ఇస్లాం పరిచయం

అంశాల సంఖ్య: 31

 • ఈ క్రింది మూడు పరిస్థితులలో తప్ప ముస్లింల రక్తం చిందించడం నిషేధించబడింది. ఒకటి వ్యభిచారానికి పడే శిక్ష. రెండోది ఇతరులను హత్య చేసినందుకు విధించబడిన మరణశిక్ష, మూడోది ఇస్లాం ధర్మాన్ని విడిచి పెట్టి శత్రుపక్షాలలో చేరిపోవడం.

 • ఇస్లాం అంటే ఏమిటి అనే అంశంపై అల్ అకానియ్యహ్ భాషలో తయారైన చర్చ.

 • ఇస్లాం అంటే ఏమిటి, దాని వాస్తవికత ఏమి అనే విషయం గురించి అల్ అకానియ్యహ్ భాషలో వెలువడిన చర్చ.

 • ఇస్లాం ధర్మంలోని సౌందర్యాన్ని చక్కగా వివరించే గొప్ప ఆడియో. దీనిని డాక్టర్ నాజీ ఇబ్రాహీం అర్ఫాజ్ తయారు చేసారు. అందరికీ నచ్చే ఒక మంచి ఆడియో ప్రోగ్రాం ఇది.

 • ఇస్లాం ధర్మ సహాబాల వృత్తాంతాల కార్యక్రమం (ఖిస్సత్ ఇస్లామ్ సహాబీ) - సౌదీ అరేబియాలోని అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ రేడియో సీరియల్ గా ప్రసారం చేయబడిన సహాబాల (రదియల్లాహు అన్హుమ్) వృత్తాంతాలన్నింటినీ ఒకచోట చేర్చి, ఈ ప్రోగ్రాం తయారు చేసినారు. దీనిని డాక్టర్ హసన్ హబషీ (అల్లాహ్ ఆయనపై అనుగ్రహం చూపుగాక) తయారు చేసినారు.

 • డాక్టర్ లారెన్స్ బ్రౌన్ మానవుల మెదడులో మెలిగే కొన్ని పెద్ద ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు - నన్ను ఎవరు పుట్టించారు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేనొక మంచి వ్యక్తిగా జీవిస్తే సరిపోతుందా, మనం కోరుకున్న విధంగా దేవుడిని ఎందుకు ఆరాధించకూడదు ...

 • ఇస్లాం మీ జన్మ హక్కు. అవును. మీరు సరిగ్గానే చదివారు. ఇస్లాం మీ జన్మహక్కు. ప్రతి మానవుడు ఇస్లాం ధర్మంలోనే పుడతాడు. కాబట్టి మానవులందరూ సహజంగా తమకు తెలిసిన దాని వైపుకు ఆకర్షించబడతారు. ఇస్లాం ధర్మం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క చిట్టచివరి స్వచ్ఛమైన ధర్మం అని నిరూపించే కొన్ని హేతువాద మరియు వివేకవంత కారణాలు. కాబ్టటి ప్రతి ఒక్కరూ ఇస్లాం ధర్మాన్నే అనుసరించాలి.

 • ఇస్లామీయ షరిఅతు అమలు చేయడం ద్వారానే శాంతి భద్రతలు స్థాపించబడతాయి. ఇస్లామీయ షరిఅతు సృష్టిపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో వారు అల్లాహ్ యొక్క ధర్మంపై ఉన్నట్లే. అలాంటి అల్లాహ్ యొక్క దాసులు శాంతి భద్రతలలో, సుఖశాంతులలో ఉంటారు. మరి ఎవరైతే తమ ఇష్టానుసారం జీవిస్తారో, తమ సంపద మరియు తమ కోరికల ఆధారంగా జీవిస్తారో, వారు ఒక్కసారి తమ జీవితం గురించి ఆలోచించుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి.

 • ఎలా కొంత మంది మహిళలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు.

 • ఇస్లాం ధర్మంపై ముస్లిమేతరులు అడిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి జవాబులు.

 • మై పాథ్ టు ఇస్లాం అనే ఈ వృత్తాంతంలో ఎలా హుడా డాడ్జ్ Huda Dodge ఇస్లాం స్వీకరించారో తెలిపినారు. దీని చదవటం ద్వారా మీలో ధర్మప్రచారంలో పాల్గొనాలనే ఆలోచన రేకిత్తించవచ్చు లేదా మీ దైవవిశ్వాసం పెరగవచ్చు. ఏదేమైనా దీనిని తప్పక చదవండి. ఇది కేవలం ఇస్లాం స్వీకరించిన ఒక మహిళ యొక్క వృత్తాంతం కానీ ఇంకా అనేక మంది ఇస్లాం ధర్మంలో ప్రవేశించక, తమ అజ్ఞానంలోనే జీవిస్తున్నారు.

