కేటగిరీలు

  • MP3

    ఇస్లాం ధర్మ సహాబాల వృత్తాంతాల కార్యక్రమం (ఖిస్సత్ ఇస్లామ్ సహాబీ) - సౌదీ అరేబియాలోని అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ రేడియో సీరియల్ గా ప్రసారం చేయబడిన సహాబాల (రదియల్లాహు అన్హుమ్) వృత్తాంతాలన్నింటినీ ఒకచోట చేర్చి, ఈ ప్రోగ్రాం తయారు చేసినారు. దీనిని డాక్టర్ హసన్ హబషీ (అల్లాహ్ ఆయనపై అనుగ్రహం చూపుగాక) తయారు చేసినారు.

  • video-shot

    LINK

    ఆండ్రాయిడ్ మరియు ఐఫోనుల కోసం ఉచిత ఆప్స్. ముస్లిమేతరులకు ఇస్లాం గురించి అనేక భాషలలో పరిచయం చేసే ఒక మంచి ఆప్స్ ఇది. ముస్లిమేతరులు ఇస్లాం ఉత్తమ బోధనల గురించి సరిగ్గా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఇస్లాం ధర్మం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఇతర ముఖ్యమైన అనేక అంశాలను వివరించే అనేక విషయాలు ఉన్నాయి. ఇస్లాం వైపు ఆహ్వానించదలచిన తమ ముస్లిమేతర పరిచయస్థులకు వారి భాషలోనే, సముచితమైన ఇస్లామీయ అంశాలు మరియు విషయాలను ఎంచుకొని తేలిగ్గా పంపవచ్చు. దీనిని ఇస్లాంహౌస్ ఎంతో కష్టపడి తయారుచేసింది.

  • RAR

    ఈ C , రష్యన్ భాషలో అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ లోని సూరతుల్ ఫాతిహా మరియు 30వ భాగపు భావం యొక్క అనువాదపు సంకలనం. ఇది కింగ్ ఫహద్ ప్రింటింగ్ ప్రెస్, మదీనా లో అచ్చయిన ఖుర్ఆన్ గ్రంథం ఆధారంగా తయారు చేయబడినది.

  • video-shot

    JPG

    అల్ ముఅల్లిమ్ మరియు అల్ మురత్తిల్ అల్ షేఖ్ మహ్మూద్ ఖలీల్ అల్ హుశైరీ కంఠస్వరంలో రికార్డు చేసిన ఖుర్ఆన్ పఠనం. ఇది ఉత్తమ నైపుణ్యంతో తయారు చేసబడినది. దీనిని మీరు WINRAR ప్రోగ్రాం ఉపయోగించి, ఆడియో ఫైలు తయారుచేసి, తమ కంప్యూటర్ లో దించుకుని, మీ అనుకూల సమయాలలో వినవచ్చును, CD తయారు చేసి అవసరమైన వారికి పంచిపెట్టవచ్చును.

  • video-shot

    JPG

    జవామీ అల్ కలిమ్ ప్రోగ్రామ్: ఇది ఒక సమగ్రమైన హదీథ్ ఎన్ సైక్లోపేడియా. దీనిలో హదీథుల యొక్క 1400 మూలాధారాలు ఉన్నాయి. వీటిలో 543 వ్రాతప్రతులతో పాటు 70,000 మంది హదీథు ఉల్లేఖకుల జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. దీని మూలాధారాల ప్రామాణికత నిశితంగా పరిశీలించబడినది. విరామచిహ్నాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోబడినాయి. ఇది 69 అసాధారణమైన సేవలు అందిస్తున్నది. ఈ సేవలలో ఒకటేమిటంటే -ఆటోమేటిక్ గా హదీథులను వాటి అసలు మూలాధారాల వరకు చేర్చటం.

  • ZIP

    ఇది ప్రతిరోజు ఐదుసార్లు ఆటోమేటిక్ గా మనకు అదాన్ పలుకులు వినిపించి, నమాజు సమయమైందని జ్ఞాపకం చేసే అదాన్ సాఫ్ట్ వేర్. ఇందులో మొత్తం ప్రపంచ దేశాలన్నింటి అదాన్ సమయాలు ఉన్నాయి. ఇది మొబైల్ ఫోన్లు, సెల్ ఫోన్లు, విండోస్ ఫోన్లు, పాకెట్ పిసీ, సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీలలో పనిచేస్తుంది. దీనిని సెర్చ్ ట్రూత్ వెబ్సైటు (www.searchtruth.com) తయారు చేసింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని 5 మిలియన్ల కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

ఫీడ్ బ్యాక్