• తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

  • తెలుగు

    అనువాదకుడు, అంశాల సంఖ్య : 1

  • తెలుగు
  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ముహమ్మద్ బిన్ ఔద్ జాయద్ అల్ హరబావీ: జామియహ్ అల్ అజ్హర్ లోని ఇస్లామీయ విద్యాభ్యాస కాలేజీలో చదువుకున్నారు. ఖిర్ఆత్ లో ఉన్నత డిగ్రీలు సంపాదించారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయం నుండి ఖిర్ఆత్ లో స్పెషలైజేషన్ చేసారు. తర్వాత ఖిర్ఆత్ లో మాస్టర్స్ మరియు పి.హెచ్.డి చేసారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయంలో రెండేళ్ళ పాటు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. సౌదీ అరేబియాలోని మదారిస్ అత్తాలీమ్ అల్ ఆమ్ లో బోధించసాగారు. తర్వాత రియాద్ పట్టణంలోని టీచర్ల కాలేజీలో ఖిర్ఆత్ విద్యను బోధిస్తూ, సేవలందించారు. ఖిర్ఆత్ గురించి ఆయన పుస్తకాలు రచించారు. వాటిలో కొన్ని: • التسهيل فيما يشتبه على القارئ من آي التنزيل، • الضياء اللامع في بيان رواية ورش عن نافع، • إرشاد القراء إلى قراءة الكسائي، • مفردات القراء العشرة من طريق الشاطبية والدرة، • شرح متن الروضات في قراءة حمزة الزيات، • رواية شعبة من طريق الشاطبية والدرة

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పేరు మూసా బిలాల్. మక్కాలోని జామియ అన్నూర్ లో ఆయన ఇమాం, ఖతీబ్, ఖుర్ఆన్ యొక్క ఖిరఆత్ అల్ అష్రహ్ యొక్క ఉపాధ్యాయుడు. 1420 మరియు 1433 సంవత్సరాలలో దుబాయ్ లో ప్రతిసంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనాకర్తల పోటీ విజేతలను ఎంపిక చేసే బృందంలో సభ్యుడుగా ఉండినారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1949లో ఔలాద్ అల్ ఆలిమ్ ప్రాంతంలో జన్మించారు. షేఖ్ ముహమ్మద్ అల్ ఆలిమ్ వద్ద ఖుర్ఆన్ విద్య నభ్యసించారు. తర్వాత లిబియాలోని మఆహద్ అల్ అస్మరీలో చేరారు. అక్కడ ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసి, తరాబ్లస్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ తన చదువు ముందుకు కొనసాగించేందుకు ఆయన మాలిక్ బిన్ అనస్ మఆహద్ లో చేరి, ప్రైమరీ మరియు సెకండరీ టీచర్ డిప్లొమాను 1972లో సంపాదించారు. తర్వాత టీచర్ గా అల్ ఇదాదియ్యహ్ బిత్తాలీమ్ అల్ ఆమ్ లో పనిచేసారు. 1978లో జామియ ఇస్లామీయ, అల్ బైదా నుండి దూరవిద్య ద్వారా ఇస్లామీయ షరిఅహ్ లో పట్టభద్రులయ్యారు. తర్వాత తరాబ్లస్ లోని జామియ బిలామీన్ లో ఇమాం, ఖతీబ్, ఉపాధ్యాయులుగా పనిచేసారు. 1994లో ఆయన అనేక ధర్మప్రచార సంస్థలలో మరియు ఖుర్ఆన్ విద్యను బోధించే సంస్థలలో పనిచేసారు. 1998 నుండి 2000 వరకు ఇస్లామీయ మంత్రిత్వశాఖలో జనరల్ మేనేజర్ గా పనిచేసారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. ఆయన స్వరం ఎంతో మృధు మధురంగా ఉంటుంది. ఖిర్ఆత్ అష్రహ్ నైపుణ్యం ఉన్నవారు. వేర్వేరు రివాయతులలో ఖుర్ఆన్ పఠించగలరు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 6

