ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు షేక్ అల్ - ఇస్లాం ఇమామ్ ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ వ్రాసిన సంక్షిప్త రచన ఇది - అల్లాహ్ ఆయనపై అనేక అనుగ్రహాలు కురిపించుగాక.
ఓ మనిషి, నీ సృష్టికర్తను గుర్తించు ! ఈ పుస్తకంలో, రచయిత మానవ పుట్టుక పరమార్థం ఏమిటి,అల్లాహ్'ను ఎందుకు ఆరాధించాలి, ఆరాధన అంటే ఏమిటి, నిజమైనదైవం ఎవరు, అల్లాహ్ పరిచయం ,కలిమా తౌహీదు సారాంశం ఇస్లాం యొక్క పరిచయం, స్వర్గనరకాల గురించి సంక్షిప్త సమాచారాన్ని ఖురాను మరియు హదీసు వెలుగులో సమర్పించారు.
ఇది ఇస్లాం గురించి సంక్షిప్త పరిచయాన్ని కలిగి ఉన్న ఒక ముఖ్యమైన పుస్తకం,ఇస్లాం యొక్క మూల వనరులైన 'పవిత్ర ఖురాన్ మరియు దైవప్రవక్త’సున్నత్ వెలుగులో అతి ముఖ్యమైన సూత్రాలు,బోధనలు మరియు సర్వోత్తమ ప్రయోజనాలను వివరిస్తుంది ఈ పుస్తకం ముస్లింలు,ముస్లిమేతరులందరితో వారిభాషలో కాలం,పరిస్థితులతో సంబంధం లేకుండా మార్గదర్శకత్వం చేస్తుంది.
ఇస్లాం ధర్మం మానవులందరికీ మార్గదర్శకత్వం వహించే అంతిమ సత్యధర్మం. దీని మూలాధారాలు ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనలు (హదీథులు). రబ్వహ్ జాలియాత్ తరుఫున 80 హదీథులు కంఠస్థం చేసేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంకలనకర్త 60 హదీథులను సేకరించి, ఇక్కడ మీకందిస్తున్నారు. వీటి ద్వారా మనం అల్లాహ్ ను సంతృప్తి పరచే సంకల్పంతో అనేక మంచి అలవాట్లు అలవర్చుకునే అవకాశం ఉంది.
ఆ ఋజువు అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు : ప్రవక్తలు , వారి అనుచరులు , పుణ్యపురుషులు తదితరవారందరూ జీవితంలో వారికి ఎదురైన ప్రతి సందర్భంలో కేవలం సర్వవిశ్వాన్ని సృష్టించిన , సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ వైప్ మరలాలో , కేవలం ఆయనతోనే ఎలా సహాయాన్ని అర్ధించారో వాటికి సంబందించిన ఆధారాలు దైవగ్రంధమైన ఖురాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ ( స ) వారి సున్నతు ద్వారా వివరింపబడినది .