కేటగిరీలు

 • MP3

  ఈ కార్యక్రమం / అకాడమీ యొక్క అసలు ఉద్దేశ్యాలు, లక్ష్యాలు : ఇంగ్లీషు భాష మాట్లాడే ప్రజల్ని ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేయడం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ధర్మ శాంతి సందేశాన్ని ప్రచారం చేయడం వైపు ప్రోత్సహించడం. ప్రధాన ఉద్దేశ్యాలు - సాంస్కృతిక పరిమితులకు అతీతంగా ఇంగ్లీషు భాషలో సంభాషించే సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం, ఇస్లామీయ పదాల సముచిత జ్ఞానం మరియు వాడుక, వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలతో ఇస్లామీయ భావనలు, సిద్ధాంతాల గురించి ఇంగ్లీషులో చర్చించడం, వారు కోరిన అంశాలపై సంక్షిప్తమైన ఇస్లామీయ ప్రజెంటేషన్లు ఇవ్వడం, ఇస్లాం ధర్మ ప్రచారంలో ఇంగ్లీషు భాషను ఉపయోగించే నైపుణ్యతను అభివృద్ధి చేసుకోవడం.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో పిల్లల పెంపకానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మరియు అందులో ఎదుర్కొనే కొన్ని ఇబ్బందుల పరిష్కారాన్ని డాక్టర్ హాతిమ్ అల్ హజ్ స్పష్టంగా వివరించారు. తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేసారు.

 • video-shot

  MP4

  ఈ భాగంలో చాలా చాలా ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన "ఒక ఆదర్శ ముస్లిం విద్యార్థి" అనే అంశం గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో వివరంగా చర్చించారు.

 • video-shot

  MP4

  ఇస్లామీయ ధర్మప్రచారంలో పాటించవలసిన నియమనిబంధనలు (5 - మరిచిపోయిన ముస్లింలు: జైళ్ళలో ఇస్లామీయ ధర్మప్రచారం)

 • video-shot

  MP4

  మాంఛేష్టర్ యూనివర్శిటీలో అంతిమ దినంనాటి భయంకర అగ్ని గురించి, మన జీవిత ముఖ్యోద్దేశం గురించి, ఈ భూలోకంపై మనం ఎందుకు నివసిస్తున్నాము అనే విషయం గురించి, ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపింపజేయబడిన అపార్థాల గురించి మరియు సత్యమైన, సూటీయైన ఇస్లాం ధర్మం గురించి షేఖ్ అబ్దుర్రహీమ్ గ్రీన్ చక్కగా వివరించారు.

 • video-shot

  PDF

  ఈ కరపత్రం మొదటి పేజీలో ఇలా ప్రశ్నించబడింది, "ప్రజల, పశుపక్ష్యాదుల, చెట్టుపుట్టల, గ్రహాల, భూమి, నీరు మొదలైన వాటితో పాటు మొత్తం భూమండలం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడే నియమనిబంధనలు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అవును - తప్పకుండా ఉండాలి !"

 • video-shot

  PDF

  అంతిమ దివ్యసందేశమైన ఖుర్ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే పేర్కొనబడిన కొన్ని సైంటిఫిక్ వాస్తవాల ద్వారా ఇస్లాం ధర్మం ఒక సత్యమైన ధర్మమని ఈ కరపత్రం నిరూపిస్తున్నది. వాటిలో కొన్ని - జీవితం ఎక్కడ మొదలైంది, మానవ పిండోత్పత్తి ప్రక్రియ, విశ్వం వ్యాపించడం మరియు భూమండలం బయటి నుండి ఇనుమును భూమిపైకి పంపడం మొదలైనవి.

 • PDF

  పరీక్షల వలన ఉపవాసాన్ని మధ్యలోనే భగ్నం చేయుట గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇచ్చిన జవాబు.

