులో ఉన్నా సరే."

  కాబట్టి, తక్కువ – ఎక్కువ అనే ప్రశ్నే లేదు, ఏ మోతాదులోనైనా సరే మత్తు పదార్థాలన్నీ నిషేధించబడినాయి.

  c. కేవలం మద్యం త్రాగేవాళ్ళు మాత్రమే శపించబడలేదు, దానితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అల్లాహ్ చే శపించబడినారు.

  సునన్ ఇబ్నె మాజా 3వ గ్రంథం, 30వ అధ్యాయంలోని 3380.

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారని అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు:

  "మద్యపానంతో సంబంధం ఉన్న పది వర్గాల ప్రజలను అల్లాహ్ శపించుగాక! ఎవరైతే దానిని బట్టీలో తయారు చేస్తారో మరియు ఎవరి కొరకైతే అది బట్టీలో తయారు చేయబడిందో; ఎవరైతే దానిని సేవిస్తారో; ఎవరైతే దానిని సప్లయి చేస్తారో, ఎవరి కొరకైతే అది చేరవేయబడుతుందో; ఎవరైతే దానిని అందజేస్తారో; ఎవరైతే దానిని అమ్ముతారో; ఎవరైతే దాని ద్వారా వచ్చిన ఆదాయంతో లాభపడతారో; ఎవరైతే దానిని కొంటారో లేదా ఎవరైతే ఇతరుల కొరకు దానిని కొంటారో."

  1. మద్యపానంతో ముడిపడి ఉన్న రోగాలు:

  మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు అంటే మద్యపానం ఎందుకు నిషేధించబడాలో తెలిపే అనేక వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇతర కారణాల వలన సంభవించే చావుల కంటే మద్యపానం వలన సంభవించే మరణాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం మిలియన్ల కొద్దీ జనాలు మద్యపానం సేవించడం వలన చనిపోతున్నారు. మద్యపానం వలన జరిగే చెడు గురించి లోతుగా పోనవసరం లేదు, ఎందుకంటే వాటిలో అనేక చెడుల గురించి అందరికీ తెలుసు. మద్యపానం వలన వచ్చే రోగాల ఒక చిన్న లిష్టు క్రింద ఉన్నది:

  1. యకృత్సంకోచం అనే కాలేయ సంబంధమైన రోగం (Cirrhosis of Liver) మద్యపానం వలన వచ్చే రోగాలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది.

  2. ఇతర రోగాలు – కంఠనాళిక అంటే అన్నవాహిక (Cancer of Oesophagus) లో వచ్చే క్యాన్సర్, తల మరియు మెడ లో వచ్చే క్సాన్సర్ (Cancer of Head and Neck), కాలేయానికి వచ్చే హెపటోమ అనే క్యాన్సర్ (Cancer of Liver, Hepatoma), పేగులలో వచ్చే క్యాన్సర్ (Cancer of Bowel), etc.

  3. అన్ననాళశోథ (Oesophagitis), జీర్ణాశయశోథ (Gastritis), క్లోమశోథ (Pancreatitis) మరియు కాలేయశోథ (Hepatitis) మొదలైన వ్యాధుల సంబంధం తిన్నగా మద్యపానంతో ముడిపడి ఉంది.

  4. హృదయజనిత వ్యాధి (Cardiomyopathy), అధిక రక్తపోటు (Hypertension), హద్ధమని (Coronary Artherosclerosis), గుండెపోటు (Angina) మరియు హార్ట్ ఎటాక్ (Heart Attack) మొదలైన రోగాలకు అధిక మోతాదులో తరచుగా మద్యపానంతో దగ్గరి సంబంధం ఉంది.

  5. స్ట్రోకులు (Strokes), రక్తఘాతం (Apoplexy), మూర్ఛరోగం (Fits) మరియు రకరకాల పక్షవాతం మొదలైన రోగాలకు ఒక ముఖ్యకారణం – మద్యపానమే.

  6. స్వతంత్ర నాడీ మండల/ నరాల వ్యాధి (Peripheral Neuropathy), క్షయరోగం (Cortical Atrophy), చిన్న మెదడు క్షీణత (Cerebellar Atrophy) మొదలైనవి మద్యపానం వలన వచ్చే రోగాలని అందరికీ తెలిసిందే.

