కేటగిరీలు

 • video-shot

  MP4

  ఈ ఖుత్బా ప్రసంగంలో డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ రమదాన్ పవిత్ర మాసానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. ఈ పవిత్ర మాసంలో ప్రోత్సహించబడిన ఆచరణలు, ఉపవాస వ్రతాన్ని భగ్నం చేసే లేదా హాని కలిగించే విషయాల నుండి దూరంగా ఉండటం ...

 • video-shot

  MP4

  ఈ భాగంలో నమాజులోని భంగిమలు మరియు వాటి నియమాలు, వాటిలోని దీవెనలు మరియు వాటికి లభించే ప్రతిఫలాల గురించి ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో చర్చించబడింది.

 • PDF

  రమదాన్ పవిత్ర మాసంలో ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇచ్చిన జవాబు.

 • video-shot

  MP4

  మక్కా నగరంలో అత్యంత ప్రాచీన కాబాగృహం ఉన్నది. ఈ నగరానికి ప్రపంచ నలుమూలల నుండి ముస్లింలు హజ్ యాత్ర మరియు ఉమ్రహ్ యాత్ర కోసం బయలు దేరి వస్తారు, ప్రతి నమాజులో దీనికి అభిముఖంగా నిలబడతారు. తగిన స్తోమత, శక్తి సామర్ధ్యాలు ఉంటే, జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేసేందుకు ప్రతి ముస్లిం శాయశక్తులా ప్రయత్నిస్తాడు.

 • video-shot

  MP4

  ఒక మానవుడి జీవిత కాలపు పవిత్ర యాత్ర అయిన హజ్ యాత్ర గురించి షేఖ్ యాసిర్ ఖాదీ ఇచ్చిన ఖుత్బా ప్రసంగం. ఆత్మను శుద్ధి చేసే ఈ పవిత్ర యాత్ర చేయాలని మీ మనస్సు తపిస్తున్నది. తమ తమ కాలంలో ప్రవక్తలందరూ చేసిన యాత్ర ఇది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇచ్చిన పిలుపుకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం విన్నది మరియు స్పందించింది. దీనికి స్పందించవలసిన మరియు అల్లాహ్ యొక్క కాబాగృహాన్ని సందర్శించవలసిన బాధ్యత మనలోని ప్రతి ఒక్కరిపై ఉన్నది. మీ మనస్సు తపిస్తున్న యాత్ర ప్రారంభించేందుకు చివరికి మీరు ముందుకు వచ్చారు. ఇక మీరు బయలు దేర బోతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు, "ఆయన యొక్క కాబాగృహానికి ఎవరైతే తరలి వస్తారో, వారు ఎలాంటి అసభ్యకరమైన పనులు మరియు పాపకార్యాలు చేయరో, అలాంటి పురుషుడు లేదా స్త్రీ, ఆ యాత్ర నుండి అప్పుడే పుట్టిన పసిబిడ్డ అంతటి పవిత్రంగా మరలి వస్తారు." హదీథు.

 • video-shot

  MP4

  పవిత్ర రమదాన్ మాసం త్వరలోనే ముగియనున్నది. మరి, దాని తర్వాత మన పయనం ఎటు ? రమదాన్ నెల ముస్లిం కావద్దు. నిస్సందేహంగా రమదాన్ నెల ప్రభువే మిగిలిన నెలలన్నింటి ప్రభువు. షేఖ్ యాసిర్ ఖాదీ ఈ ఖుత్బహ్ ప్రసంగంలో రమదాన్ నెల తర్వాత కూడా మనం ఎలా జీవితాన్ని ఇదే విధంగా కొనసాగించగలం అనే విషయాన్ని చర్చించారు.

 • video-shot

  MP4

  కొత్త నెలవంక కనబడినప్పటి నుండి, రమదాన్ నెలను ఉత్తమరీతిలో సాగనంపే మరియు రమదాన్ నెల తర్వాత కూడా రమదాన్ నెలలోని ఉత్తమ జీవితాన్ని కొనసాగించే బాటలో సహాయపడే 10 ప్రాక్టికల్ కిటుకులను షేఖ్ యాసిర్ ఖాదీ ఇక్కడ ఇచ్చినారు. ఈ జుమా ఖుత్బలో 10 ఆచరణాత్మక కిటుకులు, జ్ఞాపికలు, ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకునే విధానం గురించి వివరంగా చర్చించారు.

 • video-shot

  రమదాన్ శుభాలు ఇంగ్లీష్

  రమదాన్ పవిత్ర మాస శుభాలు అనే పేరుతో తయారైన ఈ వీడియో సీరీస్ లో రమదాన్ మాస ప్రాధాన్యత, ఉపవాసాల ప్రయోజనాలు, రమదాన్ మాస కార్యక్రమాలు, రమదాన్ మాస శుభాల గురించి డాక్టర్ అబ్దుల్లాహ్ హాకిమ్ క్విక్ చక్కగా వివరించారు. చాలా ఆసక్తికరమైన సీరీస్. ముస్లింల కొరకు ఎంతో సమాచారం ఉన్నది.

 • video-shot

  MP4

  "ఒకవేళ ఇదే నా చివరి రమదాన్ అయితే నా పరిస్థితి ఏమిటి?" అనే అంశంపై డాక్టర్ తౌఫీఖ్ చౌదరీ ఇచ్చిన మంచి ఉపన్యాసం. ఇందులో ఆయన రమదాన్ ప్రాముఖ్యత గురించి, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి ఎలా తయారు కావాలి అనే అంశాల గురించి చర్చించారు.

 • video-shot

  MP4

  రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవటానికి మనం ఎలా తయారు కావాలి అనే అంశంపై అద్నాన్ రాషిద్ ఇచ్చిన ఒక మంచి ఉపన్యాసం.

 • video-shot

  MP4

  రమదాన్ పవిత్ర మాస ప్రాధాన్యత, ఖుర్ఆన్ ను ప్రేమించుట, రమదాన్ మాసంలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు చేయవలసిన తయారీల గురించి ఉస్తాద్ నౌమాన్ అలీ ఖాన్ చక్కగా వివరించారు.

 • video-shot

  MP4

  అసలు రమదాన్ అంటే ఏమిటి అనే అంశంపై మమ్ దూహ్ ముహమ్మద్ చేసిన ఒక మంచి ప్రసంగం. దీనిలో ఆయన రమదాన్ నెల ప్రాముఖ్యత, ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునేందుకు ఎలాంటి తయారీలు చేసుకోవాలి, ఈ నెలలో ఒక ముస్లిం ఏమి చేయాలి, మరియు రమదాన్ నెలకు సంబంధించిన అనేక అంశాలను ఆయన చర్చించారు.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో షేఖ్ బిలాల్ అసద్ రమదాన్ శుభాలు అనే అంశంపై ప్రసంగించారు. దీనిలో ఆయన రమదాన్ నెల మరియు ఉపన్యాసాల యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. రమదాన్ నెల మన్నింపుల, క్షమాభిక్ష ప్రసాదించే పవిత్ర మాసం. అల్లాహ్ యొక్క దీవెనలు ప్రసాదించే అద్భుత మాసం. ముస్లింలు ఈ గొప్ప అవకాశాన్ని వదులుకో కూడదు.

 • video-shot

  రమదాన్ శుభాలు ఇంగ్లీష్

  MP4

  రమదనాన్ నెల ఆరాధనల నెల. ఇస్లాం ధర్మం యొక్క మూల స్థంభాలలోని ఒక మూలస్థంభమైన రమదాన్ నెల ఉపవాసాన్ని పాటించుటంలో ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ దగ్గరవుతారు. ఈ ఉపవాసం పాటించకుండా ఒక వ్యక్తి యొక్క ఇస్లాం ధర్మం పరిపూర్ణం కాజాలదు. ఈ ఉపన్యాసంలో యాసిర్ ఖాదీ రమదాన్ శుభాల గురించి వివరించారు.

 • PDF

  1- ప్రపంచ జనాభాలో ఐదవ వంతు ప్రజలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ ఆధ్యాత్మిక యాత్ర చేయాలనే తపనతో ఉన్నారు - అదే హజ్ యాత్ర. మొదటి భాగం - హజ్ యాత్ర పరిచయం మరియు హజ్ దినం అంటే అరఫాత్ దినం వరకు చేయవలసిన కొన్ని ఆరాధనలు. రెండవ భాగం - అరఫాత్ దినం నుండి హజ్ యాత్ర చివరి దినం వరకు చేసే ఆరాధనలు, అల్లాహ్ స్వీకరించే హజ్ యాత్ర.

 • MP3

  తన హజ్ సమయంలో ముహమ్మద్ అల్ షరీష్ రచించిన "Hajj - The Journey of Hearts" హజ్ యాత్ర - హృదయాల యాత్ర అనే వ్యాసం యొక్క ఆడియో రికార్డింగు. క్లిష్టసమయాలలో కూడా అల్లాహ్ నుండి ప్రతిఫలం ఆశిస్తూ సహనం, ఓర్పు చూపే హజ్ యాత్రికులను ఆయన చూసారు. అది చూసి నన్ను నేను ఇలా ప్రశ్నించుకున్నాను - "వీరికీ మరియు పరస్పరం విమర్శలు మరియు వాదోపవాదాలలో మునిగి ఉండే ప్రజలకూ మధ్య ఉన్న తేడా ఏమిటి ?" చివరిగా నాకు అర్థం అయింది ఏమిటంటే నేను చూస్తున్నది జైద్ లేదా అమర్ యొక్క శరీరాలు కాదు, కానీ నేను చూస్తున్నది జైద్ మరియు అమర్ యొక్క మంచి హృదయాలు, మనస్సులు.

 • video-shot

  YOUTUBE

  ఈ టివీ ప్రోగ్రాంలో రమదాన్ నెల యొక్ విశిష్ఠత అనే ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుర్రహ్మాన్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చర్చించారు.

 • video-shot

  MP4

  రమదాన్ నెలలోని జీవన విధానం, సత్ ప్రవర్తన మరియు రమదాన్ నెలలో సంపాదించిన దైవభీతిని మిగిలిన సంవత్సరమంతా ఎలా కొనసాగించాలి అనే విషయాల గురించి ఇక్కడ చర్చించబడింది.

 • video-shot

  MP4

  రమదాన్ పవిత్ర మాసం కొందరు ముస్లింల కొరకు ఎలా సీజనల్ ఆరాధనల మాసంగా మారిందో షేఖ్ ఇక్కడ చర్చించారు.

 • video-shot

  MP4

  ఒకరి దైవ విశ్వాసాన్ని ఈ పవిత్ర మాసంలో ఎలా పెంచుకోవచ్చో ఇక్కడ చర్చించబడింది.

పేజీ : 3 - నుండి : 1
ఫీడ్ బ్యాక్