కేటగిరీలు

నవముస్లిం కొరకు ఇస్లామీయ ధర్మాదేశాలు

నవముస్లిం కొరకు అవసరమైన కొన్ని ముఖ్య పాఠాలు, అంశాలు దాదాపు 30 భాషలలో ఇక్కడ చేర్చబడినాయి.

అంశాల సంఖ్య: 12

 • ఇంగ్లీష్

  MP3

  అల్లాహ్ వద్దకు చేర్చే సన్మార్గం కనుగొన్న ప్రతి నవముస్లిం కొరకు ఇది ఒక గొప్ప కానుక. వారి విశ్వాసాన్ని మరింత బలర్చుకోవడానికి మరియు భద్రంగా కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆడియోలలో ముస్లింగా మారటం వలన లభించే ప్రతిఫలం, ఇస్లాం ధర్మం యొక్క ఉత్తమమైన విశేషతలు మరియు ఇస్లాం ధర్మంలోని ముఖ్యమైన విషయాన్నింటినీ షేఖ్ ఫహద్ సాలెమ్ బహమ్మమ్ ఇక్కడ చర్చించారు. ఒకరి దైవవిశ్వాసం ఆధారంగా చేసుకోవలసిన అర్కాన్ అల్ ఈమాన్ అంటే దైవ విశ్వాసపు మూలసిద్ధాంతాలు మరియు అవయవాల ఉత్తమమైన ఆచరణలు (ఆరాధనలు) మరియు హృదయాల ఉత్తమమైన ఆచరణలు (తౌహీద్ అనే ఏకదైవత్వ సిద్ధాంతం) కలిగి ఉన్న అర్కాన్ అల్ ఇస్లాం అంటే ఇస్లాం మూల సిద్ధాంతాలను ఆయన చక్కగా వివరించారు. ఇస్లాం ధర్మం ఒక సామాజిక ధర్మం అయినందున, చిన్నా లేక పెద్ద, ముస్లిం లేక ముస్లిమేతరులు మొదలైన సమాజంలోని ప్రతి ఒక్కరితో ఒక ముస్లిం ఎలా ప్రవర్తించాలి, షేఖ్ ఫహద్ వివరించారు. తర్వాత ఆయన అనుమతించబడిన మరియు నిషేధించబడిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. అలాగే ఒకరి ఈమాన్ అంటే దైవవిశ్వాసాన్ని పెంచే మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడంలో సహాయపడే అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అల్లాహ్ మార్గంలో అడ్డుపడే (కామం, అత్యాశ, దురాశ, అపోహలు మరియు అజ్ఞానం వంటి) కొన్ని ఆటంకాలను కూడా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఒక వ్యక్తి తన సృష్టికర్త వద్ద మనస్పూర్తిగా పశ్చాత్తాప పడేందుకు అవసరమైన వాటిని చూపారు. చివరిగా, నవముస్లిం కొరకు ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు.

 • తెలుగు

  PDF

  ఈ పుస్తకంలో క్లుప్తంగా ఇస్లాం పరిచయం ఉన్నది. ముఖ్యంగా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే నవముస్లింలను ఉద్ధేశించి ఈ పుస్తకం తయారు చేయబడింది. దీని ద్వారా అనేక ఇస్లామీయ విషయాలను మనం తెలుసుకోవచ్చును. అనేక భాషలతో పాటు తెలుగులో కూడా దీనిని దారుస్సలాం పబ్లిషర్స్ ప్రచురించినారు. దీనిని కొనుక్కోవాలనుకుంటే, దారుస్సలాంను సంప్రదించవలెను.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లామీయ భోధనల రెండు ముఖ్య ఆధారాలైన ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రాథమిక లక్షణాలపై ఈ పుస్తకం చర్చిస్తున్నది. ఇస్లామీయ నడవడిక పై కూడా దృష్టి సారిస్తున్నది. ఇస్లామీయ నైతిక బోధనలు అద్వితీయమైనవి. అవి మానవులను తమ సృష్టికర్త అయిన అల్లాహ్ తో మరియు తోటి మానవులతో గట్టి సంబంధం ఏర్పరుచుకోమని ఆహ్వానిస్తున్నాయి. అంతేగాక ప్రజలు ఆంతరంగికంగానూ మరియు బహిరంగంగానూ తమను తాము సరిదిద్దుకోవాలని పిలుపునిస్తున్నాయి. ఈ చిరుపుస్తకంలో అనేక మంచి విషయాలు ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  PDF

  ఎవరైనా ఇస్లాం స్వీకరించారనే వార్త వినగానే, ఒక నిజమైన ముస్లింకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే అతడు ఎల్లవేళలా ఇతరుల మంచిని కోరతాడు మరియు తను జీవిస్తున్న సృష్టకర్త యొక్క సత్యధర్మంపైనే ఇతరులు కూడా జీవించి, ఇహపరలోకాలలో సాఫల్యం పొందాలని కోరుకుంటాడు - అధ్యాత్మిక మరియు మానసిక నిలకడ మరియు శాంతితో సుఖసంతోషాల ప్రశాంత జీవితం. ఇస్లామీయ ధర్మ ఉపదేశాలు పాటించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాలనే ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది.

