అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.
షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.
ప్రత్యేకమైన వేడుకోళ్ళతో అనారోగ్యాలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు మనకు బోధించి ఉన్నారు, హిస్నుల్ ముస్లిం అనే దుఆల పుస్తకం మనకు ముందు నుంచే తెలుసు, దానిలో అన్ని రకాల దుఆలు ఉంటాయి, అయితే ఈ చిరు పుస్తకం (హద్’యు న్నబి సల్లల్లాహు అలైహి వసల్లం)లో అనారోగ్యాలు మరియు కష్టాలకు సంబందించిన దుఆలను మాత్రమే పొందు పరచబడినవి, ప్రత్యేకించి కరోనా పరిస్తితులు నడుస్తున్న ఈ తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని మీ ముందుకు తీసుకు రావడం జరిగింది.
ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్న ఒక సంక్షిప్త కరపత్రం ఇది. ఇస్లాం ధర్మ ఐదు మూలసిద్ధాంతాలు, ఇస్లాం ధర్మంలోని ఆరాధనలు మరియు వాటి అసలు ఉద్దేశం, ఇస్లాం ధర్మ విశ్వాసం యొక్క ఆరు మూలసిద్ధాంతాలు మొదలైన వాటిపై దృష్టి సారిస్తున్నది. చాలా సులభరీతిలో, చక్కటి పదాలలో పై విషయాలన్నీ దీనిలో ప్రస్తావించబడినాయి.
ఈ వ్యాసం షేఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రచించిన హజ్, ఉమ్రహ్ మరియు జియారహ్ అనే పుస్తకం నుండి తీసుకోబడింది. ఈ సంక్షిప్త మరియు సింపుల్ పుస్తకంలో రచయిత, హజ్ మరియు ఉమ్రహ్ యొక్క ఆరాధనా ఆచరణలన్నీ చాలా స్పష్టంగా వివరించారు.