-
అబ్దుల్లాహ్ అల్ బయీజాన్ "అంశాల సంఖ్య : 14"
వివరణ :ఆయన పూర్తి పేరు అబ్దుల్లాహ్ బిన్ అబ్దుర్రహ్మాన్ బిన్ సులైమాన్ అల్ బయీజాన్. మలిక్ సఊద్ విశ్వవిద్యాలయానికి చెందిన అల్ ఖర్జ్ పట్టణంలోని హ్యుమానిటీస్ కాలేజీలోని న్యాయశాఖలో ఉపన్యాసకులు. ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ విశ్వవిద్యాలయం నుండి షరిఅహ్ రాజకీయ అంశంలో పి.హెచ్.డీ పూర్తి చేసారు. 1422లో ఆయన ఇమాం ముహమ్మద్ బిన్ సఊద్ విశ్వవిద్యాలయంలోని షరిఅహ్ కాలేజీ నుండి గ్యాడ్యుయేషన్, 1426లో మాస్టర్స్ పూర్తి చేసారు. సుప్రసిద్ధ ఇస్లామీయ పండితులు షేఖ్ డాక్టర్ ఇబ్రాహీమ్ బిన్ సయీద్ అద్ దూస్రీ, ప్రొఫెసర్ ఇమాం ముహమ్మద్ సఊద్ విశ్వవిద్యాలయం నుండి మరియు సుప్రసిద్ధ ఇస్లామీయ పండుతులైన షేఖ్ అబ్దుల్ హకీమ్ బిన్ అబ్దుస్సలాం ఖాతిర్, కింగ్ ఫహద్ ఖుర్ఆన్ ప్రింటింగ్ ప్రెస్, మదీనాలోని రివ్ముయూ కమిటీ సభ్యుడి నుండి అష్ షాతబీ పద్ధతిలో హఫ్స్ అన్ ఆసిమ్ రివాయతు ఖిర్ఆత్ లో ఇజాజత్ పొందారు. రియాద్ పట్టణంలోని జామియ్ అల్ బవార్దీ మస్జిద్ లో ఇమామ్ గా సేవలందించారు. దిల్ హజ్ 4వ తేదీ హిజ్రీ 1434వ సంవత్సరం అంటే 9వ తేదీ అక్టోబరు 2013వ సంవత్సరం బుధవారం నాడు వెలువడిన ఖాదిమైన హరమైన రాయల్ డిక్రీని అనుసరించి ఆయన మస్జిదె నబవీలో ఇమామ్ గా నియమించబడినారు.