ఈ వీడియోలో సమస్త ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే ఎందుకు ? అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.
మానవులలో ఉండవలసిన నిజాయితీ గురించి, బాధ్యతలు మరియు కర్తవ్యాల గురించి, ప్రజల మధ్య తీర్పు చేయడం గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.
ఈ టివీ ప్రోగ్రాంలో పవిత్ర ఖుర్ఆన్ గ్రంథం యొక్క విశిష్ఠత అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.
దివ్యఖుర్ఆన్ ద్వారా లభించే పుణ్యాలు, అల్లాహ్ ధ్యానం యొక్క ద్వారా లభించే పుణ్యాలు, ఉదూ మరియు నమాజు ద్వారా లభించే పుణ్యాలు, ఉపవాసం ద్వారా లభించే పుణ్యాలు, వేర్వేరు ఉత్తమ ఆచరణల ద్వారా లభించే పుణ్యాలు.
ప్రత్యేకమైన వేడుకోళ్ళతో అనారోగ్యాలు, కష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రవక్త ముహమ్మద్ (స) వారు మనకు బోధించి ఉన్నారు, హిస్నుల్ ముస్లిం అనే దుఆల పుస్తకం మనకు ముందు నుంచే తెలుసు, దానిలో అన్ని రకాల దుఆలు ఉంటాయి, అయితే ఈ చిరు పుస్తకం (హద్’యు న్నబి సల్లల్లాహు అలైహి వసల్లం)లో అనారోగ్యాలు మరియు కష్టాలకు సంబందించిన దుఆలను మాత్రమే పొందు పరచబడినవి, ప్రత్యేకించి కరోనా పరిస్తితులు నడుస్తున్న ఈ తరుణాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని మీ ముందుకు తీసుకు రావడం జరిగింది.
హిస్నుల్ ముస్లింలోని నిద్ర నుండి మేల్కొన్న తర్వాత పఠించవలసిన దుఆలు మీరిక్కడు వినగలరు. వీటిని అర్థం చేసుకొని, ప్రతిరోజు పఠించడం ద్వారా మీరు లాభం పొందగలరు
మానవులలో ఉండవలసిన సోదరభావం, కలిసికట్టుతనం, మంచిని ఆజ్ఞాపించడం, చెడును నిషేధించడం, పరస్పరం శ్రేయోభిలాషులుగా మెలగటం, లంచగొండితనం మరియు వంచనల నుండి దూరంగా ఉండటం మొదలైన ఉత్తమ గుణాల గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.