    ఆయన పూర్తి పేరు అబూ అజ్ జుబైర్ బిన్ తాలిబ్ బిన్ అబ్దుల్ హమీద్ బిన్ అల్ ముజఫ్ఫర్ ఖాన్. రియాద్ పట్టణంలో ఆయన హిజ్రీ 1401 సంవత్సరంలో జన్మించారు. రియాద్ పట్టణంలోని ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ ఇస్లామీయ విశ్వవిద్యాలయంలో పట్టభద్రులయ్యారు. హిజ్రీ1434వ సంవత్సరం నుండి రమదాన్ నెలలలో మదీనా మునవ్వరహ్ లోని మస్జిదె నబవీలో తరావీహ్ మరియు ఖియాముల్ లైల్ నమాజులకు ఇమామత్ అంటే నాయకత్వం చేసే సుదవకాశం ఆయనకు లభించింది. మస్జిదె నబవీలో ఇమామ్ గా నియమిస్తూ క్రీ.శ. 2013వ సంవత్సరం అక్టోబరు 9వ తేదీ బుధవారం అంటే దుల్ హజ్ నెల 4వ తేదీ హిజ్రీ 1434వ సంవత్సరం నాడు ఖాదిమైన్ హరమైన షరీఫ్ రాయల్ డిక్రీ జారీ చేసినారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 6

