హజ్ విధానం

వివరణ

ఈ వ్యాసంలో హజ్ విధానం గురించి క్లుప్తమైన వివరణ ఉన్నది.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

 హజ్ విధానం

﴿ صفة الحج ﴾

] తెలుగు – Telugu – تلغو [

http://ipcblogger.net/salimumri/

అనువాదం : -

పునర్విమర్శ : ముహమ్మద్ కరీముల్లాహ్

2009 - 1430

﴿ صفة الحج ﴾

« باللغة التلغو »

http://ipcblogger.net/salimumri/

ترجمة : -

مراجعة : محمد كريم الله

2009 - 1430

 హజ్ విధానం (1) హజ్ ఆచరణలు దిల్ హిజ్జ్ 8వ తేదీ నుండి ప్రారంభమౌతాయి. ఈ రోజుని ‘యౌముత్తర్వియ’ అని కూడా అంటారు. ఈ రోజు హాజీలు స్నానం చేసి హజ్ సంకల్పం చేసుకోవాలి. ఫజర్ తరువాత మరియు దొహర్ నమాజుకు ముందు మీనా మైదానానికి బయలు దేరి వెళ్ళాలి. అక్కడ దొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులు విడివిడిగా వాటి వాటి సమయాలలో ఖసర్ చేసి చదవాలి. మీనా మైదానంలో తొమ్మిదవ తేదీ రాత్రి గడిపి, ఫజ్ర్ నమాజ్ మీనా మైదానంలోనే చేసి, సూర్యోదయం తరువాత అరఫాత్ మైదానం వైపు బయలు దేరాలి. మీనాలో రాత్రి బసచేయడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయం. (2) అరఫాత్ లో విడిది: అరఫాత్ లో ‘నమిర’ అనే స్థలంలో విడిది చేయటం మంచిది. అలా కుదరకపోతే అరఫా మైదానంలో ఎక్కడైనా విడిది చేయవచ్చు. అరఫాలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సంప్రదాయాన్ని అనుసరిస్తూ దొహర్, అసర్ నమాజులు ఒక అదాన్ రెండు ఇఖామతులతో కలిపి ఖసర్ చేసి చదవాలి. నమాజ్ తరువాత అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తూ, అల్లాహ్ ను వేడుకోవడంలో నిమగ్నమై పోవాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ రోజు ప్రత్యేకంగా ఈ దుఆ చేసేవారు: ‘లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహూ లా షరికలహూ. లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్ ఖదీర్.’ ఇలా దుఆ చేస్తూ ఖుర్ఆన్ పఠిస్తూ, ఇస్లామీయ పుస్తకాలు చదువుతూ సూర్యాస్తమయం వరకు అరఫాలో వేచి ఉండాలి. సూర్యాస్తమయానికి ముందే అరఫా నుండి బయలుదేరకూడదు. సమయానికంటే ముందే అరఫా మైదానం నుండి బయలు దేరితే, అతనిపై పరిహారం (కఫ్పారా) తప్పనిసరి అవుతుంది. అలాగే ఎవరైనా తొమ్మిదవ తేది అంటే అరఫా రోజున సూర్యాస్తమయానికి ముందే అరఫాత్ మైదానంలోకి ప్రవేశించలేకపోతే వారి హజ్ పూర్తి కానట్లే. వారు మరుసటి ఏడాది దాన్ని పూర్తి చెయ్యాలి. (3) ముజ్దలిఫా: హాజీ ముజ్దలిఫా చేరుకోగానే ఒక అదాన్ రెండు ఇఖామతులతో మగ్రిబ్ నమాజు పూర్తిగా, ఇషా నమాజు ఖసర్ చేసి చదవాలి. తరువాత ముజ్దలిఫాలో రాత్రి బసచేయాలి. అర్థరాత్రి గడచిన పిదప బలహీనులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వారికి సేవలు చేస్తున్నవారు మీనా వైపు బయలు దేరవచ్చు. కాని తగిన శక్తిసామర్ధ్యాలు గలవారు మాత్రం రాత్రంతా అక్కడే గడిపి ఫజ్ర్ నమాజ్ చేసిన పిదప తెల్లారే వరకు దుఆ చేయాలి. (4) సూర్యోదయం తర్వాత మీనా వైపు పయనించాలి. అర్ధరాత్రికి ముందు బలహీనులైనా, బలవంతులైనా మీనావైపు బయలుదేరకూడదు. ఎందుకంటే ముజ్దలిఫాలో రాత్రి గడపడం తప్పనిసరి. (5) పండగ రోజున అంటే దిల్ హజ్జ్ పదవ తేదీన చేయవలసిన హజ్జ్ ఆచరణలు: (అ) రమీ (ఆ) హదీ (ఇ) హల్ఖ (ఈ) సయీ. (అ) రమీ: హాజీ ముజ్దలిఫా నుండి బయలు దేరి మీనా వచ్చేటప్పుడు ముజ్దలిఫా నుండి లేదా దారిలో ఎక్కడి నుండైనా చిన్న చిన్న ఏడు కంకర్రాళ్ళు ఏరుకోవాలి. జమ్రతుల్ ఉఖ్బా దగ్గరకు వెళ్ళి, దానిపై ఆ కంకర్రాళ్ళను విసరాలి. రమీ సమయం దిల్ హజ్జ్ 9వ తేదీ అర్దరాత్రి నుండి మొదలై పదవ తేదీ సూర్యాస్తమయం వరకు వుంటుంది. ఆరోగ్యవంతులు సూర్యోదయం నుండి మిట్టమధ్యాహ్నం లోపలే రమీ చేయటం మంచిది. (ఆ) హదీ (ఖుర్బానీ పశువు)ను వెంట తెచ్చుకున్నవారు దానిని జిబహ్ చెయ్యాలి. జిబహ్ సమయం పదవ తేది సూర్యోదయం నుండి 12వ తేది సూర్యాస్తమయం వరకు వుంటుంది. అంటే పండుగ రోజు తరువాత మరో రెండు రోజులన్న మాట. హదీని స్వయంగా భుజించ వచ్చు మరియు ఇతరులకు బహుమానంగా ఇవ్వవచ్చు, పేదలకు పంచి పెట్టవచ్చు. ముఫ్రిద్ (హజ్జే ఎఫ్రాద్ చేసే వ్యక్తి) కొరకు ఖుర్బానీ లేదు. ఖిరాన్, తమత్తు విధానాలలో హజ్ చేసే వారికే హదీ ఉంది. (ఇ) హలఖ్ (శిరోముండనం లేదా తలజుట్టు కత్తిరించుకోవటం): ఖుర్బానీ తరువాత తల వెంట్రుకలను పూర్తిగా తీసివెయ్యాలి లేదా కత్తిరించాలి. స్త్రీలు మాత్రం కొన్ని శిరోజాలను కత్తిరిస్తే సరిపోతుంది. పండుగ రోజున హాజీ రమీ, హల్ఖ - రెండూ పూర్తి చేసాక, అతనిపై అతని స్త్రీలు తప్ప ఇహ్రాం యొక్క నిషేధాజ్ఞలన్నీ తొలిగిపోతాయి అంటే అతను తన భార్యతో రమించ కూడదు. తవాఫే ఇఫాద పూర్తయ్యే వరకు ఆమె వైపు కామదృష్టితో కూడా చూడకూడదు. (ఈ) తవాఫ్ - సయీ అంటే హల్ఖ తరువాత మస్జిదె హరం వైపు వీలైతే ఆ రోజే వెళ్ళాలి. వెళ్లి తవాఫే ఇఫాద చేయాలి. ముతమత్తి అయితే సయీ కూడా చెయ్యాలి. ముఖ్రిన్ లేదా ముఫ్రిద్ మాత్రం తవాఫే ఖుదూమ్ తర్వాత సయీ చేయని ఎడల ఇప్పుడు చెయ్యాలి. తవాఫ్ అన్నది ఈ రోజు అంటే పదవ తేది చెయ్యటం చాలా మంచిది. దీన్నే 13 వ తేదీ వరకు ఆలస్యం కూడా చెయ్యవచ్చు. కాని అంతకు మించి ఆలస్యం చేయకూడదు. ఈరోజు (పదవతేది) చేసే పనులు (1) రమీ (2) జిబహ్ (3) హల్ఖ / తఖ్సీర్ (4) తవాపుల్ ఇఫాద (5) సయీ. వీటిలో ఏది ముందు, ఏది తర్వాత చేసినా పర్వాలేదు. ఒకవేళ హదీ జంతువు లభించకపోతే అరఫారోజు, పండుగ రోజు తప్ప హజ్ దినాలలో మూడు రోజులు ఉపవాసం వుండాలి. ఇంటికి వెళ్ళిన పిదప ఏడు ఉపవాసాలుండాలి. అంటే దీనికి పరిహారం పది రోజుల ఉపవాసాలన్న మాట. (ఉ) అయ్యామే తష్రీఖ్ (తష్రీఖ్ రోజులు): దిల్ హిజ్జ్ 11,12 మరియు13వ తేదీలను అయ్యామే తష్రీఖ్ అంటారు. ఈ మూడు దినాలు హజీలు రాత్రి ఎక్కువ సమయం మీనాలో గడపాలి. ఇది వాజిబ్ (తప్పనిసరి), ఈ మూడు రోజుల్లో మిట్టమధ్యానం నుండి సూర్యాస్తమయం లోపల రమీ చేయాలి. 4 రకాతుల నమాజుని ఖస్ర్ చేసి విడివిడిగా ఆయా సమయాల్లోనే చేయాలి. (ఊ) రమీ విధానం: జవాల్ (మిట్టమధ్యాహ్నం) తరువాత 21 కాకరరాళ్ళు తీసుకోవాలి. తరువాత జమ్రతుల్ సుగ్రా (చిన్న స్థంభం) ను సమీపించి, ఏడు కంకర రాళ్ళను ఒకొక్కటిగా అల్లాహు అక్బర్ అంటూ దానిపై విసరాలి. తరువాత కాబా వైపు ముఖం త్రిప్పి దుఆ చెయ్యాలి. తరువాత జమ్రతుల్ వుస్తా దగ్గరకు వెళ్ళాలి. ఇక్కడ కూడా ఏడు కంకర రాళ్ళను దానిపై విసరాలి. తరువాత అక్కడా దుఆ చెయ్యాలి. ఆ తరువాత జమ్రతుల్ ఉఖ్బా దగ్గరకు వెళ్ళి అక్కడ కూడా ఏడు కంకర రాళ్ళు అల్లాహు అక్బర్ అంటూ దానిపై విసరాలి. తరువాత దుఆ చెయ్యకుండానే అక్కడి నుండి ముందుకు వెళ్లిపోవాలి. 12వ తేదీన కూడా అలాగే చెయ్యాలి. తర్వాత మీనా వదిలి వెళ్ళ దలుచుకుంటే 12వ తేదీ సూర్యాస్తమయానికి ముందే అక్కడి మక్కా వైపు బయలుదేరివెళ్ళాలి. ఒకవేళ మీరు మీనా నుండి బయలుదేరక మునుపే సూర్యుడు అస్తమిస్తే, మళ్ళీ 13వ తేదిన కూడా రమీ చేయాల్సి వుంటుంది. ఈ రోజున కూడా ఆలస్యం చేయకుండా త్వరగా మీనా నుండి మక్కా వైపు వెళ్ళపోవడం మంచిది. రమీ చెయ్యలేని స్త్రీలు, పిల్లలు, వృద్దులు తమ తరపున మరొకరికి ఆ బాధ్యతను అప్పగించవచ్చు. (ఎ) తవాఫుల్ విదా: ఒకవేళ హాజీ మక్కా వదలి తమ స్వస్థలానికి మరలిపోయే సంకల్పం చేసుకుంటే వీడ్కోలు ప్రదక్షిణ (తవాఫ్ విదా) చెయ్యకుండా మక్కా వదలకూడదు. బహిష్టు స్త్రీల కొరకు తవాఫే విదా లేదు. (మరి ఎవరైతే తవాఫే ఇఫాదని ఆలస్యం చేస్తాడో, అతను తవాఫే విదాకి బదులు తవాఫే ఇఫాద చేస్తే సరిపోతుంది).