-
యహ్యా అహ్మద్ అల్ హలీలీ "అంశాల సంఖ్య : 1"
వివరణ :ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393 అంటే 1973లో అరబీ భాషలో పట్టభద్రులయ్యారు. తర్వాత 1390 అంటే 1970 నుండి సనఆ లోని హయ్యల్ తహ్రీర్ లో ఉన్న జామియ మస్జిద్ లో ఖుర్ఆన్ టీచర్, ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయడం ప్రారంభించారు. 1421 అంటే 2000లో ఖుర్ఆన్ కరీమ్ కంఠస్థం ధృవీకరించే సంస్థకు మరియు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించారు. ఈజిప్టులో జరిగిన కొన్ని ఖుర్ఆన్ కంఠస్థ సమావేశాలలో పాల్గొన్నారు.