 • మోడరేట్ ధర్మం ఇంగ్లీష్

  PDF

  'వసతియ్యహ్ అహ్లె సున్నహ్ బైనల్ ఫిరాఖ్' (వివిధ వర్గాల మధ్య అహ్లె సున్నతుల్ జమఆత్ యొక్క మితతత్వం) అనే పేరుతో ప్రచరించబడిన పి.హెచ్.డి థీసిస్ లోని మూడవ భాగం నుండి ఇది సంకలనం చేయబడింది. దీనిని సౌదీ అరేబియాలోని ఇస్లామీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ ముహమ్మద్ బకరీమ్ ముహమ్మద్ బఅబ్దుల్లాహ్ తయారు చేసినారు. నేను ఈ థీసిస్ యొక్క మూడవ భాగంలో నుండి 'Moderation of the Muslims between extremism and negligence' (తీవ్రవాదం మరియు నిర్లక్ష్యాల మధ్య ముస్లింల మధ్యేమార్గం) అనే భాగాన్ని ఇంగ్లీషులోనికి అనువదించాను.

 • video-shot

  MP4

  పూర్వ కాలంలో స్త్రీ స్థానం ఏమిటి? అమ్మబడే మరియు కొనబడే ఒక వస్తువుగా ఆమెను పరిగణించేవారు, ఆమెకు మానమర్యాదలు ఉండేవి కావు. ఆమె ఒక మామూలు జంతువుగా లేక ఒక గృహోపకరణ సామానుగా అమ్మబడేది; ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకునేవారు లేక వ్యభిచారంలోకి దింపేవారు. ఆమెకు వారసత్వ హక్కు ఉండేది కాదు లేక ఆమెకు స్వంతంగా సంపద ఉంచుకునే హక్కు ఉండేది కాదు; ఒకవేళ ఆమె వద్ద ఏమైనా సంపద ఉంటే దానిని ఆమె అనుమతి లేకుండానే ఆమె భర్త బలవంతంగా లాక్కునేవాడు. కొన్ని అనాగరిక సమాజాలు ఇంకో అడుగు ముందుకు వేసి, ఆమెను అసలు మనస్సు, ఆత్మ కలిగి ఉన్న మనిషిగా పరిగణించాలా లేదా అనే చర్చలు కొనసాగించాయి! ఇంత జరిగినా, కొన్ని సమాజాలు ఇస్లాం ధర్మాన్ని స్త్రీలను హింసిస్తున్నదనీ మరియు అణగద్రొక్కుతున్నదనీ, ఆమెకు అన్యాయం చేస్తున్నదనీ నిందిస్తున్నాయి. ఈ వీడియోలో వీటన్నిటిలోని సత్యాసత్యాలను మేము నిష్పక్షపాతంగా చర్చిస్తున్నాము. ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులను మరియు భద్రతను గురించి స్పష్టంగా వివరిస్తున్నాము.

 • video-shot

  MP4

  ఒక రసాయన ఇంజనీరు నుండి ఇస్లామీయ పండితుడిగా మారిన స్వీయ జీవిత ప్రయాణంపై షేఖ్ డాక్టర్ యాసిర్ ఖాదీతో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. సృష్టికర్తతో గట్టి సంబంధం కలిగి ఉండే దిశలో నడుస్తున్న ఆయన జీవితం నుండి మరియు జీవితంపై ఆయనకున్న పాజిటివ్ దృక్పథం నుండి మీరు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోండి. ఈ ఇంటర్వ్యూను ఇంగ్లండులోని ఇస్లాం ఛానెల్ కోసం సాజిద్ వర్దా నిర్వహించారు.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో అబ్దుర్ రహీమ్ గ్రీన్ చాలా ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన కోకో కోలా ముస్లిం తరం అనే అంశంపై మాట్లాడినారు.

 • video-shot

  MP4

  ముస్లింల ఐకమత్యం యొక్క బేసిస్ మరియు ప్రాముఖ్యత అనే అంశంపై షేఖ్ యాసిర్ ఖాదీ చక్కగా ప్రసంగించారు.

