ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను.
అనేక ఇస్లామీయ పదాల వివరణ ఈ మొదటి తెలుగు నిఘంటువులో సమకూర్చబడినది. తెలుగులో ఇది మొదటి ఇస్లామీయ పద నిఘంటువు. దీనిలో ఇస్లామీయ పదాలు చాలా స్పష్టంగా వివరించబడినాయి. ఇది ప్రత్యేకంగా ముస్లిమేతరులకు మరియు క్రొత్తగా ఇస్లాం స్వీకరించిన వారికీ ఎక్కువగా ఉపయోగపడును. అరబీ లేదా ఉర్దూ తెలియని ముస్లింలకు కూడా ఇది బాగా ఉపయోగపడును. రాబోయే ప్రతులలో ఇంకా ఎక్కువ పదాలు చేర్చబడును. ఇన్షాఅల్లాహ్.