    ఆయన పూర్తి పేరు బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ బలీలహ్. హిజ్రీ 1395వ సంవత్సరంలో మక్కాలో జన్మించారు. అక్కడే ఆయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ, పట్టభద్రులయ్యారు. హిజ్రీ 1422వ సంవత్సరంలో ఆయన ఉమ్ముల్ ఖురఅ ఇస్లామీయ విశ్వవిద్యాలయం, మక్కా లోని ఇస్లామీయ షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసారు. హిజ్రీ 1429వ సంవత్సరంలో మదీనాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి ఫిఖ్ హ్ లో పి.హెచ్.డీ పూర్తి చేసారు. అల్ హరమ్ అల్ మక్కీలో ఫిఖ్ హ్ విభాగంలో ఉపాధ్యాయులుగా పనిచేయసాగారు. తాయిఫ్ లోని విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసారు. మక్కాలోని హయ్యల్ అజీజియహ్ లో ఉన్న అల్ అమీరత్ నౌఫ్ జామియహ్ మస్జిదులో, తర్వాత ఇబ్నె బాజ్ జామియహ్ మస్జిద్ లో ఇమామ్ గా పనిచేసిన తర్వాత, 12/9/1434 తేదీన మస్జిద్ అల్ హరమ్ ఇమాం గా నియుక్తులయ్యారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    మగ్రిబ్ కు చెందిన ప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్త అద్దరీర్ ముస్తపా గరబీ. ఖిరాత్ లో ఉద్ధండుడు అంటే షేఖుల్ ఖుర్రా గా ప్రసిద్ధ చెందినారు. ఆయన అష్షరాకీ ఖబీలా నాయకుల వంశంలో పుట్టారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    లిబియాలో జన్మించారు. దుబాయ్ లో ప్రతి సంవత్సరం జరిగే ఖుర్ఆన్ పఠనం పోటీలలో ఆయన రెండవ స్థానం సంపాదించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖుర్ఆన్ ఖారీ, యమనీ దేశస్థుడు, అల్ హదీద్ లోని జామియ (ఉసామహ్ బిన్ జైద్) తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ఇంకా అల్ హదీద్ లోని మఆహద్ (అల్ నూర్) అల్ ఇల్మీ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ప్రస్తుతం యమన్ దేశ రాజధాని సనాఅ లోని జామియహ్ అల్ ఉలూమ్ వ టెక్నాలజీ లో విద్యాభ్యాసం చేస్తున్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1963లో మొరాకో దేశంలో జన్మించారు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠోపాఠం చేసారు. దారుల్ బైదాఅ విద్యాసంస్థలలో నుండి హిజ్రీ 1413వ సంవత్సరం రబియ అత్ తానీ నెల 24వ తేదీ అంటే 1992వ సంత్సరం అక్టోబరు నెల 22వ తేదీన చేరినారు. దారుల్ బైద్అలోని అస్సబీల్ బయీన్ అల్ షఖ్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. ఖుర్ఆన్ సొసైటీలలో సభ్యులయ్యారు. 2005వ సంవత్సరం అల్ మసీరతుల్ ఖురానీయ్యహ్ లో మరియు 2010లో అల్ ముస్హఫ్ సున్నతులో సభ్యులయ్యారు. హిఫ్స్ అల్ ఖుర్ఆన్ బైతక్ (احفظ القرآن في بيتك) అనే ఆయన ప్రాజెక్టు ఖుర్ఆన్ కంఠస్థం చేయాలనుకున్న వారికి జామియహ్ అల్ షరాహ్ మస్జిద్ నుండి ప్రత్యేక సేవలందించింది. ఆయన అనేక పద్ధతులలో చక్కటి ఖిర్ఆత్ తో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1967లో మొరాకోలోని ఆసిఫీ పట్టణంలో జన్మించారు. ఆయన దారుల్ బైదఅ పట్టణం, హయ్యల్ అనాసీలోని మస్జిద్ (అందలూస్)లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. ఆదాబ్ సబ్జెక్టులో పట్టభద్రులయ్యారు. మొరాకోలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు అంటే ఖారీలలో ఆయన కూడా ఒకరు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    జజాయిర్ దేశానికి చెందిన ఖారీ. రివాయత్ వర్ష్ అన్ నాఫియీ, అల్ అస్బహానీ పద్ధతిలో ఖుర్ఆన్ పఠనంలో ప్రావీణ్యం సంపాదించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖారీ అబ్దుల్ అలీ బిన్ తాహిర్ అఅనూన్. మగ్రిబ్ లోని ఫాస్ పట్టణంలో 1947లో జన్మించారు. వర్ష్ అన్ నాఫియీ రివాయతులో అల్ అబిహానీ పద్ధతిలో షేఖ్ అహ్మద్ బిన్ ఉథ్మాన్ అబూ అల్ ఆలా నుండి ఖుర్ఆన్ పఠనం అనుమతి పొందారు. తజ్వీద్ లో ఉద్ధండులు. తజ్వీద్ విద్య ను అభ్యసించారు. లజ్న తహ్కీమ్ లి తిలావతుల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన కైఫ నురత్తిలల్ ఖుర్ఆన్ బిరివాయతు వర్ష్ అన్ నాఫియీ మిన్ తరీఖ్ అల్ అజ్రఖ్ అనే పుస్తకం వ్రాసినారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖారీ యాసీన్ ఫఖియ్యహ్ అల్ జజాయిరీ. జజాయిర్ రాజధాని పట్టణంలోని హయ్యల్ హరాష్ లో 1969లో జన్మించారు. ఆయన బువైరహ్ దేశ కుటుంబానికి చెందుతారు. కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఉసూల్ అద్దీన్ లో కూడా. జజాయిర్ లో అల్ అజ్రఖ్ పద్ధతిలో రివాయత్ వర్ష్ లో ఖుర్ఆన్ పఠనం రికార్డు చేసిన మొట్టమొదటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన మస్జిద్ అబూ ఉబైదహ్ బిన్ జర్రాహ్, బల్దియహ్ బాష్ జరాహ్ అల్ ఆసమియ్యహ్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    మగ్రిబ్ కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    అల్ మగ్రిబ్ లోని ఖుర్ఆన్ పఠనాకర్తల పండితులలో ఒకరు

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ అష్ షువైఈ - సౌదీ అరేబీయాలోని పవిత్ర ఖుర్ఆన్ మరియు సైన్సెస్ సొసైటీ సభ్యుడు, రియాద్ నగరంలోని అతీఖహ్ ప్రాంతంలో ఉన్న అమీర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ మస్జిద్ యొక్క ఇమాం.