ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.
షహాదహ్ అంటే ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవన మార్గం పై నడిపిస్తుందో, ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించబడెను. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది.
ఈ పుస్తకంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి చాలా వివరంగా చర్చించబడినది. ఇంకా షిర్క్ అంటే బహుదైవారాధన రుగ్మతల గురించి కూడా విశదీకరించటం జరిగినది. అంతే గాక అల్లాహ్ యొక్క సందేశహరుడిని, సందేశాన్ని మరియు అల్లాహ్ కు దూరం చేసే తాగూత్ అంటే దుష్టశక్తుల గుర్తింపు మరియు ఇతర ఏకదైవారధనకు సంబంధించిన విషయాలు కూడా దీనిలో విపులంగా చర్చించబడినవి. ప్రతి పాఠకునికి దీనిలోని విషయాలు ఇహపరలోకాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
అత్తౌహీద్ అంటే ఏకదైవత్వం పై వ్రాయబడిన ఉత్తమ పుస్తకాలలో ఇది ఒకటి. దీనిలో సకల లోక సృష్టికర్త యొక్క ఏకదైవత్వం గురించి వివరంగా చర్చించబడినది. అల్లాహ్ గురించి తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన ఒక మంచి పుస్తకం.
దివ్యఖుర్ఆన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం పై అల్లాహ్ అవతరింపజేసిన ఒక మహాద్భుత మహిమ. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఆయత్ లు మరియు హదీథ్ బోధనల నుండి ఈ వ్యాసంలో వివరించబడెను.
ఇస్లాం ధర్మం గురించి సరళమైన భాషలో వివరిస్తున్నది. మానవసృష్టికి కారణాలు, సృష్టికర్త యొక్క హక్కులు, మానవుడు జీవితంలో ఆచరించవలసిన ప్రధానమైన పనులు, మరణించిన ఎదుర్కొనబోయే పరిణామాలు తెలుపు తున్నది. ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర ధర్మగ్రంథాలలోని ఆధారాలు కూడా ప్రస్తావించబడినది.
క్లుప్తంగా బహిర్భూమి అంటే టాయిలెట్ కు వెళ్ళే పద్దతి (కాలకృత్యాలు), స్నానం చేయటం, నీళ్ళులేని పరిస్థితిలో పరిశుద్ధమయ్యే పద్ధతి, ఉదూ, నమాజ్, పండగరోజు చేసే నమాజు, మృతశరీరం - స్నానం, నమాజు, అంత్యక్రియలు, తప్పనిసరిగా చేయవలసిన దానం - జకాత్, ఉపవాసం, మక్కా యాత్ర (హజ్)