ఎతేకాఫ్ షరతులు

వివరణ

ఎతేకాఫ్ పాటించటానికి అనుసరించవలసిన షరతులు - క్లుప్తంగా

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  شروط الاعتكاف

  ఎతేకాఫ్ అంటే కేవలం అల్లాహ్ కోసం మస్జిద్ లో గడిపే

  ఏకాంతవాసపు షరతులు

  ఎతేకాఫ్ షరతులు ఏమిటి? ఎతేకాఫ్ ఉండటానికి ఎతేకాఫ్ కూడా ఒక నియమమా? ముతకిఫ్ (ఎతేకాఫ్ పాటిస్తున్న వ్యక్తి) రోగస్థులను సందర్శించవచ్చునా లేదా ఆహ్వానాల్ని స్వీకరించవచ్చునా లేదా తన కుటుంబ అవసరాలను పూర్తిచేయ వచ్చునా లేదా అంత్యక్రియలలో పాల్గొనవచ్చునా లేదా ఏదైనా పని చేసుకోవటానికి వెళ్ళవచ్చునా?.

  సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును.

  సమూహంగా నమాజు జరిగే అంటే జమాఅత్ తో నమాజు జరిగే మస్జిద్ లోనే ఎతేకాఫ్ పాటించమని సూచించబడినది. ఎతేకాఫ్ పాటించే వ్యక్తి పై జుమా నమాజు (శుక్రవారపు నమాజు) తప్పని సరై ఉన్నట్లయితే మరియు ఎతేకాఫ్ ఉండాలనుకున్న సమయంలో శుక్రవారం వస్తున్నట్లయితే, ఎతేకాఫ్ పాటించే వ్యక్తి జుమా మస్జిద్ లోనే ఎతేకాఫ్ పాటించవలెను. ముతకిఫ్ (ఎతేకాఫ్ పాటించే వ్యక్తి) తప్పని సరిగా ఉపవాసం ఉండవలెననే షరతేమీ లేదు.

  ఎతేకాఫ్ సమయంలో ముతకిఫ్ రోగస్థులను సందర్శించకుండా ఉండటం, ఎటువంటి ఆహ్వానాలను స్వీకరించకపోవటం, కుటుంబ అవసరాలలో పాల్గొనకపోవటం, అంత్యక్రియలకు హాజరు కాకపోవటం, ఉద్యోగం లేక పనికోసం మస్జిద్ బయటకు వెళ్ళకపోవటం అనేవే సున్నత్ పద్ధతులు. దీనికి ఆధారం ఆయేషా రదియల్లాహు అన్హా ఉల్లేఖించిన ఈ హదీథ్: “ముతకిఫ్ కోసం సున్నత్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం) ఏమిటంటే - రోగస్థులను సందర్శించకపోవటం లేదా అంత్యక్రియలలో పాల్గొనకపోవటం లేదా ఏ స్త్రీనీ తాకకుండా ఉండటం లేక ఏకాంతంగా గడపకుండా ఉండటం (సంభోగం చేయకుండా ఉండటం) లేదా నిరోధించలేని పరిస్థితులలో తప్పితే మస్జిద్ బయటకు పోకుండా ఉండటం.” అబూ దావూద్ హదీథ్ గ్రంథం, 2473

  Standing Committee for Issuing Fatwas, Fataawa al-Lajnah, 10/410

  ఫీడ్ బ్యాక్