ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
సమాధుల విషయంలో అధిక ముస్లింల ధోరణి, సమాధుల సందర్శనలోని అసలు ఉద్ధేశ్యం, మరియు ఇస్లాం దీనిని ఘోరమైన పాపంగా ఎందుకు పరిగణిస్తుంది అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.
ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.