ఆయన పూర్తి పేరు అల్ హుస్సైనీ అల్ సయ్యద్ అలీ అబ్దుల్ గనీ అల్ అజాజీ. ఈజిప్టు దేశస్థులు. 1956వ సంవత్సరం డిసెంబరు 5వ తేదీన జన్మించారు. 1986 - 1987 వ సంవత్సరంలో జామియ అజ్ హర్ అష్షరీఫ్ నుండి ఖిరాత్ విభాగంలో ఖిరాత్ స్పెషలైజేషన్ తో ఉన్నత విద్యాఖ్యాసం పూర్తి చేసారు. అష్షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అల్ అష్రరహ్ లో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అష్షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో యోగ్యత సంపాదించారు. అత్తయ్యబహ్ (అల్ ఖస్ర్ ఫీ అల్ ముంఫసల్) పద్ధతిలో హఫ్స్ అన్ ఇమాం ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పఠనంలో కూడా యోగ్యులయ్యారు. చిన్న పిల్లలకు ఖుర్ఆన్ బోధించే ఉపాధ్యాయుల కోసం మంచి పుస్తకం వ్రాసినారు. ముస్హఫ్ మురత్తిల్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ బిల్ తూసత్ ఫీ అల్ ముంఫసల్ రచించారు. వర్ష్ అన్ నాఫియీ పద్ధతిలో ముస్హఫ్ రచించారు. మజ్ద్ ఛానెల్ కోసం ఖుర్ఆన్ సిడీ తయారు చేసారు. ఖుర్ఆన్ కరీమ్ ఎలా బోదించాలి అనే అంశంపై పుస్తకం వ్రాసినారు. తిలావత్ నియమ నిబంధనల గురించి పుస్తకం వ్రాసారు. అలాగే తజ్వీద్ నియమనిబంధనల గురించి కూడా పుస్తకం వ్రాసినారు.
ఆయన పూర్తి పేరు ఖారీ ఖలీఫహ్ మిస్బహ్ అహ్మద్ అత్తనీజీ. మర్కజ్ అల్ జైద్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్లో 13 ఏళ్ళ వయస్సులో షేఖ్ గులామ్ హుస్సేన్ వద్ద ఖుర్ఆన్ కంఠస్థం చేసారు. తర్వాత మదీనా మునవ్వరహ్ లో మస్జిదె నబవీ ఇమాం అయిన షేఖ్ ఇబ్రాహీమ్ అల్ అఖ్దర్ వద్ద హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు. వర్ష్ మరియు ఖాలూన్ అన్ నాఫియి రివాయతులలో షేఖ్ డాక్టర్ ముహమ్మద్ అస్సామ్ అల్ ఖదాహ్ వద్ద ఖుర్ఆన్ పారాయణం నేర్చుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ లో ఆయన 2001లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూనివర్శిటీ నుండి పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం ఆయన యు.ఎ.ఇ లో పబ్లిక్ వర్క్స డిపార్ట్ మెంటులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. షారిఖహ్ లోని దాదాపు 9 వేల ఖుర్ఆన్ విద్యార్థినీ విద్యార్థులు ఉన్న ఖుర్ఆన్ మరియు సున్నతు సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ మెంబరుగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణానికి చెందిన అబ్దుల్ కరీమ్ గారు చక్కని తెలుగులో ఇస్లాం ధర్మం గురించి అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఎలాంటి కల్పిత గాథలు లేకుండా, స్వచ్ఛమైన ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో మాత్రమే ఉపన్యసించడాన్ని ప్రజలు ఆయన ఉపన్యాసాల నుండి ప్రజలు స్పష్టంగా గుర్తించగలరు. అల్లాహ్ ఆయన సేవలు స్వీకరించుగాక మరియు ఆయనను కాపాడుగాక!
అబ్దుల్లాహ్ తాహా ముహమ్మద్ సర్బిల్ జోర్డాన్ దేశంలో 1979వ సంవత్సరం మే 10వ తేదీన జన్మించారు. 1999 వ సంవత్సరనం నుండి ఈ మధ్య మరణించే వరకు ఉమ్ముల్ మోమినీన్ మస్జిద్ లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. ఆయన విద్యాభ్యాసం - ఇస్లామీయ షరిఅహ్ లో ఉసూల్ అద్దీన్ స్పెషలైజేషన్ తో గ్యాడ్యుయేషన్ పూర్తి చేసారు. తఫ్సీర్ మరియు ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో ఇంటర్నేషనల్ ఇస్లామీయ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ చేసారు.
ఆయన పూర్తి పేరు ఖారీ అబ్దుర్రహ్మాన్ బిన్ అల్ ఔసీ. ఆయన జన్మతేదీ 1980/5/5. సౌదీ అరేబియాలోని అల్ ఖొబర్ కార్నిష్ లో ఉన్న మస్జిద్ ఇఖ్లాస్ లో ఇమాం మరియు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
మక్కా పట్టణంలోని సుప్రసిద్ధ ఖారీలలో ఆయన ఒకరు. సిరియా దేశస్థులు. ఖిర్ఆత్ మరియు వాటి సైన్సులలో ఉద్ధండులు. తన తండ్రి సయీద్ అల్ అబ్దుల్లాహ్ రహిమహుల్లాహ్ నుండి ఆయన ఖుర్ఆన్ విద్యలు నేర్చుకున్నారు. ఉమ్ముల్ ఖురఅ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసారు. అష్ షాతబీ పద్ధతిలో ఖిరఆత్ అష్రహ్ లో ప్రావీణ్యత సంపాదించారు.
ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అల్ బహీరహ్ ప్రాంతంలోని అల్ మహ్మూదియహ్ లో జన్మించారు. మఆహద్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. అక్కడ ఆయన అషరహ్ ఖిరఆత్ చదువుకున్నారు. ఇంకా ఉలూమ్ అల్ ఖుర్ఆన్ లో కూడా చదువుకున్నారు. న్యూయార్క్ లోని ఇస్లామీయ కేంద్రంలో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేస్తున్నారు.