షాబాన్ నెల మధ్యన ప్రత్యేక ఉపవాసం మరియు ప్రత్యేక ఆరాధనల కల్పితాచారం

వివరణ

షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటమనేది ఒక విధమైన నూతన కల్పితాచారమని నేను ఒక పుస్తకంలో చదివాను. కాని ఇంకో పుస్తకంలో షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటం మంచిదని చదివాను .............. ఈ విషయమై సరైన అసలు పద్ధతి ఏమిటి?

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి

పూర్తి వివరణ

  కేవలం షాబాన్ మాసపు మధ్య రాత్రిని మాత్రమే ఆరాధన కోసం ప్రత్యేకించరాదు.

  ప్రశ్న - షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటమనేది ఒక విధమైన నూతన కల్పితాచారమని నేను ఒక పుస్తకంలో చదివాను. కాని ఇంకో పుస్తకంలో షాబాన్ నెల మధ్యలో ఉపవాసం ఉండటం మంచిదని చదివాను .............. ఈ విషయమై సరైన అసలు పద్ధతి ఏమిటి?

  జవాబు - సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును.

  షాబాన్ నెల మధ్యభాగపు ప్రత్యేకత గురించి అనుసరించదగిన సరైన సహీ మర్ఫూ హదీథ్ ఏదీ లేదు. కనీసం అల్ ఫదాయిల్ (హదీథ్ గ్రంథాలలోని ప్రత్యేకతలు తెలిపే) అధ్యాయాలలో కూడా దాని ప్రస్తావన లేదు. కొన్ని మఖ్తూ (అంటే దేని ఇస్నాద్[1] తాబయీన్[2] తరంతో ఆగిపోతుందో) వివరాలను కొందరు తాబయీన్ ల నుండి ఉల్లేఖించారు. ఇంకా, దాని గొప్పదనాన్ని బలపరచే హదీథ్ లు కేవలం మౌదూ (కల్పితమైనవి) మరియు దయీఫ్ (చాలా బలహీనమైనవి) హదీథ్ లు మాత్రమే. అజ్ఞానంలో మునిగి ఉన్న కొన్ని దేశాలలో ఈ పద్ధతులు మరీ ఎక్కువగా ప్రసిద్ధి గాంచినవి. షాబాన్ మాసపు మధ్య దినం నాడు ప్రజల జీవిత కాలం వ్రాయబడునని లేదా రాబోయే సంవత్సరంలో చనిపోయేవారి పేర్లు వ్రాయబడునని వీరి నమ్మకం. ఈ నూతన కల్పితాచారాలను రూపుమాపటం కోసం ఆనాటి రాత్రి ఆరాధనలలో ప్రత్యేకంగా గడపటం గాని లేదా ఆ దినం నాడు ఉపవాసం ఉండటం గాని లేదా కొన్ని ప్రత్యేకమైన ఆరాధనలను ఆనాడు ఆచరించటం గాని చేయకూడదు. దీనిని పాటించే ఆజ్ఞానుల అత్యధిక సంఖ్యను చూసి ఎవరైనా మోసపోగూడదు. అల్లాహ్ కు అన్నీ తెలుసును. ..............................................................షేఖ్ ఇబ్నె జిబ్రీన్

  ఇతర రాత్రులలో ఆరాధించే విధంగా (నమాజు చేసే విధంగా) ఈ రాత్రి కూడా ఎటువంటి అదనపు ప్రార్థనలు చేర్చకుండా ఎవరైనా ఆరాధనలు చేయాలనుకుంటే లేదా ఏదో ఒక రాత్రి అలా ఆరాధించాలనుకుంటే – దానిలో తప్పులేదు. అలాగే అయ్యామ్ అల్ బీద్ దినాలలో అంటే ప్రతి నెల 13,14,15 వ తేదీలలో ఉపవాసం పాటించే వారు షాబాన్ 15వ తేదీ కూడా ఆ మూడు దినాలలోని ఒక దినంగా రావటం వలన లేదా ప్రతి వారం సోమ మరియు గురువారాలలో ఉపవాసం పాటించే వారు, ఒకవేళ షాబాన్ నెల 15వ తేదీ ఈ రెండు దినాలలో ఏ రోజున వచ్చినా కూడా వారు ఉపవాసం ఉండవచ్చును. సోమ మరియు గురువారాలలో ఉపవాసం ఉండటం వలన లభించబోయే ప్రతిఫలమే తప్ప వేరే అదనపు ప్రతిఫలాన్ని అంటే షాబాన్ నెల యొక్క 15వ తేదీ ప్రత్యేకత యొక్క ఊహల ఆధారంగా ఎటువంటి అదనపు ప్రతిఫలాన్నీ ఆశించకూడదు......................షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్.

  [1] . ఉల్లేఖకుల పరంపరం

  [2] . ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల తర్వాతి తరం ముస్లింలు