معلومات المواد باللغة العربية

అబ్దుల్లాహ్ రెడ్డి - పుస్తకాలు

అంశాల సంఖ్య: 2

  • తెలుగు

    దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు.

  • తెలుగు

    అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.