షాబాన్ నెల సగభాగం గడిచిన పోయిన తర్వాత ఉపవాసం పాటించ వచ్చునా? ఎందుకంటే షాబాన్ నెల సగభాగం తర్వాత ఉపవాసం ఉండటాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించారని విన్నాను.
అగర్వాల్ కుటుంబానికి చెందిన ఒక యువకుడు నిజనిజాలు గ్రహించిన తరువాత తన హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం ధర్మం స్వీకరించినాడు. ఆ తరువాత అతను తన తల్లిని కూడా భయంకరమైన నరకాగ్ని నుండి కాపాడాలని తపించసాగాడు. ఈ కృషిలో ఆవిడను ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తూ ఈ గొప్ప ఉత్తరాన్ని వ్రాసినాడు. ఇస్లాం ధర్మం గురించి అధ్యయనం చేసి, కొన్నాళ్ళ తరువాత ఆవిడ కూడా ఇహపరలోకాల సాఫల్యం వైపు దారిచూపే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినది.
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.
మంచిని ఆదేశించటం మరియు చెడును నివారించటం గురించిన ఆదేశాలు, విశిష్ఠతలు, వాస్తవాలు, ప్రాముఖ్యతలు, షరతులు, మానవ హక్కుల గుర్తుంచుకోవటం – మొదలైన విషయాలు మదీనా మస్జిదు ఇమాం గారు ఈ శుక్రవారపు ఉపన్యాసంలో ప్రజల ఎదుట ప్రసంగించినారు.
దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు.
అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గురించి, ఏకదైవారాధన మరియు పరలోకం గురించీ హిందూ ధర్మ గ్రంథాలలో స్పష్టంగా వివరించబడినది – ఈ పుస్తకంలో దీనిని ప్రామాణిక ఆధారాలతో స్పష్టంగా చర్చించినారు.