ఈ చిరు వ్యాసంలో మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ అబ్దుష్షుకుర్ ఉమ్రీ గారు చాలా చక్కగా లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు తౌహీద్ గురించి వివరించారు. అంతేగాక సున్నతు మరియు బిదాఅత్ ల గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి, ఆయనను అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడిగా ఎందుకు విశ్వసించాలనే ముఖ్యాంశం గురించి కూడా స్పష్టంగా, క్లుప్తంగా వివరించారు.
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సృష్టికర్తను ఏ విధంగా ఆరాధించవలసిన అసలు విధానాన్ని కూడా గురించి కూడా సోదరుడు తెలిపినారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి కార్యాలయాన్ని సంప్రదించండి.
షహాదహ్ అంటే ముస్లిం యొక్క సత్యధర్మ ధృవీకరణ వచనం ఎలా ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవన మార్గం పై నడిపిస్తుందో, ఈ పుస్తకంలో స్పష్టంగా వివరించబడెను. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన పుస్తకమిది.