ఆయన ఖుర్ఆన్ పఠనాకర్త. మహ్మూద్ రషాద్ అల్ షీమీ, ఈజిప్టు దేశస్థుడు, ఈజిప్టు దేశపు రేడియోలో ఖుర్ఆన్ పఠించే గొప్ప ఖారీ, పది రకాలలో ఖుర్ఆన్ పఠించే ప్రావీణ్యం ఉన్న గొప్ప ఖారీ, మస్జిద్ మూదీ అల్ అమ్ర్ యొక్క ముఅద్దన్. నిఖాబతుల్ ఖుర్రా సొసైటీ సభ్యుడు
అబూ మఆలీ మహ్మూద్ షకరీ బిన్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ బిన్ అబీ అథనాఅ అల్ అలూసీ. 19.9.1273హి సంవత్సరంలో ఇరాఖ్ దేశపు ముఖ్యపట్టణమైన బాగ్దాద్ నగరంలో జన్మించారు.
ఆయన ఖారీ మిఫ్తాహ్ బిన్ ముహమ్మద్ బిన్ యూసుఫ్ బిన్ ఉమర్ అస్సల్తనీ. ఆయన లిబియాలోని బింగాజీ ప్రాంతంలో హిజ్రీ 1393వ సంవత్సరం రబ్బి అత్తానీ 19వ తేదీన అంటే క్రీ.శ. 1973వ సంవత్సరం మే నెల 21వ తేదీన జన్మించారు. బింగాజీలోని హిజ్రీ 1422వ సంవత్సరంలో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. వివిధ ఖిరఆత్ విద్యలలో ఈజిప్టు, సిరియా, షంఖీత్ మొదలైన దేశాలలోని అనేక మంది ప్రఖ్యాత ఖిర్ఆత్ పండితుల వద్ద నుండి ఆయన ఇజాజహ్ పొందినారు. అల్ అజ్హర్ విశ్వవిద్యాలయం మరియు లిబియాలోని ఖుర్ఆన్ విభాగాల జనరల్ కేంద్రాల నుండి ఆయన ఉన్నత ఖిర్ఆత్ విద్యలలో ఉత్తీర్ణులయ్యారు. వృత్తిపరంగా ఆయన ఇంటర్నిష్ట్ మరియు కిడ్నీ విభాగంలో డాక్టర్ మరియు కన్సల్టెంటు.