  7. ఇటీవలి సంఘటనలు మరియు సంభాషణలు మరిచిపోయే వెర్నికీ – కార్కోఫ్ (Wernicke – Korsakoff) సిండ్రోమ్ మరియు జ్ఞాపకశక్తి పాత సంఘటనల చుట్టూ మాత్రమే పరిమితం చేసే రకరకాల పక్షవాతం మొదలైనవి ఎక్కువ మద్యం త్రాగడం ద్వారా ఏర్పడే తియామిన్ (thiamine) కొరత వలన వస్తాయి.

  8. ఉబ్బువాత వ్యాధి (Beriberi) మరియు ఇతర లోపాలు మద్యం త్రాగే వాళ్ళలో సర్వసాధారణం. వారికి పెల్లాగ్రా (Pellagra) అనే వ్యాధి కూడా వస్తుంది.

  9. డెలెరియమ్ ట్రెమెన్స్ (Delerium Tremens) అనేది ఒక గంభీరమైన క్లిష్టసమస్య. దీనికి సాధారణంగా త్రాగుబోతులు తమకు వచ్చిన అంటువ్యాధుల నుండి కోలుకుంటున్నప్పుడు లేదా ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత కోలుకుంటున్నప్పుడు గురవుతారు. విసర్జన సమయంలో ఉపసంహరణ ప్రభావాన్ని చూపుతూ కూడా ఇది సంభవిస్తుంది. ఇది చాలా గంభీరమైనది. సరైన చోట ట్రీట్మెంటు చేయించుకోక పోతే, దీని వలన చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

  10. మైక్సోడెమా నుండి హైపర్ థైరాయిడిసమ్ మరియు ఫ్లోరిడ్ కుషింగ్ సిండ్రోమ్ వరకు వివిధ నిర్వాహిక గ్రంథుల (తైరాయిడ్ గ్రంథి, స్వాదు పిండ గ్రంథి మొదలైనవి) అస్తవ్యస్తతలకు మద్యపానంతో సంబంధం ఉంది.

  11. హెమటోలాజికలుల చెడు ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది మరియు రకరకాలుగా ఉంటుంది. మద్యపానం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలలో ఫోలిక్ యాసిడ్ (Folic acid) కొరత సర్వసాధారణం. దీని లోపం కారణంగా మాక్రోటిక్ పాండురోగం (Macrocytic Anemia) వచ్చే అవకాశం ఉంది. మద్యపానం యొక్క చెడు ప్రభావాన్ని అనుసరించి వచ్చే రోగాలలో జైవ్ సిండ్రోమ్ (Zeive’s syndrome) అనేది హెమోలైటిక్ పాండురోగం, జౌడిస్ మరియు హైపర్లిపేడిమాయియ (Hemolytic Anemia, Jaundice and Hyperlipaedemia) ల త్రయంలోనిది.

  12. మద్యం త్రాగే వారిలో తరుచుగా థ్రొమంబోసైటొపెనియా (Thrombocytopenia) మరియు ఇతర సూక్ష్మ రక్త ఫలకాల వైపరీత్యం కనబడుతూ ఉంటుంది.

  13. సాధారణంగా వాడే మెట్రొనిడజోల్ (ఫ్లాజిల్) అనే టాబ్లెట్ మద్యం సేవించే వారితో చాలా చెడ్డగా ప్రతిస్పందిస్తుంది.

  14. నిరంతరం మద్యం త్రాగే వారిలో మాటిమాటికీ వచ్చే అంటురోగాలు సర్వసాధారణం. మద్యం త్రాగటం వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.

  15. మద్యం త్రాగే వారిలో వచ్చే గుండె వ్యాధులు అందరికీ తెలిసినవే. వారిలో ఊపిరితిత్తుల వాపు వ్యాధి (Pneumonia), ఊపిరితిత్తుల అబ్సెస్ (Lung Abcess), చిన్న చిన్న కురుపులు (Emphysema) మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధి (Pulmonary Tuberculosis) మొదలైనవి సర్వసాధారణం.