 • ఇంగ్లీష్

  PDF

  సత్యమార్గం తెలుసుకున్న ప్రతి నవముస్లిం కొరకు ఇదొక మంచి బహుమతి. ఇది వారి దైవవిశ్వాసాన్ని మరింతగా పటిష్టం చేయడానికి మరియు భద్రపరుచుకోవడానికి పనికి వస్తుంది. హజ్ లేదా ఉమ్రహ్ కొరకు వెళ్తున్నారా? మార్గదర్శకత్వం కోసం ఒక సింపుల్ మరియు స్పష్టమైన గైడు మీకు కావాలా ? సులభంగా మీరు హజ్ మరియు ఉమ్రహ్ చేయగలగాలనేదే ఈ పుస్తకం యొక్క ధ్యేయం మరియు ఉద్దేశ్యం. ఈ పుస్తకం చాలా సులభమైన పదాలతో వ్రాయబడింది, హజ్ మరియు ఉమ్రహ్ లో చేయవలసిన ఆచారాన్నీ సింపుల్ చిత్రపటాలతో చాలా స్పష్టంగా పేర్కొనబడినాయి. ఎలాంటి క్లిష్టమైన రిఫరెన్సులు, అభిప్రాయభేదాలు లేకుండా స్పష్టమైన వివరణలతో ఈ పుస్తకం తయారు చేయబడింది. ఇది ఒక సింపుల్ గైడ్!

 • ఇంగ్లీష్

  PDF

  డాక్టర్ బ్రౌన్ సృష్టించిన రెండు ధార్మిక సునామీలైన మిస్ గాడెడ్ మరియు గాడెడ్ ల తర్వాత, ఈ ఆవశ్యకమైన ఇస్లామీయ మౌలిక అంశం వ్రాయబడింది. రెండు సాక్ష్యప్రకటనల ఉచ్ఛరణ ఇస్లాం ధర్మంలో ప్రవేశింపజేస్తుంది. మరి ఆ తర్వాత ఏమి చేయాలి, ఇస్లామీయ జీవన విధానాన్ని ఎలా అలవర్చుకోవాలనే అంశాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • ఇంగ్లీష్

  MP4

  ఈ ఉపన్యాసంలో అంతిమ సందేశం యొక్క ప్రాధాన్యత, మన జీవితంలో మనం విధిగా, తప్పనిసరిగా చేయవలసిన పనులు ఏమిటి, ఈ సందేశాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టగలం మరియు దీనిని ఇతరులకు ఎలా అందజేయగలం అనే ముఖ్య విషయాల గురించి షేఖ్ బిలాల్ అసద్ చర్చించారు.

 • తెలుగు

  PDF

  దీనిలో ఇస్లామీయ ప్రియబోధనలు – సాక్ష్యప్రకటన షహాదా, ఏకదైవారాధన మానవ ప్రవర్తనా సంస్కరణ, ఏకదైవారాధన సంఘ సంస్కరణ, ఇస్లామీయ సద్గుణ బోధనలు, ఏకదైవారాధనా విశ్వాసం, బహుదైవారాధన, విచారణ దిన సిఫారసు వివరాలు, ఇస్లాం విశిష్టతలు మొదలైన ముఖ్యాంశాలు చర్చించబడినాయి.

 • ఇంగ్లీష్
 • పోలిష్
 • ఇంగ్లీష్

  PDF

  నవముస్లింల కోసం ఇస్లామిక్ స్టడీస్ పాఠ్య ప్రణాళిక: సరైన పద్ధతిలో ఆరాధనలు చేయాలంటే, ముస్లింలు తప్పనిసరిగా ప్రామాణిక జ్ఞానం సంపాదించాలి, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి మరియు తన ఆచరణాత్మక సమర్ధతను పెంచుకోవాలి. ఈ మార్పులు ముస్లింల స్వంత నిర్ణయాలు మరియు కృషి నుండి ఆవిర్భవించాలి - ఒకవేళ వారిలో విద్యాపరమైన దృఢత్వం, ధార్మికపరమైన పటుత్వం, సామాజికపరమైన ప్రాధాన్యత మరియు శారీరకమైన గట్టిదనం ఉంటే. ఈ ఉద్దేశ్యం మరియు సంకల్పంతో ఇస్లామీయ బోధనా కేంద్రం "నవముస్లింల కోసం శిక్షణా కార్యక్రమం" తయారు చేసింది. ఇస్లామీయ ధార్మిక హద్దులలో తన దైవవిశ్వాసం, విలువలు, గుణగణాలు మరియు స్వభావాన్ని ప్రదర్శిస్తూ మంచిని ఆదేశించే మరియు చెడును నిర్మూలించే, తప్పులు నివారించే మరియు అల్లాహ్ ను విశ్వసించే మార్గంలో , ఒక నవముస్లిం తన చుట్టుప్రక్కల వాతావరణానికి సరైన పద్ధతిలో స్పందించేట్టగా తయారు చేసే ఒక ప్రయత్నం.

 • ఫ్రెంచ్

  MP3

  మక్కా నగరం వైపు హజ్ యాత్రలో పాల్గొనే ఉద్దేశ్యంతో ప్రయాణించడం ఇస్లామీయ మూలస్థంభాలలోని ఒక మూలస్ధంభమైన హజ్ యాత్రను పూర్తి చేయడానికి ప్రయత్నించడమన్న మాట. దీనిలో అనేక రకాల ఆర్ధిక, మానసిక మరియు శారీరక ఆరాధనలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే ఆర్ధికంగా మరియు శారీరకంగా తగిన శాయశక్తులు కలిగి ఉంటారో, అలాంటి వారు తమ జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర తప్పకుండా చేయవలసి ఉంది. సూరతుల్ ఆలె ఇమ్రాన్ లోని 97 వ ఆయతులో దీని ప్రాముఖ్యత గురించి ఆదేశించబడింది.

ఫీడ్ బ్యాక్