 • video-shot

  MP4

  ఈ వీడియోలో మన బంగారు గతం మరియు ప్రకాశవంతమైన భవిష్యత్తు అనే ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశంపై షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ చర్చించినారు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగిన వీడియో.

 • video-shot

  MP4

  అంతిమ దినాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం యొక్క బాధ్యతలు, కర్తవ్యాలు అనే ఈ అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఉపన్యసించారు. ఇందులో ఆయన అల్లాహ్ యొక్క సందేశాన్ని అత్యంత ఖచ్చితమైన మరియు సరైన పద్ధతిలో ఇతరులకు అందజేయవలసిన మన బాధ్యతను గురించి వివరించారు.

 • PDF

  జనసంఖ్యలో అభివృద్ది మరియు భవిష్య జనాభా

 • PDF

  ఈ వ్యాసంలో ఏడు భాగాలు ఉన్నాయి. 1- విశ్వం, ప్రకృతి సహజ వనరులు, మానవుడికి మరియు ప్రకృతికి మధ్య ఉండే సంబంధం గురించి మొదటి భాగం పరిచయం చేస్తున్నది. 2- పర్యావరణ సంరక్షణలో ప్రపంచంలోని ప్రతి జీవి యొక్క ధార్మిక మరియు సామాజిక పాత్ర సృష్టించే సంతులనం మరియు స్థిరత్వం. 3 - పర్యావరణంలో నీటి పాత్ర మరియు దాని పరిరక్షణ దిశలో ఇస్లామీయ ధర్మాజ్ఞలు. 4- ఇస్లామీయ దృక్పథంలో గాలి, నీరు మరియు నేల యొక్క పాత్రలు మరియు మానవ జీవితం కొనసాగించటంలో వీటి పరిరక్షణ యొక్క ఆవశ్యత. 5- ఇస్లామీయ దృక్పథంలో పశుపక్ష్యాదుల పాత్ర మరియు మానవ జీవితం కొనసాగింపులో వాటి పరరక్షణ యొక్క ప్రాధాన్యత 6 - ప్రకృత సహజ వనరుల సంరక్షణపై కట్టుబడి ఉండటమే కాకుండా రసాయనాలు మరియు వ్యర్థ పదార్థాల నుండి మానవ జాతి సంరక్షణకు కూడా ఇస్లాం ధర్మం కట్టుబడి ఉంది.

 • PDF

  1- న్యాయ వ్యవస్థ మరియు ఇస్లామీయ దృక్పథం పరిచయం 2- న్యాయవ్యవస్థ నిర్వచనం, దాని చట్టబద్ధత మరియు న్యాయవ్యవస్థ గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞలు.

 • PDF

  ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఎవరైనా గమనిస్తే, ముస్లిం ప్రపంచం వివేకం కోల్పోయి అశాంతి మరియు హింసలో మునిగి ఉండటం గుర్తించకుండా ఉండలేరు. పరిస్థితి ఇంతగా దిగజారటంలో ఎలా వలసవాదం మరియు పాశ్చాత్య దేశాల జోక్యం ప్రాథమిక పాత్ర వహించిందో ఈ వ్యాసం చర్చించింది.

 • PDF

  ఇస్లాం ధర్మంలో ప్రభుత్వ వ్యవస్థను ఎవరైనా అర్థం చేసుకోవాలంటే, ముందుగా వారు ఇస్లాం ధర్మం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇస్లామీయ ధర్మ ప్రాథమిక మూలాంశాలు పరిపాలనా వ్యవస్థలో ఎలా కీలకపాత్ర వహిస్తున్నాయోఈ వ్యాసం వివరిస్తున్నది. మొదటి భాగం - చర్చీ మరియు ప్రభుత్వం రెండుగా విడిపోవడం.

పేజీ : 4 - నుండి : 1
ఫీడ్ బ్యాక్