 • మీ మెదడును మెలితిప్పే లేదా మీ ధర్మాన్ని మార్చే ఉద్దేశ్యం నాకు లేదు. నా ఉద్దేశ్యం మరియు లక్ష్యం ఏమిటంటే మీ జ్ఞాన పరిధి పెంచుకోవడం కోసం ఇస్లాం గురించి మీరు తెలుసుకోవాలి, ఇస్లాం స్వీకరించాలా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

 • ఇస్లాం యొక్క అనుగ్రహాలు - షేక్ సయీద్ బిన్ వహాఫ్ అల్ గహతానీ చేసిన ఈ ప్రసంగం రియాద్ లోని పెద్ద జామియా మస్జిదులో రికార్డు చేయబడింది. మానవజాతిపై సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయని ఆయన తెలిపినారు. దీనికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఆయన తెెలిపినారు.

 • రియాద్ లోని ప్రధాన జామియా మస్జిదులో అల్ షేఖ్ ఇచ్చిన ప్రసంగం. దీనిలో ఆయన ఇస్లాం ధర్మంలోని కొన్ని శుభాల గురించి వివరించారు మరియు ఇస్లాం ధర్మంలోని అద్భుతాలను పరిచయం చేసారు. తర్వాత ఆయన ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చారు.

 • “ఇస్లాం అంటే ఏమిటి?” అనే చాలా ముఖ్యమైన విషయాన్ని ipc, కువైత్ చాలా చక్కగా ఇక్కడ చర్చించింది. ప్రతి ఒక్కరూ తప్పక లాభం పొందుతారు.

 • క్లుప్తంగా ఇస్లాం గురించి పరిచయం చేస్తున్న ఒక మంచి పుస్తకం. ఇది వివిధ కోణాలలో ఇస్లాం గురించి, దాని మూలసిద్ధాంతాల గురించి, పునాదుల గురించి, దానిలోని అద్భుతాల గురించి, దాని ప్రయోజనాలు మరియు శుభాల గురించి ప్రజలలో చర్చలు జరిగే ప్రశ్నోత్తరాలలో ఉన్నది. ఇస్లాం గురించి ఎవరైతే చిత్తశుద్ధితో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారో, వారి కోసం ఇది ఒక అసలైన తాళం చెవిలా పనిచేస్తుంది.

 • ఇస్లాం ధర్మం మొత్తాన్ని సమగ్రహంగా నిర్వచించే అత్యుత్తమమైన మరియు మానవ జీవిత అంశాలన్నింటినీ అపూర్వంగా సంబోధించే సాక్ష్యప్రకటన వచనంతో పాటు, తౌహీద్ అనే ఇస్లామీయ ఏకదైవత్వం సిద్ధాంతం, ఇస్లామీయ విశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు, ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఈ వ్యాసంలో చక్కగా పరిచయం చేయబడింది.

 • రివ్యూ : శాఫీ ఉథ్మాన్

  ఇస్లాం పరిచయం - అనేక నిదర్శనాల వెలుగులో, సృష్టికర్త ఉనికి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యసందేశం, ఖుర్ఆన్ మరియు హదీథుల సత్యత మొదలైన వాటిని ముస్లిమేతరుల కోసం స్పష్టంగా వివరించబడింది.

 • సామాజిక హక్కులు: ఇప్పటికే పాశ్చాత్య దేశాలలోని ఇస్లామీయ సమాజ నివేదికల ద్వారా ఇస్లాం ధర్మంలోని సామాజిక హక్కులు మరియు వాటి గౌరవనీయ స్థానం గురించి అందరికీ అర్థం అవుతున్నది. వాటికి తగిన స్థానం ఇవ్వకపోతే సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది మరియు తీవ్రపరిణామాలు ఎదురవుతాయి.

 • ఉపన్యాసకులు : ఖాలిద్ యాసీన్

  1994లో సౌదీ అరేబియాలో షేఖ్ ఖాలిద్ యాసీన్ ఈ ప్రసంగం చేయగా, అక్కడి శ్రోతలలో నుండి 43 మంది ప్రజలు వెంటనే ఇస్లాం ధర్మం స్వీకరించారు.

పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్