  16. మితిమీరి మద్యం త్రాగటం, మత్తుమందులు తీసుకోవటం వలన సాధారణంగా వాంతులు చేసుకుంటారు. దగ్గుతూ ఉంటారు. శక్తి కోల్పోయి పక్షవాతానికి గురవుతారు. వాంతి తేలికగా ఊపిరితిత్తులలోనికి పోయి, న్యూమోనియా లేదా ఊపిరితిత్తుల అబ్సెస్ (Lung Abscess) రావటానికి కారణమవుతుంది. అప్పుడప్పుడు త్రాగటం వలన శ్వాస ఆడక, చనిపోయే ప్రమాదం ఉంది.

  17. స్త్రీలపై మద్యపానం యొక్క ప్రభావం ప్రత్యేకంగా పేర్కొనదగింది. మద్యపానం వలన కాలేయ సంబంధిత రోగాలు (Cirrhosis) పురుషుల కంటే స్త్రీలకు త్వరగా వస్తాయి. గర్భంతో ఉన్నప్పుడు, మద్యపానం పిండంపై తీవ్రమైన హానికర ప్రభావం చూపుతుంది. వైద్య వృత్తిలో పిండ సంబంధిత మద్యం సిండ్రోమ్ (Foetal Alcohol Syndrome) గుర్తింపు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నది.

  18. చర్మవ్యాధుల సంబంధం కూడా మద్యపానంతోనే ఉన్నది.

  19. గజ్జి (Eczema), జుట్టు ఊడటం (Alopecia), గోళ్ళ పోషణ దోషం (Nail Dystrophy), గోళ్ళ చుట్టూ వచ్చే చర్మవ్యాధులు (Paronychia) మరియు కోణాకారం నోటి లోపలి పుండు (Angular Stomatitis) మొదలైనవి మద్యం త్రాగేవాళ్ళలో సర్వసాధారణం.

  20. మద్యపానం - ఒక వ్యాధి, రోగము.

  ఈమధ్య వైద్యులు మద్యం త్రాగేవాళ్ళతో ఉదారంగా ప్రవర్తించడం మాని, మద్యపానం అనేది ఒక వ్యసనం, దురలవాటు కాదు, అదొక వ్యాధి, రోగము అని చెబుతున్నారు.

  ది ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (The Islamic Research Foundation) ప్రచురించిన ఒక కరపత్రంలో ఇలా ఉంది:

  ఒకవేళ మద్యపానాన్ని ఒక రోగం, వ్యాధి అని అయితే, ఆ వ్యాధి:

  - సీసాలలో అమ్మబడుతుంది

  - వార్తాపత్రికలలో, వారపత్రికలలో, రేడియో మరియు టెలివిజన్ లలో ప్రచారం చేయబడుతుంది.

  - దానిని వ్యాపింపజేసే షాపులకు గవర్నమెంటు అధికారిక లైసెన్సు కూడా ఇస్తుంది.

  - రహదారులలో భయంకర ప్రమాదాలు, చావులు తెస్తుంది.

  - ఫ్యామిలీ లైఫ్ ను నాశనం చేస్తుంది మరియు నేరాలను పెంచుతుంది.

  - ఆ రోగానికి సూక్ష్మజీవులు లేదా వైరస్ కారణం కాదు.

  మద్యపానం ఒక రోగం, వ్యాధి కాదు – అది షైతాన్ యొక్క చేతిపని

  ఈ షైతాను యొక్క ఉచ్చు గురించి మహోన్నతుడైన అల్లాహ్ తన అనంత వివేకం ద్వారా ముందుగానే హెచ్చరించినాడు. మానవుల ‘దీనుల్ ఫిత్రహ్ అంటే సహజ ధర్మం’ ఇస్లాం ధర్మం. దానిలోని ఆదేశాలన్నింటి లక్ష్యం మానవుడి సహజ స్వభావాన్ని కాపాడటమే. ఈ సహజ స్థితి నుండి మద్యపానం మానవుడిని మరియు సమాజాన్ని తప్పుడు దారి పట్టిస్తుంది. జంతువుల కంటే తను ఎంతో గొప్పవాడినని మానవుడు వాదిస్తుంటాడు. అయితే మద్యపానం మానవుడిని జంతువుల కంటే హీనమైన స్థితికి దిగజార్చుతుంది. కాబట్టి ఇస్లాం ధర్మం మద్యపానాన్ని నిషేధిస్తున్నది.

  ఫీడ్ బ్యాక్