సమాధుల విషయంలో అధిక ముస్లింల ధోరణి, సమాధుల సందర్శనలోని అసలు ఉద్ధేశ్యం, మరియు ఇస్లాం దీనిని ఘోరమైన పాపంగా ఎందుకు పరిగణిస్తుంది అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
‘ఇస్లాం యొక్క జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు ఉమర్.
‘ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించి, అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తీసుకు వచ్చి, అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు నరసింహులు.